
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో ఈడీ దాడుల ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఈడీ దాడులు.. బీజేపీ ఆడుతున్న రాజకీయ కుట్ర అని అద్దంకి దయాకర్ ఘాటు విమర్శలు చేశారు.
మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. ఈడీ దాడులు బీజేపీ రాజకీయ కుట్ర. ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై దాడులు చేసి బీజేపీ భయపెట్టాలని చూస్తోంది. రాజకీయ వ్యతిరేక పక్షాలపై నిరంతరం దాడులు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టి మానసికంగా దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోంది.
కర్ణాటకలో కూడా బీజేపీ ఇదే తరహాలో ముందుకు సాగింది. డీకే శివ కుమార్‌పై కూడా ఇలాగే దాడుల ప్రయోగం చేశారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా వదలకుండా కేంద్రంలోని బీజేపీ.. ఈడీ దాడులు చేయించింది. దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పుదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: హైడ్రా ఎఫెక్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment