
న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ ల్యాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి. చిదంబరం పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుపోయారు. ఈ కేసులో తాజాగా చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరం, పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీతో కలిపి మొత్తం 13మంది పేర్లను సీబీఐ చార్జీషీటులో చేర్చింది. ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో రూ. 310కోట్లు అక్రమంగా నిధులను మళ్లించడంపై ఆయనపై సీబీఐ అధికారులు చార్జిషీటు నమోదు చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరంను అరెస్ట్ చేసి తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. అప్పటి నుంచి సీబీఐ, ఈడీ అధికారుల సమక్షంలో కస్టడీలో కొనసాగుతున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్‌సిబాల్ బెయిల్ తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేసిన ఫలించలేదు. కాగా ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో కార్తీ చిదంబరంపై చార్జీషీటు నమోదు కావడం ఇదే మొదటిసారి. కార్తీ చిదంబరం సన్నిహితుడు భాస్కర్, కేంద్రమాజీ కార్యదర్శి ఆర్ ప్రసాద్, విదేశీ వ్యవహారాల మాజీ డైరెక్టర్ ప్రబోద్ సక్సేనా, ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి అనూప్ పూజారి, అదనపు కార్యదర్శి సిద్దుశ్రీ కుల్హర్, చెస్ నిర్వహణ యాజమాన్యం పేర్లను కూడా సీబీఐ అధికారులు చార్జీషీటులో నమోదు చేశారు. చార్జీషీటు నమోదు కావడంతో కేసు మరింత జఠిలమైనట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసు సోమవారం విచారణకు రానుంది.
(చదవండి : ఐఎన్‌ఎక్స్ కేసు : చిదంబరాన్ని అరెస్ట్ చేసిన ఈడీ )
Comments
Please login to add a commentAdd a comment