సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పులివెందులలో ఆర్టీసీ బస్టాండు, డిపో నిర్మాణం, ఏపీ కార్ల్ భవనాల నిర్మాణం, ఇండ్రస్టియల్ డెవలప్‌మెంట్ పార్కులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలయ్యింది.
25న యూ.కొత్తపల్లిలో సీఎంచే ఇళ్ల పట్టాల పంపిణీ...
ఈనెల 23వతేదీ సాయంత్రం 3.00 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి ముఖ్యమంత్రి కడప జిల్లా పర్యటనకు బయలుదేరతారు. రాత్రి ఇడుపులపాయ ఎస్టేట్‌లో బస చేస్తారు. 25వతేదీ మధ్యాహ్నం కడప నుంచి విమానంలో రాజమండ్రి చేరుకుంటారు. యూ.కొత్తపల్లిలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.
నేడు వైఎస్సార్ జిల్లాకు సీఎం జగన్
Published Wed, Dec 23 2020 3:33 AM | Last Updated on Wed, Dec 23 2020 4:33 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment