nuisance
-
‘సార్..దయచేసి మా అమ్మను ఇంటికి పంపకండి.. జైలుకు పంపండి..’
ఫిలింనగర్: మద్యం మత్తులో ఓ మహిళ (44) పార్కు పక్కన తూలిపోతూ..రోడ్డు పక్కన పడుకుని న్యూసెన్స్ చేస్తుండగా సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని సయ్యద్‌నగర్ బస్తీలో నివసించే ఓ మహిళ గత కొంతకాలంగా మద్యానికి బానిసై అర్ధరాత్రి దాకా రోడ్లపై తిరుగుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది. శుక్రవారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఎన్బీటీనగర్ ప్రాంతంలో మద్యం మత్తులో న్యూసెన్స్ చేస్తుండగా బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు అక్కడకు వెళ్లి ఆమె ఇంట్లో అప్పగించి వచ్చారు. అయితే ఇంట్లో చెప్పకుండానే ఆమె మళ్లీ అదే అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో బయటకు వచి్చంది. ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని లోటస్‌పాండ్ పార్కు వద్ద వివస్త్రగా పడి ఉంది. శనివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమె గురించి ఆరా తీయగా సయ్యద్‌నగర్‌లో నివసిస్తుందని తెలిసింది. దీంతో ఆమె కూతురికి ఫోన్ చేయగా ‘సార్..దయచేసి మా అమ్మను ఇంటికి పంపకండి..జైలుకు పంపండి..’ అంటూ ఆమె ఇంట్లో చేసిన న్యూసెన్స్‌ను మొరపె ట్టుకుంది. ఆమె భర్త పెయింటర్‌గా పనిచేస్తుంటాడని, ముగ్గురు పిల్లలు ఉన్నారని, మద్యానికి బానిసై నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. గత నెల రోజుల నుంచి 10 మార్లు పోలీసులు ఆమెను ఇలా గే రోడ్లపై మద్యం మత్తులో తిరుగుతుండగా కు టుం బసభ్యులకు అప్పగించారు. ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తెలుగు తమ్ముళ్ల తన్నులాట
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘నువ్వెవడివి? నువ్వు ఎక్కడోడివి? నీకిక్కడేం పని? నువ్వు ఇన్చార్జివా? ఇన్చార్జి లేకుండా కార్యక్రమం ఏంటి? వేషాలు వేయకండి. తమాషా చేస్తున్నారా.. ఎక్కువ చేస్తే తరిమి తరిమి కొడతాం.’ ఇదీ శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ నాయకుల భాష. శ్రీకాకుళం నగరంలోని టీడీపీలోని రెండు గ్రూపులు పాలకొండ రోడ్డుపై న్యూసెన్స్ చేశాయి. ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు నడిరోడ్డుపైనే బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు తోసుకుని నువ్వెంతంటే నువ్వెంత అని ఘర్షణ పడ్డారు. నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్న గొండు శంకర్‌పై మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అనుచరులు దాడికి దిగారు. బలవంతంగా తోసేసి అక్కడి నుంచి వెళ్లగొట్టారు. గంటకు పైగా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. ఐదేళ్లుగా వర్గపోరు.. శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూపునకు మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నాయకత్వం వహించగా, మరో గ్రూపునకు రూరల్ నాయకుడు గొండు శంకర్ నేతృత్వం వహిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఐదేళ్లుగా వర్గపోరు నడుస్తోంది. పలుమార్లు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని పోలీసు స్టేషన్ల వరకు వెళ్లారు. తాజాగా శ్రీకాకుళం కేంద్రంగా మరోసారి రోడ్డెక్కారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇరువురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. అధిష్టానం కూడా స్పష్టత ఇవ్వకుండా ఇద్దర్ని రెచ్చగొడుతోంది. టికెట్ తమకే అంటూ ఇద్దరూ ఆశతో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. నడిరోడ్డుపైనే వీరంగం.. ఈక్రమంలో బుధవారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని రెల్లివీధిలో గొండు శంకర్ తన వర్గీయులతో కలిసి ఇంటింటికీ శంకరన్న కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుండ లక్ష్మీదేవి అనుచరులైన పట్టణ టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటే‹Ù, వార్డు ఇన్‌ఛార్జిలు కళ్యాణి వెంకటరావు, జలగడుగుల జగన్, కవ్వాడి సుశీల తదితరులు అక్కడికొచ్చి గొండు శంకర్‌ను అడ్డుకున్నారు. అతను పట్టించుకోకుండా ముందుకెళ్లడంతో గుండ లక్ష్మీదేవీ వర్గీయులు రెచ్చిపోయారు. గొండు శంకర్‌ను అక్కడి నుంచి నెట్టేశారు. ఆయన అనుచరులను తోసేశారు. ఈ తోపులాట ప్రధాన రహదారిపైకి వచ్చేసింది. ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. ఇరు వర్గాల వీరంగంతో అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అధికారంలో లేనప్పుడు వీరింత అలజడి సృష్టిస్తున్నారంటే.. ఒకవేళ అధికారమిస్తే ఇంకెంత రెచ్చిపోతారోనని స్థానికులు చర్చించుకున్నారు. -
అనంతపురం జిల్లాలో బయటపడ్డ ఎల్లో మీడియా కుట్రలు
-
ఇబ్బందికర సందేశాలకు అడ్డుకట్ట
న్యూఢిల్లీ: ఇబ్బందికర సందేశాలను అరికట్టేందుకు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కసరత్తు ప్రారంభించింది. టెలిమార్కెటింగ్ సందేశాల టెంప్లేట్ల దుర్వినియోగంపై 30 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ శుక్రవారం ఆదేశించింది. కంపెనీల హెడర్లు, కంటెంట్ టెంప్లేట్లను కొంతమంది టెలిమార్కెటర్లు దుర్వినియోగం చేస్తున్నారని తాము గుర్తించామని తెలిపింది. ‘తాము కోరని వాణిజ్య ప్రకటనలు అందుకోవడం అనేది ప్రజల అసౌకర్యానికి ప్రధాన మూలం. వ్యక్తుల గోప్యతకు ఇవి ఆటంకం కలిగిస్తాయి. వీటిని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం’ అని ట్రాయ్ తెలిపింది. టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్–2018 కింద మెసేజ్ టెంప్లేట్ల దుర్వినియోగాన్ని ఆపడానికి ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. అధీకృత టెలిమార్కెటింగ్ కంపెనీలు సందేశాల కోసం మొబైల్ నంబర్లకు బదులుగా కంపెనీ పేరును సూచించే హెడర్లను ప్రదర్శిస్తాయి. టెలిమార్కెటింగ్ సందేశాల శీర్షికలు, కంటెంట్ టెంప్లేట్ల విధానంలో (కోడ్ ఆఫ్ ప్రాక్టీసెస్) మార్పులు చేయాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది. ఇతర కంపెనీల పేర్లను పోలిన మెసేజ్ టైటిల్స్, హెడర్లు వినియోగదార్లలో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. కొన్ని సంస్థలు తమ లాభాల కోసం వీటిని దుర్వినియోగం చేస్తున్నాయని ట్రాయ్ స్పష్టం చేసింది. బ్లాక్‌చెయిన్ ఆధారిత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో నమోదైన అన్ని హెడర్లను 30 రోజుల్లోపు తిరిగి ధృవీకరించాలని.. ధృవీకరించని హెడర్లను బ్లాక్ చేయాలని ట్రాయ్ ఆదేశించింది. 30 రోజుల పాటు ఉపయోగించని అన్ని హెడర్లను తాత్కాలికంగా నిష్క్రియం (డీయాక్టివేట్) చేయడానికి 60 రోజుల్లోపు ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాలని టెలికం ఆపరేటర్లను ట్రాయ్ కోరింది. -
కుక్కల దాడి ఘటన.. వారికి మెదడు ఉందా?.. రేవంత్‌రెడ్డి సీరియస్
సాక్షి, భూపాలపల్లి: కుక్కల బెడదపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కుక్కల బెడదను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో కుక్కల దాడిలో బాలుడు చనిపోతే మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్న రేవంత్‌రెడ్డి.. కోటంచ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుక్కలకు ఆకలి వేసి బాలుడిని తిన్నాయని మేయర్ అంటే.. మంత్రి కేటిఆర్ కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తామని చెప్పడం చూస్తే వారి ఆలోచన ఏవిధంగా ఉందో అర్థమవుతుందన్నారు. చనిపోయిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాల్సిన మంత్రి కేటీఆర్ కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామనడం వారికి మెదడు ఎక్కడ ఉందో అర్థమవుతుందన్నారు. ఎఫ్1 రేస్‌పై ఉన్న శ్రద్ధ కుక్కల బెడదపై లేదా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ తక్షణమే మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించి, క్షమాపణ చెప్పి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో పామాయిల్ కంపెనీ పేరుతో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి బినామీల పేరుతో పేదల భూములను ఆక్రమించుకుంటున్నాడని ఆరోపించారు. రేపు భూపాలపల్లిలో పర్యటించే మంత్రి కేటీఆర్.. దానిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అక్రమ దందాను నిరూపించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. చదవండి: అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు: చికోటి ప్రవీణ్ షాకింగ్ కామెంట్స్ భూపాలపల్లికి పట్టిన చీడపీడ విరగడం కోసం కోటంచ లక్ష్మి నరసింహస్వామి వారిని వేడుకుని పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. భూపాలపల్లిలో ఆరాచకశక్తులు పార్టీ ఫిరాయింపుదారులు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. వారి తప్పిదాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర భూపాలపల్లిలో ఉందన్నారు. ప్రజా వ్యతిరేక పాలనతో ఆస్తులు సంపాదనే లక్ష్యంగాఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పనిచేస్తున్నాడని విమర్శించారు. భూపాలపల్లిలో పర్యటించే కేటీఆర్ తమ సవాల్ స్వీకరించి సమాధానం చెప్పాలని కోరారు. -
Vizag: మోడిఫైడ్ సైలెన్సర్లతో న్యూసెన్స్.. నేరమని తెలియదా?
ఈ మధ్య రోడ్లపై మితిమీరిన వేగంతో.. చెవులకు చిల్లుపడే శబ్దంతో వెళుతున్న ద్విచక్రవాహనాలు ఎక్కువయ్యాయి. కంపెనీ నుంచి కొనేప్పుడు వాహనాలకు ఉన్న సైలెన్సర్లు (పొగ గొట్టాలు) తొలగించి వాటిని ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మార్చేస్తూ రోడ్లపై వెళ్లేవారికి దడపుట్టిస్తున్నారు. 90 శాతం వాహనాలు అటు పర్యావరణానికి.. ఇటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. మనిషి సాధారణంగా 60 డెసిబుల్స్ శబ్దం వరకు వినగలదు. 120 డెసిబుల్స్ కన్నా ఎక్కువగా వినడం చెవుడుకు దారితీస్తుంది. ఆకతాయిలు చేస్తున్న ఇలాంటి న్యూసెన్స్‌పై పోలీసులు కేసులు నమోదు చేసి.. తగిన చర్యలు తీసుకుంటున్నారు. – దొండపర్తి(విశాఖ దక్షిణ) విశాఖ జిల్లాలో వాహనాల శబ్ద కాలువ్యం ఎక్కువైంది. రోడ్డుపైకి వెళ్లాలంటే వృద్ధులు, మహిళలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనం వేగం పెరిగితే అది వెలువరించే శబ్దం బాగా పెరుగుతుంది. శబ్దాన్ని డెసిబుల్స్‌లో కొలుస్తారు. మోటారు వాహనాల చట్ట నిబంధనలకు అనుగుణంగా ప్రతి వాహనం నిర్ణీత శబ్దాన్ని వెలువరించేలా, దాని సైలెన్సర్‌ను తీర్చిదిద్దుతారు. అలాంటి డిజైన్లకే రవాణా శాఖ అనుమతి ఇస్తుంది. కంపెనీ సైలెన్సర్లకు ఒక సీరియల్ నంబర్ కూడా ఉంటుంది. దాని ద్వారా కంపెనీ సైలెన్సర్‌ను గుర్తించవచ్చు. ఇలా కాకుండా వాటిలో ఏమైనా మార్పులు చేసినా, రవాణా శాఖ అనుమతి లేని వాటిని వాడినా శబ్ద తీవ్రత మారిపోతుంది. ఉలిక్కి పడాల్సిందే.. బుల్లెట్ వాహనాలు దర్జాకు ప్రతీకగా నిలుస్తున్నాయి. కేటీఎం కుర్రకారుకు క్రేజ్‌గా మారుతున్నాయి. అలాగే పాతబడ్డ యమహా ఆర్ఎక్స్ –100 వాహనాలకు రంగులద్ది రోడ్లపై తిప్పుతున్నారు. ఈ వాహనాల సైలెన్సర్లలో కొద్దిపాటి మార్పు చేస్తే అది వెలువరించే శబ్దం ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తూ.. ఎదుటివారి ఇబ్బందులు ఏ మాత్రం పట్టించుకోకుండా రోడ్లపై వాహనాలను నడుపుతుండడం దడ పుట్టిస్తోంది. కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లలో కొంత మంది మార్పులు చేస్తుంటే.. మరికొంత మంది దానిని పూర్తిగా మార్చేసి అధిక శబ్దం వచ్చే వాటిని బిగించుకుంటున్నారు. ఇది మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరమని గుర్తించలేకపోతున్నారు. బుల్లెట్, ఆర్ఎక్స్–100 లాంటి వాహనాల నుంచి ఒక్కోసారి బాంబు పేలిన శబ్దం వస్తుంటుంది. యువత దీన్ని క్రేజ్‌గా భావిస్తున్నారు. వాహనం రన్నింగ్‌లో ఉన్నప్పుడు దానిలో కొన్ని మార్పులు చేస్తే బుల్లెట్ సైలెన్సర్ నుంచి బాంబు పేలిన శబ్దం వస్తుంది. పక్క నుంచి వెళ్తూ ఒక్కసారిగా ఇలాంటి శబ్దం వస్తే ఎంతటి వారైనా ఉలిక్కిపడాల్సిందే. గుండె జబ్బులున్న వారిపై ఇది తీవ్రమైన ప్రభావం చూపుతుందని వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కో సైలెన్సర్ ఒక్కో శబ్దం ద్విచక్రవాహనాలకు రకరకాల సైలెన్సర్లు బిగిస్తున్నారు. ఒక్కో మోడల్ సైలెన్సర్ ఒక్కో రకమైన శబ్దం విడుదల చేస్తుంది. దాన్ని బట్టి వాటికి ప్రత్యేకమైన పేర్లు పెట్టారు. అడవి పంది అరుపులా ఉంటే దానికి వైల్డ్బోర్ ఎగ్జాస్ట్ అన్ని పేరు పెట్టారు. మరొకటి మర తుపాకీలా గిర్రున తిరుగుతూ శబ్దం వెలువరిస్తే దానిని ‘టెయిల్ గన్నర్’ అంటారు. వీటితో పాటు బ్యారెల్, గ్రీసెస్, మెగా ఫోన్, కాక్టైల్ షార్మర్, ఇండోరి, పంజాబీ, డాల్ఫిన్, ఆర్ఆర్ఓ పేరిట స్పేర్‌పార్ట్ దుకాణాల్లో సైలెన్సర్లు లభిస్తున్నాయి. సైలెన్సర్ మార్చినా.. మోటారు వాహనానికి కంపెనీ ఇచ్చిన భాగాలను మారిస్తే వారిపై ఎంవీఐ యాక్ట్ 1988 సెక్షన్ 191 ప్రకారం కేసు నమోదు చేస్తారు. కొంత మంది నిబంధనలను ఉల్లంఘించి కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లు తీసేసి వేరే వాటిని బిగిస్తున్నారు. మరికొందరు కంపెనీ సైలెన్సర్లు ఉంచినా దానిలో ఉండే పలు ఫిల్టర్లు తీసేస్తున్నారు. దీని వల్ల శబ్ద తీవ్రత పెరుగుతుంది. ఇది కూడా నేరమే అంటున్నారు పోలీసు అధికారులు. ఇలాంటి ఉల్లంఘనులపై ట్రాఫిక్ పోలీసులు నిఘా ఉంచి కేసులు నమోదు చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. చట్టం ఏ చెబుతుందంటే.. ► ఒక వాహనం నిర్ణీత డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్ద కాలుష్యం సృష్టిస్తే అది మోటారు వాహనాల చట్టం ప్రకారం నేరం. ► నిబంధనలకు విరుద్ధంగా శబ్ద కాలుష్యం సృష్టించే వాహనంపై ఎంవీఐ యాక్ట్ 1988 సెక్షన్ 190(2) ప్రకారం పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు కేసు నమోదు చేయవచ్చు. ► సంబంధిత వాహన చోదకుడికి రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేయవచ్చు. ► రెండోసారి శబ్ద కాలుష్యానికి కారణమైతే రూ.2 వేల వరకు జరిమానా విధిస్తారు. తీవ్రత పెరిగిందా జబ్బులు ఖాయం మనం వింటున్న శబ్ద తీవ్రత పెరిగే కొద్దీ జబ్బులు ఖాయమంటున్నారు వైద్య నిపుణులు. 100 డెసిబుల్స్ దాటిన ఏ శబ్దమైనా గుండె జబ్బులున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. ► 110 డెసిబుల్స్ దాటితే.. చికాకు, చర్మంపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. వణుకు మొదలవుతుంది. ► 120 డెసిబుల్స్ దాటితే.. చికాకు, కోపంతో భరించలేని తలనొప్పి వస్తుంది. ► 160 డెసిబుల్స్ దాటితే.. చెవుల్లోని వినికిడి కణాలు, నరాలు దెబ్బతిని కొంతస్థాయిలో శాశ్వతంగా వైకల్యం ఏర్పడుతుంది. ► 190 డెసిబుల్స్ దాటితే.. కర్ణ భేరి పగిలిపోతుంది. శాశ్వతంగా వినికిడి శక్తి కోల్పోతారు. పూర్వపుస్థితి తీసుకురావడం చాలా కష్టం. అవగాహన కల్పిస్తున్నాం.. వినకపోతే కేసులు పెడతాం వాహనాలకు సైలెన్సర్లు మార్చడం చట్టరీత్యా నేరం. దీనికి తోడు రోడ్లపై ఇష్టం వచ్చిన రీతిలో వాహనాల ద్వారా సౌండ్ చేస్తూ వెళ్లడం న్యూసెన్స్ అవుతుంది. వీటిపై త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపడతాం. ఇప్పటికే ఈ విషయంపై అవగాహన కల్పిస్తున్నాం. ఇటీవలే ఇటువంటి వాహనాల సైలెన్సర్లను తొలగించడం జరిగింది. వాహనదారులు కంపెనీ సైలెన్సర్లు మాత్రమే ఉంచుకోవాలి. లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. - సి.హెచ్.శ్రీకాంత్, నగర పోలీస్ కమిషనర్ సాధారణ ధ్వని స్థాయి 60 నుంచి 70 డెసిబుల్స్. నమోదవుతున్న ధ్వని స్థాయి 80 నుంచి 120. ఫలితంగా జాతీయ రహదారులు, నగరంలోని ప్రధాన రహదారుల పక్కన నివసిస్తున్న వారి చెవులు చిల్లులు పడుతున్నాయి. ఉదయం 8 గంటల మొదలు రాత్రి 10 వరకు వాహనాల శబ్దాలు హడలెత్తిస్తున్నాయి. (క్లిక్: ఎన్నెన్నో అందాలు.. వాటి వెనుక అంతులేని విషాదాలు) -
న్యూసెన్స్‌కు 112 రోజుల జైలు
సాక్షి, హైదరాబాద్: ప్రజా జీవనానికి ఇబ్బందులు కలిగిస్తూ పదేపదే న్యూసెన్స్‌కు పాల్పడుతున్న వ్యక్తులపై నమోదయ్యే పెట్టీ కేసులను న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇలాంటి ఓ వ్యక్తికి 13వ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఏకంగా 112 రోజుల జైలు శిక్ష విధించింది. పెట్టీ కేసులో ఈ స్థాయిలో జైలు పడటం ఇదే తొలిసారి. కార్ఖానా బస్తీలో నివసించే మహ్మద్ సలీం పేరు చెప్తే ఆ ప్రాంత వాసులకు హడల్. అనునిత్యం మద్యం తాగి రోడ్డుపై హంగామా సృష్టిస్తుంటాడు. తన కుటుంబీకుల పైనే దాడులు చేస్తూ అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిని దుర్భాషలాడతాడు. అప్పుడప్పుడు నగ్నంగా రోడ్లపైకి వచ్చి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తుంటాడు. దీనికి సంబంధించి ఫిర్యాదు అందిన ప్రతిసారీ కార్ఖానా పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించే వారు. పోలీసుస్టేషన్‌లోనూ ఇతడితో అధికారులకు తలనొప్పే. గోడకు తల కొట్టుకోవడం, చేతులు కోసుకోవడం వంటివి చేస్తూ ఇబ్బందులు కలిగించే ప్రవర్తిస్తుంటాడు. సలీంపై ఇప్పటికే పలుమార్లు పోలీసులు పెట్టీ కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆదివారం మరోసారి బస్తీలో రాద్ధాంతం చేశాడు. మద్యం మత్తులో తల్లిదండ్రులపై దాడికి దిగాడు. అడ్డుకున్న స్థానికులనూ దుర్భాషలాడాడు. పోలీసులపైనా విరుచుకుపడి.. డయల్–100కు ఫిర్యాదు రావడంతో కార్ఖానా పోలీసుస్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు ఘటనాస్థలికి చేరుకున్నారు. వీరిపైనా విరుచుకుపడిన సలీం అభ్యంతరకరంగా ప్రవర్తించి, వారి విధి నిర్వహణకు అడ్డు తగిలాడు. బస్తీ వాసులకు పదేపదే ఇబ్బందులు సృష్టిస్తున్న సలీం విషయాన్ని కార్ఖానా ఇన్స్పెక్టర్ బి.రవీందర్ తీవ్రంగా పరిగణించారు. ఇతడికి వైద్య పరీక్షలు చేయించడంతో పాటు నగర పోలీసు యాక్ట్, ఐపీసీలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అవసరమైన ఆధారాలతో సోమవారం కోర్టులో సలీంను హాజరుపరిచి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అభియోగపత్రాల్లో పొందుపరిచిన ఇతడి వ్యవహారశైలి, గత చరిత్ర తదితరాలను గమనించిన న్యాయమూర్తి 112 రోజులు జైలు శిక్ష విధించారు. చట్టాన్ని అతిక్రమించినా, పబ్లిక్ న్యూసెన్స్‌కు పాల్పడినా ఇలాంటి చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ బి.రవీందర్ స్పష్టం చేశారు. (చదవండి: యువ గాయని అపహరణ.. ఆపై దారుణ హత్య!) -
అపార్ట్మెంట్ న్యూసెన్స్ కేసు : నిహారిక భర్త చైతన్య క్లారిటీ
Niharika Husband Chaitanya Clarity On Case Filed: షేక్‌పేట్‌లోని అపార్ట్మెంట్ వాసులతో జరిగిన వివాదంపై నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య క్లారిటీ ఇచ్చారు. అపార్ట్మెంట్ వాసులు గొడవ చేయడం వల్లే పీఎస్‌లో ఫిర్యాదు చేశానని తెలిపిన చైతన్య.. అందరం మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకున్నట్లు తెలిపారు. అయితే ముందు తనమీదే కేసు నమోదైనట్లు వార్తలు రావడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఆగస్టు 10లోగా ఫ్లాట్ ఖాళీ చేస్తున్నట్లు ముందే ఓనర్‌కి చెప్పినట్లు పేర్కొన్నారు. 'ఫ్లాట్ తీసుకున్నప్పుడే ఆఫీస్ పర్పస్ కోసమని ఓనర్‌కి చెప్పాం, అయితే అపార్ట్మెంట్ అసోసియయేషన్‌కు క్లారిటీ లేకపోవడంతో వాదనకు దిగారు' అని చైతన్య గొడవపై వివరణ ఇచ్చారు. ఇక ఇదే విషయంపై అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీధర్ మాట్లాడుతూ.. అపార్ట్‌మెంట్‌ను నిహారిక దంపతులు కమర్షియల్‌గా వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఆఫీస్ కోసమని ఫ్లాట్ తీసుకున్న విషయం తమకు తెలియదని, దీంతో వాదన జరిగినట్లు తెలిపారు. అయితే ఇప్పుడు అందరం కలిసి సమస్యను పరిష్కరించుకున్నామని వివరించారు. కాగా చైతన్య అర్ధరాత్రిపూట గొడవ చేస్తూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నాడని అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్న చైతన్య అక్కడే ఆఫీస్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడట. గత కొన్ని రోజులుగా ఫ్లాట్‌కు కొంతమంది యువకులు వస్తున్నారని, వారు మద్యం తాగి నానా హంగామా సృష్టిస్తున్నట్లు అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ వాసులపై కూడా చైతన్య తిరిగి ఫిర్యాదు చేశాడు. తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్మెంట్ వాసులు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇరువురి వాదనలు విన్న పోలీసులు విచారణ జరిపి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.కాగా చైతన్య జొన్నలగడ్డతో నిహారిక కొణిదెల వివాహం డిసెంబర్ 9న ఉదై విలాస్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. -
సెల్ఫోన్లో ఫోటోలు తీసి నానా రభస..
సాక్షి, ఆత్మకూరు : కారుకు సైడు ఇవ్వమని అడిగారన్న కోపంతో బొలెరో వాహనంలో ఉన్న ఓ వ్యక్తి... కారులో వెళుతున్న వారిని వెంటాడి భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన ఏఎస్‌పేట మండలంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వేద పండితులుగా పనిచేస్తున్న విఘ్నేష్‌కుమార శర్మ తన కుటుంబసభ్యులతో కారులో ఏఎస్‌పేట మండలంలోని గుంపర్లపాడులోని బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో జమ్మవరం వద్ద ఓ బొలేరో వాహనం దారికి అడ్డుగా ఉండడంతో విఘ్నేష్‌కుమార్ హారన్ మోగించాడు. తన కారు వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరాడు. బొలేరో వాహన డ్రైవర్ మద్యం మత్తులో కారులో ఉన్నవారిని దుర్భాషలాడుతూ వాహనాన్ని అడ్డు తొలగించాడు. పట్టించుకోని విఘ్నేష్‌కుమార్ తన కారును గుంపర్లపాడు వైపునకు పోనిచ్చాడు. అయితే కొద్దిసేపటికే ఆ బొలేరో వాహనంలో ఉన్న వ్యక్తి తన వాహనంతో వీరి వాహనాన్ని వెనుకనే తరుముకుంటూ దారి పొడవునా హారన్ మోగిస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు. విఘ్నేష్‌కుమార్ కుటుంబ సభ్యులు మొత్తానికి గుంపర్లపాడులోని బంధువుల ఇంటికి చేరుకున్నారు. వీరి వెనుకనే వచ్చిన బొలేరో వాహనందారుడు విఘ్నేష్‌కుమార్ బంధువుల ఇంట్లోకి వెళ్లి తన సెల్‌ఫోన్‌తో మహిళలని కూడా చూడకుండా అందరి పొటోలు తీస్తూ నా వాహనానికి అడ్డు తగులుతారా అని బెదిరించి దుర్భాషలాడాడు. కారును వెంబడించిన బొలేరో వాహనం గ్రామస్తులు గమనించి బొలేరో వాహనదారుడిని మందలించేందుకు ప్రయత్నించారు. తాను ఆర్మీలో పనిచేస్తున్నానని, తనను ఏమైనా అంటే అంతుచూస్తానని మద్యం మత్తులో నానాయాగి చేశాడు. దీంతో గ్రామస్తులు ఏఎస్‌పేట పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి అతడ్ని బైక్‌పై తీసుకుని వెళ్లారు. బొలేరో వాహనం ఏసుబాబు అనే వ్యక్తిదిగా గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై ఆత్మకూరు సీఐ పాపారావును సంప్రదించగా తాను పూర్తి విషయాలు తెలుసుకుని విచారణ చేస్తానని పేర్కొన్నారు. -
అర్ధరాత్రి ఫుల్‌గా మద్యం తాగి..
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి ఓ కానిస్టేబుల్ నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఈశ్వరయ్య సోమవారం అర్ధరాత్రి ఫుల్‌గా మద్యం తాగి నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. మద్యం మత్తులో చిందులు తొక్కిన ఈశ్వరయ్య నడిరోడ్డుపైనే పడిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసు యూనిఫాంలో ఉండి మద్యం తాగిన కానిస్టేబుల్ చేష్టలను చూసిన ప్రజలు షాకయ్యారు. ఓ వాహనదారుడు కానిస్టేబుల్ వీరంగం మొత్తాన్ని తన మొబైల్లో రికార్డ్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో విషయం పోలీస్‌శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ వ్యవహారాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఫలక్ నుమా సీఐకు మెమో జారీ చేశారు. -
అర్ధరాత్రి అభ్యంతరకరంగా సంచరిస్తున్న జంటలు..
హిమాయత్‌నగర్:‘‘సర్.. ఇంత వరకు నేను ఏ పోలీసు స్టేషన్ మెట్లక్కలేదు. స్థానిక పోలీసులు స్పందించడం లేదు. కొంతమంది చేస్తున్న న్యూసెన్స్‌ను అరికట్టమని పాలీస్ బాస్‌గా మీ వద్దకు వచ్చాం. దయచేసి యాక్షన్ తీసుకోండి’’. ‘‘సర్.. మా ఇంటి పరిసరాల్లో పుట్టగొడుగుల్లా హాస్టల్స్ పుట్టుకొచ్చాయి. వాటిలో ఎన్ని హాస్టళ్లకు అనుమతులున్నాయో తెలియదు. వాళ్లు చేసే న్యూసెన్స్ వల్ల మేము పగలు రాత్రి నిద్రాహారాలు మానుకోవాల్సి వస్తోంది. దయచేసి చర్యలు తీసుకోండి’’. మార్చి 25న ఒకే రోజు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్‌ను కలిసిన హిమాయత్‌నగర్‌కు చెందిన ఇద్దరు మహిళలు చేసిన లిఖితపూర్వక ఫిర్యాదులివి. యాక్షన్ తీసుకోవాలంటూ ఈ ఇద్దరు అధికారులు ఆదేశాలు జారీ చేసి దాదాపు నెల కావొస్తున్నా ఇప్పటి వరకు కింది స్థాయి అధికారులు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం. పోలీసులు నామ్‌కే వాస్తేగా ఒక్కరోజు వచ్చి పది నిమిషాలు గస్తీ నిర్వహించి వెళ్లిపోయారు. ఇక జీహెచ్ఎంసీ సిబ్బంది అయితే ఇటువైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ♦ అర్దరాత్రి న్యూసెన్స్.. హిమాయత్‌నగర్‌లోని తెలుగు అకాడమీ సమీపంలోని, విఠల్‌వాడీ మసీదు వెనక గల్లీలో సుమారు పది వరకు హాస్టళ్లున్నాయి. వీటిలో రెండు మాత్రమే బాయ్స్ హాస్టల్స్. మిగలనవన్నీ గరŠల్స్ హాస్టల్స్. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ గల్లీలో అమ్మాయిలు, అబ్బాయిలతో సందడిగా ఉంటుంది. రాత్రి 11 గంటల తరువాత నుంచి అసలు రచ్చ మొదలవుతుంది. అమ్మాయిలు, అబ్బాయిలు జంటలుగా హాస్టల్స్ బయట నిలబడటం, అసభ్యకరంగా ప్రవర్తించడం, పెద్దగా కేకలు వేయడం వంటివి షరా మామూలుగా మారాయి. ఇలాంటి చేష్టలను చూస్తూ బయటకు రావాలంటేనే సిగ్గుగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అర్దరాత్రి సమయాల్లో సెల్ఫీలు దిగుతూ, అంతాక్ష్యరి, డ్యాన్సులు, బైక్ రైడ్స్‌తో న్యూసెన్స్ చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ♦ ప్రశ్నించిన వారిపై యజమానుల రుబాబు.. మార్చిలో జరిగిన హోలీ రోజు ఇవే హాస్టల్స్ వద్ద అర్దరాత్రి కొంతమంది యువకులు మందు బాటిళ్లతో వీరంగం సృష్టించారు. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించిన స్థానికులపై ఆయా హాస్టళ్ల యాజమానులు ‘‘వాళ్లేదో హోలీ సంబురాలు చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఏమీ అనలేదు కదా..? మీ పని మీరు చూసుకోండి’’ అంటూ రుబాబ్‌గా మాట్లాడినట్టు స్థానికులు తెలిపారు. ఓ హాస్టల్ ముందు గుమికూడిన యువకులు ♦ కమిషనర్లకు రాతపూర్వక ఫిర్యాదు.. ఈ వ్యవహారంపై పలుమార్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్‌కు స్థానికులు దాదాపు నెలరోజుల క్రితం నేరుగా కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పందించిన సీపీ నారాయణగూడ ఇన్స్పెక్టర్ పాలేపల్లి రమేష్‌ను చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. దీంతో ఈ నెల 5న ఇన్స్పెక్టర్, అడ్మిన్ ఎస్ఐ.కర్ణాకర్రెడ్డితో కలసి గస్తీ నిర్వహించారు. ఆ సమయంలో న్యూసెన్స్ ఏమీ లేకపోవడంతో వారు వెనుదిరిగారు. జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ స్థానికంగా ఎన్ని హాస్టళ్లున్నాయి.? వాటిలో ఎంతమంది ఉంటున్నారు.? ఎన్ని హాస్టల్స్‌కు అనుమతులు ఉన్నాయి.? అనే విషయాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. ♦ చర్యలు శూన్యం ఈ న్యూసెన్స్ వ్యవహారంపై ఇటు పోలీసుల నుంచి కానీ.. అటు జీహెచ్ఎంసీ అధికారుల నుంచి కానీ ఏ మాత్రం స్పందన రాకపోవడం విచిత్రకరంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. దీనికి కారణంగా ఈ హాస్టల్స్ నడుపుతున్న వ్యక్తుల వెనక బడా బడా రాజకీయ నాయకులు ఉన్నారని, ఫిర్యాదు చేసిన ప్రతిసారీ హాస్టల్ యజమానులు రాజకీయ నాయకులతో పోలీసులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్లు చేయిస్తున్నారని స్థానికులు ‘సాక్షి’కి తెలిపారు. -
భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
-
రచ్చకెక్కిన ఇంటి గొడవ
చిలకలగూడ : న్యాయస్థానంలో పెండింగ్‌లో భార్యభర్తల వివాదం రచ్చకెక్కింది. భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు భార్యభర్తలు ఇద్దరిపై న్యూసెన్స్ కేసులు నమోదు చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పద్మారావునగర్‌కు చెందిన నికిల్‌కుమార్‌కు వరంగల్ గిర్మాజీపేటకు చెందిన అపర్ణతో 2016 ఆగస్టులో వివాహం జరిగింది. వీరిద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. పెళ్లయిన కొద్దిరోజులకే మనస్పర్ధలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. నికిల్‌కుమార్‌తోపాటు అతని కుటుంబసభ్యులు తమ కుమార్తెను వేధిస్తున్నారని అపర్ణ తల్లితండ్రులు వరంగల్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అనంతరం విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కేసు పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో అత్తవారింట్లో ఉన్న తన వస్తువులు, సర్టిఫికెట్లు ఇప్పించాలని అపర్ణ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆమె ఆదివారం న్యాయవాది, తల్లితండ్రులతో కలిసి పద్మారావునగర్‌లోని నికిల్‌కుమార్ ఇంటికి వచ్చింది. అత్తింటివారు ఆమె అల్మారా, ఇతర వస్తువులు ఇంటి బయట ఉంచారు. అల్మారాలోని బంగారు ఆభరణాలు, సర్టిఫికెట్లు లేవని అపర్ణతోపాటు వారి బంధువులు నికిల్‌కుమార్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నికిల్‌కుమార్, అపర్ణలను స్టేషన్‌కు తరలించారు. ఠాణాలో నూ వారు వాగ్వాదానికి దిగడంతో ఇరువురిపై న్యూసెన్స్ కేసులు నమోదు చేసినట్లు చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. -
ఆలయంలో మహిళ వీరంగం
సాక్షి, కర్ణాటక(తుమకూరు): దళితులు గుడిలో ప్రవేశించారనే కారణంగా ఓ మహిళ తన ఒంటిపై దేవత పూనినట్లు ఆవేశంతో ఊగి పోతూ ప్రజలను బెదిరించిన ఘటన సోమవారం జిల్లాలోని కుణిగల్ తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని కెంకరమ్మ దేవాలయంలోని కెంకమ్మ జాతర సందర్భంగా సోమవారం గ్రామంలోని దళిత కుటుంబాలకు చెందిన వ్యక్తులు కొంతమంది దేవాలయంలోకి ప్రవేశించి కెంకమ్మదేవిని దర్శించుకున్నారు. ఇది గమనించిన గ్రామస్థులు దళితులు దేవాలయంలోకి ప్రవేశించడంపై దళితులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే ఉన్న అగ్రకులానికి చెందిన మహిళ త్రిశూలాన్ని చేతిపట్టుకొని తనకు అమ్మవారు పూనినట్లు వీరంగం సృష్టించారు. తన అభీష్టానికి వ్యతిరేకంగా దళితులు దేవాలయంలోకి ప్రవేశించి అపరాధం చేసారని అందుకు దళితులంతా వాంతులు, విరేచనాలతో మరణిస్తారంటూ శపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో దళితులు తమను అవమానించారని తమకు న్యాయం చేయాలంటూ దేవాలయం ఎదుట నిరసనలకు దిగారు. -
మందు బాబు, పోలీసుల స్ట్రీట్‌ఫైట్
సాక్షి, హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల నేపథ్యంలో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద మోతాదుకు మించి మద్యం సేవించిన ఓ యువకుడు హల్ చల్ చేసాడు. తాగడమే కాకుండా కారు సీజ్ చేసినందుకు అతగాడు ట్రాఫిక్ పోలీసులపై దాడికి దిగాడు. వివరాల్లోకి వెళితే... వాహనాల తనిఖీల్లో భాగంగా దినేష్ పటేల్ అనే యువకుడికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో 194 ఆల్కహాలు పర్సంటేజ్ రావడంతో కేసు బుక్ చేశారు. అయితే తన వాహనాన్ని సీజ్ చేయడంతో అతడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపై దాడి చేశారు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కూడా ఆ మందుబాబుపై చేయి చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్ఐ ...యువకుడితో పాటు, కానిస్టేబుల్స్‌ను వారించి ...మందుబాబును అదుపులోకి తీసుకున్నారు. ఇక నగరంలో మూడు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో తాగి వాహనాలు నడుపుతూ 40 మంది పోలీసులకు చిక్కారు. 20 కార్లు, 25 బైకులను సీజ్ చేశారు పోలీసులు..పట్టుబడిన వారందరినీ కౌన్సిలింగ్ తర్వాత కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. -
మద్యం తాగి భర్త వీరంగం!
భార్య, కుమారుడిపై దాడి గణపవరం (నాదెండ్ల): మద్యం తాగి ఒక వ్యక్తి వీరంగం వేసిన సంఘటన మండలంలోని మేజర్ పంచాయతీ గణపవరంలోని శాంతి నగర్లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మేరీకి 22 సంవత్సరాల క్రితం సత్తెనపల్లికి చెందిన లారీడ్రై వర్ కాకుమాను కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్లుగా భర్త మద్యానికి బానిసై ఇంటికి రాకుండా, కుమారుల ఆలనాపాలన చూడకపోవడంతో విసుగుచెందిన భార్య మేరీ పుట్టింటింకి చేరింది. చాలాసార్లు పెద్దలు రాజీ కుదిర్చి చక్కదిద్దినా కుమార్ ప్రవర్తనలో ఏ మార్పు రాకపోగా, మద్యం తాగి భార్యాబిడ్డలపై తరచు దాడికి పాల్పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో మేరీ పిల్లలతో కలిసి మళ్లీ పుట్టింటికి వచ్చింది. అన్నదమ్ముల నివాసాల మధ్యలో గహాన్ని అద్దెకు తీసుకుని ఉంటూ కూలి పనులకు వెళుతోంది. రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో పెద్దకుమారుడు మృతి చెందాడు. రెండో కుమారుడిని తనతో పాటు కూలి పనులకు తీసుకువెళుతూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో భర్త కుమార్ శుక్రవారం రాత్రి మద్యం పూటుగా తాగి గణపవరంలో నివసిస్తున్న భార్య ఇంటికి చేరి భార్య, కుమారుడిపై దాడికి పాల్పడ్డాడు. ఇంట్లోని వస్తువులను చిందరవందర చేశాడు. కుమారుడు రాజేష్ గొంతు పట్టుకుని నొక్కడంతో అతడు కేకలు వేయడంతో స్ధానికులు వచ్చి కుమార్‌ను తాళ్లతో బంధించారు. తండ్రిని ప్రతిఘటించే క్రమంలో రాజేష్‌కు చేతికి తీవ్రగాయాలయ్యాయి. రాజేష్‌ను స్థానిక వైద్యశాలకు తరలించారు. -
బెంగాల్ రైతన్నలకు గజరాజుల పీడ
-
సైకో వీరంగం: గుడి పందిరికి నిప్పు
రాజుపేట (నల్గొండ జిల్లా) : నల్గొండ జిల్లా రాజుపేట మండలం రేణిగుంట గ్రామంలో ఆదివారం ఉదయం ఓ సైకో వీరంగం సృష్టించాడు. మహిళలపై దాడి చేయడమేకాక దుర్గమ్మ గుడిలోని పందిరికి నిప్పు పెట్టాడు. దాంతో పందిరి మొత్తం కాలిబూడిదైంది. గమనించిన స్థానికులు సైకోను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రేణిగుంటకు చెందిన నల్ల భాస్కర్(18) అనే యువకుడు గత కొంతకాలంగా ఊరిలో అర్ధనగ్నంగా తిరుగుతూ మహిళలపట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. గ్రామస్తులు ఎన్నిసార్లు చితకబాదినా ప్రయోజనం లేదు. ఆదివారం ఉదయం కూడా ఊరిలో తిరుగుతూ వీరంగం సృష్టించాడు. చివరకు దుర్గమ్మ గుడి ప్రాంగణంలో వేసిన చలువ పందిరికి నిప్పుపెట్టాడు. ఫలితంగా పందిరి కాలిబూడిదైంది. ఆగ్రహించిన గ్రామస్తులు సైకోను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
ఇక మీ ఫోన్ డేటా.. పర్సుకి భద్రత
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ఫేస్బుక్ వినియోగదారులకు కొత్త బాధలు తీసుకొచ్చిందా అంటే అవుననే అంటున్నారు పలువురు నెటిజన్లు. ఇందుకు ప్రధాన కారణం ఫేస్బుక్ లోని టైం లైన్‌లోని వీడియోలేనట. వీటి కారణంగా తాము మొబైల్ ఫోన్లలో వేసుకునే డేటా వేగంగా అయిపోవడమే కాకుండా వారి పర్సులు ఖాళీ అయిపోతున్నాయని వాపోతున్నారు. ఈ తరహా ఫిర్యాదులు ఈ మధ్య బాగా ఎక్కువై పోయాయి కూడా. ఒక్కసారి ఫేస్ బుక్ ఓపెన్ చేశాక అందులోని వీడియోలు మనం క్లిక్ చేసినా చేయకపోయినా వాటంతటవే బఫరింగ్ కావడం ఆ క్రమంలో డేటా మొత్తం అయిపోవడం తిరిగి డేటా కోసం డబ్బులు వెచ్చించడం ఒక విధిగా మారినట్లు వినియోగదారులు చెప్తున్నారు. నెల రోజులకోసం ఫోన్లలో వేయించుకున్న 500 ఎంబీ, 1జీబీ డేటా కూడా రెండు మూడు రోజుల్లో ఈ వీడియోల కారణంగా అయిపోతుందని అంటున్నారు. అయితే, ఈ సమస్యకు ఫేస్ బుక్ తాజాగా చెక్ పెట్టింది. ఫేస్‌బుక్‌లోకి వెళ్లగానే ఆటో ప్లేయింగ్ వీడియోస్ స్విచ్ఛాఫ్ చేసేలా అవకాశాన్నిచ్చింది. యూట్యూబ్ కంటే వేగంగా ఫేస్బుక్లో వీడియోలు అపలోడ్ అవుతున్న కారణంగా ప్రతి ఒక్కరు ప్రస్తుతం వీడియో అప్లోడ్లు ఎక్కువగా చేస్తున్నారు. -
బస్టాప్‌లో కల్తీకల్లు బాధితుల వికృతచేష్టలు
హైదరాబాద్ సిటీ : రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ కల్లు బాధితుల వికృత చేష్టలు సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా నగరంలోని కుత్బుల్లాపూర్‌లోని చింతల్ ఐడీపీఎల్ చౌరస్తా వద్దనున్న బస్టాప్ షెల్టర్లలో కల్లు తాగిన ముగ్గురు వ్యక్తులు నానా బీభత్సం సృష్టించారు. షెల్టర్‌లోనే అటూ ఇటూ పొర్లాడుతూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే తూలుతూ అక్కడే ఉన్నారు. దీంతో విద్యార్థినులు షెల్టర్‌లోకి రాకుండా రోడ్డుపైనే బస్ కోసం వేచి ఉండటం అక్కడ కనిపించింది. -
ఎమ్మెల్యే బావమరిదినంటూ హల్చల్
హైదరాబాద్ : నగరంలోని ఆర్టీసీ కాలనీలో అధికార పార్టీ నాయకుడు గంట్లపల్లి వెంకటేష్ హల్చల్ చేశాడు. ఎమ్మెల్యే బావమరిదిని అంటూ మహిళలతో అసభ్య పదజాలంతో మాట్లడమేకాక.. మీ పిల్లలను కిడ్నాప్ చేస్తామని.. భర్తలను చంపుతామని బెదిరించాడు. అతనితో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్ ఐటీఐ రాజు కూడా ఉన్నట్లు సమాచారం. ఫుల్లుగా మద్యం తాగిన ఇద్దరు కాలనీలోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తిచారని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ వాగ్వాద సమయంలోనే వెంకటేష్ యాదవ్‌కు చెందిన పాన్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్ కింద పడిపోయాయని వాటిని చూపిస్తూ వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. -
ట్రాఫిక్ పోలీసులపై కత్తితో వీరంగం
గోపాలపట్నం (విశాఖ) : వాహనం ఆపకుండా వెళ్లిపోతున్న ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకోగా అతడు కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటన విశాఖ నగరంలోని గోపాలపట్నంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగం శ్రీనివాసరావు అనే వ్యక్తి గోపాలపట్నం జంక్షన్లో రెడ్ లైట్ పడినా ఆగకుండా బైక్‌పై వేగంగా వెళ్లిపోయాడు. దీనిపై అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు కొంతదూరం తర్వాత అతడిని అడ్డుకున్నారు. ఆగ్రహించిన శ్రీనివాసరావు తన వద్ద ఉన్న కత్తితో వారిపైకి దాడికి దిగాడు. వారు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడి వద్ద ఉన్న నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, అతడిని విచారిస్తున్నారు. -
కానిస్టేబుల్ వీరంగం
వెంకటగిరి (నెల్లూరు ) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. జిల్లాలోని వెంకటగిరి టోల్గేట్ వద్ద ఓ పోలీస్ కానిస్టేబుల్ ఓ వ్యక్తితో చిన్న విషయమై వాగ్వివాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా బాధితుడు అయిన కోటి అనే వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదాడు. దీంతో సదరు కానిస్టేబుల్ అయిన సురేష్‌ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ బాధితుడి బంధువులు పోలీస్‌స్టేషన్ ఎదుటు ఆందోళనకు దిగారు. -
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద కత్తితో వీరంగం
విజయవాడ : విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఓ వ్యక్తి కత్తితో కలకలం సృష్టించాడు. కత్తిని గాల్లోకి చూపిస్తూ కాసేపు హల్చల్ చేశాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అతడు పిచ్చివాడని తెలిసింది. నెమ్మదిగా అతనిని అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే అతడు రెండవసారి మళ్లీ రావడంతో స్థానిక పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కాగా అతని పేరు అప్పారావు అని తెలిసింది. -
తాగుబోతుల న్యూసెన్స్
బంజారాహిల్స్ (హైదరాబాద్) : బంజారాహిల్స్ రోడ్ నెం-10లోని గౌరీశంకర్‌కాలనీ పరిసర ప్రాంతాలతోపాటు రామాలయానికి వెళ్లే రోడ్డులో తాగుబోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకూ తాగుబోతులు రోడ్ల పక్కన తిష్ట వేసి మద్యం సేవిస్తూ న్యూసెన్స్‌కు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. టీడీపీ జెండా వద్ద కూడా తాగుబోతులు తిష్టవేస్తూ రాత్రి విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే మహిళలను అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని తెలిపారు. జన్నత్‌హుస్సేన్ ఇంట్లో ఓ ఆసుపత్రి హాస్టల్ ఉందని, ఇందులో నర్సులు ఉంటున్నారని ఇక్కడ కూడా మందుబాబులు తాగి వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే ఉన్న పార్క్‌లో కూడా అర్ధరాత్రి వేళ మందుబాబులు చిందులు వేస్తూ స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రిపూట పోలీసుల నిఘా లేకపోవడం వల్లే ఆకతాయిల బెడద తలెత్తిందని పోలీస్ పెట్రోలింగ్ ఉంచాలని కోరారు. నిఘా పెంచుతాం, బంజారాహిల్స్ రోడ్ నెంబర్-10లోని గౌరీశంకర్‌కాలనీ పరిసర ప్రాంతాలతో పాటు రామాలయానికి వెళ్లే రోడ్డులో రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ పెంచుతామని స్థానిక సెక్టార్ ఎస్సై కృష్ణయ్య తెలిపారు. సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, తాగుబోతుల బెడద ఉంటే ఫోన్ నంబర్ 9966074757కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. -
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వ్యక్తి హల్చల్
విజయవాడ (కృష్ణా జిల్లా) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించటం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన గౌరీశంకర్ గురువారం విజయవాడ వెళ్లాడు. మద్యం తాగి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కనకదుర్గ ఆలయం ఉన్న ఇంద్రకీలాద్రి పైకి చేరుకున్నాడు. గుట్ట శిఖరానికి చేరుకుని అక్కడి నుంచి దూకి చనిపోతానంటూ కేకలు పెట్టాడు. ఇది గమనించిన ఆలయ సిబ్బంది సమాచారం అందించడంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది అతని వద్దకు చేరుకుని నిచ్చెన సాయంతో కిందికి దించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. -
తహశీల్దార్‌పై తెలుగు తమ్ముళ్ల దాడి
అనంతపురం : అధికారం అండగా ఉందనే భరోసాతో తెలుగు తమ్ముళ్లు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. తాజాగా బుధవారం అనంతపురం తహశీల్దార్‌పై దాడికి దిగారు. వివరాల్లోకి వెళ్తే...అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎంపీటీసీ కాటన్నెకాలువ శ్రీనివాస్ ఓ భూ వివాదానికి సంబంధించిన అంశంలో జోక్యం చేసుకుని ఎమ్మార్వోతో వాగ్వాదానికి దిగాడు. అదే క్రమంలో.. కార్యాలయంలోకి వచ్చిన తహశీల్దార్ మహబూబ్ పాషాను దుర్భాషలాడుతూ, అతని కాలర్ పట్టుకున్నాడు. దీంతో మనస్థాపం చెందిన అధికారి సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. -
తప్పతాగి రోడ్డుపై సినీతార రచ్చ రచ్చ
*మద్యం మత్తులో పట్టపగలే హల్చల్ చేసిన నటి మాధురి, ఫ్యాషన్ డిజైనర్ రమేష్ దిమ్లా * పోలీసుల అదుపులో ఐదుగురు *కేసు నమోదు చేస్తామన్న డీసీపీ పాటిల్ బెంగళూరు, న్యూస్‌లైన్ : మద్యం మత్తులో నడిరోడ్డుపై పట్టపగలే ఓ నటి, ఫ్యాషన్ డిజైనర్‌తో సహా ఐదుగురు న్యూసెన్స్ సృష్టించారు. సంఘటనకు సంబంధించి స్థానికుల ఫిర్యాదు మేరకు వారిని మల్లేశ్వరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన వివరాలను మీడియా సమావేశంలో ఉత్తర విభాగం డీసీపీ సందీప్ పాటిల్ శుక్రవారం వెల్లడించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రమేష్ దిమ్లా, శ్యాండిల్‌వుడ్ నటి మాధురి(ర్యాంబో ఫేం)తో సహా ఐదుగురు గురువారం ఉదయం 8.30గంటలకు మల్లేశ్వరం 17వ క్రాస్‌లోని వీణా స్టోర్స్ వద్దకు విలాసవంతమైన కారు (కేఏ 05 ఎన్కే 7275)లో చేరుకున్నారు. అనంతరం కారు ముందుకు చేరుకుని బీరు బాటిల్స్ చేతిలో పట్టుకుని తాగారు. ఆ సమయంలో వారిని స్థానికులు నిలదీయడంతో రమేష్ దిమ్లా రెచ్చిపోయాడు. షర్ట్ తీసి రోడ్డుపై గిరాటేసి, ప్యాంట్‌ను మోకాళ్ల వరకు ఎత్తి చూసుకుందాం రండని సవాల్ విసిరాడు. అర్ధనగ్న దుస్తులు వేసుకున్న మాధురి, మరో యువతి అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో మహిళలు తలలు దించుకుని వెళ్లిపోయారు. ఆ సన్నివేశాలను కొందరు మొబైల్లో చిత్రీకరించారు. వీరి ప్రవర్తన విషమిస్తుండడంతో సహనం కోల్పోయిన స్థానికులు ఫిర్యాదు చేయడంతో మల్లేశ్వరం పోలీసులు అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కొందరు రాజకీయ పెద్దలు జోక్యం చేసుకుని వారిని వదిలిపెట్టాలంటూ పోలీస్ అధికారులపై ఒత్తిడి పెంచారు. శుక్రవారం ఉదయం ఆ సన్నివేశాలను కొన్ని టీవీ చానెల్స్ ప్రసారం చేయడంతో విషయం వెలుగు చూసింది. తమ అదుపులో ఉన్న ఐదుగురిని మల్లేశ్వరం జనరల్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించామని, వారిలో కొందరు మద్యం సేవించినట్లు వైద్య నివేదికలో వెలుగు చూసిందని డీసీపీ తెలిపారు. కాగా, వారిని వదిలిపెట్టాలంటూ తమపై ఎలాంటి ఒత్తిడులు లేవని, కేసు నమోదు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.