న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం తదితరులపై ఢిల్లీ కోర్టులో సీబీఐ చార్జిషీటు వేసింది. శుక్రవారం ప్రత్యేక కోర్టు జడ్జి లాల్ సింగ్‌కు దీనిని సమర్పించింది. ఈ చార్జిషీటులో పీటర్ ముఖర్జీ, చార్టెర్డ్ అకౌంటెంట్ ఎస్.భాస్కరరామన్, నీతి ఆయోగ్ మాజీ సీఈవో సింధుశ్రీ ఖుల్లర్, మాజీ ఉన్నతాధికారులు అనుప్ కె.పుజారి, ప్రబోధ్ సక్సేనా, రవీంద్ర ప్రసాద్‌లతోపాటు ఐఎన్‌ఎక్స్ మీడియా, ఏఎస్‌సీఎల్ అండ్ చెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సంస్థల పేర్లున్నాయి. అప్రూవర్‌గా మారిన మరో నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ పేరు కూడా ఇందులో ఉంది. వీరిపై అవినీతి నిరోధక చట్టం, భారతీయ శిక్షాస్మృతి కింద పలు అభియోగాలు మోపింది. కాగా, ఇదే కేసులో చిదంబరం పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment