లిక్క‌ర్ స్కాం.. సీబీఐ కేసులో క‌విత విచార‌ణ వాయిదా | Liquor Scam: Kavitha Hearing Postponed By Delhi Court In CBI case | Sakshi

లిక్క‌ర్ స్కాం.. సీబీఐ కేసులో క‌విత విచార‌ణ వాయిదా

Jul 12 2024 3:25 PM | Updated on Jul 12 2024 4:35 PM

Liquor Scam: Kavitha Hearing Postponed By Delhi Court In CBI case

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌పై విచార‌ణ‌ను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశం, సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై విచారణ జూలై 22 వాయిదా వేసింది.

కోర్టులో వాద‌న‌లు సంద‌ర్భంగా.. సీబీఐ చార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని క‌విత తరపు న్యాయవాది నితీష్ రాణా పేర్కొన్నారు. దీనిపై సీబీఐ న్యాయ‌వాది స్పందిస్తూ త‌ప్పులు లేవ‌ని చెప్పారు.

చార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేశారా అని జ‌డ్జి కావేరి భ‌వేజా ప్ర‌శ్నించారు. చార్జ్‌షీట్‌లో త‌ప్పులుంటే కోర్టు ఆర్డ‌ర్ ఫైల్ చేయాల‌ని తెలిపారు. అయితే కోర్టు ఆర్డర్ అప్ లోడ్ కాలేదని  నితీష్ రాణా తెలిపారు.

డిఫాల్ట్ బెయిల్, చార్జ్ షీట్‌పై తప్పులపై విచారణ జరిగేంత వరకు చార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ వాయిదా వేయాలన్న  నితీష్ రాణా వాదించారు. అయితే చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశం,  కవిత డిఫాల్ట్ బెయిల్‌కు సంబందం లేదన్న సీబీఐ వాదించింది. చార్జ్‌షీట్ పూర్తిగా లేద‌ని తాము వాదించ‌డం లేద‌ని, త‌ప్పుగా ఉంద‌ని మాత్ర‌మే చెబుతున‌న‌ట్లు నితీష్ రాణా పేర్కొన్నారు.

దీనికి సీబీఐ స్పందిస్తూ..  తాము సరైన పద్దతిలో చార్జ్‌షీట్‌ ఫైల్ చేశామని కోర్టుకు తెలిపింది.  60 రోజుల తరువాత డిఫెక్టివ్ చార్జ్‌షీట్‌ దాఖలు చేయడం కవిత డిఫాల్ట్ బెయిల్ హక్కును కాలరాయడమేన‌ని క‌విత న్యాయ‌వాది ఆరోపించారు. అనంత‌రం  క‌విత డిఫాల్ట్ బెయిల్‌, సీబీఐ చార్జ్‌షీట్‌నుపరిగణలోకి తీసుకునే అంశంపైనా జూలై 22న విచారణ జరువుతామని తెలిపింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement