బంజారాహిల్స్ (హైదరాబాద్) : బంజారాహిల్స్ రోడ్ నెం-10లోని గౌరీశంకర్‌కాలనీ పరిసర ప్రాంతాలతోపాటు రామాలయానికి వెళ్లే రోడ్డులో తాగుబోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి 2 గంటల వరకూ తాగుబోతులు రోడ్ల పక్కన తిష్ట వేసి మద్యం సేవిస్తూ న్యూసెన్స్‌కు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. టీడీపీ జెండా వద్ద కూడా తాగుబోతులు తిష్టవేస్తూ రాత్రి విధులు ముగించుకొని ఇళ్లకు వెళ్లే మహిళలను అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని తెలిపారు. జన్నత్‌హుస్సేన్ ఇంట్లో ఓ ఆసుపత్రి హాస్టల్ ఉందని, ఇందులో నర్సులు ఉంటున్నారని ఇక్కడ కూడా మందుబాబులు తాగి వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక్కడే ఉన్న పార్క్‌లో కూడా అర్ధరాత్రి వేళ మందుబాబులు చిందులు వేస్తూ స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రిపూట పోలీసుల నిఘా లేకపోవడం వల్లే ఆకతాయిల బెడద తలెత్తిందని పోలీస్ పెట్రోలింగ్ ఉంచాలని కోరారు. నిఘా పెంచుతాం, బంజారాహిల్స్ రోడ్ నెంబర్-10లోని గౌరీశంకర్‌కాలనీ పరిసర ప్రాంతాలతో పాటు రామాలయానికి వెళ్లే రోడ్డులో రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ పెంచుతామని స్థానిక సెక్టార్ ఎస్సై కృష్ణయ్య తెలిపారు. సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, తాగుబోతుల బెడద ఉంటే ఫోన్ నంబర్ 9966074757కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.
తాగుబోతుల న్యూసెన్స్
Published Fri, Jun 26 2015 7:29 PM | Last Updated on Fri, May 25 2018 2:06 PM
Advertisement
Advertisement