cm camp office
-
Yogi Vemana: సీఎం జగన్ పుష్పాంజలి
సాక్షి, గుంటూరు: సమాజంలో రుగ్మతలను చీల్చి చెండాడిన సంఘసంస్కర్త, కవి మహాయోగి వేమన. ఇవాళ ఆయన జయంతి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో వేమన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. -
సంబరంగా సంక్రాంతి వేడుక
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గంగిరెద్దులకు సారెను సమర్పించడం, భోగిమంటలు, గోశాలలోని గోవులకు ప్రత్యేక పూజలు, హరిదాసుల కీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల సంక్రాంతి నృత్యాలతో వేడుకలు కన్నులపండువగా జరిగాయి. సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాలను చక్కగా పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. నవరత్నాలతో ముఖ్యమంత్రి ప్రతిఇంటికీ సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, మెడికల్ కాలేజీ, నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా తీర్చిదిద్ధిన స్కూల్ భవనం, పాల కేంద్రం నమూనాలు వంటి ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తూ.. ముత్యాల ముగ్గులు, రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, ధాన్యాగారాలు, గడ్డివాములు, ఎడ్లబండ్లు ఇలా అచ్చం అసలు సిసలైన గ్రామీణ వాతావరణ ప్రతిబింబించేలా, మన సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరిసేలా.. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి నేతృత్వంలో గ్రామ స్వరాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. సీఎం దంపతులను మంత్రముగ్థుల్ని చేసేలా ఆ ప్రాంతం శోభాయమానంగా అలంకరించారు. ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు ఏర్పాటుచేసిన శిలాతోరణం అందరినీ ఆకట్టుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో భోగి మంటలు వెలిగిస్తున్న సీఎం వైఎస్ జగన్ దంపతులు ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. ఇక ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో హాజరైన సీఎం జగన్ దంపతులను వేదపండితులు నుదుట తిలకం దిద్ది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం.. వారిరువురూ భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. హరిదాసుకు స్వయంపాకం, సారె సమర్పించారు. అలాగే, గోశాలలోని గోవులకు పూజచేసి వాటిని నిమురుతూ కొద్దిసేపు అక్కడ గడిపారు. గంగిరెద్దులకు, తులసి చెట్టుకు పూజలు చేశారు. గ్రామీణ సంక్రాంతి వేడుకల్లో ప్రధానంగా కనిపించే వివిధ కళాకారులను సీఎం ఆప్యాయంగా పలకరించారు. అంతేకాక.. తెలుగింటి సంక్రాంతి పిండివంటలను ముఖ్యమంత్రి దంపతులు రుచి చూశారు. అనంతరం.. కలియుగ దైవమైన శ్రీహరికి పూజలు నిర్వహించటం, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేందుకు ఏర్పాటుచేసిన వందేళ్ల క్రితం నాటి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ నమూనా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి సీఎం జగన్ దంపతులు పూలమాల వేసి నివాళులరి్పంచారు. అనంతరం.. అక్కడున్న మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులను పలకరిస్తూ ముందుకు కదిలారు. తొలుత.. కాణిపాక వినాయక విగ్రహానికి సీఎం జగన్ దంపతులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. తర్వాత.. కనకదుర్గమ్మకు.. అనంతరం శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదపండితుల ఆశీర్వాదం స్వీకరించారు. ఈ సందర్భంగా వేదపండితులు సీఎంకు కంకణం కట్టగా.. వేదపండితులు అందించిన మరో కంకణాన్ని భారతమ్మకు ముఖ్యమంత్రి జగన్ కట్టారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. ప్రముఖ సినీ నేపథ్యగాయని గోపిక పూర్ణిమ, ప్రముఖ గాయని శ్రీలలిత పాటల కార్యక్రమం శ్రవణపేయంగా సాగింది. అలాగే, సినీ రంగానికి చెందిన ప్రముఖ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ రాఘవ, కౌండిన్య, మెహర్, మానస్, చందు, రమేష్, హరేరాము, మహేష్, భాను తదితరుల లైవ్ పెర్ఫామెన్స్.. ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారులు రిత్విక్ వెంకట్, చార్మి, చిన్నారి కేతనరెడ్డి నాట్య ప్రదర్శన.. నీలకంఠం మిమిక్రీ, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఉదయ్ బృందంచే సంక్రాంతి ప్రత్యేక గీతాల నృత్యం, మాస్టర్ భువనేష్ ప్రత్యేక గీతాలు.. వీటితో పాటు ప్రముఖ సినీగేయ రచయిత, సంగీత దర్శకులు విశ్వ.. ప్రముఖ సినీ మరియు ప్రజా గేయ రచయిత మిట్టపల్లి సురేందర్, ప్రజా రచయితలు మానుకోట ప్రసాద్, మాట్ల తిరుపతి, గాయకులు గద్దర్ నర్సిరెడ్డి, తేలు విజయల కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కృష్ణవేణి మల్లావఝుల వ్యవహరించారు. చివర్లో వీరందరిని సీఎం జగన్ దంపతులు సత్కరించి, మెమొంటోలు అందజేశారు. అంతేకాక.. ప్రాంగణంలో ఉన్న అందరితో సీఎం జగన్ దంపతులు ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చెవిరెడ్డికి సీఎం అభినందనలు.. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రతిబింబించేలా.. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలా.. చక్కని ఏర్పాట్లతో, పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని సీఎం జగన్ ప్రత్యేకంగా అభినందించారు. విజయానందాలతో అడుగులు ముందుకేయాలి.. సీఎం జగన్ ట్వీట్ ఊరూ వాడా ఒక్కటై.. బంధుమిత్రులు ఏకమై.. అంబరమంత సంబరంగా జరుపుకునే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకుని.. సుఖ సంతోషాలతో.. విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటూ ఆదివారం ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తెలిపారు. -
సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు
-
తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ఎంసీఆర్హెచ్ఆర్డీ?
సాక్షి, హైదరాబాద్: ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనం త్వరలో తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా మారనున్నట్లు సమాచారం. ఎంసీఆర్హెచ్ఆర్డీకి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించారు. సీఎం అధికారిక భవనంగా ఉన్న ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. ప్రగతి భవన్నుప్రజాభవన్గా మారుస్తున్నట్లు, అక్కడే ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నారు. -
కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్
-
విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసు భవనాలు గుర్తింపు
సాక్షి, అమరావతి: విశాఖలో సీఎం క్యాంపు ఆఫీసు కోసం గుర్తించిన వివిధ భవనాల వివరాలను అధికారుల కమిటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలిపింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి పర్యవేక్షణ, సమీక్ష సమావేశాల నిర్వహణకు విశాఖలో క్యాంపు కార్యాలయం చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో విశాఖలో గుర్తించిన భవనాల వివరాలను సీఎం వైఎస్ జగన్‌కు కమిటీ వివరించింది. రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు సహా, ఇతర అధికారులు తమ కార్యకలాపాలు నిర్వహించడానికి అవసరమైన భవనాలను కూడా గుర్తించామని అధికారుల కమిటీ సీఎంకు తెలిపింది. విశాఖలో ఇప్పటికే వివిధ ప్రభుత్వ విభాగాలు, వాటి కార్యాలయాలు 2,27,287 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయని కమిటీ గుర్తించింది. వీటిలో సీనియర్ అధికారులకు అవసరమైన క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. వారి వసతికి కూడా ఆయా విభాగాల పరిధిలో ఉన్నవాటిని వినియోగించుకోవచ్చని వెల్లడించింది. ఐటీ హిల్‌పై ఉన్న మిలీనియం టవర్‌లో అందుబాటులో ఉన్న 1,75,516 అడుగుల విస్తీర్ణంలో మిగిలిన సీనియర్ అధికారులు క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. ఇంకా కొంతమంది అధికారుల కోసం, వారి కార్యాలయాల కోసం మరికొన్ని ప్రైవేటు భవనాలను గుర్తించామని సీఎం వైఎస్ జగన్‌కు వివరించింది. ఈ మేరకు 3,98,600 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని గుర్తించామని తెలిపింది. ప్రభుత్వంలోని సీనియర్ అధికారుల కార్యకలాపాలు, వారి వసతి కోసం ప్రభుత్వ భవనాలు, ప్రైవేటు భవనాల్లో మొత్తం 8,01,403 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని గుర్తించామని చెప్పింది. ముఖ్యమంత్రి కోసం ఐదు రకాల భవనాలు.. కాగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, వసతి కోసం ఐదు రకాల భవనాలను గుర్తించినట్టు కమిటీ వెల్లడించింది. ఆంధ్రా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓపెన్ వర్సిటీ బ్లాకులు, సిరిపురంలోని వీఎంఆర్డీఏ భవనాలు, మిలీనియం ఎ–టవర్, మిలీనియం బి–టవర్, రుషికొండలోని టూరిజం రిసార్టులను గుర్తించామని వివరించింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, వసతి, అధికారులతో సమావేశాల కోసం సరిపడా గదులు, భద్రతా సిబ్బంది ఉండేందుకు సదుపాయాలు, ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని కమిటీ తెలిపింది. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా, పౌరులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, ముఖ్యమంత్రికి భద్రత తదితర అంశాలను పరిగణన లోకి తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రాకపోకల సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా చూశామని తెలిపింది. అదే సమయంలో సౌలభ్యతను కూడా దృష్టిలో ఉంచుకున్నామని చెప్పింది. రుషికొండ రిసార్టులు అనుకూలం.. ట్రాఫిక్ దృష్ట్యా, యూనివర్సిటీ అకడమిక్ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో యూనివర్సిటీ భవనాలను పరిగణనలోకి తీసుకోలేదని కమిటీ వెల్లడించింది. అలాగే వీఎంఆర్డీఏ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున రద్దీ ఉంటుందని, చుట్టూ పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలు ఉన్నందున భద్రతాపరంగా ఇబ్బంది ఉందని తెలిపింది. సీఎం క్యాంపు కార్యాలయం ఇక్కడ పెడితే వారందరికీ ఇబ్బందులు వస్తాయని, అధికారులకు సరైన వసతి కూడా దీనికి సమీపంలో లేదని వెల్లడించింది. అలాగే మిలీనియం టవర్‌లో ఒక దాంట్లో ఇప్పటికే కొన్ని కంపెనీలు నడుస్తున్నాయని, రెండో టవర్ కూడా ఆఫీసుకు సరిపోయినా, సీఎం వసతికి సరిపోదని, భద్రతా కారణాల వల్ల కూడా అంత అనుకూలత లేదని తేల్చింది. రుషికొండ వద్ద నిర్మించిన రిసార్టుల కోసం నిర్మించిన భవనాలు సీఎం క్యాంపు కార్యాలయం కోసం అత్యంత అనుకూలంగా ఉన్నాయని అధికారుల కమిటీ నిర్ధారించింది. వీఐపీల రాకపోకల వల్ల పౌరులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా, నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఈ భవనాలు ఉన్నాయని, పార్కింగ్, ఆఫీసు, వసతి, భద్రతా సిబ్బందికి, సీఎం సెక్రటరీల కార్యకలాపాలకు, ఈ భవనాలు సరిపోతాయని సూచించింది. అలాగే హెలిప్యాడ్ కూడా సమీపంలోనే ఉందని, దీనివల్ల నగరంలో ట్రాఫిక్‌కు, పౌరులకు కూడా ఎలాంటి ఇబ్బందిలేకుండా ఉంటుందని వెల్లడించింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నివేదికను ఖరారుచేస్తున్నామని అధికారుల కమిటీ తెలిపింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీలు శ్రీలక్ష్మి, షంషేర్‌సింగ్ రావత్, జీఏడీ సర్విసులు, హెచ్ఆర్ సెక్రటరీ పోలా భాస్కర్, సీఎంఓ అధికారులు.. పూనం మాలకొండయ్య, ధనుంజయరెడ్డి, ముత్యాలరాజు పాల్గొన్నారు. -
కొబ్బరి నీళ్లు పంచినా అభ్యంతరమేనట!?
హైదరాబాద్: ఎన్నికల సంఘం అధికారులు డబ్బులు పట్టుకుంటున్నారు.. నగలు పట్టుకుంటున్నారు.. బంగారం పట్టుకుంటున్నారు.. తాజాగా ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి నిస్సహాయులకు, రోడ్లపై విధులు నిర్వర్తించే పోలీసులకు కొబ్బరి నీళ్లు పంచుతుండగా అభ్యంతరం చెప్పిన ఘటన చర్చనీయాంశమైంది. రహదారులపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల దప్పిక తీర్చడం కూడా తప్పేనా? ఇవేం రూల్స్ అంటూ ఆ మహిళా ప్రతినిధి నిట్టూరుస్తూ వెళ్లిపోవడం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో లయన్స్ క్లబ్ ప్రతినిధి డాక్టర్ విజయలక్ష్మి రోడ్లపై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు కొబ్బరినీళ్ల సీసాలను అందిస్తున్నారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఫ్లయింగ్ స్క్వాడ్ ఎన్నికల అధికారులు ఆమె వాహనాన్ని ఆపి ‘ఏం పంపిణీ చేస్తున్నారు’? అని ప్రశ్నించారు. ఆమె చెప్పిన జవాబు విన్న అధికారులు ఎన్నికల సమయంలో అవేవీ కుదరవమ్మా అంటూ హితవు పలి కారు. మంచినీళ్లు ఇవ్వాలన్నా, అన్నదానాలు చేయాలన్నా, కొబ్బరినీళ్లు పంచాలన్నా ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకోవాలంటూ చెప్పడంతో ఆమె అవాక్కయ్యారు. తాను 15 ఏళ్ల నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని.. ఇవేం దిక్కుమాలిన రూల్స్ అంటూ కారెక్కి వెళ్లిపోయారు. -
విశాఖలోనూ సీఎం క్యాంపు కార్యాలయం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన ఎప్పుడు మొదలవుతుందనే అంశంపై కొంత కాలంగా సాగుతున్న చర్చకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెరదించారు. విశాఖపట్నంలోనూ సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి, దసరా నుంచి పరిపాలన ప్రారంభిద్దామని మంత్రులకు స్పష్టం చేశారు. సీఎం కార్యాలయం మొదలు వివిధ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు భవనాలను గుర్తించేందుకు అధికారులతో ఒక కమిటీ వేస్తామని చెప్పారు. ఇక్కడి నుంచి విశాఖపట్నంకు కార్యాలయాల తరలింపునకు అధికారులతో మరో కమిటీ వేస్తామన్నారు. దసరాలోగా కార్యాలయాలను తరలించి.. పండుగ రోజునే విశాఖ కేంద్రంగా పరిపాలన మొదలు పెడతామని చెప్పారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో బుధవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. అజెండాలోని అంశాలపై చర్చ ముగిశాక సమావేశం నుంచి అధికారులు నిష్క్రమించారు. ఆ తర్వాత మంత్రులతో సీఎం వైఎస్ జగన్ సమకాలీన రాజకీయ పరిస్థితులపై చర్చించారు. దసరా పండుగను విశాఖపట్నంలోనే జరుపుకుందామని మంత్రులతో సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఆ రోజు నుంచి విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన మొదలు పెడతామనడంతో మంత్రులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు అక్రమాలను సాక్ష్యాధారాలతో వివరిద్దాం స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. గురువారం నుంచి నిర్వహిస్తున్న శాసనసభ సమావేశాలను సీరియస్‌గా తీసుకోవాలని మంత్రులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. శాసనసభ వేదికగా అవసరమైతే టీడీపీ సర్కార్ హయాంలో చంద్రబాబు పాల్పడిన అక్రమాలపై.. స్కిల్ స్కామ్ నుంచి ఫైబర్ గ్రిడ్ కుంభకోణం వరకు అన్నింటిపై చర్చిద్దామన్నారు. టీడీపీ సభ్యులు శాసనసభ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వ అక్రమాలను సాక్ష్యాధారాలతోసహా ప్రజలకు వివరించడానికి సమావేశాలను ఉపయోగించుకుందామని ఉద్భోదించారు. కేంద్ర ప్రభుత్వం కొంత కాలంగా ప్రతిపాదిస్తున్న వన్ నేషన్.. వన్ ఎలక్షన్ విధానాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి మంత్రులు తీసుకెళ్లగా.. జమిలి ఎన్నికలపై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దామన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందామని పిలుపునిచ్చారు. ఎన్నికలకు మరో ఐదు నెలలు మాత్రమే సమయం ఉందనే అంశాన్ని మంత్రులకు సీఎం గుర్తు చేస్తూ.. ప్రజల్లో విస్తృతంగా తిరగాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ 52 నెలలుగా మనం చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని.. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాల్పడిన అక్రమాలను కళ్లకు కట్టినట్లు వివరించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలన్నారు. సీఎం ఎక్కడి నుంచి పాలిస్తే అదే రాజధాని దసరా నుంచి విశాఖపట్నం నుంచి పరిపాలన మొదలు పెడదామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. సీఎం ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని. వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమన్నది మా విధానం. విశాఖపట్నంలో సీఎం కార్యాలయం నుంచి వివిధ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు తగిన భవనాలను గుర్తించేందుకు అధికారులతో కమిటీ వేస్తామని సీఎం చెప్పారు. దసరా నుంచి విశాఖే పరిపాలన రాజధాని. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి. -
పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం
-
ఫ్యామిలీ డాక్టర్‌తో కోటి మందికిపైగా సేవలు
సాక్షి, గుంటూరు: వైద్య, ఆరోగ్యశాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి విడదల రజిని, ఉన్నతాధికారులు, పలువురు ఆయా విభాగాల అధికారులు హాజరయ్యారు. సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ► ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవినీతికి చోటు ఉండకూడదు. ఫిర్యాదు చేయడానికి టెలిఫోన్ నంబర్ ప్రతిచోటా ఉంచాలి. అలాగే సమర్థవంతమైన ఎస్ఓపీలను పెట్టాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలి. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్‌ల పనితీరు ఇందులో కీలకం. ప్రివెంటివ్ కేర్‌లో మనం ఆశించిన లక్ష్యాలను అప్పుడే సాధించగలం. ► వైద్య ఆరోగ్యశాఖలో రిక్రూట్మెంట్ వ్యవస్ధ సమర్థవంతంగా పనిచేయాలి. ఒక ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేయాలి. ఎక్కడా కూడా సిబ్బంది కొరత అన్నది ఉండకూడదు. నాలుగు వారాలకు మించి.. ఎక్కడా ఏ ఖాళీ కూడా ఉండకూడదు. అధికారుల వివరణ ► కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చాం. ఫస్ట్‌ఎయిడ్, స్నేక్ బైట్, ఐవీ ఇన్ఫ్యూజన్, ఇంజక్షన్, వూండ్ కేర్, డ్రస్సింగ్, బేసిక్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ లాంటి అంశాల్లో వారికి శిక్షణ పూర్తయ్యింది. ► అక్టోబరు22న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభమైన తర్వాత ఇప్పటివరకూ 1,39,97,189 మందికి సేవలు అందించాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా సేవలందుకున్నవారిలో 35,79,569 మంది హైపర్ టెన్షన్‌తో, 24,31,934 డయాబెటిస్తో బాధపడతున్నట్టు గుర్తింపు. ► వాళ్లందరికి మంచి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. పేషెంట్‌కు చికిత్స అందించడంతోపాటు.. వారి ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలన్నారు. విలేజ్ క్లినిక్ స్ధాయిలో కంటి పరీక్షలు క్రమం తప్పకుండా కూడా చేయాలన్నారు. సికిల్ సెల్ ఎనీమియాను నివారించే కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష సికిల్ సెల్ ఎనీమియా నివారణ కార్యక్రమంలో భాగంగా.. ఈ ఏడాది 6.68 లక్షలమందికి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులు సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. ఈ నెలలోనే అల్లూరిసీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పరీక్షలు ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ఓరల్ హెల్త్‌లో భాగంగా ప్రతినెలా కూడా దంత వైద్యులు పీహెచ్‌సీలను సందర్శించేలా చర్యలు తీసుకున్నామన్నారు అధికారులు. ► టీబీ నివారణపైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు వెల్లడించిన అధికారులు. ప్రస్తుతం లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయిస్తున్నామని వెల్లడి. అందరికీ పరీక్షలు చేయడంద్వారా బాధితుల్ని గుర్తించి.. వారికి మంచి చికిత్స అందించే చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేయాలని సీఎం జగన్ అధికారులతో చెప్పారు. ► ప్రతి కుటుంబంలో పుట్టే బిడ్డ దగ్గరనుంచి ప్రతి ఒక్కరికీ కూడా ఆరోగ్యశ్రీకార్డు ఇవ్వాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించారు. క్యూ ఆర్ కోడ్ ఉన్న ఈ కార్డు ద్వారా వారి ఆరోగ్యవివరాలను నమోదు చేయాలన్నారు. మెడికల్ కాలేజీలపైనా సీఎం సమీక్ష. ఈ విద్యాసంవత్సంలోనే ప్రారంభం కానున్న కొత్త మెడికల్ కాలేజీల్లో మౌలికసదుపాయాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మెడికల్ కాలేజీలు చరిత్రలో నిలిచిపోయే నిర్మాణాలని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కొత్త మెడికల్ కాలేజీల్లో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. అలాగే.. పాడేరు, పులివెందుల, ఆదోని కొత్త మెడికల్ కాలేజీల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు మొదలవుతాయి. మిగిలిన కాలేజీల్లో కూడా పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించిన అధికారులు. -
స్కూళ్లకు వచ్చే విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ ఎంవీ శేషగిరిబాబు, పాఠశాల విద్యాశాఖ (మౌలికవసతులు) కమిషనర్ కాటమనేని భాస్కర్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. స్కూళ్లుకు వచ్చే విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలి సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉంది దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలి పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుంది అయినా పిల్లలు బడికి రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారు పిల్లలను బడికి పంపేలా అమ్మ ఒడిని అందిస్తున్నాం ఇంటర్మీడియట్ వరకూ అమ్మ ఒడి వర్తిస్తుంది ఆ తర్వాత కూడా విద్యాదీవెన, వసతి దీవెన ఉన్నాయి ఇలా ప్రతి దశలోనూ చదువులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది ఇలా ప్రతి విద్యార్థిని కూడా ట్రాక్ చేస్తున్నాం –అందుకే డ్రాప్‌అవుట్ అనే ప్రశ్నే ఉత్పన్నం కాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నాం దీనిపై ఎప్పటికప్పుడు సమర్థవంతమైన పర్యవేక్షణ జరగాలి వచ్చే విద్యాసంవత్సరంలో విద్యాకానుకపై సీఎం సమీక్ష విద్యార్థులకు పంపిణీచేయాల్సిన పుస్తకాల ముద్రణ ముందుగానే పూర్తిచేయాలని సీఎం ఆదేశాలు మే 15 నాటికి అన్నిరకాలుగా సిద్ధమవుతున్నామన్న అధికారులు సబ్జెక్టు టీచర్ల పైనా సీఎం సమీక్ష పిల్లలకు ప్రతి సబ్జెక్టులోనూ పట్టుకోసం ఈ విధానాన్ని తీసుకు వచ్చామన్న సీఎం దీనివల్ల చక్కటి పునాది ఏర్పడుతుందని, పిల్లల్లో నైపుణ్యాలు మెరుగుపడుతాయన్న సీఎం గతంలో సబ్జెక్టు టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశాల నేపథ్యంలో సబ్జెక్టు టీచర్లకు బోధనా పద్ధతులపై ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్ కోర్సులు ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో బోధనా పద్ధతుల్లో నైపుణ్యాలను పెంచేలా కోర్సు వచ్చే రెండేళ్లపాటు ఈ సర్టిఫికెట్ కోర్సు కొనసాగుతుందన్న అధికారులు 1998 డీఎస్సీ అభ్యర్థులకు ఈ వేసవిలో శిక్షణా తరగతులు పిల్లల సంఖ్యకు తగినట్టుగా సమీక్ష చేసుకుని వారి అవసరాలకు అనుగుణంగా టీచర్లను నియమించాలని సీఎం ఆదేశం ఇక ప్రతిఏటా కూడా దీనిపై సమీక్ష చేసుకోవాలన్న సీఎం. ఆ మేరకు మార్పులు, చేర్పులు చేసుకోవాలన్న సీఎం పిల్లలకు ఎక్కడా కూడా టీచర్లు సరిపోలేదన్న మాట రాకూడదన్న సీఎం ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ) ఏర్పాటుపై సీఎం సమీక్ష ►సీఎం ఆదేశాల మేరకు జూన్ నాటికి తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్టు అధికారుల వెల్లడి ►స్కూలు పిల్లలకు టోఫెల్ సర్టిఫికేట్ పరీక్షలపై సీఎం సమీక్ష ►3 నుంచి 5గ్రేడ్ల ప్రైమరీ విద్యార్థులకు టోఫెల్ పరీక్షలు ►ఉత్తీర్ణులైన వారికి టోఫెల్ ప్రైమరీ సర్టిఫికెట్ ►6 నుంచి 10 గ్రేడ్ల వారికి జూనియర్ టోఫెల్ పరీక్షలు ►వీరికి జూనియర్ స్టాండర్డ్ టోఫెల్ పరీక్షలు ►మొత్తం మూడు దశల్లో వీరికి టోఫెల్ పరీక్ష ►ప్రైమరీ స్థాయిలో లిజనింగ్, రీడింగ్ నైపుణ్యాల పరీక్ష ►జూనియర్ స్టాండర్డ్ స్ధాయిలో లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్ నైపుణ్యాల పరీక్ష ►ఈ పరీక్షలకోసం విద్యార్థులను, టీచర్లను సన్నద్ధం చేసేలా ఇ– కంటెంట్ రూపొందించాలని సీఎం ఆదేశం. ►విద్యార్థులకు ట్యాబుల పంపిణీ, వారు వినియోగస్తున్న తీరుపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు ►ట్యాబులు ఎక్కడ రిపేరు వచ్చినా వెంటనే దానికి మరమ్మతు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం ►దీనికి సంబంధించి ఇప్పటికే ఎస్ఓపీ తయారుచేశామన్న అధికారులు. ►ట్యాబులకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక ఫిర్యాదు నంబరును స్కూల్లో ఉంచాలన్న సీఎం. ►ఏ సమస్య వచ్చినా, రెండు మూడు రోజుల్లో పరిష్కరించి తిరిగి విద్యార్థులకు అప్పగిస్తున్నామన్న అధికారులు. ►సీఎం ఆదేశాల మేరకు పదోతరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్న అధికారులు ►గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్న అధికారులు. ►ఎక్కడా ప్రశ్నపత్రాల లీకేజీలకు ఆస్కారం లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామన్న అధికారులు. ►నో మొబైల్ జోన్స్‌గా పరీక్ష కేంద్రాలను మార్చామని, ఎవ్వరికీ కూడా మొబైల్ అనుమతిలేదని తేల్చిచెప్పిన అధికారులు. ►ప్రశ్న ప్రత్రాల్లో క్యూ ఆర్ కోడ్ ప్రతీ ప్రశ్నకూ ఇచ్చామన్న అధికారులు. ►దీనివల్ల ఎక్కడ నుంచి, ఏ సెంటర్ నుంచి, ఏ విద్యార్థికి సంబంధించిన ప్రశ్నపత్రం లీక్ అయ్యిందో సులభంగా తెలుసుకునే అవకాశం ఉందని తెలిపిన అధికారులు. ►ఈ చర్యలు కారణంగా ఎలాంటి సమస్యలు లేకుండా పరీక్షలు జరుగుతున్నాయన్న అధికారులు. ►ఇంటర్మీడియట్ పరీక్షల్లో కూడా ఇలాంటి చర్యలే తీసుకున్నామన్న అధికారులు. ►ప్రతి పరీక్షా గదిలో కూడా సీసీ కెమెరాలు పెట్టామన్న అధికారులు. ►మధ్యాహ్న భోజనం నాణ్యతపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగాలని సీఎం ఆదేశం. ►ప్రభుత్వ పాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్ పూర్తిస్థాయిలో చేయాలన్న సీఎం. ►ఇప్పటికే వేయి ప్రభుత్వ స్కూళ్లు అఫిలియేట్ అయ్యాయని, మిగిలిన స్కూళ్లు కూడా చేసేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు. ►ప్రభుత్వ పాఠశాలల్లో రెండో దశ నాడు – నేడు కింద పనులపైనా సమీక్షించిన సీఎం. ►ప్రాధాన్యతా క్రమంలో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్న అధికారులు. చదవండి: తిరుపతి-హైదరాబాద్ ‘వందేభారత్’ హౌస్‌ఫుల్.. రైలులో ప్రయాణించిన సీఎస్ -
సీఎం క్యాంప్ ఆఫీస్ లో SLBC మీటింగ్
-
సామాజిక న్యాయానికి ప్రతిరూపం సీఎం జగన్
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయానికి ప్రతిరూపమని ఎమ్మెల్సీ అభ్యర్థులు చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికైన వారు సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యం ఎమ్మెల్సీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ ప్రాధాన్యతనిచ్చారు. 2014–19 మధ్య టీడీపీ శాసన మండలికి 48 మందిని పంపితే వారిలో ఓసీలే 30 మంది ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 18 మంది మాత్రమే. – కవురు శ్రీనివాస్ బాబుకి, సీఎం జగన్‌కు మధ్య తేడా ఇదే చంద్రబాబు 2014 19 మధ్యకాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 37.5 శాతం పదవులే ఇచ్చారు. దీనికి భిన్నంగా సీఎం వైఎస్ జగన్ 68.18 శాతం కేటాయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సాధికారత పట్ల సీఎం జగన్‌కు ఉన్న చిత్తశుద్ధిని ఇది నిరూపిస్తోంది. ఇద్దరి మధ్య ఈ తేడాను అందరూ గుర్తించాలి. – వంకా రవీంద్రనాథ్ కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు రాజ్యాధికారంలో భాగం కల్పిస్తూ సీఎం జగన్ సామాజికన్యాయానికి ప్రతిరూపంగా నిలుస్తున్నారు. బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన సీఎం జగన్ అభినవ పూలేగా చరిత్రలో ఉండిపోతారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తాం. – సిపాయి సుబ్రమణ్యం టీడీపీ పని అయిపోయింది సీఎం జగన్ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఎమ్మెల్సీగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తా. టీడీపీ పని అయిపోయింది. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ చేతిలో మరోసారి చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ ఘోరంగా ఓడిపోవడం ఖాయం. – పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి సమస్యల పరిష్కారానికి కృషి శెట్టి బలిజ సామాజికవర్గంలో 36 సంచార జాతులున్నాయి. వెనుకబాటుకు గురైన వీరందరికీ న్యాయం చేస్తా. తూర్పు గోదావరి జిల్లాలో ఈసారీ వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగించేందుకు కృషి చేస్తా. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తా. – కుడుపూడి సూర్యనారాయణ ధైర్యం చెప్పారు నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు నిరాశ చెందొద్దని సీఎం జగన్ ధైర్యం చెప్పారు. పార్టీ కోసం పనిచేయి, న్యాయం చేస్తానని చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే అడగకుండానే ఎమ్మెల్సీని చేశారు. అత్యధిక జనాభా ఉన్న వడ్డెరల అభివృద్ధికి కృషి చేస్తా. – చంద్రగిరి యేసురత్నం ఇంత ప్రాధాన్యం ఇదే తొలిసారి మా జిల్లాలో మాదిగలకు ఇంత పెద్ద రాజకీయ గుర్తింపు ఇవ్వడం ఇదే తొలిసారి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పెద్దల సభకు మాదిగలు వెళ్లటం ఇదే మొదటిసారి. ఇది ఒక్క సీఎం జగన్ వల్లే సాధ్యమైంది. – బొమ్మి ఇజ్రాయిల్ సామాజిక, రాజకీయ విప్లవానికి నాంది పరిపాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా సీఎం జగన్ ఆ వర్గాల సాధికారతకు బాటలు వేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను శాసన మండలికి ఎంపిక చేసి సామాజిక, రాజకీయ విప్లవానికి నాంది పలికారు. – పోతుల సునీత ఎస్టీలకు పెద్ద పీట వేస్తున్న ముఖ్యమంత్రి జగన్ జగన్ ప్రభుత్వం బడ్జెట్లో ఎస్టీల అభివృద్ధికి సబ్ ప్లాన్‌లో ఈ ఏడాదిలోనే రూ.6,822.65 కోట్లు కేటాయించింది. ఎస్టీ సబ్ ప్లాన్ లో భాగంగా 2019 జూన్ నుంచి 2022 డిసెంబర్ దాకా రూ.15,589.38 కోట్లు ఖర్చు చేసింది. 2024లో జగన్‌ను సీఎంగా చేసేందుకు గిరిజనులు సిద్ధంగా ఉన్నారు. – కుంభా రవిబాబు చంద్రబాబును బీసీలంతా నిలదీస్తారు సీఎం జగన్.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అనేక పదవులిస్తూ పాలనలో ప్రముఖ స్థానం కల్పిస్తున్నారు. చంద్రబాబు హయాంలో చాలా తక్కువ మందికే ఈ అవకాశం దక్కేది. ఈసారి ఎన్నికల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వైఎస్ జగన్‌కే మద్దతిస్తారు. – నర్తు రామారావు పార్టీ విజయం కోసం పనిచేస్తా.. చట్ట సభలో అడుగుపెట్టే గొప్ప అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. స్థానిక ప్రజా ప్రతినిధులను కలుపుకొని ముందుకు వెళ్తా. వైఎస్సార్సీపీ విజయం కోసం పని చేస్తా. – డాక్టర్ ఎ.మధుసూదన్ ప్రజల గుండెల్లో.. సీఎం సీఎం జగన్ ప్రజల గుండెల్లో ఏనాడో స్టిక్కర్ వేసుకున్నారు. ఎంత మంది ఏకమైనా దాన్ని చెరపలేరు. మాట తప్పని, మడమ తిప్పని గుణం వైఎస్ కుటుంబానిది. – మర్రి రాజశేఖర్ ఆయన స్ఫూర్తితో ముందుకు సాగుతాం సీఎం జగన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగారు. అనేక సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చిన వ్యక్తి ఆయన. కులాలను చీల్చే విధంగా కాకుండా స్ఫూర్తిదాయక విధానాలతో పరిపాలన సాగిస్తున్నారు. ఆయన స్ఫూర్తితో మేమందరం ముందుకు నడుస్తాం. – పెన్మత్స సూర్యనారాయణరాజు బీసీ అంటే బ్యాక్‌బోన్ బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్‌బోన్ క్లాస్‌గా సీఎం జగన్ గుర్తించారు. బీసీలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. స్పీకర్‌గా బీసీకి అవకాశమిచ్చారు. సీఎం జగన్‌కు బీసీలంతా రుణపడి ఉంటారు. – కోలా గురువులు చంద్రబాబు నాకు ద్రోహం చేశారు టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాకు ద్రోహం చేశారు. ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారు. కానీ ఏ హమీ ఇవ్వకుండానే సీఎం జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. వైఎస్సార్సీపీ విజయానికి కృషి చేస్తాను. – జయమంగళ వెంకటరమణ ఇలాంటి సీఎం దేశంలోనే లేరు పేదలకు ఇంతగా మంచి చేసిన సీఎం దేశంలోనే లేరు. మహిళలకు అన్నింటా అగ్రతాంబూలమే. ఏ ప్రభుత్వం చేయని మేలు చేస్తున్నారు. బీసీలు సీఎంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంతగా మేలు జరగటంలేదు. – కర్రి పద్మశ్రీ చాలా ఆనందంగా ఉంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ గుర్తు పెట్టుకొని మరీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. పదవులు బాధ్యతగా తీసుకోవాలని సీఎం జగన్ చెబుతారు. ఆయన చెప్పిన మాటలను శిరసావహిస్తూ బాధ్యతతో పని చేస్తా. – మేరుగ మురళీధర్ ఇలాంటి సీఎంను జన్మలో చూడలేను బీసీలకు ఇంతలా చేసిన సీఎంను ఈ జన్మలో చూడలేను. బీసీ, ఎస్సీ, ఎస్సీ, మైనార్టీలంతా సీఎం జగన్ వెంటే ఉంటారు. ఇప్పటికైనా చంద్రబాబు పునరాలోచన చేసుకుని సీఎం జగన్ పథకాలకు జై కొట్టాలి. – ఎస్.మంగమ్మ జగనన్నతోనే న్యాయం జగనన్నతోనే బీసీలకు పూర్తి న్యాయం జరుగుతోంది. బడుగు, బలహీనవర్గాల దేవుడు.. జగనన్న. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తలెత్తుకు తిరిగేలా పరిపాలన సాగిస్తున్నారు. కొత్తగా ప్రకటించిన 18 ఎమ్మెల్సీ పదవుల్లో ఏకంగా 11 బీసీలకే కట్టబెట్టారు. అలాగే 25 మంది మంత్రుల్లో 11 మంది బీసీలే. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కూడా కలుపుకుంటే మొత్తం 17 మంది మంత్రులు ఉన్నారు. అలాగే 9 మందికి రాజ్యసభ సభ్యులుగా అవకాశమిస్తే వారిలో నలుగురు బీసీలే. టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి శాసనమండలిలో కేవలం 37 శాతం మందికి మాత్రమే ప్రాతినిధ్యం దక్కింది. – వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని -
ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ
-
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జగనన్న సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు (జేసీఎస్) రాష్ట్ర కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో–ఆర్డినేటర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి ఆహ్వానితులు అందరూ విధిగా హాజరుకావాలని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా పార్టీ నిర్దేశిత ఫార్మాట్లో ‘గృహ సారథులు’గా నియమితులైన వారి తుది జాబితాను హార్డ్ కాపీ (పెన్ డ్రైవ్‌లో) లేదా సాఫ్ట్ కాపీని ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ సమావేశంలో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. -
AP: సంబరంలా సంక్రాంతి
సాక్షి, అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం సంక్రాంతి సంబరాలు నేత్రపర్వంగా జరిగాయి. సంప్రదాయ పంచెకట్టుతో సతీసమేతంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి చిహ్నానికి గుర్తుగా తెల్లని పావురాలను ఎగురవేశారు. సీఎం జగన్ దంపతుల మాటామంతీ గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా.. అంతకుముందు.. సీఎం క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గోశాలను చక్కగా పల్లెటూరు వాతావరణం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతుభరోసా కేంద్రాలు, పాఠశాలల నాడు–నేడు వంటి ప్రభుత్వ ప్రాధాన్యతలను తెలియజేస్తూ రంగవల్లులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు, ధాన్యాగారాలు, గడ్డివాములు, ఎడ్లబండ్లు ఇలా అసలుసిసలైన పల్లె వాతావరణం ప్రతిబింబించేలా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో గ్రామ స్వరాజ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా.. ఇక ఈ కార్యక్రమానికి సంప్రదాయ దుస్తులతో హాజరైన సీఎం దంపతులను వేదపండితులు నుదుట తిలకం దిద్ది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారిరువురూ జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు. గోశాలలోని గోవులకు పూజచేసి దండలు వేసి వాటిని నిమిరుతూ కొద్దిసేపు సంతోషంగా అక్కడ గడిపిన అనంతరం తులసి మొక్కకు నీళ్లుపోసి నమస్కరించుకున్నారు. అక్కడి వినాయకుడి గుడిలోనూ పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసిన భోగిమంటను కాగడాతో వెలిగించారు. హరిదాసుకు బియ్యం పోయడంతోపాటు పండ్లు కూరగాయలతో కూడిన స్వయంపాకాన్ని సమర్పించారు. గ్రామీణ సంక్రాంతి వేడుకల్లో ప్రధానంగా కనిపించే వివిధ కళాకారులను సీఎం ఆప్యాయంగా పలకరించారు. అంతేకాక.. తెలుగింటి సంక్రాంతి పిండివంటలను ముఖ్యమంత్రి దంపతులు రుచి చూశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పర్ణశాలలో సీఎం దంపతులు ఆశీనులయ్యారు. హరిదాసుకు బియ్యం సమర్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుడు ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ‘శ్రీనివాస కల్యాణం’ నృత్య రూపకాన్ని సీఎం వైఎస్ జగన్ దంపతులు ఆద్యంతం ఆస్వాదించారు. నవరత్నాలతో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను అందించిన నేపథ్యంలో గ్రామ సచివాలయం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్, రైతుభరోసా కేంద్రాలు తదితర సేవల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాక్షాత్కారం చేసిన తీరును కళ్ల కట్టినట్లు చూపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమ్మా ఉయ్యాల కోన జంపాల.. పాట పాడిన గాయని ప్రకృతిరెడ్డి, అదే సినిమాలో ఎత్తర జెండా.. పాట పాడిన హారిక నారాయణ్, ప్రముఖ జానపద గాయని కనకవ్వ తదితర కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎక్కడో తెలంగాణ మారుమూల గ్రామంలో ఉన్న నన్ను గుర్తించి పిలిపించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దీర్ఘకాలం సీఎంగా ఉండాలంటూ ఆశీర్వదించారు. అనంతరం.. శాంతి చిహ్నానికి ప్రతీకగా సీఎం దంపతులు తెల్ల పావురాలను ఎగురవేశారు. ఈ సంబరాల్లో పాల్గొన్న వివిధ కళాకారులను ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించడంతో పాటు వారితో ఫొటోలు దిగుతూ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రి జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
స్వామి వివేకానందకు సీఎం ఘన నివాళి
సాక్షి, అమరావతి: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. వివేకానందుని మాటలు స్ఫూర్తిదాయకం.. యువతకు సీఎం వైఎస్ జగన్ యువజనోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘యువత దేశానికి వెన్నెముక, వారు సాధించలేనిది ఏదీ లేదు’ అన్న స్వామి వివేకానంద మాటలను స్ఫూర్తిగా తీసుకుని లక్ష్య సాధనలో అంకిత భావంతో మనమందరం ముందడుగులు వేయాలి. జాతీయ యువజనోత్సవం సందర్భంగా యువత అందరికీ శుభాకాంక్షలు’ అంటూ సీఎం గురువారం ట్వీట్ చేశారు. -
సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన వైఎస్ జగన్ (ఫొటోలు)
-
ఇళ్ల నిర్మాణంపై నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని ఆదేశాలు
-
ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికల్లా పూర్తి కావాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్షా సమావేశం చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో జగనన్న కాలనీలు, టిడ్కో హౌసింగ్ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇళ్లులేని వారందరికీ ఇళ్లు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 5,655 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. లే అవుట్లలో పర్యటన వల్ల ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. లే అవుట్లను సందర్శించినట్టుగా ఫొటోలను కూడా అప్లోడ్ చేయాలని తెలిపారు. ప్రతి శనివారం హౌసింగ్‌డేగా నిర్వహిస్తున్నామని.. ఆ రోజు తప్పనిసరిగా అధికారులు లే అవుట్లను సందర్శిస్తున్నారని అధికారులు సీఎంకు వెల్లడించారు. సీఎం జగన్ ఇంకా మాట్లాడుతూ.. ► ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికల్లా పూర్తి కావాలి. ► ఆప్షన్–3 ని ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలి. ► లే అవుట్ల వారీగా ప్రాధాన్యత పరంగా పనులను గుర్తించి.. అనుకున్న సమయానికి ఆ పని పూర్తయ్యేలా చూడాలి. ► దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో చెప్పుకోదగ్గ ప్రగతి కనిపిస్తుంది. ► ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దు. ► ప్రతి దశలోనూ నాణ్యతా నిర్ధారణ పరీక్షలు జరగాలి. ► ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీని నిరంతరం పాటించడానికి ఎస్ఓపీలను అందుబాటులో ఉంచాలి. ► గ్రామ సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ సేవలను విస్తృతంగా వాడుకోవాలి. ► ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ ప్రమాణాలు పాటించే విషయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ భాగస్వామ్యం తీసుకోవాలి. ► ఇళ్లు పూర్తయ్యే సరికి మూడు రకాల మౌలిక సదుపాయాలు ఉండాలి. ► విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. ► మిగిలిన మౌలిక సదుపాయాలనూ వృద్ధిచేసుకుంటూ ముందుకు సాగాలి. ► ఈ పనులకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయని అధికారులు తెలిపారు. ప్రాధాన్యతాక్రమంలో చేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్ శర్మ, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దవులూరి దొరబాబు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి ఇంతియాజ్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: (వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..) -
అధైర్య పడొద్దు.. అన్ని విధాల ఆదుకుంటాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): తన కుమార్తె వైద్య ఖర్చుల కోసం ఏనాడు ప్రభుత్వాన్ని సాయం కోరలేదని, ముఖ్యమంత్రిని కలవలేక పోతున్నాననే ఆవేదన, క్షణికావేశంలో మాత్రమే చేతికి గాయం చేసుకున్నట్లు కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలేనికి చెందిన ఆరుద్ర తనను కలిసిన ఉన్నతాధికారులకు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం సమీపాన తన చేతికి గాయం చేసుకుని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజులపూడి ఆరుద్రను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, సీపీ కాంతి రాణా టాటా పరామర్శించారు. ఆరుద్ర, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందని ధైర్యంగా ఉండాలని సీఎం చెప్పారని, ఆయన ఆదేశాల మేరకే తాము వచ్చినట్లు తెలిపారు. కాగా నిస్సహాయురాలైన ఓ మహిళ తన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంకోసం ప్రయత్నిస్తే ఆ ఉదంతాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఎల్లో మీడియా ప్రయత్నించడం చూసి జనం విస్తుపోతున్నారు. ఆరుద్రను కలసిన అనంతరం కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. ఆరుద్ర కుమార్తె సాయి లక్ష్మికి మూడు నెలల వయసులోనే స్పైనల్ వ్యాధికి ఆపరేషన్ జరిగిందని, కొంతకాలం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా, తర్వాత తిరిగి అనారోగ్యానికి గురవడంతో వెల్లూరు, లక్నో వంటి అనేక ప్రాంతాల్లో వైద్యం చేసినా మెరుగుపడలేదన్నారు. అమెరికాలో అధునాతన వైద్యం చేయిస్తే కోలుకోవచ్చని కొందరు వైద్యులు చెప్పినట్లు తెలిపారు. కుమార్తె వైద్య ఖర్చుల కోసం అమలాపురంలో ఉన్న తమ ఆస్తులను రూ.62 లక్షలకు విక్రయించినట్లు ఆరుద్ర చెప్పారని కలెక్టర్ పేర్కొన్నారు. శంఖవరం మండలం అన్నవరంలోని తన ఇంటిని అమ్మడానికి ప్రయత్నిస్తే ఇరువైపులా ఉన్న కానిస్టేబుళ్లు శివయ్య, కన్నయ్య, ముత్యాలరావులు అడ్డుపడటమే కాకుండా, న్యాయపరమైన చిక్కులు సృష్టించారని, వారిపై 2020లో జిల్లా ఎస్పీకి, ఆ తర్వాత కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకున్నారని తెలిపినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెకు విదేశాల్లో వైద్యం అందించలేక పోతున్నాననే బాధతో సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలని ప్రయత్నించినట్లు ఆరుద్ర తెలిపారని పేర్కొన్నారు. గత నెల 31న ఎ–కన్వెన్షన్ హాలు వద్ద సీఎంను కలిసేందుకు ప్రయత్నించగా, భద్రతా కారణాల వలన పోలీసులు అనుమతించలేదన్నారు. ఈ నెల 2న కుమార్తెతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని అధికారులను కలవగా, సమస్య కోర్టు పరిధిలో ఉందని, పౌర సమస్యలను స్థానికంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారని ఆమె తెలిపినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలవలేక పోయాననే మనస్తాపంతోనే ఆవేశంలో చేతికి గాయం చేసుకున్నానని ఆరుద్ర వివరించిందని తెలిపారు. కుమార్తె అనారోగ్యం వల్ల 2018లో గ్రూప్–2 ఉద్యోగానికి ఎంపికైనా చేరలేక పోయానని, తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్ఫథంతో మరొకసారి అవకాశం కల్పించాలని ఆరుద్ర కోరినట్లు కలెక్టర్ తెలిపారు. -
92 శాతం ప్రజలకు పథకాలు అందుతున్నాయ్: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: మనకు ఓటు వేయకపోయినా.. అర్హులకు మంచి చేశాం. అలాంటప్పుడు వాళ్లు మనల్ని ఎందుకు ఆదరించారు?. కచ్చితంగా ఆదరించి తీరతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండపేట కార్యకర్తలతో తాడేపల్లిలో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మండపేట ప్రజలకు 946 కోట్ల రూపాయలను డీబిటీ(డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్జాక్షన్) ద్వారా నేరుగా లబ్ధి చేకూర్చాం. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా పనిచేశాం. గ్రామాల్లో వచ్చిన మార్పును మనం జనంలోకి తీసుకెళ్లాలి. ఒక మిషన్ ద్వారా దీన్ని జనంలోకి తీసుకెళ్లాలి. మండపేట నియోజకవర్గంలో 96,469 ఇళ్లకు గాను 92 శాతం ఇళ్లకు పథకాలు చేరాయి. ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటే 92 శాతం మంచి పనులు చేయగలిగాము. ఆ మంచిని వివరిస్తూ గడపగడపకు వెళ్లేలా ప్లాన్ చేశాం. అలా వెళ్ళినప్పుడు అక్క చెల్లెమ్మలు మనకు స్వాగతం పలుకుతున్నారు. అలాంటప్పుడు వచ్చే ఎన్నికలలో 175కు 175 సీట్లు ఎందుకు రావు?. ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. అర్హత ఉంటే చాలు.. అందరికీ మేలు చేశాం. మనకు ఓటు వేయకపోయినా మంచి చేస్తే వారి మనసు కరుగుతుందని మేలు చేశాం. కలిసికట్టుగా అందరూ పనిచేసి ఎన్నికలలో పార్టీని గెలిపించాలి’ అని సీఎం జగన్ కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. మిమ్నల్ని కలవడానికి ఇక్కడికి రమ్మని చెప్పడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి కలిసి చాలారోజులైంది. కలిసినట్టు ఉంటుందన్నది ప్రధాన కారణమైతే... రెండోది మరో 18 నెలల్లో రానున్న ఎన్నికలకు సన్నద్దం కావాల్సి ఉంది. 18 నెలలు అంటే చాలా దూరం ఉంది అనుకోవచ్చు. దానికి సంబందించి ఇప్పుడే ఈ కార్యక్రమం ఇప్పుడే మొదలు పెట్టాలా ? అని అనుకోవచ్చు. 18 నెలలు ఉన్నప్పటికీ ఆ దిశగా మనం అడుగులు ఎందుకు వేయాలన్నది చెప్పడానికే మిమ్నల్ని రమ్మన్నాం. ► ఎన్నికలప్పుడు ప్రజల దగ్గరకి వెళ్లడం, ప్రజలను ఆశీర్వదించమని కోరడం సర్వసహజంగా జరుగుతాయి. కానీ మొట్టమొదటి సారిగా గత ప్రభుత్వాలలో ఎప్పుడూ, ఎక్కడా చూడనట్టుగా ఈ రోజు రాష్ట్రంలో మార్పులు జరుగుతున్నాయి. మొట్టమొదటిసారిగా సచివాలయ వ్యవస్ద ప్రతి 2వేల జనాభాకు 12 మంది అక్కడే కూర్చుని పనిచేసేటట్టుగా ఏర్పాటు చేశాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌తో అనుసంధానం చేసి, ప్రతి గడప, ప్రతి కుటుంబం కూడా అర్హత ఉండి రాని పరిస్థితులు ఉండకూడదని తాపత్రయపడుతున్నాం. పారదర్శకతతో అందరికీ అన్ని పథకాలు రావాలని ఎప్పుడూ జరగని విధంగా సాచ్యురేషన్ విధానంలో అడుగులు వేశాం. ► ఒక్క మండపేట నియోజకవర్గంలోనే రూ.946 కోట్లు ఈ 3 సంవత్సరాల 4 నెలల కాలంలో కేవలం బటన్ నొక్కి ప్రతి ఇంటికి అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. వైయస్సార్ పెన్షన్ కానుక, రైతు భరోసా, అమ్మఒడి, ఆసరా మొదలుకుని క్రాప్ ఇన్సూరెన్స్, చేయూత, విద్యాదీవెన వరకు రకరకాల పథకాలు డీబీటీ ద్వారా ఆధార్ కార్డు సహా ఎవరికి ఎంతిచ్చామో, ఎవరికి ఏ రకంగా మేలు జరిగిందన్నది ఆధారాలతో సహా పారదర్శకంగా ఎక్కడా లంచాలు, వివక్షకు తావులేకుండా అర్హుడైన ఏ ఒక్కరు మిస్ కాకుండా దేవుడి దయతో అడుగులు వేయగలిగాం. ఇటువంటి మార్పు గతంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి మార్పు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తోంది. ఇంత మార్పు జరుగుతున్నప్పుడు దాన్ని మనం ప్రజలదగ్గరకు తీసుకుని వెళ్లి...వారికి ఇవన్నీ గుర్తు చేసి.. ప్రజల ఆశీస్సులు మనం తీసుకుని అడుగులు ఇంకా ఎఫెక్టివ్‌గా వేసేదానికి మిమ్నల్ని భాగస్వామ్యులను చేస్తున్నాం. ► మొట్టమొదటిసారిగా గడప గడప అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం చేపట్టి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. గడప గడప కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే.. మన ఎమ్మెల్యే కానీ, మన ఎమ్మెల్యే అభ్యర్ధి కానీ... గ్రామానికి వెళ్లినప్పుడు ఆ గ్రామంలో సచివాలయ వ్యవస్ధ, మండల స్ధాయి అధికారులు, గ్రామంలో సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ మమేకమై ప్రతి గడపనూ తట్టి, ప్రతి గడపలోనూ జరిగిన మంచిని వివరిస్తూ వాళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటూ మరోవైపు పొరపాటున ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే... అటువంటి వారు కూడా మిగిలిపోకూడదనే తపన, తాపత్రయంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు డబ్బులు కూడా కేటాయించాం. ఆ సచివాలయానికి వెళ్లినప్పుడు ఆ సచివాలయ పరిధిలో అత్యంత ప్రాధాన్యత ఉన్న పనులు చేపట్టాలి. సచివాలయానికి రూ.20 లక్షలుఅంటే నియోజకవర్గానికి దాదాపు రూ.20 కోట్లు కేటాయించినట్లవుతుంది. ఆ సచివాలయంలో రెండు రోజుల పాటు ఉండాలి. ఒక్కోరోజు కనీసం 6 గంటలు ఆ సచివాలయంలో ఉండాలి. ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రాధాన్యత ఉన్న పనులు చేపట్టాలి. ► మీ నియోజకవర్గంలో 96,469 ఇళ్లు ఉన్నాయి. ఇందులో మన పథకాలు చేరిన ఇళ్లు 91.96 శాతం. అంటే సుమారు 92 శాతం ఇళ్లలో ఆ అక్కచెల్లెమ్మల పేర్లతో ఏ పథకం చేరింది, ఎన్ని పథకాలు చేరాయి అని ఏకంగా ఆథార్ కార్డు డీటైల్స్‌తో సహా చెప్పగలికే పరిస్థితుల్లో సహాయం చేయగలిగాం. ► గ్రామమే ఒక యూనిట్‌గా తీసుకుంటే ఆ గ్రామంలో 92 శాతం ఇళ్లకు.. ప్రతి ఇంట్లో మనం మంచి చేశామని సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ జరిగిన మంచిని వివరిస్తూ మనం గడప, గడపకూ కార్యక్రమం చేస్తున్నప్పుడు అవునన్నా పథకాలు అందాయి అని చల్లని ఆశీస్సులు ఆ అక్కచెల్లెమ్మలు మనమీద చూపించినప్పుడు ఆగ్రామంలో మనం గెలుస్తాం. ► గ్రామం గెల్చినప్పుడు నియోజకవర్గం గెలుస్తాం. గ్రామం, నియోజకవర్గం గెల్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 175 కి 175 ఎందుకు రావు ?. ఒక్క మండపేట నియోజకవర్గంలో మండపేట మున్సిపాల్టీతో సహా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు లెక్క తీసుకుంటే.. మున్సిపాల్టీలో 30 కి 23 వైయస్సార్సీపీ, జడ్పీటీసీలు మూడింటికి మూడు, ఎంపీపీలు మూడింటికి మూడు ఏ లెక్కలు తీసుకున్నా గతంలో రానివి ఇప్పుడు వచ్చాయి. కుప్పం నియోజకవర్గంలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాల్టీ అన్నీ క్లీన్‌స్వీప్ చేశాం. ప్రజల దీవెనలు మనవైపు కనిపిస్తున్నాయి. కారణం పాలన పారదర్శకంగా జరుగుతుంది. ఎక్కడా లంచాలు అవసరం లేదు. వివక్ష చూపించడం లేదు. మనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉండి రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే కచ్చితంగా వచ్చేటట్టు చేస్తాం. మనం చేసిన మంచిని చూసి మార్పు వస్తుంది. ► సోషల్ ఆడిట్లో జాబితాలు ప్రదర్శిస్తున్నాం. ఇవన్నీ జరుగుతుండగానే మారుతున్న గ్రామాలు కనిపిస్తున్నాయి. గ్రామంలోకి అడుగుపెడుతూనే సచివాలయం కనిపిస్తుంది. వాలంటీర్ వ్యవస్ధ కనిపిస్తుంది. ఆర్బీకేల ద్వారా రైతన్నను చేయిపట్టుకుని నడిపించే కార్యక్రమం జరుగుతుంది. ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, విలేజ్ క్లీనిక్కులు కనిపస్తాయి. శరవేగంగా డిజిటల్ లైబ్రరీలు కట్టే కార్యక్రమం కూడా మొదలుపెడుతున్నాం. ఇవన్నీ గతంలో లేనివి. ఇవన్నీ గ్రామాల రూపురేఖలు మారుస్తున్నాయి. గతంలో పిల్లలు చదువుకునే వయస్సుకు వచ్చేసరికి తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం గ్రామాలు వదిలిపెట్టే పరిస్థితి. ఆ పరిస్థితి పోయి ఇంగ్లిషు మీడియం బడులు మన గ్రామాల్లో వస్తున్నాయి. వైద్యం అన్నది విలేజ్ క్లీనిక్కుల ద్వారా మన గ్రామంలోనే ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంతా ఒకేచోట ఉంటూ.. 24 గంటలపాటు అందుబాటులో ఉంటారు. 67 రకాల మందులు, 14 రకాల పరీక్షలు చేసేటట్టుగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఊర్లోనే వైద్యం అందిస్తున్న పరిస్థితి. ఇంత మార్పు గతంలో జరగలేదు. ► డీసెంట్రలైజేషన్ ఈ స్ధాయిలోకి వెళ్లి మంచి చేయాలన్న ఆరాటం గతంలో లేదు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న నేపధ్యంలో కచ్చితంగా ఈ నియోజకవర్గంలో కూడా మార్పు రావాలి. వై నాట్ 175. కచ్చితంగా జరుగుతుంది. మీరు నేను ఒక్కటైనప్పుడు ఇది జరుగుతుంది. ఇది నా ఒక్కడి వలన జరిగేది కాదు. నేను చేయాల్సింది నేను చేయాలి. మీరు చేయాల్సింది మీరు చేయాలి. ఇద్దరం కలిసికట్టుగా చేయాలి. నేను బటన్ సరిగ్గా నొక్కాలి. అక్కడ పొరపాట్లు జరగకూడదు. నా ధర్మం నేను చేయాలి. మీరు అంతా కలిసి ప్రతి గ్రామంలో మనం చేస్తున్న మంచిని ప్రతి ఇంటికి తీసుకునిపోవడమే కాకుండా, వారికి అర్ధమయ్యేటట్టు చెప్పాలి. వాళ్ల చల్లని ఆశీస్సులు తీసుకోవాలి. ఆ ఆశీస్సులను మనకు అనుకూలంగా మార్చుకోవాలి. ఇద్దరం కలిస్తే సాధ్యం కాకుండా ఉండే ప్రసక్తే లేదు. ఇది చేయడం కోసం మీ అందరి మద్దతు కూడా ఈ దిశగా కూడగట్టేందుకు ఈ రోజు మిమ్నల్ని ఇక్కడికి ఆహ్వానించాం అని సీఎం జగన్ ప్రసంగించారు. టార్గెట్ 175లో భాగంగా.. కొన్ని నియోజకవర్గాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలతో బుధవారం సీఎం జగన్ సమావేశం అయ్యారు. సీఎం వైఎస్ జగన్‌తో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజ్యసభసభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. -
భూవివాదాలు, భూతగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలి: సీఎం జగన్
-
రీసర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నాం.. ఫలాలు ప్రజలకు అందాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్ష సందర్భంగా భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచేలా, వారి భూ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారాలు చూపేలా రీసర్వే ఉండాలని స్పష్టం చేశారు. సమీక్ష సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక ఆదేశాలు ఇవే.. రీసర్వేలో నాణ్యత చాలా ముఖ్యం.. – ఒక గ్రామంలో రీసర్వే చేసిన తర్వాత అన్నిరకాలుగా ఈ ప్రక్రియను ముగించాలి. – ఆ గ్రామంలో మనదైన ముద్ర కనిపించాలి. – భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావాలి. – రీసర్వే పేరుతో మహాయజ్ఞం చేస్తున్నాం.. వాటి ఫలాలు ప్రజలకు అందాలి. – క్వాలిటీ అనేది కచ్చితంగా ఉండాలి. ఎక్కడా కూడా సర్వే అసంపూర్తిగా మిగిలిపోయిందన్న మాట రాకూడదు. – మొబైల్ ట్రిబ్యూనల్స్, సరిహద్దులు, సబ్డివిజన్లు.. ఇవన్నీకూడా చాలా క్రమ పద్ధతిలో ముందుకు సాగాలి. – రీసర్వే చేస్తున్నప్పుడు ఉత్పన్నమైన సమస్యలను అత్యంత ప్రణాళికా బద్ధంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి. – ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచేలా, వారి భూ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారాలు చూపేలా రీసర్వే ఉండాలి. – ఈ సర్వే ద్వారా రెవెన్యూ వ్యవస్థ పూర్తిస్థాయిలో ప్రక్షాళన అవుతుంది. – రికార్డులు, డేటా అంతా కూడా స్వచ్ఛీకరణ జరుగుతుంది. – ఈ అంశాలను అధికారులు దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. – రీ సర్వే ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే కారణంతో చాలామంది ఈ కార్యక్రమంపై దుష్ప్రచారం చేస్తున్నారు. అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. – 100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నాం, దీనికోసం కొన్ని వేల మందిని రిక్రూట్ చేసుకున్నాం. అత్యాధునిక పరికరాలను కోట్లాది రూపాయలు ఖర్చుచేసి కొనుగోలు చేశాము. – దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎవ్వరూ కూడా వేలెత్తి చూపని విధంగా సర్వే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. – దోషాలతో, తప్పులతో ఒక్క హక్కు పత్రం కూడా రైతులకు వెళ్లకూడదు. – సంబంధిత గ్రామ సచివాలయంలో సర్వే పూర్తికాగానే అక్కడే రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా ఏర్పాటయ్యేలా చూడాలి. – సర్వే పూర్తైన తర్వాత ప్రతీ గ్రామంలో ఆర్డీఓలు, జేసీలు హక్కుపత్రాలను తనిఖీలు చేయాలి. – ఉన్నతాధికారులు గ్రామాల్లో సందర్శించడం వల్ల అందరూ కూడా బాధ్యతాయుతంగా తమ పనులు నిర్వర్తిస్తారు. అలాగే సిబ్బందిలో జవాబుదారీతనం కూడా వస్తుంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మార్గదర్శకాలు రూపొందించుకుంటాము.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తప్పులు, పొరపాట్లు లేని విధంగా హక్కు పత్రాలు జారీచేస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే, భూ సర్వే ప్రక్రియలో ఏ దశలో అభ్యంతరాలు వ్యక్తమైనా వాటిని పరిష్కరించే వ్యవస్థలను బలోపేతం చేస్తామన్నారు. ఈ సర్వే పూర్తిచేయడం ద్వారా భూ యజమానుల హక్కులను తరతరాలపాటు కాపాడుగలుగుతామని, ఆక్రమణలు, కబ్జాలు, రికార్డుల్లో అవకతవకలు ఇలాంటి వాటికి పూర్తిస్థాయిలో చెక్ పడుతుందని వెల్లడించారు. కేవలం ఐదు సెంటీమీటర్ల వ్యత్యాసంతో కచ్చితమైన పద్ధతుల్లో సర్వే జరుగుతుందని అధికారులు తెలిపారు. భూ యజమానులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, వారిని పూర్తిస్థాయిలో సంతృప్తపరిచే పద్ధతుల్లో సర్వే జరుగుతోందని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ 6,037 గ్రామాల్లో డ్రోన్లను ఎగురవేశామని, ఇందులో 1,545 గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు కూడా ఖరారయ్యాయని అన్నారు. ప్రతీనెలా 13,335 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని లక్ష్యంగా చేసుకుని సర్వే చేస్తున్నామన్న అధికారులు తెలిపారు. డ్రోన్లు ఎగురవేయడానికి అనువుగాలేని ప్రాంతాల్లో విమానాలు, హెలికాప్టర్ల ద్వారా సర్వే చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమయ్యామని స్పష్టం చేశారు. నవంబర్ మొదటివారంలో తొలివిడత గ్రామాల్లో హక్కుపత్రాలను అందిస్తామని, ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. అర్బన్ ప్రాంతాల్లోనూ సర్వే.. అలాగే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని 15,02,392 ఎకరాల్లో సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తైన తర్వాత ఇక్కడ కూడా పత్రాలను అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు.. వచ్చే జనవరిలో సర్వే ప్రక్రియ ప్రారంభించి మే నెల నుంచి హక్కుపత్రాల పంపిణీ ప్రారంభమయ్యేలా ముందుకుసాగుతామన్నారు. ఆగస్టు 2023 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించుకున్నామని స్పష్టం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయి ప్రసాద్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ (సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్) కమిషనర్ సిద్దార్ధ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, సీసీఎల్ఏ కార్యదర్శి ఏ ఎండీ ఇంతియాజ్, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజీ వి రామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
శిక్షణ పూర్తైన ఐపీఎస్‌లకు సీఎం జగన్ విషెస్
సాక్షి, తాడేపల్లి: ఇటీవలె శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్‌లు.. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంకు వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా.. సీఎం జగన్ వాళ్లకు ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేశారు. విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేస్తూ ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీస్ వ్యవస్ధను నిర్మించాల్సిన అతి పెద్ద బాధ్యత మీపై ఉంది అంటూ ఈ సందర్భంగా ఆయన యువ ఐపీఎస్‌లకు మార్గనిర్ధేశం చేశారు. సీఎం జగన్‌ను కలిసిన వాళ్లలో యువ ఐపీఎస్‌లు ధీరజ్ కునుబిల్లి, జగదీష్ అడహళ్ళి, సునీల్ షెరాన్, రాహుల్ మీనా ఉన్నారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గ్రహీతలకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: స్వచ్ఛ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్– 2022లో ఆంధ్రప్రదేశ్‌కు వివిధ కేటగిరీల్లో 11 అవార్డులు వచ్చాయి. ఈ క్రమంలో అవార్డులు అందుకున్న కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపాలిటీల ఛైర్మన్లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ► గార్బెజ్ ఫ్రీ సిటీస్ అవార్టు కేటగిరీలో 5 స్టార్ రేటింగ్ అవార్డుతో పాటు, సఫాయి మిత్ర సురక్షిత్ షెహర్ కేటగిరీలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు గెల్చుకుంది. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ ఆర్ శిరీష, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తిరుపతి కమిషనర్ అనుపమ అంజలిని అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► గార్బెజ్ ఫ్రీ సిటీస్ అవార్టు కేటగిరీలో 5 స్టార్ రేటింగ్ అవార్డుతో పాటు బిగ్ క్లీన్ సిటీ కేటగిరీలో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అవార్డు సాధించింది. డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, సతీష్, కమిషనర్ రాజబాబు, అడిషనల్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ సన్యాసిరావు, జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాస్త్రీలను సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ► క్లీన్ స్టేట్ క్యాపిటల్ కేటగిరీలో విజయవాడ అవార్డు గెల్చుకుంది. ఈ క్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్, అడిషనల్ కమిషనర్ కె వి సత్యవతిలను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► 50 వేల నుంచి 1 లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కేటగిరీలో పులివెందుల మున్సిపాలిటీకి అవార్డు వచ్చింది. అవార్డు అందుకున్న పులివెందులు మున్సిపాలిటీ ఛైర్మన్ వి వరప్రసాద్, వైస్ ఛైర్మన్లు వైయస్.మనోహర్‌రెడ్డి, హఫీజుల్లా, కమిషనర్ వి వి నరసింహారెడ్డిలను అభినందించారు సీఎం వైఎస్.జగన్. ► 50 వేల నుంచి 1 లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాల్టీలకు సంబంధించి సిటిజన్ ఫీడ్ బ్యాక్ కేటగిరీలో పుంగనూరు మున్సిపాలిటీ అవార్డు గెల్చుకుంది. ఈ సందర్భంగా ఛైర్మన్ అలీమ్ భాషా, కమిషనర్ నరసింహ ప్రసాద్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశంసించారు. ► ఇండియన్ స్వచ్ఛతా లీగ్ కేటగిరీలో(15వేలలోపు జనాభా) స్పెషల్ మెన్షన్ అవార్డు సాధించిన పొదిలి మున్సిపల్ కమిషనర్ కె డేనియల్ జోసఫ్, మున్సిపల్ మేనేజర్ ఎస్ వి శ్రీకాంత్‌రెడ్డిలను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► ఇండియన్ స్వచ్ఛతా లీగ్ కేటగిరీ(లక్ష నుంచి 3 లక్షలలోపు జనాభా)లో స్పెషల్ మెన్షన్ అవార్డు సాధించిన శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేశు, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జి వెంకటరావులను అభినందించారు సీఎం వైఎస్ జగన్. ► 25 వేల నుంచి 50 వేలులోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించి ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ కేటగిరీలో సాలూరు మున్సిపాలిటీకి అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, కమిషనర్ హనుమంతు శంకరరావులను అభినందించారు సీఎం వైయస్.జగన్. కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీ లక్ష్మీషా, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ డాక్టర్ పి సంపత్ కుమార్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఛైర్పర్సన్ పి దేవసేన, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ సీఓఓ కిరణ్ కుమార్, టీం లీడర్ పాతూరు సునందలు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇదీ చదవండి: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్ -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్
సాక్షి, అమరావతి: 2021 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన తొమ్మిది మంది ప్రొబేషనరీ అధికారులు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులను కలిశారు. పాలనాపరమైన అవగాహన పెంపొందించుకునేందుకు వారి సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని ఐఏఎస్ ప్రొబేషనర్స్‌కు మార్గనిర్దేశం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వారికి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసిన ఐఏఎస్ ప్రొబేషనర్స్లో పి. ధాత్రిరెడ్డి, వై.మేఘ స్వరూప్, ప్రఖర్ జైన్, గొబ్బిళ్ళ విద్యాధరి, శివ నారాయణ్ శర్మ, అశుతోష్ శ్రీవాత్సవ, అపూర్వ భరత్, రాహుల్ మీనా, సూరపాటి ప్రశాంత్ కుమార్‌లు ఉన్నారు. ఇదీ చదవండి: మార్చి 31 నాటికి అన్నిరోడ్లను బాగు చేయాలి: సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన 2021 బ్యాచ్ ఐఏఎస్ ప్రొబేషనర్స్. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసేలా పనిచేస్తూ, సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటూ ముందుకుసాగాలని మార్గనిర్ధేశం చేసి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పిన సీఎం. pic.twitter.com/7VIDUFBpz9 — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 7, 2022 -
సీఎం వైఎస్ జగన్‌కు హజ్ పవిత్ర జలం అందజేత
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హజ్ కమిటీ చైర్మన్, సభ్యులు, ఎమ్మెల్సీలు సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హజ్ పవిత్ర జలం (జమ్ జమ్ వాటర్)ను సీఎంకు అందజేశారు. హజ్ 2022 యాత్ర ముగిసిన సందర్భంగా పవిత్ర జలాన్ని ముఖ్యమంత్రికి అందజేసి, మైనారిటీలకు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. సీఎంను కలిసిన వారిలో హజ్ కమిటీ చైర్మన్ బీఎస్ గౌస్ లాజమ్, ఎమ్మెల్సీలు రుహుల్లా, ఇషాక్ బాషా, హజ్ కమిటీ సభ్యులు మునీర్ బాషా, ఇమ్రాన్, ఇబాదుల్లా, ఖాదర్, ముఫ్తిబాసిత్ తదితరులు ఉన్నారు. అన్ని సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారు సీఎంను కలిసిన అనంతరం బీఎస్ గౌస్ లాజమ్ మాట్లాడుతూ కేంద్ర పౌరవిమానయాన శాఖతో సంప్రదించి ఏపీలో హజ్ టెర్మినల్ ఏర్పాటుకు కృషి చేయాలని, విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణానికి ఆరు ఎకరాల భూమి కేటాయించాలని, వైఎస్సార్ జిల్లా కడపలో అసంపూర్తిగా నిలిచిపోయిన హజ్ హౌస్‌ను పూర్తి చేయాలని కోరామని తెలిపారు. హజ్ హౌస్ కార్యకలాపాల కోసం బడ్జెట్లో రూ.4.5 కోట్లు కేటాయించాలని, తద్వారా 2023 సంవత్సరంలో హజ్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని సీఎం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. వీటన్నింటిని త్వరలోనే నెరవేరుస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. -
సముద్ర ఉత్పత్తుల విషయంలో ప్రత్యేక చొరవ చూపండి
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం ఆలిండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వారు సీఎంతో భేటీ అయ్యారు. కాకినాడ వద్ద ఏర్పాటు కానున్న మేజర్ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల మత్స్యసంపద, సముద్ర ఉత్పత్తుల ఉనికికి ప్రమాదం ఏర్పడకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని, డ్రగ్ పార్క్ వ్యర్థ జలాల డిశ్చార్జ్ పాయింట్ దూరం పెంచాలని హ్యాచరీస్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎంను కోరారు. దీంతో పాటు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు సర్ప్లస్ పవర్‌ను హ్యాచరీస్‌కు ప్రత్యేక కేటగిరీ కింద ఇవ్వాలని కూడా వారు సీఎంకు విన్నవించారు. ష్రింప్ హ్యచరీస్ అసోసియేషన్ సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎంని కలిసిన వారిలో ఆర్అండ్బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఆలిండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి కొనకంటి మధుసూదన్‌రెడ్డి, కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ సత్తి బులివీర్రెడ్డి, నేషనల్ బాడీ వైస్ ప్రెసిడెంట్ వి.సత్తిరెడ్డి, అడ్వైజర్ ప్రత్తిపాటి వీరభద్ర కుమార్, హ్యాచరీ ఓనర్స్ కనుమూరి ఆనంద వర్మ, ఎ.నగేష్ బాబు, బి.విజయ్‌కుమార్, సి.కోదండ తదితరులు ఉన్నారు. -
‘అసని’పై అప్రమత్తం
లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఖాళీ చేయించి.. సహాయ, పునరావాస కేంద్రాలకు తరలించాలి. వారికి భోజనం, వసతితో సహా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలి. బాధితుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. వారు ఇంటికి వెళ్లేటప్పుడు ఒక్కొక్కరికి రూ.1,000, కుటుంబానికి రూ.2 వేలు చొప్పున సాయం అందించాలి. ఈ సొమ్ము వారి ఇళ్లు బాగు చేసుకోవడానికి, తక్షణ అవసరాలకు ఉపయోగపడుతుంది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న ఏడు జిల్లాల్లో ఈ ఏర్పాట్లు చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అసని తుపాను నేపథ్యంలో జిల్లాల అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు కోస్తా తీర ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఉదయం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒక్క మరణం కూడా సంభవించకుండా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే అవసరమైన నిధులు విడుదల చేశామని, అవసరమైన మేర ఖర్చు చేసుకోవచ్చని చెప్పారు. ఈ విషయంలో వెనుకాడవద్దని స్పష్టం చేశారు. బాధితులకు పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. తీర ప్రాంతాలపై దృష్టి సారించాలి ► నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుంది. ఈ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా కోస్తా తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలి. ► కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలి. వారికి భోజనంతో పాటు అవసరమైన సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇప్పటికే 454 చోట్ల సహాయ, పునరావాస కేంద్రాలను గుర్తించినప్పటికీ, ఇంకా అవసరమైన చోట్ల మరిన్ని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. నిత్యావసరాలను సిద్ధం చేసుకోండి ► సహాయ, పునరావాసానికి ఉపయోగపడే డీజిల్ జనరేటర్లు, జేసీబీల వంటి వాటిని సిద్ధం చేసుకోవాలి. బియ్యం, పప్పులు, వంట నూనెలు తదితర నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుకోవాలి. ప్రభుత్వ విభాగాల వారీగా సహాయ చర్యల కోసం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. ► ప్రభుత్వ శాఖలు పరస్పర సహకారంతో పని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మరణాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గాలుల వేగం గంటకు 30 నుంచి 80 కిలోమీటర్లు వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతాయన్న సూచనలు కూడా ఉన్నాయి. ► ఈ దృష్ట్యా కలెక్టర్లు అందరూ జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. త్వరితగతిన సహాయ పునరావాస చర్యలు చేపట్టాలి. పునరావాస కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలి. ప్రతి ఒక్కరూ పునరావాస కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలి. తీరం దాటే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి ► కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ ప్రాంతాలకు మధ్యాహ్నానికి (బుధవారం) తుపాను తాకే అవకాశం ఉంది. సాయంత్రానికి విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలపైనా ప్రభావం చూపిస్తుంది. రాత్రికి తీరం దాటి బలహీనపడే సమయంలో అధికారులందరూ మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. బాధితులకు హెల్ప్ లైన్ ఏర్పాటు పక్కాగా ఉండాలి. ఉప్పాడ రోడ్డుకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలి. (ఇందుకోసం చెన్నై ఐఐటీ నిపుణులతో మాట్లాడి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు.) ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, హోం, డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ మంత్రి తానేటి వనిత, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ సీఎస్ జి సాయి ప్రసాద్, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రవాణా, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ అంబేడ్కర్ పాల్గొన్నారు. -
కొత్త జిల్లాలతో ప్రజలకు మేలు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: జిల్లా స్థాయిలో వికేంద్రీకరణతో రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు ఇవాళ అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం క్యాంప్ కార్యాలయంలో.. కొత్త జిల్లాలను ప్రారంభించిన అనంతరం జిల్లాల ఏర్పాటు ఆవశ్యకతను ఆయన స్వయంగా వివరించారు. అంతకు ముందు 26 జిల్లాల ఏపీ రాష్ట్రంగా రూపుమారుతున్న సందర్భంగా.. ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు సీఎం వైఎస్ జగన్. కొత్త జిల్లాల పేర్లను స్వయంగా చదివి వినిపించిన ఆయన.. ప్రజల సెంటిమెంట్లను, గొప్పవాళ్లను పరిగణనలోకి తీసుకున్నాకే జిల్లాలను ఏర్పాటు చేశామని, వాటికి పేర్లు కూడా పెట్టినట్లు వెల్లడించారు. పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు అని మరోసారి స్పష్టం చేసిన సీఎం జగన్.. గతంలో ఉన్న జిల్లాలు యథాతధంగానే ఉంటాయని గుర్తు చేశారు. ఏపీతో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలోనే 26 జిల్లాలు ఉన్నాయని చెబుతూ.. జనాభా ప్రతిపాదికన చూసుకుంటే ఏపీకి జిల్లాల ఏర్పాటు అవసరం తప్పక ఉందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో జిల్లాకు ఇంత ఎక్కువ జనాభా ఉన్న పరిస్థితి లేదని, సుమారు 4 కోట్ల 96 లక్షల మంది జనాభా ఉన్న ఏపీకి జిల్లాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు. ఇంతకు ముందు 38 లక్షల 15 వేల మందికి ఒక జిల్లా ఉండేదని.. ఇప్పుడు 26 జిల్లాల ఏర్పాటుతో 19 లక్షల 7 వేల మందికి ఒక జిల్లా ఉంటుందని తెలిపారు. గిరిజన జిల్లాల్లో మినహా 6 నుంచి 8 అసెంబ్లీ సెగ్మెంట్లతో ఒక జిల్లా ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. కొత్త జిల్లాలతో మెరుగైన పాలనా, శాంతి భద్రతలు, పారదర్శకత.. ఉంటుందని చెప్పారాయన. గ్రామస్థాయి నుంచి పరిపాలనపై దృష్టి పెట్టిన తమ ప్రభుత్వం.. అందుకు తగ్గట్లే జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిందని, ఏరకంగా చూసుకున్నా ఇదే సరైన విధానమని సీఎం జగన్ స్పష్టం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
AP: శుభకృత్‌లో అన్నీ శుభాలే
సాక్షి, అమరావతి: శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు జరుగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ పంచకట్టులో సీఎం వైఎస్ జగన్, సతీమణి భారతితో కలిసి ఈ వేడుకలకు ముఖ్య అతి«థులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ రోజు శుభకృత్ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని, పంచాంగాలన్నీ ఈ పేరులోనే శుభం అన్న మాట కనిపిస్తోందని చెబుతున్నాయని తెలిపారు. సతీమణి భారతీరెడ్డికి కంకణం కడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో విప్ చెవిరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి తదితరులు ఈ సంవత్సరం అంతా రాష్ట్ర ప్రజలందరికీ శుభం జరుగుతుందని చెబుతున్న నేపథ్యంలో దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వానికి ఇంకా బలాన్నివ్వాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సంవత్సరం అంతా ప్రజలందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నానని చెప్పారు. ఇక్కడ ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, మిత్రులే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు, ప్రతి తాతకు, అవ్వకు, ప్రతి సోదరుడు, స్నేహితుడికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. క్యాలెండర్లు, పుస్తకాలు ఆవిష్కరించారు. సీఎం దంపతులకు ఘన స్వాగతం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు విచ్చేసిన సీఎం దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం అందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, సాంస్కృతిక, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. పంచాంగ శ్రవణ వేదిక వద్దకు వస్తున్న సమయంలో సీఎం వైఎస్ జగన్ నుదిటిపై తిలకం దిద్దుతున్న ఆయన సతీమణి వైఎస్ భారతి ప్రత్యేక వేదిక వద్ద ఏర్పాటు చేసిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సీఎం దంపతులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సంప్రదాయ పంచకట్టులో వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుదిటిపై సతీమణి భారతి తిలకం దిద్దగా, ఆమె నుదిటిపై సీఎం కుంకుమ అద్దడంఅక్కడున్న వారందరినీ ఆకర్షించింది. వేద పండితులు సీఎం చేతికి కంకణ ధారణ చేయగా, భారతి చేతికి సీఎం కంకణ ధారణ చేశారు. అనంతరం వారు వేదం నేర్చుకుంటున్న చిన్నారులతో కలిసి ప్రాంగణమంతా కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ పేరుపేరున పలకరిస్తూ సభా వేదికపైకి చేరుకున్నారు. వైఎస్ భారతి నుదిటిపై తిలకం అద్దుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాలెండర్ల ఆవిష్కరణ సమాచార శాఖ రూపొందించిన ప్రభుత్వ సంక్షేమ క్యాలెండర్, వ్యవసాయ పంచాంగం 2022–23, ఉద్యానవన పంచాంగం 2022–23, సాంస్కృతిక శాఖ రూపొందించిన శిల్పారామం క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు జయశ్రీ రచించిన ‘ఆమెకు తోడుగా న్యాయదేవత’, అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ‘తెలుగు సాహిత్యం, సమాజం చరిత్ర – రెండువేల సంవత్సరాలు’ అనే పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్రంలో వివిధ దేవస్థానాలకు చెందిన వేద పండితులను సీఎం సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్న పథకాలపై చిన్నారుల నృత్య రూపకాన్ని తిలకించి, వారితో కలసి ఫొటోలు దిగారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఆర్.మల్లిఖార్జునరావు రూపొందించిన డీ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చిత్రపటాన్ని సీఎం ఆవిష్కరించారు. ఐఏఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెక్ రూపంలో విరాళం అందజేశారు. ఈ కార్యక్రమాలను ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆద్యంతం దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం సీఎం దంపతులకు శ్రీవారి దశావతార కళారూపం అందజేశారు. శుభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని సిద్ధాంతి సోమయాజులుకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి (ప్రజా వ్యవహారాలు), జీవీడీ కృష్ణమోహన్ (కమ్యూనికేషన్స్), పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజలు హాయిగా ఉంటారు.. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు పంచాంగ పఠనం చేశారు. పేరుకు తగ్గట్లుగానే శుభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలే జరుగుతాయని సిద్ధాంతి చెప్పారు. ప్రభువుల చల్లని పాలనకు తగ్గట్లే ప్రజలూ హాయిగా ఉంటారని, చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుందన్నారు. ఓర్పుగా అవాంతరాలను ఎదుర్కొంటూ మంచి పాలన అందిస్తారని సీఎం జగన్‌ను సిద్ధాంతి ఆశీర్వదించారు. ఉగాది పచ్చడిని స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు శుభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని సీఎం ఆవిష్కరించి, కప్పగన్తు సుబ్బరామ సోమయాజులకు అందజేశారు. అనంతరం ఆయన సీఎం దంపతులకు ఉగాది పచ్చడి అందించారు. సిద్ధాంతిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం సత్కరించారు. పంచాంగ శ్రవణం అనంతరం ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ, శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం స్థానాచార్యులు, అర్చకులు, వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. ఉట్టిపడిన గ్రామీణ వాతావరణం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లతో ఒక గ్రామ నమూనా ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయంలో ఒక అరుగు మీద సీఎం దంపతులు కూర్చోగా, వారికి ఎదురుగా మరో అరుగుపై సిద్ధాంతి కూర్చొన్నారు. సచివాలయం ఎదురుగా ఆహుతులు కూర్చొని తిలకించేలా ఏర్పాట్లు చేశారు. పంచాంగ శ్రవణం, ఇతర కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సీఎం వైఎస్ జగన్‌తో రాజమౌళి భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రముఖ డైరెక్టర్ రాజమౌళితో భేటీ అయ్యారు. ఆయనతో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా సీఎం జగన్‌ను కలిశారు. ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో రాజమౌళి భేటీ ప్రాధ్యాన్యత సంతరించుకుంది. కాగా ఇటీవలే ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. -
సీఎం జగన్ చేతుల మీదుగా బీఫామ్.. అందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థి రుహుల్లా
-
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన నటుడు పోసాని
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సినీ నటుడు పోసాని కృష్ణమురళి కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ కుటుంబం కరోనాతో బాధపడుతున్న సమయంలో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి ఫోన్‌చేసి మెరుగైన చికిత్స అందించాలని చెప్పారని.. అందుకే సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చానన్నారు. చదవండి: పవన్ సినిమాను తొక్కేయడమేంటి?: మంత్రి పేర్ని నాని సినిమా టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. చిన్ని సినిమాల నుండి ప్రతిపాదనలు అందాకే టికెట్ల ధరలపై నిర్ణయం వస్తుందని పోసాని తెలిపారు. సినిమా టికెట్ల ధరలపై తానేమి ముఖ్యమంత్రితో చర్చించలేదన్నారు. భీమ్లానాయక్ సినిమాను ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బంది పెట్టిందని ఆరోపించడం సరికాదని.. ఒకవేళ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినట్లు సాక్ష్యం ఉంటే చూపాలని పోసాని మీడియాను కోరారు. సీఎం జగన్‌పై నిందలు వేసిన వారు భూమిలో 100 అడుగుల లోతుకు పాతుకుపోతారని చెప్పారు. -
సీఎం జగన్‌ను కలిసిన ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ థియరీ బెర్దెలాట్
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ (బెంగళూరు) థియరీ బెర్దెలాట్ శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. -
Andhra Pradesh: రూ.2,134 కోట్లతో 5 కొత్త పరిశ్రమలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రూ.2,134 కోట్ల పెట్టుబడులతో కొత్తగా ఐదు పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 8,578 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశంలో ఈ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం లభించింది. పరిశ్రమలకు భూముల కేటాయింపులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. కంపెనీల విస్తరణకు అవకాశాలున్న చోట భూములు కేటాయించాలని సూచించారు. భవిష్యత్తులో పరిశ్రమలను విస్తరించేందుకు అనువుగా తగిన వనరులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, రెవెన్యూశాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, బీసీ సంక్షేమశాఖ స్పెషల్ సీఎస్ జి.అనంతరాము, జీఏడీ ముఖ్య కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్, ఐటీ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ఐదు పరిశ్రమలు ఇవీ ► వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్– రిటైల్ లిమిటెడ్ ఏర్పాటు కానుంది. ఇక్కడ జాకెట్స్, ట్రౌజర్ల తయారీని చేపట్టనున్నారు. ఆదిత్యా బిర్లా రూ.110 కోట్ల పెట్టుబడితో 2,112 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ► వైఎస్సార్ జిల్లా బద్వేలులో సెంచురీ కంపెనీ ప్లైవుడ్ తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది. రూ.956 కోట్ల పెట్టుబడితో 2,266 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. మరోవైపు ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల రైతులకు కూడా భారీగా మేలు జరగనుంది. దాదాపు 22,500 ఎకరాల్లో యూకలిఫ్టస్ చెట్లను గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేస్తారు. రూ.315 కోట్ల విలువైన ఉత్పత్తులను రైతుల నుంచి కొనుగోలు చేయనున్నారు. ► తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం వద్ద ఇండస్ట్రియల్ కెమికల్స్ తయారీ పరిశ్రమకు ఎస్‌ఐపీబీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ రూ.861 కోట్ల పెట్టుబడితో ఇక్కడ 1,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుంది. స్థానిక ప్రజల అభ్యంతరాల నేపథ్యంలో థర్మల్ పవర్ ప్లాంట్‌ను నెలకొల్పబోమని గ్రాసిమ్ కంపెనీ స్పష్టం చేసింది. ప్రజల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని థర్మల్ ప్లాంట్ నిర్మాణాన్ని విరమించుకుంటున్నట్లు తెలిపింది. ఈమేరకు కంపెనీ స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఐపీబీ ఆమోదం లభించింది. ► వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తి ఈఎంసీలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల (హెచ్ఏసీ కెమెరా, ఐపీ కెమెరా, డీవీఆర్) తయారీ పరిశ్రమను ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నెలకొల్పనుంది. రూ.127 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా 1,800 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ► కొప్పర్తి ఈఎంసీలోనే ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మరో పరిశ్రమను కూడా ఏర్పాటు చేయనుంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్, కెమెరా, డీవీఆర్ తయారీకి సంబంధించి రూ.80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 1,100 మందికి డిక్సన్ కంపెనీ ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తుంది. -
సీఎం జగన్‌ని కలిసిన టీటీడీ బోర్డ్ మెంబర్ మిలింద్ కే. నర్వేకర్
సాక్షి, అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీటీడీ బోర్డ్ మెంబర్ మిలింద్ కే. నర్వేకర్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడిగా తనను నియమించినందుకు గాను ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు మిలింద్ కే.నర్వేకర్, ఆయన కుటుంబ సభ్యులు. నర్వేకర్‌తో పాటు మహారాష్ట్ర శివసేన సెక్రటరీ సూరజ్ చవాన్ కూడా సీఎం జగన్‌ని కలిశారు. చదవండి: TTD: శ్రీవారి దర్శనానికి టీకా సర్టిఫికెట్ తప్పనిసరి -
3 ప్రాంతాల్లో క్యాన్సర్ ఆస్పత్రులు!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేకంగా ఆస్పత్రులను ఏర్పాటు చేయడంతో పాటు అందులో ఒకటి అత్యాధునికంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారని ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో ఆయన సమావేశమయ్యారు. ప్రజారోగ్యం, ముఖ్యంగా క్యాన్సర్ నివారణ, చికిత్సలు, ఆధునిక విధానాలపై సుదీర్ఘ సమాలోచనలు జరిగాయి. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్ నోరిని ఈ సందర్భంగా సీఎం కోరారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం డాక్టర్ నోరి దత్తాత్రేయుడు వివరాలను వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేకుండా... రాష్ట్రంలో ప్రజారోగ్యరంగంపై సమావేశంలో చర్చ జరిగింది. ప్రభుత్వాసుపత్రులలో చేపడుతున్న నాడు – నేడు, వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించాం. క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై సుదీర్ఘంగా చర్చించడంతోపాటు పరస్పరం ఆలోచనలు పంచుకున్నాం. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్స కోసం ఆస్పత్రులు నెలకొల్పి అందులో ఒకటి అత్యాధునికంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ సంకల్పించారు. వివిధ మెడికల్ కాలేజీలు, జిల్లా ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్సలను దీనికిందకు తేవాలన్నది ముఖ్యమంత్రి ప్రణాళిక. క్యాన్సర్ రోగులందరికీ చికిత్సలు అందుబాటులోకి తీసుకు రావాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యం. చిన్న గ్రామంలో క్యాన్సర్ రోగి ఉన్నా చికిత్స కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్నది ముఖ్యమంత్రి ఆశయం. ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏపీలోనే చికిత్స లభ్యమయ్యేలా చూడాలన్న ప్రధాన లక్ష్యంగా చర్చ కొనసాగింది. రాష్ట్రానికి తగిన సహాయ సహకారాలు అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నట్లు తెలియచేయడంతో ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో సమావేశం కావడం ద్వారా రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్సకు గొప్ప అడుగు పడింది. సీఎం జగన్ ఆరోగ్య రంగంలో తీసుకున్న చర్యలన్నీ నాకు చాలా నచ్చాయి. మెడికల్ కాలేజీలు, జిల్లా ఆస్పత్రులను బాగు పరచడం, కొత్తవి ఏర్పాటు చేస్తుండటం చాలా ఆనందాన్నిస్తోంది. -
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: సీఎం జగన్
-
మంచి పనులకు విఘ్నాలు తొలగాలి
సాక్షి, అమరావతి: వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, అందరికీ విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని అభిలషించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని, మీరు తలపెట్టే ఏ కార్యమైనా విఘ్నాలు లేకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు ప్రజలందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు.#HappyGaneshChaturthi — YS Jagan Mohan Reddy (@ysjagan) September 10, 2021 (చదవండి: మహా గణపతిం మనసా స్మరామి...) -
‘రోడ్డు’ మ్యాప్ రెడీ
సాక్షి, అమరావతి: వర్షాలు తగ్గుముఖం పట్టగానే రాష్ట్రంలో రహదారుల మరమ్మతుల పనులు వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మళ్లీ వర్షాకాలం వచ్చే లోగా పనులన్నింటినీ పూర్తి చేసి రోడ్లను బాగు చేయాలని సూచించారు. అక్టోబర్ చివరి నాటికి వర్షాలు తగ్గుముఖం పట్టగానే పనుల సీజన్ మొదలవుతుందని, ఈ సమయంలో ముందుగా రహదారులను బాగు చేయడంపై దృష్టిపెట్టాలని దిశా నిర్దేశం చేశారు. గత సర్కారు రహదారులు బాగు చేయడాన్ని పూర్తిగా వదిలేసిందని, చివరి రెండేళ్ల పాటు నిర్వహణను ఏమాత్రం పట్టించుకోకుండా అధ్వాన పరిస్థితులు సృష్టించిందని చెప్పారు. మన ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. వనరుల సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని, ఒక నిధిని కూడా ఏర్పాటు చేసిందని వివరించారు. రాష్ట్రంలో రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలపై సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రైతన్నల్లో ఆనందం.. రోడ్లకు మాత్రం దెబ్బ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదీ వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. దేవుడి దయవల్ల వర్షాలు బాగా పడటం వల్ల రైతులంతా సంతోషంగా ఉన్నారని, అయితే మరోవైపు వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. ఏటా వానలు విస్తారంగా కురవడంతో కొన్ని రోడ్లు దెబ్బతిని మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వర్షాలు తగ్గగానే వచ్చే నెల చివరికి ఈ పనులన్నీ ప్రారంభం కావాలని ఆదేశించారు. పాజిటివ్ థృక్పథంతో ముందుకెళదాం.. కొంతమంది నెగెటివ్ ఉద్దేశాలతో ప్రచారం చేస్తున్నప్పటికీ మనం చేయాల్సిన పనులను సక్రమంగా నిర్వర్తిద్దామని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి సూచించారు. ఆ ప్రచారాన్ని పాజిటివ్‌గా తీసుకుని అడుగులు ముందుకేద్దామన్నారు. మనం బాగా పనిచేసి పనులన్నీ పూర్తిచేస్తే .. నెగెటివ్ మీడియా ఎన్నిరాసినా ప్రజలు వాటిని గమనిస్తారని చెప్పారు. రాష్ట్రంలో రహదారులు, పోర్టులు, విమానాశ్రయాలపై ఉన్నతస్థాయి సమీక్ష చేస్తున్న సీఎం జగన్ అసంపూర్తి అప్రోచ్ రోడ్లు పూర్తవ్వాలి.. బ్రిడ్జిల వద్ద అప్రోచ్ రోడ్లు పూర్తికాకపోవడంతోచాలా రహదారులు అసంపూర్తిగా మిగిలిపోయాయని, చాలా సంవత్సరాలుగా అవి అలాగే ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. తన పాదయాత్ర సమయంలో చాలా చోట్ల ఇలాంటి దృశ్యాలను చూశానని గుర్తు చేశారు. వీటిని వెంటనే పూర్తిచేసేలా కార్యాచరణ సిద్ధంచేసి పనులు చేపట్టాలని ఆదేశించారు. జాతీయ రహదారుల పనుల ప్రగతిపై పరిశీలన రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల నిర్మాణ ప్రగతి, ప్రతిపాదనలపై అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందచేశారు. కొడికొండ చెక్‌పోస్టు మీదుగా విజయవాడ – బెంగళూరు రహదారిని ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చేపడుతున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో షీలానగర్ – సబ్బవరం జాతీయ రహదారిపైనా దృష్టి సారించినట్లు చెప్పారు. విశాఖ సిటీ నుంచి అనకాపల్లి మీదుగా ఆనందపురం వెళ్లే రహదారిలో ప్రధాన జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణానికి సిద్ధమయ్యామని, దీనివల్ల నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. ఈ రోడ్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీనిపై జాతీయ రహదారుల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రైల్వే ప్రాజెక్టుల భూ సేకరణపై దృష్టి నడికుడి – శ్రీకాళహస్తి, కడప– బెంగళూరు, కోటిపల్లి–నరసాపురం, రాయదుర్గం – తుమకూరు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ పనులను ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. మరికొన్ని మార్గాల్లో డబ్లింగ్ పనులు ముందుకెళ్లేలా చొరవ చూపాలన్నారు. కాకినాడ పోర్టుకు అపార అవకాశాలు కాకినాడ ఎస్ఈజెడ్ గేట్‌వే పోర్టు అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భూములు విస్తారంగా ఉన్నందున పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని సీఎం తెలిపారు. పోర్టును మెరుగైన రోడ్లు, రైల్వే లైన్లతో అనుసంధానం చేయాలని సూచించారు. పోర్టుల్లో కాలుష్య నివారణకు చర్యలు పోర్టులున్న ప్రాంతాల్లో ఫ్రీ ట్రేడ్ వేర్‌హౌసింగ్ జోన్స్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. పోర్టుల వద్ద కాలుష్యాన్ని నియంత్రించాలని, కొత్తగా నిర్మించనున్న పోర్టుల వద్ద ఇప్పటి నుంచే ఈమేరకు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వేగంగా భోగాపురం పనులు భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి కేసుల పరిష్కారంపై దృష్టిపెట్టి వీలైనంత త్వరగా పనులు ప్రారంభమయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మిగిలిన విమానాశ్రయాల అభివృద్ధి పనులపైనా సమీక్షించాలని అధికారులకు సూచించారు. వీటికి సంబంధించి పెండింగ్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కర్నూలు, కడప నుంచి విశాఖకు మరిన్ని విమానాలు కర్నూలు, కడప నుంచి విశాఖపట్నానికి విమాన సౌకర్యాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. విశాఖ, తిరుపతి విమానాశ్రయాల నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీని అభివృద్ధి చేయాలని సూచించారు. 24 నెలల్లో రామాయపట్నం పోర్టు పూర్తి రాష్ట్రంలో పోర్టులు, సరుకు రవాణా తదితర అంశాలను సమీక్ష సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పోర్టులతో రోడ్లు, రైల్వేల అనుసంధానంపై వివరాలు అందచేశారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం తీసుకుంటున్న చర్యలు, పనుల పురోగతిపై సీఎం సమీక్షించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణాన్ని 24 నెలల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. తొలివిడతలో భాగంగా 25 మిలియన్ టన్నుల కార్గో రవాణా, నాలుగు బెర్తులు, రూ.2,647 కోట్ల వ్యయంతో అక్టోబరు 1 నుంచి రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. బ్రేక్ వాటర్ పనులను నవంబర్ మొదటివారంలో ప్రారంభిస్తామని, వచ్చే మే నాటికి కీలకమైన పనులు పూర్తిచేస్తామని తెలిపారు. భూ సేకరణ, సహాయ పునరావాస పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. అక్టోబర్ చివరికి భావనపాడు టెండర్లు భావనపాడు పోర్టుపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. అక్టోబరు చివరి నాటికి భావనపాడు పోర్టు టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. తొలిదశలో రూ.2,956 కోట్ల వ్యయంతో 15 మిలియన్ టన్నుల కార్గో రవాణా సామర్ధ్యంతో పనులు చేపడుతున్నట్లు చెప్పారు. 14లోగా బందరు పోర్టు టెండర్ల ప్రక్రియ పూర్తి మచిలీపట్నం పోర్టుకు సంబంధించి సెప్టెంబరు 14లోగా టెండర్ల ప్రక్రియ పూర్తి అవుతుందని అధికారులు తెలిపారు. తొలిదశలో రూ.3,650 కోట్ల వ్యయంతో 35 మిలియన్ టన్నుల కార్గో రవాణా సామర్థ్యంతో పనులు ప్రారంభించి 30 నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. మచిలీపట్నం తీర ప్రాంతంలో మట్టి ఎక్కువగా ఉన్నందున అనుసరించాల్సిన నిర్మాణ ప్రక్రియలపై అంతర్జాతీయ నిపుణులను సంప్రదించి వినూత్న విధానాలను పాటిస్తున్నట్లు చెప్పారు. ఫిషింగ్ హార్బర్ల ప్రగతిపై పరిశీలన రాష్ట్రంలో కొత్తగా నిర్మించనున్న 9 ఫిషింగ్ హార్బర్ల ప్రగతిపై అధికారులు వివరాలు అందచేశారు. మొదటి విడతలో 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె వద్ద ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ ప్రగతిపై సీఎంకు వివరాలు సమర్పించారు. వచ్చే ఏడాది మే – జూన్ నాటికి మొదటి విడత హార్బర్లను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. రెండో విడతలో బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, కొత్తపట్నం, వాడరేవుల వద్ద ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. సమీక్షలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్అండ్బి శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ కె.వెంకటరెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎం.ఎం.నాయక్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్ తదితరులు పాల్గొన్నారు. రూ.6,400 కోట్లతో నూతన రహదారులు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సహాయంతో రూ.6,400 కోట్ల వ్యయంతో కొత్త రోడ్ల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు లేన్లతో మంచి రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొంటూ ప్రాజెక్టు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం సూచించారు. జీర్ణించుకోలేకే వక్రీకరణలు – పనులు పూర్తి చేసి నెగిటివ్ ప్రచారాన్ని తిప్పికొడదాం: సీఎం జగన్ ముఖ్యమంత్రి పీఠంపై చంద్రబాబు లేకపోవడాన్ని పచ్చ మీడియా జీర్ణించుకోలేకపోతోందని, అందుకనే ప్రతి విషయంలో వక్రీకరణలు చేస్తోందని సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ ఒక్క చంద్రబాబుతోనే కాకుండా పచ్చమీడియాతోనూ మనం యుద్ధం చేస్తున్నామని చెప్పారు. నెగిటివ్ ప్రచారాన్ని కూడా పాజిటివ్‌గా తీసుకుని అడుగులు ముందుకు వేద్దామని అధికార యంత్రాంగానికి సూచించారు. మనం బాగా పనిచేసి పనులను పూర్తి చేస్తే నెగిటివ్ మీడియా ఎన్ని రాసినా ప్రజలు పట్టించుకోరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బాగు చేసిన రోడ్లే సాక్ష్యాలుగా.. మనం మరమ్మతులు చేసి బాగు చేశాక ప్రజలు ప్రయాణించే రోడ్లే సాక్ష్యాలుగా నిలబడతాయి. రోడ్లను బాగుచేయడానికి ఇప్పటికే చాలావరకూ టెండర్లు పిలిచాం. మిగిలిన చోట్ల ఎక్కడైనా జాప్యం చేస్తే వెంటనే టెండర్లు ఆహ్వానించాలి. అక్టోబరులో వర్షాలు ముగియగానే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయి నివేదికలు తెప్పించుకుని మరొకసారి నిశితంగా పరిశీలించి రోడ్ల మరమ్మతులపై దృష్టి కేంద్రీకరించాలి. సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి కార్యాచరణ రూపొందించాలి. -
సీఎం క్యాంపు కార్యాలయం ముస్తాబు
సాక్షి, అమరావతి: స్వాతంత్య్రదిన వేడుకలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం ముస్తాబయింది. రంగురంగుల విద్యుత్ దీపాలతో మెరిసిపోతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు సీఎంవోలో వేడుకలు ప్రారంభం కానున్నాయి. సీఎంవో ముఖ్య అధికారులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరిమిత సంఖ్యలోనే అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధం : విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ప్రదర్శన కోసం వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలు ముస్తాబయ్యాయి. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. -
ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అనిల్ కుంబ్లే
తాడేపల్లి: టీమిండియా మాజీ కోచ్, దిగ్గజ స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన.. సీఎం వైయస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురి మధ్య క్రీడల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఏపీలో స్పోర్ట్స్ యూనివర్శిటీ, క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఇరువురు చర్చించారు. ఈ రెండు ప్రాజెక్ట్‌ల ఏర్పాటుపై దృష్టి సారించాలని, దీనికి తన వంతు సహకారం అందిస్తానని కుంబ్లే సీఎంకు తెలిపారు. క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీలు ప్రస్తుతం జలంధర్, మీరట్ లాంటి నగరాల్లో మాత్రమే ఉన్నాయని, అక్కడి నుంచే అన్ని రకాల క్రీడా సామగ్రి సరఫరా జరుగుతుందని కుంబ్లే.. సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఏపీలో ఫ్యాక్టరీ పెడితే అందరికీ అందుబాటులో క్రీడా సామగ్రి ఉంటుందని ఆయన సీఎంకు వివరించారు. టీమిండియాకు టెస్ట్ కెప్టెన్‌గా, ప్రధాన బౌలర్‌గా వ్యవహరించిన అనిల్ కుంబ్లే.. భారత జట్టు ప్రధాన కోచ్ సహా బీసీసీఐలో పలు ఉన్నత పదవులు చేపట్టాడు. -
జగనన్న కాలనీల్లో.. 3 రోజుల్లో 3 లక్షల ఇళ్లు
సాక్షి, అమరావతి: పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కంకణం కట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో చేపట్టే ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా ప్రారంభించి.. వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో యంత్రాంగాన్ని సన్నద్ధం చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృఢ సంకల్పాన్ని ఆచరణలో పెట్టేందుకు అధికార యంత్రాంగం సమష్టి చర్యలు చేపడుతోంది. మూడు రోజుల పాటు మెగా గ్రౌండింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముహూర్తాలను సైతం ఖరారు చేసింది. మెగా వ్యాక్సినేషన్ స్ఫూర్తితో రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు మొత్తం యంత్రాంగం భాగస్వామ్యంతో రోజుకు లక్ష చొప్పున మూడు రోజుల్లో మూడు లక్షల పేదల ఇళ్లను గ్రౌండింగ్ చేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. జూలై 1, 3, 4 తేదీల్లో యజ్ఞంలా నిర్మాణాలను ప్రారంభించేలా సీఎం కార్యాలయం, గృహ నిర్మాణ శాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశాయి. ఈ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తిచేసేందుకు మునుపెన్నడూ లేని రీతిలో జిల్లాకో జాయింట్ కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా నియమించారు. వివిధ స్థాయిల్లో అధికారుల పర్యవేక్షణ ఈ కార్యక్రమంలో ప్రధానంగా గృహ నిర్మాణ, రెవెన్యూ, గ్రామ, వార్డు సచివాలయాలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం, మునిసిపల్ పట్టణాభివృద్ధి విభాగం, రవాణా, ఇంధన శాఖలు పూర్తిగా భాగస్వామ్యం కానున్నాయి. ఇందుకోసం ప్రతి మండలం, మునిసిపాలిటీలకు జిల్లాస్థాయి ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు. అలాగే ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి వార్డుకు డివిజనల్, మునిసిపల్, మండల స్థాయి అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నారు. ప్రతి లే–అవుట్‌కు గ్రామ, వార్డు సచివాలయ స్థాయి అధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నారు. వలంటీర్లను పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేస్తున్నారు. సోమవారం మండల, నియోజకవర్గ స్థాయి అధికారులకు ఈ కార్యక్రమంపై శిక్షణ ఇవ్వనున్నారు. 29వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ స్థాయి ఉద్యోగులు, వలంటీర్లకు శిక్షణ ఇస్తారు. 30వ తేదీన వలంటీర్లు తమ పరిధిలోని ఇళ్ల లబ్ధిదారులతో సమావేశమై మెగా గ్రౌండింగ్‌కు వారిని సమాయత్తం చేస్తారు. మూడు రోజులపాటు జరిగే ఇళ్ల మెగా గ్రౌండింగ్ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎక్కడికక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వాములవుతారు. లే–అవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇసుకను సిద్ధంగా ఉంచేందుకు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. లే–అవుట్లు దూరంగా ఉంటే.. సిమెంట్, ఇసుక అక్కడికి తరలించేలా లబ్ధిదారులకు వాహనాలు సమకూరుస్తారు. లే–అవుట్లలో ఇళ్ల గ్రౌండింగ్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు తీసి యాప్‌లో అప్లోడ్ చేసేలా ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, వలంటీర్లు ఫొటోలు ఏర్పాట్లు చేశారు. రికార్డు స్థాయిలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం: అజయ్ జైన్ గతంలో ఏడాదికి లక్షన్నరకు మించి ఇళ్ల నిర్మాణాలు జరగలేదని, ఇప్పుడు పేదల కోసం రికార్డు స్థాయిలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్‌జైన్ చెప్పారు. ముఖ్యమంత్రి నిర్ధేశించిన సమయంలోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ఉద్యమ స్ఫూర్తితో పని చేస్తోందన్నారు. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించడంతో పాటు వాటిని పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం మొత్తాన్ని భాగస్వామ్యం చేస్తూ మూడు రోజుల పాటు మెగా గ్రౌండింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. ఇందుకోసం లే–అవుట్ల వద్దకే ఇసుక, సిమెంట్ సమకూరుస్తున్నామని చెప్పారు. మెగా గ్రౌండింగ్‌కు సంబంధించిన వివరాలను ప్రత్యేకంగా డాష్ బోర్డులో ఎప్పటికప్పుడు నమోదు చేస్తామన్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత పెద్దఎత్తున ఒకేసారి పేదల కోసం ఇన్ని లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదన్నారు. ముఖ్యమంత్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు అధికార యంత్రాంగమంతా సమష్టి కృషితో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తుందన్నారు. చదవండి: మూడు నెలల్లో వైఎస్సార్ ఈఎంసీ ప్రారంభం -
అన్నను మించిన అండ
సాక్షి, అమరావతి: ‘జగనన్నా.. నాకు సొంత అన్న ఉంటే కూడా ఇంత సాయం చేసి ఉండరు. నాకు అన్న లేరని బాధ పడుతుంటే మీరు వచ్చి ఎంతో సాయం చేసి, ఆ లోటు తీర్చారు. దేవుడు ఎలా ఉంటారో తెలీదు కానీ మీరు మాకు ప్రత్యక్ష దైవం అన్నా..’ అని విశాఖ గాజువాకకు చెందిన మహిళా ఆటో డ్రైవర్ పైడిమాత భావోద్వేగంతో పేర్కొన్నారు. మా వెనుక జగనన్న ఉన్నారనే ధీమాతో బతుకుతున్నామని వైఎస్సార్ జిల్లా కడపకు చెందిన ఆటో డ్రైవర్ నాగూరు నాగయ్య, ఒక లీడర్ ఎలా ఉండాలో మీరు నిరూపించారని గుంటూరుకు చెందిన మరో ఆటోడ్రైవర్ మేడా మురళి శ్రీనివాసరావు ప్రశంసించారు. తమ గురించి ఇదివరకెన్నడూ ఎవరూ ఇంతగా ఆలోచించలేదని కొనియాడారు. వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద మంగళవారం వారు రూ.10 వేలు సాయం అందుకుంటూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడుతూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. సొంత వాహనం కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం వరుసగా మూడో ఏడాది, కరోనా కష్టకాలంలో కూడా ఈ పథకం కింద.. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి రూ.10 వేల చొప్పున 2.48 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.248.47 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో డ్రైవర్లతో పాటు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలను కండిషన్లో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎవ్వరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడపొద్దని కోరారు. మీ కుటుంబాలు బాగుండాలని, మీ వాహనాల్లో ప్రయాణించే వారు కూడా బాగుండాలని.. మనందరి రాష్ట్రం బాగుండాలని మనసారా కోరుకుంటున్నానని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు పన్నులు, చలానా రూపంలో భారీగా వడ్డించే వారని.. మన ప్రభుత్వం వచ్చాక పన్నులు, అపరాధ రుసుములు గణనీయంగా తగ్గాయని స్పష్టం చేశారు. రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా 95 శాతం హామీలను అమలు చేశామని చెబితే, 95 అన్యాయాలంటూ అవాస్తవాలతో టీడీపీ పుస్తకం ప్రచురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రభుత్వంలో ఆటోలపై బాదుడు తగ్గిస్తే.. పెంచామని అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. పండ్లు ఉన్న చెట్టుపైనే రాళ్లు పడతాయన్నట్లు.. మంచి చేసేవారి మీదే విమర్శలు అడ్డగోలుగా వస్తాయని పేర్కొన్నారు. మన ప్రభుత్వం మానవత్వంతో ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, అన్నకు, తమ్ముడికి తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తుంటే.. తెలుగుదేశం పార్టీ వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి.. – వరుసగా మూడో సంవత్సరం ప్రతి ఆటో డ్రైవర్‌కు మంచి చేసే కార్యక్రమమిది. సొంత వాహనం కలిగి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లగా ప్రతిరోజూ సేవలందిస్తూ, రోజూ లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్య స్థానాలకు చేరుస్తున్నారు. అలాంటి అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలందరికీ నా 3,648 కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో ఏలూరు సభలో 2018 మే 14న ఒక మాటిచ్చాను. ఆరోజు వాళ్లు నా దగ్గరకు వచ్చి ప్రభుత్వంలో బాదుడు ఎక్కువ అయింది, ఫెనాల్టీలు ఎక్కువ ఉన్నాయని మొర పెట్టుకున్నారు. – ఫెనాల్టీలు కట్టకపోతే ఆటో తిరగదని, రోజుకు రూ.50 ఫెనాల్టీ వేస్తున్నారని ఆవేదన చెందారు. ఇన్సూరెన్స్ కట్టాలంటే దాదాపు రూ.7,500 అవుతుందని చెప్పారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ రావాలంటే రిపేర్లు చేయించాలని, అన్నీ కలిపి దాదాపు రూ.10 వేలు ఖర్చవుతుందన్నారు. ఒకేసారి అంత కట్టాలంటే అప్పులు తీసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని చెప్పారు. వారి బాధలు విన్న తర్వాత ఆ మేరకు సాయం చేస్తానని ఆ రోజు ఏలూరు సభలో మాటిచ్చాను. – ఆ మాట నిలుపుకుంటూ ఈ రోజు మూడో ఏడాది కింద 2,48,468 మంది నా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు రూ.248.47 కోట్లు సహాయంగా వాళ్ల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. మొత్తంగా ఈ మూడేళ్లలో ఒక్క ఈ పథకం ద్వారా రూ.759 కోట్లు సాయం చేశాం. ఈ లెక్కన ఒక్కొక్కరికి రూ.30 వేల సహాయం అందినట్టవుతుంది. ఈ సంవత్సరం కొత్తగా మరో 42,932 లబ్ధిదారులకు సాయం చేశాం. నాడు పన్నుల బాదుడు.. నేడు ఊరట – గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు చలాన్ల రూపంలో భారీగా వడ్డింపులు ఉండేవి. గత ప్రభుత్వంలో 2015–16లో ఆటో నడుపుకుంటున్న డ్రైవర్ల నుంచి వసూలు చేసింది రూ.7.39 కోట్లు. 2016 –17లో రూ.9.68 కోట్లు. 2017–18లో రూ.10.19 కోట్లు. అలాగే 2018–19లో రూ.7.09 కోట్లు. – మన ప్రభుత్వంలో 2019–20లో వసూలు చేసింది రూ.68.44 లక్షలు మాత్రమే. ఇది కూడా కేవలం కాంపౌండింగ్ ఫీజు (సీఎఫ్)గా వసూలు చేశారు. 2020–21లో రూ.35 లక్షలు మాత్రమే. అంటే దీని అర్థం ఏమిటో ఆటోలు నడుపుకుంటున్న అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు బాగా తెలుసు. అన్ని అనుమతులు ఉంటే చలాన్లు కట్టే పరిస్థితి ఉండదు. ఇది మీ అన్న ప్రభుత్వం – ఈ రోజు 2.48 లక్షల మందికి అందిస్తున్న సహాయంలో ఎక్కడా, ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేదు. పారదర్శకంగా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయంలో ప్రదర్శించాం. ఇది మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం అని కచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఎవరికైనా ఈ పథకం రాకుండా పోతే ఎలా ఇవ్వాలి.. అని ఆలోచన చేసే ప్రభుత్వం. ఎలా ఎగరగొట్టాలని అని ఆలోచన చేసే ప్రభుత్వం కాదు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సహాయం చేశాం. – ఇప్పటికీ కూడా ఎవరైనా పొరపాటున మిగిలిపోయుంటే ఏమాత్రం ఆందోళన చెందవద్దు. ఇంకో నెలపాటు గడువు ఇస్తున్నాను. మీరు అర్హులై ఉంటే గ్రామ సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేయండి. వలంటీర్ల సహాయ, సహకారాలు తీసుకోండి. మీకు సహాయం అందేటట్టు చేస్తాను. – ఇంకా ఏమైనా సందేహాలుంటే 9154294326 నంబరుకో లేదా 1902 నంబరుకో కాల్ చేయండి. ఈ కార్యక్రమం బాగా జరిపించేందుకు ట్రాన్స్‌ఫోర్ట్ జాయింట్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశాం. వీరు మీకు తోడుగా ఉంటారు. – ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్) కె నారాయణస్వామి, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రవాణా శాఖ కమిషనర్ పీఎస్ఆర్ ఆంజనేయులు, ఇతర ఉన్నతాధికారులు, వాహనమిత్ర లబ్ధిదారులు హాజరయ్యారు. మహిళా డ్రైవర్ల సంఖ్య పెరగడం శుభపరిణామం ఓ వైపు కరోనా కష్టాలతో ఇక్కట్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10 సాయం చేస్తోంది. ఆటోల గిరాకీ తగ్గిన సమయంలో ఈ సాయం వారికి బాగా ఉపకరించింది. అత్యంత పారదర్శకంగా ఇవాళ 2,48,468 మందికి సాయం చేస్తోంది. వీరిలో 2,17,086 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన ఆటో ఓనర్ కం డ్రైవర్లు ఉన్నారు. మరో 26,397 మంది కాపు వర్గం వారు ఉన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనకు అగుణంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ వృత్తిలోకి రావడం శుభ పరిణామం. మహిళా డ్రైవర్లు తప్పులు చేయడం లేదని బ్రేక్ ఇన్స్పెక్టర్లు చెబుతున్నారు. అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంచి చేస్తుంటే టీడీపీ బురద చల్లుతోంది. – పేర్ని నాని, రవాణా, సమాచార శాఖ మంత్రి ఇలాంటి పథకం ఎక్కడా లేదు నవరత్నాలులో భాగం కానప్పటికీ మా శాఖకు 2019లో తొలి సంక్షేమ పథకానికి అవకాశం ఇచ్చారు. ఒక్కో ఆటో, టాక్సీ, మ్యాక్సీ కేబ్ ఓనర్ కం డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు సాయం చేస్తున్నారు. ఇవాళ మూడో సంవత్సరం సాయం అందిస్తుండటం సంతోషకరం. వలంటీర్లు ప్రతి లబ్ధిదారుడి దగ్గరకు వెళ్లి వాహనంతో పాటు ఫొటో తీసి, పారదర్శకంగా అర్హతను తనిఖీ చేసి ఆన్లైన్లో ఉన్న డేటాబేస్ క్రాస్ చెక్ చేసుకుంటూ అప్లోడ్ చేశారు. దేశం మొత్తం మీద చూస్తే ఇలాంటి పథకం ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో కరోనా వల్ల ఉన్న ఆర్థిక ఇబ్బందులను కూడా లెక్క చేయకుండా ఆర్థిక సాయం చేస్తున్నారు. – ఎంటీ కృష్ణబాబు, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఆడపిల్లగా ఏపీలోనే పుట్టాలన్నా అన్నా.. మీరు ఇచ్చే రూ.10 వేలు మాకు చాలా పెద్ద విషయం. మా ఆటోవాళ్ల కుటుంబాలకు ఇబ్బంది లేకుండా మీరు సాయం చేస్తున్నారు. మీ పథకాల వల్ల మేము ఎంతో లబ్ధి పొందుతున్నాం. ప్రత్యేకించి మహిళల కోసం మీరు తీసుకుంటున్న చర్యల పట్ల ఆనందంగా ఉంది. దిశ పోలీస్ స్టేషన్లు, అభయ యాప్ ద్వారా మాకు భద్రత ఉంటోంది. పుడితే ఏపీలో ఆడపిల్లగానే పుట్టాలి అన్నంతగా మీరు శ్రద్ధ తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు. – పైడిమాత, మహిళా ఆటోడ్రైవర్, విశాఖ -
Land Survey: సమగ్ర 'భూ సర్వే' పరుగెత్తాలి
సమగ్ర భూ సర్వే ఆలస్యం కాకూడదు. మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో సర్వేకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి. అక్కడ సిగ్నల్స్ సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి. సర్వే పనులకు ఇబ్బంది కలగకుండా కావాల్సిన వాటి కోసం ఆర్డర్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ 2023 జూన్ నాటికి రాష్ట్రంలో సమగ్ర భూసర్వే పూర్తి కావాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా రాష్ట్రంలో మంద గమనంలో ఉన్న సమగ్ర భూ సర్వే పనులను ఇక నుంచి పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2023 జూన్ నాటికి రాష్ట్రం అంతటా సమగ్ర భూసర్వే పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. సర్వే చురుగ్గా ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనుకున్న సమయంలోగా లక్ష్యం చేరాల్సిందేనని, క్రమం తప్పకుండా దీనిపై సమీక్షలు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో, అంకిత భావంతో ముందుకు సాగాలని సూచించారు. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం’పై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణాల్లో కూడా సమగ్ర సర్వేను వేగవంతం చేసేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తి అయితే అన్నింటికీ క్లియర్ టైటిల్స్ వస్తాయని, దీంతో ఎక్కడా భూ వివాదాలకు అవకాశం ఉండదని చెప్పారు. సచివాలయాల్లో అన్ని రకాల సేవలు ప్రజలకు అన్ని రకాల సేవలు అందించేలా గ్రామ, వార్డు సచివాలయాలు తయారు కావాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ప్రస్తుతం అందిస్తున్న జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో సహా ప్రజలకు అన్ని రకాల సర్టిఫికెట్లు సచివాలయాల్లోనే అందేలా చూడాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సచివాలయాల్లో కూడా కొనసాగాలని, సిబ్బంది శిక్షణ కార్యక్రమాల మాన్యువల్‌ను డిజిటల్ ఫార్మాట్లో పెట్టాలని ఆదేశించారు. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు డౌన్లోడ్ చేసుకుని సందేహాలు తీర్చుకునేలా దీనిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. యూజర్ మాన్యువల్, తరచుగా వచ్చే ప్రశ్నలకు సందేహాలు, అన్ని రకాల శిక్షణ కార్యక్రమాల వివరాలు డిజిటల్ ఫార్మాట్ ద్వారా సిబ్బందికి అందుబాటులో ఉంచాలన్నారు. ఒక డిజిటల్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. తొలి దశలో 4,800 గ్రామాల్లో సర్వే ► రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు సంబంధించి ఇప్పటికే 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, అవి పూర్తి కచ్చితత్వంతో పని చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో మరి కొన్ని గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, అవసరమైనన్ని డ్రోన్లను రంగంలోకి దించుతామని చెప్పారు. ► సర్వేలో పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే దాదాపు పూర్తి కాగా, తొలి దశలో 4,800 గ్రామాల్లో సర్వే చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఆ గ్రామాల్లో సమగ్ర సర్వే అనంతరం, డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రికార్డుల ప్యూరిఫికేషన్ పూర్తి చేసి, ముసాయిదా ముద్రిస్తామని చెప్పారు. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ మంత్రి) ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగరాలు, పట్టణాల్లో సర్వే ఇలా.. పట్టణాలు, నగరాల్లో కూడా సమగ్ర భూ సర్వేకు సంబంధించి ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సర్వే మొదలు పెట్టామని మున్సిపల్ అధికారులు సీఎంకు వివరించారు. మిగిలిన పట్టణాలు, నగరాలకు సంబంధించి మూడు దశల్లో స్పష్టమైన కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఫేజ్–1: 2021 జూన్‌లో ప్రారంభమై,2022 జనవరి నాటికి 41 పట్టణాలు, నగరాల్లో పూర్తి. ఫేజ్–2: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమై, 2022 అక్టోబర్ నాటికి 42 పట్టణాలు, నగరాల్లో పూర్తి. ఫేజ్–3: 2022 నవంబర్‌లో ప్రారంభమై, 2023 ఏప్రిల్ నాటికి 41 పట్టణాలు, నగరాల్లో పూర్తి. -
పేదవాడి భరోసా.. సీఎం జగన్: వాసిరెడ్డి పద్మ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదవాళ్లకు పెద్ద భరోసా.. సీఎం వైఎస్ జగన్ అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక పథకం కింద లబ్ధి పొందారని పేర్కొన్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి.. అందులోని హామీలను రెండేళ్లలోనే నెరవేర్చిన ఘనత సీఎం జగన్ సొంతమన్నారు. చెప్పినవే కాకుండా.. చెప్పనివి కూడా అమలు చేసి.. సీఎం జగన్ ప్రజలకు లబ్ధి చేకూర్చారని వివరించారు. కాగా, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఇంత మంది కుట్రలు పన్నుతున్నారంటే.. ఆయన పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా సీఎం జగన్ సంక్షేమ పాలన అందిస్తున్నారని చెప్పారు. -
నేడు రెండేళ్ల పాలనపై పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, అమరావతి: రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు నివేదించనున్న అంశాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకంలో మేనిఫెస్టోలో చెప్పినవాటితోపాటు చెప్పని అంశాలను కూడా ఈ రెండేళ్లలో ఎలా అమలు చేశారో వివరిస్తారు. అంతేకాకుండా ప్రజల దగ్గరకు ఆ పుస్తకాన్ని పంపించి.. అమలు తీరును పరిశీలించాల్సిందిగా కోరనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
మధ్య తరగతి ప్రజలకు ఉగాదికి ‘ప్లాట్లు’!
సాక్షి, అమరావతి: పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు తొలిదశలో మూడు లక్షల ఇళ్ల స్థలాలను వచ్చే ఏడాది ఉగాది రోజు (ఏప్రిల్ 2) ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. కోవిడ్ సమయంలో ఉపాధి హామీ ద్వారా కూలీలకు పనులు కల్పించడం చాలా ముఖ్యమని, జూన్ నెలాఖరులోగా ప్రతి జిల్లాలో తప్పనిసరిగా కోటి పని దినాలు కల్పించటాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. కొత్తగా నిర్మాణం చేపట్టనున్న మెడికల్ కాలేజీలన్నింటికీ ఈ నెల 30వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ‘జగనన్న తోడు’ పథకాన్ని జూన్ 8న, ‘వైఎస్సార్ వాహన మిత్ర’ జూన్ 15న, ‘వైఎస్సార్ చేయూత’ జూన్ 22న అమలు చేయనున్నట్లు ప్రకటించారు. లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి సామాజిక తనిఖీ చేపట్టి మార్పులు చేర్పులు చేయాలని ఆదేశించారు. ఈ నెల 31వతేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ ఏపీ పాల ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు తెలిపారు. జూన్ 1వ తేదీన పేదల ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సిందేనని, ఈలోగా మిగతా పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్‌కు సన్నద్ధమై రైతులకు అన్ని విధాలా అండగా నిలవాలని కలెక్టర్లు, జిల్లా అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ‘స్పందన’లో భాగంగా ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు అంశాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్ మధ్య తరగతి ప్రజలకు (ఎంఐజీ) ఇళ్ల స్థలాలు... పట్టణాల్లో మధ్య తరగతి ప్రజలకు తొలిదశలో 3 లక్షల ఇళ్ల స్థలాలను వచ్చే ఏడాది ఉగాది రోజు (ఏప్రిల్ 2న) ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వివాదాలు లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం 17 వేల ఎకరాల భూమి కావాలి. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల సేకరణ చేపట్టి మూడు కేటగిరీల్లో 133.33 గజాలు, 146.66 గజాలు, 194.44 గజాలలో ప్లాట్లు అభివృద్ధి చేసి లాభాపేక్ష లేకుండా అర్హులకు ప్లాట్లు కేటాయించాలి. వాటిలో భూగర్భ కేబుల్, విద్యుత్ వ్యవస్థ, వీధి దీపాలు, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, నీటి సరఫరా, వాటర్ డ్రెయిన్ల నిర్మాణం లాంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి. 14 టీచింగ్ ఆస్పత్రులకు 30న... రాష్ట్రంలో కొత్తగా 16 బోధనాస్పత్రులు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే పులివెందుల, పాడేరు ఆస్పత్రులకు భూమి పూజ జరిగింది. మిగిలిన 14 టీచింగ్ ఆస్పత్రులకు ఈనెల 30న ఒకేసారి శిలాఫలకాలు ఆవిష్కరించబోతున్నాం. ఆ మేరకు ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయండి. ఉపాధి హామీ పనులు కోవిడ్‌తో సహజీవనం తప్పదు. అదే సమయంలో అన్ని కార్యక్రమాలు యథావిథిగా జరగాలి. కోవిడ్ సమయంలో ఉపాధి హామీ పనులు చాలా ముఖ్యం. మనకు ఈ ఏడాది 20 కోట్ల పని దినాలు మంజూరయ్యాయి. వచ్చే నెల చివరిలోగా 16 కోట్ల పని దినాలు పూర్తి చేయాలన్నది మన లక్ష్యం. ఆ లక్ష్యం చేరాలంటే ప్రతి జిల్లాలో తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాలి. ఇప్పటివరకు అన్ని జిల్లాల్లో 7.41 కోట్ల పని దినాల కల్పన మాత్రమే జరిగింది. నిజానికి ఈ నెలలో మన టార్గెట్ 10.46 కోట్ల పని దినాలు. జూన్ చివరిలోగా ప్రతి జిల్లాలో తప్పనిసరిగా కోటి పని దినాలు పూర్తి చేయాల్సి ఉంది. జూన్ 1న ఇళ్ల నిర్మాణం మొదలు.. ఎట్టి పరిస్థితులలోనూ ఇళ్ల నిర్మాణం జూన్ 1న ప్రారంభం అవుతుంది. ఆ ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక పురోగతి (బూస్టప్) మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. స్టీల్, సిమెంట్ వినియోగం పెరుగుతుంది. మరోవైపు ఉపాధి దొరుకుతుంది. వీటన్నింటి వల్ల ఎకానమీ బూస్టప్ అవుతుంది. మ్యాపింగ్, జియో ట్యాగింగ్, ఏపీ హౌజింగ్ వెబ్సైట్లో లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, ఉపాధి హామీ పథకంలో జాబ్‌కార్డుల మ్యాపింగ్ లాంటివి చాలా చోట్ల పూర్తి కావాల్సి ఉంది. వచ్చే స్పందన కార్యక్రమం నాటికి అవన్నీ పూర్తి చేయాలి. ఆ మేరకు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. మోడల్ హౌస్ తప్పనిసరి.. ఎక్కడ ఇళ్ల నిర్మాణం చేయాలన్నా నీటి వసతి తప్పనిసరి. అన్ని లేఅవుట్లలో నీటి కనెక్షన్లు ఉండేలా చూడండి. తొలిదశలో 9,024 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం తలపెట్టగా వాటిలో 8,798 లేఅవుట్లలో నీటి సదుపాయం కల్పించాల్సి ఉంది. డిస్కమ్‌లు, గ్రామీణ నీటి సరఫరా విభాగాలతో కోఆర్డినేట్ చేసుకుని వెంటనే నీటి సదుపాయం కల్పించాలి. ఆ పనులన్నీ ఈనెల 31లోగా పూర్తి చేయాలి. కలెక్టర్లు క్రమం తప్పకుండా ఆర్డబ్ల్యూఎస్, రెవెన్యూ, డిస్కమ్ అధికారులతో సమీక్షించాలి. ఇప్పటికే పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చిన 3.84 లక్షల ఇళ్ల నిర్మాణాలు వెంటనే మొదలు పెట్టవచ్చు. ప్రతి లేఅవుట్లో తప్పనిసరిగా మోడల్ హౌస్ నిర్మించాలి. తొలిదశలో 9,024 లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం మొదలు పెడుతున్నా ఇప్పటి వరకు కేవలం 5,148 లేఅవుట్లలో మాత్రమే మోడల్ హౌస్‌లు కట్టారు. మిగిలిన వాటిలో కూడా వెంటనే పనులు పూర్తి చేయాలి. అప్పుడే మనకు నిర్మాణ వ్యయం కూడా తెలుస్తుంది. అన్ని లేఅవుట్లలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ కేబుళ్లు, నీటి సరఫరా వ్యవస్థ, ఫైబర్ కేబుళ్ల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టి పనులు చేయాలి. ఆ మేరకు అన్నింటిపై సమగ్ర ప్రాజెక్టు నివేదికలను వచ్చే నెల 20 కల్లా సిద్ధం చేసి పంపాలి. ఇక జూన్ 1న పనులు మొదలవుతాయి కాబట్టి అవసరమైన ఇసుక అందుబాటులో ఉండేలా చూడండి. 90 రోజుల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు మొత్తం 28,81,962 ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాల్సి ఉండగా అన్నింటినీ ఇవ్వడం జరిగింది. కోర్టు కేసులున్న 3,77,122 ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాల్సి ఉంది. ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్తగా 1,53,852 మంది అర్హులైన లబ్ధిదారులను గుర్తించాం. ఇంకా 40,990 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వారిలో కూడా అర్హులను గుర్తించండి. ఇప్పటికే గుర్తించిన అర్హులకు వెంటనే ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడంపై దృష్టి పెట్టండి. వారిలో 17,945 మందిని ఇప్పటికే ఉన్న లేఅవుట్లలో, మరో 2,964 మందికి కొత్త లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు ఇచ్చే వీలుంది. మిగిలిన 1,32,943 మందికి సంబంధించి భూసేకరణ జరగాలి. దీనిపై దృష్టి పెట్టి వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చొరవ చూపండి. ఇళ్ల నిర్మాణం.. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో 15.60 లక్షల ఇళ్లు మంజూరు చేశాం. వాటిలో పట్టణ ప్రాంతాల్లో 15.10 లక్షల ఇళ్లుండగా మిగిలినవి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.తొలి విడత ఇళ్లలో 14.89 లక్షల ఇళ్లకు సంబంధించి ఇప్పటికే మంజూరు పత్రాలు జారీ చేశాం. టిడ్కో ఇళ్లు: రాష్ట్రంలో 2,62,216 టిడ్కో ఇళ్ల నిర్మాణం జరుగుతుండగా వాటిలో 2,14,450 ఇళ్లకు సేల్ అగ్రిమెంట్ల పంపిణీ జరిగింది. ఇంకా 47,766 ఇళ్లకు సంబంధించి సేల్ అగ్రిమెంట్ పత్రాలు ఇవ్వాల్సి ఉంది. వాటిలో అనర్హులకు కేటాయించిన ఇళ్లతో పాటు సాఫ్ట్వేర్ సమస్యల వల్ల నిల్చిపోయిన ఇళ్లు ఉన్నాయి. కలెక్టర్లు చొరవ చూపి వీలైనంత త్వరగా వాటన్నింటిని పరిష్కరించాలి. ఖరీఫ్‌కు సన్నద్ధత: ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నందున రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఇచ్చే విత్తనాలు మొదలు ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఉండాలి. అది మనం (ప్రభుత్వం) ఇచ్చే అష్యూరెన్స్. కల్తీ లేని సర్టిఫైడ్ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలి. ఈ సీజన్లో 8.08 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీతో రైతులకు ఇవ్వాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 1.35 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు పంపిణీ జరిగింది. జూన్ 17 నాటికి వేరుశనగ విత్తనాల పంపిణీ పూర్తి కావాలి. వ్యవసాయ సలహా కమిటీలు.. అన్ని ఆర్బీకేల పరిధిలో వ్యవసాయ సలహా కమిటీలు ఏర్పాటు కావాలి. ఇప్పటి వరకు 10,498 ఆర్బీకేలకు సంబంధించి, 8,650 మాత్రమే ఆ కమిటీలు సమావేశమయ్యాయి. మిగిలిన చోట్ల కూడా ఆ కమిటీలు చురుగ్గా పని చేయాలి. కమిటీలు రైతులకు క్రాప్ ప్లానింగ్ ఇవ్వాలి. ఎరువులపై దృష్టి పెట్టాలి.. ఈ ఖరీఫ్‌లో 20.2 లక్షల టన్నుల ఎరువుల అవసరం ఉంటుందని అంచనా. ఆ మేరకు కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ప్రతి జిల్లాలో కలెక్టర్లు నీటి పారుదల సలహా బోర్డుల సమావేశాలు నిర్వహించాలి. జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆ పని చేయాలి. జాయింట్ కలెక్టర్లు తరచూ పర్యటించాలి. ఈ–క్రాపింగ్ ఎలా జరుగుతుందన్నది సమీక్షించాలి. ఎందుకంటే రైతుకు ఏ మేలు చేయాలన్నా ఈ–క్రాపింగ్ తప్పనిసరి. రూ.1.45 లక్షల కోట్ల రుణాలు.. జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలను కలెక్టర్లు ఏర్పాటు చేయాలి. అప్పుడే పంటల రుణాల పంపిణీ పక్కాగా ఉంటుంది. ఈ ఏడాది ఖరీఫ్, రబీకి సంబంధించి పంట రుణాలు, ఇతర రుణాలన్నీ కలిపి మొత్తం రూ.1,44,927 కోట్లు రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం. కౌలు రైతులకు కూడా ఈ ఖరీఫ్‌లో పంటల సాగు హక్కుల కార్డు (సీసీఆర్సీ)లు ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాలు జరగాలి. ఆర్బీకేల ద్వారా తమకు న్యాయం జరగలేదని ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయవద్దు. కాబట్టి కలెక్టర్లు ప్రతి రోజూ ఆర్బీకేలపై దృష్టి పెట్టాలి. రైతు సంతోషంగా ఉంటేనే..: రైతు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వం బాగా పని చేస్తోందని అర్ధం. రైతులు, వ్యవసాయాన్ని మనం బాగా చూసుకుంటే దాదాపు 62 శాతం ప్రజలకు మేలు చేసిన వాళ్లమవుతాం. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోండి. ఆక్వా గిట్టుబాటు ధరలు తగ్గకూడదు.. ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధరలు ప్రకటించాం. మార్కెట్లో అంతకన్నా ధరలు తగ్గితే కలెక్టర్లు వెంటనే జోక్యం చేసుకోవాలి. ఏ వ్యాపారీ రైతులను మోసం చేసే పరిస్థితి రాకూడదు. పంటలకు కచ్చితంగా గిట్టుబాటు ధర రావాలి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర తప్పనిసరిగా రైతులకు దక్కాలి. రైతులు నష్టపోకుండా కలెక్టర్లు చొరవ చూపాలి. ఈనెల, వచ్చే నెలలో పథకాలు, కార్యక్రమాలు ఈనెల 31న పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్ పాల సేకరణ మొదలు కానుంది. జూన్ 8న జగనన్న తోడు (చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం). జూన్ 15న వైఎస్సార్ వాహనమిత్ర. జూన్ 22న వైఎస్సార్ చేయూత (45 ఏళ్లకు పైబడిన మహిళలకు సాయం). అర్హులైన ఏ ఒక్కరికీ పథకం మిస్ కాకూడదు. కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి. ► దివంగత వైఎస్సార్ జయంతి రోజైన జూలై 8 నాటికి ఆర్బీకేల నిర్మాణం పూర్తి కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. కానీ చాలా పనులు జరగాల్సి ఉంది. మొత్తం 10,408 ఆర్బీకే భవనాల నిర్మాణం మొదలు పెడితే దాదాపు సగం మాత్రమే దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. మిగిలిన వాటిలో కొన్ని బేస్మెంట్, మరికొన్ని శ్లాబ్ లెవెల్లోనే ఉన్నాయి. వాటిపై కూడా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు (గ్రామీణ), ఏఎంసీయూ, బీఎంసీయూ, అంగన్వాడీ కేంద్రాలు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్‌ల భవనాల నిర్మాణాలను నిర్ధారించుకున్న సమయంలోగా పూర్తి చేయడంపై కలెక్టర్లు దృష్టి సారించాలి. ► సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ)ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతమ్ సవాంగ్, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
గ్రామ పాలనకు గౌరవం
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో 17 అవార్డులు పొందిన రాష్ట్రంలోని పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పురస్కారాలను ప్రదానం చేశారు. ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాగా పనితీరు కనబరిచిన పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నాలుగు కేటగిరీల్లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో అవార్డులు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గతేడాది రాష్ట్రానికి 15 అవార్డులు రాగా.. ఈసారి 17 వచ్చాయి. అవార్డుల పరంగా ఏపీ జాతీయ స్థాయిలో నాలుగో స్థానం దక్కించుకుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. దక్షిణ భారతదేశంలో ఏపీ మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఈ–పంచాయత్ కేటగిరీలో రాష్ట్ర స్థాయి రెండో అవార్డుతోపాటు, జిల్లా స్థాయిలో 2, మండల స్థాయిలో 4, పంచాయతీ స్థాయిలో 10 జాతీయ అవార్డులు ఈసారి రాష్ట్రానికి దక్కాయి. జిల్లా స్థాయి అవార్డు కింద రూ.50 వేలు, మండల స్థాయి అవార్డు కింద రూ.25 వేలు, పంచాయతీ స్థాయిలో జనాభాను బట్టి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు నగదు బహుమతి అందించారు. గ్రామ పంచాయతీల నుంచే ప్రారంభం కావాలి: ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఆ తర్వాత కంప్యూటర్లో బటన్ నొక్కి అవార్డులు పొందిన పంచాయతీలు, మండలాలు, జిల్లాల ఖాతాల్లో నగదు బహుమతి జమ చేశారు. అలాగే మరో బటన్ నొక్కి 7 రాష్ట్రాల్లోని 5 వేల గ్రామాల్లో ప్రాపర్టీ కార్డుల జారీని కూడా ప్రారంభించారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. కోవిడ్ కష్టకాలంలోనూ గ్రామ పంచాయతీలు గతేడాది నుంచి చాలా చక్కగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నందువల్ల పంచాయతీలు అదే స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు. కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడం గ్రామ పంచాయతీల నుంచే ప్రారంభమవ్వాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు వివిధ రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. ఈ–పంచాయత్ కేటగిరీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పురస్కారంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, కమిషనర్ గిరిజా శంకర్ అవార్డులు ప్రదానం చేసిన సీఎం జగన్ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతీయ స్థాయి అవార్డులను ప్రదానం చేశారు. ఈ–పంచాయత్ కేటగిరీలో రాష్ట్రస్థాయి రెండో అవార్డును పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ కమిషనర్ ఎం.గిరిజాశంకర్, జిల్లా స్థాయిలో.. గుంటూరు, కృష్ణా జిల్లాలు పొందిన అవార్డులు (దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారం) ఆ జిల్లాల జెడ్పీ సీఈవోలు డి.చైతన్య, పీఎస్ సూర్యప్రకాశరావు, మండలాల స్థాయిలో.. చిత్తూరు జిల్లా సొడెం, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్, కృష్ణా జిల్లా విజయవాడ రూరల్, అనంతపురం జిల్లా పెనుకొండ ఎంపీడీవోలు అవార్డులు అందుకున్నారు. అలాగే పంచాయతీల స్థాయిలో.. కర్నూలు జిల్లా వర్కూరు, విశాఖపట్నం జిల్లా పెదలబూడు, గుంటూరు జిల్లా గుల్లపల్లి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ కండ్రిగ, తాళ్లపాలెం, పార్థవెల్లంటి, పెన్నబర్తి, చిత్తూరు జిల్లా రేణిమాకులపల్లి, తూర్పుగోదావరి జిల్లా జి.రంగంపేట, ప్రకాశం జిల్లా కొడెపల్లి పంచాయతీలకు సీఎం పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ల్యాండ్ రికార్డ్స్ సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్దార్థజైన్తోపాటు వివిధ జిల్లాలు, మండల స్థాయి అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
ప్రతి ఇల్లూ సుభిక్షం.. ప్రతి ఒక్కరిలో ఆనందం
ప్లవ అంటే ఒక నావ అని అర్థం. ఈ సంవత్సరం బాగుంటుందని సిద్ధాంతి కూడా చెప్పారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవాలని, రైతులందరికీ మంచి జరగాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కోవిడ్‌పై జరిపే యుద్ధంలో మనం గెలవాలని ఆకాంక్షిçస్తున్నా. ప్రతి ఒక్కరికి ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: శ్రీ ప్లవ నామ సంవత్సరంలో రాష్ట్రంలో ప్రతి ఇల్లు సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరిగి ఆనందంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. ఉగాది సందర్భంగా దేవదాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారికంగా నిర్వహించిన పండుగ కార్యక్రమంలో సీఎం జగన్ సంప్రదాయ బద్ధంగా పంచె కట్టుకుని పాల్గొన్నారు. శ్రీ ప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి.. తొలి ప్రతిని ప్రభుత్వ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతుల సుబ్బరామ సోమయాజులుకు అందజేశారు. ఈ సందర్భంగా సోమయాజుల పంచాంగ పఠనాన్ని సీఎం జగన్ ఆసాంతం ఆలకించారు. అనంతరం సిద్ధాంతి అందజేసిన ఉగాది పచ్చడి స్వీకరించారు. అనంతరం సీఎం జగన్.. రాష్ట్ర ప్రజలందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చిన అర్చకుల బృందం సీఎం జగన్‌కు స్వామి వారి ప్రసాదాలు అందజేసి, ఆశీర్వదించింది. ఉగాది పండుగ సందర్భంగా శారదా పీఠం పంపిన శేషవస్త్రాలను పండితులు సీఎం జగన్‌కు అందజేశారు. ఉగాది సందర్భంగా నూతన పంచాంగం తొలి ప్రతిని సుబ్బరామ సోమయాజులుకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, అధికారులు ఈ ఏడాది చాలా అనుకూల పరిస్థితులు సిద్ధాంతి సోమయాజులు ఆధ్వర్యంలో జరిగిన పంచాంగ పఠనంలో..ప్లవ నామ సంవత్సరంలో రాష్ట్రమంతటా అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పారు. పాలన చేసే సీఎం వ్యక్తిగత జాతక రీత్యా గురువు సంచారంతో చాలా అనుకూలంగా ఉందని తెలిపారు. పంచాంగ ప్రభావానికి తోడు పరిపాలన చేసే వారి జాతకం బావుండటం మూలంగా గ్రహాలు రాష్ట్ర ప్రజలందరికీ అనుకూలిస్తాయన్నారు. ► ఈ ఏడాది మేఘాలు అన్ని ప్రాంతాల్లో చక్కగా వర్షిస్తాయి. వ్యాపారాలకు మంచి అనుకూలత ఉంది. ఈ ఏడాది అంతా బాగుంటుంది. ధన ధాన్యం సమృద్ధిగా చేకూరుతుంది. సుభిక్షం, సంక్షేమం, ఆర్యోగంతో రాష్ట్రమంతా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ► గురు, శుక్రుల ప్రభావంతో మంత్రి మండలి చాలా చక్కటి ఆలోచనలు చేయడంతో పాటు వాటి అమలును దిగ్విజయంగా కొనసాగిస్తుంది. ఈ కారణంతో ప్రభుత్వం, ప్రజలు చక్కటి ఫలితాలతో ముందుకెళ్లే పరిస్థితి. ఈ సంవత్సరం వాతావరణం సమతూకంగా నడుస్తుంది. ► గురువు ప్రభావంతో భూమి సస్యశ్యామలం అవుతుంది. పంటలు బాగా పండుతాయి. వర్షాలు బాగా కురవడం వల్ల చెరువులు, నదులు నీళ్లతో నిండుతాయి. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి అనుకూల అవకాశాలు పెరుగుతాయి. రైతులు, రైతు కూలీలు, శ్రామికులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభుత్వ పాలన కొనసాగడానికి అనుకూలత ఉంది. ► ఈ ఏడాది విద్య, వ్యవసాయం, ఆర్థిక రంగాలు అన్నీ బాగుంటాయి. గతేడాది కంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా మెరుగు పడుతుంది. అన్ని అనుకూల పరిస్థితులతో ప్రజలందరూ వ్యక్తిగతంగా, ఆర్థికంగా బలపడే అవకాశాలుంటాయి. ► వ్యవస్థాపరంగా ఆర్థిక పరిస్థితులు పుంజుకునే అవకాశం ఉంది. ఆనందంగా ఉన్నామని ప్రతి వారు అనుకునేలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం రాష్ట్రం ఎన్నో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. విద్యా విధానంలో కొత్త మార్పులు తీసుకొస్తారు. మంచి ప్రణాళికలు చేసే అవకాశం ఉంది. ► కరోనాను జయించడమే కాకుండా, ప్రజలందరికీ చక్కటి ఆరోగ్యం అందేలా ముందుకు సాగే పరిస్థితులు ఉంటాయి. రాబోయే కాలంలో అందరి మన్ననలు పొందేలా సీఎం వ్యక్తిగత జాతకం ఉంది. అందరితో స్నేహ భావంతో వ్యవహరిస్తూ రాష్ట్రం విజయాలు సాధిస్తుంది. ప్రభుత్వ పథకాల వివరాలతో క్యాలెండర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా రూపొందించిన తెలుగు సంవత్సర క్యాలెండర్‌లోనూ ఈ ఏడాది ఎప్పుడు ఏయే పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తారన్నది పొందుపర్చారు. క్యాలెండర్ తొలి పేజీలో అన్ని పథకాల వివరాలను, రెండో పేజీలో గత 22 నెలల కాలంలో అంటే, 2019 జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఏయే పథకాలలో ఎంత మందికి, ఎన్ని కోట్ల మేర ప్రయోజనం కల్పించారన్న వివరాలను ఇచ్చారు. మూడో పేజీలో అవ్వాతాతలకు ఆసరాగా అందిస్తున్న వైఎస్సార్ పింఛన్ కానుక వివరాలను ప్రచురించారు. ఆ తర్వాత వరుసగా ఏనెల, ఏయే పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తారన్నది వివరించారు. వేద పండితులు, అర్చకులకు సీఎం సత్కారం ► ప్రభుత్వ సిద్ధాంతి కప్పగంతుల సుబ్బరామ సోమయాజులుతో పాటు పలువురు అర్చకులు, వేద పండితులను సీఎం సత్కరించారు. ► విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు లింగంభట్ల దుర్గాప్రసాద్, ప్రకాశం జిల్లా మార్కాపురం అర్చకులు ఏవీకే నరసింహాచార్యులు, గుంటూరు జిల్లా తెనాలికి చెందిన అర్చకులు మామిళ్లపల్లి మృత్యుంజయప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు కోట రవికుమార్, వేద పండితులు ఆర్వీఎస్ యాజులు సీఎం జగన్ చేతుల మీదగా సత్కారం పొందారు. ► ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన వ్యవసాయ పంచాంగంతో పాటు, ప్రభుత్వ క్యాలెండర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
4 లేన్లుగా కరకట్ట రోడ్డు.. రూ.150 కోట్లతో విస్తరణ
సాక్షి, అమరావతి: అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలో భాగమైన కరకట్ట రోడ్డు నాలుగు లేన్లుగా విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. విశాఖపట్నం, ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలోని కీలక ప్రాజెక్టులపై సీఎం సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.150 కోట్లతో కృష్ణా కరకట్ట రోడ్డు నాలుగు లేన్లుగా విస్తరణ ప్రతిపాదన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి అందించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు రూ.150 కోట్లు ఖర్చు కానుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారుతుందని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ రోడ్డుకు ఆనుకుని ఉన్న రహదారులను కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. సీడ్ యాక్సెస్ రోడ్డును మెయిన్ రోడ్డుకు అనుసంధానం చేసే పనులు కూడా పూర్తి చేయాలన్నారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను కూడా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. విశాఖ తీరంలో ప్రతిపాదిత ప్రాజెక్టుపై సీఎం సమీక్ష విశాఖపట్నంలోని సముద్ర తీరంలో 13.59 ఎకరాల స్థలంలో ప్రాజెక్టు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. ఇదే భూమిని గత ప్రభుత్వం లులూ గ్రూపునకు కారుచౌకగా 33 ఏళ్ల లీజుకు కట్టబెట్టింది. తాజాగా ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేలా, విశాఖ నగరానికి తలమానికంగా రూపుదిద్దేలా పలు ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్బీసీసీ, ఏపీఐఐసీ సీఎంకు వివరాలు అందించాయి. కమర్షియల్ ప్లాజా, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాల వల్ల ప్రభుత్వానికి కనీసం సుమారు రూ.1,450 కోట్ల నికర ఆదాయం వస్తుందని ఎన్బీసీసీ వివరించింది. సీఎం సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, ఏఎంఆర్డీఏ కమిషనర్ పి.లక్ష్మీ నరసింహం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘పీఎం ట్రోఫీ’ విజేతలకు సీఎం అభినందన
సాక్షి, అమరావతి: రిపబ్లిక్ డే పరేడ్ పీఎం ట్రోఫీ అవార్డును గెలుచుకున్న ఎన్సీసీ కేడెట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వారు సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్సీసీ కేడెట్లు శ్రేయాసి భక్త, ఎ.శ్రీసాయిప్రియ, రొంగలి భార్గవి, చిలకపాటి జ్యోత్స ్న, ఎ.హరిప్రసాద్, బి.భరత్‌నాయక్, డీడీ నాగసురేష్, వి.రామ్‌ప్రశాంత్, పి.సతీష్ కుమార్‌రెడ్డిలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని సీఎం అందజేశారు. 2020–21 సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రైమ్ మినిస్టర్ ఛాంపియన్షిప్ బ్యానర్‌ను ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ గెలుచుకుంది. ఈ సందర్భంగా ఎన్సీసీ కేడెట్లతో పాటు సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో యూత్ సర్వీసెస్ అండ్ స్పోర్ట్స్ ముఖ్య కార్యదర్శి కె.రామ్‌గోపాల్, ఏపీ, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ డీడీజీ ఎయిర్ కమాండర్ టీఎస్ఎస్ కృష్ణన్, డైరెక్టర్ కల్నల్ ఎస్ నాగ్, గ్రూప్ కమాండర్ (కాకినాడ) కల్నల్ కేవీ శ్రీనివాస్, స్టేషన్ కమాండర్ (విజయవాడ) కల్నల్ నితిన్ శర్మ, కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెపె్టన్ పంకజ్ గుప్తా, తదితరులు ఉన్నారు. -
విద్వేషకారులను వదలొద్దు.. కఠినంగా శిక్షించాలి
రాజకీయ దురుద్దేశాలతో గుళ్లలో విధ్వంసాలు జరుగుతున్నాయి. ఎవరూ లేని ప్రదేశాల్లో, అర్ధరాత్రి పూట, అందరూ పడుకున్నాక, తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లోని గుడులపై దాడులు చేస్తున్నారు. వాటిలోని విగ్రహాలను పగలగొడుతున్నారు. ఆ మర్నాడు వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఆ వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి మీడియా సంస్థలు వాటిని అదే పనిగా ప్రసారం చేస్తున్నాయి. దాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్ష పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. విగ్రహాల విధ్వంసం ఘటనలను లోతుగా దర్యాప్తు చేయండి. ఆ ఘటనలకు బాధ్యులైన వారెవరో అందరికీ తెలిసేలా ప్రదర్శించండి. ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడేలా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి అన్యాయమైన పనులు చేసే వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదన్న సందేశం స్పష్టంగా ఇవ్వాలి. వారి పట్ల కఠినాతికఠినంగా వ్యవహరించాలి. సాక్షి, అమరావతి: కులాలు, మతాల మధ్య విద్వేషాలు పెంచుతూ, విగ్రహాలను ధ్వంసం చేసే వారి పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో ఎవరినీ లెక్క చేయొద్దని, ఉపేక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏవైనా ఘటనలు జరిగితే ఖండించాలని, మత సామరస్యం కోసం పాటుపడే వారికి సహకరించాలన్నారు. అలా కాకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించే వారికి గట్టి గుణపాఠం చెప్పాలని ఆదేశించారు. విగ్రహాలను ధ్వంసం చేసే పనులను చేపడితే మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాలని పునరుద్ఘాటించారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో నిర్వహించిన స్పందన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ దురుద్దేశాలతో గుళ్లలో విధ్వంసాలు ► సోమవారం పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రంలో పరిస్థితుల గురించి మాట్లాడాను. మనం డీల్ చేయాల్సిన పరిస్థితుల గురించి కూడా వివరంగా మాట్లాడాను. రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ జరుగుతోంది. ఇది చాలా కొత్త అంశం. ఎక్కడైనా దొంగతనాలు జరిగితే పోలీసులు పట్టుకునే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు పోయి కొత్త ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ► ఇంటింటికీ అనేక సంక్షేమ ఫలాలు అందిస్తుంటే.. జీర్ణించుకోలేక, తట్టుకోలేక దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎన్నో సేవలందుతున్నాయి. దీంతో ఏం చేయాలో తోచక, అలాంటి పనులకు ఒడిగడుతున్నారు. ► దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు రావాలనుకుంటున్నారు. ఇలాంటి నేరాలపై పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టాలి. కఠినంగా వ్యవహరించాలి ► వీటన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. ఇప్పటికే గుళ్లలో 36 వేల సీసీ కెమెరాలు పెట్టాం. ఆ విధంగా గుడులు, గోపురాలను రక్షించుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. నిజానికి గతంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. అంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ► ఈ రాజకీయ గెరిల్లా వార్ ఫేర్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మత సామరస్యం గురించి మాట్లాడే మాటలు ప్రచారం కావాలి. మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు పెంచే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. -
నేడు వైఎస్సార్ జిల్లాకు సీఎం జగన్
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పులివెందులలో ఆర్టీసీ బస్టాండు, డిపో నిర్మాణం, ఏపీ కార్ల్ భవనాల నిర్మాణం, ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలయ్యింది. 25న యూ.కొత్తపల్లిలో సీఎంచే ఇళ్ల పట్టాల పంపిణీ... ఈనెల 23వతేదీ సాయంత్రం 3.00 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి ముఖ్యమంత్రి కడప జిల్లా పర్యటనకు బయలుదేరతారు. రాత్రి ఇడుపులపాయ ఎస్టేట్‌లో బస చేస్తారు. 25వతేదీ మధ్యాహ్నం కడప నుంచి విమానంలో రాజమండ్రి చేరుకుంటారు. యూ.కొత్తపల్లిలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. -
పీఈటీ అభ్యర్థులు ప్రగతి భవన్ ముట్టడి
సాక్షి, హైదరాబాద్ : గురుకుల పీఈటీ మహిళా అభ్యర్థులు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ముట్టడించారు.. సోమవారం పెద్ద ఎత్తున మహిళలు విజిల్ సౌండ్లతో సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వరంగల్, నాగర్ కర్నూల్, మహాబూబ్‌నగర్, ఖమ్మం, కరీంనగర్ నుంచి ఈ ముట్టడికి భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. 2018 నుంచి గురుకుల పీఈటీ ఫలితాలు విడుదల చేయడంలేదని ఆందోళన చేస్తున్నామన్నారు. కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసును ప్రభుత్వం కౌంటర్ వేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: డీఎస్పీ లక్ష్మీ నారాయణ అరెస్ట్ 2017లో నోటిఫికేషన్ ఇచ్చి 2018లో పరీక్ష రాశామని, ఫలితాలు ఇప్పటికీ విడుదల చేయకపోవటంతో అభ్యర్తులు నిరసనకు దిగారు. కారుణ్య మరణాలే శరణ్యం అంటూ.. ప్రగతి భవన్ వద్ద మహిళా అభ్యర్థులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ రోడ్డుపై బైఠాయించారు. అభ్యర్థుల ఆందోళనతో క్యాంప్ ఆఫీస్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
ఐటీ నైపుణ్యాల కోసం యూనివర్సిటీ
సాక్షి, అమరావతి: ద్వితీయ శ్రేణి (టైర్–2) నగరాల్లో నిపుణులైన ఐటీ ప్రొఫెషనల్స్ కొరత సహజమని, దాన్ని తీర్చడానికి విశాఖపట్నంలో ఐటీ హై ఎండ్ స్కిల్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. టైర్–1 నగరాల్లో అయితే నిపుణుల కొరత అనే అంశం ఉత్పన్నం కాదు కాబట్టి సమస్యలుండవని, టైర్–2 నగరాల్లో వీరిని తయారు చెయ్యడానికి శిక్షణ అవసరమని ఆయన స్పష్టంచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రొబోటిక్స్ వంటి అత్యాధునిక అంశాల్లో అక్కడ శిక్షణ ఇవ్వాలని చెప్పారాయన. ఐటీ విధానంపై ముఖ్యమంత్రి మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హై ఎండ్ స్కిల్డ్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ప్రాంతంలోనే ప్రభుత్వ ఐటీ విభాగం కూడా ఉండాలని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రస్తుతం ప్రభుత్వం ఏటా రూ.3,000 కోట్ల విలువైన ఐటీ సేవలను వినియోగించుకుంటోంది. ఇదంతా ఐటీ విభాగం ద్వారానే జరుగుతోంది. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ఈ స్కిల్డ్ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో నైపుణ్యాన్ని మరింత పెంచడానికి వీలవుతుంది. ప్రభుత్వ ఐటీ విభాగం ఉండటం వల్ల విద్యార్థులకు అప్రెంటిస్ షిప్ సమస్య ఉండదు. ఉపాధి అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి’’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తద్వారా అత్యుత్తమమైన మానవ వనరులను తయారు చేసుకునే అవకాశం వస్తుందన్నారు. వీలైనంత త్వరగా ఈ యూనివర్సిటీ పనులు ప్రారంభించాలన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. – స్వదేశీ, విదేశీ ఐటీ దిగ్గజ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలి. – ఆయా కంపెనీలు ఇక్కడి విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా, వారిలో నైపుణ్యాన్ని పెంచేలా చూడాలి. – తద్వారా ఐటీ కంపెనీలకు తగినట్టుగా మానవ వనరులు సిద్ధం కావాలి. – ఏటా కనీసం రెండు వేల మందికి విశాఖ సంస్థలో శిక్షణ ఇవ్వాలి. – అక్కడ శిక్షణ పొందడం ప్రతిష్టాత్మకంగా భావించాలి. ఆ సర్టిఫికెట్లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి. – ఐటీలో డిమాండ్‌కు అనుగుణంగా డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులు కూడా ప్రారంభించాలి. – సమీక్షలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యంతోపాటు ఐటీ, పరిశ్రమల శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
జగనన్న దసరా కానుక
సాక్షి, అమరావతి: ‘రాయితీలు ఎంతో ఉపయోగపడతాయి. కోవిడ్ సమయంలో రాయితీలు ఇచ్చి ఆదుకున్నారు. జగనన్న ఇచ్చిన దసరా కానుక ఇది’ అని పలువురు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం అందించేందుకు ‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల మనోగతం ఇలా ఉంది. రూ.కోటి సబ్సిడీ.. ఇదే తొలిసారి వైఎస్సార్ గతంలో ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకు వచ్చారు. అయితే ఇవాళ్టి పాలసీ దేశంలోనే తొలిసారి. కోటి రూపాయల సబ్సిడీని ఎక్కడా ఇవ్వడం లేదు. నైపుణ్యాభివృద్ధి నుంచి ఉత్పత్తి వరకు అన్ని కోణాల్లోనూ ఆలోచించారు. ఎస్సీ, ఎస్టీలకు జగనన్న ఇచ్చిన దసరా కానుక ఇది. ప్రభుత్వంతో కలిసి మేం అడుగులు ముందుకు వేస్తున్నాం. డీఐసీసీఐ (దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నుంచి పూర్తి సహకారం అందిస్తాం. దేశంలోని దళిత పారిశ్రామిక వేత్తలతో రాష్ట్రంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. – నర్రా రవికుమార్, డీఐసీసీఐ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్సెంటివ్‌తో ఎంతో ఉపయోగం నేను నోట్బుక్లు తయారు చేస్తున్నాను. ఏడాదిలో కేవలం ఆరు నెలలు మాత్రమే మా యూనిట్ పని చేస్తుంది. ఈసారి కోవిడ్ వల్ల పాఠశాలలు ఆరు నెలలు వాయిదా పడ్డాయి. దీంతో యూనిట్ నడవక చాలా ఇబ్బంది పడ్డాం. ఈ పరిస్థితుల్లో మీరు ఇచ్చిన ఇన్సెంటివ్ ఎంతో ఉపయోగపడింది. నవరత్నాలు, ఇతర పథకాలతో ప్రతి కుటుంబంలో ఆనందం నిండింది. ప్రభుత్వ స్కూళ్లంటే ఉన్న చెడు భావన ఇప్పుడు పోయింది. – సి.సుజాత, సూరంపల్లి, గన్నవరం మండలం, కృష్ణా రూ.21 లక్షల సబ్సిడీ పొందాను నా పరిశ్రమలో 25 మంది ఉపాధి పొందుతున్నారు. రూ.45 లక్షల యంత్రాలకు రూ.15 లక్షల సబ్సిడీ వచ్చింది. విద్యుత్ చార్జీలో కూడా సబ్సిడీ ఇచ్చారు. ఆ విధంగా దాదాపు రూ.21 లక్షల సబ్సిడీ వచ్చింది. కరోనా కష్టకాలంలోనూ చిన్నతరహా పరిశ్రమలను ఆదుకున్నారు. దీంతో విజయవంతంగా నా పరిశ్రమను నడిపించుకోగలుగుతున్నాను. వివిధ పథకాల కింద రూ.60 వేలకుపైగా లబ్ధి కలిగింది. – సీహెచ్ ఏసుపాదం, ఐఎంఎల్ పాలిమర్స్ కంపెనీ, పశ్చిమగోదావరి మమ్మల్ని నిలబెట్టారు నేను డిప్లొమా చేశాను. ఒక ఫార్మా కంపెనీలో 17 ఏళ్లు పని చేశాను. ఆ తర్వాత రూ.12 కోట్లు పెట్టుబడితో సీపీఆర్ కంపెనీ స్థాపించి, బల్క్ డ్రగ్‌లు తయారు చేస్తున్నాను. తొలి ఏడాది చాలా ఇబ్బంది పడ్డాను. ఓ వైపు బ్యాంక్ ఈఎంఐ.. మరోవైపు మార్కెట్ లేదు.. ఇంకోపక్క కోవిడ్.. ఈ సమయంలో మీరు ఇచ్చిన రీస్టార్ట్ ప్యాకేజి నాతో పాటు నా దగ్గర పని చేస్తున్న 50 మంది కుటుంబాలకు పునర్జన్మలాంటిది. – డి.రవికుమార్, విశాఖపట్నం -
సీఎం సానుకూలంగా స్పందించారు
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను వివరించినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమకు రావాల్సిన బకాయిలు, రాయితీలు, ఎదుర్కొంటున్న సమస్యలను వివరించామని చెప్పారు. కరోనా కారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులకు నిలిపివేసిన 50 శాతం జీతాలను, మార్చి నెలలో నిలిపివేసిన పెన్షన్‌దారుల సగం పెన్షన్ వెంటనే చెల్లించాలని కోరామన్నారు. జూలై 1, 2018, జనవరి 1, 2019, జూలై 1, 2019 నుంచి బకాయి ఉన్న మూడు విడతల డీఏలను విడుదల చేయాలని అడిగామన్నారు. జూలై 1, 2018 నుంచి 55% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రాధాన్యత క్రమంలో ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్టు చెప్పారు. సీఎంను కలిసిన వారిలో సంఘ ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, రాష్ట్ర సహాధ్యక్షుడు సీహెచ్ పురుషోత్తమనాయుడు, ఉపాధ్యక్షుడు డీవీ రమణ ఉన్నారని చెప్పారు. -
అన్ని పథకాలకు అండగా నిలుస్తాం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలకు పూర్తి అండగా నిలుస్తామని, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి రుణాలు అందించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపబోమని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన 212వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ విజ్ఞఫ్తికి బ్యాంకర్లు సానుకూలంగా స్పందించారు. బ్యాంకులు ముందుంటాయి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా చిరు వ్యాపారులు, హస్తకళల కళాకారులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ దిశగా సహాయం చేయడానికి బ్యాంకులు కూడా ముందుకు వస్తాయి. – జి.రాజ్‌కిరణ్‌రాయ్, ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు వైఎస్సార్ జిల్లాలో నూరు శాతం డిజిటలైజేషన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలకు పూర్తి అండగా నిలుస్తాము. వైఎస్సార్ కడప జిల్లాలో నూటికి నూరు శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. లక్ష్యానికి అనుగుణంగా దాన్ని పూర్తి చేస్తాం. – వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ కోవిడ్ సంక్షోభంలోనూ పథకాలు కోవిడ్ సంక్షోభంలో కూడా సీఎం ఏ ఒక్క పథకాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఆర్బీకేల వద్ద బ్యాంక్ సేవలు కూడా అందాలి. అదే విధంగా కౌలు రైతుల సమస్యలు కూడా బ్యాంకులు పట్టించుకోవాలి. – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి ఎంఎస్ఎంఈలను ఆదుకున్నాం కోవిడ్ సంక్షోభంలోనూ ఎంఎస్ఎంఈలకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను సీఎం విడుదల చేశారు. ఆ నిధుల వల్ల ఎంఎస్ఎంఈ రంగం నిలదొక్కుకోగలిగింది. – మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి బ్యాంకుల భాగస్వామ్యం వల్లే సఫలీకృతం బ్యాంకుల భాగస్వామ్యం వల్లే అన్ని పథకాలు సఫలీకృతం అవుతున్నాయి. బ్యాంకులు అన్ని విధాలుగా సహకరిస్తున్నాయి. కోవిడ్ సమస్య ఉన్నప్పటికీ ఆరోగ్య, విద్యా రంగాలలో ఎక్కడా వెనుకబాటు లేదు. అన్ని పథకాలు అమలు చేస్తున్నాం. పంటల ఈ–క్రాపింగ్ కూడా జరుగుతోంది. స్కిల్డ్ మ్యాన్ పవర్ లోటు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. – నీలం సాహ్ని, సీఎస్ -
నిండు నూరేళ్లూ జీవించాలి
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక ► ఏటా రూ.510 కోట్ల ఖర్చుతో బియ్యం కార్డు ఉన్న 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా రక్షణ కల్పిస్తున్నాం. ఈ పథకంలో పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. ► ఆ జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని చెప్పాము. అర్హత ఉండీ కూడా ఎవరి పేర్లు అయినా ఆ జాబితాలో లేకపోతే వారు వెంటనే పేర్లు నమోదు చేసుకోవచ్చు. బీమా ప్రయోజనాలు ► ఈ పథకంతో 18–50 ఏళ్ల మధ్య ఉన్న లబ్ధిదారులు సహజంగా మరణిస్తే, వారి కుటుంబానికి రూ.2 లక్షల సహాయం అందుతుంది. ► 18–50 ఏళ్ల మధ్య ఉన్న వారు ప్రమాదవశాత్తు మరణించినా, లేక శాశ్వత అంగ వైకల్యానికి గురైనా రూ.5 లక్షల పరిహారం ఇస్తారు. ► 51–70 ఏళ్ల మధ్య ఉన్న వారు ప్రమాదవశాత్తు చనిపోయినా, లేక శాశ్వత అంగ వైకల్యానికి గురైనా రూ.3 లక్షల సహాయం చేస్తారు. ► 18–70 ఏళ్ల మధ్య ఉన్న వారికి పాక్షిక శాశ్వత అంగ వైకల్యం సంభవిస్తే రూ.1.5 లక్షల పరిహారం ఇస్తారు. సాక్షి, అమరావతి: ఏ ఒక్క కుటుంబం బాధ పడకూడదనే లక్ష్యంతో వైఎస్సార్ బీమా పథకాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా నిండు నూరేళ్లు బతకాలని కోరుకునేది మా ప్రభుత్వం అని అన్నారు. సంపాదించే వ్యక్తిని కోల్పోతే ఏ ఒక్క నిరుపేద కుటుంబం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. ఏదైనా ప్రమాదం జరిగి కుటుంబ పెద్ద చనిపోతే, క్లెయిమ్ పొందడానికి 15 రోజులు పడుతుందని.. ఆలోగా ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10 వేలు ఇస్తారని తెలిపారు. ఇది పథకంలో లేకపోయినా, కొత్తగా అమలు చేయబోతున్నామని అన్నారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో బియ్యం కార్డులున్న 1.41 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కల్పించే విధంగా ‘వైఎస్సార్ బీమా’ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ బీమా పథకం ప్రారంభ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి – ఈ పథకంలో ప్రీమియమ్ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఆ తర్వాత బ్యాంకర్లు ఆ నగదును బీమా కంపెనీలకు ప్రీమియమ్గా చెల్లిస్తారు. – ఆ తర్వాత ఒక వారంలో వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి బీమా కార్డులు అందజేస్తారు. – లబ్ధిదారులకు ఏ సమస్య వచ్చినా.. గ్రామ, వార్డు సచివాలయాలు రెఫరల్ పాయింట్‌గా ఉంటాయి. – కంప్యూటర్లో బటన్ నొక్కి ‘వైఎస్సార్ బీమా’ పథకాన్ని ప్రారంభించిన సీఎం.. బ్యాంకర్లు, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి వేర్వేరుగా మొత్తం రూ.510 కోట్ల చెక్కులు అందజేశారు. పలువురు లబ్ధిదారులకు బీమా కార్డులు అందజేశారు. – ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, గుమ్మనూరు జయరామ్, సీఎస్ నీలం సాహ్ని, పంచాయతీ రాజ్, కార్మిక ఉపాధి కల్పన శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకులు, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ పథకంలో లబ్ధిదారులను పూర్తి పారదర్శకంగా ఎంపిక చేశారు. గ్రామ వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. గతంలో ఉన్నట్లు కాకుండా ఈ పథకం నుంచి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తప్పుకున్నప్పటికీ 1.41 కోట్ల కుటుంబాలకు మేలు కలిగేలా రూ.510 కోట్ల ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. -
సీఎం క్యాంప్ కార్యాలయం ఒకచోటే ఉండాల్సిన అవసరం లేదు
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఒకచోటే ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. సీఆర్డీఏ చట్టంలో, ఈ చట్టం కింద నోటిఫై చేసిన మాస్టర్ ప్లాన్‌లో సీఎం క్యాంపు కార్యాలయం గురించి స్పష్టమైన నిర్వచనం, ప్రస్తావనేవీ లేవంది. ప్రతి జిల్లాలో తనకు నచ్చిన వసతిని క్యాంపు కార్యాలయంగా మార్చుకునే స్వేచ్ఛ సీఎం కార్యాలయానికి ఉందని తెలిపింది. ప్రస్తుత క్యాంపు కార్యాలయం నుంచే పనిచేయాలని సీఎంను ఒత్తిడి చేసే హక్కు పిటిషనర్లకు లేదంది. అలాగే జిల్లాల్లో దేన్నీ క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకోకూడదని చెప్పే హక్కు కూడా వారికి లేదని స్పష్టం చేసింది. అమరావతి నుంచి రాజ్‌భవన్, సచివాలయం, ఇతర శాఖా«ధిపతుల కార్యాలయాలను, పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ను విశాఖపట్నంకు తరలించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు ఈ నెల 6న విచారణ జరిపింది. ఈ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం సీఎం క్యాంపు కార్యాలయం అంటే ఏంటి? అది ఎక్కడ ఉండాలని ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడిగింది. ఈ వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు కౌంటర్ దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన యథాతథస్థితి ఉత్తర్వులు కేవలం సీఆర్డీఏ పరిధిలో ఉన్న కార్పొరేషన్లకే వర్తిస్తాయని కౌంటర్లో పేర్కొన్నారు. సీఆర్డీఏ పరిధిలో విజయవాడ, గుంటూరుల్లో ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్, ఏపీ రాజీవ్ స్వగృహ, ఏపీఎండీసీ, ఏపీటీడీసీ, ఏపీ రోడ్ డెవలప్మెంట్, ఏపీ బేవరేజస్, ఏపీ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్, ఏపీ స్టేట్ క్రిస్టియన్ (మైనారిటీస్) ఫైనాన్స్, ఏపీ సేŠట్ట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లు, జెన్కో, ట్రాన్స్‌కో, ఏపీఐఐసీ, తదితరాలు ఉన్నాయన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టేయాలని అభ్యర్థించారు. -
గతంలోనూ ఇదే సాంప్రదాయం: అడ్వకేట్ జనరల్
-
సీఎం క్యాంపు కార్యాలయమంటే?
సాక్షి, అమరావతి: పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో మంగళవారం నుంచి అంశాలవారీగా ప్రారంభమైన విచారణ ఎక్కువ సమయం ‘ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం’ చుట్టూనే తిరిగింది. తొలుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, ఆ తరువాత జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ సత్యనారాయణమూర్తి వరుసగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్‌కు ప్రశ్నలు సంధించారు. సీఎం క్యాంపు కార్యాలయం అంటే అర్థం ఏమిటి? క్యాంపు కార్యాలయాలు ఏ సందర్భాల్లో ఏర్పాటు చేస్తారు? అసలు వేటిని క్యాంపు కార్యాలయాలంటారు? శాశ్వత నిర్మాణాన్ని క్యాంపు కార్యాలయంగా చెప్పొచ్చా? సీఆర్డీఏ చట్టంలో సీఎం క్యాంపు కార్యాలయం ప్రస్తావన ఉందా? గతంలో ఎప్పుడైనా సీఎం క్యాంపు కార్యాలయాల ఏర్పాటు, వినియోగం జరిగిందా? అని హైకోర్టు ప్రశ్నించింది. పలుచోట్ల చంద్రబాబు క్యాంపు కార్యాలయాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన స్వగ్రామం నారావారి పల్లెలో ఒక క్యాంపు కార్యాలయం, హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో మరో క్యాంపు కార్యాలయాన్ని నడిపారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వాటికి అయిన వ్యయాన్ని ఖజానా నుంచి రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని తెలిపారు. దీనిపై కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ పేర్కొనటంతో సీఎం క్యాంపు కార్యాలయం, పలు కార్పొరేషన్ల కార్యాలయాల తరలింపు అంశాలపై విచారణను ఈ నెల 9కి వాయిదా వేస్తూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మాకు అలాంటి ఉద్దేశమేదీ లేదు.. సీఎం క్యాంపు కార్యాలయం గురించి సీఆర్డీఏ చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదని, సీఆర్డీఏ పరిధిలోనే సీఎం కార్యాలయం ఉండాలని ఎక్కడా లేదని ఏజీ తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ ముఖ్యమంత్రి ఇతర జిల్లాలకు వెళ్లినప్పుడు కొన్ని రోజులు ఉండి అధికారిక కార్యకలాపాలు నిర్వహించడానికి ఉద్దేశించిందే క్యాంపు కార్యాలయమని పేర్కొంది. సీఎం తాత్కాలికంగా ఉండి పాలనా కార్యకలాపాలు నిర్వహిస్తే ఇబ్బంది లేదని, శాశ్వత భవనం కడితే దాన్ని ఎలా పరిగణించాలని ప్రశ్నించింది. దీనిపై ఏజీ సమాధానమిస్తూ క్యాంపు కార్యాలయం ఏర్పాటు అన్నది ప్రస్తుత చట్టాల పరిధిలోకి రాని అంశమని చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ముఖ్యమంత్రిని పనిచేయకుండా తామేమీ నిరోధించడం లేదని, తమకు అలాంటి ఉద్దేశం ఏదీ లేదని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. రాజధానికి సంబంధించి విశాఖపట్నం, కర్నూలులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ దాఖలైన వ్యాజ్యంపై కూడా ఈ నెల 9న విచారణ జరుపుతామని ప్రకటించింది. ఆ కథనంపై.. మా అసంతృప్తిని తెలియచేస్తున్నాం పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో మంగళవారం నుంచి అంశాలవారీగా విచారణ ప్రారంభమైన సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి సాక్షి పత్రికలో వచ్చిన ఓ కథనం గురించి ప్రస్తావించారు. దీనిపై తన అసంతృప్తిని తెలియచేస్తున్నట్లు ఏజీ శ్రీరామ్‌కు తెలిపారు. ఏ పత్రికైనా వాదనల సమయంలో జరగని సంభాషణలను రాయడం మంచిది కాదని, ఆ కథనం గురించి తనకు సోదర న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి చెప్పారని తెలిపారు. అనంతరం జస్టిస్ సత్యనారాయణమూర్తి ఏజీని ఉద్దేశించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఎన్నో చెబుతుందంటూ హైకోర్టు వ్యాఖ్యానించినట్లు సాక్షి పత్రికలో వచ్చిందన్నారు. తాను ఊర్లో లేనని, అందులో ఏం వచ్చిందో చూడలేదని, కోర్టు ప్రొసీడింగ్స్‌ను ఎవరూ తప్పుగా రాయడానికి వీల్లేదని ఏజీ శ్రీరామ్ పేర్కొన్నారు. న్యాయమూర్తులే చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి కథనం.. బార్ కౌన్సిల్ సభ్యుడు యర్రంరెడ్డి నాగిరెడ్డి జోక్యం చేసుకుంటూ జడ్జీల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని, ఆ విషయాన్ని న్యాయమూర్తులే చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి కథనం రాసిందన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్‌ను రోజూ తప్పుగా రాస్తున్నారన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉందని, అందువల్ల దీనిపై తామేమీ మాట్లాడబోమని పేర్కొంది. తప్పుగా వార్తలు రాసే పత్రికలపై న్యాయపరంగా ఏవైనా చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చని నాగిరెడ్డికి సూచించింది. -
మహాత్ముడికి సీఎం జగన్ నివాళి
-
మహాత్ముడికి సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి: జాతిపిత మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటాలకు పూలమాలు వేసి నివాళులు ఆర్పించారు. దేశానికి వారు అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌తో పాటు డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యానారాయణ, బాలీనేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
అధికోత్పత్తికి బీజం
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, పశు గ్రాస విత్తనాలు, చేపల ఫీడ్ తదితర అవసరాలకు సంబంధించి ఆర్బీకేల ద్వారా ఇప్పటి వరకు 2.17 లక్షల ఆర్డర్లు రాగా, 69,561 మెట్రిక్ టన్నులు రైతులకు సరఫరా చేశాం. ఆర్బీకేల వద్ద డిజిటల్ పేమెంట్లు కూడా అనుమతిస్తున్నారు. ఇప్పటికే 38 వేల ఆర్డర్లకు డిజిటల్ పేమెంట్లు జరిగాయి. ఖరీఫ్ సీజన్లో ఎరువులకు సంబంధించి 2 లక్షల ఆర్డర్ల మేరకు సరఫరా చేశాం. –సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందించడం వల్ల రైతులు అధికోత్పత్తి సాధించగలుగుతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ఏర్పాటు ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ కేంద్రాలు రైతులకు అన్ని విధాలా సహాయ కారిగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్బీకేల నుంచి రైతుల ఇళ్లకే నేరుగా ఎరువుల సరఫరా కోసం పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) వర్షన్, ఎస్ఎంఎస్ సర్వీసును బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ, ఆ శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవియా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. తాడేపల్లి క్యాంపు కార్యాయం నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. తద్వారా రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) నుంచి రైతులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇవ్వడంతో పాటు ఎరువుల హోం డెలివరీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్బీకేల పనితీరుపై పదర్శించిన వీడియో చిత్రం సంతోషంగా ఉంది.. ► మీతో (కేంద్ర మంత్రులు) కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను నేరుగా రైతులకు అందించడం వల్ల సాగు ఖర్చు తగ్గుతుంది. ► రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద మే 30న 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీటిలో డిజిటల్ కియోస్క్, స్మార్ట్ టీవీ, వైట్ బోర్టు, కుర్చీలు, డిజిటల్ లైబ్రరీతో పాటు, భూసార పరీక్షకు అవసరమైన ఉపకరణాలు ఏర్పాటు చేశాం. ► రైతులు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను డిజిటల్ కియోస్క్‌ల ద్వారా బుక్ చేసుకుంటే, 24 గంటల నుంచి 48 గంటలలోగా వాటిని సరఫరా చేస్తాం. ► వీటి నిర్వహణ బాధ్యత కోసం బీఎస్సీ (అగ్రికల్చర్) గ్రాడ్యుయేట్లను వ్యవసాయ సహాయకులు, ఉద్యాన సహాయకులు, ఆక్వా సహాయకులుగా నియమించాం. వ్యవసాయం, హార్టికల్చర్, సెరికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్, సహకార, నీటిపారుదల తదితర రంగాలన్నింటిలోనూ సేవలకు ఒకే వేదికగా ఆర్బీకేలు పని చేస్తున్నాయి. ► ప్రభుత్వం ధ్రువీకరించిన నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులతో పాటు, పశు సంవర్థక, మత్స్యసాగుకు అవసరమైన వాటిని కూడా ఆర్బీకేల ద్వారా అందజేస్తున్నాం. అత్యాధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు శిక్షణ ఇస్తున్నాం. ఆర్బీకేలదే కీలక పాత్ర ► ఆర్బీకేల వద్ద 155251 నంబర్‌తో ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఇప్పటి దాకా ఈ సెంటర్‌కు రైతుల నుంచి 46,500 కాల్స్ వచ్చాయి. ► కోవిడ్ సమయంలోనూ 15 రకాల పంటలకు సంబంధించి 6.9 లక్షల టన్నుల విత్తనాలను 13.64 లక్షల రైతులకు ఆర్బీకేల ద్వారా సరఫరా చేశాం. ఈ–క్రాప్ బుకింగ్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 49.14 లక్షల మంది రైతుల పేర్లు, 1.12 కోట్ల ఎకరాలలో సాగు చేస్తున్న పంటల వివరాలు నమోదు చేశాం. ► లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శిస్తున్నాం. మార్కెట్ ఇంటెలిజెన్స్, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) సమాచారం అందిస్తున్నాం. రైతుల సందేహాలు తీరుస్తున్నాం. ధాన్యం సేకరణ కేంద్రాలుగా కూడా ఆర్బీకేలు పని చేయనున్నాయి. పంట సాగుకోసం ఒక్కో రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 ఇస్తున్నాం. ► ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీ ముందంజలో ఉంది కేంద్రం అమలు చేసే ఏ పథకానికి అయినా ఏపీ చాలా సహకరిస్తోంది. మా ప్రభుత్వం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రానికి ఎరువులు, పురుగు మందులు కావాలని సీఎం జగన్ పలుమార్లు కోరారు. ఆ మేరకు మేము సహకరించాం. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) బాగా సక్సెస్ అయింది. ఎరువుల పంపిణీలో ఎక్కడా అవకతవకలు జరగవు. లీకేజీ ఉండదు. ఇవాళ రైతులకు ఎస్ఎంఎస్ సర్వీస్‌తో పాటు, ఎరువుల హోం డెలివరీ ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. రైతులకు మేలు చేయడంతో పాటు, ఈ రంగంలో సంస్కరణల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందంజలో ఉంది. – డీవీ సదానందగౌడ, కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డ్యాష్ బోర్డుల ద్వారా రైతులకు ప్రయోజనం కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ నుంచి ఇవాళ రెండు మంచి పనులు మొదలవుతున్నాయి. దాదాపు 54 కోట్ల మంది రైతుల కోసం ప్రత్యేకంగా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేశాం. దేశంలో ఏ మేరకు ఎరువుల ఉత్పత్తి జరిగింది? ఎంత స్టాక్ ఎక్కడ ఉంది? డిస్ట్రిబ్యూటర్స్ వద్ద ఎంత సరుకు ఉందన్నది ఆ బోర్డు ద్వారా తెలుసుకోవచ్చు. రైతులకు నేరుగా సబ్సిడీ చెల్లింపు వల్ల వారికి ఎంతో మేలు కలుగుతుంది. దేశంలోని అన్ని గిడ్డంగులలో ఎరువులు నిల్వ ఉంటాయి కాబట్టి కొరత ఉండదు. బుక్ చేసుకున్న 72 గంటల్లో రైతులకు ఎరువులు అందించడం నిజంగా అభినందనీయం. – మన్సుఖ్ మాండవియా, కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి -
మన రాష్ట్రానికి పేరు తెచ్చేలా పని చేయండి
సాక్షి, అమరావతి: ఏ రాష్ట్ర కేడర్‌లో పనిచేసినా ఏపీకి పేరు తెచ్చేలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని సివిల్స్ విజేతలకు సీఎం వైఎస్ జగన్ సూచించారు. రాష్ట్రం నుంచి ఇటీవల సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన 10 మంది మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి అభినందించారు. వృత్తిలో రాణించి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని సూచించారు. -
వారానికి రూ.10 కోట్ల విలువైన పనులు
ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్‌కు సంబంధించి రూ.1,124 కోట్లు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురంలో ఆ నిధులు ఎక్కువ ఖర్చు కావాల్సి ఉంది. ఉపాధి హామీ పనులకు సంబంధించి అన్ని బిల్లులను అక్టోబర్ మొదటి వారంలో క్లియర్ చేస్తాం. సాక్షి, అమరావతి: ఉపాధి హామీ కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వారానికి రూ.10 కోట్ల విలువైన పనులు చేయాలని సీఎం వైఎస్ జగన్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అందుకోసం సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, అంగన్వాడీ కేంద్రాలు, బల్క్ మిల్క్ యూనిట్లు, ప్రహరీల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇవన్నీ విజయవంతంగా చేపడితే, అదనంగా మరో రూ.5 కోట్ల విలువైన పనులకు అనుమతి ఇస్తామని చెప్పారు. స్పందనలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి ఉపాధి హామీ పనులపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ► రాష్ట్రంలో 7,529 బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు సకాలంలో ఏర్పాటు చేయాలి. లక్ష్యం ప్రకారం పనులు పూర్తి చేయాలి. ► వచ్చే ఏడాది మార్చి 31 నాటికి సచివాలయాల భవనాలు పూర్తి కావాలన్నది లక్ష్యం. తూర్పు గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాలలో పనులు మందకొడిగా సాగుతున్నాయి. ► మొత్తం 10,408 ఆర్బీకే భవనాలు మంజూరు కాగా, వాటిలో 10,383 భవనాలు ఏర్పాటయ్యాయి. ఇంకా 25 పెండింగ్‌లో ఉన్నాయి. వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్‌కు సంబం«ధించి 1,269 భవనాలు బేస్మెంట్ లెవెల్ (బీఎల్) దాటలేదు. తూర్పు గోదావరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఈ పనిలో వెనకబడి ఉన్నాయి. ► వీటన్నింటినీ వెంటనే ఉపాధి పథకం కింద పూర్తి చేయండి. గ్రామ ఇంజనీరింగ్ సహాయకులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. మెజర్మెంట్స్ రికార్డింగ్ కోసం వారి సేవలు ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఏఈఈలు, డీఈలు చొరవ చూపాలి. పంచాయతీ రాజ్, గ్రామీణ నీటి సరఫరా, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగాలు.. వారికి పని కల్పించాలి. -
5న జగనన్న విద్యా కానుక
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా పలు కీలక విషయాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు మార్గనిర్దేశం చేశారు. నవంబర్ 2న స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో అక్టోబర్ 5న విద్యార్థులకు విద్యా కానుక పంపిణీ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఇదే రోజున పంటలకు గిట్టుబాటు ధరలను ఆర్బీకేలలో ప్రదర్శించాలని చెప్పారు. జేసీలు తరచూ సచివాలయాలను సందర్శించాలని, ప్రజలకు అందించే సేవల్లో వేగం పెరగాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని పునరుద్ఘాటించారు. కోవిడ్ సోకిన వారికి ఖర్చు లేకుండా చికిత్స చేయించడం బా«ధ్యతగా తీసుకోవాలని సూచించారు. అన్యాయమైన ప్రతిపక్షం, అదే మైండ్ సెట్ గల ఎల్లో మీడియా వల్ల ప్రతి మంచి పనీ ఆలస్యమవుతోందని, అవాస్తవాలు ప్రచారం చేస్తే నిలదీయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించే ప్రక్రియలో జాయింట్ కలెక్టర్లు కాస్త నెమ్మదిగా ఉన్నారు. వారానికి కనీసం నాలుగుసార్లు సచివాలయాలు సందర్శించి నివేదికలు పంపాలి. కలెక్టర్లు కూడా ఇంకాస్త చొరవ చూపాలి. జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయాలను ఓన్ చేసుకోవాలి. ఎందుకంటే అవి గ్రామ స్థాయిలో పౌర సేవలకు ఎంతో కీలకం కాబట్టి. గ్రామ, వార్డు సచివాలయాల ప్రాతిపదికనే కలెక్టర్లు, జేసీల పని తీరును అంచనా వేస్తాం. సాక్షి, అమరావతి: అక్టోబర్ 5వ తేదీన పిల్లలకు విద్యా కానుక కిట్లు అందజేస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. నవంబర్ 2వ తేదీన స్కూళ్లు తెరవాలని నిర్ణయించామని, అందువల్ల ఇప్పుడే పిల్లలకు కిట్ ఇస్తే స్కూళ్లు తెరిచేలోగా యూనిఫామ్ కుట్టించుకోగలుగుతారన్నారు. గతంలో అక్టోబరు 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నవంబరు 2వ తేదీకి వాయిదా వేశామని చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నిర్ణీత వ్యవధిలో సేవలు అందాలి ► ముఖ్యంగా బియ్యం కార్డులు, పెన్షన్ కానుక, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ.. ఈ నాలుగు నిర్దేశించుకున్న వ్యవధిలో అందేలా చూడాలి. ► బియ్యం కార్డులు, పెన్షన్ కార్డులు వేగంగా ప్రింట్ చేసి, పక్కాగా బయోమెట్రిక్ నమోదుతో పంపిణీ చేయాలి. సకాలంలో సేవలందించడంలో విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లాలు చాలా వెనకబడి ఉన్నాయి. ఇంధన శాఖ (విద్యుత్), మున్సిపల్, రవాణా విభాగాలలో సకాలంలో సేవలు అందడం లేదు. ► ఎవరైనా దేని కోసమైనా దరఖాస్తు చేసుకుంటే 6 పాయింట్ వాలిడేషన్ డేటా ఎంట్రీలో తప్పుడు వివరాలు నమోదు చేయకూడదు. పక్కాగా ఎస్ఓపీ ఫాలో కావాలి. ► ఎవరైనా సేవలకు సంబంధించి ఫిర్యాదు చేయగానే అన్ని స్థాయిల్లో వెనువెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారునిగా అర్హత ఉంటే 17 రోజుల్లో పేరు జాబితాలో చేర్చాలి. ఇలాంటి కేసులను ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు ర్యాండమ్‌గా 10 శాతం కేసులను వ్యక్తిగతంగా తనిఖీ చేయాలి. జేసీలు కనీసం 1 «శాతం కేసులను ర్యాండమ్‌లో తనిఖీ చేయాలి. సచివాలయాల్లో ఉద్యోగుల నియామకం కోసం పరీక్షలు చాలా చక్కగా నిర్వహించినందుకు అభినందనలు. పనుల్లో వేగం పెరగాలి ► అక్టోబర్ 2న దాదాపు 2 లక్షల మందికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేస్తున్నాం. అక్టోబర్ ఆఖరులో జగనన్న తోడు పథకం ప్రారంభిస్తాం. ఈ పథకం కింద వీధుల్లో చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. అర్హులందరికీ వచ్చే నెల 10లోగా బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా కలెక్టర్లు చూడాలి. ► నాడు–నేడు (స్కూళ్లు) మొదటి దశలో ఇంకా పనులు మొదలు కాని స్కూళ్లలో వెంటనే పనులు మొదలు పెట్టాలి. 701 టాయిలెట్లకు వెంటనే శ్లాబ్ పనులు పూర్తి చేయాలి. జేసీలు రోజూ పర్యవేక్షించాలి. ► అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు స్థలాల గుర్తింపులో తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకా«శం, అనంతపురం జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు వెంటనే చొరవ చూపాలి. ► గ్రామాల్లో వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల పనులు వేగంగా జరిగేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణానికి సంబంధించి త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి కావాలి. ► రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తుండగా, వాటిలో అమలాపురం, మదనపల్లె, పిడుగురాళ్ల, ఆదోని, ఏలూరు, పులివెందులలో భూసేకరణ జరగాల్సి ఉంది. కాకినాడ, ఒంగోలు, అనంతపురంలోని పాత కాలేజీలకు ఇంకా అదనపు భూమి కావాలి. వెంటనే ఆ మేరకు భూమి సేకరించాలి. ► ఇంకా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాల వద్ద భూములు గుర్తించాలి. ► వైఎస్ఆర్ బీమాకు సంబంధించి మొత్తం 111.35 లక్షల ఇళ్లకు సర్వే పూర్తి అయింది. యజమానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి. దీనిపైనా కలెక్టర్లు చొరవ చూపాలి. భారీ వర్షాలు, వరదలు.. నష్టం అంచనా ► 10 జిల్లాలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. వరద తగ్గుముఖం పట్టింది. పంటల నష్టాన్ని వీలైనంత త్వరగా అంచనా వేసి, పంపించాలి. కృష్ణా, గుంటూరు, నెల్లూరు కలెక్టర్లు చొరవ చూపాలి. ► ఆ జాబితాలను ఆర్బీకేల వద్ద ప్రదర్శించాలి. సహాయ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. ఈ వరదల్లో మృతి చెందిన 8 మంది కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలి. అన్యాయమైన ప్రతిపక్షం ఉండడంతో మంచి పని చేయాలన్నా ఇబ్బంది పడాల్సి వస్తోంది. పేదలకు ఇంటి స్థలం ఇవ్వడం కోసం చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వస్తోంది. వీలైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటున్నాం. పెండింగ్‌లోఉన్న దరఖాస్తులను వెరిఫై చేసి పంపండి. సమీక్షలో మంత్రులు ఆళ్ల నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స, ఆదిమూలపు సురేష్, కన్నబాబు, సీఎస్ సాహ్ని, డీజీపీ సవాంగ్ పాల్గొన్నారు. వీటన్నింటినీ పరిశీలించాలి ► గ్రామ, వార్డు సచివాలయాల్లో అన్ని సదుపాయాలు (ఎంటైర్ హార్డ్‌వేర్) అందుబాటులో ఉన్నాయా? ► ప్రభుత్వ సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలు ప్రదర్శిస్తున్నారా? ► అన్ని ముఖ్య నంబర్లు డిస్ప్లే చేస్తున్నారా? ► అన్ని ప్రభుత్వ సేవలు (543కు పైగా) సచివాలయాల్లో అందుతున్నాయా? లేదా? ► ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల క్యాలెండర్లు డిస్ప్లే చేస్తున్నారా? ► కోవిడ్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోవిడ్ చికిత్స కేంద్రాలు, ఆస్పత్రుల వివరాలు ప్రదర్శిస్తున్నారా? ► సచివాలయాల సిబ్బంది, గ్రామ, వార్డు వలంటీర్లు విధులకు హాజరవుతున్నారా? బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తున్నారా? ► అన్ని ముఖ్య రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా జరుగుతోందా? నిర్ణీత వ్యవధిలో సేవలు అందుతున్నాయా? -
రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం
రైతుల ఆదాయం రెట్టింపవ్వాలంటే ముందుగా వారు పంటపై చేస్తున్న వ్యయం తగ్గాలి. దాంతో పాటు వారికి లభిస్తున్న గిట్టుబాటు ధర పెరగాలి. అలా జరగాలంటే వీరికి జాతీయ స్థాయి మార్కెట్ అందుబాటులోకి రావాలి. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా ఇది సాధ్యం కావాలి. ఆర్బీకేలను ఈ– మార్కెట్ సెంటర్లుగా ఉపయోగించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రైతుల ఆదాయం రెట్టింపు కావడమే లక్ష్యంగా వీలైనంత వరకు లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలనే అంశంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈ–మార్కెట్ ప్లాట్ ఫామ్స్‌ను వచ్చే ఖరీఫ్ నాటికి అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. ప్రతి అంశం ఒకదానికొకటి కనెక్ట్ కావాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్బీకేల్లో మౌలిక సదుపాయాల కల్పనపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ► రైతు భరోసా కేంద్రాల పక్కన దాదాపు రూ.6 వేల కోట్లతో మల్టీపర్పస్ ఫెసిలిటీస్‌లో భాగంగా మొత్తం 13 రకాల సదుపాయాలు కల్పించాలి. ► గోదాములు, డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్, కలెక్షన్ సెంటర్స్, కోల్డ్ రూమ్‌లు – స్టోరేజీలు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, అసేయింగ్ ఎక్విప్మెంట్, జనతా బజార్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, సెలెక్టెడ్ గ్రామాల్లో ఆక్వా ఇన్ఫ్రా, సెలెక్టెడ్ గ్రామాల్లో క్యాటిల్ షెడ్స్, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ఈ –మార్కెటింగ్ మల్టీపర్పస్ ఫెసిలిటీస్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు ఆప్కాబ్ ద్వారా నాబార్డ్‌కు పంపించి చర్యలు తీసుకోవాలి. ► గోదాముల వద్దే జనతా బజార్లు ఏర్పాటు చేయడంపై అనుకూలతలు, ప్రతికూలతలపై అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేయాలి. ఆర్బీకేల్లో మౌలిక సదుపాయాలు ► ఆర్బీకేలను బలోపేతం చేసేందుకు తగిన మౌలిక సదుపాయాలు ఉండాలి. క్వాలిటీ మెటీరియల్, క్వాలిటీ సీడ్స్, క్వాలిటీ ఫెర్టిలైజర్స్ ఉండాలి. ఈ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ వల్ల రైతులు తమ ఉత్పత్తులు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ► రైతు తన పంటను అమ్ముకోవాలంటే జనతా బజార్లు అందుబాటులోకి రావాలి. ఆర్బీకేలు అన్నీ ఫంక్షనింగ్‌లోకి రావాలి. పంటల ఈ–క్రాపింగ్ వల్ల వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం నమోదవుతుంది. దాని వల్ల పంటలకు బీమా ప్రీమియమ్ చెల్లింపుతో పాటు, వాటికి గిట్టుబాటు ధర కల్పన, పంట నష్టం జరిగితే పరిహారం చెల్లింపు వంటివి ఎంతో సులభం అవుతాయి. ► గోదాముల నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించాలి? ఎప్పుడు పూర్తి చేయాలి? బడ్జెట్ నిధులు వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి. ఆ ప్రణాళికలో జనతా బజార్లను, ఆక్వా రంగాన్ని కూడా కలపాలి. ► జనతా బజార్లు, షెడ్యూలింగ్, సెకండరీ ప్రాసెసింగ్‌కు సంబంధించి వెంటనే తగిన ప్రణాళిక సిద్ధం చేయాలి. ఆ తర్వాత పంటలకు కనీస మద్దతు ధరల (ఎమ్మెస్పీ)పై కసరత్తు చేయాలి. పీఏసీఎస్‌లను బలోపేతం చేయాలి ► ప్రాథమిక వ్యవసాయ పరపతి సం«ఘాల (పీఏసీఎస్)ను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలి. పీఏసీఎస్‌ల ముందున్న సవాళ్లు, పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టాలి. ► దీనిపై ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను పరిశీలించి, ఆర్థిక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలి. మహిళా సాధికారతకు పెద్దపీట ► ఆసరా, చేయూత పథకాలు మెజార్టీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నాం. కేవలం పాల ధర పెంచినంత మాత్రాన రైతులకు పూర్తి ప్రయోజనం కలగదు. ► జనతా బజార్లలో మత్స్య సంపద విక్రయ కేంద్రాలను కూడా అందుబాటులోకి తెస్తారు. ఇదంతా ఎందుకంటే సాధ్యమైనన్ని అనుబంధ కార్యకలాపాలను రైతులకు, మహిళలకు అందుబాటులోకి తేవటానికే. వారి ఆదాయం పెంచడానికే. అమూల్, ఇతర సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటం కూడా ఇందులో భాగమే. ఉపాధి అవకాశాలు కోరుతూ ఇప్పటికే మహిళల నుంచి లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి. గతంలో రికార్డులు తారుమారు ► 2016లో గత ప్రభుత్వం వెబ్‌ల్యాండ్ (ఆన్లైన్ రికార్డులు) పేరుతో ప్రక్షాళన అంటూ రికార్డులను తారు మారు చేసిందని, ఇష్టానుసారం పేర్లు మార్చేశారని సమావేశంలో అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఈ అంశాన్ని రానున్న స్పందన సమీక్ష అజెండాలో చేర్చి, కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ► సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ స్పెషల్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, అగ్రికల్చర్ కమిషనర్ అరుణŠ కుమార్, నాబార్డు సీజీఎం ఎస్కే జన్నావర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 30 ఏళ్ల దాకా ఉచిత విద్యుత్‌కు ఢోకా ఉండదు ► పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఓ 30 ఏళ్ల పాటు శాశ్వతంగా అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌కు ప్రణాళికలు వేసింది. దీంతో పాటు యూనిట్ రూ.2.50కే లభ్యమయ్యేలా తగు ప్రయత్నాలు చేస్తోంది. ఈ చర్యలన్నీ రైతుకు నాణ్యమైన విద్యుత్ అందేలా చూస్తాయి. చివరికి పంటకయ్యే ఖర్చు తగ్గటానికి ఇవి కూడా ఉపకరిస్తాయి. ► విజన్‌తో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ తీసుకొస్తున్నాం. ఇందువల్ల రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు. ► క్వాలిటీ పవర్ ఇవ్వాలంటే మీటర్లు ఉండాలి. అప్పుడే ఫీడర్లపై భారం ఎంతో కూడా తెలుస్తుంది. ప్రభుత్వమే నేరుగా రైతులకు ప్రత్యేక అకౌంట్లలో డబ్బు జమ చేస్తుంది. అందువల్ల ఎక్కడా రైతులకు విద్యుత్ బిల్లుల సమస్య ఉండదు. ► నాడు శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులను కొన్ని వేల కోట్ల రూపాయలతోనే కట్టారు. అదే ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.55 వేల కోట్లు ఖర్చవుతున్నాయి. ఇదే ప్రాజెక్టు మరో 10 సంవత్సరాలు ఆలస్యం అయితే ఖర్చు రెండింతలు పెరుగుతుంది. అందుకే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేస్తున్నాం. -
వేగంగా నైపుణ్యాభివృద్ధి కాలేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 30 నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కాలేజీల నిర్మాణం కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, భవనాల నిర్మాణం అత్యంత నాణ్యతగా ఉండాలని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. ► ఆర్థిక శాఖ అధికారులతో కూర్చొని కాలేజీల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలి. పనులు త్వరగా మొదలు పెట్టాలి. వ్యవసాయంలో ఉపయోగించే యంత్రాల వినియోగం, వాటి మరమ్మతులపై యువతకు శిక్షణ ఇవ్వాలి. ► హై ఎండ్ స్కిల్స్‌తో పాటు ప్రతి కాలేజీలో ఏసీలు, ప్లంబింగ్, భవన నిర్మాణం తదితర పనులపై శిక్షణ ఇవ్వాలి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కాలేజీ ఉండేలా చూసుకుంటూ రాష్ట్రంలో 30 కాలేజీల నిర్మాణం త్వరితగతిన పూర్తవ్వాలి. నైపుణ్యాల అభివృద్ధి, ఉత్తమ మానవ వనరులను పరిశ్రమలకు అందించడంలో, పారిశ్రామికాభివృద్ధిలో ఈ కాలేజీలు కీలక పాత్ర పోషిస్తాయి. నైపుణ్యాభివృద్ధి కాలేజీలపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి, అధికారులు 20 చోట్ల స్థలాల గుర్తింపు ► కాలేజీల కోసం ఇప్పటి వరకు దాదాపు 20 చోట్ల స్థలాలను గుర్తించామని, మిగిలిన చోట్ల కూడా ఆ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీల్లో వివిధ కోర్సులకు పాఠ్యప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. అధికారులు ఇంకా ఏం చెప్పారంటే.. ► ఫినిషింగ్ స్కిల్ కోర్సులు, ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఉంటుంది. మొత్తం 162కిపైగా కోర్సులు ఉంటాయి. ఇందులో 127 కోర్సులు ఫినిషింగ్ స్కిల్స్, 35 ప్రత్యామ్నాయ ఉపాధి కోర్సులు ఉన్నాయి. ► పరిశ్రమల అవసరాలపై సర్వే. ఆ సర్వే ప్రకారం కోర్సులు నిర్ణయించాం. పాఠ్య ప్రణాళిక తయారీలో సింగపూర్ పాలిటెక్నిక్, జీఐజెడ్, వాన్ హాల్ లారెన్‌స్టెన్ (యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్), డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ భాగస్వామ్యాన్ని తీసుకున్నాం. ► మరో 23 ప్రఖ్యాత సంస్థలతో భాగస్వామ్యం కోసం ఎంఓయూలకు సిద్ధమయ్యాం. ఇంకో 35 సంస్థలతో చర్చలు నడుస్తున్నాయి. ల్యాబ్ ఏర్పాట్లు, పాఠ్య ప్రణాళికలో వీరి సహకారం తీసుకుంటున్నాం. ఎంఓయూలకు సిద్ధమైన వాటిలో డెల్, హెచ్‌పీ, టీసీఎస్, ఐబీఎం, బయోకాన్, టాటా తదితర కంపెనీలు ఉన్నాయి. ► సమీక్షలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.అనంతరాము, స్పెషల్ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ అర్జా శ్రీకాంత్, ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఇతర రాష్ట్రాల్లో ఆస్తి పన్ను విధానాలపై అధ్యయనం
సాక్షి, అమరావతి: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సంస్కరణలపై కేంద్ర మార్గదర్శకాల అమలు తీరు తెన్నులను ఇతర రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఈ అంశంపై సమీక్షించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ► కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలని కేంద్రం మార్గనిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో ఆస్తి పన్ను విధానాలు, రాష్ట్రంలో ఆస్తి పన్ను విధానాలను అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు. ► ఆయా రాష్ట్రాల్లో నెలవారీ అద్దె ప్రాతిపదికన కాకుండా ఆస్తి విలువ ప్రాతిపదికన పన్నులు విధిస్తున్న అంశాన్ని అధికారులు వివరించారు. ఆయా రాష్ట్రాల్లో ఆస్తి విలువలు, దాన్ని నిర్ధారించే విధానాలు, ఆ మేరకు విధిస్తున్న పన్ను తదితర అంశాలపై చర్చించారు. వాటన్నింటిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ► ఈ సమీక్షలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
‘వైఎస్సార్ వేదాద్రి’
-
ఫిబ్రవరికి ‘వైఎస్సార్ వేదాద్రి’
సాక్షి, అమరావతి/ పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట): వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం చెంత కృష్ణా నదిపై రూ.490 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేసి పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు అతి సమీపంలోని కృష్ణా జిల్లాలోని నందిగామ, వత్సవాయి, పెనుగంచి ప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో తాగు, సాగు నీటికి కటకటలాడే పరిస్థితి. ఐదేళ్లపాటు అధికారంలో ఉండీ కూడా, ఈ ప్రాజెక్టు చేస్తే మంచి జరుగుతుందని తెలిసీ కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎత్తిపోతల పథకానికి క్యాంపు కార్యాలయంలో వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్ – మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 14 నెలల్లోపు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాన చేశాం. ఫిబ్రవరి 2021 నాటికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి ఈ ప్రాంతానికి అందాల్సిన నీరు అందడంలేదు. దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టాం. – ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు అందిస్తాం. డీవీఆర్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 30 గ్రామాలకు, వాటితోపాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా వైఎస్సార్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా నీరు అందిస్తాం. – దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి కటకట తీరి, ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుకుంటూ.. నాకు ఈ అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు. పెళ్లి రోజున చేపట్టిన ఈ ప్రాజెక్టు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వేదాద్రిలో ఎత్తిపోతల ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు అనిల్‌కుమార్, పేర్ని నాని, కొడాలి నాని, ప్రభుత్వ విప్ ఉదయభాను, కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు రైతు బాంధవుడిగా నిలిచారు – వేదాద్రి ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు బాంధవుడిగా నిలిచారని మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. – ‘ఈ ఎత్తిపోతల పథకంతో జగ్గయ్యపేట నియోజకవర్గంలో సాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. వేదాద్రి వద్ద కృష్ణా నది నుంచి 26 కిలోమీటర్ల పైపులైన్ ద్వారా నాగార్జునసాగర్ కాలువల్లోకి నీటిని విడుదల చేస్తారు. మంగొల్లు, గండ్రాడు, భీమవరం మీదుగా శనగపాడు వరకు ఆయకట్టు చివరి భూములకు సైతం సాగునీరు అందుతుంది. నాడు ఇదే ప్రాంతంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వేదాద్రి–కంచెల ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి మేలు చేశారు. ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ పెళ్లి రోజు కానుకగా వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడం ఈ ప్రాంత రైతాంగానికి గొప్ప వరం. తద్వారా ఈ ప్రాంతంలో ఎకరాకు రూ.10 లక్షలు విలువ పెరిగింది’ అని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. – ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే పైలాన్ వద్ద సీఎం తన కార్యాలయంలో రిమోట్ ద్వారా పైలాన్‌ను ఆవిష్కరించే కార్యక్రమాన్ని స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. – వేదాద్రి ఎత్తిపోతల ప్రాజెక్టు వద్ద మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్నినాని, కొడాలి నాని, ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్రావు, కైలే అనిల్‌కుమార్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. – క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, మేకపాటి గౌతం రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
‘పేట’ జేఎన్టీయూకు శాశ్వత భవనాలు
సాక్షి, అమరావతి, నరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని జేఎన్టీయూ క్యాంపస్ శాశ్వత భవనాల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సోమవారం తన క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా నరసరావుపేటలో శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ప్రస్తుతం రూ.80 కోట్ల వ్యయంతో కళాశాల శాశ్వత భవనాల నిర్మాణం చేపడుతున్నామని, వచ్చే ఏడాది మరో రూ.40 కోట్లు మౌలిక సదుపాయాల కోసం వ్యయం చేస్తామని, నరసరావుపేట జేఎన్టీయూ కోసం మొత్తం రూ.120 కోట్లు వెచ్చిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే... వెనుకబడ్డ పల్నాడుకు మేలు.. ► నరసరావుపేట జేఎన్టీయూలో 2016లో ఫస్ట్ బ్యాచ్‌లో చేరిన విద్యార్థులు ఇప్పుడు ఫైనల్ ఇయర్‌కు వచ్చారు. వారికోసం కాలేజీ కట్టాలన్న ఆలోచన గత ప్రభుత్వం ఏనాడూ చేయలేదు. ఇప్పటిదాకా ప్రైవేట్ కాలేజీలు, ల్యాబుల్లో నడుపుతూ వచ్చారు. ఈ పరిస్థితిని మారుస్తాం. ► వెనుకబడ్డ పల్నాడు ప్రాంతానికి మంచి చేయాలన్నది మా సంకల్పం. చిత్తశుద్ధితో చేపట్టిన ఈ కార్యక్రమమే అందుకు ఉదాహరణ. ► మొన్ననే 1,100 టీచింగ్ పోస్టుల భర్తీకి ఆదేశాలు ఇచ్చాం. ఆ పోస్టుల్లో నరసరావుపేట జేఎన్టీయూకు చెందినవీ ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన భవనాల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ల్యాబులు కూడా అందుబాటులోకి తెస్తాం. గత సర్కారు ఐదేళ్లు కాలయాపన గత సర్కారు జేఎన్టీయూ భవనాలు కట్టకుండా ఐదేళ్లు కాలయాపన చేస్తే మీరు (సీఎం జగన్) వచ్చి నిధులిచ్చారు. పీజీ కళాశాల కూడా మంజూరు చేయాలని కోరుతున్నాం. – ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాకాని వద్ద నిర్మాణం ► పల్నాడు రోడ్డులో ప్రస్తుతం జేఎన్టీయూను నిర్వహిస్తుండగా నరసరావుపేట మండలం కాకాని గ్రామం వద్ద శాశ్వత భవనాలు నిర్మించనున్నారు. ► స్థానిక లింగంగుంట్ల కాలనీ ఎన్ఎస్పీ స్థలంలో రూ.20 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ వైద్యశాలను జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రారంభించారు. ► సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నత విద్యా శాఖకు చెందిన అధికారులతో పాటు యూనివర్సిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. నరసరావుపేట నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కాసు మహేష్‌రెడ్డి, విడదల రజని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కలెక్టర్ శామ్యూల్, కళాశాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఒక అన్నగా.. తమ్ముడిగా.. చేయి పట్టి నడిపిస్తా
సాక్షి, అమరావతి: అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటామని, వైఎస్సార్ చేయూత ద్వారా నాలుగేళ్లూ కచ్చితంగా ఆర్థిక సాయం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ‘వైఎస్సార్ చేయూత’ పథకాన్ని ముఖ్యమంత్రి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. కంప్యూటర్ బటన్ నొక్కి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.18,750 చొప్పున నగదును ముఖ్యమంత్రి జమ చేశారు. 45 నుంచి 60 ఏళ్ల మ«ధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా అందించనున్నారు. ఇందుకోసం ఏటా రూ.4,687 కోట్లు వ్యయం కానుంది. ఈ సందర్భంగా వైఎస్సార్ చేయూత లబ్ధిదారులు, కలెక్టర్లనుద్దేశించి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలివీ.. మీ ఇబ్బందులను పాదయాత్రలో చూశా.. –ప్రతి అక్కచెల్లెమ్మకు మేలు చేసే వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించడాన్ని ఒక అన్నగా, తమ్ముడిగా నా అదృష్టంగా భావిస్తున్నా. 45 – 60 ఏళ్ల మధ్య ఉన్న అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వ పథకాలు ఏవీ లేవని నా పాదయాత్ర సమయంలో గమనించా. గతంలో కార్పొరేషన్ల ద్వారా గ్రామంలో ఒకరికో ఇద్దరికో మాత్రమే అరకొరగా రుణాలు ఇచ్చేవారు. అది కూడా లంచం ఇస్తేనే సాయం అందేది. వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు చెక్ అందజేస్తున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ రోజు... వెటకారం చేశారు – నాడు అక్క చెల్లెమ్మల ఇబ్బందులను గమనించి వారికి పెన్షన్ రూపంలో డబ్బులు ఇద్దామనుకున్నా. 45 ఏళ్లకే పెన్షన్ ఏమిటని అప్పుడు చాలామంది వెటకారం చేశారు. అక్కచెల్లెమ్మలకు పెన్షన్ రూపంలో ఏటా రూ.12 వేలకు బదులుగా అంతకంటే ఎక్కువగా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. ఆ పథకాన్ని పార్టీ ఎన్నికల ప్రణాళికలో కూడా చేర్చి అధికారంలోకి వచ్చాక రెండో ఏడాది నుంచి అమలు చేస్తామని హామీ ఇచ్చాం. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటున్నా. ఈ సాయాన్ని బ్యాంకులు ఇతర రుణాల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం. ఈమేరకు బ్యాంకులకు ఆదేశాలిచ్చాం. ఈ సాయంపై ఏ ఆంక్షలూ లేవు – వైఎస్సార్ చేయూత ద్వారా ప్రభుత్వం అందచేసే డబ్బులను దేనికి వాడుకోవాలన్నది పూర్తిగా అక్క చెల్లెమ్మల ఇష్టం. ఇదే చేయాలని ఎలాంటి ఆంక్షలూ లేవు. ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా కష్టాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల చేతిలో ఈ డబ్బులు పెడితే వారికి మేలు జరుగుతుందని భావించి నాలుగు అడుగులు ముందుకు వేశాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే? –ఇవాళ 22,28,909 మంది అక్క చెల్లెమ్మలకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతోంది. ఇంకా ఎవరైనా మిగిలిపోతే గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. వెంటనే వెరిఫికేషన్ పూర్తి చేసి అర్హులకు వచ్చే నెలలో పథకాన్ని వర్తింపచేస్తాం. పలు సంస్థలతో ఎంవోయూ – అక్క చెల్లెమ్మలు వ్యాపార రంగంలో రాణించేలా ప్రోత్సహించేందుకు దిగ్గజ కంపెనీలు అముల్, రిలయన్స్, ఐటీసీ, ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్తాన్ యూని లీవర్ తదితర సంస్థలతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. వలంటీర్ల ద్వారా 2 పేజీల లేఖ కూడా పంపిస్తున్నాం. మెప్మా, సెర్ప్ ప్రతినిధులు మిమ్మల్ని కలిసి సొంతంగా వ్యాపారం ప్రారంభించేలా సహకరిస్తారు. అక్క చెల్లెమ్మలు ఒక వేళ పాల వ్యాపారం చేయాలనుకుంటే అముల్ సంస్థ పూర్తి సహకారం అందిస్తుంది. గేదెలు కొనివ్వడంతో పాటు పాలు కూడా కొనుగోలు చేస్తుంది. – మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఎం.శంకరనారాయణ, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పి.విశ్వరూప్, ఎంపీ మార్గాని భరత్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మైనార్టీలకు సీఎం జగన్ పెద్దపీట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్సీ జకియా ఖానం కొనియాడారు. నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన జకియా ఖానం సోమవారం సీఎంను క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయం వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సామాన్య కుటుంబానికి చెందిన తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపానన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, రాయచోటి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మహిళా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని చెప్పారు. తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్‌రెడ్డి, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ ఔషధాలపై కొరడా
సాక్షి, అమరావతి: నకిలీ ఔషధాలపై కొరడా ఝుళిపించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా నిర్మాణాత్మక చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఔషధ నియంత్రణపై సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. నకిలీ మందులపై కట్టడి కోసం డ్రగ్ కంట్రోల్లో విజిలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ విభాగం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. చర్చించిన అంశాలకు సంబంధించి నెలరోజుల్లో కార్యాచరణ, ప్రణాళిక తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సందర్భంగా మార్కెట్లో నకిలీ మందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆదేశాలు, సూచనలిలా ఉన్నాయి.. ► ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే నకిలీ ఔషధాలను అరికట్టాల్సిందే. డ్రగ్ కంట్రోల్ కార్యకలాపాలు బలోపేతం చేయాలి. ► ఇందుకోసం కఠినమైన నిబంధనలు తీసుకురావాలి. ► డ్రగ్ తయారీ యూనిట్లలోనూ నాణ్యతపై కూడా దృష్టిపెట్టాలి. ► జరిమానాలు విధించేందుకు వీలుగా చట్టంలో నిబంధనలు తీసుకురావాలి. ► మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో గొప్ప విధానాలు ఉండేలా చూడాలి. థర్డ్ పార్టీ తనిఖీలు జరగాలి. ► మందుల దుకాణాల వద్దే ఫిర్యాదు ఎవరికి.. ఏ నంబర్‌కు చేయాలన్న సమాచారం ఉంచాలి. ► ప్రభుత్వాస్పత్రుల్లో కూడా క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. ► నకిలీ మందుల తయారీ, విక్రయంపై సమాచారమిచ్చే వారికి రివార్డులు ఇవ్వాలి. ► అలాగే, ప్రజల నుంచి, ఇతరత్రా వ్యక్తుల నుంచి నిరంతరం ఫిర్యాదులు స్వీకరించాలి. ► విజయవాడలో ఉన్న ల్యాబ్‌తోపాటు నిర్మాణంలో ఉన్న కర్నూలు, విశాఖపట్నం ల్యాబ్‌ల్లో సామర్థ్యం పెంచాలి. దీంతో.. ఏడాదికి 2వేల నుంచి 13వేల శాంపిళ్లకు సామర్థ్యం పెంచుతున్నట్లు అధికారుల వివరణ. కాగా, ఈ సమీక్షలో డ్రగ్స్ అండ్ కాపీరైట్ డైరెక్టర్ జనరల్ రవిశంకర్ నారాయణ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.