న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ పొడిగించింది ట్రయల్ కోర్టు. రిమాండ్ గడువు ముగియడంతో ఇవాళ(బుధవారం) ఆమెను వర్చువల్‌గా ట్రయల్ కోర్టు(రౌస్ అవెన్యూ కోర్టు) ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు. దీంతో ఆగష్టు 13దాకా జ్యూడీషియల్ రిమాండ్‌ను పొడిగించింది ట్రయల్ కోర్టు.
ఇదిలా ఉంటే.. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత మనీష్ సిసోడియా కస్టడీలను సైతం కోర్టు పొడిగించింది. మరోవైపు సీబీఐ కేసులో.. దర్యాప్తు సంస్థ ప్రవేశపెట్టిన ఛార్జ్‌షీట్‌పై విచారణ ఆగష్టు 9వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో కవిత ఏ17గా ఉన్నారు.
కవితతో పాటు మిగతా నిందితులను కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. అయితే.. సీబీఐ ఛార్జ్‌షీట్‌ను పరిశీలించేందుకు కొంత సమయం కావాలని కవిత తరఫు న్యాయవాది కోరారు. అయితే ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని జడ్జి కావేరీ బవేజా, కవిత లాయర్‌కు గుర్తు చేశారు. చివరకు.. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణను వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment