హయత్నగర్ కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు | City police busted kidnap case in hayathnagar | Sakshi
Sakshi News home page

హయత్నగర్ కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు

Published Tue, Oct 20 2015 1:34 PM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM

City police busted kidnap case in hayathnagar

హైదరాబాద్ : హయత్నగర్ కిడ్నాప్ కేసును నగర పోలీసులు మంగళవారం ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు కిడ్నాపర్లు మహేశ్, రామకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడు నవీన్ను కిడ్నాప్ చేసేందుకు మహేశ్ రూ. లక్ష సుపారీ ఇచ్చాడని పోలీసులు తెలిపారు. మహేశ్కు ఆడపిల్లలు ఉన్నారు.

ఈ నేపథ్యంలో నవీన్ కిడ్నాప్కు యత్నించారని పోలీసులు వెల్లడించారు. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో మరో ఇద్దరు కిడ్నాపర్లు పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement