హయత్ నగర్ (రంగారెడ్డి జిల్లా): హయత్‌నగర్ మండలం బాట సింగారం వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టింది. శుక్రవారం మద్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో ఉగాండా దేశానికి చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. మరో విద్యార్థికి తీవ్రగాయాలవడంతో చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.