ప్రేమ పేరుతో వేధింపులకు తాళలేక హయత్‌నగర్‌కు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయిని ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ : ప్రేమ పేరుతో వేధింపులకు తాళలేక హయత్‌నగర్‌కు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయిని ఆత్మహత్య చేసుకుంది. చందన(23) అనే ప్రైవేట్ పాఠశాల టీచర్‌ను నల్లగొండ జిల్లా చౌటుప్పటల్‌కు చెందిన మహేష్ కొంతకాలంగా ప్రేమించాలని వెంటపడుతున్నాడు. ఆమె తిరస్కరించినా వేధింపులు ఆగలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె శనివారం సరూర్‌నగర్ చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ఉస్మానియాకు తరలించారు.