HYD: హయత్ నగర్‌లో హిట్ అండ్ రన్ | Hyderabad: Man dies in hit and run Hayatnagar Incident Updates | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: హయత్ నగర్‌లో హిట్ అండ్ రన్.. ఒకరి మృతి.. నిందితుడ్ని అరెస్ట్‌ చేయని వైనం!

Published Fri, Oct 6 2023 8:52 AM | Last Updated on Fri, Oct 6 2023 9:01 AM

Hyderabad: Man dies in hit and run Hayatnagar Incident Updates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదు అయ్యింది. మద్యం మత్తులో అతివేగంతో కారు నడపడంతో ఓ ప్రాణం పోయింది. యాక్సిడెంట్ చేసి కారుతో సహా నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నప్పటికీ.. ఇప్పటిదాకా నిందితులను అదుపులోకి తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబం న్యాయ పోరాటానికి దిగింది. 

హయాత్‌ నగర్‌లో ఓ వైట్‌ కలర్‌ బెంజ్‌ కారు వేగంగా ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి స్పాట్‌లోనే చనిపోగా.. కారు అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. మృతుడ్ని పోషం కృష్ణారెడ్డిగా గుర్తించిన పోలీసులు.. హిట్‌ అండ్‌ రన్‌ కేసుగా నమోదు చేసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వైట్‌ కలర్‌ బెంజ్‌ కారు నెంబర్‌ TS08EZ6717 ఆధారంగా.. ఓనర్‌ను వరాల శ్వేతారెడ్డిగా గుర్తించారు. 

అయితే.. మద్యం మత్తులో పవన్‌ రెడ్డి కారు నడిపి కృష్ణారెడ్డి మృతికి కారణమైనట్లు తేలింది. దీంతో.. మోటర్ వెహికిల్ యాక్ట్ కింద కేసు  నమోదు చేశారు పోలీసులు. అయితే.. ఇప్పటివరకు నిందితుడ్ని అరెస్ట్‌ చేయలేదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement