వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు
విజయవాడ(గాంధీనగర్) : వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు వీవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. లెనిన్ సెంటర్‌లో వీఆర్‌ఏలు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్ష సోమవారం రెండో రోజుకు చేరింది.
మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ 50 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ ఎంత కాలమైనా తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు.