హైదరాబాద్: నగరంలో హయత్నగర్ ఆర్టీసీ కాలనీలో శుక్రవారం స్కూల్ బస్సును వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. దాంతో గాయపడిన విద్యార్థులను 108లో ఆసుపత్రికి తరలించారు. వాటర్ ట్యాంకర్ వాహనం అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికుల ఆరోపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాటర్ ట్యాంకర్ను పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.