సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో పొంగులేటికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పార్టీ కండువా కప్పిన విషయం తెలిసిందే. కాగా టీపీసీసీ ప్రచార కమిటీకి గతంలో చైర్మన్‌గా ఉన్న మధు యాష్కీ గౌడ్, కన్వీనర్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీలను అదే పదవుల్లో కొనసాగించారు. ఇక ప్రచార కమిటీలో 37 మందిని కార్యనిర్వాహక సభ్యులుగా నియమించారు.
కార్యనిర్వాహక సభ్యులు వీరే..
టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్, ఎం.ప్రవీణ్ రెడ్డి, కత్తి కార్తీక గౌడ్, మహ్మద్ జావేద్ అక్రమ్, నరేంద్ర ముదిరాజ్, జూలూరు ధనలక్ష్మి గౌడ్, దయాకర్ గౌడ్, వరంగల్ రవి, నాగన్న, అముగోతు వెంకటేశ్, రాములు యాదవ్, దాస్‌గౌడ్, కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, గడుగు రోహిత్, బండ శంకర్, కోలా వెంకటేశ్, దినేశ్ సాగర్ ముదిరాజ్, గోపాల్‌రెడ్డి, దండెం రాంరెడ్డి, శ్రీకొండ మల్లేష్, కోట శ్రీనివాస్, గిరి కొండల్, సంగీతం శ్రీనివాస్, చారులత రాథోడ్, రేణుక, గిరి నాగభూషణం, భీం భరత్, కె.శివ కుమార్, సాయిని రవి, రఘువీర్ గౌడ్, డా.కె.విజయ్‌కుమార్, జి. లోకేశ్ యాదవ్, ఏఎం ఖాన్, జంగారెడ్డి, డా. వడ్డేపల్లి రవి, తాటికొండ శ్రీనివాస్, డా. మోతీ లాల్‌ను కార్యనిర్వాహక సభ్యులుగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అవకాశం కల్పించారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా...
వీరితో పాటు పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, కౌన్సిల్ నేత, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు ప్రచార కమిటీలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment