
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద కత్తితో వీరంగం
విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఓ వ్యక్తి కత్తితో కలకలం సృష్టించాడు.
విజయవాడ : విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఓ వ్యక్తి కత్తితో కలకలం సృష్టించాడు. కత్తిని గాల్లోకి చూపిస్తూ కాసేపు హల్‌చల్ చేశాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అతడు పిచ్చివాడని తెలిసింది.
నెమ్మదిగా అతనిని అక్కడి నుంచి పంపించి వేశారు. అయితే అతడు రెండవసారి మళ్లీ రావడంతో స్థానిక పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కాగా అతని పేరు అప్పారావు అని తెలిసింది.