ప్రకృతిపై ప్రేమ.. ఆ చిన్నారిని ప్రధాని వరకు తీసుకెళ్లింది
జంతువులపై ఆ విద్యార్థికి ఉన్న ప్రేమ ఏకంగా దేశ ప్రధాని, అధ్యక్షుల దగ్గరకు చేర్చింది. ఉగాండలో నివసిస్తున్న ప్రవాస భారతీయురాలైన ప్రజ్ఞా 9వ తరగతి చదువుతోంది. జంతువులన్నా, మొక్కలన్నా ఆమెకు ఎంతో ప్రేమ. దీంతో వాటి రక్షణ కోసం చిన్నప్పటి నుంచే తనకు చేతనైనంత సాయం చేస్తోంది. జూలో ఏనుగులు, సింహం పిల్ల, కుక్కలను దత్తతకు తీసుకుని పెంచుతోంది. ఈ క్రమంలో నాట్య ప్రదర్శనలు నిర్వహిస్తూ తద్వారా వచ్చిన డబ్బులను జంతు సంరక్షణకు కేటాయిస్తోంది. ప్రజ్ఞ చేస్తున్న పనులకు ఆ దేశ అధ్యక్షుడు యొవేరి కటుగా ముసవేనిని ఆకట్టుకున్నాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉగాండ పర్యటన సందర్భంగా ప్రజ్ఞకి అరుదైన అవకాశం లభించింది. ప్రధాని మోదీకి పూలగుచ్ఛం అందించి ఆహ్వానం పలకాలంటూ ప్రజ్ఞని ఆ దేశ అధ్యక్షుడు ముసవేని కోరారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే ఆ కార్యక్రమంలో ఉగాండ జాతీయ గీతం ఆలపించి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ప్రజ్ఞా. ఇటీవల సేవా కార్యక్రమాలు అందిస్తూ 18 ఏళ్ల ప్రవాస భారతీయురాలైన గడ్డం మేఘనా నామినేటెడ్ ఎంపీగా న్యూజీలాండ్ చట్టసభకు ఎంపికైంది. ఈ తరుణంలో మరిన్ని దేశాల్లో ప్రవాస భారతీయులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే ఆకాంక్ష ఇండియన్లలో కనిపిస్తోంది. (చదవండి: న్యూజిలాండ్‌లో ఎంపీగా ప్రకాశం జిల్లా యువతి)