CBI Charge Sheet
-
ఢిల్లీ లిక్కర్ కేసు: సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణ వాయిదా
ఢిల్లి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ ఛార్జ్‌షీట్‌పై విచారణను ఢిల్లీ రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు వేసింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై విచారణను సెప్టెంబర్ 11 తేదీకి వాయిదా వేసినట్లు న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. బుధవారం ట్రయల్ కోర్టు చేపట్టిన విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కొన్ని డాక్యుమెంట్స్ సరిగా లేవని, కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీతో ఉన్న పత్రాలను ఇవ్వాలని నిందితుల న్యాయవాదులు కోర్టును కోరారు. సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్లను వారికి అందజేయాలని జడ్జి కావేరి భావేజా అదేశించారు. -
లిక్కర్ స్కాం: కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ పొడిగించింది ట్రయల్ కోర్టు. రిమాండ్ గడువు ముగియడంతో ఇవాళ(బుధవారం) ఆమెను వర్చువల్‌గా ట్రయల్ కోర్టు(రౌస్ అవెన్యూ కోర్టు) ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు. దీంతో ఆగష్టు 13దాకా జ్యూడీషియల్ రిమాండ్‌ను పొడిగించింది ట్రయల్ కోర్టు. ఇదిలా ఉంటే.. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత మనీష్ సిసోడియా కస్టడీలను సైతం కోర్టు పొడిగించింది. మరోవైపు సీబీఐ కేసులో.. దర్యాప్తు సంస్థ ప్రవేశపెట్టిన ఛార్జ్‌షీట్‌పై విచారణ ఆగష్టు 9వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో కవిత ఏ17గా ఉన్నారు. కవితతో పాటు మిగతా నిందితులను కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. అయితే.. సీబీఐ ఛార్జ్‌షీట్‌ను పరిశీలించేందుకు కొంత సమయం కావాలని కవిత తరఫు న్యాయవాది కోరారు. అయితే ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని జడ్జి కావేరీ బవేజా, కవిత లాయర్‌కు గుర్తు చేశారు. చివరకు.. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణను వాయిదా వేశారు. -
సిక్కు అల్లర్ల కేసులో టైట్లర్‌పై చార్జిషీటు
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జగదీశ్ టైట్లర్(78)పై సీబీఐ శనివారం ప్రత్యేక కోర్టులో చార్జిషీటు వేసింది. ఢిల్లీలోని పుల్ బంగాష్ గురుద్వారాకు నిప్పుపెట్టడంతోపాటు ముగ్గురు సిక్కులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు జగదీశ్ టైట్లరే కారణమని, అక్కడ చేరిన గుంపును రెచ్చగొట్టారని చార్జిషీటులో పేర్కొంది. ఈ నేరానికి గాను ఆయన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ అభియోగాలపై జూన్ 2న కోర్టు విచారణ చేపట్టనుందని సీబీఐ వర్గాలు తెలిపాయి. 1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అంగరక్షకుల తుపాకీ గుళ్లకు బలైన అనంతరం ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో సిక్కులపై జరిగిన దాడుల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. -
డీహెచ్ఎఫ్ఎల్ కేసులో... 75 మందిపై చార్జిషీట్
న్యూఢిల్లీ: రూ.34 వేల కోట్ల బ్యాంకులను మోసగించిన కేసులో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్) మాజీ సీఎండీ కపిల్ వాధవన్, మరో 74 మందిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీలోని సీబీఐ కోర్టులో వేసిన చార్జిషీట్లో ఆ సంస్థ మాజీ డైరెక్టర్ ధీరజ్ వాధవన్, మాజీ సీఈవో హర్షిల్ మెహతా పేర్లు కూడా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 17 బ్యాంకుల కన్సార్టియంను రూ.34 వేల కోట్ల మేర మోసగించినట్లు డీహెచ్ఎఫ్ఎల్పై ఆరోపణలున్నాయి. 2010 నుంచి 2018 వరకు 17 బ్యాంకులతో కూడిన కన్సార్టియం నుంచి ఏకంగా రూ.42,871 కోట్లు రుణాలు సేకరించింది హెచ్డీఎఫ్ఐ. అయితే 2019 నుంచి రుణాలకు సంబంధించిన చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో కన్సార్టియంకు నేతృత్వం వహిస్తున్న యూనియన్ బ్యాంకు 2021లో సీబీఐకి లేఖ రాసింది. తాము తాజాగా నిర్వహించిన ఆడిట్లో ఈ మోసం వెలుగు చూసినట్టు పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఈ ఏడాది ఫిబ్రవరిలో యూనియన్ బ్యాంకు కోరింది. దీనిపై విచారణ చేపట్టిన అనంతరం సీబీఐ కేసులు నమోదు చేసింది. ఇదీ చదవండి: డీహెచ్ఎఫ్ఎల్ కుంభకోణం.. రూ.34,615 కోట్ల మోసం.. సీబీఐ కేసు నమోదు -
వివేకా హత్య కేసులో వాస్తవాలు బయటకు రావాలని అంతా కోరుకుంటున్నారు:సజ్జల
-
West Bengal Post Poll Violance: సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ఇద్దరు నిందితుల పేర్లు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండ కేసులో సీబీఐ గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. తీవ్రమైన నేరాల దర్యాప్తును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించిన తర్వాత ఇదే మొదటి ఛార్జ్‌షీట్ అని అధికార వర్గాలు తెలిపాయి. రాంపూర్హాట్ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో బీజేపీ కార్యకర్త హత్యతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితుల పేర్లు చేర్చారు. కాగా ఆగస్టు 19న కోల్‌కతా హైకోర్టు హత్య, అత్యాచారం కేసులను సీబీఐ ద్వారా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. చదవండి: రూ.23 లక్షల కోట్లు ఏమయ్యాయి?: రాహుల్ గాంధీ కేసులపై సీబీఐ దర్యాప్తును ఆదేశించిన హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా ఇప్పటివరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బీజేపీ కార్యకర్తలపై హత్య, ఇతర దారుణమైన అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై మొత్తం 34 ఎఫ్ఐఆర్లను దాఖలు చేసింది. ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాలు ప్రకటించిన కొద్ది సేపటికే సీబీఐ అధికారుల బృందం నగరంలోని కంకుర్గాచి ప్రాంతంలో మరో బీజేపీ పార్టీ కార్యకర్త హత్యకు పాల్పడిన నిందితులను విచారించడానికి ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్‌ని సందర్శించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చదవండి: 'నా చావుకు బాకీలోల్లే కారణం'.. సెల్ఫీ వీడియో -
హాథ్రస్ కేసులో చార్జ్‌షీట్
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన హాథ్రస్ కేసులో సీబీఐ చార్జ్‌షీటు దాఖలు చేసింది. యూపీలోని హాథ్రస్ జిల్లాలో జరిగిన దళిత యువతిపై అత్యాచారం, హత్యకు సంబంధించి నలుగురిపై సీబీఐ నేరారోపణ చేస్తూ శుక్రవారం కోర్టులో చార్జ్‌షీటు ఫైల్ చేసింది. రెండు నెలల దర్యాప్తు అనంతరం నిందితులు సందీప్, రవి, లవ్‌కుశ్, రాము సెప్టెంబర్14న దళిత యువతిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు సీబీఐ పేర్కొంది. చార్జ్‌షీటులో వీరిపై అత్యాచారం, హత్య, సామూహిక అత్యాచారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద నేరారోపణ చేసింది. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే గరిష్ఠంగా మరణ శిక్ష విధిస్తారు. చనిపోయిన యువతి వాంగ్మూలం, సాక్ష్యాలు, ఇతర సాక్షుల స్టేట్మెంట్ల ఆధారంగా విచారణ పూర్తి చేసినట్లు సీబీఐ తెలిపింది. సీబీఐ చార్జ్‌షీటుతో అసలు నేరమే జరగలేదన్న యూపీ పోలీసుల వాదన తేలిపోయినట్లయింది. అత్యాచారమే జరగలేదన్న పోలీసుల వాదనపై అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు యువతి అంత్యక్రియలపై అలహాబాద్ హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి పోలీసులకు అక్షింతలు వేసింది. -
చిదంబరంపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం తదితరులపై ఢిల్లీ కోర్టులో సీబీఐ చార్జిషీటు వేసింది. శుక్రవారం ప్రత్యేక కోర్టు జడ్జి లాల్ సింగ్‌కు దీనిని సమర్పించింది. ఈ చార్జిషీటులో పీటర్ ముఖర్జీ, చార్టెర్డ్ అకౌంటెంట్ ఎస్.భాస్కరరామన్, నీతి ఆయోగ్ మాజీ సీఈవో సింధుశ్రీ ఖుల్లర్, మాజీ ఉన్నతాధికారులు అనుప్ కె.పుజారి, ప్రబోధ్ సక్సేనా, రవీంద్ర ప్రసాద్‌లతోపాటు ఐఎన్ఎక్స్ మీడియా, ఏఎస్‌సీఎల్ అండ్ చెస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థల పేర్లున్నాయి. అప్రూవర్‌గా మారిన మరో నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ పేరు కూడా ఇందులో ఉంది. వీరిపై అవినీతి నిరోధక చట్టం, భారతీయ శిక్షాస్మృతి కింద పలు అభియోగాలు మోపింది. కాగా, ఇదే కేసులో చిదంబరం పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. -
పీకల్లోతు కష్టాల్లో మాజీ ఆర్థికమంత్రి
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుపోయారు. ఈ కేసులో తాజాగా చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీతో కలిపి మొత్తం 13మంది పేర్లను సీబీఐ చార్జీషీటులో చేర్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో రూ. 310కోట్లు అక్రమంగా నిధులను మళ్లించడంపై ఆయనపై సీబీఐ అధికారులు చార్జిషీటు నమోదు చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరంను అరెస్ట్ చేసి తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అప్పటి నుంచి సీబీఐ, ఈడీ అధికారుల సమక్షంలో కస్టడీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్‌సిబాల్ బెయిల్ తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేసిన ఫలించలేదు. కాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరంపై చార్జీషీటు నమోదు కావడం ఇదే మొదటిసారి. కార్తీ చిదంబరం సన్నిహితుడు భాస్కర్, కేంద్రమాజీ కార్యదర్శి ఆర్ ప్రసాద్, విదేశీ వ్యవహారాల మాజీ డైరెక్టర్ ప్రబోద్ సక్సేనా, ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి అనూప్ పూజారి, అదనపు కార్యదర్శి సిద్దుశ్రీ కుల్హర్, చెస్ నిర్వహణ యాజమాన్యం పేర్లను కూడా సీబీఐ అధికారులు చార్జీషీటులో నమోదు చేశారు. చార్జీషీటు నమోదు కావడంతో కేసు మరింత జఠిలమైనట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసు సోమవారం విచారణకు రానుంది. (చదవండి : ఐఎన్ఎక్స్ కేసు : చిదంబరాన్ని అరెస్ట్ చేసిన ఈడీ ) -
సీబీఐ చార్జ్‌షీట్‌లో చిదంబరం, కార్తీ
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్–మాక్సిస్ ఒప్పందం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) గురువారం అదనపు చార్జ్‌షీట్‌ను దాఖలుచేసింది. ఇందులో కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీతో పాటు 10 మంది ప్రభుత్వాధికారులు, ఆరు సంస్థలను చేర్చింది. వీరందరిపై నేరపూరిత కుట్ర, ఆర్థిక అవకతవకలకు పాల్పడటం, అధికార దుర్వినియోగంతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది. 2006లో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో మాక్సిస్ అనుబంధ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్ కంపెనీకి 800 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.3,680 కోట్ల) మేర విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎఫ్ఐపీబీ) అనుమతులు జారీచేశారు. కానీ నిబంధనల మేరకు విదేశీ పెట్టుబడులు రూ.600 కోట్లు దాటితే కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మాత్రమే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చిదంబరం నిబంధనలు ఉల్లంఘించి అనుమతుల్ని ఎలా జారీ చేయగలిగారన్న విషయమై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. ఈ అనుమతులకు ప్రతిఫలంగా కార్తీకి సంబంధించిన కంపెనీలకు రూ.1.14 కోట్ల ముడుపులు ముట్టాయని సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. కాగా, ఈ చార్జ్‌షీట్‌పై జూలై 31న విచారణ జరుపుతానని ప్రత్యేక సీబీఐ జడ్జి ఓపీ సైనీ తెలిపారు. కేంద్రం ఒత్తిడితోనే తనతో పాటు నిజాయితీపరులైన ప్రభుత్వాధికారుల పేర్లతో సీబీఐ అర్థరహితమైన చార్జ్‌షీట్ దాఖలుచేసిందని చిదంబరం మండిపడ్డారు. -
యాంత్రిక్స్-దేవాస్ చార్జ్‌షీట్‌లో మాధవన్ పేరు
న్యూఢిల్లీ: యాంత్రిక్స్-దేవాస్ ఒప్పందం కేసులో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్‌తో పాటు పలువురుపై సీబీఐ గురువారం ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాధవన్ నాయర్‌ను సీబీఐ విచారించిన విషయం తెలిసిందే. 2005లో బెంగళూరుకు చెందిన దేవాస్ మల్టీ మీడియాతో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు చెందిన యాంత్రిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు కొత్త శాటిలైట్లను తయారుచేసి, వాటి వినియోగానికి ఎస్-బాండ్ స్పెక్ట్రమ్ ను లీజ్ కు ఇచ్చేందుకు దేవాస్ యాంత్రిక్స్ తో 2005లో ఒప్పందం చేసుకుంది. అయితే రేడియో తరంగాల కోసం ఎస్-బాండ్ ఫ్రీక్వెన్సీ అమ్మకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీంట్లో మాధవన్ నాయర్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనతో పాటు మరో ముగ్గురు శాస్త్రవేత్తలపై కూడా కేంద్రం నిషేధం విధించింది. ఇస్రో మాజీ సైంటిఫిక్ సెక్రటరీ భాస్కర్‌నారాయణ, ఆంత్రిక్స్ మాజీ మేనేజింగ్ డైరక్టర్ శ్రీథామూర్తి, ఇస్రో శాటిలైట్ సెంటర్ మాజీ డైరక్టర్ కెఎన్ శంకర్ పై వేటు వేసిన విషయం విదితమే. -
కొనసాగుతున్న ‘ఈనాడు’ అసత్య ప్రచారం
* ఈడీ అటాచ్మెంట్ల క్రమంలో... ఇది పెన్నా చార్జిషీటు! * వరుసగా అటాచ్మెంట్లు చేస్తూ వస్తున్న ఈడీ * తాజాగా పెన్నా చార్జిషీటు విషయంలోనూ అదే చర్య * పనిగట్టుకుని ఆందోళన కలిగించేలా ‘ఈనాడు‘ వార్తలు హైదరాబాద్, సాక్షి ప్రతినిధి: తెలిసిన వాళ్లకయితే ‘ఇది మరో చార్జిషీటు’ అంతే!. అదే తెలియని వాళ్లకయితే... ‘సాక్షి పత్రిక, టీవీ ఆస్తుల జప్తు’ అనేది ఆందోళన కలిగించే అంశం. కాబట్టే ‘ఈనాడు’ పత్రిక మరికాస్త మసాలా దట్టించి మొదటి పేజీలో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఫొటోతో సహా అంతపెద్ద వార్తను అచ్చేసింది. తన లక్ష్యం సాక్షి, వైఎస్ అభిమానుల్లో ఆందోళనను పెంచటమేనని మరోసారి చాటుకుంది. నిజానికి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన కేసులో మొదటినుంచీ జరుగుతున్న పరిణామాల్ని చూసినవారెవరూ దేనికీ ఆశ్చర్యపోరు. ఎందుకంటే ఈ కేసులో జరిగినవన్నీ ఆశ్చర్యం కలిగించేవి, ఇంతకు ముందెన్నడూ ఏ కేసులోనూ జరగనివే కాబట్టి. తాజా వ్యవహారం విషయానికొస్తే ఇదే కేసులో సాక్షి పత్రిక, చానల్‌కు సంబంధించిన రూ.47 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. నిజానికి ఈ కేసులో ఆస్తుల్ని ఈడీ అటాచ్మెంట్ చేయటమనేది ఇది తొలిసారేమీ కాదు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సీబీఐ విచారణ జరిపింది. ఈడీ స్వయంగా దర్యాప్తు చేయకుండా సీబీఐ వేసిన ప్రతి చార్జిషీట్‌నూ యథాతథంగా స్వీకరిస్తూ సీబీఐ చార్జిషీటులో పేర్కొన్న ఆస్తుల వివరాల ప్రకారం అటాచ్మెంట్ చేస్తున్నట్టు ప్రకటిస్తోంది. ఇప్పటికి సీబీఐ ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తిచేసి 11 చార్జిషీట్లు వేయటం తెలిసిందే. వాటిలో అరబిందో, హెటెరో డ్రగ్స్ పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీటును, కొందరు వ్యక్తులు వ్యక్తిగత స్థాయిలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీటును, రాంకీ గ్రూపు పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీటును, వాన్‌పిక్ అధిపతి నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులకు సంబంధించిన చార్జిషీటును అనుసరిస్తూ... ఆయా చార్జిషీట్లలో పెట్టుబడులుగా పేర్కొన్న మొత్తాలకు సంబంధించి బ్యాంకు డిపాజిట్ల నుంచి భవనాల వరకు జగతి పబ్లికేషన్స్‌కు చెందిన పలు ఆస్తుల్ని ఈడీ యథాతథంగా అటాచ్ చేస్తూ వస్తోంది. ఈ అటాచ్మెంట్లను సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్లు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లో ఉన్నాయి కూడా. ఇదే క్రమంలో పెన్నా గ్రూపు సంస్థలు సాక్షిలో పెట్టిన పెట్టుబడులకు సంబంధించి సీబీఐ ఛార్జిషీటు మేరకు ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లుగా సోమవారం రాత్రి ఈడీ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దీన్లో ఆయా ఆస్తుల్ని వరసగా పేర్కొంటూ.... సాక్షి భవనాల జాబితాను ఇచ్చేసరికి... ఏదో బ్రహ్మాండం బద్దలైపోయిన తీరులో సాక్షి , వైఎస్ అభిమానుల్లో ఆందోళన రేకెత్తించేలా ‘ఈనాడు’ మొదటిపేజీలో పేద్ద వార్తను అచ్చేసింది. ‘ఈనాడు’ గమనించాల్సిన విషయమేంటంటే ‘సాక్షి’ ఆస్తుల్ని ఎలియనేట్ చేయరాదంటూ రెండేళ్ల కిందట రాష్ట్ర హైకోర్టే ఓ కేసులో ఉత్తర్వులిచ్చింది. అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల్లో క్రయవిక్రయాలు కుదరవు. వాటాలు విక్రయించటం వంటివి చేయకూడదు. అంతకు మినహాయించి రోజువారీ కార్యక్రమాలకు ఏమాత్రం అంతరాయం కలగరాదని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ప్రతి లావాదేవీనీ ఎంతో పారదర్శకంగా నిర్వహించే సాక్షి... అప్పటి నుంచీ అటాచ్మెంట్ పరిధిలోనే తన కార్యకలాపాలను కొనసాగిస్తూ... దినదిన ప్రవర్ధమానమవుతుండటం ‘ఈనాడు’కు మింగుడుపడటం లేదు. అదే ఈ రాతలకు అసలు కారణం. -
మనవళ్ల వంతు!
సాక్షి, చెన్నై: దేశాన్ని కుదిపేసిన 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో డీఎంకే నేతల ప్రమేయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కేసుతో పాటుగా మనీలాండరింగ్ వ్యవహారం ఆ పార్టీ అధినేత కరుణానిధి గారాలపట్టి కని మొళి, మాజీ మంత్రి ఏ రాజా మెడకు చుట్టుకుంది. కేంద్రంలో అధికారం మారడంతో ఈ కేసుల విచారణ వేగం పుంజుకుంది. ఈ సమయంలో మరో కేసు వేగం పుంజుకుంది. కనెక్షన్లు : కేంద్ర టెలికాం మంత్రిగా ఉన్న కాలంలో కరుణానిధి మనవడు దయానిధి మారన్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. వ్యక్తిగతంగా 363 కనెక్షన్లను కలిగిన మారన్, వాటిని మరో మనవడు కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ నెట్ వర్క్‌కు ఉపయోగించుకుంటూ వచ్చినట్టు, రూ.440 కోట్ల మేరకు ప్రభుత్వానికి గండి పడ్డట్టుగా వెలుగు చూసింది. 2007లో బీఎస్ఎన్ఎల్ కనెక్షన్లలో ఈ బ్రదర్స్ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చినా, అధికారం చేతిలో ఉండడంతో దాన్ని డీఎంకే పెద్దలు తొక్కి పెట్టారు. కేంద్రంలోని యూపీఏపై ఒత్తిడి తెచ్చి ఆ వ్యవహారాన్ని పక్కదారి పట్టించే యత్నం చేశారు. అయితే, 2013లో సీబీఐ కోర్టులో దాఖలైన చార్జ్ షీట్ మేరకు విచారణ మరింత వేగవంతం చేయడానికి అధికాారులు సిద్ధం అయ్యారు. విచారణ వేగవంతం: ఆ చార్జ్ షీట్ ఆధారంగా సీబీఐ తన విచారణ చేపట్టింది. యూపీఏ పుణ్యమా నత్తనడకన సాగిన ఈ విచారణ అధికార మార్పుతో వేగం పుంజుకుంది. రూ.440 కోట్ల అవినీతి, అధికార దుర్వినియోగాన్ని అస్త్రంగా చేసుకుని సీబీఐ నాలుగు రోజులుగా చెన్నైలో తిష్ట వేసి ఉన్నట్టు వెలుగు చూసింది. డీఎస్పీ రాజేష్ మహేంద్రన్ నేతృత్వంలోని నలుగురు అధికారుల బృందం, సన్‌గ్రూప్ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది మీద నిఘా పెట్టారు. మారన్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆ సంస్థలో పనిచేసిన ప్రధాన అధికారులను విచారిస్తున్నారు. ఆ సంస్థకు చెందిన శరత్‌కుమార్, మాజీ అధికారి హన్సరాజ్ సక్సేనాల్ని రెండు రోజుల పాటు విచారించినట్టు తెలిసింది. శరత్‌కుమార్ మాత్రం ఆ సమయంలో తాను ఆ సంస్థలో లేనని చెప్పినట్లు సమాచారం. సక్సేనా, సన్ గ్రూప్ మధ్య ఇటీవల వివాదం రేగడంతో, మారన్ మంత్రి గా ఉన్న సమయంలో ఆ సంస్థలో సక్సేనా పని చేస్తున్నందు వల్ల ఆయన ఎలాంటి వాంగ్మూ లం ఇచ్చి ఉంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. సమన్లు: తన విచారణను వేగవంతం చేసిన సీబీఐ బృందం దృష్టిని మారన్ బ్రదర్స్‌పై పెట్టింది. ఆ ఇద్దరినీ విచారించేందుకు కసరత్తులు పూర్తి చేసింది. తమ విచారణకు రావాలంటూ దయానిధి మారన్, కళానిధి మారన్‌కు సమన్లు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. సీబీఐ ఉన్నతాధికారులు సంతకాలు చేయడం తో మరో రెండు మూడు రోజుల్లో ఈ సమన్లు ఆ బ్రదర్స్‌కు చేరనున్నాయి. ఒక దాని తర్వాత మరొకటి గారాల పట్టి కనిమొళి కేసు, ఇటు మనవళ్ల వ్యవహారం డీఎంకే అధినేత ఎం కరుణానిధికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడే సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న పార్టీ, ఈ కేసుల రూపంలో మరింతగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందోనన్న బెంగ డీఎంకే వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
నిడో తానియా కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అరుణాచల్‌ప్రదేశ్ యువకుడు నిడో తానియా హత్యకేసుకు సంబంధించి సీబీఐ శుక్రవారం అభియోగపత్రం దాఖలు చేసింది. ఏడుగురిపై సీబీఐ అభియోగాలు మోపగా అందులో ముగ్గురు బాల నేరస్తులు ఉండడం గమనార్హం. అభియోగాలు ఎదుర్కొంటున్న ఏడుగురికి నిడో తానియా హత్యతో ప్రత్యక్ష సంబంధం ఉందని సీబీఐ ఆరోపించింది. నేరపూరిత హత్య, అక్రమ నిర్బంధం, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం ఫర్మాన్, పవన్, సుందర్, సున్నీ ఉప్పల్లపై అభియోగాలు మోపారు. -
క్విడ్‌ప్రోకో కేసులో మూడు చార్జ్షీట్లు దాఖలు
-
మాజీమంత్రి పవన్‌కుమార్ బన్సల్‌కు ఊరట