యువకుడి వేధింపులకు యువతి బలి | young woman commit to sucide for young boy harrased | Sakshi
Sakshi News home page

యువకుడి వేధింపులకు యువతి బలి

Published Sat, Nov 12 2016 3:43 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

యువకుడి వేధింపులకు యువతి బలి - Sakshi

యువకుడి వేధింపులకు యువతి బలి

ములుగు: ప్రేమ పేరిట వేధించడంతో ఓ యువతి ఆత్మ హత్య చేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా  గోవిందరావుపేట మండలం సండ్రగూడెంకు చెందిన హట్కర్ సమ్మయ్య-లాలమ్మలకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. తల్లిదండ్రులు మరణించడంతో కుమారుడు దేవ్‌సింగ్ చెల్లెళ్లతో కలసి ములుగులో ఉంటున్నాడు. పెద్ద చెల్లెలికి వివాహం కాగా, చిన్న చెల్లెలు అశ్విని(24) బీఈడీ పూర్తిచేసి  వరంగల్‌లో ట్యాలీ కోర్సులో శిక్షణ పొందుతూ ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటోంది. ఆమె బీఈడీ చేస్తున్నప్పుడు జనగామ జిల్లా కొడకండ్ల మండలం పాకాలకు చెందిన పెట్రోజు సంతోష్‌కుమార్ అనే యువకుడు పరిచయమయ్యాడు.

సంతోష్‌కుమార్ అశ్విని ఫోన్ నంబర్ తెలుసుకొని తరచుగా ఫోన్ చేస్తుండేవాడు. అరుుతే, తనకు గత జనవరిలో నిశ్చితార్థమైందని ఫోన్ చేసి ఇబ్బంది పెట్టవద్దని అశ్విని చాలాసార్లు చెప్పినా వినిపించుకోకుండా అదేపనిగా ఫోన్ చేసి బెదిరిస్తుండడంతో మనస్తాపం చెందిన అశ్విని గత నెల 31న ఇంట్లో ఓ రసాయనం తాగింది. బంధువులు ఆమెను వరంగల్‌కు, అక్కడి నుంచి హైద రాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు కష్టతరమని తెలపడంతో శుక్రవారం ములుగుకు తీసుకువచ్చిన కొద్దిసేపటికి మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement