హయత్‌నగర్‌లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన! | Man Held For Molesting Woman in Hayathnagar | Sakshi
Sakshi News home page

హయత్‌నగర్‌లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన!

Published Sun, Dec 8 2019 4:00 PM | Last Updated on Sun, Dec 8 2019 4:11 PM

Man Held For Molesting Woman in Hayathnagar - Sakshi

సాక్షి, హైదరాబాద్ : దిశ ఘటన ప్రకంపనలు కొనసాగుతున్న నేపథ్యంలోనే నగరంలోని హయత్‌నగర్‌లో ఓ అనుచిత ఘటన చోటుచేసుకుంది. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ కాలనీలో ఓ యువతి పట్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. రాజేశ్‌ అనే యువకుడు వేధింపులకు పాల్పడుతూ.. అసభ్యంగా ప్రవర్తించడంతో బాధిత యువతి చురుగ్గా వ్యవహరించి.. డయల్‌ 100కు కాల్‌ చేసింది. పోలీసులు కూడా ఆమె కాల్‌కు తక్షణమే స్పందించారు. ఆమె పల్ల అసభ్యంగా ప్రవర్తించిన రాజేశ్‌ను అరెస్టు చేసి.. పోలీసు స్టేషన్‌కు తరలించారు.

షాద్‌నగర్‌ శివార్లలో జరిగిన దిశ అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో మహిళలపై నేరాలు అరికట్టడంలో పోలీసుల వైఫల్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిశ ఘటనలోని నిందితులు ఎన్‌కౌంటర్‌ కావడంతో పోలీసులపై ఒకవైపు ప్రశంసల జల్లు, మరోవైపు విమర్శలు వస్తున్నాయి. మరోవైపు మహిళలపై నేరాలు జరగకుండా పోలీసులు ఇకముందు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నలు సోషల్‌ మీడియా నుంచి, ప్రజల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆపద సమయంలో డయల్‌ 100కు కానీ, 112కు కానీ కాల్‌ చేయాలని, ప్రతి ఒక్కరూ హాక్‌-ఐ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని.. అనుకోని పరిస్థితులు ఎదురైతే పోలీసుల సహాయం తీసుకోవాలని పోలీసు శాఖ కోరుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement