హైదరాబాద్ : నగరంలోని ఆర్టీసీ కాలనీలో అధికార పార్టీ నాయకుడు గంట్లపల్లి వెంకటేష్ హల్‌చల్ చేశాడు. ఎమ్మెల్యే బావమరిదిని అంటూ మహిళలతో అసభ్య పదజాలంతో మాట్లడమేకాక.. మీ పిల్లలను కిడ్నాప్ చేస్తామని.. భర్తలను చంపుతామని బెదిరించాడు. అతనితో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్ ఐటీఐ రాజు కూడా ఉన్నట్లు సమాచారం.
ఫుల్లుగా మద్యం తాగిన ఇద్దరు కాలనీలోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తిచారని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ వాగ్వాద సమయంలోనే వెంకటేష్ యాదవ్‌కు చెందిన పాన్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్ కింద పడిపోయాయని వాటిని చూపిస్తూ వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
ఎమ్మెల్యే బావమరిదినంటూ హల్‌చల్
Published Mon, Sep 21 2015 6:47 PM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM
Advertisement
Advertisement