న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ కౌంటర్ దాఖలు చేయగా.. కౌంటర్‌కు సీబీఐ గడువు కోరింది. ఇవాళ కవిత తరఫున లాయర్ వాదనలు వినిపించగా.. సోమవారం కూడా ఆ వాదనలు కొనసాగనున్నాయి.
మరోవైపు కవిత బెయిల్‌పై కేంద్ర దర్యాప్తుపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో తాము వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇక విచారణ సందర్భంగా ఈడీ అరెస్ట్ చేసిన విధానం.. కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత తరఫున న్యాయవాది కోర్టుకు వివరించారు.
కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ..
కవిత అరెస్ట్‌లో అనేక చట్టపరమైన ఉల్లంఘనలు జరిగాయి.
దానిపై సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 కింద పిటిషన్ చేశాం.. సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.
ఆ కేసు జూలైకి వాయిదా పడింది. ఈలోగా బెయిల్ కోసం దరఖాస్తు చేశాం.
మహిళకు ప్రత్యేక రక్షణలు ఉన్నాయి. ఈ రక్షణ కింద కవితకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నాం.
2022 ఆగస్టు 7న సీబీఐ కేసు నమోదు చేసింది.
సీబీఐ, ఈడీ కేసులు నమోదు చేసినప్పుడు కవిత పేరు రాలేదు.
శ్రీనివాస్ రావు అనే వ్యక్తి కోటి రూపాయలు ఇచ్చారని అరుణ్ పిళ్లై స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ఇండో స్పిరిట్‌లో వాటా కోసం ఇచ్చారని చెప్పారు.
అప్పుడు తొలి సారిగా కవిత పేరు తెరపైకి వచ్చింది.
అరుణ్ పిళ్లై ఆ తర్వాత తన వాంగ్మూలం వెనక్కి తీసుకున్నారు .
అభిషేక్ బోయినపల్లి ఈ కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు.
కవిత మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని సీబీఐ చెప్పింది.
విచారణ జరపకుండా ఈ విషయం రిమాండ్ రిపోర్టులో పెట్టారు.
ముందుగా సీబీఐ సీఆర్‌పీసీ160 నోటీసు ఇచ్చి నవంబర్ 2022 ఆమె ఇంట్లో 7 గంటలు విచారణ జరిపారు.
ఈడీ మార్చి 2023లో విచారణ జరిపింది.
మహిళను కార్యాలయంలోకి పిలవద్దని, సీఆర్‌పీసీ160 ప్రకారం నడుచుకోవాలని చెప్పినా ఈడీ వినకుండా కార్యాలయానికి పిలిచింది.
అరెస్టు చేసిన వ్యక్తితో కలిపి విచారణ జరపాలని ఢిల్లీకి పిలిచారు.
కవిత ఫోన్లు సీజ్ చేశారు. అని కవిత లాయర్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు.
స్పందించిన న్యాయస్థానం దీనికి సంబంధించి ఆదివారం సాయంత్రంలోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని ఈడీ, సీబీఐని ఆదేశించింది. ఈడీ, సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. బెయిల్ పిటిషన్లపై సోమవారం, మంగళవారం రెండు రోజుల్లో ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుంది.
అంతకు ముందు.. మే 27న కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపింది. అదే విధంగా జూన్ 7న ఛార్జిషీట్ దాఖలు చేస్తామని కోర్టుకు వెల్లడించింది.
సోమవారం నాడు రెండు కేసుల్లో కవిత తరఫున వాదనలు పూర్తి చేయాలని హైకోర్టు సూచించింది. మంగళవారం నాడు ఈడీ, సీబీఐ వాదనలు వింటామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment