తాటి చెట్టుపై నుంచి పడి కార్మికుడి మృతి
హయత్‌నగర్: తాటిచెట్టుపై నుంచి పడిపోవడంతో ఓ గీత కార్మికుడు మృతి చెందాడు. హయత్‌నగర్ మండలం మాజీద్‌పూర్ గ్రామంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. బత్తిని బిక్షపతిగౌడ్ కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కగా మోపు తెగిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న గ్రామస్తులు మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు.