హయత్‌నగర్ (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం కొత్తగూడ వద్ద ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న మారుతి కారు హయత్‌నగర్ మండలం కొత్తగూడ వద్ద అదుపు తప్పి వంతెన గోడను ఢీకొంది.
ఈ ఘటనలో కారులో ఉన్న వరప్రసాద్(50) అనే వ్యక్తి మృతి చెందాడు. అదే కారులో ప్రయాణిస్తున్న నాగమణి(45), దేవదానం(20)లు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను సన్‌రైజ్ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం
Published Sun, Jul 26 2015 8:10 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement