సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను పున:ప్రారంభిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
కాంగ్రెస్ ఏడాది పాలనపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పదేళ్ల పాలనకు...ఏడాది ఇందిరమ్మ పాలనకు స్పష్టమైన తేడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మేం అధికారంలోకి వచ్చే నాటికి 2 లక్షల 40 వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వస్తున్నాం.
డిసెంబర్ 1 నుంచి ధరణి పోర్టల్‌ను ఎన్‌ఐసీకి అప్పగించాం. 2024 కొత్త ఆర్వో ఆర్ చట్టాన్ని తయారు చేశాం. అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదిస్తాం. గతంలో ధరణి 33 మాడ్యుల్స్‌తో ఇబ్బందిగా ఉండేది. మాడ్యుల్స్‌ను తగ్గిస్తాం. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు. మళ్ళీ మేం ఈ వ్యవస్థలను తీసుకు వస్తాం.
గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పింక్ షర్ట్స్ వేసుకున్న వాళ్ళకే వచ్చాయి. మేము అత్యంత నిరుపేదలకు మాత్రమే ఇళ్లు ఇస్తాం. ప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్లు. ఇందిరమ్మ ఇళ్లు ఒక్కసారి ఇచ్చి వదిలేసే కార్యక్రమం కాదు. కేంద్రం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇవ్వకపోయినా మా ప్రభుత్వం ఇస్తుంది. ఆనాటి ప్రభుత్వం ఖజానాను కొల్లగొట్టక పోయి ఉంటే వడివడిగా హామీలు నెరవేర్చే వాళ్ళం. అయినా మేము ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాం.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను పరిష్కారం చేసుకుందాం. రియల్ ఎస్టేట్ పడిపోయిందని కొంత మంది మాజీ మంత్రులు అంటున్నారు. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని ప్రధాన ప్రతిపక్షం గ్రహించాలి. మేము 15 నుంచి 18 శాతం అనుకున్నాం కానీ..ఆశించినంత పెరగలేదు. ప్రతిపక్ష పార్టీకి జ్ఞానోదయం కలగకపోవటం బాధాకరం. ప్రతిపక్ష పార్టీకి డిశ్చార్జ్ షీట్ ప్రజలు ఇచ్చారు.
ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో నడుపుతున్నది తుగ్లక్ పాలనా?సెక్రటేరియట్‌లో నడుపుతున్నది తుగ్లక్ పాలనా?.రేపటి కార్యక్రమానికి కేసీఆర్ వస్తారని ఆశిస్తున్నాం’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.
చదవండి👉 : ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ.. బీఆర్‌ఎస్ ఎల్పీలో కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment