ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రముఖ డైరెక్టర్ రాజమౌళితో భేటీ అయ్యారు. ఆయనతో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా సీఎం జగన్‌ను కలిశారు. ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో రాజమౌళి భేటీ ప్రాధ్యాన్యత సంతరించుకుంది. కాగా ఇటీవలే ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయంలో సవరణలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment