
బస్టాప్‌లో కల్తీకల్లు బాధితుల వికృతచేష్టలు
హైదరాబాద్ సిటీ : రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ కల్లు బాధితుల వికృత చేష్టలు సంచలనం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా నగరంలోని కుత్బుల్లాపూర్‌లోని చింతల్ ఐడీపీఎల్ చౌరస్తా వద్దనున్న బస్టాప్ షెల్టర్లలో కల్లు తాగిన ముగ్గురు వ్యక్తులు నానా బీభత్సం సృష్టించారు. షెల్టర్‌లోనే అటూ ఇటూ పొర్లాడుతూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగే తూలుతూ అక్కడే ఉన్నారు. దీంతో విద్యార్థినులు షెల్టర్‌లోకి రాకుండా రోడ్డుపైనే బస్ కోసం వేచి ఉండటం అక్కడ కనిపించింది.