ఏటీఎం చోరీకి విఫల యత్నం | atm thivets attempted to loot atm in hayathnagar | Sakshi
Sakshi News home page

ఏటీఎం చోరీకి విఫల యత్నం

Published Mon, Oct 24 2016 4:34 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

ఏటీఎం చోరీకి విఫల యత్నం - Sakshi

ఏటీఎం చోరీకి విఫల యత్నం

ఏటీఎం మిషన్‌లోని డబ్బులు దొంగిలించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా అది తెరుచుకోకపోవడంతో తిరిగి వెళ్లిన పోయిన సంఘటన సోమవారం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

హయత్‌నగర్: ఏటీఎం మిషన్‌లోని డబ్బులు దొంగిలించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించగా అది తెరుచుకోకపోవడంతో తిరిగి వెళ్లిన పోయిన సంఘటన సోమవారం హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మునగనూరులోని సిండికేట్‌బ్యాంకు ఏటీఎం లోకి అర్ధరాత్రి 1.30గంటల సమయంలో ఓ గుర్తుతెలియని వ్యకి ముఖానికి టవల్ చుట్టుకుని ప్రవేశించాడు. లోపల ఉన్న సీసీ కెమరా తీగలను కట్ చేశాడు. మిషన్‌డోర్ తెరిచాడు. మిషన్‌లోపల ఉన్న సీల్‌ను తొలగించేందుకు ప్రయత్నించాడు.

సుమారుగా అరగంటసేపు ప్రయత్నించినా మిషన్ తెరుచుకోలేదు. దీంతో దుండగుడు తిరిగి వెళ్లిపోయాడు. ఉదయం బ్యాంకుకు వచ్చిన మేనేజర్ పీఎస్‌ఆర్‌బీ ప్రసాద్ చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ నరేందర్‌గౌడ్. ఎస్సైలు చంద్రశేఖర్, మన్మదకుమార్‌లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీ పుటేజిలను పరిశీలించారు. క్లూస్‌టీం సభ్యులు సాక్షాలను సేకరించారు. దుండగడు స్థానికంగా లేబర్ పని చేసే వాడై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement