pongulati srinivasa reddy
-
‘తెలంగాణలో వీఆర్ఓ, వీఆర్ఏ సేవలు’
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను పున:ప్రారంభిస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పదేళ్ల పాలనకు...ఏడాది ఇందిరమ్మ పాలనకు స్పష్టమైన తేడా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ధరణిని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మేం అధికారంలోకి వచ్చే నాటికి 2 లక్షల 40 వేల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వస్తున్నాం.డిసెంబర్ 1 నుంచి ధరణి పోర్టల్‌ను ఎన్ఐసీకి అప్పగించాం. 2024 కొత్త ఆర్వో ఆర్ చట్టాన్ని తయారు చేశాం. అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదిస్తాం. గతంలో ధరణి 33 మాడ్యుల్స్‌తో ఇబ్బందిగా ఉండేది. మాడ్యుల్స్‌ను తగ్గిస్తాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు. మళ్ళీ మేం ఈ వ్యవస్థలను తీసుకు వస్తాం.గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పింక్ షర్ట్స్ వేసుకున్న వాళ్ళకే వచ్చాయి. మేము అత్యంత నిరుపేదలకు మాత్రమే ఇళ్లు ఇస్తాం. ప్రతి నియోజక వర్గానికి 3500 ఇళ్లు. ఇందిరమ్మ ఇళ్లు ఒక్కసారి ఇచ్చి వదిలేసే కార్యక్రమం కాదు. కేంద్రం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇవ్వకపోయినా మా ప్రభుత్వం ఇస్తుంది. ఆనాటి ప్రభుత్వం ఖజానాను కొల్లగొట్టక పోయి ఉంటే వడివడిగా హామీలు నెరవేర్చే వాళ్ళం. అయినా మేము ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాం.జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను పరిష్కారం చేసుకుందాం. రియల్ ఎస్టేట్ పడిపోయిందని కొంత మంది మాజీ మంత్రులు అంటున్నారు. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందని ప్రధాన ప్రతిపక్షం గ్రహించాలి. మేము 15 నుంచి 18 శాతం అనుకున్నాం కానీ..ఆశించినంత పెరగలేదు. ప్రతిపక్ష పార్టీకి జ్ఞానోదయం కలగకపోవటం బాధాకరం. ప్రతిపక్ష పార్టీకి డిశ్చార్జ్ షీట్ ప్రజలు ఇచ్చారు.ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌లో నడుపుతున్నది తుగ్లక్ పాలనా?సెక్రటేరియట్లో నడుపుతున్నది తుగ్లక్ పాలనా?.రేపటి కార్యక్రమానికి కేసీఆర్ వస్తారని ఆశిస్తున్నాం’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. చదవండి👉 : ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ.. బీఆర్ఎస్ ఎల్పీలో కేసీఆర్ -
పొంగులేటి.. జైలుకెళ్లడానికి రెడీగా ఉండు: కేటీఆర్
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణ మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు జరిగితే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రి పొంగులేటి జైలుకు పోవడానికి రెడీగా ఉండాలని కేటీఆర్ అన్నారు. అలాగే, భారీ స్కామ్‌లు జరుగుతుంటే కేంద్రం ఏం చేస్తోందని ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడించినట్లు ఆడితే ఉన్నతాధికారుల ఉద్యోగాలు ఊడగొడుతాం. బీఆర్ఎస్ తరఫున ఉన్నతాధికారులకు ఇదే మా హెచ్చరిక. తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. రేవంత్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణను దోచుకుంటున్నారు. నీటి ప్రాజెక్టుల పేరుతో సీఎం రేవంత్ భారీ కుంభకోణానికి తెర తీశారు. మంత్రి పొంగులేటి, రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీలు డబ్బులు పంచుకుంటున్నాయిరేవంత్ రెడ్డి అవినీతిపై బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదు. భారీ కుంభకోణాలు జరుగుతుంటే.. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది?. కేబినెట్లో ఉన్న మంత్రి పొంగులేటి కంపెనీకి కాంట్రాక్టులు ఎలా ఇస్తారు?. పొంగులేటి జైలు పోవటానికి రెడీగా ఉండాలి. వాళ్ళు, వీళ్ళు జైలుకు పోతారని చెప్పటానికి పొంగులేటి ఎవరు?. పొంగులేటి ఏమైనా హోంమంత్రినా?. బాంబులు పేల్చుడు కాదు.. ముందు పొంగులేటి జైలు పోవటానికి సిద్ధంగా ఉండాలి.మూసీ ప్రాజెక్ట్ కోసం రేవంత్ రెడ్డి ఆగమాగం అవుతున్నాడు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం. మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు జరిగితే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. -
పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు బీజేపీ రాజకీయ కుట్రే: అద్దంకి దయాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో ఈడీ దాడుల ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఈడీ దాడులు.. బీజేపీ ఆడుతున్న రాజకీయ కుట్ర అని అద్దంకి దయాకర్ ఘాటు విమర్శలు చేశారు.మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. ఈడీ దాడులు బీజేపీ రాజకీయ కుట్ర. ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై దాడులు చేసి బీజేపీ భయపెట్టాలని చూస్తోంది. రాజకీయ వ్యతిరేక పక్షాలపై నిరంతరం దాడులు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టి మానసికంగా దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోంది.కర్ణాటకలో కూడా బీజేపీ ఇదే తరహాలో ముందుకు సాగింది. డీకే శివ కుమార్‌పై కూడా ఇలాగే దాడుల ప్రయోగం చేశారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా వదలకుండా కేంద్రంలోని బీజేపీ.. ఈడీ దాడులు చేయించింది. దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పుదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: హైడ్రా ఎఫెక్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత -
పొంగులేటి సవాల్ స్వీకరించిన కేటీఆర్.. సీఎం కుర్చీకి ఎసరు అంటూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మంత్రి పొంగులేటి సవాల్‌ను కేటీఆర్ స్వీకరించారు. అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుదాం రావాలంటూ ప్రతి సవాల్ విసిరారు. దీంతో, రాష్ట్రంలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి సవాల్‌ను స్వీకరిస్తున్నాను. చిత్తశుద్ధి ఉంటే రండి.. హైకోర్టు సీజే దగ్గరకు పోదాం. అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుదాం. అక్రమాలు జరగలేదని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. లేదంటే సెంట్రల్ కమిషనర్ దగ్గరకు పోదాం. రేవంత్ ముఖ్యమంత్రి పదవి ఊడగొట్టాలన్న ఆలోచన ఉన్నట్టుంది. రాజీనామా చేస్తానని పొంగులేటి ప్రగల్భాలు చేస్తున్నాడు. అమృత్ టెండర్లు రద్దు చేసి సిగ్గు తెచ్చుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీకు చిత్తశుద్ధి ఉంటే రండి.. హైకోర్టు సీజే దగ్గరకు పోదాం. అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుదాం.- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/Dzl4ZsziiD— BRS Party (@BRSparty) September 22, 2024 కేటీఆర్ ఆరోపణలపై అంతకుముందు మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం. నిరూపించలేకపోతే కేటీఆర్ రాజీనామా చేస్తారా? ఈ ప్రభుత్వం కేవలం రూ.3,516 కోట్ల పనులకే టెండర్లు పిలిచింది. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పేరు మీద రూ.39వేల కోట్ల ప్రజాధనం లూటీ చేశారు. ఆధారాలతో కూడిన విమర్శలు చేయాలి. ఖమ్మంలో నాపై పోటీ చేసిన ఉపేందర్‌రెడ్డి అల్లుడు సృజన్‌రెడ్డి ఒకటి దక్కించుకున్నారు. టెండర్లు వేయొద్దని ఏ కంపెనీని కూడా ప్రభుత్వంలోని పెద్దలు బెదిరించలేదు. మేం పిలిచిన రీ టెండర్లలో గతంకంటే రూ.54 కోట్లు తక్కువకే బిడ్లు వచ్చాయి అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో పోలింగ్ తేదీకి ఒక్కరోజు ముందే గత ప్రభుత్వం ఈ టెండర్లను కట్టబెట్టిందని గుర్తు చేశారు. ఇది కూడా చదవండి: కూకట్‌పల్లిలో హైడ్రా.. బీఆర్ఎస్ నేత అక్రమ నిర్మాణాలు కూల్చివేత -
టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా పొంగులేటి
సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో పొంగులేటికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్టీ కండువా కప్పిన విషయం తెలిసిందే. కాగా టీపీసీసీ ప్రచార కమిటీకి గతంలో చైర్మన్‌గా ఉన్న మధు యాష్కీ గౌడ్, కన్వీనర్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీలను అదే పదవుల్లో కొనసాగించారు. ఇక ప్రచార కమిటీలో 37 మందిని కార్యనిర్వాహక సభ్యులుగా నియమించారు. కార్యనిర్వాహక సభ్యులు వీరే.. టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్, ఎం.ప్రవీణ్ రెడ్డి, కత్తి కార్తీక గౌడ్, మహ్మద్ జావేద్ అక్రమ్, నరేంద్ర ముదిరాజ్, జూలూరు ధనలక్ష్మి గౌడ్, దయాకర్ గౌడ్, వరంగల్ రవి, నాగన్న, అముగోతు వెంకటేశ్, రాములు యాదవ్, దాస్‌గౌడ్, కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, గడుగు రోహిత్, బండ శంకర్, కోలా వెంకటేశ్, దినేశ్ సాగర్ ముదిరాజ్, గోపాల్‌రెడ్డి, దండెం రాంరెడ్డి, శ్రీకొండ మల్లేష్, కోట శ్రీనివాస్, గిరి కొండల్, సంగీతం శ్రీనివాస్, చారులత రాథోడ్, రేణుక, గిరి నాగభూషణం, భీం భరత్, కె.శివ కుమార్, సాయిని రవి, రఘువీర్ గౌడ్, డా.కె.విజయ్‌కుమార్, జి. లోకేశ్ యాదవ్, ఏఎం ఖాన్, జంగారెడ్డి, డా. వడ్డేపల్లి రవి, తాటికొండ శ్రీనివాస్, డా. మోతీ లాల్‌ను కార్యనిర్వాహక సభ్యులుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అవకాశం కల్పించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా... వీరితో పాటు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, కౌన్సిల్ నేత, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు ప్రచార కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. -
నేను సీట్ల ఒప్పందంతో కాంగ్రెస్‌లో చేరడం లేదు: పొంగులేటి
సాక్షి, నల్లగొండ: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎండదెబ్బ కారణంగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వడదెబ్బతో ఆయనకు జ్వరం, తలనొప్పి, నీరసం కారణంగా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో, భటి పాదయాత్రకు బ్రేక్ పడింది. కాగా, వైద్యుల సూచనల అనంతరం భట్టి పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా.. అనారోగ్యానికి గురైన భట్టి విక్రమార్కను కేతేపల్లిలో పొంగులేటి శ్రీనివాస్ కలిశారు. ఈ క్రమంలో భట్టిని పరామర్శించారు. అనంతరం, పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. వేసవి ఎండను కూడా లెక్కచేయకుండా భట్టి విక్రమార్క వంద రోజలు పాదయాత్ర చేశారు. అన్ని కులాలు, మతాల వారిని కలుస్తూ వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. భట్టిని పరామర్శించడానికే ఇక్కడికి వచ్చాను. సీఎం కేసీఆర్ మాయమాటలతో తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేయడం అభినందనీయం. తెలంగాణ ప్రజలు కన్న కలలు.. కాంగ్రెస్‌తోనే సాధ్యం. రాష్ట్రంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం చేస్తున్నారు. అమరుల కుటుంబానికి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా అమలు చేశారా?. తెలంగాణ బిడ్డలు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ను క్షమించరు. నేను సీట్ల ఒప్పందంతో కాంగ్రెస్‌లోకి రావడం లేదు అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దోపిడీకి గురవుతోంది. తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. పొంగులేటిని కాంగ్రెస్‌లోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. పొంగులేటి చేరిక సభ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది.. వారిద్దరూ హ్యాండ్ ఇవ్వనున్నారా? -
టీ కాంగ్రెస్ లో చేరికలు
-
కాంగ్రెస్ లో చేరనున్న పొంగులేటి మరియు జూపల్లి
-
పొంగులేటి వ్యాఖ్యల పై ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి రియాక్షన్
-
పొంగులేటి,జూపల్లి వర్సెస్ బీఆర్ఎప్
-
'పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదు.. 9 ఏళ్లుగా ఆత్మాభిమానం ఎటుపోయింది'
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డిలను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయంపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. వీరిద్దరు చాలా కాలంగా పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా ప్రవరిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ కంటే వ్యక్తులమే గొప్ప అనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సందర్భం లేకుండా సందర్భం సృష్టించుకుని ప్రవర్తించారని చెప్పుకొచ్చారు. 'తమను ఏం చేయలేరనుకొని ఇష్టారీతిలో వ్యవహరించారు. వ్యక్తులకు తలొగ్గి పార్టీ ప్రవర్తించదు. ఒకరిద్దరి కోసం పార్టీని పణంగా పెట్టం. పార్టీ అధినేతనే విమర్శించే స్థాయికి చేరుకోవడం పరాకాష్ట. ఎవరినైనా వదులుకోకుండా ఉండాలనే పార్టీ చూస్తుంది. కేసీఆర్‌ను తిట్టిన వారిని కూడా రాష్ట్ర అవసరాల దృష్ట్యా పార్టీలో చేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. టీఆర్ఎస్ స్థాపించిన 11ఏళ్ళ తర్వాత జూపల్లి పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కూడా ప్రాధాన్యత ఇచ్చింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని జూపల్లికి మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఓడినా ఓపికతో వేచి చూడాలని పార్టీ చెప్పింది. కేటీఆర్ కూడా చాలా సార్లు మాట్లాడారు. పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వకుంటే అధిష్టానం దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని కాదని రెబల్స్‌ను పోటీలో నిలబెట్టారు. గత తొమ్మిది ఏళ్ళు గా ఆత్మాభిమానం ఎటుపోయింది? ఇన్ని రోజులు ఏం చేశాడు?' అని నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. చదవండి: పొంగులేటి, జూపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ -
పొంగులేటి రూటు ఎటు? అక్కడి నుంచే పోటీ!
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. గులాబీ పార్టీకి దూరమైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంతంగా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. మరో మూడు సెగ్మెంట్లకు ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే తాను పోటీ చేయబోయే నియోజకవర్గం కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇంతకీ పొంగులేటి ఏ పార్టీలో చేరబోతున్నారు? ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఈ ప్రశ్నలకు క్లారిటీ ఎప్పడు ఇస్తారు? కారు ఎగ్జిట్ షేక్ హ్యాండ్ కోసమా? తనకు, తన అనుచరులకు సరైన న్యాయం జరగడంలేదని ప్రకటించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాన్నాళ్ళ క్రితమే బీఆర్ఎస్ నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశిస్తున్న ఆయన అనుచరులు కూడా పొంగులేటి వెంటే నడుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తూ బీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ఎనిమిదేళ్ల కాలంగా తనకు, తనను నమ్ముకున్నవారికి గులాబీ పార్టీలో ఎలాంటి గుర్తింపు లభించలేదని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పొంగులేటికి బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం రివర్స్‌లో కౌంటర్స్ ఇస్తున్నారు. జిల్లా అంతటా పొంగులేటి వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాజకీయ ఆత్మీయ సమ్మేళనాలు నియోజకవర్గాల్లో పొంగులేటి నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు సైతం వ్యూహాత్మకంగా జరుగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే..ఇందులో ఏడు నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తయ్యాయి. ఇందులో పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట, వైరా నియోజకవర్గాల్లో తన వర్గం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను సైతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. పాలేరు, మధిర, సత్తుపల్లి అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా వ్యూహాత్మకంగానే ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదని ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఒక పద్దతిగా.. వ్యూహాత్మకంగా పొంగులేటి తన భవిష్యత్ రాజకీయాలను నిర్మించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొద్ది రోజుల్లోనే మూడు సెగ్మెంట్లలో కూడా తన అభ్యర్థులను పొంగులేటి ప్రకటిస్తారని తెలుస్తోంది. హైదరాబాద్‌కా? ఢిల్లీకా? ఇంకా జరగాల్సిన మూడు నియోజకవర్గాల ఆత్మీయ సమ్మేళనాల్లో.. రెండు అత్యంత కీలకం కానున్నాయి. ముందుగా భద్రాచలం ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గంలో సమావేశం పూర్తయ్యాక.. జనరల్ సీట్లైన కొత్తగూడెం...ఆఖరులో ఖమ్మం పట్టణాల్లో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. తాను అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని పొంగులేటి ఇప్పటికే చెప్పారు. అయితే ఎక్కడి నుంచి పోటీచేస్తారో కొత్తగూడెం, ఖమ్మం సమావేశాల్లో ప్రకటించనున్నారు. ఆత్మీయ సమ్మేళనాల్లో ఆఖరుగా నిర్వహించే ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. బహుశా ఖమ్మం నుంచే పొంగులేటి పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం అదొక మిస్టరీ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక్కటే గులాబీ పార్టీకి కొరుకుడు పడటంలేదు. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ ఒక్కో సీటు మాత్రమే బీఆర్ఎస్కు దక్కంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గత ఎన్నికల్లో ఎంపీ సీటు ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక తనకు బీఆర్ఎస్లో భవిష్యత్ ఉండదనే నిర్ణయానికి వచ్చాకే పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. తనతోపాటు బీఆర్ఎస్లో చేరినవారంతా ఇప్పుడు పొంగులేటి వెంటే ఉన్నారు. వారినే వివిధ సెగ్మెంట్లలో అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. ఈ నెలాఖరుకు ఆత్మీయ సమ్మేళనాలన్నీ పూర్తి చేసి..తాను చేరబోయే పార్టీపై కూడా స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. పోటీ చేయబోయే స్థానం, చేరబోయే పార్టీ పేరు ప్రకటిస్తే ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కుతాయని టాక్ నడుస్తోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
బీజేపీలోకి పొంగులేటి.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశాలకు తెలంగాణ నుంచి బండి సంజయ్‌తో పాటుగా బీజేపీ నేతలు పాల్గొన్నారు. కాగా, సమావేశాల అనంతరం.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సమావేశంలో ప్రధాని మోదీ ప్రజా సంగ్రామ యాత్రను ప్రత్యేకంగా రెండు సార్లు ప్రశంసించారు. ప్రభుత్వ వేధింపులను తట్టుకొని పాదయాత్రను కొనసాగిస్తున్న విషయాన్ని అభినందించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. బెంగాల్ తరహాలో హింసాత్మక పాలన జరుగుతోంది. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి చేరే అంశంపై నాకు ఎలాంటి సమాచారం లేదు. మా సిద్ధాంతం నచ్చి పార్టీలోకి వచ్చే వారందరికీ ఆహ్వానం పలుకుతున్నాము. మా పార్టీలోకి ఎవరు వచ్చినా.. రాకున్నా.. ప్రజలే పార్టీని అధికారంలోకి తీసుకువస్తారు అని కామెంట్స్ చేశారు. -
మురుగు మాయమైంది..: తుమ్మల
ఖమ్మం (అర్బన్) : హైదరాబాద్ ట్యాంక్ బండ్‌ను తలదన్నేలా ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ అతి తక్కువ కాలంలో అభివృద్ధి చేయడం అభినందనీయమని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ఆదివారం ట్యాంక్ బండ్‌ను ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఏ చెరువుకు ఇవ్వని విధంగా లకారం చెరువుకు నగరంలో రూ.23 కోట్లతో అభివృద్ధి చేశామని అన్నారు. మిషన్ కాకతీయ పథకంలో రూ 17.5 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఒకప్పుడు మురుగు నీటితో కంపు కొట్టిన చెరువు నేడు కృష్టానది జలాలతో కలకలలాడుతోందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఈ చెరువు మొత్తం కబ్జాలకు గురైందని అన్నారు. ఎప్పుడైనా ఇంత అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అజయ్‌కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి వెంటబడి నిధులు సమకూర్చుకున్నారని అన్నారు. నగరంలోనే ఉన్న అటవీ భూమి 400 ఎకరాల్లో కూడా పార్కుగా నగర వాసులకు ఆహ్లదం అందించాలనే తలంపుతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయించడం జిల్లా ప్రజల ఆదృష్టం అన్నారు. కష్టాల్లో ఉన్న గ్రానైట్ పరిశ్రమను ఆదుకునేందుకు మంత్రి తుమ్మల ప్రభుత్వ సహకారంతో చర్యలు తీసుకున్నారని ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు గుర్తు చేశారు. హైదరాబాద్ తలదన్నేలా త్వరలో ఖమ్మంలో కూడా రింగ్ రోడ్డు నిర్మాణం చేయబోతున్నట్లు తెలిపారు. జాతీయ పార్టీలను నమ్ముకుంటే ఢీల్లిలో బానిసలం అవుతమని అన్నారు. గాంధీ భవన్లో కూర్చోని సర్వే చేసుకోవడం కాదని.., ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలన్నారు. జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. రఘునాథపాలెం మండలంలో సాగు నీరు అందించేందుకు ఉపయోగపడే బుగ్గవాగునీటిని అందించడానికి అవసరమైన కాల్వల నిర్మాణానికి భూసేకరణ ఇతర పనులకు అవసరమైన రూ 37 కోట్లును కొద్ది రోజుల్లో మంజూరు చేస్తానని హరీష్‌రావు అన్నారు. ప్రూట్ మార్కెట్ ఏర్పాటుకు కావాల్సిన స్థలం ఉంటే వెంటనే నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. మురుగు మాయమైంది..: తుమ్మల ఒకప్పుడు మురుగు కూపంగా ఉన్న లకారం చెరువును నేడు సుందరీకరణగా తీర్చిదిద్దామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నాడు ఖమ్మం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తనకు మిగిలిన పనులు చేయడానికి సీఎం కేసీఆర్ మళ్లీ అవకాశం కల్పించడం ఆదృష్టంగా ఉందని అన్నారు. ఖమ్మం నగరంలోని సాగర్ ప్రధాన కాల్వ కట్టలకు ఖాళీ స్థలాల్లో కూడా బ్యూటిపి కేషన్ చేసి నగర వాసులకు అందిస్తామన్నారు. 180 కోట్లుతో రింగ్‌రోడ్డు నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ ఇప్పటికే నిధులు కేటాయించారని, త్వరలోనే నిర్మాణం చేసి చూపిస్తామన్నారు. కాళేశ్వరం తరహాలనే గోదావరి నీళ్లను జిల్లాలో సస్యశ్యామలం చేసే విధంగా పనులన్ని యుద్ధ ప్రాతిపధికన చేయనున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం :పొంగులేటి అభివృద్ధి సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదారాబాద్ కంటే ఖమ్మం అభివృద్ధికి కంకణం కట్టుకుని సాధిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ఒక మోడల్ జిల్లాగా నిలుస్తుందని గుర్తు చేశారు. అందరి సహకారంతోనే..: అజయ్ సీఎం కేసీఆర్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తన్నీరు హరీష్‌రావు, కేటీఆర్‌ల కృషితోనే ఖమ్మం అభివృద్ధి సాధ్యమవుతోందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. లకారం ట్యాంక్ బండ్ నిర్మాణానికి నాడు మంత్రి తుమ్మల గుణపం వేశారని, అదే చెరువులో నేడు బోటులో షికా>రు చేశారని గుర్తు చేశారు. ఇంకా కలెక్టర్ లోకేష్‌కుమార్, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో 6 దశాబ్దాలుగా జరిగని అభివృద్ధిని మూడు సంవత్సరాల్లో సాధించుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ది సంస్థ చైర్మన్ బేగ్ తదితరులు మాట్లాడారు. ఈ సభలో జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, మేయర్ డాక్టర్ పాపాలాల్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, ఎమ్మెల్యేలు బానోత్ మధన్‌లాల్, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, కమిషనర్ సంధీప్కుమార్ షూ, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ, కార్పొరేటర్లు చావా నారాయణరావు, కర్నాటి కృష్ణ, బిక్కసాని ప్రశాంతిలక్ష్మి, కొత్తపల్లి నీరజ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, సీతారామ ప్రాజెక్టు సీఈ సుధాకర్, ఇరిగేషన్ ఎస్ఈ ధర్మ,ఈఈలు నరిసింహరావు, వెంకటేశ్వరరెడ్డి, డీఈ ఆర్జన్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ నివాసంలో తేనేటి విందు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు తన్నీరు హరీష్‌రావు, తుమ్మలనాగేశ్వరరావులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఆదివారం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన అల్పాహారం, తేనేటి విందు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీ పొంగులేటి ఇటీవల నిర్మించిన నూతన నివాసాన్ని పరిశీలించారు. -
టీ-వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీగా జె. మహేందర్ రెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగ కమిటీలను తెలంగాణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం ప్రకటించారు. మెదక్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులుగా- జి. శ్రీధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులుగా- బండారు వెంకట రమణ వరంగల్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా- డి. సాంబయ్య తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్ సెక్రటరీగా -బత్తుల సంతోష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్ జనరల్ సెక్రటరీగా- డి. రాహుల్ గౌడ్ తెలంగాణ వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీగా- జె. మహేందర్ రెడ్డి వరంగల్ జిల్లా వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీగా- వి. రాజ్‌కుమార్ గౌడ్లను నియమించారు. -
వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించిన పొంగులేటి
ఖమ్మం: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలో మిని వాటర్ ఫ్లాంట్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆదివారం నారాయణపురం గ్రామంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న అంగన్వాడీ కేంద్రానికి నిధులు కేటాయిస్తామని పొంగులేటి చెప్పారు. పాఠశాల భవనం మరమ్మత్తు, చర్చికి చుట్టుగొడ ఏర్పాటు కోసం నిధులు కేటాయిస్తామని హామినిచ్చారు. -
వైఎస్సార్ సీపీలో పాలమూరుకు పెద్దపీట
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ప్రకటించిన రాష్ర్ట కమిటీలో మహబూబ్‌నగర్ జిల్లా నేతలకు చోటు దక్కింది. మాజీ ఎమ్మెల్యే, పార్టీ రైతు విభాగం రాష్ర్ట అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. నాగర్‌కర్నూలుకు చెందిన మాదిరెడ్డి భగవంతురెడ్డి రాష్ట్ర కార్యదర్శిగా, కోస్గికి చెందిన గందె హన్మంతు రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ జిల్లా పరిశీలకులుగా గున్నం నాగిరెడ్డి, సహ పరిశీలకులుగా కె.సుదీప్‌రెడ్డి, వేముల శేఖర్‌రెడ్డి వ్యవహరిస్తారు. కాగా ఎడ్మ కిష్టారెడ్డి నల్లగొండ, భగవంతురెడ్డి ఆదిలాబాద్ జిల్లాల పరిశీలకుగా వ్యవహరిస్తారు. గత నెల తొమ్మిదిన ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గ జాబితాలో ఎడ్మ కిష్టారెడ్డి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. రాష్ట్ర కార్యవర్గంలో స్వల్ప మార్పు చేస్తూ కిష్టారెడ్డికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. గతంలో ప్రకటించిన రాష్ట్ర కమిటీలో భీష్వ రవీందర్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా, రాంభూపాల్‌రెడ్డి, భీమయ్యగౌడ్, లక్ష్మణ్ రాష్ట్ర కార్యవర్గంలో నియమితులయ్యారు. జిల్లా నేతలకు పార్టీ రాష్ట్ర కమిటీలో పెద్ద పీట వేయడంపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, తెలంగాణ కమిటీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు జిల్లా నేతల సహకారంతో పార్టీని మరింత బ లోపేతం చేస్తామన్నారు. పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా : భగవంతరెడ్డి నాగర్‌కర్నూల్: పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మాదిరెడ్డి భగవంతరెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన అనంతరం శుక్రవారం ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు. పార్టీ ఇచ్చిన ఆదేశాలు పాటిస్తూ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని ముందుకు తీసుకెళ్తానని అన్నారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ రైతులకు, నిరుపేదల కోసం వైఎస్ఆర్సీపీ తరఫున నియోజకవర్గంలో పోరాటాలు నిర్వహిస్తానన్నారు. గ్రామగ్రామాన నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేయటమే లక్ష్యమని వివరించారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేవి అయితే మద్దతిస్తామని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామన్నారు. అధిష్టానానికి కృతజ్ఞతలు కోస్గి: వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించినందుకు కోస్గి పట్టణానికి చెందిన గందె హన్మంతు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ పార్టీ కమిటీలో కొడంగల్ నియోజకవర్గానికి ప్రాధాన్యం ఇస్తూ తనకు పార్టీ పదవి ఇచ్చారని.. తనకు పదవి రావడానికి సహకరించిన నాయకులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు చెప్పారు. -
వైఎస్సార్సీపీ తెలంగాణ కొత్త టీం
8 మంది ప్రధాన కార్యదర్శులు 11 మంది కార్యదర్శులు 11 మంది సంయుక్త కార్యదర్శుల నియామకం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయి కమిటీ ఏర్పడింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడిగా ఏర్పాటు చేసిన కమిటీకి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ కమిటీలో 8 మంది ప్రధాన కార్యదర్శులు, 11 మంది కార్యదర్శులు, 11 మంది సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు కార్యవర్గ సభ్యులు ఉన్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర అనుబంధ సంఘాలు పదింటికి అధ్యక్షులను, ముగ్గురు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులను నియమించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర కమిటీ జాబితాను విడుదల చేశారు. ప్రధానకార్యదర్శులు: ఎమ్మెల్యే పి.వెంకటేశ్వర్లు (ఖమ్మం), కె.శివకుమార్ (హైదరాబాద్), గట్టు శ్రీకాంత్‌రెడ్డి (నల్లగొండ), యెర్నేని వెంకటరత్నంబాబు(నల్లగొండ), ఎన్.సూర్యప్రకాష్ (మెదక్), హెచ్ఏ రెహ్మాన్ (హైదరాబాద్), ఎం.దయానంద్ విజయ్‌కుమార్ (ఖమ్మం), జి.నాగిరెడ్డి (నల్లగొండ-రాష్ట్రపార్టీ కార్యాలయ సమన్వయకర్త) నియమితులయ్యారు. కార్యదర్శులు: వండ్లోజుల వెంకటేశ్ (నల్లగొండ), ఏనుగు మహిపాల్‌రెడ్డి, జి.సూర్యనారాయణరెడ్డి, కె.అమృతసాగర్ (రంగారెడ్డి), జి. రాంభూపాల్‌రెడ్డి (మహబూబ్‌నగర్), క్రిసోలైట్ (హైదరాబాద్), కొమ్మర వెంకటరెడ్డి (మెదక్), బోయినపల్లి శ్రీనివాసరావు (కరీంనగర్), మాశారం శంకర్ (ఆదిలాబాద్),అల్లూరి వెంకటేశ్వరరెడ్డి (ఖమ్మం), విలియం ముని గాల (వరంగల్) నియమితులయ్యారు. సంయుక్త కార్యదర్శులు: టి.భూమయ్యగౌడ్,బంగి లక్ష్మణ్ (మహబూబ్‌నగర్‌జిల్లా), పి.శ్రీనివాసరెడ్డి (మెదక్), ఎస్.బి.మోహన్‌కుమార్, కసిరెడ్డి ఉపేంద్ర రెడ్డి, ఎస్.హరినాథ్‌రెడ్డి (హైదరాబాద్), గుడూరు జైపాల్‌రెడ్డి, ఏరుగు సునీల్ కుమార్ (నల్లగొండ), షర్మిల సంపత్ (ఖమ్మం), తోడసం నాగోరావు (ఆదిలాబాద్), సుజాతా మంగీలాల్ (వరంగల్) ఉన్నారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జూపల్లి రమేశ్ (ఖమ్మం), గిడిగంటి శివ (వరంగల్) ఉన్నారు. పార్టీ కార్యక్రమాల సమన్వయకర్తగా పెద్దపట్లోళ్ల సిద్దార్ధరెడ్డి నియమితులయ్యారు. అనుబంధ సంఘాల అధ్యక్షులు పార్టీ రాష్ట్ర రైతువిభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి (మహబూబ్‌నగర్), యువజన విభాగం అధ్యక్షుడిగా బేష్వా రవీందర్ (మహబూబ్‌నగర్), ఎస్సీసెల్ అధ్యక్షుడిగా మెండం జయరాజ్ (ఖమ్మం), మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ముజ్తిబాఅహ్మాద్-ముస్తాఫా (రంగారెడ్డి), సేవాదళ్ / వాలంటీర్ల అధ్యక్షుడిగా వెల్లాల రామ్మోహన్ (హైదరాబాద్), సాంస్కృతి విభాగం అధ్యక్షుడిగా సదమల్లా నరేష్ (కరీంనగర్), కార్మిక విభాగం అధ్యక్షుడిగా నర్రా భిక్షపతి (మెదక్ ), డాక్టర్స్ వింగ్ అధ్యక్షురాలిగా పి.ప్రఫుల్ల (హైదరాబాద్), క్రమశిక్షణా కమిటీ అధ్యక్షుడిగా విఎల్‌ఎన్ రెడ్డి (ఖమ్మం), క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా కె. జార్జి హర్బట్ (రంగారెడ్డి) నియమితులయ్యారు. రాష్ర్ట పార్టీ అధికారప్రతినిధులుగా కొండా రాఘవరెడ్డి, సత్యం శ్రీరంగం (రంగారెడ్డి), ఆకుల మూర్తి (ఖమ్మం) నియమితులయ్యారు. 4 జిల్లాల కమిటీల కొత్త అధ్యక్షులు.. మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, రంగారెడ్డిజిల్లా పార్టీ అధ్యక్షుడిగా జి. సురేష్‌రెడ్డి, వరంగల్జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిన్నారెడ్డి మహేందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాయుడు ప్రకాష్‌లను నియమించారు. తెలంగాణ రాష్ట్ర కమిటీని మరింత విస్తరిస్తాం: పొంగులేటి రాబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీని మరింత విస్తరించి తెలంగాణలో వైఎస్సార్సీపీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక దివంగత వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు అమలు కావాలని కోరుకుంటున్న ప్రజల పక్షాన నిలబడి అందుకు తమ పార్టీ కృషి చే స్తుందన్నారు. రాజన్న కన్న కలలను తెలంగాణలో సాకారం చేసుకునే ందుకు కృషి చేస్తామన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణలో అనేక కష్ట,నష్టాలు ఓర్చి పనిచేశారని, రానున్న కొద్దిరోజుల్లోనే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో సముచితమైన రీతిలో గౌరవించేలా చూస్తామన్నారు. పార్టీకి అండగా ప్రజలున్నారని ఆయన చెప్పారు. పార్టీ కోసం పాటుపడిన వారికి తగిన గుర్తింపును ఇస్తామని చెప్పారు. పార్టీ నేతలు కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాష్, గున్నం నాగిరెడ్డి, సత్యం శ్రీరంగం, జార్జి హర్బర్ట్, ఏనుగు మహీపాల్‌రెడ్డి తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. -
శోభానాగిరెడ్డికి నివాళి
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకురాలు శోభానాగిరెడ్డి మృతిపార్టీకి తీరని లోటని ఆ పార్టీ నాయకుడు, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శోభానాగిరెడ్డి సంతాప సభ గురువారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నగర అధికార ప్రతినిధి హెచ్.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. శోభానాగిరెడ్డి చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. సభలో పొంగులేటి మాట్లాడుతూ.. వైఎస్ మృతి అనంతరం జగన్మోహన్రెడ్డి కుటుంబానికి శోభానాగిరెడ్డి అండగా నిలిచారని, పార్టీలో కీల కంగా వ్యవహరించారని అన్నారు. వైఎస్ విజయమ్మకు కుడి భుజంలా వ్యవహరించిన శోభమ్మ మృతి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. ‘రాజన్న ఆశయ సాధనకు అహర్నిశలు కృషి చేస్తున్న జగనన్నకు శోభమ్మ అండగా ఉన్నారు. జగన్‌ను సీఎంగా చూడకుండానే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్లడం బాధాకరం’ అని అన్నారు. సభలో పార్టీ ఖమ్మం అసెంబ్లీ అభ్యర్థి కూరాకుల నాగభూషణం, పార్టీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి శ్రీలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి నిరంజన్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు తోట రామారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ముసా ్తఫా, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, నగర అధ్యక్షురాలు కొత్తగుండ్ల శ్రీలక్ష్మి, నాయకులు విఎల్‌ఎన్.రెడ్డి, జిల్లేపల్లి సైదులు, భీమనాధుల అశోక్‌రెడ్డి, ఆకుల మూర్తి, వంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, ఆరెంపుల వీరభద్రం, మేడా విజయ్‌కుమార్ పాల్గొన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో.. శోభానాగిరెడ్డి మృతిపట్ల కుక్కునూరులో పార్టీ మండల కన్వీనర్ కుచ్చర్లపాటి నరసింహరాజు ఆధ్వర్యంలో గురువారం ఇక్కడ సంతాప సభ జరిగింది. ఆమె చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పగిళ్ల అల్లేశ్, నాయకులు గంగుల రమణారెడ్డి, రాయి రవీందర్, పరవా రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దమ్మపేటలో సంతాప సభ జరిగింది. హాజరైన నాయకులు, కార్యకర్తలు రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. ఈ సభలో పార్టీ మండల అధ్యక్షుడు జూపల్లి ఉపేంద్రబాబు, పట్టణ అధ్యక్షుడు పగడాల రాంబాబు, వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దారా యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో.. భూమ శోభానాగిరెడ్డి మృతికి సంతాపంగా గురువారం భద్రాచలంలో సంతాపసభ జరిగింది. ఆమె చిత్రపటానికి నాయకులు పూలమాలలువేసి, కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ సభలో నాయకులు కొవ్వూరి రాంబాబు, దామర్ల రేవతి, కొప్పినీడు నాని తదితరులు పాల్గొన్నారు. వెంకటాపురంలో పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిలిపేసి, అత్యవసర సమావేశం నిర్వహించి, రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ సమావేశంలో నాయకులు చిట్టెం సత్యనారాయణ(ఎర్ర బాబు), పాండియన్ రాకేష్, యన్నమల్ల దాసు, జెజ్జరి నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. చర్లలో జరిగిన పార్టీ అత్యవసర సమావేశంలో నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు రామగిరి యాకయ్య, నాయకులు కాళ్ల కృష్ణ, పొడుపుగంటి సమ్మక్క, తడికల అనుసూర్య తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందు నియోజకవర్గంలో.. శోభానాగిరెడ్డి మృతికి సంతాపంగా బయ్యారం మండల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి సంతాపం తెలిపారు. టేకులపల్లిలోని పార్టీ కార్యాలయంలో సంతాప సమావేశం జరిగింది. హాజరైన వారంతా రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో పార్టీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ ఏలూరి కోటేశ్వరరావు, నాయకులు బట్టు శివ, నర్సింగ్ లక్ష్మయ్య, పెద్దబోయిన మదనయ్య తదితరులు పాల్గొన్నారు. పాలేరు నియోజకవర్గంలో.. శోభానాగిరెడ్డి మృతిచెందారన్న వార్తతో కూసుమంచి మండలంలోని పార్టీ శ్రేణుల్లో విషాదాన్ని నింపింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూసుమంచిలో సమావేశమయ్యారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం, శాంతియాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బజ్జూరి వెంకట రెడ్డి, నాయకులు జర్పుల బాలాజీనాయక్, పిట్టా సత్యనారాయణరెడ్డి, టి.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేలకొండపల్లిలో సంతాపం సమావేశం జరిగింది. పార్టీ మండల అధ్యక్షుడు కొర్లకుంట్ల నాగేశ్వరరావు, నాయకులు కోటి సైదారెడ్డి, పాకనాటి సంగీత, కాకమాను మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు. మణుగూరు నియోజకవర్గంలో.. మోరంపల్లి బంజరలో జరిగిన సంతాప సభలో నాయకులు కైపు సుబ్బరామిరెడ్డి, జె.మల్లారెడ్డి, బత్తుల రామకొండారెడ్డి, కైపు నాగిరెడ్డి తదితరులు మాట్లాడుతూ.. పార్టీలో శోభానాగిరెడ్డి మృతితో డైనమిక్ లీడర్‌ను పార్టీ కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. శోభానాగిరెడ్డి మృతికి సంతాపంగా బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు గ్రామంలో గురువారం రాత్రి శాంతి ర్యాలీ, స్కూల్ సెంటర్లో సంతాప సభ జరిగాయి. శోభానాగిరెడ్డి చిత్రపటం వద్ద నాయకులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలలో పార్టీ నాయకులు మేడగం శ్రీనివాసరెడ్డి, కాటం వెంకట్రామిరెడ్డి, బానోతు రామదాసు, ఇమ్మడి రాము తదితరులు పాల్గొన్నారు. వైరా నియోజకవర్గంలో.. శోభానాగిరెడ్డి మృతిపట్ల వైఎస్ఆర్సీపీ నాయకుడు, వైరా అసెంబ్లీ అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైరాలోని పార్టీ కార్యలయంలో ఏర్పాటైన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కోసం ఆవిర్భావం నుంచి ఆమె కృషి చేశారని, వైఎస్ఆర్ కుటుంబానికి అండగా నిలిచారని నివాళులర్పించారు. ఆమె మృతితో శక్తిమంతురాలైన నాయకురాలిని పార్టీ కోల్పోయిందన్నారు సంతాప సూచకంగా పార్టీ శ్రే ణులు నల్ల బ్యాడ్జీలు ధరించారు. తొలుత, రెండు నిముషాలపాటు సభికులు మౌనం పాటించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ షేక్ లాల్‌మహ్మద్, నాయకులు బొర్రారాజశేఖర్, సూతకాని జైపాల్, తేలప్రోలు నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు. జూలూరుపాడులో జరిగిన సంతాప సభలో పార్టీ మండల కన్వీనర్ పొన్నెకంటి వీరభద్రం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పూర్ణకంటి నాగేశ్వరరావు, నాయకులు దారావతు నాగేశ్వరరావు, కాళ్లూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఏన్కూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సంతాప సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ ముక్తి వెంకటేశ్వర్లు, నాయకులు నలమల శివకుమార్, నలమల వెంకటేశ్వరరావు, భూక్యా సక్రునాయక్ తదితరులు పాల్గొన్నారు. శోభా నాగిరెడ్డి మృతికి సంతాపంగా కారేపల్లి మండలంలో పార్టీ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించారు. కారేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సంతాప సమావేశంలో నాయకులు విష్ణువర్థన్‌రెడ్డి, ఇమ్మడి తిరుపతిరావు, కోట సత్యానారాయణ, మండెపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మధిర నియోజకవర్గంలో.. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద శోభానాగిరెడ్డి చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ అంకసాల శ్రీనివాసరావు, నాయకులు లక్కిరెడ్డి నర్సిరెడ్డి, తల్లపురెడ్డి అంకాలరెడ్డి, శీలం అక్కిరెడ్డి, జంగా పుల్లారెడ్డి పాల్గొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో.. శోభానాగిరెడ్డి మృతివార్త తెలియగానే కల్లూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిలిపివేసి, సంతాప సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కీసర వెంకటేశ్వరరెడ్డి, మండల కన్వీనర్ పాలెపు రామారావు, పట్టణ కన్వీనర్ కర్నాటి అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేంసూరులో జరిగిన సంతాప సమావేశంలో పొంగులేటి మాధురి, పార్టీ మండల కన్వీనర్ అట్లూరి సత్యనారాయణరెడ్డి, నాయకులు జంగా శ్రీనివాసరెడ్డి, గండ్ర నరోత్తమరెడ్డి, బాపూజీ తదితరులు పాల్గొన్నారు. -
13 నుంచి జిల్లాలోషర్మిల పర్యటన
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: రాజన్న కుమార్తె, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఈనెల 13వ తేదీ నుంచి జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం షర్మిల పర్యటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 13వ తేదీ సాయంత్రం 4గంటలకు కూసుమంచిలో నిర్వహించనున్న సభలో షర్మిల ప్రసంగిస్తారు. 5గంటలకు తిరుమలాయపాలెం, 6గంటలకు ఖమ్మం రూరల్ మండలం పెద్దతండలో ప్రచారం నిర్వహిస్తారు. 14వ తేదీ ఉదయం 9గంటలకు రఘునాధపాలెం మండలం మంచుకొండలో, 10గంటలకు కారేపల్లి, 11గంటలకు గార్ల, సాయంత్రం 4గంటలకు టేకులపల్లి, 5గంటలకు పాల్వంచ, రాత్రి 7గంటలకు మణుగూరులో రోడ్‌షో ద్వారా ప్రచారం నిర్వహిస్తారు. 15వ తేదీ ఉదయం 9గంటలకు అశ్వాపురం, 10గంటలకు బూర్గంపాడు మండలం సారపాక, 11గంటలకు భద్రాచలం, సాయంత్రం 5గంటలకు ములకలపల్లి, రాత్రి 7గంటలకు దమ్మపేటల్లో రోడ్‌షో ద్వారా షర్మిల ప్రచారం నిర్వహిస్తారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని పాయం, పొంగులేటి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. -
రాజన్న ఆశయ సాధనే ధ్యేయం
ఖమ్మం హవేలి, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయ సాధనే ధ్యేయంగా జిల్లా ప్రజలందరి అండదండలతో ముందుకెళ్తానని వైఎస్సార్సీపీ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని ఆయన అన్నారు. జిల్లాలోని అన్నివర్గాల ప్రజల సహకారంతో జిల్లా అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ఆశయాల సాధన కోసం జగనన్న బాటలో నడుస్తున్న తనను జిల్లా ప్రజలు మరింతగా ఆదరిస్తూ ప్రోత్సహిస్తుండడం సంతోషకరమన్నారు. వైఎస్ ఏ కార్యక్రమం చేపట్టినా తెలంగాణ నుంచే ప్రారంభించేవారన్నారు. జగన్మోహన్రెడ్డి కూడా పార్టీ తరఫున మొదటి అభ్యర్థిగా ఇదే మైదానం నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన తనను ప్రకటించడం తెలంగాణ అభివృద్ధి పట్ల వైఎస్ కుటుంబానికి ఉన్న శ్రద్ధ ఏమిటో తెలియచేస్తోందన్నారు. అచంచల మనస్తత్వం ఉన్న వైఎస్.. జలయజ్ఞంతో పాటు ఇతర అనేక రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గిరిజన ప్రాంతమైన ఖమ్మం జిల్లాలో అనేక మంది గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్‌దేనన్నారు. పావలా వడ్డీ, పింఛన్లు ఇతర అనేక పథకాలు ప్రజలకు పక్కాగా అందేలా వైఎస్ కృషి చేశారన్నారు. రాజన్న స్ఫూర్తితో ఖమ్మం జిల్లా నుంచి లోక్‌సభ, 10శాసనసభ స్థానాలను గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. వైఎస్సార్సీపీ గురించి ఛలోక్తులు విసిరే పార్టీలు తమ అభ్యర్థులెవరో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితిలో ఉండడాన్ని గమనించాలన్నారు. వైఎస్సార్సీపీ మాత్రం ఆరు నెలల కిందే అభ్యర్థులను ఎంపిక చేసిందన్నారు. ప్రతిఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్న వైఎస్సార్సీపీతో నవ తెలంగాణ నిర్మాణం సాధ్యం అవుతుందన్నారు. అన్నివర్గాల ప్రజలకు మేలు కలిగించిన రాజన్న పథకాలను వైఎస్సార్సీపీ మాత్రమే పూర్తి స్థాయిలో కొనసాగిస్తుందన్నారు. నవ తెలంగాణలో ఇవి అత్యంత కీలకమని పొంగులేటి అన్నారు. శీనన్నను గెలిపిస్తే కేంద్రమంత్రి అవుతారు: పాయం వెంకటేశ్వర్లు పొంగులేటి శీనన్నను గెలిపిస్తే తప్పకుండా కేంద్రమంత్రి అవుతారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ ఏర్పాటులో వైఎస్సార్సీపీ కీలక ప్రాత్ర పోషిస్తుందన్నారు. గత నెల 5వ తేదీన ఖమ్మంలో జగన్ ప్రకటించినట్లు శీనన్న తప్పకుండా కేంద్రమంత్రి అవుతారని, అత్యధిక మెజారిటీతో గెలిపించి ఢిల్లీకి పంపాలన్నారు. పొంగులేటి గెలుపుతోనే జిల్లా అభివృద్ధి: కూరాకుల నాగభూషణం పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని, తద్వారా జిల్లా అభివృద్ధికి చక్కటి బాటలు పడతాయని వైఎస్ఆర్సీపీ ఖమ్మం శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్త కూరాకుల నాగ భూషణం అన్నారు. జిల్లాకు చెందిన పొంగులేటిని గెలిపించేందుకు అన్నివర్గాల ప్రజలు ఓట్లు వేయాలన్నారు. కొత్తగూడెం సెగ్మెంట్ నుంచి అత్యధిక మెజారిటీ: ఎడవల్లి కృష్ణ రాజన్న ఆశయ సాధన కోసం, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజలు కృషిచేయాలని వైఎస్ఆర్సీపీ కొత్తగూడెం నియోజకవర్గ సమన్వయకర్త ఎడవల్లి కృష్ణ అన్నారు. శీనన్న గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా కృషిచేయాలన్నారు. కొత్తగూడెం సెగ్మెంట్ నుంచి అత్యధిక మెజారిటీ వచ్చేలా చేస్తానన్నారు. రైతుబిడ్డ శీనన్నను ఆదరించాలి: తాటి వెంకటేశ్వర్లు రైతుబిడ్డగా జన్మించి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ కన్వీనర్ తాటి వెంకటేశ్వర్లు అన్నారు. శీనన్న ఖమ్మం ప్రతినిధిగా పార్లమెంటుకు వెళితే జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. జగనన్న ఆశయ సాధన కోసం శీనన్నను గెలిపించాలన్నారు. తెలంగాణ ఎంపీల్లో పొంగులేటికి అత్యధిక మెజారిటీ ఇచ్చి ఖమ్మం జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా నిలబెట్టాలన్నారు. జగనన్నకు కానుకగా ఇవ్వాలి: మదన్‌లాల్ పొంగులేటి శీనన్నను ఖమ్మం ఎంపీగా గెలిపించి జగన్‌కు కానుకగా ఇవ్వాలని పార్టీ వైరా నియోజకవర్గ సమన్వయకర్త మదన్‌లాల్ అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉన్న శ్రీనివాసరెడ్డిని గెలిపించేందుకు వైరా నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. శీనన్న వ్యక్తిగా వచ్చి శక్తిగా మారారు: గుగులోత్ రవిబాబు నాయక్ సాధారణ గ్రామీణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శీనన్న వ్యక్తిగా ప్రజల్లోకి వచ్చి శక్తిగా మారారని పార్టీ ఇల్లెందు నియోజకవర్గ కన్వీనర్ గుగులోత్ రవిబాబు నాయక్ అన్నారు. శీనన్న గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. అన్ని వర్గాలు శీనన్న నాయకత్వాన్ని కోరుకుంటున్నాయి: సాధు రమేష్‌రెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పార్టీ మూడు జిల్లాల యువజన విభాగం సమన్వయకర్త సాధురమేష్‌రెడ్డి అన్నారు. శీనన్నను గెలిపిస్తే ఎట్టిపరిస్థితుల్లో కేంద్రమంత్రి అవుతారన్నారు. వైఎస్ ఆశయాలు, పథకాలు కొనసాగించాలంటే యువనాయకులు జగనన్న, శీనన్నలతోనే సాధ్యమన్నారు. ఖమ్మం జిల్లా జగన్ శీనన్న: మెండెం జయరాజ్ ఏ పదవి లేకున్నప్పటికీ జిల్లాలోని పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పెద్దమనసుతో పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న శీనన్న మనసున్న మారాజని, ఖమ్మం జిల్లా జగన్ శీనన్న అని పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ మెండెం జయరాజ్ అన్నారు. శీనన్న రాజకీయాల్లోకి రావడం జిల్లా అదృష్టమన్నారు. అందరి పట్ల ఆప్యాయంగా ఉండే శీనన్న గెలుపు జిల్లాకు అత్యవసరమన్నారు. ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ శీనన్న: సయ్యద్ అక్రం అలీ నిరాండబరుడు, నిగర్వి అయిన శీనన్న ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ అని జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అక్రం అలీ అన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని పోయే మనస్తత్వం ఉన్న పొంగులేటి శీనన్న గెలుపు జిల్లాకు, అన్ని వర్గాల ప్రజలకు అవసరమన్నారు. పొంగులేటి గెలిస్తే ఖమ్మం జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించడం తథ్యం అన్నారు. జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్న పొంగులేటి: కీసర పద్మజారెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిన రాజన్న కుటుంబానికి అండగా నిలిచిన శీనన్నను ప్రతిఒక్కరూ ఆశీర్వదించాలని పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి అన్నారు. జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్న పొంగులేటిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. అఖండ మెజారిటీతో గెలిపించాలి: కొత్తగుండ్ల శ్రీలక్ష్మి జిల్లా అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేస్తున్న పొంగులేటి శీనన్నను అఖండ మెజారిటీతో గెలిపించాలని మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కొత్తగుండ్ల శ్రీలక్ష్మి అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త శీనన్న కోసం వంద చొప్పున ఓట్లు వేయించాలన్నారు. సర్వమత ప్రార్థనలు.. సభ అనంతరం ప్రదర్శనకు ముందుగా పొంగులేటిని మైదానంలో బ్రాహ్మణులు, ముస్లిం, క్రిస్టియన్ మత గురువులు ఆశీర్వదించారు. శీనన్న సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మండుటెండలోనూ మైదానానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈ సభలో జిల్లా అధికార ప్రతినిధి నిరంజన్‌రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ముస్తఫా, నగర పార్టీ అధ్యక్షుడు తోట రామారావు, వట్టికొండ జగన్మోహన్రావు, సంపెట వెంకటేశ్వర్లు, కొంపల్లి బాలకృష్ణ, కొండలరావు, మార్కం లింగయ్య, ఆకుల మూర్తి, జిల్లేపల్లి సైదులు, ఆరెంపుల వీరభద్రం, వెంకటేశ్వర్లు, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కందిమళ్ల బుడ్డయ్య, జూపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.