
సాక్షి, హైదరాబాద్ : హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ బీభత్సవం సృష్టించింది. కుంట్లూరులోని ఓ వేద పాఠశాలలో చోరబడి 7 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. అలాగే పసుమములలోని రెండు ఇళ్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఓ ఇంట్లో మొబైల్, మరో ఇంట్లో కిశోర్‌స్వామి అనే వ్యక్తిని కట్టేసి.. 50వేల నగదు, 11 తులాల బంగారం దొంగిలించారు. 6 గురు దుండగులు చెడ్డీ వేసుకుని వచ్చి రాడ్లతో బెదిరించి దోపిడీకి పాల్పడినట్టు బాధిత కుటుంబాలు తెలిపాయి.
ఈ విషయంపై సమచారం అందుకున్న ఎల్బీ నగర్ జోన్ డీసీపీ సంప్రీత్ సింగ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో మొత్తం ఆరుగురు దుండగులు చోరీకి పాల్పడినట్టు నిర్ధారణ అయిందని వెల్లడించారు. దొంగల కోసం 10 ప్రత్యేక టీమ్‌లతో గాలింపు చేపడుతున్నామని తెలిపారు. తొందరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment