P. Chidambaram
-
Lok Sabha elections 2024: మేనిఫెస్టో కోసం సూచనలు ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రజల నుంచి పొందిన సలహాలు, సూచనలకు అనుగుణంగా ఈసారి లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను సిద్ధంచేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇందుకోసం వారు పంపాల్సిన ఈమెయిల్, వెబ్సైట్లను బుధవారం ఆవిష్కరించింది. awaazbharatki.in వెబ్‌సైట్‌కు ఓటర్లు తమ సూచనలను పంపొచ్చు. awaazbharatki@inc.in. మెయిల్ ఐడీకి సైతం దేశ ప్రజలు తమ సలహాలు, సూచనలను పంపొచ్చు. కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం ఛైర్మన్‌గా ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీ ఇలా సామాన్య ప్రజలు, వివిధ వర్గాలు, సమూహాలు, సంస్థల నుంచి సలహాలు సూచనలను కోరుతోంది. ‘ప్రజాభీష్టానికి అనుగుణంగానే కాంగ్రెస్ మేనిఫెస్టో రూపుదిద్దుకుంటుంది’’ అని బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ చిదంబరం, కన్వీనర్ టీఎస్ సింగ్ దేవ్ స్పష్టంచేశారు. -
ఈ బడ్జెట్లు స్వతంత్ర భారతంలో వెరీ స్పెషల్..
స్వతంత్ర భారతంలో 76 ఏళ్లుగా ఏటా బడ్జెట్ ప్రవేశపెడుతూనే ఉన్నారు. కానీ కొన్ని బడ్జెట్లు మాత్రం ఎంతో ప్రత్యేకం. ఆయా సందర్భాలుగానీ, బడ్జెట్లలో చేర్చే కీలక అంశాలుగానీ దీనికి కారణం. అలాంటి బడ్జెట్లు ఏమిటో చూద్దామా? బ్లాక్ బడ్జెట్ 197374లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్‌రావు చవాన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ‘బ్లాక్ బడ్జెట్’గా వ్యవహరిస్తారు. అప్పటికే కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో.. 550 కోట్ల ఆర్థిక లోటుతో ఆ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పటి లెక్కల్లో ఈ మొత్తం తక్కువే అనిపిస్తున్నా.. నాటి పరిస్థితుల ప్రకారం.. భారీ లోటు అన్నమాట. క్యారట్ – స్టిక్ ఓ వైపు తాయిలాలు ఇస్తూనే.. మరోవైపు బెత్తంతో అన్నింటినీ నియంత్రణలోకి తెచ్చుకునే లక్ష్యంతో 1986లో కాంగ్రెస్ ఆర్థిక మంత్రి వీపీ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌నే ‘క్యారట్ అండ్ స్టిక్ బడ్జెట్’గా పిలుస్తారు. దేశంలో లైసెన్స్‌రాజ్ వ్యవస్థకు మంగళం పాడేదిశగా చర్యలు ఈ బడ్జెట్లోనే మొదలయ్యాయి. అంతేకాదు పన్నులపై మళ్లీ పన్నులు పడుతూ పెరిగిపోయే భారం నుంచి ఉపశమనం కలిగించేందుకు ‘మోడిఫైడ్ వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ క్రెడిట్’ను అమల్లోకి తెచ్చారు. అదే సమయంలో స్మగ్లర్లు, బ్లాక్ మార్కెటింగ్ చేసేవారు, పన్నులు ఎగ్గొట్టేవారిపై కఠిన చర్యల కోసం ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. ప్రగతి బడ్జెట్ ఒక రకంగా ఆధునిక భారతదేశ చరిత్రనే మార్చినదిగా చెప్పుకొనేది 1991 బడ్జెట్. మన దేశం ఆర్థిక సంక్షోభం అంచున ఉండి, రోజువారీ వ్యవహారాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితుల్లో.. పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో మన్మోహన్సింగ్ ఆర్థిక మంత్రిగా విప్లవాత్మక సంస్కరణలతో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. లైసెన్స్‌రాజ్ వ్యవస్థకు పూర్తిగా మంగళం పాడుతూ.. స్వేచ్ఛాయుత వ్యాపారానికి దారులు తెరిచారు. ఎగుమతులను పెంచేందుకు భారీగా పన్నులు తగ్గించారు. కలల బడ్జెట్ వ్యాపారస్తుల నుంచి సామాన్యుల వరకు కలలుగనేది పన్నుల తగ్గింపు, సులువుగా వ్యాపార, వాణిజ్యాలు చేసుకునే అవకాశమే. అలా అందరి ఆశలు తీర్చినది 1997–98 బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్లో ఎన్నో సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఆదాయపన్నులో మార్పులు చేశారు. గరిష్ట శ్లాబును 40శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. దేశీయ కంపెనీలకు పన్నును 35 శాతానికి తగ్గించారు. స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడించే పథకాన్ని ప్రకటించారు. కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 40 శాతానికి తగ్గించి, ఎగుమతులు–దిగుమతులు ఊపందుకోవడానికి బాటలు వేశారు. ‘మిలీనియం’ ఐటీరంగంలో ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే కీలకమైన స్థానంలో ఉంది. అలాంటి సాంకేతికతకు ప్రాధాన్యమిచ్చినదే 2000లో యశ్వంత్‌సిన్హా ప్రవేశపెట్టిన ‘మిలీనియం బడ్జెట్’. అందులో సాఫ్ట్వేర్ ఎగుమతులకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించారు. కంప్యూటర్లు, సంబంధిత ఉపకరణాలపై దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించారు. ‘రోల్‌బ్యాక్’ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏదైనా ప్రతిపాదన చేసిందంటే.. దాదాపుగా దాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టేనని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. అలాంటిది యశ్వంత్‌సిన్హా ప్రవేశపెట్టిన 2002–03 బడ్జెట్లోని చాలా అంశాలపై.. అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొన్ని ప్రతిపాదనలనైతే మొత్తంగా వెనక్కి తీసుకుంది. అందుకే ఈ బడ్జెట్‌ను ‘రోల్‌బ్యాక్ బడ్జెట్’గా పిలుస్తుంటారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
కేంద్రం సెస్ తగ్గిస్తే రూ. 32కే లీటర్ పెట్రోల్
పటాన్చెరు: కేంద్ర ప్రభుత్వం సెస్‌ను తగ్గిస్తే పెట్రోల్ రేట్లు బాగా తగ్గుతాయని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అన్నారు. పెట్రోల్‌పై సెస్ రూపంలో ఆయా సందర్భాల్లో కేంద్రం సొమ్మును వసూలు చేస్తోందని, సెస్ అనేది పన్ను కాదని గుర్తించాలన్నారు. కేంద్రం ఇలా ఆయా సమయాల్లో వేసిన సెస్‌ను తొలగిస్తే పెట్రోల్ లీటరు రూ.32కే ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. బుధవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన సెమినార్‌కు ఆయన హాజరయ్యారు. అక్కడి విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దు అనే మోదీ ప్రభుత్వ ఆలోచన మంచిదే అయినా అమలులో వెనుకబడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. నల్లధనం వెలికితీత పేరుతో నోట్లరద్దు అమల్లోకి తేగా, బ్లాక్‌మనీ మొత్తం వైట్‌గా మారిందన్నారు. తనకు దివంగత ప్రధాని పీవీ నరసింహారావుతో ఉన్న అనుబంధాన్ని చిదంబరం గుర్తుచేసుకుంటూ.. ఓసారి తాను రూపొందించిన ఓ ముసాయిదా చట్టం ఫైలును పీవీ కనీసం చదవకుండానే సంతకం పెట్టారని అన్నారు. -
Corona: ‘ముందస్తు ప్రణాళిక లేకుంటే.. థర్డ్ వేవ్ ఆపటం కష్టం’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ వ్యాప్తి ఉద్ధృతి నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పలువురు రాజకీయ నాయకులు, మేధావులు ప్రధాని మోదీకి లేఖలు రాస్తున్నారు. వైరస్ కట్టడికి అనుసరించాల్సిన విధివిధానాలపై లేఖల్లో పేర్కొంటున్నారు. అయితే తాజాగా కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధంగా లేదంటూ కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం విమర్షలు గుప్పించారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై శనివారం ఆయన ట్విటర్లో స్పందించారు. కరోనా సెకండ్ వేవ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందని మండిపడ్డారు. కోవిడ్ టీకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్టు గుర్తుచేశారు. భవిష్యత్తుల్లో కరోనా పిల్లలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చిన్నారులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. పిల్లలకు అందించే చికిత్స, వ్యాక్సినేషన్ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేయాలన్నారు. దేశ భవిష్యత్తు కోసం ప్రస్తుత ప్రభుత్వాన్ని నిద్రలేపాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయకపోతే రాబోయే కరోనా మూడో దశను కూడా నివారించడం సాధ్యం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. (చదవండి: కర్ఫ్యూ ఉల్లంఘించాడని పోలీసుల దాడి: బాలుడు మృతి) -
'కోవిడ్‌పై ప్రభుత్వ విధానం వినాశకరం'
న్యూఢిల్లీ: కోవిడ్–19 కట్టడిపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వినాశకరంగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈ సమయంలో దేశానికి సరైన వ్యాక్సినేషన్ విధానం అవసరముందన్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును చూస్తే మరింత తీవ్రమైన మూడోవేవ్ ఖాయంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. అనుమానిత కరోనా బాధిత మృతదేహాలు గంగానదిలో తేలియాడుతుం డటంపై రాహుల్.. ప్రధాని మోదీ గంగామాతను రోదించేలా చేశారని ట్విట్టర్లో శనివారం వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి, గంగా నదిలో 1,140 కిలోమీటర్ల మేర 2 వేల మృతదేహాలు లభించాయన్న వార్తలను ఆయన ట్యాగ్ చేశారు. తౌటే తుపాను నేపథ్యంలో రాష్ట ప్రభుత్వాలు జారీ చేసిన హెచ్చరికలను పాటిస్తూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ప్రజలను ఆయన కోరారు. అవసరమైన వారికి సాయం అందించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. గుజరాత్లో ఆ 65,805 మరణాలు ఎవరివి? గుజరాత్ వంటి రాష్ట్రాలు కోవిడ్ మరణాలను తక్కువగా చేసి చూపుతున్నాయంటూ వస్తున్న వార్తలపై కేంద్రం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆ పార్టీ నేతలు పి.చిదంబరం, శక్తిసిన్హ్ సోలంకి మీడియాతో మాట్లాడుతూ..ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 10వ తేదీ మధ్యలో 1,23,000 డెత్ సర్టిఫికెట్లు జారీ కాగా, గత ఏడాది ఇదే సమయంలో 58వేల మరణ ధ్రువీకరణ పత్రాలను మాత్రమే యంత్రాంగం జారీ చేసినట్లు గుజరాత్‌లోని 33 జిల్లాల గణాంకాలను బట్టి తేలిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే సమయంలో కోవిడ్ మరణాలను కేవలం 4,218గా అధికారికంగా ప్రకటించిందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ మరణాలు, జారీ అయిన డెత్ సర్టిఫికెట్ల మధ్య కనిపిస్తోన్న 65,805 వ్యత్యాసంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. -
కేజ్రీవాల్‌కు ఢిల్లీ నిర్వచనం తెలుసా
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఇటీవల రాష్ట్రేతరులకు ఢిల్లీలో కరోనా చికిత్స అందించబోమని ప్రకటించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై కేంద్ర మాజీ ఆర్థికమంత్రి పి.చిదంబరం మండిపడ్డారు. ఆయన సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కేవలం ఢిల్లీ వాసులకే కరోనా చికిత్స చేస్తామని కేజ్రీవాల్ అంటున్నారు.. కానీ ఢిల్లీ వాసులంటే నిర్వచనం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రేతరులకు అనుమతి లేదన్న ప్రకటనపై న్యాయ నిపుణులను సంప్రదించారా అని ప్రశ్నించారు. (ఢిల్లీ ఆసుపత్రుల్లో 'ఇతరులకు' నో ఛాన్స్!) కాగా దేశంలోని ప్రజలు జనవరి నెలలో కేంద్ర పథకం ఆయుష్మాన్ భారత్‌లో తమ పేరును నమోదు చేసుకుంటే.. దేశంలో ఎక్కడైన చికిత్స చేసుకునే వెసులుబాటు ఉంటుందని చిదంబరం గుర్తు చేశారు. ఢిల్లీ ప్రభుత్వం పై కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ ఫైర్ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ప్రజలకు హక్కులుంటాయని అన్నారు. కరోనా చికిత్సకు రాష్ట్రేతరులు అనుమతి లేదన్న ప్రకటనపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని ఆయన సూచించారు. చదవండి: వాళ్లంతా అమాయకులను ఎక్కడా చూడలేదు -
‘సబ్ సాత్, సబ్ కా వికాస్’ హామీ ఏమైంది
-
దేశం తగలబడిపోతున్నా పట్టదా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అధిక ధరలతో ప్రజలు అల్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన భారత్ బచావో ర్యాలీ సందర్భంగా శనివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో సోనియా మాట్లాడారు. దేశాన్ని రక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, దేశాన్నికాపాడుకునేందుకు కలిసి పోరాటం చేయాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మోదీ సర్కారు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని.. యువతకు ఉద్యోగాలు లేవని, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించలేకపోయిందని విమర్శించారు. ‘సబ్ సాత్, సబ్ కా వికాస్’ హామీ ఏమైందని సోనియా గాంధీ ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ బిల్లుతో దేశం తగలబడిపోతున్నా మోదీ-షాలకు పట్టడం లేదని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తూ తమకు ఇష్టమొచ్చినట్టుగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. తమకు కావాల్సిన చోట రాజ్యాంగ అధికరణలను విధిస్తూ, అధికరణలను రద్దు చేస్తూ రాష్ట్రాల హోదాలను మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తేసి ఎటువంటి చర్చ లేకుండానే తమకు కావాల్సిన బిల్లులు ఆమోదించుకున్నారని పేర్కొన్నారు. భారత్ బచావో ర్యాలీలో ఎంపీ రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా, సీనియర్ నేత చిదంబరం, తదితరులు పాల్గొన్నారు. ఏది అడిగినా అదే చెబుతారు: చిదంబరం ఆరు నెలల నరేంద్ర మోదీ పాలన దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందని, ఇప్పటికీ మంత్రులకు దీనిపై అవగాహన లేకుండా పోయిందని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నారు. ‘ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న కూడా పార్లమెంట్లో మాట్లాడుతూ దేశ ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని.. ఆర్థికాభివృద్ధిలో ప్రపంచంలో మనం అగ్రభాగాన ఉన్నామని చెప్పారు. ఎవరు ఏది అడిగినా మంచి కాలం రాబోతుందనే ఆమె సమాధానం చెబుతార’ని చిదంబరం ఎద్దేవా చేశారు. (చదవండి: నా పేరు రాహుల్ సావర్కర్ కాదు) -
చిదంబరాన్ని కలిసిన రాహుల్, ప్రియాంక
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలు బుధవారం ఉదయం మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరంను కలిశారు. చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. గత సోమవారం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, మనీష్ తివారీలు ఆయనను కలిశారు. కాగా, అధికారంలో ఉన్నప్పుడు ముడుపుల కుంభకోణం, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ అభియోగాలు వచ్చిన నేపథ్యంలో సీబీఐ ఆగస్టు 21న చిదంబరంను అరెస్ట్ చేసింది. అనంతరం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసినా ఈడీ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులో విచారణ ఖైదీగా ఉంటున్నారు. -
చిదంబరంపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం తదితరులపై ఢిల్లీ కోర్టులో సీబీఐ చార్జిషీటు వేసింది. శుక్రవారం ప్రత్యేక కోర్టు జడ్జి లాల్ సింగ్‌కు దీనిని సమర్పించింది. ఈ చార్జిషీటులో పీటర్ ముఖర్జీ, చార్టెర్డ్ అకౌంటెంట్ ఎస్.భాస్కరరామన్, నీతి ఆయోగ్ మాజీ సీఈవో సింధుశ్రీ ఖుల్లర్, మాజీ ఉన్నతాధికారులు అనుప్ కె.పుజారి, ప్రబోధ్ సక్సేనా, రవీంద్ర ప్రసాద్‌లతోపాటు ఐఎన్ఎక్స్ మీడియా, ఏఎస్‌సీఎల్ అండ్ చెస్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థల పేర్లున్నాయి. అప్రూవర్‌గా మారిన మరో నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ పేరు కూడా ఇందులో ఉంది. వీరిపై అవినీతి నిరోధక చట్టం, భారతీయ శిక్షాస్మృతి కింద పలు అభియోగాలు మోపింది. కాగా, ఇదే కేసులో చిదంబరం పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. -
వర్సిటీల్లో స్వేచ్ఛ ఎప్పుడు?
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ విద్యార్థులకు ఐన్‌స్టీన్ చాలెంజ్ విసరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం స్పందించారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు ఆలోచన, భావ ప్రకటన స్వేచ్ఛ నిలయాలుగా ఎప్పుడు మారుతాయని ప్రశ్నించారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న చిదంబరం కోరిక మేరకు కుటుంబసభ్యులు ఓ ట్వీట్ చేశారు. అందులో.. ‘ప్రధాని మోదీ విద్యార్థులకు ఐన్‌స్టీన్ చాలెంజ్ విసిరినందుకు సంతోషం. ఐన్‌స్టీన్ చెప్పినట్లుగా.. బోధన, రచన, పత్రిక రంగాల్లో స్వేచ్ఛ ప్రజల సహజ, ఉన్నత వికాసానికి పునాది వంటివి’. అయితే, మన వర్సిటీలు అటువంటి వాస్తవమైన స్వేచ్ఛా నిలయాలుగా ఎప్పుడు మారతాయి?’అని పేర్కొన్నారు. -
‘అందుకే ఆర్టికల్ 370 రద్దు’
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ, ఆర్టికల్ 370 రద్దుపై వాదప్రతివాదనలు కొనసాగుతునే ఉన్నాయి. జమ్మూ కశ్మీర్లో ముస్లింలు మెజారిటీలుగా ఉండటంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్లో హిందువులు మెజారిటీలుగా ఉంటే ఆర్టికల్ 370ని బీజేపీ తాకే ప్రయత్నం చేసేది కాదని చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370 రద్దుపై రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసినప్పటి నుంచీ చిదంబరం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. జాతీయవాద జులుంతో ప్రపంచంలో ఎక్కడైనా ఎలాంటి వివాదమైనా పరిష్కారమైందా అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఆయన గతంలో ట్వీట్ చేశారు. మరోవైపు ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ చేపట్టిన జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్ధీకరణ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ప్రభుత్వానికి బాసటగా నిలవడం గమనార్హం. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు నేతలు బాహాటంగా సమర్ధించారు. -
ఇదో ఘోర తప్పిదం
జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పి.చిదంబరం తీవ్రస్థాయిలో బీజేపీపై మండిపడ్డారు. సోమవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఘోర తప్పిదానికి పాల్పడిందని, ఇదొక చట్టపరంగా తీసుకున్న ప్రమాదకర నిర్ణయమని ఆరోపణలు చేశారు. బీజేపీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌ను చిన్నాభిన్నం చేస్తోందని, అక్కడి యువతను హింస వైపు ప్రేరేపించేలా చర్యలు తీసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం భారతదేశ చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుంది. మీరు (బీజేపీ) దీని నుంచి ఓ విజయాన్ని పొందారని అనుకోవచ్చు. వీధుల్లో మోగుతున్న డప్పు చప్పుళ్లతో మీరేదో అన్యాయాన్ని సరిచేశామని భావించవచ్చు. కానీ ఆర్టికల్ 370ని రద్దు చేసి ఈ సభ ఘోర తప్పిదానికి పాల్పడిందని భవిష్యత్ తరాలు తెలుసుకుంటాయి. ఈ ఘోర తప్పిదాన్ని కాంగ్రెస్ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తుంది. మేం ఇక్కడ కూర్చుంటాం. మీరు (రాష్ట్రాలు) చెప్పేది వింటాం. కానీ రాష్ట్రాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటాం అనేలా బీజేపీ వైఖరి ఉంది. రాష్ట్రాల హక్కులను కాపాడాల్సిన రాజ్యసభలో ఉమ్మడి జాబితాలోని అంశాలపై బిల్లులు పాస్ చేస్తున్నారు. రాష్ట్రాల అధికారాలను బీజేపీ లాక్కుంటోంది. జమ్మూ కశ్మీర్లో మెజార్టీ యువత భారత్‌తోనే ఉంది. భారత్ నుంచి రక్షణ కోరుకుంటోంది. అదేసమయంలో కొంతమంది యువత హింసామార్గాన్ని ఎంచుకుంది. వాళ్లంతా భారత్ నుంచి స్వాత్రంత్యం కోరుకుంటున్నారు’అని ఆందోళన వ్యక్తం చేశారు. -
వెర్రి ప్రభుత్వాలే అలా చేస్తాయి: చిదంబరం
సాక్షి, చెన్నై: మూర్ఖ ప్రభుత్వాలే దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను బయటపెడతాయని, మోదీ ప్రభుత్వంపై మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం నిప్పులు చెరిగారు. ‘ఉపగ్రహాలను కూల్చే సత్తాను భారత్ చాలా రోజుల క్రితమే సంపాదించింది. తెలివైన ప్రభుత్వాలు ఇలాంటి విషయాలను బయటపెట్టవు. కానీ వెర్రి ప్రభుత్వాలు మాత్రమే దేశ రక్షణకు సంబంధించిన ఇటువంటి అంశాలను బహిర్గతం చేసి, ద్రోహానికి పాల్పడుతాయి’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతరిక్షంలో ఉపగ్రహాలను కూల్చివేసే ఉపగ్రహ విధ్వంసక క్షిపణి(ఏశాట్)ని గురువారం భారత శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించిన సంగతి విదితమే. ఈ విజయంతో ఏశాట్ సాంకేతికత కలిగిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ నిలిచింది. ఈ ప్రయోగానికి ‘మిషన్ శక్తి’ అని నామకరణం చేశారు. ‘మిషన్ శక్తి ప్రయోగాన్ని ఇప్పుడే ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారం మధ్యలో ఉన్నందున, లాభపడాలనే దుర్బుద్ధితోనే బీజేపీ ఈ ఎత్తుగడ వేసింద’ని మోదీని చిదంబరం విమర్శించారు. ఎన్నికల పోలింగ్‌కు తక్కువ సమయం ఉండటంతో మిషన్ శక్తి గురించి మోదీ చేసిన ప్రసంగాన్ని, కోడ్ ఉల్లంఘనగా చెప్తూ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎన్నికల కమిషన్ దర్యాప్తునకు ఆదేశిస్తూ, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని వేసింది. -
కాంగ్రెస్‌లో బయటి అధ్యక్షులు చాలామంది ఉన్నారు
న్యూఢిల్లీ: నెహ్రూ–గాంధీ కుటుంబానికి సంబంధంలేని చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తెలిపారు. ఇలాంటి విషయాలను వదిలేసి రాఫెల్ ఒప్పందం, నిరుద్యోగం, మూకహత్యలు, యాంటీ రోమియా గూండాలు, ఉగ్రదాడులు, బీజేపీ హయాంలో రైతుల ఆత్మహత్యలపై స్పందించాలని ప్రధాని మోదీకి చురకలు అంటించారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఐదేళ్లు గాంధీయేతర వ్యక్తికి కేటాయించాలన్న మోదీ సవాల్‌పై ఆయన ఈ మేరకు స్పందించారు. బీఆర్ అంబేడ్కర్, లాల్‌బహదూర్ శాస్త్రి, కామరాజ్ నాడార్, మన్మోహన్ సింగ్, పట్టాభి సీతారామయ్య, పీవీ నరసింహారావు వంటి హేమాహేమీ నేతలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారని చిదంబరం గుర్తుచేశారు. -
విభజన చట్టం అమలుపై కమిటీ భేటీ
-
విభజన చట్టం అమలుపై చిదంబరం అధ్యక్షతన కమిటీ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునరవ్యవస్థీకరణ చట్టం-2014లోని అంశాల అమలు స్థితిగతులపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలోని పార్లమెంటరీ హోంశాఖ స్టాండింగ్ కమిటీ శుక్రవారం సమావేశమైంది. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల విభజన, ఆర్టీసీ ఆస్తుల పంపకం, రెండు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న వివాదాల గురించి కమిటీ చర్చించనుంది. ఈ సందర్బంగా విభజన చట్టం అమలు నివేదికను ఏపీ ప్రభుత్వం కమిటీకి అందించింది. విభజన అనంతరం కేంద్రం ఇచ్చిన నిధులకు సంబధించిన మరో నివేదికను సమర్పించింది. రాష్ట్రంలో ఏర్పడిన రెవెన్యూ లోటుకు కేంద్రం 3,979 కోట్ల నిధులు ఇచ్చినట్లు వీటికి సంబంధించిన వినియోగ పత్రాలు(యూసీలు) ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం కమిటీతో పేర్కొంది. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు పెట్టిన 6,727 కోట్లకు యూసీలు అవసరం లేదని కమిటీకి సూచించింది. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన 1,632 కోట్లకు యూసీలు ఇచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. విజయవాడ- గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్దికి కేంద్రం మంజూరు చేసిన వెయ్యి కోట్లకు గాను 229 కోట్లకు యూసీలు ఇచ్చినట్టు తెలిపింది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ది కోసం కేంద్రం ఇచ్చిన 1,050 కోట్లకు గాను 946 కోట్లకు యూసీలు ఇచ్చినట్టు ఏపీ ప్రభుత్వం కమిటీకి తెలిపింది. -
చిదంబరంను విచారించిన ఈడీ
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మాక్సిస్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 6 గంటలపాటు విచారించింది. ఈడీ ఎదుట చిదంబరం హాజరవడం ఇదే తొలిసారి. ఈడీ సమన్లు జారీ చేయడంతో మంగళవారం ఉదయం లాయర్‌తో కలసి ఈడీ ప్రధాన కార్యాలయానికి చిదంబరం వచ్చారు. విచారణ అనంతరం మధ్యాహ్నం ఆయనకు భోజన విరామం ఇచ్చారు. తర్వాత 3.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు విచారణ కొనసాగింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద చిదంబరం వాంగ్మూ లం నమోదు చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. రూ.3,500 కోట్ల ఎయిర్‌సెల్–మాక్సిస్ ఒప్పందానికి సంబంధించి ఇప్పటికే చిదంబరం కొడుకు కార్తీ చిదంబరంను ఈడీ విచారించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే విచారణ ‘ఈడీ ఎదుట హాజరయ్యాను. అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చాను. ప్రభుత్వం వద్ద ఉన్న పత్రాల్లోని ప్రశ్నలే అడిగారు. సమాధానాలు కూడా ప్రభుత్వ పత్రాల్లోనే ఉన్నాయి. నాపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. నేరారోపణ జరగలేదు. కానీ నాకు వ్యతిరేకంగా, నన్ను పిలిపించి విచారణ జరుపు తున్నారు’ అని చిదంబరం ట్విట్టర్లో పేర్కొన్నారు. జూలై 10 వరకు అరెస్టు చేయొద్దు ఈ కేసుకు సంబంధించి తనను అరెస్టు చేయకుండా ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విషయంలో చిదంబరంనకు ఊరట లభించింది. జూలై 10 వరకు చిదంబరంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, ప్రత్యేక కోర్టు జడ్జి ఆదేశాలిచ్చారు. -
చిదంబరంనకు సమన్లు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కుంభకోణంపై ఈనెల 6వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంనకు సీబీఐ సమన్లు జారీ చేసింది. మే 31వ తేదీనే సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా చిదంబరం విజ్ఞప్తి మేరకు 6వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో జూలై 3వ తేదీ వరకు చిదంబరంను అరెస్టు చేయరాదంటూ ఢిల్లీ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మీడియా ప్రముఖులు పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణిలు ప్రమోటర్లుగా ఉన్న ఐఎన్ఎక్స్ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల అవకతవకల్లో 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం పాత్ర ఉందంటూ సీబీఐ గత ఏడాది కేసు నమోదు చేసింది. ఈ కేసులో రూ.10 లక్షలు తీసుకున్నారనే ఆరోపణలపై చిదంబరం కుమారుడు కార్తీని సీబీఐ ఇప్పటికే అరెస్ట్ చేసింది. -
లీటరు పెట్రోల్‌పై కేంద్రానికి రూ.25 బొనాంజా
సాక్షి, న్యూఢిల్లీ: మండుతున్న పెట్రో ధరలపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం మరోసారి బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఆందోళన రేపుతున్న పెట్రో ధరలపై ఆయన ట్విటర్లో స్పందించారు. లీటరుకు ఒకటి లేదా రెండు రూపాయల చొప్పున ఇంధన ధరలను తగ్గించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందంటూ కేంద్రంపై ధ్వజమెత్తారు. తమ ఖజానా నింపుకునేందుకు సాధారణ ప్రజలపై కేంద్ర ప్రభుత్వమే ఆ భారాన్ని వేస్తోందని విమర్శించారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి లీటరుపై రూ. 25 బొనాంజా అంటూ బుధవారం ఆయన వరుస ట్వీట్లలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం పూనుకుంటే లీటరుకు 25 రూపాయల దాకా తగ్గించే అవకాశం ఉందని ట్విట్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.77 ఉంది. అయితే ప్రతి లీటరు పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.25 లాభం పొందుతోందన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినప్పుడు ప్రతి లీటరు పెట్రోల్‌పై సుమారు రూ.15 కేంద్ర ప్రభుత్వం ఆదా చేస్తుందని, ప్రతి లీటరు పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.10 అదనపు ట్యాక్స్‌ను విధిస్తుందని చిదంబరం తన ట్వీట్లో పేర్కొన్నారు. తద్వారా ప్రతి లీటరుపై రూ.25 కేంద్రానికి ఆదా అవుతుందని ఆయన తెలిపారు. ఆదా అయిన డబ్బు అంతా సగటు వినియోగదారుడికే చెందాలని ఆయన వ్యాఖ్యానించారు. కావాలంటే ప్రభుత్వం ప్రతి లీటరుపై సుమారు రూ.25 తగ్గించవచ్చు అని, కానీ ప్రభుత్వం అలా చేయదు, కేవలం ఒకటి లేదా రెండు రూపాయలు తగ్గిస్తూ ప్రజలను మోసం చేస్తుందని చిదంబరం విమర్శించారు. — P. Chidambaram (@PChidambaram_IN) May 23, 2018 Bonanza to central government is Rs 25 on every litre of petrol. This money rightfully belongs to the average consumer. — P. Chidambaram (@PChidambaram_IN) May 23, 2018 -
‘ఆ ఆరుగురిపై చర్యలెందుకు లేవు?’
చెన్నై: విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో ఆరుగురు ప్రభుత్వ కార్యదర్శులపై సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోలేదని మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో గత 2006లో ముంబైలో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థను పారిశ్రామికవేత్త పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీలు నిర్వహించారు. ఆ సమయంలో కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం కుమారుడు కార్తీ చట్టవిరుద్ధంగా ఐఎన్ఎక్స్ సంస్థకు అనుమతి ఇప్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా సదరు సంస్థ నుంచి కార్తీ చిదంబరం లంచాలు తీసుకున్నట్లు, ఆ సంస్థను పరోక్షంగా తన కట్టడిలో ఉంచుకున్నట్లు సీబీఐ ఆరోపించింది. గత మే నెలలో దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ కార్తీ చిదంబరం, పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీ ముంబై, ఢిల్లీలోగల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపింది. ఇలా వుండగా శుక్రవారం కేంద్ర హోంశాఖ కార్తీ చిదంబరంను వెతుకుతున్న నేరస్థునిగా ప్రకటించడంతో ఆయన మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి ఎం.దురైసామి ఎదుట శుక్రవారం విచారణకు వచ్చింది. అనంతరం కేసు విచారణను ఆగస్టు ఏడవ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అయితే, ఈ విషయంతో సంబంధం ఉన్న ఆరుగురు ప్రభుత్వ కార్యదర్శులపై మాత్రం చర్యలెందుకు తీసుకోలేదని చిదంబరం కేంద్రాన్ని నిలదీశారు. -
కేంద్రం అసలు టార్గెట్ నేనే... కార్తీ కాదు..
చెన్నై: కేంద్రం గురి అంతా తన మీదే ఉందని మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. తన కుమారుడు కార్తీని అడ్డం పెట్టుకుని తనను ఇరకాటంలో పెట్టేందుకు తీవ్ర కుట్రలు సాగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ జాతీయ రాజకీయల్లో కీలక నేతగా ఉన్న పి.చిదంబరం కుటుంబం మీద ఇటీవల కాలంగా ఆరోపణల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. శారదా చిట్ ఫండ్ కేసులో ఆయన సతీమణి నళిని చిదంబరం ప్రమేయం ఉన్నట్టుగా ఓవైపు విచారణ సాగుతోంది. అలాగే, ఆయన తనయుడు కార్తీ చిదంబరం మెడకు ఐఎన్ఎక్స్ మీడియా, వాసన్ హెల్త్ కేర్‌లోకి విదేశీ పెట్టుబడుల రాక వ్యవహారాలు ఉచ్చుగా మారి ఉన్నాయి. ఇటీవల సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ల దాడుల పర్వం సాగాయి. విచారణ వేగవంతం అయింది. కార్తీ విదేశాల్లో ఉండటంతో, రాగానే, అరెస్టుకు తగ్గ ప్రయత్నాలు సాగుతున్నట్టు ప్రచారం ఊపందుకుని ఉంది. ఈ పరిస్థితుల్లో ఓ మీడియాతో నిన్న చిదంబరం మాట్లాడుతూ, కేంద్రం గురి తన కుమారుడు కాదు అని, తానేనని వ్యాఖ్యానించారు. తనను ఇరకాటంలో పెట్టడం, తనను అణగదొక్కడం లక్ష్యంగా తీవ్ర కుట్రలకు కేంద్రం వ్యూహరచన చేసి ఆచరణలో పెట్టే పనిలో నిమగ్నం అయిందని ఆరోపించారు. తన కుమారుడు అన్ని విచారణలకు సరైన సమాధానం ఇస్తారని పేర్కొంటూ, తనను గురిపెట్టి, కొత్త ఎత్తుగడలకు సీబీఐ సిద్ధం అవుతోన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. సీబీఐని అడ్డం పెట్టుకుని సాగుతున్న ప్రయత్నాలకు కాలమే సమాధానం ఇస్తుందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
ధీశాలి ఇందిర
శతజయంతి సదస్సులో పి.చిదంబరం ప్రతికూలతలే ఉక్కు మహిళను చేశాయి సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా అంతర్గత, బహిర్గత ప్రతికూలతలే దివంగత ప్రధాని ఇం దిరాగాంధీని ఉక్కుమహిళను చేశాయని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డా రు. ఇందిర శతజయంతి ఉత్సవాల సందర్భం గా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. ‘‘దేశంలో ఎమర్జెన్సీ విధింపు తప్పుడు నిర్ణయమేనని తన తప్పును ధైర్యంగా అంగీకరించిన ధీశాలి ఇందిర. ‘గాంధీ తర్వాత ప్రజలంతా గుర్తు పెట్టుకునేది ఆమెనే. సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయాలతో చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు. ఆమె చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఎవరూ విమర్శించలేరు. దేశాన్ని స్వయం సమృద్ధం చేసే హరిత విప్లవం వం టి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు యుద్ధాలు, కరువు కాటకాల బారినుంచి దేశాన్ని కాపాడారు. వెనకబడిన వర్గాల పట్ల సమాజంలో ఉన్న దృక్పథాన్ని ఇందిర మార్చారు. ఎప్పటికప్పుడు పరిణతిని సాధిస్తూ వచ్చారు. అన్ని వర్గాల వారూ సొంత మనిషిలా ఆదరిం చిన ఆమెను కులం, మతం, వర్గం వంటివాటికి పరిమితం చేసి చూడలేం’’అని వ్యాఖ్యానించారు. అట్టడుగు వర్గాల కోసం తపించారు: శాంతా సిన్హా విద్యార్థి దశలో తనకూ అందరిలాగే ఇందిరపై వ్యతిరేకత భావనే ఉండేదని ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ బాలల హక్కుల రక్షణ కమి షన్ మాజీ చైర్పర్సన్ శాంతా సిన్హా చెప్పారు. ‘‘రైతులు, కూలీలు, అట్టడుగు వర్గాల పట్ల ఆలోచనా విధానం, ఆ దిశగా ఆమె చేసిన చట్టా లు, వాటి అమలు చూసి నా అభిప్రాయం మా రింది. బ్యాంకుల జాతీయీకరణ విప్లవాత్మక నిర్ణయం. తరతరాలుగా కూలీలుగా ఉన్నవాళ్లు భూ సంస్కరణలతో భూ యజమానులయ్యారు. 20 సూత్రాల పథకంతో అభివృద్ధి అన్ని వర్గాలకు చేరేలా విప్లవాత్మక చర్యకు ఇందిర తెర తీశారు’’అని చెప్పారు. ఇందిర తర్వాత దేశంలో అలాంటి రాజకీయ నేత మళ్లీ కని పించడం లేదని ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. ‘‘ఆమె అమలు చేసిన భూ సంస్కరణల వల్ల దళితులకే ఎక్కువ మేలు జరిగింది. 1975లో తప్పనిసరి పరిస్థితిలో ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది. రాజకీయాల్లో ఇందిర పట్టుదల చూపేవారు. అంతా తన మాట వినాలనే తత్వంతో వ్యవహరించేవారు’’అని విశ్లేషించా రు. పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి అజయ్ మాకెన్, విపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధి కారి మల్లెపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘అది తమిళనాడు నుంచే లీకైంది’
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు(ఎఫ్ఐపీబీ)లో భాగమైన ఆరుగురు కార్యదర్శులను తమ కుటుంబంలోని సభ్యులు ప్రభావితం చేశారనడం ‘అర్థరహితం’అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం పేర్కొన్నారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు ఎఫ్ఐపీబీలో జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే సోమవారం మీడియాతో మాట్లాడిన చిదంబరం ఈ ఆరోపణలను కొట్టివేశారు. కొందరు పనిలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తమ కుటుంబంలోని ఎవరూ ఎఫ్ఐపీబీని ప్రభావితం చేసే అవకాశమే లేదని, ఆరుగురితో కూడిన బోర్డు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఏ ఒక్క అధికారీ సొంతంగా నిర్ణయం తీసుకోలేరన్నారు. ఎఫ్ఐపీబీ సిఫార్సు చేసిన వాటికి మాత్రమే తాను అనుమతి ఇచ్చానని, తన హయాంలో బోర్డులో పనిచేసిన కార్యదర్శులంతా ఎంతో అనుభవం ఉన్న సీనియర్ ఐఏఎస్‌లని.. ఒక్కరు మాత్రం ఐఎఫ్ఎస్ అధికారని వివరించారు. ‘‘నా నిర్ణయాలను ప్రభావితం చేసేందుకు ఏ అధికారి ధైర్యం చేసేవారు కాదు. మా కుటుంబ సభ్యులైనా కూడా అధికారులతో మాట్లాడేందుకు అనుమతించేవాడిని కాద’’ని పేర్కొన్నారు. అక్రమంగా నగదు బదిలీలో భాగంగా పక్షం రోజుల క్రితం సీబీఐ.. కార్తి, ఐఎన్ఎక్స్ మీడియా వ్యవస్థాపకురాలు ఇంద్రాని, పీటర్ ముఖర్జీ నేరపూరిత కుట్ర కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం విదితమే. దీనిపై చిదంబరం స్పందిస్తూ.. ఎఫ్ఐఆర్లో తన పేరును చేర్చనప్పటికీ, ఎఫ్ఐపీబీని చేర్చడంతో నాటి ఆర్థిక మంత్రిగా తననూ టార్గెట్ చేసినట్లేనని చెప్పారు. ఎఫ్ఐఆర్ కాపీ అనుకోకుండా తనకు సోషల్ మీడియా ద్వారా లభించిందని, ఇది లీక్ అయింది కూడా తమిళనాడు నుంచే అని వెల్లడించారు. అందులో ఉన్న ఆరోపణలన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కార్తిపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని, ఎం/ఎస్ ఎడ్వాంటేజ్ స్ట్రాటిజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎస్‌సీపీఎల్)లో అతడు డైరెక్టర్ కాదని, కనీసం వాటాదారుడు కూడా కాదన్నారు. ఆ కంపెనీ తన కుమారుడి స్నేహితులదని, వారంతా టార్గెట్ కావడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్తి దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరిస్తాడని చిదంబరం వివరించారు. -
కొండను తవ్వి ఎలుకను పట్టి..
• నోట్ల రద్దుపై చిదంబరం తీవ్ర విమర్శలు • పల్లె ప్రజల బాధలు వర్ణానాతీతమని వ్యాఖ్య • క్యూలో ఒక్క ధనవంతుడైనా కనిపిస్తున్నాడా?: రాహుల్ నాగ్‌పూర్/న్యూఢిల్లీ: నోట్ల రద్దు నిర్ణయం అనాలోచితమని, కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన ఉందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అభివర్ణించారు. మోదీ ప్రభుత్వం పేదలపై దాడికి పాల్పడిందని... నగదు కోసం పేదలే క్యూలో నిలబడుతున్నారని, ధనవంతులకు ఎలాంటి ఇబ్బంది లేదని తప్పుపట్టారు. ‘ఇది పేద ప్రజలపై భయంకరమైన దాడి. ఈ నిర్ణయం 45 కోట్ల ప్రజల వెన్ను విరిచింది. పేదలకు శిక్షగా పరిణమించింది. నాకు తెలిసి ఏ ధనవంతుడు నోట్ల రద్దుతో ఇబ్బంది పడలేదు’అని మంగళవారం నాగ్‌పూర్‌లో అన్నారు. రోజువారీ కూలీలకు పని దొరకడం లేదని, గత 30 రోజులుగా గ్రామాల్లో మార్కెట్లు, షాపులు మూతపడ్డాయని విమర్శించారు. ప్రపంచంలో ఎన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు నగదు రహితమో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.‘ప్రపంచంలో చిన్నచిన్న కొనుగోళ్లు నగదుతోనే జరుగుతాయి.. కార్డులతో కాదు. భారత్‌లో 3%గా ఉన్న నగదు రహిత కార్యకలాపాలు కొద్ది నెలల్లో 100% చేరుకోవాలని ఆశించడం అసాధారణం’ అని చెప్పారు. నోట్ల రద్దుతో ధనవంతులు ఇబ్బందిపడ్డారని, పేదలు లాభపడ్డారనేది భ్రమేనని, పల్లె ప్రజల బాధలు వర్ణనాతీతమని అన్నారు. ‘ఈశాన్య భారత ప్రజల దుస్థితిని ఒకసారి ఊహించుకోండి. కేవలం 5 వేల ఏటీఎంలు ఉండగా 3,500 అస్సాంలోనే ఉన్నాయి. అందులో అధిక శాతం పనిచేయడం లేదు. ఇక దేశవ్యాప్తంగా 65% ఏటీఎంల్లో నగదు లేదు’ అని చెప్పారు. పలు చోట్ల రూ. 2 వేల నోట్ల స్వాధీనంతో నోట్ల రద్దు నిర్ణయం అతిపెద్ద స్కాంగా తేలిందని, వీటన్నింటిపై సిట్‌తో విచారణ జరిపించాలన్నారు. నోట్ల రద్దుతో అవినీతిని ఎలా అరికట్టాలో చెప్పాలని, ఇప్పుడు లంచాన్ని రూ. 2 వేల నోట్ల రూపంలో తీసుకుంటారని చెప్పారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు కనీసం బీజేపీకే చెందిన ఆర్థిక మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను సంప్రదించినా బాగుండేదన్నారు. పేదలపై యుద్ధం: రాహుల్ నవంబర్ 8న మోదీ పేదలపై యుద్ధం ప్రకటించారంటూ ఉత్తరప్రదేశ్‌లోని అనాజ్ మండిలో రాహుల్ విమర్శించారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ.. నిజాయితీపరులను క్యూల్లో నిలబెడుతున్నారని, అవినీతిపరులు వెనుక నుంచి డబ్బులు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీకు క్యూలలో కనీసం ఒక్క సంపన్నుడైనా కనబడుతున్నారా’అని ప్రశ్నించారు. మోదీ రోజురోజుకూ మాటలు మారుస్తున్నారని విమర్శించారు. మొదట్లో నల్లధనానికి వ్యతిరేకంగా పెద్ద నోట్లను రద్దు చేశానని, తర్వాత ఉగ్రవాదంపై పోరాడటానికని, ఇప్పుడేమో నగదు రహిత సమాజం కోసమని అంటున్నారని దుయ్యబట్టారు. ‘నగదు రహిత సమాజం వస్తే రైతులకు తెలియకుండానే వారి సొమ్ము పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల జేబుల్లోకి వెళ్లిపోతుంది. కొందరు పెద్ద వ్యాపారులు రూ. 8 లక్షల కోట్ల రుణాలు తీసుకుని తిరిగి చెల్లించడం లేదు. ప్రధాని మోదీ వాళ్ల నుంచి ఆ డబ్బును రాబట్ట లేకపోతున్నారు’అని రాహుల్ విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌కు ఇబ్బందిగా మారింది: జైట్లీ న్యూఢిల్లీ: కాంగ్రెస్ కుంభకోణాల చరిత్రకు మోదీ అవినీతి వ్యతిరేక ప్రచారం తీవ్ర అసౌకర్యంగా మారిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో భారత్ తక్కువ నగదుతో నడిచే ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ చెల్లింపుల దిశగా నడుస్తుందని, పన్ను ఆదాయం పెంచడంతో పాటు, పన్నుల ఎగవేత కూడా తగ్గుతుందన్నారు. ప్రస్తుత సమస్యల పరిష్కారానికి రద్దైన నోట్ల స్థానంలో కొత్త నోట్ల జారీని వేగవంతం చేశామన్నారు. యూపీఏ పదేళ్ల హయాంలో అవినీతి, నల్లధనం అరికట్టేందుకు కనీసం ఒక్క చర్య కూడా తీసుకోలేదని ఆయన విమర్శించారు. -
కరెన్సీ ఖాళీ
► డిపాజిట్లు మాత్రమే స్వీకరణ ► నిరాశలో ఖాతాదారులు ► రాజకీయ పార్టీల ఆందోళనలు ► మరో ఏడు నెలలు ► కరెన్సీ కష్టాలే: పి. చిదంబరం కరెన్సీ నోట్ల మార్పిడి వ్యవహారం డిమాండ్ ఎక్కువ.. సరఫరా తక్కువ అన్నట్లుగా తయారైంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా రిజర్వు బ్యాంకు నుంచి కొత్త కరెన్సీ అందకపోవడంతో బ్యాంకులన్నీ సదరు లావాదేవీలను నిలిపి వేశారుు. దీనిపై అనేక రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగారుు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవలి వరకు చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను కేంద్రం ఈనెల 8వ తేదీన రద్దు చేయగా, 10వ తేదీ నుంచి కొత్త కరెన్సీ పంపిణీ ప్రారంభమైంది. అరుుతే కేవలం రూ.2వేల నోటును మాత్రమే రిజర్వు బ్యాంకు సరఫరా చేయడంతో చిల్లర సంక్షోభం నెలకొని ఉంది. రూ.100, రూ.500, రూ.1000 నోట్లు ఎప్పుడు అందజేస్తారంటూ బ్యాంకుల వద్ద ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చాలా పరిమితమైన బ్యాంకుల్లోనే రూ.100 నోట్లు ఇస్తున్నారు. కరెన్సీ రద్దరుు పదిరోజులు అవుతుండగా కొత్త కరెన్సీ పొందేందుకు అనేక ఏటీఎంలు ఇప్పటికీ పనిచేయడం లేదు. బ్యాంకుల వద్ద క్యూను కట్టడి చేసేందుకు ఖాతాదారుల వేలిపై ఇంకు గుర్తు వేసే విధానం 10 శాతం బ్యాంకుల్లో మాత్రమే అమల్లోకి వచ్చింది. ఇదిలా ఉండగా బ్యాంకుల వద్ద బారులు బారులుగానిలుస్తున్న ప్రజలందరికీ కొత్త నోట్లు దక్కడం లేదు. దాదాపుగా అన్ని బ్యాంకుల్లోనూ కొత్త కరెన్సీ స్టాక్ అరుుపోవడం, రిజర్వు బ్యాంకు నుంచి వెంటనే సరఫరా కాకపోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. చాంతాడంత క్యూలో నిలుచుని సరిగ్గా కౌంటర్ వద్దకు వచ్చేసరికి ఉన్న కాస్త కరెన్సీ అరుుపోరుుందంటూ బ్యాంకులను మూసివేస్తున్నారు. ఈ రోజు కరెన్సీ మార్పిడి లేదు అంటూ సుమారు 50 శాతం బ్యాంకుల ముందు బోర్డులు దర్శనమిస్తున్నారుు. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు మాత్రమే ప్రజలు సజావుగా రూ. 2 వేల నోట్లను పొందగలిగారు. ఆ తరువాత నుంచి అష్టకష్టాలు ఆరంభమయ్యారుు. రూ.కోటి అవసరమైన బ్యాంకులకు కేవలం రూ.15లక్షలు మాత్రమే అందుతున్నారుు. దీంతో ప్రజలకు నచ్చజెప్పలేక ఆర్బీఐ నుంచి అందగానే మళ్లీ పంపిణీ చేస్తామని బ్యాం కు అధికారులు సర్దిచెబుతున్నారు. వేలిముద్ర వేసే ఇంకు రానందున కరెన్సీ మార్పిడి కుదరదని ఖాతాదారులను పంపించేశారు. తెల్లవారుజామునే బ్యాంకుల వద్దకు వచ్చి ఉదయం వేళ క్యూలోనే కూర్చుని టిఫిన్ చేస్తున్నట్లు కొందరు తెలిపారు. ఈరోడ్ జిల్లాలో ఒక క్షయవ్యాధి గ్రస్తుడిని బంధువులు బ్యాంకు వద్దకు మోసుకొచ్చి కరెన్సీని మార్చుకున్నారు. సహకార బ్యాంకుల గతేమిటంటూ సహకార బ్యాంకు సహాయ రిజిస్ట్రార్ మద్రాసు హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేయగా ఈనెల 28వ తేదీకి వారుుదాపడింది. పొన్నేరీలో ఒక చెత్తకుప్పలో రూ.500, రూ.1000 నోట్లతో కూడిన పెద్ద ఎత్తున కరెన్సీని కొందరు చింపిపారేశారు. కరెన్సీ రద్దును నిరసిస్తూ వర్తక, వాణిజ్య సంఘాలు శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారుు. కరెన్సీ నోట్ల రద్దు నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చెన్నై కలెక్టర్ కార్యాలయం ముందు వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు సాగారుు. కేంద్రప్రభుత్వ తొందరపాటు చర్య వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ విమర్శించారు. కొత్త కరెన్సీ కోసం బ్యాంకులకు వచ్చే ప్రజలకు సహకరించాల్సిందిగా డీఎంకే కోశాధికారి స్టాలిన్ తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పెట్రోలు బంకుల నుంచి వారానికి రూ.2వేలు పొందేలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 4,470 పెట్రోలు బంకులు ఉండగా, ఏఏ బంకుల్లో నగదు డ్రా చేసుకోవచ్చో? త్వరలో ఎస్బీఐ ప్రకటించనుంది. కష్టాలు తప్పవు:కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం దేశవ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కష్టాలు మరో ఏడు నెలలపాటు తప్పవని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఒక వారానికి రూ.3వేల కోట్ల విలువైన కరెన్సీని మాత్రమే ముద్రించే వెసులు బాటు ఉందని తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 8వ తేదీన అకస్మాత్తుగా ప్రకటించారు, అరుుతే ఈ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. పెద్ద నోట్లను రద్దు చేసి పెద్ద తప్పు చేసిన ప్రధాని నేడు ఆ తప్పును దిద్దుకునేందుకు తంటాలు పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో రూ.500, రూ.1000 నోట్లు సుమారు 2,100 కోట్లు ఉండగా, వీటిని రద్దు చేసినప్పుడు అదే స్థారుులో కొత్తవాటిని విడుదల చేయాల్సి ఉందని చెప్పారు. అరుుతే ఆ స్థారుులో వెంటనే ముద్రించేందుకు అవకాశం లేదని, నెలకు రూ.300 కోట్లు మాత్రమే కేంద్రం ముద్రించగలదని తెలిపారు. ఈలెక్కన చూసుకుంటే పూర్తిస్థారుు అవసరాలకు మరో 7 నెలలు గడువు తప్పనిసరి, అంత వరకు ప్రజలకు తిప్పలు తప్పవని ఆయన తెలిపారు. -
మళ్లీ తెరపైకి కార్తీ!
సాక్షి, చెన్నై : ఎన్నికల వేళ మరో మారు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం అక్రమాస్తులు అంటూ చిట్టాను తెర మీదకు తెచ్చే పనిలో తమిళ మీడియా నిమగ్నమైంది. అలాగే, ఆడిటర్ గురుమూర్తి సైతం ఆరోపణలు గుప్పించే పనిలో పడ్డారు. అవన్నీ అవాస్తవాలని, ఎన్నికల్లో దెబ్బ తీయడానికి కుట్రగా కార్తీ ఖండించారు. యూపీఏ హయాంలో కేంద్రంలో తొలుత ఆర్థిక మంత్రిగా, తదుపరి హోం మంత్రిగా తన తండ్రి చిదంబరం ఉన్న సమయంలో కార్తీ చిదంబరం స్వలాభాన్ని చూసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. 2జీ వ్యవహారంలోనూ పరోక్షంగా లాభ పడ్డట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమార్జనతో విదేశాల్లో కార్తీ చిదంబరం ఆస్తుల్ని గడించినట్టు, అనేక సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా ఆరోపణలు గుప్పించే వాళ్లు అధికం అయ్యారు. అయితే, వీటిని కార్తీ ఖండిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరో మారు కార్తీ చర్చ తమిళ మీడియాలు కొన్ని తెర మీదకు తెచ్చే పనిలో పడ్డాయి. డీఎంకే, కాంగ్రెస్ కూటమిని దెబ్బ తీయడానికి ఈ కుట్ర సాగుతున్నదా? లేదా, కార్తీ గడించిన ఆస్తుల చిట్టా ఇదేనా..? అన్న చర్చ తాజాగా బయలు దేరింది. ఇందుకు తగ్గట్టుగా కార్తీ ఎక్కడెక్కడ ఆస్తుల్ని కొనుగోలు చేసి ఉన్నారో, సంస్థల్లో పెట్టుబడులు పెట్టారో వివరిస్తూ చిట్టా రూపంలో కథనాలు బయలు దేరాయి. ఇందులో సింగపూర్‌కు చెందిన సంస్థ ద్వారా లండన్, దుబాయ్, ఫిలిఫైన్స్, దక్షిణాఫ్రికా, మలేషియా, థాయలాండ్, సింగపూర్, స్పెయిన్ తదితర యాభై దేశాల్లో ఈ ఆస్తులు ఉన్నట్టుగా ఆచిట్టాలో వివరించడం గమనార్హం. అదే సమయంలో ఆడిటర్ గురుమూర్తి సైతం కార్తీ చిదంబరం పై తీవ్ర ఆరోపణలు గుప్పించే పనిలో పడ్డారు. అయితే, ఇవన్నీ అవాస్తవాలని, కట్టుకథలుగా కార్తీ చిదంబరం వ్యాఖ్యానిస్తున్నారు.ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, డీఎంకే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చి తీరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేతో మాత్రమే ప్రధాన పోటీ అని, మిగిలిన వాళ్లంతా డిపాజిట్లను గల్లంతు చేసుకోవడం ఖాయం అని వ్యాఖ్యానిస్తున్నారు. -
'ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం'
న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ రాసిన 'శటానిక్ వర్సెస్' పుస్తకంపై రాజీవ్‌గాంధీ ప్రభుత్వం నిషేధం విధించడం సబబేనని కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా అన్నారు. ఈ అంశంపై తమ పార్టీ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం వెలువరించిన అభిప్రాయం వ్యక్తిగతమైందని పేర్కొన్నారు. ఆయన ప్రటనకతో తాను విభేదిస్తున్నానని శుక్లా చెప్పారు. తమ అసహనం పెరిగిపోతున్నా ప్రతిపక్షాలతో చర్చలు జరిపేందుకు అధికార బీజేపీ ఇష్టపడడం లేదని ఆయన విమర్శించారు. 'శటానిక్ వర్సెస్' పుస్తకంపై నిషేధించడం విధించడం తప్పేనని చిదంబరం చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ సాహిత్య కార్యక్రమంలో చిదంబరం మాట్లాడుతూ... 'సల్మాన్ రష్దీ పుస్తకంపై నిషేధం విధించడం తప్పేనని చెప్పడంలో నాకేలాంటి సంకోచం లేదు' అని వ్యాఖ్యానించారు. చిదంబరం వ్యాఖ్యలను బంగ్లాదేశ్ వివాదస్పద రచయిత్రి తస్రీమా నస్రీన్ సమర్థించారు. -
కాంగ్రెస్‌లో ముసలం
చెన్నై, సాక్షి ప్రతినిధి : తమిళనాడు కాంగ్రెస్‌లో చిదంబరం రూపంలో కొత్త ముసలం బయలుదేరింది. మాజీ కేంద్ర మంత్రి జీకే వాసన్ కొత్త పార్టీ స్థాపనతో బలహీనపడిన రాష్ట్రశాఖ, పీ చిదంబరం వేరుకుంపటితో మరో చీలిక ఏర్పడనుంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో జీకే వాసన్, పీ చిదంబరం, తంగబాలు, కృష్ణస్వామి, ఇళంగోవన్ ఇలా అనేక వర్గాలు ఉన్నాయి. ఎవరి బలాలు వారికున్నాయి. జీకేవీ అనుచురుడైన జ్ఞానదేశికన్ టీఎన్సీసీఅధ్యక్షులుగా ఉన్నపుడు మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్, సీనియర్ నేత జీకే మూపనార్ బొమ్మలను ప్రచారాల్లో వాడరాదని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఈ ఆదేశాలు కామరాజర్, మూపనార్ అభిమానుల్లో ఆగ్రహం తెప్పించారుు. ఇదే అదనుగా మూపనార్ తనయుడు జీకే వాసన్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ఏకంగా వేరే పార్టీనే పెట్టేశారు. రాష్ట్రంలోని 23 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే పార్టీలో చేరిపోయారు. జీకే వాసన్ వేరుకుంపటి కారణంగా వలసబాట పట్టిన 23 జిల్లాల్లోని అధ్యక్ష స్థానాలను తనవర్గం వారితో భర్తీ చేయాలని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్‌ను పీ చిదంబరం కోరారు. అయితే ఇందుకు ఇళంగోవన్‌తోపాటూ ఇతర వర్గ నేతలు సైతం సమ్మతించలేదు. తన మాటను కాదన్నారన్న అక్కసుతో ఇళంగోవన్‌పై అధిష్టానానికి చిదంబరం ఫిర్యాదులు చేశారు. అధిష్టానం చిదంబరం ఫిర్యాదులను లెక్కచేయకపోగా మందలించినట్లు వ్యవహరించింది. రాష్ట్రంలో కామరాజనాడార్ పాలనను తీసుకువస్తామని చేస్తున్న కాంగ్రెస్ ప్రచారాలను కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం తప్పుపట్టారు. పార్టీ సమావేశాల్లోనే విమర్శలు గుప్పించారు. ప్రజాకర్షణ కలిగిన నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మనుగడ అని వ్యాఖ్యానించారు. తన అనుచరులతో ఈనెల 22న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి రాష్ట్ర కాంగ్రెస్ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్నారు. కార్తీ వ్యాఖ్యలు, ఇళంగోవన్ షోకాజ్ నోటీసు వెనుక ఇరువర్గాల మధ్య అంతర్యుద్ధం సాగుతున్న విషయం బట్టబయలైంది. తన కుమారుడి ముసుగులో అసంతృప్తిని వెళ్లగక్కిన చిదంబరం కాంగ్రెస్ నుంచి వైదొలిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్త పార్టీ పెట్టడమా, గతంలో ఉన్న ప్రజా కమిటీని పునరుద్ధరించడమా అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. చిదంబరం కొత్త పార్టీ ఆలోచనల సమాచారం తెలిసినందునే కార్తీకి ఇళంగోవన్ షోకాజ్ నోటీసు జారీచేశారని తెలుస్తోంది. అధిష్టానానికే ఆ హక్కు: కార్తీ తాను ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నా అధిష్టానానికి మాత్రమే తాను సంజాయిషీ ఇచ్చుకుంటానని కార్తీ చిదంబరం మంగళవారం వ్యాఖ్యానించారు. పార్టీకి విరుద్ధంగా తానేదైనా తప్పు చేసి ఉంటే ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది, తనకు షోకాజ్ నోటీసు ఇచ్చే అధికారం టీఎన్‌సీసీకి లేదని ఆయన వ్యాఖ్యానించారు. చిదంబరానికి ఓట్లు పడవు : ఇళంగోవన్ కార్తీ చిదంబరం ఆశిస్తున్నట్లుగా ఆయన తండ్రి చిదంబరాన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు నుంచి కూడా ఓట్లు పడవని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ మంగళవారం ఎద్దేవా చేశారు. కామరాజనాడార్‌ను విమర్శించడమేగాక కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రిగా ఆయన పాలన ముగిసిన అనంతరం పుట్టిన కార్యకర్తలతో జీ 67 (1967) పేరుతో సమావేశం నిర్వహించడం శోచనీయమన్నారు. కామరాజర్ తరువాత సీఎం అభ్యర్థిగా ప్రకటించే స్థాయి గల నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్‌లో లేడని ఆయన వ్యాఖ్యానించారు. పీ చిదంబరం పార్టీని వీడిపోయినా నష్టం లేదన్నారు. ఆనాడు రాజాజీ వెళితేనే పార్టీకి ఏమీ కాలేదని చెప్పారు. కాంగ్రెస్‌కు అంటూ రాష్ట్రంలో కొన్ని ఓట్లు ఉన్నాయని, చిదంబరంను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పడే ఓట్లు కూడా పడవని ఎద్దేవా చేశారు. -
'కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చిదంబరం పోటీపడొచ్చు'
-
'కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చిదంబరం పోటీపడొచ్చు'
హైదరాబాద్: చిదంబరం కావాలనుకుంటే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చని అదే పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తాను మాత్రం రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతరులు అధ్యక్షుడయ్యే అవకాశముందని చిదంబరం ఇటీవల వ్యాఖ్యానించడంతో రగడ మొదలైంది. తర్వాత తన వ్యాఖ్యలపై చిదంబరం వివరణయిచ్చారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మైనారిటీ సమ్మేళనంలో దిగ్విజయ్ సింగ్ తో పాటు ఏఐసీసీ మైనారీటీ సెల్ చైర్మన్ ఖుర్షీద్ అహ్మద్, ఆర్.సి. కుంతియా పాల్గొన్నారు. -
ఈసీ పనితీరు అద్భుతం: చిదంబరం
న్యూఢిల్లీ: నైరాశ్యంతోనే వారణాసిలో బీజేపీ ఆందోళనకు దిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నారు. ఓడిపోతామన్న నైరాశ్యంతోనే ఈసీకి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళన చేపట్టిందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం బలహీనమైందన్న వాదనతో ఏకీభవించబోనని చెప్పారు. మొత్తంమీద ఎన్నికల సంఘం పనితీరు గొప్పగా ఉందని కితాబిచ్చారు. ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని చిదంబరం అన్నారు. అధిక వృద్ధితోనే పెట్టుబడుల వస్తాయన్నారు. ఆహార వస్తువుల ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరుగుతోందన్నారు. ఆర్బీఐ తదుపరి విధాన రేట్ల సమీక్షలో ద్రవ్యోల్బణం, అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ నియామకాన్ని తదుపరి ప్రభుత్వం తప్పకుండా గౌరవించాలని చిదంబరం సూచించారు. -
స్విట్జర్లాండ్‌పై భారత్ మరింత ఒత్తిడి
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆధారాలు లభించిన కొందరు భారతీయుల ఖాతాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిరాకరించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారం ఉండాలంటే పన్ను సంబంధ సమాచార మార్పిడి అత్యంత ముఖ్యమని హెచ్చరించింది. ద్వంద్వ పన్నుల నివారణ సదస్సులో అంగీకరించిన ప్రకారం స్విట్జర్లాండ్ ప్రభుత్వం తమ హక్కులు, బాధ్యతలను గుర్తించాలని స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ మేరకు స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రికి ఘాటైన లేఖ రాశారు. ఆయన ఇలా లేఖ రాయడం నాలుగునెలల్లో ఇది మూడోసారి. సమాచారాన్ని సమర్థంగా మార్పిడి చేసుకోవడానికి తగిన చట్ట, ప్రభుత్వ వ్యవస్థలు స్విట్జర్లాండ్‌కు లేకపోవడాన్ని గ్లోబల్ ఫోరమ్‌లో ప్రశ్నిస్తామని చిదంబరం పునరుద్ఘాటించారు. భారత్ విజ్ఞప్తికి తగినట్లుగా తాము సమాచారాన్ని పంచుకోలేమని స్విట్జర్లాండ్ పేర్కొనడం అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. సమాచార మార్పిడికి తాము వ్యతిరేకమంటూ స్విట్జర్లాండ్ ప్రభుత్వం గత నెల 7న చిదంబరానికి లేఖ రాసింది. దీంతో భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్‌పై ఒత్తిడి మరింత పెంచుతోంది. స్విట్జర్లాండ్‌లోని హెచ్ఎస్బీసీ బ్యాంకు శాఖల్లో అకౌంట్లున్న కొందరు భారతీయుల జాబితాను ఫ్రాన్స్ ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం గతంలో భారత్‌కు అందించింది. వీరి ఖాతాల సమాచారాన్ని ఇండియా కోరగా, స్విస్ నిరాకరించింది. ఇండియన్ బ్యాంక్ ఎఫ్సీఎన్ఆర్ వడ్డీరేట్ల తగ్గింపు చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంకింగ్)కు సంబంధించి టర్మ్ డిపాజిట్ వడ్డీరేట్లను స్వల్పంగా తగ్గించింది. తక్షణం ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. అమెరికా డాలర్ డిపాజిట్లకు సంబంధించి యేడాది ఆపైన రెండేళ్ల వరకూ రేటు ప్రస్తుత 2.56 శాతం నుంచి 2.55 శాతానికి, 2-3 యేళ్లకాల వ్యవధి డిపాజిట్ రేటు 2.59 శాతం నుంచి 2.56 శాతానికి, 3-4 యేళ్ల వ్యవధి డిపాజిట్లపై రేటు 4.05 శాతం నుంచి 4.02 శాతానికి, 4-5 సంవత్సరాల మధ్య డిపాజిట్ రేటు 4.48 శాతం నుంచి 4.45 శాతానికి, ఐదేళ్లు పైబడిన డిపాజిట్లపై రేటు 4.85 శాతం నుంచి 4.81 శాతానికి తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. -
రైతుల రుణమాఫీ హామీ తెలంగాణ, సీమాంధ్రకే పరిమితం
-
రైతుల రుణమాఫీ హామీ తెలంగాణ, సీమాంధ్రకే పరిమితం
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: రైతుల రుణాలమాఫీ హామీ కేవలం తెలంగాణ, సీమాంధ్రకే పరిమితమని కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం పేర్కొన్నారు. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో తమ పార్టీ రుణమాఫీ హామీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చలేదన్నారు. ఏఐసీసీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటు తెలంగాణ పునర్నిర్మాణానికి, అటు సీమాంధ్ర అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులోనే స్పష్టంగా చెప్పామన్నారు. దాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోగానే భావించాలన్నారు. భారత్ వెలిగిపోతోందంటూ 2004లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 2003-04 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే యూపీఏ హయాంలోనే వృద్ధిరేటు మెరుగ్గా ఉందన్నారు. 2000-01, 2002-03 ఆర్థిక సంవత్సరాలు ఆర్థిక సరళీకరణ చరిత్రలోనే అత్యంత గడ్డురోజులుగా ఆయన పేర్కొన్నారు. ఫలితంగా అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఆర్థికమంత్రిని మర్చాల్సి వచ్చిందన్నారు. యూపీఏ తిరిగి అధికారంలోకి వస్తుందనే విశ్వాసం ఉందా? అన్న ప్రశ్నకు.. ‘యూపీఏ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసింది. తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ కొన్ని వర్గాలు మార్పును కోరుకుంటున్నాయి’ అని బదులిచ్చారు. -
మా విధానాలతోనే మార్కెట్ పరుగు
న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానాలతో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతపై ఇన్వెస్టర్లకు నమ్మకం పెరుగుతుండటమే స్టాక్ మార్కెట్ల పరుగుకు కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పారు. ఈ ఘనతను బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి కట్టబెట్టడం సరికాదన్నారు. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దేశ ఎకానమీ రానున్న రోజుల్లో మరింత పటిష్టంగా మారుతుందని శనివారం మీడియా సమావేశంలో చిదంబరం పేర్కొన్నారు. ఇప్పటికే ద్రవ్య లోటును గణనీయంగా కట్టడి చేయగలిగామని, పరోక్ష పన్నుల వసూళ్లలో రూ. 17,000 కోట్లు తగ్గినప్పటికీ.. మొత్తం మీద పన్ను వసూళ్లు అంచనాలకు దరిదాపుల్లోనే ఉన్నాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కరెంటు అకౌంటు లోటు 88 బిలియన్ డాలర్ల నుంచి 32 బిలియన్ డాలర్లకు తగ్గిందని చెప్పారు. మరోవైపు, స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనానికి సంబంధించిన అకౌంట్ల వివరాలను ఇచ్చిపుచ్చుకునే విషయంపై భారత్, స్విట్జర్లాండ్ చర్చలు జరుపుతున్నాయని ఆయన వివరించారు. -
ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పటిష్టం
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ 20 నెలల క్రితంతో పోల్చితే ప్రస్తుతం పటిష్టంగా ఉందని ఆర్థికమంత్రి పి.చిదంబరం పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశం పలు ఆర్థిక అంశాల్లో పురోగతి సాధించిందన్నారు. ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్య అంశాలను పరిశీలిస్తే... గడచిన ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్- క్యాపిటల్ ఫ్లోస్ అంటే ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీల మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య ఉన్న వ్యత్యాసం) 88 బిలియన్ డాలర్లు. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 4.5% పైబడి ,ఇది తీవ్ర ఆందోళన సృష్టించింది. 2013-14లో ఇది 35 బిలియన్ డాలర్ల స్థాయికి తగ్గింది. జీడీపీలో 3%కన్నా ఎగువకు పెరిగే అవకాశం లేదు. ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయం-వ్యయానికి మధ్య ఉన్న వ్యత్యాసం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీలో 4.8%గా ఉంటుందని భావించినప్పటికీ, ప్రస్తుతం 4.6% వద్ద కట్టడి చేసే పరిస్థితి ఉంది. యూపీఏ ప్రభుత్వ పాలసీ సానుకూలతే స్టాక్ మార్కెట్ల ర్యాలీకి కారణం. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న అంచనాలే ఈ ర్యాలీకి కారణమని భావించడం ఎంతమాత్రం తగదు. బంగారంపై నియంత్రణలు సడలించే యోచన బంగారం దిగుమతులపై నియంత్రణలు సడలించే ఆలోచన వుంది. ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష తర్వాత ఈ అంశంపై ఒక నిర్ణయం తీసుకుంటాం. గ్యాస్‌పై ఈసీకి నివేదించకుండా ఉండాల్సింది గ్యాస్ ధర రెట్టింపునకు సంబంధించిన క్యాబినెట్ నిర్ణయాన్ని పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వశాఖ ఎన్నికల సంఘానికి(ఈసీ) నివేదించకుండా ఉండాల్సింది. చాలా ఆలోచించి ఎన్నికల నోటిషికేషన్‌కు 3 నెలల క్రితమే క్యాబినెట్ దీనిపై నిర్ణయం తీసుకుంది. పెట్రోలియం శాఖ అతిజాగ్రత్తకు పోయి ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘానికి నివేదించిందని వ్యక్తిగతంగా భావిస్తున్నా. అసలు ఇలాంటి అవసరమేలేదు. (రిలయన్స్ వంటి కంపెనీలు ఉత్పత్తి చేసిన ఇంధన ధరల రెట్టింపు నోటిఫై చేయడాన్ని ఎన్నికల దృష్ట్యా వాయిదా వేయాలని ఈసీ యూపీఏ ప్రభుత్వానికి సూచించిన సంగతి తెలిసిందే.) బ్యాంక్ లెసైన్సులపై కూడా ఇదే తీరు... బ్యాంక్ లెసైన్సుల జారీ అంశం ఎన్నికల సంఘానికి నివేదించడం సైతం అతి జాగ్రత్తతో కూడినదే. నేనే కాదు... ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ కూడా ఇదే విధమైన అభిప్రాయంతో ఉన్నారు. రెండున్నర సంవత్సరాల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో అసలు ప్రభుత్వ పాత్రే ఉండదు. -
మరిన్ని బ్యాంకులకు పసిడి దిగుమతి చాన్స్
న్యూఢిల్లీ: పసిడి దిగుమతులకు మరిన్ని బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతి ఇచ్చింది. వీటిలో యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్‌బ్యాంక్‌లు ఉన్నాయి. ఈ దిగుమతుల ప్రక్రియలో 80:20 పథకం వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది. ఆగస్టు 14వ తేదీన ప్రవేశపెట్టిన 80:20 పథకం బంగారం నామినేటెడ్ ఏజెన్సీలకు వర్తిస్తుంది. దీని ప్రకారం దిగుమతిచేసుకున్న పసిడిలో 20 శాతం తప్పనిసరిగా ఎగుమతి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని దేశీయ అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఎగుమతి షరతును అమలుచేస్తేనే తదుపరి పసిడి దిగుమతులకు వీలవుతుంది. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) కట్టడిలో భాగంగా ఈ నిబంధనసహా, పసిడిపై దిగుమతి సుంకాన్ని 10 శాతం వరకూ, ఆభరణాల దిగుమతుల విషయంలో 15 శాతం వరకూ పెంచుతూ కేంద్రం గతంలో చర్యలు తీసుకుంది. ప్రస్తుతం కేవలం 6 బ్యాంకులు, మూడు ఆర్థిక సంస్థలకు 80:20 పథకం కింద బంగారం దిగుమతులు చేసుకుంటున్నాయి. కన్సైన్మెంట్ ప్రాతిపదికన 21 బ్యాంకులకు బంగారం, వెండి దిగుమతులకు ఆర్బీఐ అనుమతి ఉంది. బంగారం ఆభరణాల ఎగుమతిదారుల వాస్తవ అవసరాలను నెరవేర్చడానికి బులియన్ దిగుమతులకు కన్సైన్మెంట్ ప్రాతిపదిక వెసులుబాటు కల్పిస్తుంది. ప్రభుత్వ ఆంక్షలు బంగారం దిగుమతులు గణనీయంగా పడిపోయి, క్యాడ్ కట్టడికి దోహదపడ్డాయి. అయితే దేశీయంగా పరిశ్రమ దెబ్బతింటున్న నేపథ్యంలో ఈ ఆంక్షలను ఎత్తివేయాలని ఇటీవల కేంద్రంపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. పరిస్థితిని సమీక్షించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆర్థికమంత్రి పీ చిదంబరం ఇటీవల చేసిన ప్రకటన నేపథ్యంలో ఆర్బీఐ నుంచి తాజా అనుమతులు వచ్చాయి. -
ప్రభుత్వ రంగ బ్యాంకులకు అతిపెద్ద సవాలు మొండిబకాయిలు రికవరీ
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మొండిబకాయిలు(ఎన్పీఏలు) అంతకంతకూ ఎగబాకడం పట్ల ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎన్పీఏలే అతిపెద్ద సవాలుగా నిలుస్తున్నాయని చెప్పారు. వీటిని రికవరీ చేసుకునేందుకు మరింత దృష్టిపెట్టాలని, తగు చర్యలు చేపట్టాలని బ్యాంకులకు సూచించారు. బుధవారం ఇక్కడ పీఎస్‌యూ బ్యాంకులు, ఆర్థిక సంస్థల అధిపతులతో సమావేశం అనంతరం చిదంబరం విలేకరులతో మాట్లాడారు. ఈ భేటీలో వాటి త్రైమాసిక ఆర్థిక పనితీరును సమీక్షించారు. మధ్యస్థాయి పరిశ్రమలకు రుణ వితరణ తగ్గిందని, ఇదే సమయంలో వ్యవసాయ రంగానికి మాత్రం సంతృప్తికరంగానే ఉందని విత్తమంత్రి చెప్పారు. బ్యాంకు చీఫ్‌లతో సమావేశంలో ఎక్కువగా మొండిబకాయిలు, వీటి రికవరీ కోసం చేపట్టాల్సిన చర్యలపైనే చర్చజరిగినట్లు ఆయన వెల్లడించారు. ‘రియల్టీలో మొండిబకాయిలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ... బడా కార్పొరేట్ రంగాలు, చిన్న పరిశ్రమల్లో ఇవి భారీగా పేరుకుపోతున్నాయి. అయితే, 2013-14 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో పీఎస్‌యూ బ్యాంకులు రూ.18,933 కోట్ల బకాయిలను వసూలు చేయగలిగాయి. అదేవిధంగా ప్రతి బ్యాంక్ కూడా టాప్-30 ఎన్పీఏ ఖాతాలపై ప్రత్యేక పర్యవేక్షణను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నాయి’ అని చిదంబరం వెల్లడించారు. గతేడాది మార్చి చివరి నాటికి పీఎస్‌యూ బ్యాంకుల స్థూల ఎన్పీఏలు రూ. 1.83 లక్షల కోట్లు కాగా... సెప్టెంబర్ నాటికి ఇవి రూ.2.36 లక్షల కోట్లకు ఎగబాకడం గమనార్హం. అంటే ఏకంగా 28.5 శాతం పెరిగిపోయాయి. యునెటైడ్ బ్యాంక్ ఎన్పీఏల వివాదంపై... ప్రభుత్వ రంగ యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎన్పీఏల సంక్షోభానికి సంబంధించిన అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో ఈ నెల 7న ప్రత్యేకంగా చర్చించనున్నామని చిదంబరం చెప్పారు. ఇది మరీ అంత ఆందోళనకరమైన అంశమేమీ కాదని, రాజన్‌తో భేటీ అనంతరం సమస్య సద్దుమణగనుందని చెప్పారు. మొండిబకాయిలు, రుణ పునర్వ్యవస్థీకరణ గణాంకాల వెల్లడి విషయంలో వైఫల్యానికి గాను యునెటైడ్ బ్యాంక్‌పై అంతర్గత విచారణతో పాటు ఆర్బీఐ కూడా ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో బ్యాంక్ చైర్పర్సన్ అర్చనా భార్గవ స్వచ్ఛంద పదవీ విరమణతో వైదొలగడం కూడా జరిగింది. గతేడాది మార్చి క్వార్టర్లో రూ. 2,964 కోట్లుగా ఉన్న యునెటైడ్ బ్యాంక్ స్థూల ఎన్పీఏలు డిసెంబర్ త్రైమాసికం నాటికి ఏకంగా రూ. 8,546 కోట్లకు ఎగబాకడం తెలిసిందే. అంతేకాకుండా ఈ క్వార్టర్లో రూ. 1,238 కోట్ల భారీ నికర నష్టాన్ని కూడా ప్రకటించింది. పసిడిపై నియంత్రణలను సమీక్షిస్తాం... బంగారం దిగుమతులపై నియంత్రణలను తొలగించాలంటూ ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రభుత్వం దీనిపై దృష్టిసారిస్తోంది. ఈ ఏడాది(2013-14) కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) గణాంకాలను పరిశీలించిన తర్వాత తప్పకుండా దిగుమతి సుంకాలను సమీక్షిస్తామని ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. గతేడాది క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(జీడీపీలో 4.8 శాతం-88.2 బిలియన్ డాలర్లు) ఎగబాకడంతో దీని అడ్డుకట్టకోసం దిగుమతులకు కళ్లెం వేసే పలు చర్యలు ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధానంగా బంగారంపై దిగుమతి సుంకాన్ని దశలవారీగా 10 శాతానికి చేర్చారు. దీని ప్రభావంతో పసిడి దిగుమతులు భారీగా తగ్గడంతోపాటు క్యాడ్ కూడా దిగొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్-డిసెంబర్ తొమ్మిది నెలల కాలంలో ఏకంగా జీడీపీలో 2.3 శాతానికి(31.1 బిలియన్ డాలర్లు) తగ్గింది. అక్టోబర్ త్రైమాసికంలో అయితే కేవలం 0.9 శాతం(4.2 బిలియన్ డాలర్లు) మాత్రమే నమోదైంది. ఇక బంగారం దిగుమతుల విషయానికొస్తే.. గతేడాది మే నెలలో 162 టన్నుల గరిష్టస్థాయి నుంచి నవంబర్‌లో 19.3 టన్నులకు పడిపోయాయి. కాగా, పసిడి దిగుమతులపై కఠిన నియంత్రణల కారణంగా స్మగ్లింగ్ పెరిగేందుకు దారితీస్తోందని, ఈ నియంత్రణలను సడలించాల్సిన అవసరం ఉందని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ కూడా తాజాగా వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఎయిర్ ఇండియాకు 5,500 కోట్లు
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడి కింద రూ.5,500 కోట్లను ఎయిర్ ఇండియా పొందనుంది. ఆర్థిక మంత్రి పి.చిదంబరం సోమవారం పార్లమెంటుకు సమర్పించిన మధ్యంతర బడ్జెట్లో ఈ విషయం వెల్లడించారు. దీంతో పౌర విమానయాన శాఖ ప్రణాళిక కేటాయింపులు రూ.5,720 కోట్లకు చేరాయి. ప్రణాళికేతర వ్యయం రూ.657.98 కోట్లుగా అంచనా. - ఏడు కొత్త విమానాశ్రయాలు నిర్మాణంలో ఉన్నట్టు చిదంబరం చెప్పారు. - ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఎఐ)కు బడ్జెటరీ మద్దతు కింద రూ.74.7 కోట్లు కేటాయించారు. ఇందులో సిక్కింలోని పాక్యోంగ్ పర్వత ప్రాంతంలో రూ.22 కోట్లతో నిర్మిస్తున్న కొత్త విమానాశ్రయం కూడా ఉంది. - శిక్షణ ప్రాజెక్టులు, ఐటీ, ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టులతోసహా పలు పథకాలను కొనసాగించేందుకు వీలుగా డెరైక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు రూ.50 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. డీజీసీఏ భవన్ నిర్మాణం, సంయుక్త శిక్షణ అకాడెమీ నిర్మాణం కూడా ఇందులో ఉన్నాయి. - బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కోసం రూ.40 కోట్ల నిధుల కేటాయింపు. - సోనియాగాంధీ నియోజకవర్గమైన రాయబరేలిలోని ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ కోసం రూ.5.10 కోట్లు కేటాయింపు. సీబీఐకి రూ.520 కోట్లు మధ్యంతర బడ్జెట్లో సీబీఐకి ప్రభుత్వం రూ. 520.56కోట్లు కేటాయించింది. ఇది గత ఆర్థికసంవత్సరంతో పోల్చుకుంటే 17 శాతం అధికం. 2013-14 బడ్జెట్లో రూ.443 కోట్లు కేటాయించగా ఈ సారి రూ.520 కోట్లకు పెంచారు. ఈ-గవర్నెన్స్, శిక్షణ కేంద్రాల ఆధునీకరణ, సాంకేతిక, ఫోరెన్సిక్ విభాగాలను పటిష్టం చేసేందుకు సీబీఐ ఈ నిధులను వినియోగించనుంది. -
లెక్కలతో మోసం చేశారు... : డీఏ సోమయాజులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉందని, ఆయన తన లెక్కలతో పార్లమెంటును మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డీఏ సోమయాజులు విమర్శించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ 2013-14 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 4.8 అంచనా వేయగా అది 4.6 శాతానికి తగ్గించినట్లు గొప్పగా టీవీ చానళ్లన్నింటిలో చెప్పుకుంటున్నారని వాస్తవానికి ఈ లోటు తొలి 8 నెలల్లోనే (ఏప్రిల్ నుంచి నవంబర్-2013 వరకు) 5 శాతంగా ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక నివేదికలో వెల్లడించిన అధికార డాక్యుమెంటులోనే ఉందన్నారు. పదేళ్లపాటు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఈ విధంగా ప్రజలను ఎలా తప్పు పట్టించారని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సవరించిన అంచనాల ప్రకారం 2013-14 ఆర్థిక సంవత్సరానికి రూ.105 లక్షల కోట్ల మేరకు జీడీపీ ఉంటే తొలి 8 నెలల్లోనే 59,557 కోట్ల మేరకు ద్రవ్యలోటు ఉందన్నారు. దీని ప్రకారమే 5 శాతం ద్రవ్యలోటు ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఇంకా మిగిలి ఉన్న నాలుగు నెలల ఆర్థిక సంవత్సరానికి కనీసం ఎంత లేదన్నా మరో రెండున్నర శాతం అదనంగా అంటే కనీసం 7 నుంచి 7.5 శాతం వరకూ ఉంటుందని వివరించారు. నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో జీడీపీ పెరిగే అవకాశం లేదని అందుకు కారణం యూపీఏ ప్రభుత్వ నిర్ణయ కార్యశూన్యతే కారణమని వ్యాఖ్యానించారు. నిర్ణయాలు తీసుకోకుంటే జీడీపీ పెరగదని, అది పెరగకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయన్నారు. ద్రవ్యలోటు రెవెన్యూలోటు కూడా పెరుగుతాయన్నారు. గత ఏడాదితో పోలిస్తే పారిశ్రామికాభివద్ధి సూచీ మైనస్ ఒక్క శాతంగా ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో 1.5 నుంచి 2 శాతం మేరకు మాత్రమే వృద్ధిరేటు ఉందనేది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. 80 శాతం మంది ఆధారపడి ఉన్న పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లోనే వృద్ధిరేటు ఇంత అధ్వానంగా ఉందన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎలాగూ వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి పంపేస్తారన్నారు. సీబీఐ కేసులు పెడుతుందని, కాగ్ ప్రశ్నిస్తుందనే భయంతో గత మూడేళ్లుగా ప్రధాని మన్మోహన్సింగ్ ప్రభుత్వం అభివృద్ధికి పనికి వచ్చే ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. -
పద్దు కాదు.. ప్రోగ్రెస్ రిపోర్ట్
పద్దు కాదు.. ప్రోగ్రెస్ రిపోర్ట్ చిదంబరం ‘ఓటాన్ అకౌంట్’లో ‘గత ఘనత’ల ఏకరువు 2014-15 ఏడాదికి రూ. 17,63,214 కోట్లతో మధ్యంతర బడ్జెట్ విశేషాలు లేకుండా సాదాసీదాగా రూపకల్పన ఎకై్సజ్ సుంకాల తగ్గింపు.. తగ్గనున్న కార్లు, బైక్‌ల ధరలు.. టీవీలు, ఫ్రిజ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్ పరికరాల రేట్లు కూడా.. చవక మొబైల్ ఫోన్లు కాస్త ప్రియం.. ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహం పన్ను చట్టాల్లో ఎలాంటి మార్పులు లేవు యథాతథంగా ప్రత్యక్ష పన్నురేటు సైన్యంలో ‘ఒకే హోదాకు ఒకే పింఛను’కు ఓకే వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ పథకం కొనసాగింపు 2009 ఏప్రిల్ ముందు నాటి విద్యా రుణాలపై వడ్డీ మీద మారటోరియం 9 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం ఎన్నికల వేళ సొంత డబ్బా కొట్టుకోవటంతో పాటు.. ఇటు మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునేందుకు.. అటు తయారీ రంగానికీ కొంత ఊతమిచ్చేందుకు కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం తన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రయత్నించారు. ఇందులో భాగంగా వాహనాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాల ధరలను కొంతమేర తగ్గించే చర్యలతో పాటు.. కొన్ని సబ్సిడీలను, సంక్షేమ పథకాలకు కేటాయింపులను స్వల్పంగా పెంచారు. కార్పొ రేట్లు, సంపన్నులపై అధిక సర్‌చార్జ్ కొనసాగించటం మినహా.. ఇతరత్రా పన్నుల జోలికి పెద్దగా పోకుండా జాగ్రత్తపడ్డారు. పనిలో పనిగా తమ యూపీఏ ప్రభుత్వం గత పదేళ్లలో సాధించిన ఘనతలను ఏకరువు పెట్టడానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నారు. ఎప్పట్లాగానే చిదంబరం బడ్జెట్ చాలా సమతూకంగా, వాస్తవికతకు అద్దం పట్టేలా ఉందని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కితాబు ఇవ్వగా.. ఆర్థిక వృద్ధి మెరుగుపడితే తప్ప ఇందులో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించటం సాధ్యంకాదని ఆర్థికవేత్తలు వ్యాఖ్యానించారు. పాత విషయాలన్నీ ఏకరువు పెట్టడం తప్ప ఇందులో కొత్త విశేషాలేమీ లేవంటూ విపక్షాలు పెదవి విరిచాయి. చిదంబరం సోమవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ను పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. స్టాక్ మార్కెట్ స్వల్పంగా అర శాతం మేర పెరిగింది. న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు అత్యంత సమీపంలోకి వచ్చిన తరుణంలో.. పెద్దగా విన్యాసాల జోలికి పోకుండా కొన్ని జనాకర్షక చర్యలతో పాటు పరిశ్రమకు తోడ్పడేలా 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం. వార్షిక వ్యయం రూ.17,63,214 కోట్ల అంచనాతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో.. అంతా ఊహించినట్లే విధానపరంగా కీలకమైన నిర్ణయాలేమీ లేవు. అయితే.. పదేళ్ల యూపీఏ పాలనలో చివరి బడ్జెట్ కావటంతో.. యూపీఏ పాలన ప్రోగ్రెస్ రిపోర్టును తలపింపజేసేలా సాధించిన విజయాల చిట్టా చదివారు. సంక్షేమ పథకాలకు మరిన్ని నిధుల కేటాయింపులతో ఎస్సీలు, మైనారిటీలు, మహిళలు, రైతులు, సైనిక సిబ్బందిని ఆకట్టుకునేందుకూ ప్రయత్నం చేశారు. ఇక కార్లు, ద్విచక్ర వాహనాలు, యంత్ర పరికరాలు, ఫ్రిజ్‌లు, ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్లు వంటి వినియోగ వస్తువుల ఎకై్సజ్ సుంకాలను తగ్గించారు. తద్వారా ఆయా వస్తువుల ధరలు కొంతమేర తగ్గనుండటంతో.. మధ్యతరగతి వర్గం మెప్పుపొందటంతో పాటు.. పరిశ్రమలకూ ప్రోత్సాహాన్నందించేదుకు యత్నించారు. దీనికి అనుగుణంగా కార్ల తయారీ దిగ్గజం ఆడి సంస్థ.. తమ కార్ల రేట్లు తగ్గిస్తున్నట్లు తక్షణమే ప్రకటించగా.. టాటా మోటార్స్, జనరల్ మోటార్స్ సైతం అదే బాటలో ఉన్నట్లు తెలిపాయి. మరోవైపు.. మధ్యంతర బడ్జెట్ (ఓటాన్ అకౌంట్) కావటం వల్ల పన్నుల విధానాల్లో భారీ మార్పులు చేసేందుకు ఆస్కారం లేకపోవటంతో చిదంబరం వాటి జోలికి వెళ్లలేదు. ప్రత్యక్ష పన్నుల రేట్లను యధాతథంగా ఉంచారు. ‘‘సంప్రదాయానికి అనుగుణంగా నేను పన్ను చట్టాల్లో ఎలాంటి మార్పులు చేయటం లేదు’’ అని ఆయన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. పరోక్ష పన్నులపరమైన మినహాయింపుల (ఎకై్సజ్ సుంకాల తగ్గిం పు) కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 40 రోజుల్లో సుమారు రూ. 300-400 కోట్ల ఆదాయానికి గండి పడగలదని బడ్జెట్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ఈ మినహాయింపులు జూన్ 30 దాకా వర్తిస్తాయని.. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక వీటిని సమీక్షించే అవకాశం ఉందని చెప్పారు. మాజీ సైనికోద్యోగులకు ఊరట: చిరకాలంగా మాజీ సైనికోద్యోగులు కోరుతున్నట్లుగా.. ఒక హోదాలో ఉన్నవారందరికీ ఒకే మొత్తం పింఛను వర్తింపచేసే అంశాన్ని సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చిదంబరం తెలిపారు. ఇందుకోసం రూ. 500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మరిన్ని జనాకర్షక చర్యల్లో భాగంగా వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అలాగే, 2009 మార్చి 31కి ముందు తీసుకున్న విద్యా రుణాల మీద వడ్డీపై మారటోరియం విధించారు. ఈ నిర్ణయం వల్ల దాదాపు 9 లక్షల మంది విద్యార్థులకు సుమారు రూ.2,600 కోట్ల మేర లబ్ధి చేకూర్చనుంది. కార్లపై సుంకాలు తగ్గింపు: మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకోవటంతో పాటు.. అమ్మకాలు పడిపోయి కుదేలవుతున్న ఆటోమొబైల్ రంగానికి తోడ్పాటు ఇచ్చేలా చిదంబరం మరికొన్ని చర్యలు ప్రకటించారు. చిన్న కార్లు, ద్విచక్ర వాహనాలు, స్కూటర్లు, వాణిజ్య వాహనాలపై ఎకై్సజ్ సుంకాలను 12 శాతం నుంచి 8 శాతానికి త గ్గించారు. అలాగే, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల (ఎస్యూవీ) పైనా ఎకై్సజ్ సుంకాన్ని ఆరు శాతం మేర తగ్గించారు. దీంతో ఇది 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గింది. భారీ, మధ్య స్థాయి కార్లపై ఇప్పటిదాకా ఎకై్సజ్ సుంకం 24/20 శాతంగా ఉండగా దీన్ని 27/24 శాతానికి తగ్గించారు. చాసిస్ తదితరాలపైనా సముచిత స్థాయిలో సుంకాలు తగ్గుతాయని చిదంబరం పేర్కొన్నారు. యంత్రా లు, యంత్ర పరికరాల ఉత్పత్తికీ ఊతమిచ్చేలా.. ఎకై్సజ్ సుంకాన్ని 12 నుంచి 10 శాతానికి తగ్గించారు. దేశీయంగా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీని ప్రోత్సహించే దిశగా అన్ని రకాల మొబైల్స్‌పై ఎకై్సజ్ సుంకాన్ని ఆరు శాతంగా క్రమబద్ధీకరించారు. ఫలితంగా రూ. 2,000 కన్నా ఎక్కువ ధర పలికే హ్యాండ్సెట్ల రేట్లు యథాతథంగా ఉన్నా.. అంతకన్నా తక్కువగా ఉండే వాటి రేట్లు మాత్రం పెరిగే అవకాశముంది. సబ్బులు, రసాయనాల్లో ఉపయోగించే నూనెలపై కస్టమ్స్ సుంకాన్ని 7.5 శాతానికి పరిమితం చేశారు. అందర్నీ మెప్పించాలని కాదు: ‘ఎన్నికల్లో ఓటర్లకు గాలమేసేందుకే జనాకర్షక చర్యలను ప్రకటించారా?’ అన్న ప్రశ్నకు చిదంబరం స్పందిస్తూ .. ‘‘అందర్నీ మెప్పించడం నా అభిమతం కాదు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒడిదుడుకుల గుండా సాగుతోందని ప్రజలకు నేరుగా తెలియజేయాలన్నదే నా ఉద్దేశం’’ అని బదులిచ్చారు. సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టేలోగా ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉండటంతోనే పరిశ్రమలకు ఎకై్సజ్ సుంకాలపరంగా వెసులుబాటు కల్పించాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. ముఖ్యంగా తయారీ రంగానికి తక్షణమే తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని చిదంబరం చె ప్పారు. ‘‘ఇప్పుడు ఎవరూ డౌన్గ్రేడ్ల గురించి మాట్లాడటం లేదు. విధాన జడత్వం అంటూ ఏమీ లేదు.. రెండేళ్ల కిందటి కంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి పరంగా మన దేశం ప్రపంచంలోనే 11వ అతిపెద్ద దేశం. ఇది ఎంత మందికి తెలుసు. ఇలాంటి మరెన్నో గొప్ప పరిణామాలు రానున్న రోజుల్లో జరగనున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు నిర్దేశిత లక్ష్యానికన్నా తక్కువగానే ఉండగలదని చిదంబరం చెప్పారు. 4.8 శాతాన్ని దాటనివ్వకూడదని నిర్దేశించుకోగా.. అంతకన్నా తక్కువగా 4.6 శాతంగా ఉండ గలదన్నారు. ఈసారి వృద్ధి రేటు అంతంత మాత్రంగానే ఉన్నా.. ఆర్థికవ్యవస్థ కోలుకుంటున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6 శాతం పైగా వృద్ధి సాధించగలమని ధీమా వ్యక్తంచేశారు. -
ఇక బ్యాంకుల నిరవధిక సమ్మె !
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే నెలలో నిరవధిక సమ్మె చేయడానికి ప్రభుత్వరంగ బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. వేతనాలు పెంచాలనే డిమాండ్‌తో పాటు బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను వ్యతిరేకిస్తూ బ్యాంకు యూనియన్లు రెండు రోజుల సమ్మెకు పిలుపునివ్వటం... సోమవారం నుంచి రెండురోజుల సమ్మె మొదలు కావటం తెలిసిందే. ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలూ రాలేదు సరికదా... బ్యాంకుల లాభాలు ఉద్యోగుల జీతాలు పెంచడానికి కాదని, వీటిని వేరే కార్యక్రమాలకు ఉపయోగించుకుంటామని ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు యూనియన్లను మరింత ఎగదోశాయి. దీంతో వచ్చే నెలలో నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంపాయీస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) పేర్కొంది. ‘చివరిసారిగా మరోసారి ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కలుస్తాం. అప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోతే నిరవధిక సమ్మెకు దిగుతాం’ అని ఏఐబీఈఏ సంయుక్త కార్యదర్శి బి.ఎస్.రాంబాబు ‘సాక్షి’తో చెప్పారు. తదుపరి కార్యాచరణ కోసం ఈనెల 13న సమావేశమవుతామని, ఆ తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఐదేళ్లకోసారి చేసే జీతాల సవరణకు రూ.3,000 కోట్లు అవుతుందని, దానికి ఒప్పుకోకుండా కార్పొరేట్ సంస్థలు చెల్లించకుండా ఎగ్గొట్టిన రుణాలకు లక్షల కోట్లు కేటాయించడం దారుణమన్నారు. గత ఐదేళ్ళలో కార్పొరేట్ సంస్థలకు మాఫీ చేసిన రుణాల విలువ 5 లక్షల కోట్లపైనే ఉందని.. న్యాయ సమ్మతంగా పెంచాల్సిన జీతాలకు మాత్రం డబ్బులు లేవనడం సమంజసం కాదంటూ ఆంధ్రాబ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ ప్రధానకార్యదర్శి ఐ.హరినాథ్ వాపోయారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని ప్రభుత్వ బ్యాంకులు కలిసి రూ.1.25 లక్షల కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జిస్తే, నికరలాభం రూ.42,000 కోట్లు మాత్రమేనని, మిగిలిన లాభాలన్నీ మొండి బకాయిల ప్రొవిజనింగ్‌కు కేటాయించడం జరిగిందన్నారు. ఈ ఆర్థిక సం వత్సరం 9 నెలల్లో ఆంధ్రాబ్యాంక్‌కు రూ.1,911 కోట్ల స్థూల లాభం వస్తే.. డెక్కన్‌క్రానికల్, ఎంబీఎస్ జ్యూవెలర్స్ వంటి సంస్థల మొండి బకాయిలకు ప్రొవిజనింగ్ కేటాయింపుల వల్ల నికరలాభం రూ.348 కోట్లకు పడిపోయిందని వివరించారు. ఆగిపోయిన లావాదేవీలు రూ.1.68 లక్షల కోట్లు ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన రెండు రోజుల సమ్మె కారణంగా సోమవారం దేశవ్యాప్తంగా రూ.1.68 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు స్తంభించిపోయాయి. రాష్ట్రంలో కూడా ప్రభుత్వరంగ బ్యాంకింగ్ కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోయాయి. సుమారు 4,500 శాఖల్లో ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు. పలు గ్రామాల్లో నగదు లేక ఏటీఎంలు పనిచేయలేదు. దేశవ్యాప్తంగా 8 లక్షలమంది, రాష్ర్టంలో 75,000 మంది ఆఫీసర్లు సమ్మెలో పాల్గొన్నట్లు రాంబాబు తెలిపారు. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగస్తులు సమ్మెలో పాల్గొన్నట్లు హరినాథ్ చెప్పారు. మంగళవారం కూడా సమ్మె యథాతథంగా కొనసాగుతుందని బ్యాంకు యూనియన్లు పేర్కొన్నాయి. లాభాలన్నీజీతాల పెంపునకే కాదు: చిదంబరం జీతాల సవరణ కోసం బ్యాంకు ఉద్యోగుల రెండు రోజుల సమ్మె చేస్తున్న సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. బ్యాంకులు ఆర్జిస్తున్న లాభాలను పూర్తిగా జీతాల పెంపునకే కేటాయించలేమని, వాటికి ఇతర అవసరాలు కూడా ఉంటాయని చెప్పారు. బ్యాంకుల ఆదాయం, లాభాలను జీతాల పెంపునకు కేటాయించాలేమన్న విషయాన్ని బ్యాంకు ఉద్యోగులు, ఆఫీసర్లు దృష్టిలో పెట్టుకోవాలని వ్యాఖ్యానించారాయన. బ్యాంకుల లాభాలను వాటాదారులకు డివిడెండ్లు, వ్యాపార విస్తరణకు అవసరమైన మూలధన అవసరాలను సమకూర్చుకోవడం వంటి అంశాలకు కేటాయించాల్సి ఉంటుందన్నారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 78వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
9 శాతం వృద్ధి సాధన సత్తా ఉంది
న్యూఢిల్లీ: భారత్‌కు 9 శాతం వృద్ధి రేటు సాధనా సామర్థ్యం ఉందని ఆర్థికమంత్రి పీ చిదంబరం బుధవారం పేర్కొన్నారు. రానున్న 10 నుంచి 30 యేళ్లలో వార్షికంగా భారత్ 8 నుంచి 9 శ్రేణిలో వృద్ధి సాధించగలదని ఆర్థికమంత్రి అన్నారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి చిదంబరం ప్రసంగిస్తూ, వృద్ధికి దోహదపడే కొన్ని విశిష్ట లక్షణాలు భారత్ సొంతమన్నారు. దేశంలో 83 కోట్ల మంది అంటే మొత్తం జనాభాలో దాదాపు 68 శాతం మంది 35 సంవత్సరాలలోపువారేనని వివరించారు. పలు ఖనిజ నిక్షేపాలు, సుదీర్ఘ సముద్రతీరం, భారీ పంట దిగుబడులకు వీలయ్యే భూమి వంటి అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీటన్నింటినీ వినియోగించుకుని భారత్‌కు వచ్చే 10,20,30 యేళ్లలో వార్షికంగా 8-9 శాతం శ్రేణి వృద్ధిని సాధించే సత్తా ఉందని అన్నారు. మనల్ని మనమే మోసగించుకుంటున్నాం... పన్ను సంస్కరణల అమలుపై ఆయన మాట్లాడుతూ, రూ.కోటి వార్షిక ఆదాయం ఉన్నదని అంగీకరిస్తున్నవారు దేశంలో కేవలం 42,800 మంది మాత్రమే ఉన్నారని అన్నారు. ‘నేను అనుకోవడం ఏమిటంటే... కోటి ఆదాయం ఉన్నవారు దక్షిణ ఢిల్లీలోనే 42,800 మంది ఉన్నారని. దీని అర్ధం ఏమిటి? మనం మనల్నే మోసం చేసుకుంటున్నాం. దేశాన్ని మోసగిస్తున్నాం. పన్నులు చెల్లించాలని మనం కోరుకోవడం లేదు’ అని చిదంబరం ఈ సందర్భంగా అన్నారు. తగిన ప్రతిఒక్కరూ పన్నులు చెల్లిస్తే, పెట్టుబడులకు ప్రభుత్వానికి మరిన్ని నిధులు వస్తాయని ఆర్థికమంత్రి అన్నారు. ఇది దేశాభివృద్ధికి కూడా దోహదపడుతుందని వివరించారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యల్లో అవినీతి ఒకటని చిదంబరం పేర్కొన్నారు. రూ.2000 కోట్ల పన్ను ఎగవేతలను నిరోధించడానికి ఉద్దేశించి దాదాపు 12 లక్షల మందికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపినట్లు ఈ సందర్భంగా తెలిపారు. -
కీలక బిల్లుల ఆమోదం అనుమానమే: చిదంబరం
న్యూఢిల్లీ: ఈ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బిల్లు మినహా మరే కీలక బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం అనుమానమేనని కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం బుధవారం వ్యాఖ్యానించారు. స్థానిక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం.. ‘రోజూ పార్లమెంటుకెళ్లడం.. ఉత్త చేతులతో తిరిగిరావడం సాధారణమైపోయింది’ అన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఆర్థిక బిల్లు, ఓటాన్ అకౌంట్, ద్రవ్య వినిమయ బిల్లులు ఆమోదం పొందుతాయి. ఒకవేళ చర్చ జరగకుండా అవి ఆమోదం పొందితే మాత్రం నేను సంతోషించను. చర్చ జరిగిన తరువాతే అవి పాస్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ)ల తగ్గింపు నిర్ణయం రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసింది కాదన్నారు. తెలంగాణపై సభలో నిరసనలు తాత్కాలికమేనన్న ప్రధాని ఇదిలా ఉండగా, తెలంగాణ అంశంపై సభను అడ్డుకునే సంఘటనలు తాత్కాలిక అవాంతరాలేనని ప్రధాని మన్మోహన్ అభివర్ణించారు. వ్యక్తిగత వ్యతిరేకాభిప్రాయాలను పక్కనబెట్టి సభ సజావుగా నడిచేలా వ్యవహరించాలన్న జ్ఞానం అన్నివర్గాలకు ఉందని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. పార్లమెంటు భవనం వెలుపల బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాగా పార్లమెంటు చివరి సమావేశాల్లో 39 బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటిలో తెలంగాణ బిల్లు, పలు అవినీతి వ్యతిరేక బిల్లులు ఉన్నాయి. -
ప్రస్తుతం వీలుకాదు
దావోస్: బంగారం దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలన్న డిమాండ్‌పై చర్య తీసుకోవాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరగా, ఇప్పట్లో అలాంటి ఆలోచనేదీ లేదని ప్రభుత్వం పేర్కొంది. దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలనీ, పసిడి దిగుమతులను ఎగుమతులతో ముడిపెడుతున్న నిబంధనను సవరించాలన్న ఆభరణాల ఎగుమతిదారుల విజ్ఞప్తిని పరిశీలించాలని సోనియా గురువారం కేంద్ర వాణిజ్య శాఖకు లేఖ రాశారు. అయితే, కరెంటు అకౌంట్ లోటు(క్యాడ్)పై గట్టి పట్టు సాధించిన తర్వాతే బంగారం దిగుమతులపై ఆంక్షలను ఉపసంహరించుకోగలమని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం తేల్చిచెప్పారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్) సదస్సులో మంత్రి ప్రసంగించారు. పుత్తడి దిగుమతులపై ఆంక్షలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. 8 శాతం వృద్ధి రేటును మళ్లీ అందుకుంటాం... సంస్కరణలు, సత్వర నిర్ణయాలు సత్ఫలితాలిచ్చాయని చిదంబరం అన్నారు. పాత తప్పిదాలు పునరావృతం కాకుంటే భారత్ 8% వృద్ధి రేటును మళ్లీ అందుకుంటుందని ఉద్ఘాటించారు. డబ్ల్యుఈఎఫ్ సదస్సులో భాగంగా బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘మేం మరింత నిర్ణయాత్మకంగా ఉండాలని ఏడాదిన్నర క్రితం నిర్ణయించాం. ఆ ఫలితాలు ఇపుడు కళ్లెదుటే కన్పిస్తున్నాయి. వచ్చే మూడేళ్లలో క్రమంగా 8% వృద్ధిరేటును మళ్లీ చేరుకుంటామనడంలో ఎలాంటి సందేహం లేదు..’ అని చిదంబరం ధీమా వ్యక్తంచేశారు. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాదు... ఇండియాతో పాటే దక్షిణాఫ్రికాలోనూ ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా, ‘దక్షిణాఫ్రికా పరిస్థితి సంతోషకరం. అక్కడి పాలక పక్షం మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశముంది. కానీ భారత్‌లో పరిస్థితి అలా లేదు. ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం కన్పించడం లేదు’అన్నారు. 10 కోట్ల ఉద్యోగాల కల్పన: ఆనంద్ శర్మ తయారీ రంగంలో 10 కోట్ల మంది నిపుణులకు ఉద్యోగాలు కల్పించాలని భారత్ యోచిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంతి ఆనంద్ శర్మ తెలిపారు. జీడీపీలో ప్రస్తుతం 16%గా ఉన్న తయారీరంగం వాటాను 25%కు పెంచడం ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. దావోస్‌లో తయారీరంగంపై నిర్వహించిన సెషన్లో ఆయన ప్రసంగించారు. ఇదీ 80:20 నిబంధన పసిడి దిగుమతులపై ఆంక్షలను, 80:20 దిగుమతుల నిబంధనను సడలించాలని వజ్రాలు, ఆభరణాల పరిశ్రమ చేస్తున్న డిమాండుపై తగిన చర్య తీసుకోవాలంటూ వాణిజ్య శాఖకు సోనియా గురువారం లేఖ రాశారు. బంగారం దిగుమతిపై 10%గా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 2%కు తగ్గించాలని అఖిల భారత రత్నాలు, ఆభరణాల వ్యాపార సమాఖ్య సోనియాకు రాసిన లేఖలో కోరింది. 80:20 నిబంధనను సవరించాలని విజ్ఞప్తి చేసిం ది. 80:20 నిబంధన ప్రకారం అంతకుముందు దిగుమతి చేసుకున్న పసిడిలో 20%ను ఎగమతి చేసే వరకూ కొత్త దిగుమతులను అనుమతించరు. -
ఆర్థిక క్రమశిక్షణలో రాజీలేదు
న్యూఢిల్లీ: ఆర్థిక క్రమశిక్షణ విషయంలో తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోదని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటం, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని చవిచూడటంతో ప్రభుత్వ వ్యయం ఎగబాకే అవకాశం ఉందని... దీంతో ద్రవ్యలోటు లక్ష్యం సాధ్యం కాకపోవచ్చనే ఆందోళనల నేపథ్యంలో విత్తమంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపాలైనప్పటికీ... ఆర్థిక క్రమశిక్షణకు కట్టుబడి ఉంటామని చిదంబరం చెప్పారు. బుధవారం ఇక్కడ ఢిల్లీ ఆర్థిక సదస్సు-2013ను ప్రారంభించిన అనంతరం ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ధరలే కొంపముంచాయ్... నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో(మధ్యప్రదేశ్, రాజస్థాన్,ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ) కాంగ్రెస్ ఓటమికి అధిక ధరలూ ఒక కారణమేనని చిదంబరం వ్యాఖ్యానించారు. అయితే, ద్రవ్యోల్బణానికి కళ్లెం వేయడం కోసం వ్యవసాయోత్తులకు మద్దతు ధర తగ్గించడం, జాతీయ ఉపాధి హామీ పథకంలో కార్మికుల వేతలనాల్లో కోత వంటి చర్యలేవీ చేపట్టబోమన్నారు. దీనికి కళ్లెం వేయడం తమ ప్రధాన కర్తవ్యాల్లో ఒకటని కూడా ఆయన నొక్కిచెప్పారు. అక్రమ నిల్వలను అరికట్టడంలో రాష్ట్రాలు విఫలంకావడమే ధరలు ఎగబాకడానికి కారణమని ఆర్థిక మంత్రి విమర్శించారు. అధిక ద్రవ్యోల్బణానికి మూల్యాన్ని మాత్రం కేంద్రం చెల్లించాల్సి వస్తోందన్నారు. ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధిస్తాం... ప్రభుత్వ ఎజెండాలో తొలి ప్రాధాన్యంగా ఆర్థిక స్థిరీకరణ ఉంటుందని, ద్రవ్యలోటుకు కచ్చితంగా కళ్లెం వేస్తామన్నారు. ప్రస్తుత 2013-14 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 4.8 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థను భవిష్యత్తులో కొంతపుంతలు తొక్కించాలంటే క్రమంతప్పకుండా ఆర్థిక సంస్కరణలను దీర్ఘకాలం కొనసాగించాల్సిందేనని విత్తమంత్రి పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ), ప్రత్యక్ష పన్నుల కోడ్(డీటీసీ), బీమా చట్టాల సవరణ బిల్లు, ఇండియన్ ఫైనాన్షియల్ కోడ్ వంటి సంస్కరణలు దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయడం(గేమ్ ఛేంజర్స్)లో కీలకంగా నిలుస్తాయని కూడా చిదంబరం పేర్కొన్నారు. -
నైపుణ్యాల పెంపునకు రూ.1,000 కోట్లు
శివగంగ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల మంది యువజనులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమానికి గాను ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించింది. ఇక్కడకు సమీపంలోని అమరావతిపుత్తూర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తూ ఆర్థిక మంత్రి పి. చిదంబరం ఈ విషయం చెప్పారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మొత్తం విద్యార్ధుల్లో 15 శాతం మంది మాత్రమే తమ నైపుణ్యాలను మెరుగుపరచుకొని విదేశాల్లో ఉద్యోగాలు పొందగలుగుతున్నారని చిదంబరం పేర్కొన్నారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. -
మంత్రల బృందం మొదటి భేటీ
తెలంగాణపై సమావేశమైన మంత్రుల బృందం ఆంటోనీ, చిదంబరం మినహా ఐదుగురు మంత్రుల హాజరు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన ప్రక్రియలో కేంద్రం మరో ముందడుగు వేసింది. కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే నేతృత్వంలో పునర్వ్యవస్థీకరించిన కేంద్ర మంత్రుల బృందం శుక్రవారంనాడిక్కడ తొలిసారిగా సమావేశమైంది. రాష్ట్ర విభజన ప్రక్రియ విధివిధానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో సీమాంధ్ర ప్రాంత ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంలో నిష్పాక్షికంగా, వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తామని ప్రకటించింది. నార్త్‌బ్లాక్‌లోని హోం మంత్రిత్వశాఖ కార్యాలయంలో దాదాపు 45 నిమిషాలసేపు జరిగిన ఈ సమావేశానికి విదేశీ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ మినహా మిగిలిన అయిదుగురు మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, గులాంనబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, జైరాం రమేష్, వి.నారాయణసామి హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని అమలు చేయడంలో జీవోఎంకు కేంద్ర మంత్రివర్గం నిర్దేశించిన 11 పరిశీలనాంశాలకు సంబంధించిన వివరాలతో సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖల నుండి నివేదికలను కోరాలని, రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా సమాచారాన్ని కోరాలని నిర్ణయించింది. ప్రాథమిక చర్చ మాత్రమే జరిగింది: షిండే జీవోఎంకు అప్పగించిన పనిని పూర్తిచేసేందుకు అనుసరించాల్సిన పద్ధతులపైనే తొలి సమావేశంలో ప్రాథమికంగా చర్చ జరిగిందని కేంద్ర హోం మంత్రి షిండే, ఆరోగ్య శాఖ మంత్రి గులాంనబీ ఆజాద్‌లు వెల్లడించారు. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో అనుసరించాల్సిన మౌలిక విధివిధానాలను పరిశీలన మినహా ప్రధాన నిర్ణయాలేమీ తీసుకోలేదని తెలిపారు. జీవోఎం పరిశీలనాంశాల్లో పొందుపరిచిన అంశాలపై కేంద్రంలోని జలవనరుల మంత్రిత్వశాఖ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ, పట్టణాభివృద్ధి, రవాణా వంటి సంబంధిత మంత్రిత్వ శాఖలన్నింటి నుండి నివేదికలను కోరాలని నిర్ణయం తీసుకున్నట్లు షిండే చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా అవసరమైన సమాచారాన్ని కోరాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రాన్ని విభజించడంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికను ప్రాతిపదికగా తీసుకుంటామని కూడా ఆయన వెల్లడించారు. అయితే సీమాంధ్ర ప్రజల భయాందోళనలు, సమస్యలను పరిష్కరించడంలో జీవోఎం నిష్పక్షపాతంగా, వాస్తవిక దృక్పథంతో వ్యవహరిస్తుందని ఆ తర్వాత విడుదలైన అధికార ప్రకటన హామీ ఇచ్చింది. పదేళ్లపాటు రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా వ్యవహరించాల్సిన హైదరాబాద్ నగర ప్రతిపత్తి, రెండు రాష్ట్రాల భౌగోళిక సరిహద్దుల నిర్ణయం, నదీజలాలు, విద్యుచ్ఛక్తి, ఆదాయ వనరుల పంపిణీ, సహజ వనరులు, సిబ్బంది పంపిణీ వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో పరిష్కరించాల్సిన 11 అంశాలతో జీవోఎం పరిశీలనాంశాలను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ శాఖలు వివిధ అంశాలపై సమర్పించే స్టేటస్ రిపోర్టులను అధ్యయనం చేసి కేంద్ర మంత్రివర్గానికి సమర్పించే నివేదికలో పొందుపరిచే సిఫార్సులను పర్యవేక్షించేందుకు జీవోఎం సభ్యుల మధ్య పని విభజన కూడా జరిగినట్లు అధికార వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఆరు వారాల్లో జీవోఎం నివేదిక సమర్పించాల్సి ఉంటుందని కేంద్రం మొదట నిర్దేశించినా ఆ తర్వాత గడువును తొలగించడం తెలిసిందే. జీవోఎం నివేదిక సమర్పణకు ఎలాంటి గడువు లేదని ఆజాద్ స్పష్టంగా చెప్పడం గమనార్హం. అలాగే కేంద్ర మంత్రుల బృందం రాష్ట్రంలో పర్యటించే అవకాశం లేదని అధికార వర్గాలు తేల్చిచెబుతున్నాయి. సీమాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ? ఎన్ని అవరోధాలు ఎదురైనా రాష్ట్ర విభజన నిర్ణయంతోనే ముందుకు సాగాలని కృతనిశ్చయంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజలను బుజ్జగించేందుకు భారీగా ప్యాకేజీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విభజనానంతరం రెండు రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాల సత్వరాభివృద్ధికి అవసరమైన సిఫార్సులు చేయాలన్న అంశాన్ని మంత్రుల బృందం పరిశీలనాంశాల్లో చేర్చింది. ఈ నేపథ్యంలో కొత్త రాజధాని నిర్మాణం కోసం భారీగా ఆర్థిక సహాయాన్ని ప్రకటించడంతో పాటు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కూడా కేంద్రమంత్రుల బృందం సిఫార్సు చేయవచ్చునని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సీమాంధ్రకు రాజధానిని ఆ ప్రాంత నేతలతో సంప్రదించిన తర్వాతే కేంద్రం ఎంపిక చేస్తుందని, కొత్త రాజధానిని అత్యుత్తమ స్థాయిలో అభివృద్ధి చేసుకొనేందుకు భారీగా నిధులు సమకూర్చే అవకాశం లేకపోలేదని ఏఐసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
తెరపైకి నాచ్చియప్పన్ తనయుడు
శివగంగైలో ఆధిపత్యం కోసం కేంద్ర మంత్రులు చిదంబరం, సుదర్శనం నాచ్చియప్పన్ మధ్య పోరు తీవ్రమవుతోంది. చిదంబరం గ్రూపునకు చెక్ పెట్టడం లక్ష్యంగా నాచ్చియప్పన్ పావులు కదుపుతున్నారు. అదే సమయంలో చిదంబరం వర్గం దీటుగా బదులిస్తోంది. ఈ ఆధిపత్య పోరు రాష్ట్ర కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. సాక్షి, చెన్నై: గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఇక్కడున్న గ్రూపులు మరే ఇతర పార్టీ ల్లో కనిపించవు. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జి.కె.వాసన్ గ్రూపులను ప్రధానంగా తీసుకోవచ్చు. తాజాగా కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుదర్శన నాచ్చియప్పన్ గ్రూపు తెర మీదకు వచ్చింది. ఈ గ్రూపు శివగంగైలో ఆధిపత్యం చాటుకునే పనిలో ఉంది. గతంలో శివగంగై నుంచి లోక్‌సభకు నాచ్చియప్పన్ ఎన్నికయ్యూరు. గత ఎన్నికల్లో చిదంబరం కోసం సీటును త్యాగం చేయా ల్సి వచ్చింది. అప్పటి నుంచి ఈ ఇద్దరి మధ్య చాప కింద నీరులా వివాదం నడుస్తోంది. వివాదం: ఢిల్లీలో తనకున్న పలుకుబడితో రాజ్యసభ సీటును రెండుసార్లు నాచ్చియప్పన్ దక్కించుకున్నారు. ఏదో ఒక రోజు చిదంబరానికి నియోజకవర్గంలో చెక్‌పెట్టి ఆ సీటును మళ్లీ తన్నుకెళ్లాలన్న వ్యూహంతో ఉన్నారు. తన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడానికి చిదంబరం ప్రయత్నిస్తున్నారంటూ నాచియప్పన్ పలుమార్లు అధిష్టానానికి ఫిర్యా దు చేశారు. నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే నియోజకవర్గానికి చిదంబరం వస్తుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న నాచ్చియప్పన్ తన బలాన్ని పెంచుకునే పనిలో నిమగ్నమయ్యారు. తన తనయుడు జయసింహాను తెరపైకి తీసుకొచ్చారు. అభివృద్ధిపరంగా వెనుకబడ్డ నియోజకవర్గంలో కేంద్ర పథకాల్ని అమలు చేయించే పనిలో ఉన్నారు. మంత్రి హోదాలో పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు చిదంబరం వర్గానికి మింగుడు పడడం లేదు. సై అంటే సై: కయ్యూనికి కాలు దువ్వే రీతిలో జయసింహ చేస్తున్న వ్యాఖ్యలతో శివగంగైలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఆసక్తిగా మారింది. తామేమీ తక్కువ కాదన్నట్లు చిదంబరం వర్గం ఎదురుదాడికి దిగుతోంది. తమ వర్గానికి చెక్ పెట్టేందుకు నాచ్చియప్పన్ వేగంగా పావులు కదుపుతున్న సమాచారం చిదంబరం దృష్టికి చేరింది. నాచ్చియప్పన్ మద్దతుదారులు మాట్లాడుతూ తమ నేత గుప్పెట్లో ఉన్న నియోజకవర్గాన్ని చిదంబరం లాగేసుకున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గం అభివృద్ధి మీద దృష్టి పెట్టని ఆయనకు మళ్లీ సీటు ఇవ్వకూడదన్న నినాదంతో ముందుకు వెళుతున్నట్లు వివరించారు. చిదంబరం గత ఎన్నికల్లోనే ఓటమి అంచుల్లోకి వెళ్లారని, ఈ పర్యాయం సీటు ఇస్తే ఓటమి తప్పదని పేర్కొన్నారు. చిదంబరం మద్దతుదారులు మాట్లాడుతూ మంత్రి పదవి దక్కడంతో తానే దో గొప్ప నాయకుడైనట్లుగా నాచ్చియప్పన్ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేస్తున్నారు. తమ నేతను కాదని మరొకరికి శివగంగై సీటు దక్కదని ధీమా వ్యక్తం చేశారు. ఈ రెండు గ్రూపులు బహిరంగంగానే వివాదాలకు దిగుతుండడంపై సత్యమూర్తి భవన్ (కాంగ్రెస్ పార్టీ కార్యాలయం)కు ఫిర్యాదులు వెళ్లారుు. -
‘చెన్నైకు తెలుగుగంగను ఆపితే సహించం’
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ విభజనకు తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి పి.చిదంబరాన్ని కారణంగా చూపుతూ చెన్నైకి తెలుగుగంగ జలాలను నిలిపివేస్తే సహించేది లేదని తెలుగు సంఘాలు హెచ్చరించాయి. 7న చెన్నైకి తెలుగుగంగ కాలువలో నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటామని సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ శ్రీకాళహస్తిలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆస్కా అధ్యక్షుడు కె.సుబ్బారెడ్డి, తెలుగు సంఘాల అధ్యక్షులు డా. సీఎంకే రెడ్డి, కె.నరసారెడ్డి, టి.రామకృష్ణ, అనిల్‌కుమార్‌రెడ్డి, ఎంవీ నారాయణగుప్తా, రంగనాయకులు శుక్రవారమిక్కడ మీడియూతో మాట్లాడారు. తెలుగుగంగను అడ్డుకుంటే తెలుగువారికి, తమిళులకు మధ్య అగాధాన్ని సృష్టిస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. -
పండుగల వేళ.. చౌక రుణాల మేళా..!
న్యూఢిల్లీ: ఒకవైపు అధిక వడ్డీరేట్ల కారణంగా రుణాలు తీసుకోవడానికి వెనుకాడుతున్న వారికీ, మరోవైపు డిమాండ్ లేక కుదేలవుతున్న పరిశ్రమకూ ఊరట కలిగించేందుకు ప్రభుత్వం నడుం కట్టింది. పండుగ సీజన్లో ద్విచక్ర వాహనాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ (టీవీలు, ఫ్రిజ్‌లు మొదలైనవి) వంటి వాటి కొనుగోళ్లకు బ్యాంకులు మరికాస్త చౌకగా రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఇందుకోసం ప్రభుత్వరంగ (పీఎస్‌యూ) బ్యాంకులకు బడ్జెట్లో పేర్కొన్న దానికంటే అదనంగా పెట్టుబడులు సమకూర్చాలని నిర్ణయించింది. అయితే, ఈ పరిమాణం ఎంత మేర ఉంటుందన్నది వెల్లడి కాలేదు. ఆర్థిక మంత్రి పి.చిదంబరం, ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం మధ్య గురువారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘బడ్జెట్లో పేర్కొన్న దానికన్నా (రూ.14,000 కోట్లు) ఎక్కువగా, బ్యాంకులకు కావాల్సినన్ని నిధులు సమకూర్చడం జరుగుతుంది. ద్విచక్ర వాహనాలు, కన్సూమర్ డ్యూరబుల్స్ వంటి ఎంపిక చేసిన కొన్ని రంగాల్లో డిమాండ్‌ను పెంచే విధంగా కాస్త తక్కువ వడ్డీ రేటుకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ఇది తోడ్పడగలదు’ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది మందగమనాన్ని ఎదుర్కొనేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు కూడా దోహదపడగలదని వివరించింది. వినియోగదారులకు.. ప్రత్యేకించి మధ్యతరగతి వర్గాలకు ఈ నిర్ణయం ఊరట కలిగించగలదని, అలాగే కంపెనీల సామర్థ్య విస్తరణకు, ఉపాధికి, ఉత్పత్తి పెరుగుదలకు కూడా తోడ్పడగలదని ఆర్థిక శాఖ తెలిపింది. ఈ సమావేశంలో వివిధ రంగాల్లో రుణాల వృద్ధిని మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నిర్దిష్ట రంగాలకు చౌక వడ్డీలపై రుణాలివ్వాల్సిన అవసరంపై చర్చించేందుకు త్వరలోనే పీఎస్‌యూ బ్యాంకుల అధినేతలతో సమావేశమవుతానని చిదంబరం చెప్పారు. బ్యాంకుల సామర్థ్యాన్నిబట్టి తక్కువ వడ్డీ రుణాలివ్వడం ఆధారపడి ఉంటుందన్నారు. ఏయే రంగాల్లో తక్కువ వడ్డీ రేట్లకు రుణాలిస్తే డిమాండ్ మెరుగుపడగలదన్నది బ్యాంకులు నిర్ణయిస్తాయని చిదంబరం చెప్పారు. ఇటీవలి పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రకారం కన్సూమర్ డ్యూరబుల్స్ రంగం గతేడాది జూలైతో పోలిస్తే ఈసారి జూలైలో 9.3 శాతం మేర క్షీణించింది. గతేడాది ఏప్రిల్-జూలై మధ్యకాలంలో 6.1 శాతం వృద్ధి ఉండగా.. ఈసారి అదే వ్యవధిలో ఏకంగా 12 శాతం క్షీణించింది. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు వంటి తయారీ ఉత్పత్తులకు డిమాండ్‌ను కన్సూమర్ డ్యూరబుల్స్ విభాగం ప్రతిబింబిస్తుంది. మరోవైపు గతేడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో 6.8 శాతం వృద్ధి చెందిన ద్విచక్ర వాహనాల రంగం ఈసారి 0.72 శాతం మాత్రమే వృద్ధి చెందింది. పరిశ్రమకు సానుకూలం.. పండుగల సీజన్లో చౌక రుణాల పరిణామాన్ని స్వాగతిస్తున్నట్లు వాహన తయారీ సంస్థల సమాఖ్య ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు. ద్విచక్ర వాహనాల మార్కెట్ కోలుకునేందుకు ఇది తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ ప్రయోజనాన్ని కార్లు, ఇతర వాణిజ్య వాహనాలకు కూడా వర్తింపచేసి ఉంటే మరింత ఉపయోగకరంగా ఉండేదని కిర్లోస్కర్ చెప్పారు. నేడు ఆర్బీఐ బోర్డు సమావేశం ..రాయ్‌పూర్‌లో నేడు (శుక్రవారం) ఆర్బీఐ బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో బ్యాంకులకు మరిన్ని పెట్టుబడులు సమకూర్చాలన్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. కీలక ఆర్థిక పరిణామాలను చర్చించేందుకు ఆర్బీఐ బోర్డు ప్రతి త్రైమాసికంలో ఒకసారి సమావేశమవుతుంటుంది. తాజాగా ఆర్థిక వృద్ధి నాలుగేళ్ల కనిష్టమైన 4.4 శాతానికి తగ్గడం, ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కరెంటు ఖాతా లోటు అధిక స్థాయిలో 4.9 శాతంగా ఉండటం వంటి పరిస్థితుల్లో జరగబోయే ఆర్బీఐ బోర్డు సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఒక వైపున వృద్ధికి ఊతమిచ్చే చర్యలు తీసుకోవాలంటుండగా.. గత నెల జరిగిన త్రైమాసిక మధ్యంతర పరపతి సమీక్షలో కూడా ఆర్బీఐ.. ద్రవ్యోల్బణ కట్టడికే ప్రాధాన్యమిస్తూ పాలసీ రేట్లను పావు శాతం పెంచిన సంగతి తెలిసిందే. రెండో త్రైమాసిక పాలసీ సమీక్ష ఈ నెల 29న జరగనుంది. -
16న రాష్ట్రానికి కేంద్ర మంత్రి చిదంబరం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ నెల 16వ తేదీన రాష్ట్రానికి రానున్నారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్లో ఉదయం 11.15కు జరిగే ‘ఐఆర్డీఏ ఇన్సూరెన్స్ రిపోజిటరీ సిస్టమ్’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు. చిదంబరంతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ ఠక్రూ కూడా రాష్ట్రానికి రానున్నారు. -
త్వరలో కఠిన నిర్ణయాలు: చిదంబరం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో వృధా ఖర్చులు తగ్గించడంతో పాటు, నిత్యావసరాలు కాని వస్తువుల దిగుమతి నిరోధానికి త్వరలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం తెలిపారు. శనివారం రాజ్యసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చను ఆర్థిక మంత్రి ముగించారు. ఒత్తిళ్లలో కొనసాగుతున్న ఆర్థికవ్యవస్థ దృష్ట్యా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నామని, తదుపరి కొన్ని రోజులు, వారాల్లో మరిన్ని చర్యలు ప్రకటిస్తామని చెప్పారు. ఈ చర్యలు ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలను అరికట్టేందుకు కూడా ప్రభుత్వం మరిన్ని చ ర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ‘నిరాశాజనకమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు వృధా వ్యయానికి కళ్లెం వేయాలి.. వీటిని పొదుపు చర్యలని మీరనవచ్చు.. లేదా ప్రణాళికేతర వ్యయంలో కోత అనవచ్చు..’ అని చిదంబరం అన్నారు. ఇంధన ధరలపై సభ్యుల ఆందోళనను ప్రస్తావిస్తూ.. డీజిల్, పెట్రోల్ ధరల పెంపుపై ప్రభుత్వం ఎలాంటి దుందుడుకు నిర్ణయమూ తీసుకోబోదని హామీ ఇచ్చారు. రూపాయి పతనంపై మాట్లాడుతూ.. కొన్నిరోజులుగా పరిస్థితి కొంత మెరుగుపడటాన్ని ఆయన ప్రస్తావించారు. కరెన్సీ మార్కెట్లలో ఎన్నో అదృశ్య అంశాలపై మన ం పోరాడుతున్నామని చిదంబరం వ్యాఖ్యానించారు. ఏపీలో పరిస్థితి కేంద్రం అదుపులోనే ఉంది ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి కేంద్రం అదుపులోనే ఉందని, రాష్ట్రానికి చెందిన ఎంపీలు కాస్త ఓపికతో ఉండాలని కేంద్రం సూచించింది. సమైక్యాంధ్ర మద్దతుదారులు చేపట్టిన 24 గంటల బంద్ నేపథ్యంలో శనివారం రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సభ్యులు రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ నిర్ణయం ప్రకటించినప్పటి నుంచీ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణిస్తోందని, దీనిని చక్కదిద్దేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలేమిటని రాష్ట్రానికి చెందిన పలువురు సభ్యులు ప్రశ్నించారు. ఈ అంశంపై రాష్ట్రానికి చెందిన కొందరు కాంగ్రెస్ సభ్యులు మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ కురియన్ అనుమతించలేదు. ఈ అంశంపై ఒత్తిడి తేవద్దని కాంగ్రెస్ సీనియర్ సభ్యులు కూడా వారికి నచ్చచెప్పడంతో వారు మిన్నకుండిపోయారు. ఆర్థిక మంత్రి చిదంబరం ఈ అంశంపై మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన సభ్యుల ఆందోళనను తాను అర్థం చేసుకోగలనని, అయితే పరిస్థితి అదుపులోనే ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు సాగిస్తున్నామని, శాంతిభద్రతలు కాపాడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెప్పారు. అయితే రాష్ట్రంలో పరిస్థితిపై రాజ్యసభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసనగా శనివారం తెలుగుదేశం ఎంపీలు సి.ఎం.రమేష్, సుజనా చౌదరి వాకౌట్ చేశారు. హైదరాబాద్‌లో అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని సీ ఎం రమేష్ అన్నారు. -
రూపాయి దానంతట అదే సర్దుకుంటుంది
న్యూఢిల్లీ: అంతకంతకూ క్షీణించిన రూపాయి మారకం విలువ మళ్లీ దానంతటదే సర్దుకుంటుందని ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పారు. వృద్ధి కూడా మళ్లీ మెరుగుపడుతుందని లోక్‌సభకు తెలిపారు. ఎకానమీ ఒత్తిడిలో ఉందన్న చిదంబరం.. రూపాయి పతనానికి అడుకట్ట వేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందన్నారు. రూపాయి ఉండాల్సిన స్థాయి కన్నా మరింత తక్కువకి పతనమైందని, మరలా కోలుకోగలదని ఆయన పేర్కొన్నారు. దేశీ కరెన్సీ విలువ అనేది ద్రవ్య లోటు, కరెంటు ఖాతా లోటు, ద్రవ్యోల్బణం వంటి అనేక స్థూల ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉంటుందని చిదంబరం చెప్పారు. ఇవన్నీ అధిక స్థాయుల్లో ఉన్నప్పుడు కరెన్సీ కరెక్షన్‌కి లోను కావడం సహజమేనని, కానీ ప్రస్తుతం ఓవర్ కరెక్షన్ జరిగిందన్నారు. దేశ చరిత్రలో ఉత్థానపతనాలు సహజమేనని ఆయితే నిరాశావాదానికి లోను కావాల్సిన అవసరం లేదని, మళ్లీ వృద్ధి పుంజుకోగలదని చిదంబరం చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ప్రభుత్వం తగినన్ని చర్యలు తీసుకోవడం లేదన్న విపక్షాల ఆరోపణలను చిదంబరం తోసిపుచ్చారు. ఎకానమీపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు పలు చృర్యలు తీసుకున్నామన్నారు. 2012-13లో కేవలం రెండు రాష్ట్రాలే 5 శాతం కన్నా తక్కువ జీడీపీ వృద్ధి నమోదు చేశాయని, మిగతావన్నీ అంతకన్నా చాలా అధికంగానే వృద్ధి సాధించాయని చిదంబరం పేర్కొన్నారు. 2013-14లో ద్రవ్య లోటును 4.8 శాతానికి మించనివ్వకూడదని లక్ష్మణ రేఖ నిర్దేశించుకున్నామని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాటబోమని స్పష్టం చేశారు. ద్రవ్య లోటును అదుపులో ఉంచాల్సిన అవసరమున్న నేపథ్యంలో నిధుల కేటాయింపు విషయంలో మరింత ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు చిదంబరం చెప్పారు. -
వైఎస్సార్ సీపీ నేత ఆర్కే బహిరంగ లేఖ
సాక్షి, గుంటూరు : ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నవారే ప్రజానాయకులవుతారు. ఈ విషయాన్ని విస్మరించి.. తెలుగు ప్రజల్ని వంచించి.. సోనియా విశ్వాసం, దిగ్విజయ్ సింగ్, చిదంబరం ప్రాపకం పొందడం కోసం చంద్రబాబు పాకులాడడం తగదని వైఎస్సార్ సీపీ గుంటూరు, కృష్ణా జిల్లాల సమన్వయకర్త ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. జిల్లాలో బస్సుయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆర్కే గురువారం ఓ బహిరంగలేఖ రాశారు. తనకు అధికారం ఇస్తే ఏడాదిలోపు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని పదే పదే వేడుకుంటున్న చంద్రబాబుకు 2004, 2009లో రెండు దఫాలు ప్రజలు తిరస్కరించినా వారి మనోభావాలు పట్టించుకోకుండా ఆత్మవంచన యాత్ర చేయడం ఇంకా ఎందుకోసమని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధానం సుస్పష్టమని, టీడీపీ విధానమేంటో చంద్రబాబు చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆర్కే బహిరంగ లేఖలోని ప్రశ్నలివే... = బాబు గారూ... 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకుని పోటీ చేసి టీడీపీ తెలంగాణకు అనుకూలమని మీరు ప్రకటించిన విషయం వాస్తవమా? అవాస్తమా? = తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా 2008లో బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు ప్రణబ్‌ముఖర్జీకి లేఖ ఇచ్చి ఆ లేఖలో తెలంగాణ రాష్ట్రం విభజిస్తే సీమాంధ్ర పరిస్థితి ఏంటి? అన్న విషయంపై ఒక్క ముక్కయినా రాశారా? = విభజన ప్రకటన వెలువడిన తర్వాత నీటి సమస్య, హైదరాబాద్ మహానగరం అంశాలపై పరిష్కారం కోసం ప్రశ్నించకుండా సీమాంధ్రుల మనోభావాల్ని రూ.4-5 లక్షల కోట్లకు తాకట్టు పెట్టే విధంగా ప్యాకేజీ అడిగిన విషయం మరిచి తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర అంటూ తెలుగుజాతి ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారా? లేదా? = రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న మీ వద్దకు ఏపీఎన్జీవోలు వచ్చి బ్లాంక్ చెక్‌లా ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోమని ప్రాధేయపడినా వారి పట్ల మీరు వ్యవహరించి తీరు.. వారితో ఏం మాట్లాడారో.. మీకు గుర్తుందా? = విభజన ప్రకటనపై కాంగ్రెస్ ఎక్కడ వెనక్కు వెళుతుందోనని గతంలో రెండు కళ్ల సిద్ధాంతం అన్నట్లు ఇప్పుడు రెండు కాళ్ల సిద్ధాంతం కోసం మీరు యాత్ర చేయడం లేదని మనస్సాక్షితో చెప్పగలరా? = విభజన జరిగితే మీరు ప్రాతినిధ్యం వహించే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఉప్పు నీరు తప్ప మంచినీరు దొరకదనే విషయం మీకు తెలియదా? ఈ విషయాన్ని మీ యాత్రలో ధైర్యంగా చెప్పగలరా? = రాష్ట్ర విభజనపై ప్రకటన చేసి, ఎట్టి పరిస్థితుల్లోనూ విభజన ఆగదని చెబుతున్న దిగ్విజయ్‌సింగ్.. మీకు మంచి స్నేహితుడనే విషయం ఆయన స్వయంగా మీడియాలో అంగీకరించారు. ఈ విషయంపై బహిరంగంగా బస్సు యాత్రలో మీరు ప్రకటన చేయగలరా? = మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేయకుండా రాజకీయ వ్యాఖ్యలతో, ఆరోపణలతో కూడిన లేఖలను రాజీనామా చేశారా? లేదా? ఈప్రశ్నలపై ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుని మీరు యాత్ర సాగించాలని, ముఖ్యంగా చంద్రబాబు ఫ్రస్టేషన్ నుంచి బయటపడాలని ఆర్కే తన లేఖ ద్వారా సూచించారు. -
రాజన్‌తో చిదంబరం భేటీ
న్యూఢిల్లీ: రూపాయి రికార్డు స్థాయి పతనం, స్టాక్ మార్కెట్లు కుదేలవడం... ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి పి. చిదంబరం మూడో రోజు కూడా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆర్బీఐ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న రఘురామ్ రాజన్‌తో పాటు వివిధ అంతర్జాతీయ ఆర్థిక సంస్థల భారత విభాగపు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు(ఈడీ)లతో కూడా ఆయన సమావేశాలు జరిపారు. ముకేష్ ప్రసాద్(వరల్డ్ బ్యాంక్ ఈడీ). రాకేష్ మోహన్(అంతర్జాతీయ ద్రవ్య సంస్థ-ఐఎంఎఫ్), ఉమేష్ కుమార్(ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్)లతో ఆయన సమావేశం జరిపారు. ఈ సమావేశాల కారణంగా భారత్ నిధుల కోసం ఐఎంఎఫ్‌ను ఆశ్రయించనున్నదనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. -
తెలంగాణ తథ్యం: రాజ్యసభలో చిదంబరం ప్రకటన
-
తెలంగాణ తథ్యం: రాజ్యసభలో చిదంబరం ప్రకటన
టీడీపీ ఒక నిర్ణయం తీసుకుంటేనేమో అది ప్రజాస్వామికం. అదే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటేనేమో దాన్ని నిరంకుశత్వమంటారా? ఇదెక్కడి వైఖరి? నిర్ణయం తీసుకోకుంటే ఎందుకు తీసుకోవడం లేదని తిడతారు. తీసుకుంటేనేమో ఎందుకు తీసుకున్నారంటూ విమర్శిస్తారు! తెలంగాణపై పలు పార్టీలు పదేపదే వైఖరి మార్చుకున్నాయి. బీజేపీ కూడా ఈ విషయంలో ద్వంద్వ వైఖరి అవలంబించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అనుకూలంగా లేదంటూ కేంద్ర హోం మంత్రి హోదాలో అద్వానీ లేఖ రాశారు హైదరాబాద్‌తో పాటు నదీజలాలు, విద్యుత్, విద్య, ఆరోగ్యం, అన్ని ప్రాంతాల వారి రక్షణ, ఆదాయ పంపిణీ తదితర అంశాలన్నింటిపై వ్యక్తమవుతున్న ఆందోళనలు, సందేహాలను పరిగణనలోకి తీసుకున్నాకే కేంద్రం ముందుకు సాగుతుంది. పార్టీల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాం తెలంగాణపై అధ్యయనం చేసే బాధ్యతను శ్రీకృష్ణ కమిటీకి అప్పగించడం మేం చేసిన హోంవర్క్ కాకపోతే మరేమిటి? రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కేంద్రం ముందుకు సాగుతుంది. అయితే కాల పరిమితంటూ ఏమీ లేదు. నేను తేదీ చెప్పలేను ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియతో కేంద్రం ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం తేల్చిచెప్పారు. తెలంగాణపై సోమవారం రాజ్యసభలో మూడు గంటలకు పైగా జరిగిన చర్చకు కేంద్ర హోం మంత్రి తరపున ఆయన సమాధానమిచ్చారు. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారో లేదో స్పష్టం చేయాలని ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ డిమాండ్ చేయడంతో, ‘‘తెలంగాణ నిర్ణయం అమలు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది’’ అంటూ చిదంబరం కుండబద్దలు కొట్టారు. అయితే తాను తేదీ చెప్పలేనన్నారు. రాష్ట్రాల ఏర్పాటుకు గతంలో అనుసరించిన విధానాలకు అనుగుణంగా ప్రకియ్రను ముందుకు తీసుకెళ్తామని బదులిచ్చారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తవడానికి దాదాపు రెండేళ్లు పట్టిందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు మాత్రం అంత సమయం పట్టబోదన్నారు. అది ఎప్పట్లోగా పూర్తవుతుందో ఇప్పుడే చెప్పడం మాత్రం సాధ్యం కాదన్నారు. తెలంగాణ అంశాన్ని తొమ్మిదేళ్లుగా నానబెట్టిన కాంగ్రెస్, ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసమే హడావుడిగా నిర్ణయం తీసుకుందన్న విపక్షాల ఆరోపణలను చిదంబరం తిప్పికొట్టారు. హైదరాబాద్‌తో పాటు నదీజలాల పంపిణీ, విద్యుత్, విద్య, ఆరోగ్యం, అన్ని ప్రాంతాల వారి రక్షణ, ఆదాయ పంపిణీ తదితర అంశాలన్నింటిపై వ్యక్తమవుతున్న ఆందోళనలు, సందేహాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఈ విషయంలో కేంద్రం ముందుకు సాగుతుందని హామీ ఇచ్చారు. కేంద్ర హోం శాఖ పలుమార్లు నిర్వహించిన అఖిలపక్ష సమావేశాల్లో రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ‘‘రాష్ట్ర ఏర్పాటు క్రమంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో పూర్తిస్థాయి చర్చ తొందరపాటు అవుతుంది’’ అన్నారు. తెలంగాణపై చివరగా నిర్ణయం తీసుకున్న పార్టీ కాంగ్రెసేనని అంగీకరించారు. అయితే, ‘కాంగ్రెస్ పార్టీని మీరెంతగా విమర్శిస్తే, దానిపై ఎంతగా ఆరోపణలు సంధిస్తే పార్టీ అంతగా పటిష్టమవుతుంది’ అని విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీడీపీపై విసుర్లు: ఈ సందర్భంగా టీడీపీపై చిదంబరం సునిశితమైన విమర్శలు చేశారు. ‘టీడీపీ నిర్ణయం తీసుకుంటేనేమో అది ప్రజాస్వామికం. అదే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటేనేమో దాన్ని నిరంకుశత్వమంటారా? ఇదెక్కడి వైఖరి?’ అంటూ తూర్పారబట్టారు. ‘నిర్ణయం తీసుకోకుంటేనేమో ఎందుకు తీసుకోవడం లేదని తిడతారు, తీసుకుంటే ఎందుకు తీసుకున్నారంటూ విమర్శిస్తారు’ అంటూ ఆక్షేపించారు. రాజకీయాల కంటే హేతుబద్ధత, తర్కాలదే పైచేయిగా మారే అంశాలు కొన్ని ఉంటాయంటూ హితవు పలికారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ముందు ఎలాంటి అధ్యయనమూ చేయలేదన్న విపక్షాల ఆరోపణలను కూడా తోసిపుచ్చారు. ఆ బాధ్యతను శ్రీకృష్ణ కమిటీకి అప్పగించామని గుర్తు చేశారు. సమగ్ర అధ్యయనం ద్వారా ఒక నిర్ణయానికి రావడానికి కావాల్సిన పూర్తి సమాచారాన్ని కమిటీ తమకు అందజేసిందన్నారు. ఇదంతా తాము చేసిన హోంవర్క్ కాకపోతే మరేమిటంటూ ఎదురు ప్రశ్నించారు. పార్టీలే వైఖరి మార్చుకున్నాయి తెలంగాణ అంశంపై పలు పార్టీలు పదేపదే వైఖరి మార్చుకున్నాయని చిదంబరం అన్నారు. ఈ విషయంలో కూడా బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబించిందని ఆరోపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అనుకూలంగా లేదని పేర్కొంటూ 2002 ఏప్రిల్ 1న కేంద్ర హోం మంత్రి హోదాలో ఆ పార్టీ అగ్రనేత అద్వానీ లేఖ రాశారని గుర్తు చేశారు. సరిగా సంప్రదింపులు జరపకుండానే నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలనూ కొట్టిపారేశారు. ‘‘నా అనుభవంలో మా పార్టీలోనూ, బయటా అత్యంత సుదీర్ఘంగా, విసృ్తతంగా సంప్రదింపులు జరిగిన అంశమేదైనా ఉందంటే అది తెలంగాణే’ అన్నారు. పూర్తిస్థాయి సంప్రదిపుల తర్వాతే నిర్ణయం తీసుకుంటే దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దాదాపు 80 మంది ఎందుకు వ్యతిరేకించారని, ఆ మేరకు తమ సంతకాలతో కాంగ్రెస్ అధ్యక్షురాలికి వినతిపత్రం ఎందుకు పంపారని బీజేపీ నేత వెంకయ్యనాయుడు నిలదీశారు. దాంతో పార్టీల అంతర్గత వ్యవహారాలను తేల్చుకొనేందుకు పార్లమెంటును వేదికగా చేసుకోవద్దని చిదంబరం బదులిచ్చారు. ‘‘ఎన్డీఏ ప్రభుత్వం తన పదవీకాలం ముగుస్తున్న చివరి రోజునే ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది. తర్వాత కొన్నేళ్లకు ఆ రాష్ట్రం ఏర్పాటైంది. అలాగే ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటును 1998 మే 25న రాష్ట్రపతి ప్రకటించగా మొత్తం ప్రక్రియ పూర్తికావడానికి రెండేళ్లు పట్టింది’’ అన్నారు. రాజ్యసభ చర్చలో వ్యక్తమైన అభిప్రాయాలను, సూచనలన్నింటినీ కేంద్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకునే ముందు పరిగణనలోకి తీసుకుంటామని ప్రకటించారు.