ధీశాలి ఇందిర
శతజయంతి సదస్సులో పి.చిదంబరం ప్రతికూలతలే ఉక్కు మహిళను చేశాయి
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా అంతర్గత, బహిర్గత ప్రతికూలతలే దివంగత ప్రధాని ఇం దిరాగాంధీని ఉక్కుమహిళను చేశాయని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డా రు. ఇందిర శతజయంతి ఉత్సవాల సందర్భం గా శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. ‘‘దేశంలో ఎమర్జెన్సీ విధింపు తప్పుడు నిర్ణయమేనని తన తప్పును ధైర్యంగా అంగీకరించిన ధీశాలి ఇందిర. ‘గాంధీ తర్వాత ప్రజలంతా గుర్తు పెట్టుకునేది ఆమెనే.
సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తీసుకున్న నిర్ణయాలతో చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు. ఆమె చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఎవరూ విమర్శించలేరు. దేశాన్ని స్వయం సమృద్ధం చేసే హరిత విప్లవం వం టి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెండు యుద్ధాలు, కరువు కాటకాల బారినుంచి దేశాన్ని కాపాడారు. వెనకబడిన వర్గాల పట్ల సమాజంలో ఉన్న దృక్పథాన్ని ఇందిర మార్చారు. ఎప్పటికప్పుడు పరిణతిని సాధిస్తూ వచ్చారు. అన్ని వర్గాల వారూ సొంత మనిషిలా ఆదరిం చిన ఆమెను కులం, మతం, వర్గం వంటివాటికి పరిమితం చేసి చూడలేం’’అని వ్యాఖ్యానించారు.
అట్టడుగు వర్గాల కోసం తపించారు: శాంతా సిన్హా
విద్యార్థి దశలో తనకూ అందరిలాగే ఇందిరపై వ్యతిరేకత భావనే ఉండేదని ముఖ్య అతిథిగా పాల్గొన్న జాతీయ బాలల హక్కుల రక్షణ కమి షన్ మాజీ చైర్‌పర్సన్ శాంతా సిన్హా చెప్పారు. ‘‘రైతులు, కూలీలు, అట్టడుగు వర్గాల పట్ల ఆలోచనా విధానం, ఆ దిశగా ఆమె చేసిన చట్టా లు, వాటి అమలు చూసి నా అభిప్రాయం మా రింది. బ్యాంకుల జాతీయీకరణ విప్లవాత్మక నిర్ణయం. తరతరాలుగా కూలీలుగా ఉన్నవాళ్లు భూ సంస్కరణలతో భూ యజమానులయ్యారు. 20 సూత్రాల పథకంతో అభివృద్ధి అన్ని వర్గాలకు చేరేలా విప్లవాత్మక చర్యకు ఇందిర తెర తీశారు’’అని చెప్పారు.
ఇందిర తర్వాత దేశంలో అలాంటి రాజకీయ నేత మళ్లీ కని పించడం లేదని ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. ‘‘ఆమె అమలు చేసిన భూ సంస్కరణల వల్ల దళితులకే ఎక్కువ మేలు జరిగింది. 1975లో తప్పనిసరి పరిస్థితిలో ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది. రాజకీయాల్లో ఇందిర పట్టుదల చూపేవారు. అంతా తన మాట వినాలనే తత్వంతో వ్యవహరించేవారు’’అని విశ్లేషించా రు. పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి అజయ్ మాకెన్, విపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధి కారి మల్లెపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.