ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల సంఘం ఐక్యవేదిక సమావేశం ముగిసింది.
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల సంఘం ఐక్యవేదిక సమావేశం ముగిసింది. నిరుద్యోగులు తమ సమస్యలపై చర్చించడానికి గుంటూరు పట్టణంలో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వారు చేయవలసిన ఆందోళన కార్యక్రమాల షెడ్యూలును విడుదల చేశారు.
నిరుద్యోగుల సంఘం ఐక్యవేధికలో తీసుకున్న నిర్ణయాలు:
- 21 న ఏపీలోని అన్ని కలెక్టరేట్ల ముట్టడి
- 23న మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడికి నిర్ణయం
- 26న విజయంవాడలో అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు
- అక్టోబర్ 1న సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి నిర్ణయం తీసుకున్నారు