వైఎస్సార్‌సీపీ తెలంగాణ కొత్త టీం | ysrcp announces state committee in telangana | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ తెలంగాణ కొత్త టీం

Published Sat, Jan 10 2015 2:06 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి - Sakshi

లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి

 8 మంది ప్రధాన కార్యదర్శులు
11 మంది కార్యదర్శులు
11 మంది సంయుక్త కార్యదర్శుల నియామకం

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర  పూర్తి స్థాయి కమిటీ ఏర్పడింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడిగా  ఏర్పాటు చేసిన కమిటీకి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ కమిటీలో 8 మంది ప్రధాన కార్యదర్శులు, 11 మంది కార్యదర్శులు, 11 మంది సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు కార్యవర్గ సభ్యులు ఉన్నారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర అనుబంధ సంఘాలు పదింటికి అధ్యక్షులను, ముగ్గురు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులను నియమించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర కమిటీ జాబితాను విడుదల చేశారు.
 
 ప్రధానకార్యదర్శులు: ఎమ్మెల్యే పి.వెంకటేశ్వర్లు (ఖమ్మం), కె.శివకుమార్ (హైదరాబాద్), గట్టు శ్రీకాంత్‌రెడ్డి (నల్లగొండ), యెర్నేని వెంకటరత్నంబాబు(నల్లగొండ), ఎన్.సూర్యప్రకాష్ (మెదక్), హెచ్‌ఏ రెహ్మాన్ (హైదరాబాద్), ఎం.దయానంద్ విజయ్‌కుమార్ (ఖమ్మం), జి.నాగిరెడ్డి (నల్లగొండ-రాష్ట్రపార్టీ కార్యాలయ సమన్వయకర్త) నియమితులయ్యారు.
 
 కార్యదర్శులు: వండ్లోజుల వెంకటేశ్ (నల్లగొండ), ఏనుగు మహిపాల్‌రెడ్డి, జి.సూర్యనారాయణరెడ్డి, కె.అమృతసాగర్ (రంగారెడ్డి), జి. రాంభూపాల్‌రెడ్డి (మహబూబ్‌నగర్), క్రిసోలైట్ (హైదరాబాద్), కొమ్మర వెంకటరెడ్డి (మెదక్), బోయినపల్లి శ్రీనివాసరావు (కరీంనగర్), మాశారం శంకర్ (ఆదిలాబాద్),అల్లూరి వెంకటేశ్వరరెడ్డి (ఖమ్మం), విలియం ముని గాల (వరంగల్) నియమితులయ్యారు.
 సంయుక్త కార్యదర్శులు: టి.భూమయ్యగౌడ్,బంగి లక్ష్మణ్ (మహబూబ్‌నగర్‌జిల్లా), పి.శ్రీనివాసరెడ్డి (మెదక్), ఎస్.బి.మోహన్‌కుమార్, కసిరెడ్డి ఉపేంద్ర రెడ్డి, ఎస్.హరినాథ్‌రెడ్డి (హైదరాబాద్), గుడూరు జైపాల్‌రెడ్డి, ఏరుగు సునీల్ కుమార్ (నల్లగొండ), షర్మిల సంపత్ (ఖమ్మం), తోడసం నాగోరావు (ఆదిలాబాద్), సుజాతా మంగీలాల్ (వరంగల్) ఉన్నారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జూపల్లి రమేశ్ (ఖమ్మం), గిడిగంటి శివ (వరంగల్) ఉన్నారు. పార్టీ కార్యక్రమాల సమన్వయకర్తగా పెద్దపట్లోళ్ల సిద్దార్ధరెడ్డి నియమితులయ్యారు.
 
 అనుబంధ సంఘాల అధ్యక్షులు
 
 పార్టీ రాష్ట్ర రైతువిభాగం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి (మహబూబ్‌నగర్), యువజన విభాగం అధ్యక్షుడిగా బేష్వా రవీందర్ (మహబూబ్‌నగర్), ఎస్సీసెల్ అధ్యక్షుడిగా  మెండం జయరాజ్ (ఖమ్మం), మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ముజ్తిబాఅహ్మాద్-ముస్తాఫా (రంగారెడ్డి), సేవాదళ్ / వాలంటీర్ల అధ్యక్షుడిగా వెల్లాల రామ్మోహన్ (హైదరాబాద్), సాంస్కృతి విభాగం అధ్యక్షుడిగా సదమల్లా నరేష్ (కరీంనగర్), కార్మిక విభాగం అధ్యక్షుడిగా నర్రా భిక్షపతి (మెదక్ ), డాక్టర్స్ వింగ్ అధ్యక్షురాలిగా పి.ప్రఫుల్ల (హైదరాబాద్), క్రమశిక్షణా కమిటీ అధ్యక్షుడిగా విఎల్‌ఎన్ రెడ్డి (ఖమ్మం), క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా కె. జార్జి హర్బట్ (రంగారెడ్డి) నియమితులయ్యారు.  రాష్ర్ట పార్టీ అధికారప్రతినిధులుగా కొండా రాఘవరెడ్డి, సత్యం శ్రీరంగం (రంగారెడ్డి), ఆకుల మూర్తి (ఖమ్మం) నియమితులయ్యారు.
 
 4 జిల్లాల కమిటీల కొత్త అధ్యక్షులు..
 
 మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, రంగారెడ్డిజిల్లా పార్టీ అధ్యక్షుడిగా జి. సురేష్‌రెడ్డి, వరంగల్‌జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జిన్నారెడ్డి మహేందర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాయుడు ప్రకాష్‌లను నియమించారు.
 
 తెలంగాణ రాష్ట్ర కమిటీని మరింత విస్తరిస్తాం: పొంగులేటి
 
 రాబోయే రోజుల్లో రాష్ట్ర కమిటీని మరింత విస్తరించి తెలంగాణలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక దివంగత వైఎస్సార్  చేపట్టిన అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు అమలు కావాలని కోరుకుంటున్న ప్రజల పక్షాన నిలబడి అందుకు తమ పార్టీ కృషి చే స్తుందన్నారు. రాజన్న కన్న కలలను తెలంగాణలో సాకారం చేసుకునే ందుకు కృషి చేస్తామన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణలో అనేక కష్ట,నష్టాలు ఓర్చి పనిచేశారని, రానున్న కొద్దిరోజుల్లోనే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో సముచితమైన రీతిలో గౌరవించేలా చూస్తామన్నారు. పార్టీకి అండగా ప్రజలున్నారని ఆయన చెప్పారు. పార్టీ కోసం పాటుపడిన వారికి తగిన గుర్తింపును ఇస్తామని చెప్పారు. పార్టీ నేతలు కె.శివకుమార్, నల్లా సూర్యప్రకాష్, గున్నం నాగిరెడ్డి, సత్యం శ్రీరంగం, జార్జి హర్బర్ట్, ఏనుగు మహీపాల్‌రెడ్డి తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement