హయత్నగర్ మండలం తట్టిఅన్నారం కుత్బుల్లాపూర్ పరిసరాల్లోని అటవీప్రాంతంలో గురువారం ఆకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది.
హైదరాబాద్ : హయత్నగర్ మండలం తట్టిఅన్నారం కుత్బుల్లాపూర్ పరిసరాల్లోని అటవీప్రాంతంలో గురువారం ఆకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయి. మూడు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే స్పందించి... అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు ఫైరింజన్లు వీలుకాలేదు. దీంతో సమీపంలో నుంచి ఫైరింజన్ ద్వారా మంటలార్పే ప్రయత్నాం చేస్తున్నారు.