హయత్‌నగర్: హయత్‌నగర్ మండలంలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాల వెనుకవైపు పేకాడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2,700 నగదు, నాలుగు సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. సదురు స్థావరంలో పేకాడుతున్నట్లు పోలీసులకు ఆగంతకులు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో పోలీసులు దాడి చేశారు.