ఐదు నెలలుగా మైనర్ బాలికపై లైంగిక దాడి | minor girl raped in hayathnagar | Sakshi
Sakshi News home page

ఐదు నెలలుగా మైనర్ బాలికపై లైంగిక దాడి

Published Wed, Dec 11 2013 9:51 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

ఐదు నెలలుగా మైనర్ బాలికపై లైంగిక దాడి - Sakshi

ఐదు నెలలుగా మైనర్ బాలికపై లైంగిక దాడి

హయత్నగర్: మాయ మాటాలతో ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడో దుర్మార్గుడు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. హాస్టల్లో సీటు ఇప్పిస్తానని చెప్పి నల్లగొండ జిల్లాకు మైనర్ బాలికను నగరానికి తీసుకొచ్చిన ప్రశాంత్ యువకుడు ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. ఓ గదిలో నిర్బంధించి ఐదు నెలలుగా బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

బాలిక అతడి బారిన తప్పించుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ దారుణం వెలుగు చూసింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు పరారయ్యాడు. తనకు మాయా మాటలు చెప్పి లోబరుచుకున్నాడని బాధిత బాలిక బాలిక తెలిపింది. హాస్టల్ సీటు ఇప్పిస్తానని చెప్పి అకృత్యానికి పాల్పడ్డాడని వివరించింది. తనను వంచించిన దుర్మార్గుడిపై చర్య తీసుకోవాలని కోరింది. నిందితుడిపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement