సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా మంత్రి పొంగులేటి సవాల్‌ను కేటీఆర్ స్వీకరించారు. అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుదాం రావాలంటూ ప్రతి సవాల్ విసిరారు. దీంతో, రాష్ట్రంలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి సవాల్‌ను స్వీకరిస్తున్నాను. చిత్తశుద్ధి ఉంటే రండి.. హైకోర్టు సీజే దగ్గరకు పోదాం. అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుదాం. అక్రమాలు జరగలేదని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటాను. లేదంటే సెంట్రల్ కమిషనర్ దగ్గరకు పోదాం. రేవంత్ ముఖ్యమంత్రి పదవి ఊడగొట్టాలన్న ఆలోచన ఉన్నట్టుంది. రాజీనామా చేస్తానని పొంగులేటి ప్రగల్భాలు చేస్తున్నాడు. అమృత్ టెండర్లు రద్దు చేసి సిగ్గు తెచ్చుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీకు చిత్తశుద్ధి ఉంటే రండి.. హైకోర్టు సీజే దగ్గరకు పోదాం. అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ అడుగుదాం.
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/Dzl4ZsziiD— BRS Party (@BRSparty) September 22, 2024
కేటీఆర్ ఆరోపణలపై అంతకుముందు మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.8,888 కోట్ల టెండర్లు ఎవరు దక్కించుకున్నారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. టెండర్లు పిలిచినట్లు కేటీఆర్ నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్ధం. నిరూపించలేకపోతే కేటీఆర్ రాజీనామా చేస్తారా? ఈ ప్రభుత్వం కేవలం రూ.3,516 కోట్ల పనులకే టెండర్లు పిలిచింది. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ పేరు మీద రూ.39వేల కోట్ల ప్రజాధనం లూటీ చేశారు. ఆధారాలతో కూడిన విమర్శలు చేయాలి. ఖమ్మంలో నాపై పోటీ చేసిన ఉపేందర్‌రెడ్డి అల్లుడు సృజన్‌రెడ్డి ఒకటి దక్కించుకున్నారు. టెండర్లు వేయొద్దని ఏ కంపెనీని కూడా ప్రభుత్వంలోని పెద్దలు బెదిరించలేదు. మేం పిలిచిన రీ టెండర్లలో గతంకంటే రూ.54 కోట్లు తక్కువకే బిడ్లు వచ్చాయి అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో పోలింగ్ తేదీకి ఒక్కరోజు ముందే గత ప్రభుత్వం ఈ టెండర్లను కట్టబెట్టిందని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: కూకట్‌పల్లిలో హైడ్రా.. బీఆర్‌ఎస్ నేత అక్రమ నిర్మాణాలు కూల్చివేత
Comments
Please login to add a commentAdd a comment