హైదరాబాద్ : ఎండల తీవ్రత కోళ్లఫారాల యజమానులను తీవ్ర నష్టాల పాలు చేస్తోంది. ఎండ వేడిమికి హయత్‌నగర్ మండలం గడిచెరువు సమీపంలో ఓ కోళ్ల ఫారంలో శనివారం మూడు వేల కోళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ పరిణామంతో ఫారం నిర్వాహకుడు శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.