ED Raids
-
బీబీఎంపీ బోర్ల స్కాం.. రెండోరోజూ ఈడీ తనిఖీలు
బనశంకరి: బెంగళూరు మహానగర పాలికెలో బోరుబావుల తవ్వకం, ఆర్ఓ ప్లాంట్ల ఏర్పాటు పథకంలో 2016–2019 మధ్య కోట్లాది రూపాయల అక్రమాల ఆరోపణలపై ఈడీ అధికారులు రెండవ రోజు బుధవారం కూడా తనిఖీలు కొనసాగించారు. పాలికె చీఫ్ ఇంజినీర్ బీఎన్.ప్రహ్లాద్రావ్ ఆఫీసులో సోదాలు చేశారు. బీబీఎంపీ చీఫ్ అకౌంటెంట్ బీనా ను విచారించారు. పాలికె ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, 8 వలయాల చీఫ్ ఇంజినీర్లను పాలికె ఆఫీసుకు పిలిపించి కూలంకుషంగా సమాచారం రాబట్టారు. బొమ్మనహళ్లి, ఆర్ఆర్.నగర, మహదేవపుర, యలహంక, దాసరహళ్లి నియోజకవర్గాల్లోని 68 వార్డుల్లో 9,558 బోర్‌వెల్స్ తవ్వారు. దీంతో పాటు 976 వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని బీబీఎంపీ అధికారులు లెక్కలు చూపారు. కానీ వెయ్యి బోర్లను తవ్వకుండానే తప్పుడు లెక్కలు చూపించి కోట్లాదిరూపాయల్ని కైంకర్యం చేశారని ఆరోపణలున్నాయి. మొత్తం రూ.400 కోట్లకు పైగా స్వాహా చేసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. -
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ హీట్
-
భూదాన్ భూముల కుంభకోణంలో కీలక పరిణామం
-
దాడి చేయబోతే 'దాడి' చేశార్సార్!
-
కాంగ్రెస్, బీజేపీ మధ్య "క్విడ్ ప్రో కో".. కేటీఆర్ సంచలన ట్వీట్ ..
-
చంద్రబాబు స్కిల్ స్కామ్ పై ED లెటర్.. వైఎస్ జగన్ రియాక్షన్
-
ఆ పెద్దన్న ఎవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి కాపాడుతున్న పెద్దన్న ఎవరో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రశ్నించారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్టు నాటకం ఆడుతూ, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అంట కాగుతున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్నా బీజేపీ నేతలు ఈ అంశంపై మాట్లాడటం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంపై ఈడీ జరిపిన దాడుల అంశాన్ని ప్రస్తావిస్తూ, ఆ దాడిలో రూ.వందల కోట్ల నగదు దొరికిందని మీడియాలో కథనాలు వస్తున్నాయని, 2 వారాలు పూర్తయిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఈ సంఘటన తాలూ కు ఒక్క విషయం బయటకి రాలేదని కేటీఆర్ తెలిపారు. కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం ద్వారా వచ్చిన రూ.40 కోట్ల అక్రమ ధనాన్ని పార్లమెంటు ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ఉపయోగించిందని స్వయంగా తన ప్రకటనలో ఈడీ వెల్లడించిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టులు జరగకపోవడం, దారి మళ్లిన నిధుల తాలూకు అంశంపైనా ప్రాథమిక విచారణ కూడా చేయకపోవడం పట్ల కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. -
మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, వ్యాపార సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందాలు సోదా లు జరిపాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు తెలిసింది. శుక్రవారం ఉదయం 5:30 గంటల నుంచి జూబ్లీహిల్స్‌లోని మంత్రి పొంగులేటి ఇంటితో పాటు కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లు, పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగాయి. ఏకకాలంలో మొత్తం 15 ఈడీ అధికారుల బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.విదేశాల నుంచి ఖరీదైన వాచీల కొనుగోలుకు సంబంధించిన ఆరోపణలపై ఈ ఏడాది మార్చి 28న చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షరెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కస్టమ్స్, డీఆర్ఐ కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు దర్యాప్తులో భాగంగా స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల రక్షణలో సోదాలు కొనసాగాయి. పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సహా పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థల ఆర్ధికలావాదేవీలపైన ఆరా తీసినట్టు సమాచారం. కేసు వివరాలివీ..: హాంగ్‌కాంగ్‌లో నివాసముండే మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్ ఈ ఏడాది ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చాడు. అతని వద్ద కస్టమ్స్ అధికారులు విదేశాలకు చెందిన రెండు లగ్జరీ వాచ్‌లు స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్‌ను కస్టమ్స్ అధికారులు విచారించగా, మధ్యవర్తి నవీన్‌కుమార్ పేరు వెల్లడించాడు. ఈ క్రమంలో నవీన్‌కుమార్ ద్వారా పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి ముబీన్ నుంచి దాదాపు రూ.7 కోట్లు విలువ చేసే ఏడు లగ్జరీ వాచ్‌లను కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై సమాధానం ఇవ్వాలని కస్టమ్స్ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రూ.100 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. దీంతోమనీలాండరింగ్ కోణంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈడీ దాడులను ఖండించిన మంత్రి సీతక్క ఈడీ దాడులను మంత్రి సీతక్క ఖండించారు. ‘ప్రతిపక్ష ప్రభుత్వాలున్న చోట బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది. ఈడీ, సీబీఐలను పచ్చిగా దురి్వనియోగం చేస్తోంది. తమకు అనుకూలంగా రాజ్యాంగ విరుద్ధంగా దర్యాప్తు సంస్థలను వాడుకుంటోంది’ అని సీతక్క ఒక ప్రకటనలో మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఈడీ అధికారులకు సోదాలకు కారణం బీజేపీ కుట్రలేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. -
పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు బీజేపీ రాజకీయ కుట్రే: అద్దంకి దయాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో ఈడీ దాడుల ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఈడీ దాడులు.. బీజేపీ ఆడుతున్న రాజకీయ కుట్ర అని అద్దంకి దయాకర్ ఘాటు విమర్శలు చేశారు.మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. ఈడీ దాడులు బీజేపీ రాజకీయ కుట్ర. ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై దాడులు చేసి బీజేపీ భయపెట్టాలని చూస్తోంది. రాజకీయ వ్యతిరేక పక్షాలపై నిరంతరం దాడులు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టి మానసికంగా దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోంది.కర్ణాటకలో కూడా బీజేపీ ఇదే తరహాలో ముందుకు సాగింది. డీకే శివ కుమార్‌పై కూడా ఇలాగే దాడుల ప్రయోగం చేశారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా వదలకుండా కేంద్రంలోని బీజేపీ.. ఈడీ దాడులు చేయించింది. దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పుదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: హైడ్రా ఎఫెక్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత -
పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు
-
సందీప్ ఘోష్ తండ్రి నివాసంలో ఈడీ సోదాలు
కోల్‌కతా: జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన అనంతరం ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ఆర్థిక అవకతవకల అంశంపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు గురువారం ఉదయం కోల్‌కతా, సబర్బన్ ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తండ్రి సత్య ప్రకాశ్ నివాసంలోనూ ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.West Bengal | Enforcement Directorate carrying out search operation in connection with RG Kar Medical College & Hospital financial irregularities case at several places in Kolkata and suburban areas including the residence of former principal of RG Kar Medical College & Hospital…— ANI (@ANI) September 12, 2024 మరోవైపు.. డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ డార్టర్లు, వైద్య సిబ్బంది ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇక.. హత్యాచార ఘటనపై నిర్లక్ష్యం వహించినందుకు సందీప్ ఘోష్ సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.చదవండి: జూనియర్ డాక్టర్ల షరతులు.. కుదిరే పనికాదన్న సర్కారు -
2 కేసుల్లో బెయిల్.. ఈడీపై న్యాయమూర్తి ఆగ్రహం
-
ఈడీ దూకుడు.. మరోసారి హీరా గ్రూప్‌పై దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మరోసారి హీరా గ్రూప్‌పై ఈడీ దాడులు చేపట్టింది. తెల్లవారుజాము నుంచి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. నౌహిరా షేక్ ఇల్లు,ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కోట్ల రూపాయలు నిధులు గోల్మాల్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. విదేశీ పెట్టుబడులపై అధికారులు ఆరా తీస్తున్నారు.నౌహిరా ఆస్తులను ఒక్కొక్కటిగా ఈడీ అటాచ్ చేస్తోంది. టోలీ చౌక్‌లోని 81 ప్లాట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ... ఇప్పటి వరకు రూ.380 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మరో రూ.600 కోట్లపై చిలుకు ఆస్తులపై ఈడీ విచారణ జరుపుతోంది. దేశవ్యాప్తంగా నౌహిరా షేక్‌పై 60కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రజల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి ఆస్తులను కూడా పెట్టుకున్నారని ఆరోపణలపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నౌహీరా షేక్‌పై గతంలో కేసు నమోదు చేశారు. -
ఈడీ రైడ్స్.. మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో భారీ అక్రమాలు
సాక్షి, హైదరాబాద్: మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లో భారీ అక్రమాలు బయటపడుతున్నాయి. రెండు రోజుల పాటు మహేష్ బ్యాంక్‌లో ఈడీ సోదాలు చేపట్టింది. రూ. కోటి నగదుతో పాటు రూ.5 కోట్ల విలువైన ఆభరణాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనర్హులకు రూ.300 కోట్ల రుణాలు ఇచ్చినట్లు ఈడీ గుర్తించింది. 1800 మందికి డమ్మీ గోల్డ్‌లోన్స్ ఇచ్చినట్లు ఈడీ తేల్చింది.పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్లు గుర్తించని ఈడీ.. రుణాలన్నీ బినామీల పేర్లతో కుటుంబసభ్యులే తీసుకున్నట్లు నిర్థారణ అయ్యింది. బ్యాంక్‌లోని డబ్బు వివిధ మార్గాల ద్వారా పక్కదారి పట్టిందని ఈడీ వెల్లడించింది. తప్పుడు ఆస్తి పత్రాలతో భారీ రుణాలు మంజూరు చేయడంతో పాటు.. వక్ఫ్‌బోర్డ్‌కు చెందిన పలు ఆస్తులకు లోన్స్ ఇచ్చారని.. బ్యాంక్ అక్రమాలపై విచారణ కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు. -
విపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వం వేధిస్తోంది
పటాన్చెరు టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం విపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఆరోపించారు. ‘మా పారీ్టలో చేరండి.. లేకుంటే ఇబ్బందులు తప్పవన్న విధంగా వ్యవహరిస్తోంది’అని ఆయన మండిపడ్డారు. శుక్రవారం పటాన్చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్‌రెడ్డిని హరీశ్‌రావు కలిశారు. గురువారం జరిగిన ఈడీ సోదాలపై ఆరా తీశారు. అనంతరం విలేకరులతో హరీశ్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేయడమే పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.పదవికి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వర్తించేలా చట్ట సవరణ చేస్తామంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని.. కానీ టీ కాంగ్రెస్ నేతలు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకొనేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మాట వినకపోతే ఆ ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు పెట్టడం, భయభ్రాంతులకు గురిచేస్తూ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తున్నారన్నారు. ఈడీ దాడుల్లో దొరికిందేమీ లేదు.. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఇంట్లో ఈడీ చేపట్టిన సోదాల్లో డబ్బు, బంగారం, ఎలాంటి వస్తువులు అక్రమంగా దొరకలేదని హరీశ్‌రావు చెప్పారు. ఆదాయపన్ను చెల్లిస్తున్న ఎమ్మెల్యే వద్ద ఆదాయ లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని స్పష్టం చేశారు. లీకేజీకి కారణమైన అధికారులపై ఈడీ, ఐటీ ఎందుకు దాడులు చేయట్లేదని నిలదీశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్యరావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జెడ్పీ వైస్ చైర్మన్ మంజుశ్రీ పాల్గొన్నారు. -
పటాన్చెరు ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు కీలక పత్రాలు స్వాధీనం
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట ఈడీ సోదాలు
-
ED Raids: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట ఈడీ సోదాలు
Updates..👉 నిజాంపేటలో ఈడీ సోదాలు ముగిశాయి. ఎమ్మెల్యే అల్లుడి చంద్రశేఖర్ ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో మూడు కోట్ల రూపాయలతో కారు కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. అలాగే, పలు ఆస్తులను సంబంధించిన పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.👉ఇక, అంతకుముందు గడువు పూర్తైనా మైనింగ్ చేశారనే ఆరోపణల నేపథ్యంలో క్వారీలను అధికారులు సీజ్ చేశారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ేసుల ఆధారంగానే ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.👉తెలంగాణలో మరోసారి ఈడీ సోదాల అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో, తీవ్ర కలకలం చోటుచేసుకుంది. 👉కాగా, ఈడీ అధికారులు ఏక కాలంలో గురువారం తెల్లవారుజాము నుంచే పటాన్చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు. అలాగే, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇద్దరు సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో ఓ కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇక, గతంలో లక్డారం గనుల వ్యవహారంలో పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, తాజా సోదాల గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
గొర్రెల స్కాం లో అసలు దొంగలు దూకుడు పెంచిన ఈడీ
-
సందేశ్‌ఖాలిలో మళ్లీ హింస
కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ పూర్తవగానే పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలిలో ఆదివారం మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. పోలింగ్ సమయంలో పోలీసులపై దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేసేందుకు అగర్హటి గ్రామానికి వెళ్లిన బలగాలపై మహిళలు దాడికి దిగారు. మహిళా సిబ్బంది గాయపడ్డారు. నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తిని విడిపించుకునేందుకు నిరసనకారులు చేసిన ప్రయత్నాలను బలగాలు అడ్డుకున్నాయి. జనవరి 5వ తేదీన రేషన్ కుంభకోణం కేసులో తనిఖీల కోసం సందేశ్‌ఖాలీకి వెళ్లిన ఈడీ బృందంపై దాడి, అనంతరం టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరెస్టయినప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. -
కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు. నిన్న(సోమావారం) కవిత తరపున ముగిసిన వాదనలు విపించారు. . సీబీఐ, ఈడీ దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.నేడు ఈడీ, సీబీఐ వాదనలు వినిపించింది. ఈడీ, సీబీఐ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తామని ఇంతకముందే న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు ఈడీ తరపు న్యాయవాది జోహెబ్ హుసేన్ వాదనలు వినిపిస్తూ.. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత కింగ్ పిన్ అని పేర్కొన్నారు. లిక్కర్ కేసులో అక్రమ సొమ్ము ఆమెకు చేరిందని, దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు.ఈడీ వాదనలుఇండియా ఎహెడ్ ఛానల్లో పెట్టుబడి పెట్టారు.ఫోన్లో డేటాను ధ్వంసం చేశారు.విచారణకు ముందే ఫోన్ సాక్షాలు ధ్వంసం చేశారు.ఈడీకి ఇచ్చిన ఫోన్లో డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది.డిజిటల్ డేటా ధ్వంసంపై 19 పొంతనలేని సమాధానాలు ఇచ్చారు.కవితకు బెయిల్ ఇవ్వొద్దు.సూర్యాస్తమయానికి ముందే కవితను అరెస్టు చేశాం.ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు.గోప్యత హక్కును భంగపరచలేదుసీబీఐ వాదనలు:మద్యం విధానంపై కవితిను కలవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్యం వ్యాపారికి చెప్పారు.భూములు, హవాలా మార్గం ద్వారా అక్రమ సొమ్ము రవాణా జరిగింది.ఈ కేసులో కవిత పాత్రపై అనేక సాక్షాలు, వాంగ్మూలాలు ఉన్నాయి.అందుకే కవిత అరెస్టు తప్పనిసరి.మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు.ఈ లిక్కర్ కేసులో కవితనే ప్రధాన లబ్ధిదారు.ఆమె సాక్షాలు ధ్వంసం చేస్తుందిసాక్షులను ప్రభావితం చేస్తుందికవితకు కొత్త ఆరోగ్య సమస్యలు ఏవీ లేవుకవిత తరపు న్యాయవాది నితీష్ రానా కౌంటర్ వాదనలు👇ఈడీ కేసులో బుచ్చి బాబును నిందితుడిగా చేర్చక పోవడం, అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.బుచ్చి బాబు స్టేట్మెంట్లు కోర్టు పట్టించు కోవద్దు.ఆగస్టు 2023 తర్వాత ఎలాంటి కొత్త సాక్షాలు ఈడీ చూపలేదు.సాక్షాల ధ్వంసం చేసిన సమయంలో ఎందుకు అరెస్టు చేయలేదు.కవిత తన ఫోన్లు పనిమనుషులకు ఇచ్చారు.190 కోట్ల అక్రమ సొమ్ము చేరిందన్న ఈడి వాదనలో.. ఒక్క పైసా కవిత ఖాతాకు చేరలేదు.దీనిపై ఎలాంటి సాక్షాలు ఈడీ చూపలేదు.కవిత అరెస్టులో సీబీఐ చట్ట ప్రకారం నడుచుకోలేదు.సీబీఐ కవిత అరెస్టుకు కారణాలు చెప్పలేదు. ముగిసిన ఈడి, సీబీఐ వాదనలు, తీర్పు రిజ ర్వ్లిక్కర్ కేసులో కవిత బెయిల్‌పై ముగిసిన ఈడీ, సీబీఐ వాదనలుకవితకు బెయిల్ ఇవ్వద్దని వాదనలు వినిపించిన ఈడీ, సీబీఐఆమెకు బెయిల్ ఇస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని వాదనలులిక్కర్ స్కామ్ లో అక్రమ సొమ్ము నేరుగా కవితకు చేరిందని వాదించిన ఈడికవిత కేసులో కీలక పాత్రధారి దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్, ఇతర ఎవిడెన్స్ ఉందన్న ఈడీ.తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ.. -
జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు
-
జార్ఖండ్‌లో ఈడీ సోదాలు.. భారీగా పట్టుబడ్డ నోట్ల కట్టలు
రాంచీ: జార్ఖండ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడుల్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. సోమవారం రాంచీలోని పలుచోట్ల ఈడీ సోదాలు చేపట్టగా.. మంత్రి అలంగీర్ సన్నిహితుడి ఇంట్లో సుమారు రూ. 25 కోట్ల భారీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.జార్ఖండ్ మంత్రి అలంగీర్ సన్నిహితుల ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రకారం.. జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రి అలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజయ్ లాల్ ఇంట్లోని గది నిండా ఉన్న భారీ నోట్ల కట్టలను ఈడీ స్వాధీనం చేసుకుంది. 70 ఏళ్ల అలంగీర్ ఆలం పాకూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహిస్తున్నారు.‘‘జార్ఖండ్‌లో అవినీతి అంతం కావటం లేదు. ఈ డబ్బును ఎన్నికల్లో పంచాలని ప్రణాళిక వేశారు. దీనిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతూల్ సహదేవ్ అన్నారు. -
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం విధానం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అధికారుల బృందం శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసింది. బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన, పోలీసుల స్వల్ప లాఠీచార్జ్, నాటకీయ పరిణామాల మధ్య ఈడీ అధికారులు రాత్రి 8:45 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లి.. విమానంలో ఢిల్లీకి తరలించారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ జోగిందర్ నేతృత్వంలోని 12 మంది ఢిల్లీ అధికారుల బృందం హైదరాబాద్ ఈడీ అధికారుల సహకారంతో శుక్రవారం మధ్యాహ్నమే హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 14లోని ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకుంది. సుమారు 1.45 గంటల సమయంలో సోదాలు ప్రారంభించారు. కవిత, ఆమె భర్త అనిల్‌కుమార్ సహా అక్కడున్నవారి సెల్ఫోన్లను సీజ్ చేశారు. సోదాల్లో పలు పత్రాలను స్వాదీనం చేసుకున్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో కవిత మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఆధారాలు లభించాయని, పీఎంఎల్ఏ యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్–2002)లోని 3, 4 సెక్షన్ల కింద అరెస్టు చేస్తున్నట్టు ఎమ్మెల్సీ కవితకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అరెస్టుకు కారణాలను తెలియజేస్తూ 14 పేజీల కాపీని కవితకు అందజేశారు. తర్వాత సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను ఈడీ బృందం అరెస్టు చేసింది. దీనికి సంబంధించిన సమాచార లేఖను ఆమె భర్త అనిల్‌కుమార్‌కు అందించింది. కవితను ఢిల్లీకి తరలించేందుకు సిద్ధమైంది. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది ఈడీ అధికారుల బృందంలో ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు. తీవ్ర ఉద్రిక్తత మధ్య తరలింపు.. ఈడీ సోదాల విషయం తెలుసుకుని భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కవిత నివాసం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఈడీ సోదాలు కొనసాగినంత సేపూ నిరసన తెలిపారు. బీజేపీ, ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్‌రావు, ఇతర నేతలు, న్యాయవాదులు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు. వారు లోనికి వెళ్లకుండా ఈడీ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. దీనితో సుమారు ఇరవై నిమిషాల పాటు కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర నేతలు గేటు వద్దే వేచి ఉన్నారు. ఒకదశలో బీఆర్ఎస్ శ్రేణులు గేటు తోసుకుని కవిత నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి. దీనితో పోలీసులు బందోబస్తు పెంచారు. రోప్ పారీ్టలను పిలిపించారు. స్వల్పంగా లాఠీచార్జి చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అక్రమమంటూ వాగ్వాదం! కొంతసేపటి తర్వాత కేటీఆర్, ఇతర నేతలు కవిత నివాసం లోపలికి వెళ్లారు. కవిత అరెస్టు అక్రమం, చట్టవ్యతిరేకమని ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఈడీ అధికారి భానుప్రియ మీనా కల్పించుకుని కేటీఆర్, ఇతర నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీలు జరుగుతున్నప్పుడు అనుమతి లేకుండా లోపలికి వచ్చారని మండిపడ్డారు. వారందరినీ వీడియో తీయాలంటూ మరో ఈడీ అధికారిని ఆదేశించారు. ఈ సమయంలో కేటీఆర్ కలగజేసుకుని.. ‘‘మేడం.. సెర్చ్ చేయడం అయిపోయింది. అరెస్టు వారెంట్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు లోపలికి రావొద్దని ఎలా చెప్తున్నారు? ఎలాంటి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా, మెజి్రస్టేట్ ముందు హాజరుపర్చకుండానే కేసు చేస్తాను అంటున్నారు. కావాలనే శుక్రవారం వచ్చి అరెస్టు చేస్తున్నారు. మీరు (ఈడీ అధికారులు) ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోబోమని సుప్రీంకోర్టుకు అండర్‌టేకింగ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని మీరే ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల సీరియస్ ట్రబుల్లో పడతారు..’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. అందరికీ అభివాదం చేసి.. సుమారు 7 గంటల సమయంలో ఈడీ అధికారులు కవితను శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు బయటికి వచ్చారు. ఈ సమయంలో కవిత ఉద్వేగానికి లోనయ్యారు. అక్కడే ఉన్న తన కుమారుడిని హత్తుకుని ముద్దుపెట్టుకున్నారు. కుమారుడి కన్నీటిని తుడిచి, త్వరగా వస్తానని చెప్పారు. ఆందోళన చేస్తున్న అభిమానులకు నమస్కరించారు. కవితను విమానాశ్రయానికి తీసుకెళ్లేందుకు ఈడీ అధికారులు పోలీసులతో కలసి ప్రత్యేక కాన్వాయ్ సిద్ధం చేశారు. అయితే కవిత తన భర్త అనిల్‌కుమార్ కారులో వస్తానని చెప్పారు. ఈడీ అధికారులు అంగీకరించడంతో భర్తతో కలసి కారులో బయలుదేరారు. ఈ కారు ముందు వెనుక ఈడీ, పోలీసు వాహనాలు కాన్వాయ్‌గా శంషాబాద్‌కు చేరుకున్నాయి. విమానాశ్రయం లోపలికి వెళ్లే సమయంలోనూ కవిత పిడికిలి ఎత్తి అభివాదం చేశారు. ఈడీ అధికారుల బృందం విస్తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన యూకే–870 విమానంలో రాత్రి 8.58 గంటలకు కవితను ఢిల్లీకి తరలించింది. నేడు కోర్టు ఎదుట హాజరు కవితను ఢిల్లీకి తరలించిన ఈడీ అధికారులు శుక్రవారం రాత్రి ఆమెను ఈడీ కార్యాలయంలోనే ఉంచారు. శనివారం మధ్యాహ్నం ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నట్టు సమాచారం. లిక్కర్ కేసులో అరెస్టులు ఇవీ.. సమీర్ మహేంద్రు (ఇండో స్పిరిట్ యజమాని) సెప్టెంబర్ 27, 2022 శరత్‌చంద్రారెడ్డి (ట్రైడెంట్ కెంఫర్ లిమిటెడ్) నవంబర్ 10, 2022 వినయ్‌బాబు (ఫెర్నాడ్ రికార్డ్ కంపెనీ) నవంబర్ 10, 2022 అభిషేక్ బోయినపల్లి (రాబిన్ డిస్ట్రిబ్యూషన్) నవంబర్ 14, 2022 విజయ్ నాయర్ (మద్యం వ్యాపారి) నవంబర్ 14, 2022 అమిత్ అరోరా (బడ్డీ రిటైల్ డైరెక్టర్) నవంబర్ 30, 2022 గోరంట్ల బుచ్చిబాబు (కవిత మాజీ ఆడిటర్) ఫిబ్రవరి 9, 2023 గౌతం మల్హోత్రా (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 9, 2023 మాగుంట రాఘవ (మద్యం వ్యాపారి) ఫిబ్రవరి 11, 2023 మనీష్ సిసోదియా (ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం) ఫిబ్రవరి 26, 2023 కల్వకుంట్ల కవిత (ఎమ్మెల్సీ) మార్చి 15, 2024 నేడు కేసీఆర్, కేటీఆర్ ఢిల్లీకి.. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతోపాటు మరికొందరు కీలక నేతలు శనివారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. తండ్రిగా కేసీఆర్, సోదరుడిగా కేటీఆర్ నైతికంగా కవితకు అండగా నిలబడేందుకు, న్యాయ నిపుణులతో చర్చించేందుకు వెళ్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణలో ఉన్న సమయంలో ఈడీ అరెస్టు చేసిన అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. కవిత అరెస్టుతోపాటు తెలంగాణ, జాతీయ రాజకీయాలు, మోదీ–బీజేపీ విధానాలపై కేసీఆర్ జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. ఈడీ తీరు చట్టవిరుద్ధం: కవిత న్యాయవాది మోహిత్‌రావు సాక్షి, న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో ఈడీ చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని సుప్రీంకోర్టులో ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది మోహిత్‌రావు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కవిత అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ మంగళవారానికి వాయిదాపడిందని.. ఈ కేసులో కవితపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని ఈడీ గతంలో కోర్టుకు హామీ ఇచ్చిందని వివరించారు. సుప్రీంకోర్టులో విచారణ పూర్తయ్యే వరకు కఠిన చర్యలు తీసుకోబోమన్న ఈడీ హామీ వర్తిస్తుందని చెప్పారు. అయినా ముందస్తు పథకంలో భాగంగా సోదాల పేరిట వచ్చి కవితను అరెస్ట్ చేశారని.. విమానం టికెట్లు కూడా ముందుగానే బుక్ చేశారని ఆరోపించారు. కవిత ముందు న్యాయపరంగా చాలా అవకాశాలు ఉన్నాయని, అరెస్ట్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. -
‘అన్నీ ఊహలు.. అవాస్తవాలే’.. ఎన్నికల బాండ్లపై నిర్మలమ్మ వ్యాఖ్యలు
ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలనే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయా వివరాలను వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతం చేసింది. దాంతో భారతీయ స్టేట్ బ్యాంక్ సమర్పించిన డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచింది. మొత్తం 763 పేజీలతో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో వివరాలను అప్లోడ్ చేసింది. అయితే ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన కొన్ని సంస్థలపై గతంలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేశాయని పలువురు గుర్తు చేస్తున్నారు. రాజకీయ పార్టీలకు అత్యధిక విరాళాలిచ్చిన టాప్ 30 కంపెనీల్లో 15 కంపెనీలకుపైగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ (ఐటీ)వంటి సంస్థల దర్యాప్తు ఎదుర్కొన్నవే కావడం గమనార్హం. ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రముఖ మీడియా సంస్థతో జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. విరాళాలకు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దాడులకు సంబంధం ఉందంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. ఈడీ కంపెనీలపై రైడ్ చేస్తేనే ఆత్మరక్షణ కోసం ఎన్నికల బాండ్లు కొనుగోలు చేశారనుకోవడం ఊహాగానమే అవుతుందన్నారు. బాండ్లు కొనుగోలు చేసిన తర్వాత కూడా ఆయా సంస్థలపై దాడులు జరిగిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఆ విరాళాలు మొత్తం భాజపాకే వెళ్లాయని చాలా మంది భావిస్తున్నారని, కొన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా జమైనట్లు తెలిపారు. ఎన్నికల బాండ్లకు సంబంధించి సమగ్ర సమాచారంతో పూర్తి వివరాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించించింది కదా అని ప్రస్తావించగా ప్రస్తుతం ఆ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. తనకంటే ముందు ఆర్థిక మంత్రిగా పనిచేసిన అరుణ్‌జైట్లీ మునుపటి కంటే మెరుగైనదిగా భావించి ఈ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌ను తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కొనుగోలు చేసిన బాండ్లు నేరుగా రాజకీయ పార్టీల ఖాతాల్లోనే పడుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ముందుకెళ్లాలన్నారు. ఇదీ చదవండి: ఎన్నికల బాండ్లను భారీగా కొనుగోలు చేసిన కంపెనీలివే.. ఎలక్షన్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్నికల బాండ్ల విరాళాల్లో ఎక్కువ మొత్తం బీజేపీకి వెళ్లగా ఆ తర్వాతి స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, బీఆర్ఎస్ తదితర పార్టీలున్నాయి. -
బీజేపీకి నో చెప్పా... ఈడీ వచ్చింది: జార్ఖండ్ ఎమ్మెల్యే
రాంచీ: లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలు ప్రకటిస్తున్నాయి. చివరి నిమిషంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారేవారికి కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితాల్లో చోటు దక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నేపపథ్యంలో జార్ఖండ్‌లోని బర్కాగాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ తనకు ఆఫర్ ఇచ్చిందని ఈ ఆఫర్ రిజెక్ట్ చేసినందుకే తన నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తో అర్ధరాత్రి దాడులు చేస్తోందన్నారు. VIDEO | ED raids to break morale ahead of LS polls: Congress MLA Amba Prasad's mother READ: https://t.co/J7UeiSbEIC "I was offered an MP ticket from the BJP for Hazaribagh, which I declined. Some people from the BJP side pressurised me to contest from the side of BJP MP Chatra.… pic.twitter.com/rDocABkLvp — Press Trust of India (@PTI_News) March 12, 2024 ‘నాకు బీజేపీ హజారీబాగ్ ఎంపీ టికెట్ ఆఫర్ చేసింది. కొందరు బీజేపీ నేతలు నన్ను ఛాత్రా నుంచి పోటీ చేయాల్సిందిగా కోరారు. ఈ ఆఫర్లను నేను తిరస్కరించాను. దీంతో ఈడీని రంగంలోకి దించి నాపై దాడులు చేయిస్తున్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు’ అని ఎమ్మెల్యే మండిపడ్డారు. మనీలాండరింగ్ కేసులో అంబ ప్రసాద్‌కు సంబంధించిన 17 ప్రదేశాల్లో ఈడీ మంగళవారం అర్ధరాత్రి సోదాలు ప్రారంభించింది. జార్ఖండ్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా ఉన్న అంబ ప్రసాద్ మాజీ మంత్రి యోగేంద్ర సా కుమార్తె. హజారీబాగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అంబప్రసాద్ కుటుంబానికి గట్టి పట్టుండటం గమనార్హం. #WATCH | Ranchi, Jharkhand: The Enforcement Directorate (ED) leaves after conducting raids on the premises of Congress MLA Amba Prasad for almost 18 hours. pic.twitter.com/2vrhhMimsW — ANI (@ANI) March 12, 2024 ఇదీ చదవండి.. పోలీసుల బందోబస్తు మధ్య ఒక్కటైన గ్యాంగ్‌స్టర్, రివాల్వర్ రాణి -
డీఎల్ఎఫ్లో ఈడీ సోదాలు... ఎందుకంటే?
రియల్టీ రంగ దిగ్గజ సంస్థ అయిన డీఎల్ఎఫ్ కార్యాలయంలో ఈడీ సోదాలు జరిగినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. మనీలాండరింగ్ కేసులో డీఎల్ఎఫ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. నోయిడాలోని ప్రాజెక్ట్‌లను పూర్తి చేయకుండా గురుగ్రామ్‌లో ఆస్తులు కొనుగోలు చేయడానికి సూపర్‌టెక్ గ్రూప్ నిధులు సేకరించింది. సంస్థ ఛైర్మన్ రామ్ కిషోర్ అరోరా గృహ కొనుగోలుదారులు, బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.638 కోట్లను మళ్లించారని ఈడీ జూలైలో పేర్కొంది. అయితే సూపర్‌టెక్ గ్రూప్‌తో డీఎల్ఎఫ్ సంస్థకు సంబంధం ఉండడంతో ఈడీ సోదాలు చేసినట్లు సమాచారం. ఈ సోదాలు శనివారం ఉదయం ముగిశాయని, ఈ సందర్భంగా ఈడీ అధికారులు కొన్ని పత్రాలను పరిశీలించారని చెప్పారు. అయితే సూపర్‌టెక్‌కు సంబంధించి డీఎల్ఎఫ్ ఏ మేరకు సహకరించింది, ఎలాంటి ఆధారాలు లభ్యమయ్యాయో వివరించలేదు. ఇదీ చదవండి: సాయంత్రం 5 దాటితే కష్టాలే.. ఆ నగరాల్లో దారుణమైన ట్రాఫిక్! ఈ కేసులో ఇప్పటివరకు సుమారు రూ.638.93 కోట్లు నిధులు మళ్లించారని ఈడీ తెలిపింది. దీన్ని సూపర్‌టెక్ గ్రూప్, దాని ప్రమోటర్లు/ డైరెక్టర్లు తమ గ్రూప్ కంపెనీల ద్వారా తక్కువ ధర ఉన్న భూమిని కొనుగోలు చేసేందుకు ఈ డబ్బును వినియోగించినట్లు ఈడీ వివరించింది. 2013-14లో సర్వ్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని కొనుగోలు చేయడానికి కస్టమర్లు, బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణం మొత్తం రూ.444 కోట్లు వినియోగించారని ఈడీ తెలిపింది. -
హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడి ఇంట్లో ఈడీ సోదాలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి జి వినోద్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. వినోద్‌తో పాటు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్‌ల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (TACB) దాఖలు చేసిన మూడు ఛార్జిషీట్ల ఆధారంగా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మంగళవారం వినోద్ సోదరుడు, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి నివాసంలోనూ ఈడీ సోదాలు జరిపింది. వివేక్ కంపెనీ ఖాతాల్లో అక్రమ లావాదేవీలు జరిగాయన్న ఫిర్యాదు నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. వివేక్, వినోద్ దివంగత కాంగ్రెస్ నేత వెంకటస్వామి (కాకా) కుమారులు. -
కేజ్రీవాల్‌కు మరో షాక్.. మరో ఆప్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు
ఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన వేళ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) తనిఖీలు చేపట్టింది. దీంతో, ఢిల్లీలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో ఈడీ సోదాలపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. వివరాల ప్రకారం.. ఢిల్లీలో ఆప్ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. కాగా, అమానతుల్లా ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌గా ఉన్న సమయంలో జరిగిన అక్రమ నియామకాలకు సంబంధించి సీబీఐ, ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఆప్ ఎమ్మెల్యే మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే కోణంలో విచారిస్తున్నది. ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నది. మరోవైపు, ఈడీ సోదాలపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | Delhi: ED raids underway at the premises of AAP MLA Amanatullah Khan in connection with a money laundering case. pic.twitter.com/KD0EaQOdjn — ANI (@ANI) October 10, 2023 ఇదిలా ఉండగా.. ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, సంజయ్ సింగ్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు ఐదు రోజులు ఈడీ కస్టడీని విధించింది. దీంతో, లిక్కర్ స్కాం గురించి సంజయ్ సింగ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. #WATCH | Delhi: BJP workers hold protest against Delhi CM and AAP national convenor Arvind Kejriwal, and demand his resignation. pic.twitter.com/9d2pZhExVL — ANI (@ANI) October 10, 2023 ఇక, ఆప్ నేతల ఇళ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేపట్టిన నేపథ్యంలో కేజ్రీవాల్ సర్కార్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా కేజ్రీవాల్ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. ఇది కూడా చదవండి: పాలస్తీనాకు మద్దతుగా సీడబ్ల్యూసీ తీర్మానం -
HYD: ఫార్మా కంపెనీలపై ఈడీ దాడులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. వివరాల ప్రకారం.. ఫినిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రియల్ ఎస్టేట్, మైన్స్, ఆటో మొబైల్స్, ఫార్మా కంపెనీలను ఫినిక్స్ సంస్థ ఏర్పాటు చేసింది. శనివారం ఉదయం నుంచి ఏక కాలంలో 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పటాన్చెరులో సోదాలు కొనసాగుతున్నాయి. కాగా, ఈడీ దాడులపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఈడీ దాడులు.. సీఎం సంచలన కామెంట్స్
ప్రతిపక్ష పార్టీల నేతలే టార్గెట్‌గా దేశంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు జరుగుతున్నాయని ఇప్పటికే విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఈడీ దాడులు పొలిటికల్‌గా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బొగ్గు కుంభకోణం కేసులో కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు జరుగుతున్నాయి. వివరాల ప్రకారం.. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కేసులో ఈడీ సోమవారం 14 చోట్ల తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ రామ్ గోపాల్ అగర్వాల్‌కు రూ. 52 కోట్లు ముడుపులు ముట్టినట్లు డాక్యుమెంటరీ ఆధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొన్నది. ఆరి డోంగ్రి మైనింగ్‌లో జరిగిన అక్రమాలకు సంబంధించిన కేసులో కూడా ఈడీ దర్యాప్తు చేస్తోంది. టన్ను బొగ్గు సరఫరాపై అక్రమంగా రూ.25 వసూల్ చేసి.. 2021లో సగటున సుమారు 500 కోట్లు వసూల్ చేసినట్లు ఈడీ ఆరోపణ చేసింది. ఈ కేసులో భాగంగా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లు, ఆఫీసుల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక, ఈడీ తనిఖీలపై సీఎం భూపేష్ భఘేలే స్పందించారు. ఈ సందర్భంగా సీఎం భఘేల్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతం అవడాన్ని బీజేప తట్టుకోలేకపోతోంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఆదారణ చూసి బీజేపీ భయాందోళనకు గురువుతోంది. హిండెన్ బర్గ్ నివేదికతో అదానికి చెందిన అసలు విషయాలు వల్ల బీజేపీ ఇబ్బందిపడుతోంది. వీటిని నుంచి ప్రజల దృష్టిమరల్చేందుకే బీజేపీ.. ఈడీ దాడులు చేస్తోందని ఆరోపణలు చేశారు. ఈ దేశానికి నిజం తెలుసు.. పోరాడి గెలుస్తాం అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ ప్లీనర్ రాయ్‌పూర్‌లో జరుగనుంది. ఈ నేపథ్యంలో ఈ దాడులు జరగడం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. -
‘ఈడీ’నామ సంవత్సరం.. గుట్టలుగా నోట్ల కట్టలు..
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. ఈ పేరు వింటనే ఈ ఏడాది ఎంతో మంది పొలిటికల్ లీడర్లు, ప్రముఖులు వణికిపోయారు. ఎందుకంటే 2022లో ఈడీ దాడుల కారణంగా కొన్ని వందల కోట్ల అక్రమ సంపాదన బయటకు వచ్చింది. దీంతో, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రముఖ రాజకీయ నేతలతో సహా ప్రముఖులు సైతం జైలు ఊసలు లెక్కబెట్టారు. కానీ, వీరంతా ప్రతిపక్ష నేతలు కావడంతో కేంద్రం తీవ్ర విమర్శులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువ సంఖ్యలో ఈడీ దాడులు జరగడం విశేషం. ఈడీ జోరు పెంచిన కారణంగా ఈ ఏడాదిని ‘ఈడీనామ సంవత్సరం’గా పేర్కొనవచ్చు.. 1. నేషనల్ హెరాల్డ్ కేసు.. ఈ కేసులో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటుగా రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలను ఈడీ ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ముందుగా రాహుల్ గాంధీ.. ఈడీ అధికారుల ఎదుట హాజరవుతున్న క్రమంలో ఢిల్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈడీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఢిల్లీలో ర్యాలీ తీశారు. దీంతో, ఉద్రిక్తత నెలకొంది. ఈడీ అధికారులు రాహుల్ గాంధీని ఐదు రోజుల్లో దాదాపు 50 గంటల పాటు విచారించారు. ఇక, ఈడీ విచారణ అనంతరం.. తన ఓర్పును చూసి ఈడీ అధికారులే షాక్ అయ్యారని రాహుల్ చెప్పుకొచ్చారు. తర్వాత ఈ కేసులో ఈడీ.. సోనియాను విచారించింది. కాగా, ఈడీ విచారణకు ముందే సోనియా కరోనా బారినపడటంతో విచారణ ఆలస్యమైంది. అనంతరం, సోనియా.. ఈడీ విచారణను హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారం ఈడీ నడుచుకుంటోందని, ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనిగా పెట్టుకుందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. సోనియా గాంధీ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది. వీరి విచారణల అనంతరం, ఈడీ అధికారులు.. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్ సహా మరికొంత మందికి నోటీసులు ఇచ్చి విచారించింది. ఈ క్రమంలో ఈడీ విచారణ రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టించింది. 2. బెంగాల్లో పార్థా చటర్జీ ప్రకంపనలు.. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్న బెంగాల్లో ఈడీ దాడులు దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారాయి. బెంగాల్ విద్యాశాఖ మంత్రి, టీఎంసీ నేత పార్థా చటర్జీ.. టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఈడీ అధికారులు మంత్రి పార్థా చటర్జీ సహా, అర్పిత ముఖర్జీని అరెస్ట్ చేశారు. ఇక, వీరి విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. టీచర్ పోస్టులకు, బదీలీలకు పార్థా చటర్జీ భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నట్టు వెల్లడైంది. ఈ కేసులో దాదాపు 50 కోట్ల రూపాయల నగదు.. కిలోల్లో బంగారం, లగర్జీ కార్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. దీంతో, సీఎం మమత.. టీఎంసీ నుంచి పార్థా చటర్జీని తొలగించారు. 3. పంజాబ్‌లో మైనింగ్ కేసు.. పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాజీ సీఎం చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ బావమరిది భూపేందర్ సింగ్ హనీపై ఇసుక మాఫియా కేసులో భాగంగా ఈడీ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. ఈ కేసులో విచారణలో భాగంగా ఈడీ అధికారులు దాదాపు రూ.10 కోట్లు, 21 లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భాగంగా మాజీ సీఎం ఛన్నీని కూడా ఈడీ విచారించింది. 4. జార్ఖండ్ సీఎంకు ఈడీ షాక్.. అక్రమ మైనింగ్ వ్యవహారంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ నోటీసులు జారీచేసింది. ఇదే కేసులో సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాను ఈడీ అరెస్టు చేసింది. అతనిపై మనీ లాండరింగ్ కేసు నమోదుచేసిన అధికారులు.. జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మిశ్రాతోపాటు అతని వ్యాపార భాగస్వాముల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 బ్యాంకు అకౌంట్లలో రూ.13.32 కోట్ల నగదును సీజ్ చేశారు. మే నెలలో సీఎం సోరెన్‌తోపాటు జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్ ఇంట్లో కూడా ఈడీ తనిఖీలు నిర్వహించింది. ఇదే క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తనకు తానుగా గనులను కేటాయించుకున్నారని, సీఎం సోరెన్‌ను ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించాలని రాష్ట్ర గవర్నర్‌కు కేంద్ర ఎన్నికల సంగం సూచించిన విషయం తెలిసిందే. దీంతో, ఈ కేసు వ్యవహారం జార్ఖండ్‌లో సోరెన్ తన సీఎం పదవి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ కేసు రాష్ట్రంలోనే కాకుండా రాజకీయంగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. 5. ఢిల్లీలో ఆప్‌ను తాకిన ఈడీ.. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఈడీ అధికారులు షాకిచ్చారు. మనీలాండరింగ్ కేసులో మే ౩౦వ తేదీన సత్యేంద్ర జైన్‌ను ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని 2017 ఆగష్టు 24వ తేదీన సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఆధారంగా ఈడీ ఇన్విస్టిగేషన్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే సత్యేంద్రను మే ౩౦వ తేదీన అరెస్ట్ చేసి తీహార్ జైలులో పెట్టారు. అరెస్ట్ అనంతరం.. ఆయన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే జైలులో మంత్రి సత్యేంద్ర జైన్‌కు వీఐపీ సేవలు అందుతున్నాయనే వార్తలు, వీడియోలు బయటకు వచ్చాయి. జైలులో మసాజ్, ఇంటి ఫుడ్ తీసుకున్న వీడియోలు లీక్ అయ్యాయి. దీంతో, ఈ వ్యవహారంలో ఈమధ్యే తీహార్ జైలు సూపరింటెండెంట్ని సస్పెండ్ చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయి అదే జైలులో ఉన్న సహ నిందుతులను సత్యేంద్ర పదే పదే కలుస్తున్నారని, తద్వారా ఈ కేసుని ప్రభావితం చేస్తున్నారని ఈడీ ఆరోపిస్తోంది. దీంతో, సత్యేంద్ర జైన్ జైలు వ్యవహారం దేశంలో హాట్ టాపిక్ మారింది. 6. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈడీ షాక్.. మహారాష్ట్రలో పాత్రా చాల్ కుంభకోణానికి సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో భాగంగా ముంబైలోని సంజయ్ రౌత్ ఇంట్లో సోదాలు జరిపిన ఈడీ అధికారులు లెక్కల్లో చూపని నగదును గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. పాత్రా చాల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్‌ను కూడా ఈడీ అదుపులోకి తీసుకుంది. మనీ ల్యాండరింగ్ కేసులో రూ. 11 కోట్ల నగదు, పత్రా చాల్ ల్యాండ్ స్కామ్ కేసులో పలు కీలక డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇక, ఈ కేసులో దాదాపు 100 రోజులు జైలు జీవితం గడిపిన అనంతరం.. కోర్టు సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరు చేయడంతో రౌత్ విడుదలయ్యారు. 7. దావూద్ ఇబ్రహీం కారణంగా నవాబ్ మాలిక్ అరెస్ట్.. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్టు చేసింది. పీఎంఎల్ఏ (అక్రమార్జన నిరోధక చట్టం) కింద మాలిక్ స్టేట్మెంట్ను రికార్డు చేశామని, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు చెప్పారు. దావూద్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దాఖలు చేసిన ఒక ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మాలిక్‌పై కేసు నమోదు చేసింది. ముంబై దాడులతో సంబంధమున్నవారితో మాలిక్‌కు స్థిరాస్తి సంబంధాలున్నాయని, అందువల్ల ఆయన్ను ప్రశ్నించాల్సి ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో, ఈ వ్యవహారం మహారాష్ట్రలో సంచలనంగా మారింది. ఈ కేసులో భాగంగా ముంబైలో దావూద్ హవాలా లావాదేవీలతో సంబంధం ఉందంటూ దావూద్ సోదరి, సోదరుడు, చోటా షకీల్ బావమరిది సహా పలువురికి సంబంధించిన ఇళ్లపై ఈడీ రైడింగ్లు జరిపి కేసు నమోదు చేసింది. గతంలో దావూద్ తదితరులపై ఎన్ఐఏ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అంశాల ఆధారంగా ఈడీ దాడులు నిర్వహించింది. 2005లో ముంబైలోని కుర్లా ప్రాంతంలోని రూ.300 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం రూ.55 లక్షలకే మాలిక్ పొందాడని ఈడీ తెలిపింది. ఇందులో ఆయనకు దావూద్ సోదరి హసీనా పార్కర్‌తో పాటు దావూద్ సన్నిహితులు సాయం చేశారని తెలిపింది. దావూద్‌తో మాలిక్‌కు సంబంధం ఉందన్న ఆధారాల్లేవని మాలిక్ న్యాయవాదులు చెప్పారు. ఈడీ చెబుతున్న లావాదేవీ 1999కి సంబంధించినదని తెలిపారు. ఇక, మాలిక్ అరెస్ట్‌ను ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సహా పలువురు నేతు ఖండించారు. 8. ఢిల్లీ లిక్కర్ స్కాం.. దేశ రాజధాని ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో అమిత్ అరోరా సహా పలువురు అరెస్ట్ అయ్యారు. ఇక, ఈ కేసులో ఈడీ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఇండోస్పిరిట్ కంపెనీకి ఢిల్లీలో ఎల్1 లైసెన్సుతో వచ్చిన షాపుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు వాటా ఉందని ఈడీ పేర్కొంది. లిక్కర్ స్కాం ద్వారా సంపాదించిన ఈ ఆదాయంలో ఎక్కువ భాగం కవితకు చేరినట్టు ఈడీ ఆరోపించింది. లిక్కర్ స్కాంకు సంబంధించి ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఏర్పాటుచేసిన మీటింగ్‌లో కవితతో పాటు అమిత్ అరోరా, దినేశ్ అరోరా, సమీర్ మహీంద్రు పాల్గొన్నారని ఈడీ చార్జిషీట్లో ప్రస్తావించింది. కవిత వాడిన ఫోన్ల వివరాలను, వాటిని ఐఎంఈఐ నంబర్లను కూడా ఈడీ ప్రస్తావించింది. ఇక, ఇదే కేసులో గతంలో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. ఈ కేసులో భాగంగానే కవితను సీబీఐ కూడా విచారించింది. 9. విజయవాడ ఆసుపత్రుల్లో ఈడీ దాడులు.. విజయవాడలోని ఆసుపత్రుల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గుంటూరు జిల్లా చినకాకానిలోని ‘ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్’లో అక్రమాలపై ఈడీ కొరడా ఝుళిపించింది. ఆ అకాడమీ నిర్వహిస్తున్న ఆస్పత్రి, మెడికల్ కాలేజీల నిధులను నిబంధనలకు విరుద్ధంగా కొల్లగొట్టడంపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఎన్ఆర్ఐ ఆస్పత్రితోపాటు విజయవాడలో నివసిస్తున్న ఆ ఆస్పత్రి డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ఉప్పలాపు శ్రీనివాసరావు, వల్లూరిపల్లి నళినీమోహన్ల నివాసాలలో 40 ఈడీ బృందాలు ఏకకాలంలో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. రెండు ఆస్పత్రుల్లో పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మెడికల్ సీట్ల అమ్మకం, అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో పెట్టుబడులపై ఆరా తీశారు. దాదాపు రూ.100 కోట్లు వరకు ఆర్థిక వ్యవహారాలు నడిచినట్లు సమాచారం. 10. గ్రానైట్ విషయంలో గంగులపై ఈడీ దాడి.. టీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్‌ను ఈడీ టార్గెట్ చేసింది. గంగుల నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్లో సోదాలు నిర్వహించారు. గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్‌తో పాటు కరీంనగర్‌లోని మహవీర్, ఎస్వీఆర్ గ్రానైట్స్ కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. గంగులతో పాటు ఇతర గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలను ఉల్లంఘించినందుకే సోదాలు నిర్వహిస్తున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. అనంతరం, గంగుల కమలాకర్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. - ఇవే కాకుండా.. ఎంపీ కార్తీ చిదంబరం చైనా వీసా కేసులో కూడా ఆయన్ను ఈడీ విచారించింది. ఈ కేసులో చిదంబరం మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ పేర్కొంది. యస్-బ్యాంక్, డీహెచ్ఎఫ్ఎల్ ఫ్రాడ్ కేసులో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో భాగంగా రూ. 415 కోట్లను ఈడీ ఎటాచ్ చేసింది. జమ్మూ-కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ స్కామ్ వ్యవహరంలో మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేసింది. -
ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాల సోదాలపై ఈడీ కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: ఎన్ఆర్ఐ సొసైటీ, వైద్య కళాశాలలో నిధుల మళ్లింపుపై నమోదైన మనీలాండరింగ్ కేసులో సోదాలపై కీలక ప్రకటన చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించి మొత్తం 53 చోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. నగదు, కీలక పత్రాలు, పలు ఆస్తులను సీజ్ చేసినట్లు తెలిపింది. ‘ నగదు, కీలక పత్రాలు, పలు ఆస్తులు సీజ్ చేశాం. ఎన్ఆర్ఐ సొసైటీకి చెందిన నిధులను భవన నిర్మాణాల పేరుతో దుర్వినియోగం చేశారు. కోవిడ్ సమయంలో రోగుల నుంచి భారీగా నగదు వసూలు చేశారు. ఆ ఆదాయాన్ని ఎన్ఆర్ఐ సొసైటీ ఖాతాల్లో చూపించలేదని గుర్తించాము. ఎంబీబీఎస్ విద్యార్థుల దగ్గర పెద్ద మొత్తంలో అడ్మిషన్ల పేరుతో వసూళ్ళు చేశారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని దారి మళ్లించారు. ఎన్ఆర్ఐ సొసైటీ ఖాతా నుండి ఎన్‌ఆర్‌ఐఏఎస్ అనే మరో ఖాతాకు బదిలీ చేసినట్లు గుర్తించాము.’ అని తెలిపింది ఈడీ. ఎన్ఆర్ఐ సొసైటీలో జరిగిన అవకతవకలపై ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. ఈ కేసులో విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్ ప్రాంతంలో రెండు రోజులుగా సోదాలు నిర్వహించింది. ఇదీ చదవండి: బీసీలను బెదిరించాడు.. చంద్రబాబు ఆ మాట చెప్పలేకపోతున్నాడు: సీఎం జగన్ -
ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ముగిసిన ఈడీ తనిఖీలు
సాక్షి, గుంటూరు: ఎన్ఆర్ఐ ఆస్పత్రి, దానికి అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలో ఈడీ తనిఖీలు ముగిసాయి. మొత్తం 27 గంటలపాటు జరిపిన సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది ఈడీ. గతంలో ఆస్పత్రిలో జరిగిన అవకతవకలపై ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి ఎన్ఆర్ఐ ఆస్పత్రికి డైరెక్టర్లగా వ్యవహరించిన పలువుర్ని విచారించారు. గతంలో అక్కినేని మణి, బసవరాజు, చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ నళినిమోహన్‌తో పాటు 25 మందిని ఈడీ విచారించింది. ఎన్ఆర్ఐ ఆస్పత్రుల్తో నిధులు సొంత ఖాతాలకు మళ్లినట్లు ఈడీ గుర్తించింది. కోవిడ్ సమయంలోనూ అడ్వాన్స్ పేమెంట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయి. దొంగ ఇన్వాయిస్ పత్రాలతో నిధులను పక్కదారి పట్టించడంతో భవన నిర్మాణానికి సంబంధించి కోట్ల రూపాయలు గోల్‌మాల్‌పై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. -
ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఈడీ సోదాలు
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: టీడీపీ పెద్దల గుప్పిట్లో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న గుంటూరు జిల్లా చినకాకానిలోని ‘ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్’లో అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝుళిపించింది. ఆ అకాడమీ నిర్వహిస్తున్న ఆస్పత్రి, మెడికల్ కాలేజీల నిధులను నిబంధనలకు విరుద్ధంగా కొల్లగొట్టడంపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఎన్ఆర్ఐ ఆస్పత్రితోపాటు విజయవాడలో నివసిస్తున్న ఆ ఆస్పత్రి డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ఉప్పలాపు శ్రీనివాసరావు, వల్లూరిపల్లి నళినీమోహన్ల నివాసాలలో ఈడీ బృందాలు శుక్రవారం ఏకకాలంలో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. ఈనాడు రామోజీరావుకు సమీప బంధువు కూడా అయిన ఎన్ఆర్ఐ ఆస్పత్రి కోశాధికారి అక్కినేని మణి నివాసంతోపాటు విజయవాడలో ఆమె నిర్మించిన ‘అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రి’లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. 40 మంది ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏకధాటిగా 8 గంటలపాటు సోదాలు నిర్వహించడం గమనార్హం. అక్కినేని మణి ఎన్ఆర్ఐ ఆస్పత్రి నిధుల మళ్లింపులో కీలకంగా వ్యవహరించినట్టు ఈడీ అధికారులు భావిస్తున్నారు. విజయవాడ భారతీనగర్‌లోని అక్కినేని ఉమెన్స్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి నిధులు ఎలా సమకూర్చారని ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ ఆస్పత్రి నిధులను దారి మళ్లించి, ఈ ఆస్పత్రిని నిర్మించినట్టు భావిస్తున్నారు. అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రి నిర్మాణ బిల్లులను ఎన్ఆర్ఐ ఆస్పత్రినిధుల నుంచి చెల్లించడం గమనార్హం. ఈ మేరకు ఈడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించి, అక్కినేని మణిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ పెద్దల పాత్రపైనా దృష్టి టీడీపీ పెద్దలు తమ అక్రమాలకు అక్షయపాత్రగా ఎన్ఆర్ఐ అకాడమీని వాడుకున్నారని తెలుస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన టీడీపీకి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (రాజ) కుటుంబం నియంత్రణలో ఎన్ఆర్ఐ అకాడమీ పాలక మండలి చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ఎన్ఆర్ఐ ఆస్పత్రికి అనుబంధంగా ఎన్ఆర్ఐ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఆలపాటి రాజ, ఆయన సతీమణి కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ ఆస్పత్రి నిధుల మళ్లింపు వ్యవహారం వెనుక వీరి కుటుంబం పాత్రపైనా ఈడీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వైద్య పరికరాల కొనుగోలు పేరిట కూడా నిధులు నొక్కేసినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలో ఈ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరించిన తన సోదరుడు రవి ద్వారా రాజా ఈ వ్యవహారాలు సాగించినట్లు తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబుకు సన్నిహితుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్న సుజనా చౌదరి చేతిలో ఎన్ఆర్ఐ అకాడమీ రిమోట్ కంట్రోల్ ఉందన్నది బహిరంగ రహస్యం. ఈ అకాడమీలో అక్రమాలపై కేసులు నమోదైన నేపథ్యంలో సుజనా చౌదరి వ్యూహాత్మకంగా తన సన్నిహితుడిని ఆస్పత్రిలో కీలక స్థానంలో చేర్చారు. ఆయన ద్వారా గుట్టుచప్పుడు కాకుండా నిధులు దారి మళ్లించారు. కీలక ఆధారాలను ధ్వంసం చేసేందుకు కూడా యత్నించారని తెలుస్తోంది. కంప్యూటర్లలో హార్డ్ డిస్క్‌లను గల్లంతు చేసినట్టు సమాచారం. ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించిన ఈడీ అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్ఆర్ఐ ఆస్పత్రి, డైరెక్టర్లు, ఇతర కీలక వ్యక్తుల నివాసాల్లో ఈడీ అధికారులు శనివారం కూడా సోదాలు కొనసాగిస్తారని సమాచారం. కాగా తాజా సోదాలపై ఈడీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. సీట్ల పేరిట భారీగా వసూలు చినకాకానిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రితోపాటు నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ఉప్పాల శ్రీనివాసరావు, నళిని మోహన్ నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో కూడా నిధుల మళ్లింపునకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రి నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర సంస్థలకు మళ్లించినట్టు ఈడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఎన్ఆర్ఐ ఆస్పత్రి మేనేజ్మెంట్ కోటా సీట్ల పేరిట నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఫీజులు వసూలు చేసినట్టు కూడా ఈడీ గుర్తించింది. 2020–21లో ఆస్పత్రి నిధులను ఎన్ఆర్ఐ పాలక మండలి సభ్యులు తమ వ్యక్తిగత ఖాతాలకు మళ్లించినట్టు కూడా ఈడీ ఆధారాలు సేకరించింది. ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న దాదాపు 2 వేల మంది వివరాలను కూడా ఈడీ అధికారులు అడగడం గమనార్హం. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో కొందరు ఉద్యోగులను అధికారులు ప్రత్యేకంగా విచారించారు. ముందుగా వారి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, అనంతరం వారిని రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి మరీ విచారించి కీలక సమాచారాన్ని రాబట్టారని తెలిసింది. ఆ సమాచారం ఆధారంగానే కొందరు ఆస్పత్రి ఉన్నతాధికారుల నివాసాల్లోనూ తనిఖీలు చేశారు. -
ఎన్ఆర్ఐ ఆస్పత్రి అక్రమాల్లో టీడీపీ నేతల పాత్ర!
సాక్షి, విజయవాడ: ఏపీలోని పలు ఆస్పత్రిల్లో ఈడీ సోదాలు చేస్తున్న వేళ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రి, విజయవాడ అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రిల్లో ఈరోజు(శుక్రవారం) ప్రధానంగా సోదాలు నిర్వహించగా విస్తుగొలిపే విషయాలు బయటకు వచ్చాయి. ఎన్ఆర్ఐ ఆస్పత్రి అక్రమాల్లో ప్రముఖంగా టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రి నిర్మాణం కాకుండా రూ. 43 కోట్లు అక్రమ మార్గంలో దారి మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఎన్ఆర్ఐ ఆస్పత్రి మేనేజ్మెంట్లో కీలకంగా వ్యవహరించిన టీడీపీ మాజీ మంత్రి ఆలపాట రాజా.. సుదీర్ఘకాలం ఎన్ఆర్ఐ ఆస్పత్రి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఎన్ఆర్ఐ ఆస్పత్రికి అనుబంధంగా ఎన్ఆర్ఐ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు.ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి నిధులు దారి మళ్లించేందుకు ఎన్ఆర్ఐ అగ్రిటెక్ లిమిటెడ్‌ను ఉపయోగించుకున్నట్లు ఈదీకి ఆధారాలు లభించాయి. మరొకవైపు ఈనాడు రామోజీరావు సమీప బంధువు అక్కినేని మణి చైర్మన్‌గా వ్యవహరించిన అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రిలోనూ చేసిన ఈడీ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్పత్రికి డైరెక్టర్లుగా వ్యవహరించిన వారిని విచారించిన ఈడీ.. కీలక ఆధారాలు సేకరించింది. -
అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రిలో ముగిసిన సోదాలు
సాక్షి, విజయవాడ: ఏపీలోని పలు ఆసుపత్రుల్లో ఈడీ సోదాలు చేపట్టింది. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో శుక్రవారం ఈడీ తనిఖీలు చేసింది. ఆసుపత్రిలో రికార్డులను ఈడీ అధికారులు పరిశీలించారు. రెండు బృందాలుగా విడిపోయి అధికారులు రికార్డులు తనిఖీ చేశారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి సొసైటీ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. విజయవాడ అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలోనూ ఈడీ తనిఖీలు చేసింది. రేపు కూడా ఆస్పత్రిల్లో తనిఖీలు చేయనుంది. ఈ రోజు తనిఖీల్లో ఆసుపత్రి సిబ్బంది ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రి ఛైర్మన్‌తో సహా సిబ్బందిని ఈడీ ప్రశ్నించింది. అమెరికాలో వైద్యురాలుగా ఉంటూ విజయవాడలో అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిని అక్కినేని మణి ప్రారంభించారు. విదేశీ నిధులు అక్రమంగా దారి మళ్లింపు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. గతంలో ఎన్నారై ఆసుపత్రిలో డైరెక్టర్‌గా అక్కినేని మణి వ్యవహరించారు. అక్కినేని మణిని ఈడీ అధికారులు రహస్యంగా విచారిస్తున్నారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కోవిడ్ సమయంలోనూ భారీగా అవతవకలకు పాల్పడ్డారని గతంలోనే కేసు నమోదైంది. మాన్యువల్‌రసీదులు, నకిలీ రసీదులతో నిధులను పక్కదారి మళ్లించారనే అభియోగాలు నమోదయ్యాయి. కోవిడ్ సమయంలో ట్రీట్మెంట్ తీసుకున్న 1500 మంది పేషెంట్ల వివరాలను రికార్డుల్లో చేర్చలేదని గతంలోనే అధికారులు పేర్కొన్నారు. కొంత మంది ఉద్యోగుల సహకారంతో దొంగ ఖాతాలకు నగదు మళ్లింపులు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నారై హాస్పటల్‌కి సంబంధించి పరికరాల కొనుగోళ్లుపై అవకతవకలు జరిగాయని ఆరోపణలు రాగా, ఎంబీబీఎస్ ఫీజు రూపంలో కూడా కోట్లాడి రూపాయల మేర అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు గతంలో పనిచేసిన డైరెక్టర్లు నిమ్మగడ్డ ఉపేంద్రనాధ్, అక్కినేని మణి, ఉప్పాల శ్రీనివాసరావు, నళిని మోహన్‌లు ఈడీ అధికారలు విచారిస్తున్నారు. ఉమెన్స్ ఆస్పత్రి , ఎన్ఆర్ఐ ఆస్పత్రుల్లో కీలక రికార్డులు స్వాధీనం అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రి, ఎన్ఆర్ఐ ఆస్పత్రుల్లో పలు కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. నిధులు గోల్మాల్, మేనేజ్మెంట్ కోటాలోని మెడికల్ సీట్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. చదవండి: చంద్రబాబుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ షాకింగ్ కామెంట్స్ -
ఎంబీఎస్ జ్యువెలరీస్ సూపర్వైజర్ సురేష్ కుమార్ ఇంట్లో ఈడీ తనిఖీలు
-
పోడు సమస్యల పరిష్కారంతో ప్రభుత్వం విఫలమైంది: భట్టి విక్రమార్క
-
ఐటీ దాడులు, మర్రి శశిధర్‌పై భట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్రబోరు అటవీప్రాంతంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు దారుణ హత్య తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి పోడు భూముల వ్యవహరం తెరపైకి వచ్చింది. కాగా, పోడు భూముల సమస్యలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. పోడు సమస్యల పరిష్కారంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైంది. పోడు రైతుల జీవితాలతో కేసీఆర్ సర్కార్ ఆడుకుంటోంది. అర్హులైన వారికి భూములు ఇవ్వలేదు. ప్రభుత్వ విధానాలతో అధికారులు, గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇక, తెలంగాణలో దాడులపై భట్టి విక్రమార్క స్పందిస్తూ.. గతంలోనూ ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. రెగ్యులర్‌గా జరిగే రైడ్స్‌ను పార్టీలు, ప్రభుత్వం చూపించడం తప్పు. విధినిర్వహణలో జరిగే చర్యలను కూడా టీఆర్ఎస్, బీజేపీ రాజకీయం చేశాయి. మర్రి శశిధర్ రెడ్డి పార్టీని విడిచిపెట్టి వెళ్ళేది కాదు.. కానీ వెళ్లిపోయారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. కాంగ్రెస్ పార్టీతో మర్రి కుటుంబానికి సుదీర్ఘంగా అనుబంధం ఉంది. మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. నేను జగ్గారెడ్డితో మాట్లాడుతాను. ఆయన ఏ సలహా ఇచ్చినా తీసుకుంటాను. నాకు బేషజాలు లేవు. కాంగ్రెస్ పార్టీని ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఎన్నికలకు రెడీగా ఉంటుంది. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం అభ్యంతరకం. శ్రీనివాస్ రావు కాళ్లు మొక్కడాన్ని ఖండిస్తున్నాం. కాళ్లు మొక్కుతా బాంచన్ అనే కాలం నుంచి మనం బయటకు వచ్చాము అని కామెంట్స్ చేశారు. -
TS Raids: బీజేపీ టార్గెట్‌గా జగ్గారెడ్డి సంచలన కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈడీ, ఐటీ దాడుల నేపథ్యంలో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ క్రమంలో రాజకీయ నేతలు టీఆర్ఎస్, బీజేపీ సర్కార్లను టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఈ దాడులపై స్పందించారు. కాగా, జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ, ఐటీని బీజీపీ వాడుతోంది. కేసీఆర్ ఏసీబీని వాడుకుంటున్నారు. వీరిద్దరి మధ్య దాడుల వల్ల ప్రజలు జరిగే లాభమేంటి?. మా దగ్గర ఏ శాఖ లేదు.. మేమేమీ చేయలేము. టీడీపీలో ఉన్నప్పటి నుంచే మంత్రి మల్లారెడ్డి సంపాదించాడు. గత ఎనిమిదేళ్లలో లేని దాడులు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు. గోవాలో క్యాసినో ఫ్రీ.. అక్కడ బీజేపీనే కదా అధికారంలో ఉంది. గోవాలో ఆడించేది మీరే.. ఇక్కడ దాడులు చేసేది కూడా మీరేనా అంటూ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ దెబ్బతీయాలని చూస్తోంది. మీడియాను అడ్డంపెట్టుకుని కుట్ర పన్నుతోంది. లైమ్‌లైట్‌లో ఉంచడానికే టీఆర్ఎస్ మంత్రులపై దాడులు జరుపుతోంది అంటూ సంచలన కామెంట్స్ చేశారు. -
Telangana: సోదాలు, దాడుల కాలమిది!
తెలంగాణాలో రాజకీయ సమరం ప్రస్తుతం దర్యాప్తు సంస్థల రూపంలో సాగుతోంది. రాష్ట్ర పోలీసులు బీజేపీ పెద్ద నేతలలో ఒకరైన బీఎల్ సంతోష్‌కు విచారణ నిమిత్తం రావాలని నోటీసు పంపితే, కేంద్ర ఆదాయ పన్నుశాఖ రాష్ట్రమంత్రి మల్లారెడ్డి ఇంటిలోనూ, ఆయనకు సంబంధించిన వారి ఇళ్లు, ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించింది. అయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏ మలుపు తీసుకుంటుందో అన్న ఆలోచన అందరి మదిలో ఉన్న సమయంలో మల్లారెడ్డిపై దాడి జరగడం విశేషం. కింది స్థాయి నుంచి పైకి ఎదిగి, ఇప్పుడు యూనివర్శిటీ, మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీల స్థాపనతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న మల్లారెడ్డి వివాదాలకు అతీతుడేమీ కాదు. ఆయన రాజకీయాల్లోకి ఒకందుకు వస్తే, అది ఇప్పుడు మరొకందుకా అన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. అలా ఎదిగారు.. ఇలా చిక్కారు.! 2014లో మల్లారెడ్డి తెలుగుదేశం టిక్కెట్ సంపాదించి మల్కాజిగిరి నుంచి పోటీ చేసినప్పుడే రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా గుర్తింపు పొందారు. పక్కా తెలంగాణ యాస, భాషలో మాట్లాడే మల్లారెడ్డి తన వ్యవహార శైలితో భిన్నంగా కనిపిస్తారు. అప్పట్లో టీడీపీలోనే ఉన్న రేవంత్ రెడ్డి కూడా మల్కాజిగిరి టిక్కెట్ ఆశించారు. కానీ, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం మల్లారెడ్డి వైపు మొగ్గు చూపారు. దానికి కారణం మల్లారెడ్డి టీడీపీకి భారీగా నిధులు సమకూర్చడమేనని రేవంత్ ఆరోపించేవారు. దీనిపై పార్టీలో పంచాయితీ కూడా జరిగింది. ఆనాటి రాజకీయ పరిణామాలు కలిసి వచ్చి మల్లారెడ్డి ఎంపీ అయ్యారు. తదుపరి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు చిక్కుకుని రాత్రికి రాత్రి పెట్టేబేడ సర్దుకుని విజయవాడ వెళ్లిపోవడంతో మొత్తం రాజకీయం టీఆర్ఎస్ కంట్రోల్లోకి వెళ్లింది. టీడీపీ ఎమ్మెల్యేలు పలువురిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకర్షించారు. ఆ క్రమంలోనే మల్లారెడ్డిని కూడా పార్టీలోకి తీసుకువచ్చారు. తదుపరి శాసనసభ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి టీఆర్ఎస్ పక్షాన పోటీచేసి భారీ విజయం సాధించారు. ఆ వెంటనే రాష్ట్ర మంత్రి కూడా అయిపోయారు. సోదాలకు, రాజకీయాలకు లింకు? మల్లారెడ్డి మాటకారితనంతో పాటు, ఆయన ఆర్ధిక స్థోమత కూడా ఇందుకు బాగా ఉపయోగపడిందని నియోజకవర్గ ప్రజలు భావిస్తారు. అప్పటి నుంచి ఆయా సందర్భాలలో మల్లారెడ్డి వార్తలలోకి ఎక్కారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో బహిరంగంగా మద్యం తీసుకుంటూ, దానిని సమర్ధిస్తూ మాట్లాడిన వైనం ప్రముఖంగా ప్రచారం అయింది. ఇప్పుడు ఐటీ దాడుల ద్వారా ఆయన వార్తల్లోని వ్యక్తి అయ్యారు. సాధారణంగా ఐటీ దాడులు జరిగితే పెద్ద ప్రాధాన్యత ఉండేది కాదు. అన్నిచోట్ల జరిగినట్లే సోదాలు జరిపి, డబ్బు ఏమైనా దొరికినా, పన్నులు సరిగా కట్టలేదని తేలినా అధికారులు నోటీసులు ఇచ్చి వివరణ కోరి తదుపరి చర్యలకు ఉపక్రమిస్తారు. ఇది రొటీన్ వ్యవహారం. కానీ.. మల్లారెడ్డి మంత్రి కావడం, ఇటీవలి కాలంలో టీఆర్ఎస్కు, బీజేపీకి మధ్య హోరాహోరీ రాజకీయ యుద్దం సాగుతుండటంతో దాని ప్రభావం మొట్టమొదటగా మల్లారెడ్డిపైన పడినట్లుగా ఉంది. అటు కారు, ఇటు కమలం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ తరఫున కొనుగోలు చేసే యత్నం చేశారంటూ ముగ్గురు వ్యక్తులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేయడం, ఆ తర్వాత ఒక సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తును మరీ సీరియస్‌గా మార్చడంతో పరిస్థితి హద్దులు దాటిపోయినట్లుగా ఉంది. ఏకంగా కేంద్ర బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు పోలీసులు నోటీసు ఇవ్వడాన్ని కాషాయ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వెరసి ఐటీ దాడి జరిగిందన్నది అందరి అభిప్రాయంగా ఉంది. ఈ దాడిలో ఏమీ దొరక్కపోతే టీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఎదురు దాడి చేసి ఉండేది. కానీ.. మల్లారెడ్డి, ఆయన బంధువుల వద్ద ఎనిమిదిన్నర కోట్ల రూపాయల నగదు దొరకడం కలకలం రేపుతోంది. దీనికి వివరణ ఇచ్చుకోవడం తలకు మించిన పనే అవుతుంది. నోట్ల రద్దు తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నోట్లు దొరికితే అది పెద్ద విషయమే అవుతుంది. అందులోను రాజకీయంగా సున్నితమైన అంశం కావడంతో ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందా అనే ఉత్కంఠ ఏర్పడింది. జవాబు లేని ప్రశ్నలెన్నో! మల్లారెడ్డి తన సెల్ ఫోన్ ఎక్కడో ఒక జనప బ్యాగ్‌లో దాచారన్న విమర్శలు సందేహాలకు తావిస్తున్నాయి. మరో బంధువు తన ఇంటి తలుపులు తీయకుండా అడ్డుకోవడం, అధికారులు తలుపులు పగలకొట్టడం వంటి ఘట్టాలు మల్లారెడ్డికి ఇబ్బంది కలిగించేవి. దీనిని టీఆర్ఎస్ సమర్ధించుకోవడం కూడా కష్టమే అవుతుంది. పట్టుబడ్డ కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి? మెడికల్ కాలేజీ సీట్లను బ్లాక్‌లో అమ్మడం వల్ల వచ్చాయా? ఇంకేదైనా రూట్లో వచ్చాయా? అన్నదానికి వీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ సమావేశంలో ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే, ఎంత హెచ్చరించినా, ఎవరి మీద ఏ సంస్థ దాడి చేస్తుందో ఊహించడం కష్టమే. అంతేకాక ఎవరిని నమ్మి ఇంత డబ్బు ఎక్కడ పెడతారు?. టీఆర్ఎస్, బీజేపీ గొడవ కాస్తా రాష్ట్ర, కేంద్ర దర్యాప్తు సంస్థల మధ్య రగడగా మారిందా?. బీజేపీని వదిలేదిలేదని కేసీఆర్ చర్యలు చేపడితే, కేసీఆర్‌ను సహించబోమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనడం ఎలాంటి సంకేతాలిస్తున్నాయి?. ఈ ప్రహసనంలో సీఎం కేసీఆర్ ఇబ్బంది పడతారా? లేక ఆయన బీజేపీపై చేయి సాధిస్తారా? అన్నది తేలడానికి మరి ఎక్కువ కాలం పట్టకపోవచ్చేమో! హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
‘అంత భయమెందుకు.. బండి సంజయ్ ఎందుకు కన్నీరు పెట్టుకున్నారు?’
సాక్షి, కామారెడ్డి: తెలంగాణ రాజకీయాల్లో ఈడీ, ఐటీ, సిట్ హీట్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఈ క్రమంలో పొలిటికల్ లీడర్లు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, నాగిరెడ్డిపేట్ మండలం తాండూరులో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఈడీ, ఐటీకి భయపడే ప్రసక్తే లేదు. తప్పు చేసిన వాళ్లే భయపడతారు. బీఎల్ సంతోష్ ఎందుకు విచారణకు రావడంలేదు. మేము విచారణకు హాజరు కావాలి కానీ.. బీజేపీ వాళ్లు విచారణకు రారా?. బీఎల్ సంతోష్‌ను ఎందుకు అరెస్ట్ చేయకూడదు. మన దగ్గర దొరికితే విచారణ చేయకూడదా?. నెల రోజులుగా మంత్రులపై ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారు. బీఎల్ సంతోష్ విచారణకు రమ్మంటే కోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు చెప్పినా విచారణకు రావడంలేదు. నిన్న సభ పెట్టి బండి సంజయ్ కన్నీరుపెట్టుకున్నారో అర్థం కాలేదు. తప్పు చేయకపోతే భయమెందుకు?. దాడులకు తెలంగాణలో ఎవరూ భయపడరు. విచారణ చేసుకోండి.. అన్ని పత్రాలు చూపిస్తాము’ అంటూ కౌంటర్ ఇచ్చారు. -
సంచలనాలకు కేంద్రబిందువుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఇప్పుడు అంతా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆకస్మిక దాడులు, ఎమ్మెల్యేల ఎరపై దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) గురించే జోరుగా చర్చలు సాగుతున్నాయి. మీడియాలో ప్రతీరోజూ పతాకశీర్షికన కథనాలు వస్తుండగా.. ఈ వ్యవహారాలన్నీ రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. ఈ దర్యాప్తు సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ.. వీరు విచారిస్తున్న ప్రతీ కేసులోనూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధాలు ఉండటం చర్చనీయాంశంగా మారింది. ► ఉద్యమకాలం నుంచి రాజకీయాల్లో ఉమ్మడి కరీంనగర్ తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్ర అవతరణ అనంతరం కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా తనదైన ముద్ర వేస్తూ వస్తోంది. తాజాగా రాష్ట్రంలో టీఆర్ఎస్–బీజేపీ మధ్య రాజకీయవైరం పతాకస్థాయికి చేరడం, కేంద్ర దర్యాప్తు సంస్థలు జోరు పెంచడం, రాష్ట్ర దర్యాప్తు బృందాలు కూడా అదేస్థాయిలో దూకుడు ప్రదర్శించడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతీ వ్యవహారంలోనూ కరీంనగర్ వ్యక్తులే కీలకంగా మారుతుండటం ఇక్కడ గమనించదగ్గ విషయం. ► ఇటీవల కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రానైట్ సంస్థలపై ఈడీ, ఐటీ ఆకస్మిక దాడులు నిర్వహించడం.. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ తనిఖీలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అదే సమయంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పార్టీలు మారుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా చీకోటి ప్రవీణ్ కేసినో వ్యవహారంలోనూ ఉమ్మడి జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ రమణకు ఈడీ సంస్థ నోటీసులు ఇవ్వడం.. శుక్రవారం ఆయన విచారణకు హాజరవడం జరిగాయి. తొలుత ఎన్ఐఏ.. నిజామాబాద్‌లో స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఉ గ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓ సంస్థలో క్రియాశీలక సభ్యుడు జగిత్యాల వాసిగా గుర్తించా రు. ఈ క్రమంలో సెప్టెంబరు 19వ తేదీన దేశవ్యాప్తంగా సదరు సంస్థపై ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో సదరు జగిత్యాల వాసిని కరీంనగర్‌లోని నాఖా చౌరస్తా సమీపంలోని ఓ ఇంటి నుంచి అరె స్టు చేసి తీసుకెళ్లారు. ఆ రోజు తెల్లవారుజామున కరీంనగర్ పట్టణంలో పలువురి అనుమానితుల ఇళ్లపైనా ఎన్ఐఏ అధికారులు సోదాలు జరిపి, అనుమానాస్పద ఫైళ్లను తీసుకెళ్లారని సమాచారం. జగిత్యాల, కరీంనగర్లో ఉగ్ర సంస్థతో సంబంధాలు బయటపడటం అప్పట్లో కలకలం రేపింది. ఈడీ, ఐటీ.. ఆకస్మిక సోదాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సింగరేణి తరువాత అతిపెద్దది గ్రానైట్ పరిశ్రమ. ఈ క్రమంలో మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేశారని, అక్రమ మార్గాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బు విదేశాలకు తరలించారన్న ఆరోపణలపై పలు కంపెనీలపై ఈ నెల 9వ తేదీన తరలించారన్న ఫిర్యాదులతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) సంయుక్తంగా సోదాలు నిర్వహించాయి. రెండురోజులపాటు జరిగిన ఈ సోదాల్లో దాదాపు 10కిపైగా కంపెనీల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లోనూ తనిఖీలు చేయడం సంచలనంగా మారింది. ► చీకోటి ప్రవీణ్ కేసినో కేసులోనూ రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. తొలుత ఈ కేసుకు కరీంనగర్‌తో సంబంధాలు లేవనుకున్నప్పటికీ.. తాజాగా ఎమ్మెల్సీ రమణకు నోటీసులు జారీ చేయడం, ఆయన విచారణకు హాజరు కావడం ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. ► మరోవైపు ఢిల్లీ వేదికగా జరిగిన లిక్కర్ స్కాంలోనూ పలువురు సిరిసిల్ల, కరీంనగర్ పట్టణవాసుల ప్రమేయం ఉందన్న ప్రచారం అప్పుడే మొదలైంది. కరీంనగర్లో ఇటీవల జరిగిన ఈడీ దాడుల సమయంలోనూ తొలుత లిక్కర్ స్కాంలో సోదాలుగానే ప్రచారం జరిగాయి. ► మరోవైపు అధికార పార్టీ ‘ఎమ్మెల్యేలకు ఎర కేసు’ కూడా జాతీయస్థాయిలో చర్చ లేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీజేపీ పార్టీపై స్వయంగా సీఎం చంద్రశేఖర్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు కరీంనగర్‌తో ఉన్న లింకులు బయటపెట్టారు. కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులకు విమాన టికెట్లు బుక్ చేసిన ఆరోపణలపై సిట్ అధికారులు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్‌కు నోటీసులు జారీచేయడంతో మరోసారి కరీంనగర్ వార్తల్లోకెక్కింది. రాజకీయ సమరానికీ ఇక్కడే ఆజ్యం..! కొంతకాలంగా ఉప్పు నిప్పులా ఉన్న బీజేపీ–టీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు బహిరంగంగానే పరస్పర ప్రత్యారోపణలకు దిగుతున్నాయి. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీస్థాయి వరకు ఇరు పార్టీ నాయకులు తమకు ఏమాత్రం చిన్న అవకాశం లభించినా ప్రత్యర్థి వర్గాన్ని ఆరోపణలతో చీల్చిచెండాడుతున్నారు. ఈ సమరానికి సైతం ఉమ్మడి కరీంనగర్ జిల్లానే వేదికగా నిలవడం విశేషం. ఇటీవల రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్సీఎల్)ను జాతికి అంకితం చేసే క్రమంలో స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా టీఆర్ఎస్పై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. అవినీతి చేసే ఎవరినీ వదలమంటూ హెచ్చరికలు జారీచేశారు. ► మరోవైపు సోషల్‌మీడియాలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు నాయకుల విషయంలో పూటకో ప్రచారం వెలుగుచూస్తోంది. టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురై, హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తిరిగి సొంతగూటికి వెళ్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ‘ఘర్‌వాపసీ’ పేరిట సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఈటల ఖండించారు. ► శుక్రవారం ఉదయం నుంచి మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ పుట్ట మధు పార్టీ మారుతున్నారన్న సందేశం వైరల్‌గా మారింది. టీవీలు, వెబ్సైట్లలో బ్రేకింగ్ న్యూస్ రావడంతో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పుట్ట మధు హడావిడిగా అక్కడే విలేకరుల సమావేశం పెట్టి ప్రచారాన్ని ఖండించారు. అంతకుముందు ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడిన ఆయన తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు. తాను సొంత పనుల మీద నియోజకవర్గం వీడిన ప్రతీసారి ప్రతిపక్షాలు రాస్తున్న ప్రేమలేఖలు చదివి నవ్వుకుంటున్నానని చమత్కరించారు. (క్లిక్: ఆ ఎమ్మెల్యే ఇక రాజకీయాలకు దూరమా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా?) -
గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ ప్రకటన
-
ED Raids Telangana: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన చేసింది. శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్, పీఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్‌లో రెండు రోజులు సోదాలు జరిపినట్లు వెల్లడించింది. హైదరాబాద్, కరీంనగర్‌లోని పలుచోట్ల సోదాలు చేసినట్లు పేర్కొంది. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ సోదాలు నిర్వహించింది. రాయల్టీ చెల్లించిన దానికంటే ఎక్కువ గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేసినట్టు ఈడీ గుర్తించింది. సోదాల్లో రూ.1.8 కోట్ల నగదు ఈడీ సీజ్ చేసింది. ఉద్యోగులతో బినామీ అకౌంట్లు తెరిచినట్లు అధికారులు గుర్తించారు. పదేళ్లుగా భారీగా హవాలా లావాదేవీలు జరిపినట్లు తేలింది. చైనా, హాంకాంగ్‌కు చెందిన కంపెనీల పాత్రపై ఈడీ ఆరాతీసింది. ఎలాంటి పత్రాలు లేకుండా చైనా సంస్థల నుంచి నగదు మళ్లించడాన్ని గుర్తించినట్టు ఈడీ వెల్లడించింది. చదవండి: మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే -
HYD: 30 టీమ్స్‌తో స్పీడ్ పెంచిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. పలుచోట్ల మరోసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు బయలుదేరారు. బుధవారం ఉదయం నుంచే కేంద్ర బలగాలు పెద్ద సంఖ్యలో నగరంలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నాయి. కరీంనగర్, హైదరాబాద్‌లో ఈడీ సోదాలు నిర్వహించేందుకు బయలుదేరాయి. కాగా, బుధవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో దాదాపు 30 బృందాలు, 10 వాహనాల్లో సోదాలు నిర్వహించేందుకు ఈడీ కార్యాలయం నుంచి అధికారులు బయలుదేరాయి. వాటిలో కొన్ని బృందాలు కరీంనగర్‌వైపు వెళ్లగా.. మరికొన్ని బృందాలు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు.. కేంద్ర బలగాల్లో మహిళా అధికారులు కూడా ఉన్నారు. కాగా, కొద్దిరోజుల పాటు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈడీ అధికారులతోపాటు ఐటీ అధికారులు కూడా సోదాలకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. సోమాజీగూడ, అత్తాపూర్‌లో గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలో, కరీంనగర్‌లోని గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసులే లక్ష్యంగా ఈడీ, ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. క్వారీ నిర్వాహకులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఇక, గతంలో 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. తక్కువ పరిమాణం చూపి విదేశాలకు ఎక్కువ ఎగుమతులపై ఈడీ ఆరా తీస్తోంది. -
ముసద్దిలాల్ జువెల్స్ లో ముగిసిన ఈడీ సోదాలు
-
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం సైతం సోదాలు చేపట్టింది. రుణాల ఎగవేత, నకిలీ ఇన్వాయిస్లతో మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలతో హైదరాబాద్ ఎంబీఎస్ జ్యువెలరీలో ఈడీ అధికారులు మంగళవారం ఉదయాన్నే తనిఖీలు చేపట్టారు. ఎంబీఎస్ జ్యువెలరీ బ్యాంకు లావాదేవీలు, వాల్యూయేటర్ ద్వారా గోల్డ్ వంటి వాటిపై సోదాలు చేపట్టారు. ఈడీకి చెందిన 20 బృందాలు ఎంబీఎస్ జ్యువెలరీ షోరూముల్లో తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు.. విజయవాడలోనూ ఈడీ, ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బిగ్‌సీ అధినేత సాంబశివరావు ఇంట్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ) తనిఖీలు చేపట్టింది. హార్డ్‌డిస్క్‌లు, డాక్యుమెంట్లు తనిఖీ చేశారు ఐటీ అధికారులు. హానర్ హోమ్స్‌లో రూ.360 కోట్ల లావాదేవీలపై ఐటీ విచారణ చేపట్టింది. ఇదీ చదవండి: టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ మరో షాక్.. -
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఈడీ ప్రశ్నల వర్షం
-
ఈడీ దూకుడు.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి సోదాలు
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. మరోసారి ఈడీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్‌లో సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, కూకట్ పల్లి,మాదాపూర్, జూబ్లీహిల్స్‌లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పంజాబ్, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా 35 ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ,సీబీఐ.. ఇద్దరిని అరెస్ట్ చేసింది. లిక్కర్ స్కాం కేసులో గతంలో అరెస్టయిన విజయ్, మహేంద్రు ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ సోదాలు జరుపుతుంది. చదవండి: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్ ఢిల్లీలో డిప్యూటీ సీఎం సిసోడియా అనుచరుడి ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. దినేష్ అరోరా నివాసం, ఆఫీసుతో పాటు స్నేహితుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దినేష్ అరోరా అకౌంట్లోకి సమీర్ మహేంద్రు రూ.కోటి బదిలీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే దినేష్ అరోరాపై సీబీఐ కేసు నమోదు చేసింది. మనీష్ సిసోడియాకు దినేష్ అరోరా డబ్బులు ఇచ్చినట్లు గుర్తించారు. -
Delhi Liquor Scam: 18 కంపెనీలతోపాటు 12 మందికి ఈడీ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. దేశ వ్యాప్తంగా 40 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. 18 కంపెనీలతోపాటు 12 మందికి ఈడీ నోటీసులు ఇచ్చింది. అరుణ్‌రామచంద్ర పిళ్లై, శరత్‌చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి, బుచ్చిబాబు, చందన్‌రెడ్డి, పెర్రాయి రిచర్డ్, విజయ్‌నాయర్, సమీర్ మహంద్రు, దినేష్ అరోరా, వై.శశికళ, రాఘవ మాగుంటకు నోటీసులు జారీ అయ్యాయి. ఇండో స్పిరిట్స్, మాగుంటి ఆగ్రోఫామ్స్ ట్రైడెంట్ ప్రైవేట్ లిమిటెడ్స్, శ్రీ అవంతిక కాంట్రాక్టర్స్, ఆర్గానమిక్స్ ఈకోసిస్టమ్ లిమిటెడ్స్, అరబిందో ఫార్మా, పిక్సీ ఎంటర్ ప్రైజెస్, ఎన్రికా ఎంటర్ ప్రైజెస్, ప్రీమిస్ ఎంటర్ ప్రైజెస్, బైనాబ్‌ట్రైడింగ్ ప్రై. లిమిటెడ్, బాలాజీ డిస్టిలరీస్, టెక్రా, పెరల్ డిస్టిలరీస్, హివిడే ఎంటర్ ప్రైజెస్, వైకింగ్ ఎంటర్ ప్రైజెస్, డైయాడిమ్ ఎంటర్ప్రైజెస్, డిప్లొమాట్ ఎంటర్ ప్రైజెస్, పెగాసస్ ఎంటర్ ప్రైజెస్, రాబిన్ డిస్టిలరీస్ ఈడీ నోటీసులు జారీ చేసింది. చదవండి: లిక్కర్ స్కామ్‌లో దూకుడు పెంచిన ఈడీ.. తెలంగాణలో పొలిటికల్ టెన్షన్! సాక్షి, హైదరాబాద్: అనూస్ బ్యూటీ పార్లర్ హెడ్ ఆఫీస్‌లో ఈడీ సోదాలు జరుపుతోంది. మాదాపూర్‌లోని అలైఖ్య ప్రవణవ్ హోమ్స్‌లో ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. -
లిక్కర్ స్కామ్‌లో దూకుడు పెంచిన ఈడీ.. తెలంగాణలో పొలిటికల్ టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పొలిటికల్ హీట్ ఇంకా తగ్గలేదు. లిక్కర్ స్కామ్ కేసుపై బీజేపీ నేతలు ఇంకా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు.. లిక్కర్ స్కామ్ కేసులో ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. దీంతో తెలంగాణలో ఊహించని విధంగా పొలిటికల్ టెన్షన్ చోటుచేసుకుంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ శుక్రవారం ఉదయం మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఇక, హైదరాబాద్‌లో 25 ప్రాంతాల్లో 25 బృందాలు సోదాలు జరుపుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో ఢిల్లీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటకల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా, తెలంగాణకు సంబంధించి హైదరాబాద్‌లోని రాయదుర్గం, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ అధికారులు లిక్కర్ పాలసీ దక్కించుకున్న కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు.. లిక్కర్ స్కామ్‌పై బీజేపీ ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ సిర్సా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో హైదరాబాద్ నుంచి ఎవరెవరు ఢిల్లీకి వచ్చారు, ఎవరెవరిని కలిశారు... ఢిల్లీ నుంచి ఎవరు హైదరాబాద్ వెళ్లి ఎవరెవరిని, ఎప్పుడు కలిశారు.. అనే వాటి గురించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. గతంలో తాము చేసిన ఆరోపణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున వివరాలన్నీ తెలంగాణలోనే చెబుతామన్నారు. హైకోర్టు స్టే విధించిన కారణంగా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడట్లేదన్నారు. ఇది కూడా చదవండి: సర్వే రిపోర్టులతో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు ! -
గేమింగ్ యాప్ స్కామ్.... సుమారు రూ. 17 కోట్లు స్వాధీనం
న్యూఢిల్లీ: కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారి ఆవరణలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సోదాల్లో ఈడీ సుమారు రూ. 12 కోట్ల నగదు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వ్యాపారవేత్త అమీర్‌ఖాన్ నివాసాలపై బ్యాంకు అధికారులతో కలిసి ఈడీ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. వ్యాపారి నివాసంలో ఈడీ దాడుల నేపథ్యంలో కేంద్ర బలగాలను పటిష్టంగా మోహరించారు. ఈ నగ్గేట్స్ అనే మొబైల్ గేమింగ్ యాప్‌తో వినియోగదారులను మోసం చేసినందుకు నిందితుడు అమీర్ఖాన్తోపాటు మరికొంత మంది పై ఫెడరల్ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేను నమోదు చేశారు. ఈ మేరకు ఈడీ గేమింగ్ స్కామ్ గురించి మాట్లాడుతూ....తొలుత వినియోగ దారులకు గేమింగ్ యాప్ ప్రారంభంలోనే మంచి కమిషన్ వాలెట్లు అందించి విశ్వాసాని పొందుతాయి. ఆ తర్వాత వారి నుంచి ఎక్కుక కొనుగోళ్లను చేయించి అనుహ్యంగా వారి వాలెట్లో ఉన్న మనీ అంతా స్వాహా చేసి అకస్మాత్తగా యూప్ పనిచేయడం మానేస్తుంది. ఆ తర్వాత రీ ఇన్స్టాల్ చేసుకోవాలంటు రావడం మొదలవుతుంది. ఈలోగా అందులో ఉన్న మన డేటా మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అప్పుడికి గానీ వినియోగదారుడి మోసపోయినట్లు గ్రహించలేడు అని ఈడీ వివరించింది. (చదవండి: రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన అమిత్ షా... సీఎం సొంత గడ్డ నుంచి ప్రచారం) -
ఢిల్లీ లిక్కర్ స్కాం.. హైదరాబాద్‌లో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఆరోపణలెదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్లు అరుణ్ రామచంద్రన్ పిళ్లై, బోయినపల్లి అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్ సాగర్ నివాసాలు, కార్యాలయాల్లో ఢిల్లీకి చెందిన ఈడీ బృందాలు మంగళవారం సోదాలు నిర్వహించాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు సాగిన ఈ సోదాలు రాష్ట్రంలో సంచలనం రేపడంతో పాటు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రముఖుల పాత్ర ఉందంటూ బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈడీ సోదాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇదీ లిక్కర్ స్కామ్.. నిబంధనలకు విరుద్ధంగా ఎక్సైజ్ పాలసీ రూపొందించి, పథకం ప్రకారం కొంత మందికి టెండర్లు కట్టబెట్టారన్న ఆరోపణలపై సీబీఐ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు మరో 15 మందిని నిందితులుగా చేర్చి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సిసోడియాతో పాటు ఎక్సైజ్ అధికారులకు లంచాలు ఇచ్చి కొందరు లిక్కర్ టెండర్లు దక్కించుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన రామచంద్ర పిళ్లైని కూడా సీబీఐ 14వ నిందితుడిగా చేర్చింది. లంచం నగదుపై ఆరా.. సీబీఐ కేసు నేపథ్యంలో రంగంలోకి దిగిన ఈడీ బృందాలు.. ఢిల్లీ, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, హరియాణా, యూపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని సుమరు 30 ప్రాంతాల్లోని ప్రైవేట్ వ్యక్తుల నివాసాల్లో మంగళవారం దాడులు నిర్వహించాయి. హైదరాబాద్ కోకాపేటలో (ఈడెన్ గ్రీన్ గేటెడ్ కమ్యూనిటీ విల్లా నం.16) ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసం, సికింద్రాబాద్‌లోని రాబిన్ డిస్టిలరీస్ కార్యాలయం, నార్సింగిలోని అభిషేక్‌రావు, ప్రేమ్‌సాగర్ నివాసాల్లో ఐదు బృందాలు సోదాలు జరిపాయి. ఎక్సైజ్ టెండర్ల వ్యవహారంలో పిళ్లై రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు లంచాలు ఇచ్చినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నగదు ఎక్కడిది? ఏ ఖాతా నుంచి వచ్చిందో ఈడీ కూపీ లాగుతోంది. రాబిన్ డిస్టిలరీస్‌కు సంబంధించిన మొత్తం లావాదేవీలతో పాటు లిక్కర్ టెండర్ల కోసం సాగిన చీకటి నగదు లావాదేవీలు లక్ష్యంగా ఈడీ సోదాలు సాగించినట్టు తెలిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే... రాబిన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్..అరుణ్ రామచంద్రన్ పిళ్లై, గండ్ర ప్రేమ్ సాగర్ డైరెక్టర్లుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో 22న ప్రారంభమయ్యింది. 2022 జూలై 12న బోయినిపల్లి అభిషేక్ డిజిగ్నేటెడ్ పార్ట్నర్గా చేరారు. కంపెనీ పెట్టి కేవలం నాలుగు నెలలవుతుండగా కోట్ల రూపాయల లంచాలు చెల్లించి టెండర్లు దక్కించుకునేందుకు ప్రయత్నించడం దర్యాప్తు సంస్థలు దీనిపై దృష్టి పెట్టేలా చేసింది. రామచంద్రన్ పిళ్లైతో పాటు మిగతా డైరెక్టర్ల ప్రమేయాన్ని తేల్చేక్రమంలో ఈడీ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. కంపెనీ ఏర్పాటు, పెట్టుబడి వ్యవహారాలు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పాత్రకు సంబంధించిన కీలక పత్రాలను, లావాదేవీలకు సంబంధించి బ్యాంకు ఖాతాల çస్టేట్మెంట్లను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అభిషేక్ బోయినిపల్లి మరికొన్ని కంపెనీల్లో కూడా డైరెక్టర్‌గా ఉన్నారు. బెంగళూరు, చెన్నైల్లోనూ పిళ్లై లింకులు..! మరోవైపు బెంగళూరులో అరుణ్ రామచంద్రన్ పిళ్లైతో సంబంధాలున్న ఇతర స్పిరిట్ కంపెనీల్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. అయితే బెంగళూర్ కేంద్రంగా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్న పిళ్లైకి ఇక్కడ ఉన్న సంబంధాలు, లావాదేవీలపై ఈడీ ఆరా తీసినట్టు తెలిసింది. అలాగే చెన్నైలోనూ ఈడీ బృందాలు సోదాలు నిర్వహించాయి. అక్కడి వ్యవహారాలతో కూడా పిళ్లైకి సంబంధాలుండటం సంచలనం రేపుతోంది. సిండికేట్‌లో భాగంగానే.. ఢిల్లీ లిక్కర్ దందాలో టెండర్లు దక్కనిపక్షంలో ఇతర కంపెనీలతో సిండికేట్ ఏర్పాటు చేసుకోవడానికే పిళ్లై ముందస్తుగా హైదరాబాద్‌లో రాబిన్ డిస్టలరీస్ ఏర్పాటు చేసినట్టు సీబీఐ అనుమానిస్తోంది. బెంగళూరుకు చెందిన ఇండో స్పిరిట్ కంపెనీతో సిండకేట్కు పిళ్లై ప్రయత్నించినట్టు ఆరోపణలున్నాయి. సిండికేట్ కోసమే రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల మేర లంచాలిచ్చినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. రాజకీయంగా హీట్..! లిక్కర్ స్కామ్‌లో ఈడీ సోదాలు నిర్వహించడం రాజకీయంగా హీట్ పెంచుతోంది. ఈ వ్యవహారంలో రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ వ్యక్తిపై బీజేపీ, కాంగ్రెస్‌లు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈడీ తాజాగా చేపట్టిన సోదాలతో రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్రమై వేడి రాజుకునే సూచనలు కన్పిస్తున్నాయి. ఇదీ చదవండి: Delhi Liquor Scam: దేశవ్యాప్తంగా ఏకకాలంలో 30 చోట్ల ఈడీ మెరుపు దాడులు -
చైనా లోన్ యాప్స్:పేటీఎం, రేజర్‌పే, క్యాష్‌ఫ్రీలకు ఈడీ షాక్!
బెంగళూరు: ఆన్లైన్ పేమెంట్ సంస్థలు రేజర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ సంస్థలకు చైనీస్ లోన్ యాప్‌ల అక్రమ దందా సెగ చుట్టుకుంటోంది. కర్ణాటక రాజధాని నగరంలో ఆరు ప్రాంగణాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో చైనీయుల నియంత్రణలో ఉన్న ఈ సంస్థల ఖాతాల్లోని రూ. 17 కోట్ల విలువైన నిధులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. పేటీం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్, రేజర్‌పే, క్యాష్‌ఫ్రీ పేమెంట్స్‌కు చెందిన బెంగళూరులోని పలు ఆఫీసుల్లో దాడులు కొనసాగుతున్నాయని ఈడీ శనివారం తెలిపింది. ఇండియాకు చెందిన వారి నకిలీ ఐడీలతో, డమ్మీ డైరెక్టర్లుగా అవతరించి అనుమానిత, చట్టవిరుద్ధమైన ఆదాయాల్ని ఆర్జిస్తున్నారని ఈడీ ఆరోపించింది. మొబైల్ ద్వారా తక్కువ మొత్తంలో లోన్లు ఎరవేసి, ఆ తరువాత వారిని తీవ్రంగా వేధించడం లాంటి వాటికి సంబంధించి అనేక సంస్థలు/వ్యక్తులపై బెంగళూరు పోలీస్ సైబర్ క్రైమ్ స్టేషన్ దాఖలు చేసిన 18 ఎఫ్ఐఆర్ల ఆధారంగా మనీలాండరింగ్ కేసును రూపొందించినట్లుఈడీ తెలిపింది. కాగా పేటీఎం, రేజర్‌పే సహా దేశంలోని పలు పేమెంట్ గేట్‌వే కంపెనీలపై ఈడీ ఇప్పటికే నిఘా పెట్టిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన పలు లోన్ల యాప్స్ పేమెంట్స్ చేసేందుకు వీటిని వాడుకుంటున్నట్లు ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్లో ఇటీవలి తేలింది. దీంతో ఈ ఆయా కంపెనీలపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద విచారిస్తోంది. -
కేంద్ర ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపిస్తాం! మమత స్ట్రాంగ్ వార్నింగ్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు ఎక్కువైపోతున్నాయంటూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మండిపడ్డారు. దీన్ని సహించేదిలేదని తేల్చి చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ అధికారుల పై విచారణ జరిపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు మమతా తమ పార్టీ విద్యార్థి విభాగం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ... తనపై కూడా సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయని, అలాగే బెంగాల్‌లోని ఇతర కేంద్ర ప్రభుత్వాధికారుల పై కూడా కేసులు ఉన్నాయని చెప్పారు. కేంద్రం తమ అధికారులను ఢిల్లీకి రప్పిస్తే మీ అధికారులను ఇక్కడకు పిలిపిస్తాను అని హెచ్చరించారు. రాష్ట్రంలో సుమారు ఎనిమిది మంది కేంద్ర ప్రభుత్వాధికారులపై కేసులు ఉన్నాయని మమతా తెలిపారు. కేంద్రం సీబీఐ దాడులతో తమ నాయకులను అరెస్టులు చేస్తోందని విరుచుకుపడ్డారు. ఎడ్యుకేషన్ స్కాంలో పార్థ ఛటర్జీపై సీబీఐ జరిపిన దాడులు గురించి ప్రస్తావిస్తూ...ఆ కేసులో ఏదీ రుజువుకాలేదని, కేవలం రాజకీయపార్టీలను మీడియా, న్యాయవ్యవస్థను అడ్డుపెట్టుకుని బీజేపీ భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపణలు చేశారు. ఈడీ, సీబీఐ దాడులతో తమ నాయకుల డబ్బులను కొల్లగొడుతోందని చెప్పారు. అంతేకాదు బిల్కిస్ బానో కేసులో దోషులుగా ఉన్నవారిని గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ కింద విడుదల చేయడాన్ని కూడా తప్పుపట్టారు. ఆ దోషుల పై కఠిన చర్యలు తీసుకునేలా తమ పార్టీ టీఎంసీ కోల్‌కతాలో 48 గంటల పాటు ధర్నా నిర్వహిస్తుందని మమతా బెనర్జీ తెలిపారు -
ఆ విషయం బీజేపీ ఎంపీకి ముందే ఎలా తెలుసు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ దాడిని మంత్రి హరీష్‌రావు ఖండించారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఎంఓటీ, మోడ్రన్ కిచెన్, దోబీఘాట్లను ప్రారంభించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, సీబీఐ నోటీసులు ఇస్తుందని బీజేపీ ఎంపీకి ఎలా తెలుసు? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పాలనను వదిలేసి ప్రతిపక్షాలను వేధిస్తోంది. 8 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పడగొట్టారు. రాష్ట్రంలో పథకం ప్రకారం కుట్రలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ జేబు సంస్థలుగా మారాయనే అనుమానం కలుగుతోందన్నారు. చదవండి: మునుగోడు ఉప ఎన్నిక: టికెట్ రెడ్డికా.. బీసీకా? కర్ణాటకలో కాంట్రాక్టు పనులకు 40 శాతం కమిషన్ ఇవ్వాలని అక్కడ కాంట్రాక్టర్ అసోసియేషన్ అంటుంది. అక్కడ ఎందుకు ఈడీ, సీబీఐ దాడులు ఎందుకు జరగవు అని హరీష్‌రావు ప్రశ్నించారు. మహారాష్ట్ర, బీహార్, ఢిల్లీతో పాటు నిన్న జార్ఖండ్‌లో బీజేపీ చేసిన నిర్వాకాన్ని అందరూ చూశారన్నారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలన్న ధోరణిలో బీజేపీ పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఆ పార్టీని ఎవరు ప్రశ్నించినా వారిని టార్గెట్ చేస్తోందని, సీబీఐ, ఈడీలతో దాడులు చేయిస్తోందని హరీష్‌రావు ధ్వజమెత్తారు. -
వల్లభనేని, కొడాలి పేర్లు చెప్పాలి.. లేకపోతే సుపారీ ఇచ్చి చంపేస్తామంటూ బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్: క్యాసినో వ్యవహారంలో, ఈడీ విచారణలో ఏపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్లు చెప్పాలని పదేపదే బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయని చీకోటి ప్రవీణ్ కుమార్ తెలిపారు. వారి పేర్లు చెప్పకపోతే ఓ ప్రమాదకరమైన వెబ్సైట్ ద్వారా తనని చంపేందుకు సుపారీ ఇస్తున్నట్టు బెదిరిస్తున్నారని చీకోటి ప్రవీణ్ ‘సాక్షి’కి చెప్పారు. బెదిరింపుల వెనక అక్కడి ప్రతిపక్ష పార్టీ ఉందా లేదా ఆ పార్టీ ముసుగులో ఎవరైనా చేస్తున్నారా అన్నది పోలీసుల విచారణలో తేలుతుందన్నారు. తాను రాష్ట్రంలో కాకుండా లీగల్‌గా క్యాసినో ఎక్కడ నడుస్తుందో అక్కడే వ్యాపారం చేస్తున్నట్టు వెల్లడించారు. తనకు వ్యక్తిగతంగా రెండు రాష్ట్రాల్లో చాలామంది రాజకీయ నాయకుల్లో స్నేహితులున్నారని, అలా ఉండటంలో తప్పేంటన్నారు. స్నేహితులుగా ఉన్నంత మాత్రాన వారికి సంబంధంలేని వ్యవహారాల్లో వాళ్ల పేర్లు చెప్పడం పద్ధతి కాదంటూ చీకోటి చెప్పుకొచ్చారు. అదేవిధంగా నేపాల్ క్యాసినో వ్యవహారంలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు తప్ప పెద్దగా ఎవరు రాలేదని, పలువురు సినీ ప్రముఖులకు తాను కోట్ల రూపాయలు చెల్లించినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టంచేశారు. ఈ లెక్కల వ్యవహారాలు పూర్తిగా ఈడీకి వివరించినట్టు తెలిపారు. తాను చిన్ననాటి నుంచి జంతు ప్రేమికుడినని, కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకునే పలు జంతువులు, పక్షులను పెంచుతున్నట్టు చెప్పారు. ఈడీ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తున్నట్టు తెలిపారు. తన భద్రత విషయంలో హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టాలని, లేకపోతే మరోసారి హైకోర్టుకు వెళతానని చెప్పారు. -
వారి పేర్లు బయటకు చెప్పలేను: చికోటీ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహరం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చికోటి ప్రవీణ్‌పై ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రవీణ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నేను ఏ తప్పు చేయలేదు. క్యాసినో లీగల్‌గానే చేశాను. ఈడీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. రాజకీయ స్వార్థం కోసమే నా భుజంపై తుపాకీ పెట్టారు. విదేశాల నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. విచారణలో రాజకీయ నేతల పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారు. మా ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. నేను ఎలాంటి హవాలా వ్యాపారాలకు పాల్పడలేదు అని స్పష్టం చేశారు. సినీ ప్రముఖుల ప్రమోషన్లకు చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగాయి. వీఐపీలు, వీవీఐపీలు క్యాసినోలకి వచ్చింది వాస్తవం. వారి పేర్లు చెప్పలేను. నాకు అన్ని పార్టీల నేతలతో పరిచయాలు ఉన్నాయి. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఈడీ ఎప్పుడూ పిలిచినా వెళ్తాను’’ అని వెల్లడించారు. ఇది కూడా చదవండి: 40 ఏళ్ల పొలిటికల్ లైఫ్‌లో ఇలా ఎన్నడూ జరగలేదు.. మర్రి శశిధర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ -
..చైనా మీద ఈడీ దాడులు చేయలేం కదా!
..చైనా మీద ఈడీ దాడులు చేయలేం కదా! -
దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదు : రాహుల్ గాంధీ
-
‘మహా’దారిలో జార్ఖండ్ ? కాంగ్రెస్ భయానికి కారణాలివీ...
జార్ఖండ్ మరో మహారాష్ట్ర కానుందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వస్తుంది. మహారాష్ట్రలో 40 మంది పై చిలుకు ఎమ్మెల్యేలతో ముంబై నుంచి బిచాణా ఎత్తేసి వేరుకుంపటి పెట్టుకున్న శివసేన నేత ఏక్నాథ్ షిండేతో బీజేపీ రసవత్తర రాజకీయ నాటకం ఆడించింది. షిండే సీఎం పీఠమెక్కి, అప్పటిదాకా అధికారాన్ని పంచుకున్న ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి ప్రతిపక్షానికి పరిమితం కావడంతో ఆ నాటకానికి తెరపడింది. కనీసం ఎంపీలనన్నా కాపాడుకుందామనుకున్న ఉద్ధవ్‌కు ఆ ముచ్చట కూడా తీరేట్టు లేదు. శివసేన ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్టు చేయడం ఉద్ధవ్‌కు కోలుకోలేని దెబ్బే. ఈ పరిణామాలు కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదు. బీజేపీ ఇప్పుడు జార్ఖండ్‌ను కూడా తమ సంకీర్ణం నుంచి లాక్కునే ప్రయత్నంలో ఉందని ఆ పార్టీ అనుమానిస్తోంది. అసలేం జరిగింది! ► జార్ఖండ్‌లో జేఎంఎంతో కాంగ్రెస్ అధికారాన్ని పంచుకుంటోంది. ఆ రాష్ట్రానికి చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత ఆదివారం భారీ నగదుతో పశ్చిమబెంగాల్లో అరెస్టయ్యారు. తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ వారిని పార్టీనుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఇదంతా బీజేపీ కుట్రలో భాగమేనని కాంగ్రెస్ అనుమానిస్తోంది. ► జేఎంఎంతో అవినాభావ సంబంధాలున్న తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న బెంగాల్లో ఈ అరెస్టులు జరగడం గమనార్హం. ► ‘మహారాష్ట్ర కథ ముగిసింది. ఇక మిగిలింది జార్ఖండ్, రాజస్తాన్, పశ్చిమబెంగాల్లే’నని బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఇటీవల వ్యాఖ్యానించడం కాంగ్రెస్ ఆందోళనలను మరింత పెంచుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కన్నేయడం బీజేపీకి ఇదేమీ కొత్త కాదని కాంగ్రెస్ దుయ్యబడుతోంది. చరిత్రే ఇందుకు సాక్ష్యమంటోంది. ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించి అందరినీ దారికి తెచ్చుకోవడం బీజేపీకి అలవాటైన విద్యేనన్నది కాంగ్రెస్ ఆరోపణ. జార్ఖండ్ పరిణామాలే ఇందుకు తాజాఉదాహరణ అంటోంది కాంగ్రెస్. బీజేపీ మాత్రం వీటిని కట్టుకథలుగా కొట్టిపారేస్తోంది. జార్ఖండ్‌లో అవినీతి రాజ్యమేలుతోందని, ఎమ్మెల్యేల అరెస్టు దీన్ని నిరూపిస్తోందని చెబుతోంది. కాంగ్రెస్–బీజేపీ పరస్పర నిందారోపణలకు తోడు సంకీర్ణ భాగస్వామి జేఎంఎంతో సంబంధాలు బెడిసికొడుతుండటం కాంగ్రెస్‌ను కుంగదీస్తోంది. జేఎంఎం– కాంగ్రెస్ విభేదాలు ► జూన్‌లో రాజ్యసభ ఎన్నికలప్పుడు సంకీర్ణ ధర్మాన్ని అనుసరించి ఉమ్మడి అభ్యర్థిని పోటీలో నిలపాలన్న సోనియాగాంధీ విజ్ఞప్తిని సీఎం సోరెన్ పెడచెవిన పెట్టారు. సొంత అభ్యర్థిని బరిలోకి దించడంతో సోనియా కంగుతిన్నారు. ► రాష్ట్రపతి ఎన్నిక వేళ ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీతో పాటు ఇతర విపక్షాల నేతలు ఆయన వెంట నడిచారు. కానీ జేఎంఎం నేత సోరెన్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరయ్యారు. తద్వారా కాంగ్రెస్‌కు దూరం జరుగుతున్న సంకేతాలిచ్చారు. ఓటింగ్‌లోనూ అదే జరిగింది... కాంగ్రెస్ మద్దతిచ్చిన సిన్హాకు కాకుండా అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు సోరెన్ జై కొట్టారు. జార్ఖండ్‌లో గణనీయంగా ఉన్న గిరిజనులను సంతృప్తి పరిచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనూ ఏడెనిమిది మంది ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డట్టు తేలింది. ఆదివారం అరెస్టైన ముగ్గురు కూడా వారిలో ఉన్నట్టు వినికిడి. ఈ విభేదాలన్నీ ఒక ఎత్తయితే యశ్వంత్ సిన్హా నామినేషన్ వేసిన రోజే హేమంత్ సోరెన్ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఢిల్లీలో కలుసుకోవడం చర్చనీయంగా మారింది. తనపై ఉన్న కేసుల నుంచి బయట పడేందుకే హోం మంత్రితో ఆయన బేరాలాడుతున్నారనే మాటా వినిపించింది. సంకీర్ణం నుంచి కాంగ్రెస్‌ను తప్పించి బీజేపీతో జతకట్టాలంటూ సోరెన్‌పై తీవ్ర ఒత్తిడి ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకు ఆయన లొంగిపోయినా ఆశ్చర్యం లేదు. జరగబోయేది అదేననేది విశ్లేషకుల అంచనా. సోరెన్‌పై కేసులివీ.. ► జార్ఖండ్ శాసనసభకు ఎన్నికైన సమయంలో సోరెన్ లాభదాయక పదవిలో కొనసాగుతున్నారనేది తొలి ఆరోపణ. ఇది ఎన్నికల సంఘం విచారణలో ఉంది. ► 2021లో గనుల మంత్రిగా ఉండగా ఓ గనుల లీజును తనకు తానే కేటాయించుకున్నారనేది మరో ఆరోపణ. ► షెల్ కంపెనీలతో సోరెన్‌కు సంబంధముందని కోర్టులో ఓ పిల్ పెండింగులో ఉంది. ► మైనింగ్ కేసులో జూలై 19న సోరెన్ సన్నిహితుడైన పంకజ్ మిశ్రాను ఈడీ అరెస్టు చేయడం కూడా ఆయన్ను చిక్కుల్లో పడేసింది. ► మైనింగ్‌కు సంబంధించినవే మరికొన్ని కేసులు కూడా సోరెన్‌పై పెండింగ్‌లో ఉన్నాయి. ఈ తలనొప్పుల నుంచి తప్పించుకోవడానికి సోరెన్ బీజేపీ వైపు చూస్తున్నారనేది విశ్లేషకుల అంచనా. అదే జరిగితే జార్ఖండ్ మరో మహారాష్ట్ర కావడానికి ఎంతో సమయం పట్టదు! ఎస్.రాజమహేంద్రారెడ్డి -
మెడికల్ చెకప్‌కి వెళ్లిన ఛటర్జీకి అవమానం!... ముఖం మీదే చెప్పులు విసిరి.....
న్యూఢిల్లీ: బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీని టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్రేట్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సన్నిహితురాలు, నటి అర్పిత ముఖర్జీ నివాసంలో కూడా సోదాలు నిర్వహించిన అధికారులు ఇప్పటివరకు సుమారు రూ.50కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ మేరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పార్థ ఛటర్జీని అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని మెడికల్ చెకప్ కోసం జోకాలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఐతే అక్కడ ఛటర్జీకీ ఊహించని అవమానం ఎదురైంది. ఐఎస్ఒఐ ఆస్పత్రి వెలుపల ఒక మహిళ ఛటర్జీ ముఖం పైనే చెప్పులు విసిరి ఘోరంగా అవమానించింది. ఆ తర్వార సదరు మహిళ మాట్లాడుతూ...తాను మందులు కొనుక్కోవడానకి ఆస్పత్రికి వచ్చినట్లు తెలిపింది. ఫ్లాట్లు, ఏసీ కార్లు కొనుక్కునేందుకు అతను పేదలను దోచుకుంటున్నాడని విమర్శించింది. ఇలాంటి వాళ్లను కాళ్లుచేతులు కట్టి వీధుల్లోకి ఈడ్చుకెళ్లాలంటూ.. తిట్టిపోసింది. అంతేకాదు ఆ చెప్పుల ఇక తాను ధరించను అంటూ ఛటర్జీ మండిపడింది. మరోవైపు తృణమాల్ కాంగ్రెస్ ఛటర్జీని సస్సెండ్ చేయడమే కాకుండా బెంగాల్ మంత్రివర్గం నుంచి తొలగించింది. (చదవండి: Partha Chatterjee: మమత కేబినెట్లో కీలక మార్పులు.. ఒక్కరికి ఒకే పదవి!) -
నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో ఈడీ సోదాలు!
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్-ఏజేఎల్ ఆస్తులకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ప్రశ్నించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ).. తాజాగా నేషనల్ హెరాల్డ్ హౌస్‌లో మంగళవారం సోదాలు నిర్వహించింది. నేషనల్ హెరాల్డ్ హౌస్‌తో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టింది. కాంగ్రెస్‌కు చెందిన నేషనల్ హెరాల్డ్ న్యూస్‌పేపర్ కార్యాలయం సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టినట్లు అధికారవర్గాలు తెలిపాయి. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని మూడు రోజుల పాటు ప్రశ్నించిన వారంలోపే ఈ దాడులు చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. సోనియా విచారణ సందర్భంగా.. న్యూస్‌పేపర్ నిర్వహణపై పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియాల్లో సోనియా, రాహుల్ గాంధీల పాత్రపై పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అంతకు ముందు జూన్‌లో రాహుల్ గాంధీని ఐదు రోజుల పాటు విచారించింది ఈడీ. Delhi | ED raids are underway at multiple locations in Delhi pertaining to alleged National Herald money laundering case pic.twitter.com/fUmD1YxI9a — ANI (@ANI) August 2, 2022 ఇదీ చదవండి: National Herald case: సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం -
నేషనల్ హెరాల్డ్ ప్రధాన కార్యాలయంలో ఈడీ తనిఖీలు
-
ఇక్కడి నుంచే దేశం దాటింది
సాక్షి, హైదరాబాద్/ సైదాబాద్: చీకోటి ప్రవీణ్ కుమార్ క్యాసినో కేంద్రాలుగా సాగించిన హవాలా లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే ట్ (ఈడీ) దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వందల కోట్ల సొమ్ము చెన్నై, హైదరాబాద్ కేంద్రాల నుంచి విదే శాలకు డాలర్ల రూపంలో తరలిపోయినట్లు ఈడీ అనుమానిస్తోంది. చీకోటితోపాటు ఆయన భాగ స్వామి మాధవరెడ్డి ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు గురువారం ఇద్దరికీ నోటీసులు జారీచేశారు. సోమవారం ఈడీ కార్యా లయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. నేపా ల్, శ్రీలంక, ఇండోనేసియా తదితర దేశాల్లో క్యాసి నోలకు ఉపయోగించిన రూ.కోట్లాది సొమ్ము కేవ లం జూదరుల కోసమేనా లేక హవాలా మార్గం ద్వారా దేశం దాటించారా అన్న దానిపై ఈడీ అధి కారులు తీగలాగుతున్నట్టు తెలిసింది. రూ.వందల కోట్ల మేర జరిగిన లావాదేవీలు కేవలం క్యాసినో కోసం కాదని, బంగారం హవాలా కోసం కూడా దారి మళ్లించి ఉంటారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడి నుంచి ఒక దేశానికి హవాలా జరిగిన సొమ్ము అక్కడి నుంచి మరెన్ని దేశాలకు దాటించి ఉంటారన్న దానిపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ సెలబ్రిటీలు ప్రవీణ్‌తో లావాదేవీలు సాగించిన వ్యవహారంలో ఈడీ పలు సంచలనాత్మక సందేశాలను మొబైల్ ఫోన్లో గుర్తించినట్టు తెలిసింది. ప్రధానంగా ఇద్దరు మంత్రులకు సంబంధించి వాట్సాప్, సిగ్నల్ మెసెంజర్ల ద్వారా సాగిన సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నట్టు ఈడీ వర్గాలు చెప్పాయి. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలకు సంబంధించిన వాట్సాప్ సందేశాల్లో క్యాసినో కేంద్రాల వివరాలు, విమాన టికెట్లు, క్యాసినో ఆడేందుకు డబ్బు ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి అప్పజెప్పాలి అన్న కీలక విషయాలను ఈడీ గుర్తించినట్టు తెలిసింది. ఓ జిల్లా డీసీసీబీ చైర్మన్ భూమి పత్రాలు సైతం ప్రవీణ్ ఇంట్లో లభించడం కలకలం రేపింది. ఇకపోతే సినీ ప్రముఖుల నంబర్లకు లొకేషన్ మ్యాప్లుండటంపై అధికారులు కూపీలాగే పనిలో ఉన్నట్టు తెలిసింది. ప్రముఖులకు సంబంధించిన ఖాతా నంబర్లు, వాటి ద్వారా జరిగిన లావాదేవీల స్క్రీన్ షాట్లు తదితరాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఆ నలుగురు ఎవరు? హవాలా మార్గంలో సొమ్ము తరలించేందుకు చీకోటితో మరో నలుగురు భాగస్వాములుగా ఉన్నట్టు ఈడీ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు, బెంగళూరుకు చెందిన ఒకరు, చెన్నైకి చెందిన మరొకరు హవాలా ఏజెంట్లుగా వ్యవహరించిన వివరాలను ప్రవీణ్ మొబైల్‌తోపాటు ల్యాప్‌టాప్‌లో గుర్తించినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. సోదాల్లో లభించిన డాక్యుమెంట్లతోపాటు హార్డ్‌డిస్క్ నుంచి రిట్రీవ్ చేయాల్సిన అంశాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేయాలని భావిస్తున్నారు. నేపాల్, శ్రీలంక, ఇండోనేసియానే కాకుండా సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్ దేశాల్లోనూ ప్రవీణ్ క్యాసినోలు నిర్వహించినట్లు సమాచారం. స్టిక్కర్‌ను రోడ్డు మీద పడేశానన్న మంత్రి హవాలా ఆరోపణలెదుర్కొంటున్న మాధవరెడ్డి కారుకు మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంపై మంత్రి స్పందించారు. మార్చి 2022 వరకు చెల్లుబాటున్న స్టిక్కర్‌ను తీసి ఎక్కడో రోడ్డు మీద పడేశానని, అది ఎవరో తీసుకుని పెట్టుకుంటే తనకేం సంబంధమన్నారు. అయితే ఎమ్మెల్యే స్టిక్కర్‌ను ఎక్కడపడితే అక్కడ పడేయటం ఏంటన్నదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. చట్టపరంగానే క్యాసినోలు: చీకోటి గోవాలో, నేపాల్‌లో చట్టపరంగానే తాను క్యాసినోలు నిర్వహించానని చీకోటి ప్రవీణ్‌కుమార్ చెప్పారు. ఈడీ దాడుల అనంతరం గురువారం తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు ఎందుకు మీ ఇంటిపై దాడులు నిర్వహించారని ప్రశ్నించగా.. ఎందుకో మీకు తెలియదా అంటూ వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. ఈడీ నోటీసుల మేరకు సోమవారం విచారణకు హాజరై అధికారుల సందేహాలను నివృత్తి చేస్తానని చెప్పారు. ఎంటర్టైన్మెంట్ పేరుతో... గత జూన్ 10 నుంచి నాలుగు రోజులపాటు నేపాల్‌లో క్యాసినో నిర్వహణలో భాగంగా ఎంటర్టైన్మెంట్ పేరుతో సినీ సెలబ్రిటీలకు భారీగా పారితోషకాలిచ్చినట్టు ఈడీ గుర్తించింది. అందులోభాగంగా బాలీవుడ్ నటులు మల్లికా షెరావత్కు రూ.కోటి, అమీషా పటేల్‌కు రూ.80 లక్షలు, గోవిందకు రూ.50 లక్షలు, డింపుల్ హయతీకి రూ.40 లక్షలు, టాలీవుడ్ నటి ఇషారెబ్బకు రూ.40 లక్షలు, గణేష్ ఆచార్యకు రూ.20 లక్షలు, ముమైత్‌ఖాన్‌కు రూ.15 లక్షలు పారితోషకం కింద ఇచ్చినట్టు ఈడీ ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. -
Casino: ఈడీ సోదాలపై స్పందించిన క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్
సాక్షి, హైదరాబాద్: క్యాసినో నిర్వహిస్తూ కోట్ల రూపాయల హవాలాకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ స్పందించాడు. క్యాసినో విషయంలోనే ఈడీ అధికారులు సోదాలు చేసినట్టు మీడియాతో చెప్పాడు. మనదేశంలోని గోవాలో క్యాసినో లీగల్ అని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు. దీంతోపాటు నేపాల్, ఇండోనేషియాలో క్యాసినో లీగల్ అని తెలిపాడు. తాను చేసింది లీగల్ వ్యాపారమేనని అన్నాడు. తానొక సామాన్య వ్యక్తినని ప్రవీణ్ వ్యాఖ్యానించాడు. ఈడీ అధికారులకు కొన్ని సందేహాలు ఉన్నాయని.. అందుకే వాళ్లు వివరణ అడిగారని చెప్పాడు. వాళ్లు కొన్ని ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పానని అన్నాడు. వారికి ఏమేం వివరాలు కావాలో చెప్తానని ప్రవీణ్ మీడియాతో వెల్లడించాడు. సోమవారం మరోసారి విచారణకు రమ్మన్నారని, హాజరవుతానని పేర్కొన్నాడు. (చదవండి: క్యాసినోవాలా... కోట్ల హవాలా! మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖ హీరోలు కస్టమర్లే..) -
హైదరాబాద్: చికోటి ప్రవీణ్ ఈడీ కేసులో కీలక అంశాలు