RTC Colony
-
ముక్కలుగా నరికి.. డ్రమ్ముల్లో కుక్కి
హైదరాబాద్: తండ్రి పాలిట కన్నకొడుకే కాలయముడయ్యాడు. కుటుంబసభ్యులతో కలిసి వృద్ధతండ్రిని దారుణంగా హత్య చేసి ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిల్వ చేసి ఉంచిన సంఘటన హైదరాబాద్ మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఏసీపీ సందీప్‌కుమార్, ఇన్స్పెక్టర్ మన్మోహన్ ఆదివారం వివరాలను వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన కిషన్ సుతార్ మారుతి(80) రైల్వే విభాగంలో గూడ్స్ డ్రైవర్‌గా పనిచేశాడు. 20 ఏళ్ల క్రితం మౌలాలి ఆర్టీసీ కాలనీలో స్ధిరపడ్డాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు చాలా ఏళ్ల క్రితమే అదృశ్యమయ్యాడు. పెద్ద కూతురు అనుపమ, భర్తతో కలిసి మారేడ్‌పల్లిలో ఉంటోంది. ఆర్టీసీకాలనీలో సూతార్ మారుతీ, అతని భార్య గయ, కూతురు ప్రపుల్, కుమారుడు కిషన్‌తో కలిసి ఉంటున్నాడు. తాగుడుకు బానిసైన సుతార్ మారుతీ నిత్యం కుటుంబసభ్యులతో గొడవపడేవాడు. కుమారుడి ఆరోగ్యం కూడా బాగాలేదు. ఈ నెల 16వ తేదీ రాత్రి పది గంటలకు మద్యం సేవించి ఇంటికి వచ్చిన సుతార్ మారుతి భార్య, కొడుకు, కూతురుతో గొడవపడ్డాడు. అదేరాత్రి సుతార్ మారుతీ హత్యకు గురయ్యాడు దుర్వాసనతో బయటపడ్డ సంఘటన రెండు రోజులుగా ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు 100 నంబర్‌కు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ మన్మోహన్, ఎస్ఐ సంజీవరెడ్డిలు ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. సుతార్ మారుతీ మృతదేహం ముక్కలు, ముక్కలుగా ఆరు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో వేసి ఉండటం చూసి ఖంగుతిన్నారు. సుతార్ మారుతీని పథకం ప్రకారమే హత్య చేసారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యులను తరచూ వేధించడం, కిషన్‌కు ఉద్యోగంలేదని గొడవపడుతుండటంతో సుతార్ మారుతీను హత్య చేసి ఉంటారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పకడ్బందీగా మృతదేహాన్ని తరలించేందుకు కొత్తగా ఆరు ప్లాసిక్ట్ డమ్ములను వాడటం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. సంఘటనాస్థలానికి వచ్చిన క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. డాగ్‌స్క్వాడ్ శునకం ఇంట్లో నుంచి కొంత దూరం వెళ్లి తిరిగివచ్చింది. పోలీసుల అదుపులో నిందితులు? నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఉద్దేశపూర్వకంగా హత్య చేశారా లేక సుతార్ మారుతీ, కిషన్ గొడ వపడినప్పుడు కిందపడి ప్రమాదవశాత్తు చనిపోతే ఎవరికీ తెలియకుండా ప్లాసిక్ట్ డ్రమ్ముల్లో తరలించడానికి ప్రయత్నించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చట్టుపక్కలవారిని విచారించగా సుతార్ మారుతీ కుటుంబసభ్యులు ఎవరితోనూ ఎక్కువగా కలిసేవారు కాదని తెలిపారు. కుటుంబ కలహాలే కారణం: ఏసీపీ సందీప్ సుతార్ మారుతీ హత్యకు కుటుంబకలహాలే కారణమని ప్రాథమికంగా నిర్ధారించామని ఏసీపీ సందీప్ తెలిపారు. కొడుకుకు ఉద్యోగం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తరచూ తండ్రీకొడుకులు గొడవపడేవారన్నారు. -
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
మహబూబాబాద్ రూరల్: ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో గురువారం చోటు చేసుకుంది. మృ తుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... మహబూబాబాద్ పట్టణంలో ఆర్టీసీ కాలనీలో నివాసముండే తోట శ్రీనివాస్ ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ డిపో క్లర్క్ (ఏడీసీ)గా పని చేస్తున్నారు. శ్రీనివాస్, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా రెండో కుమారుడైన తోట రంజిత్‌కుమార్ (25) పట్టణంలోని ఓ చిట్‌ఫండ్స్‌లో పని చేస్తున్నాడు.. తనకు వేతనం పెంచాలని సంస్థ యజ మానిని కోరగా రంజిత్‌కుమార్ చేసే ఉద్యోగానికి బదులు మరో ఉద్యోగం విధులు నిర్వర్తించాలని, అప్పుడు వేతనం పెంచుతానని చెప్పారు. దీంతో కొద్ది రోజుల క్రితం రంజిత్‌కుమార్ అక్కడ పని బంద్‌చేసి అప్పటి నుంచి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆ సంస్థ కాకుంటే మరో సంస్థలో పని చేయవచ్చని తండ్రి శ్రీనివాస్ మృతుడు రంజిత్‌కుమార్‌కు తెలిపాడు. అదే ఆలోచనతో ఉంటూ, మనస్తాపానికి గురైన అతడు గురువారం ఉదయం తల్లిదండ్రులు దేవాలయానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనపై టౌన్ పోలీస్ స్టేషన్లో మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని టౌన్ ఎస్సై బి. సంతోష్‌రావు తెలిపారు. -
‘నిట్’ విద్యార్థి దుర్మరణం
కాజీపేట అర్బన్ /లింగాలఘణపురం : జనగామ, సూర్యాపేట రోడ్డులో నెల్లుట్ల సమీపంలోని ఆర్టీసీ కాలనీ వద్ద శుక్రవారం తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం ఢీకొని వరంగల్ నిట్‌లో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న నల్గొండ జిల్లాకు చెందిన కేతావత్ భార్గవ్ (20) దుర్మరణం చెందాడు. ఏఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దామెరచర్ల మండలం జిలావర్పూర్ శివారు గ్రామమైన కేతావత్తండాకు చెందిన కేతావత్ భార్గవ్ మిర్యాలగూడలో ఉంటున్న తల్లిదండ్రులు సైదమ్మ, సీతారాంనాయక్‌లను చూసేందుకు గురువారం హోండా ఎఫ్‌జెడ్ ద్విచక్రవాహనంపై వెళ్లాడు. తల్లిదండ్రులను చూసిన భార్గవ్ రాత్రి 1.30గంటల సమయంలో మిర్యాలగూడ నుంచి అదే వాహనంపై వరంగల్ నిట్ కళాశాలకు బయలుదేరాడు. శుక్రవారం తెల్లవారు జామున సుమారు 4.30 గంటల సమయంలో నెల్లుట్ల ఆర్టీసీ కాలనీ కల్వర్టు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి తలకు బలమైన గాయమై అక్కడిక్కడే మృతి చెందాడు. చీటూరు నుంచి జనగామకు వెళ్తున్న టాటాఏస్ డ్రైవర్ ప్రమాదానికి సంబంధించి వివరాలను ఇంట్రాసెక్టార్, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. తలకు బలమైన గాయం కావడంతో రోడ్డంతా రక్తసిక్తమై అక్కడికక్కడే భార్గవ్ మృత్యువాత పడ్డాడు. మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భోరున విలపించారు. కాగా ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు నవాబుపేట, నెల్లుట్ల, జనగామలోని సీసీ కెమెరాల పూటేజీలను పరిశీలిస్తున్నారు. నవాబుపేట సీసీ కెమెరాల పుటేజీలో భార్గవ్ 4.05 గంటలకు అక్కడి నుంచి వచ్చినట్లు గుర్తించారు. -
ఎమ్మెల్యే బావమరిదినంటూ హల్చల్
హైదరాబాద్ : నగరంలోని ఆర్టీసీ కాలనీలో అధికార పార్టీ నాయకుడు గంట్లపల్లి వెంకటేష్ హల్చల్ చేశాడు. ఎమ్మెల్యే బావమరిదిని అంటూ మహిళలతో అసభ్య పదజాలంతో మాట్లడమేకాక.. మీ పిల్లలను కిడ్నాప్ చేస్తామని.. భర్తలను చంపుతామని బెదిరించాడు. అతనితో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్ ఐటీఐ రాజు కూడా ఉన్నట్లు సమాచారం. ఫుల్లుగా మద్యం తాగిన ఇద్దరు కాలనీలోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తిచారని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ వాగ్వాద సమయంలోనే వెంకటేష్ యాదవ్‌కు చెందిన పాన్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్ కింద పడిపోయాయని వాటిని చూపిస్తూ వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. -
స్కూలు బస్సు - వాటర్ ట్యాంకర్ ఢీ
హైదరాబాద్: నగరంలో హయత్‌నగర్ ఆర్టీసీ కాలనీలో శుక్రవారం స్కూల్ బస్సును వాటర్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108కి సమాచారం అందించారు. దాంతో గాయపడిన విద్యార్థులను 108లో ఆసుపత్రికి తరలించారు. వాటర్ ట్యాంకర్ వాహనం అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికుల ఆరోపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాటర్ ట్యాంకర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.