కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు | MLC Kavitha Bail Petition Hearing Delhi High Court ED CBI Cases | Sakshi
Sakshi News home page

కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు

Published Tue, May 28 2024 3:36 PM | Last Updated on Tue, May 28 2024 5:13 PM

MLC Kavitha Bail Petition Hearing Delhi High Court ED CBI Cases

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై  మంగళవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌ను  జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు. నిన్న(సోమావారం) కవిత తరపున ముగిసిన వాదనలు విపించారు. . సీబీఐ, ఈడీ దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

నేడు ఈడీ, సీబీఐ వాదనలు వినిపించింది. ఈడీ, సీబీఐ వాదనల అనంతరం తీర్పు రిజర్వ్ చేస్తామని ఇంతకముందే న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు ఈడీ తరపు  న్యాయవాది జోహెబ్‌ హుసేన్‌ వాదనలు వినిపిస్తూ.. లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత కింగ్‌ పిన్‌ అని పేర్కొన్నారు. లిక్కర్‌ కేసులో అక్రమ సొమ్ము ఆమెకు చేరిందని, దీనికి సంబంధించిన వాట్సాప్‌ చాట్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు.

ఈడీ వాదనలు

  • ఇండియా ఎహెడ్ ఛానల్‌లో పెట్టుబడి పెట్టారు.

  • ఫోన్లో డేటాను ధ్వంసం చేశారు.

  • విచారణకు ముందే ఫోన్ సాక్షాలు ధ్వంసం చేశారు.

  • ఈడీకి ఇచ్చిన ఫోన్లో డేటాను ఫార్మాట్ చేసినట్టు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది.

  • డిజిటల్ డేటా ధ్వంసంపై  19 పొంతనలేని సమాధానాలు ఇచ్చారు.

  • కవితకు బెయిల్ ఇవ్వొద్దు.

  • సూర్యాస్తమయానికి ముందే కవితను అరెస్టు చేశాం.

  • ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు.

  • గోప్యత హక్కును భంగపరచలేదు

ఎమ్మెల్సీ కవిత బెయిల్.. తీర్పు రిజర్వ్

సీబీఐ వాదనలు:

  • మద్యం విధానంపై కవితిను కలవాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్యం వ్యాపారికి చెప్పారు.

  • భూములు, హవాలా మార్గం ద్వారా అక్రమ సొమ్ము రవాణా జరిగింది.

  • ఈ కేసులో కవిత పాత్రపై అనేక సాక్షాలు, వాంగ్మూలాలు ఉన్నాయి.

  • అందుకే కవిత అరెస్టు తప్పనిసరి.

  • మహిళ అయినంత మాత్రాన బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు.

  • ఈ  లిక్కర్ కేసులో కవితనే ప్రధాన లబ్ధిదారు.

  • ఆమె సాక్షాలు ధ్వంసం చేస్తుంది

  • సాక్షులను ప్రభావితం చేస్తుంది

  • కవితకు కొత్త ఆరోగ్య సమస్యలు ఏవీ లేవు

కవిత తరపు న్యాయవాది నితీష్ రానా కౌంటర్ వాదనలు👇

  • ఈడీ కేసులో బుచ్చి బాబును నిందితుడిగా చేర్చక పోవడం, అరెస్టు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
  • బుచ్చి బాబు స్టేట్మెంట్లు కోర్టు పట్టించు కోవద్దు.
  • ఆగస్టు 2023 తర్వాత ఎలాంటి కొత్త సాక్షాలు ఈడీ చూపలేదు.
  • సాక్షాల ధ్వంసం చేసిన సమయంలో ఎందుకు అరెస్టు చేయలేదు.
  • కవిత తన ఫోన్లు పనిమనుషులకు ఇచ్చారు.
  • 190 కోట్ల అక్రమ సొమ్ము చేరిందన్న ఈడి వాదనలో.. ఒక్క పైసా కవిత ఖాతాకు చేరలేదు.
  • దీనిపై ఎలాంటి సాక్షాలు ఈడీ చూపలేదు.
  • కవిత అరెస్టులో సీబీఐ చట్ట ప్రకారం నడుచుకోలేదు.
  • సీబీఐ కవిత అరెస్టుకు కారణాలు చెప్పలేదు.

 ముగిసిన ఈడి, సీబీఐ వాదనలు, తీర్పు రిజ ర్వ్‌

  • లిక్కర్ కేసులో కవిత బెయిల్‌పై  ముగిసిన ఈడీ, సీబీఐ వాదనలు
  • కవితకు బెయిల్ ఇవ్వద్దని వాదనలు వినిపించిన ఈడీ, సీబీఐ
  • ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని వాదనలు
  • లిక్కర్ స్కామ్ లో అక్రమ సొమ్ము నేరుగా కవితకు చేరిందని వాదించిన ఈడి
  • కవిత కేసులో కీలక పాత్రధారి దీనికి  సంబంధించిన వాట్సాప్ చాట్, ఇతర ఎవిడెన్స్ ఉందన్న ఈడీ.
  • తీర్పు రిజర్వ్ చేసిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement