కరెన్సీ ఖాళీ | no currency in reserve bank | Sakshi
Sakshi News home page

కరెన్సీ ఖాళీ

Published Sat, Nov 19 2016 1:35 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM

no currency in reserve bank

డిపాజిట్లు మాత్రమే స్వీకరణ
  నిరాశలో ఖాతాదారులు
  రాజకీయ పార్టీల ఆందోళనలు
  మరో ఏడు నెలలు
  కరెన్సీ కష్టాలే: పి. చిదంబరం

 
కరెన్సీ నోట్ల మార్పిడి వ్యవహారం డిమాండ్ ఎక్కువ.. సరఫరా తక్కువ అన్నట్లుగా తయారైంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా రిజర్వు బ్యాంకు నుంచి కొత్త కరెన్సీ అందకపోవడంతో బ్యాంకులన్నీ సదరు లావాదేవీలను నిలిపి వేశారుు. దీనిపై అనేక రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగారుు.
 
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవలి వరకు చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను కేంద్రం ఈనెల 8వ తేదీన రద్దు చేయగా, 10వ తేదీ నుంచి కొత్త కరెన్సీ పంపిణీ ప్రారంభమైంది. అరుుతే కేవలం రూ.2వేల నోటును మాత్రమే రిజర్వు బ్యాంకు సరఫరా చేయడంతో చిల్లర సంక్షోభం నెలకొని ఉంది. రూ.100, రూ.500, రూ.1000 నోట్లు ఎప్పుడు అందజేస్తారంటూ బ్యాంకుల వద్ద ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. చాలా పరిమితమైన బ్యాంకుల్లోనే రూ.100 నోట్లు ఇస్తున్నారు. కరెన్సీ రద్దరుు పదిరోజులు అవుతుండగా కొత్త కరెన్సీ పొందేందుకు అనేక ఏటీఎంలు ఇప్పటికీ పనిచేయడం లేదు. బ్యాంకుల వద్ద క్యూను కట్టడి చేసేందుకు ఖాతాదారుల వేలిపై ఇంకు గుర్తు వేసే విధానం 10 శాతం బ్యాంకుల్లో మాత్రమే అమల్లోకి వచ్చింది.

ఇదిలా ఉండగా బ్యాంకుల వద్ద బారులు బారులుగానిలుస్తున్న ప్రజలందరికీ కొత్త నోట్లు దక్కడం లేదు. దాదాపుగా అన్ని బ్యాంకుల్లోనూ కొత్త కరెన్సీ స్టాక్ అరుుపోవడం, రిజర్వు బ్యాంకు నుంచి వెంటనే సరఫరా కాకపోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. చాంతాడంత క్యూలో నిలుచుని సరిగ్గా కౌంటర్ వద్దకు వచ్చేసరికి ఉన్న కాస్త కరెన్సీ అరుుపోరుుందంటూ బ్యాంకులను మూసివేస్తున్నారు. ఈ రోజు కరెన్సీ మార్పిడి లేదు అంటూ సుమారు 50 శాతం బ్యాంకుల ముందు బోర్డులు దర్శనమిస్తున్నారుు. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు మాత్రమే ప్రజలు సజావుగా రూ. 2 వేల నోట్లను పొందగలిగారు. ఆ తరువాత నుంచి అష్టకష్టాలు ఆరంభమయ్యారుు. రూ.కోటి అవసరమైన బ్యాంకులకు కేవలం రూ.15లక్షలు మాత్రమే అందుతున్నారుు. దీంతో ప్రజలకు నచ్చజెప్పలేక ఆర్బీఐ నుంచి అందగానే మళ్లీ పంపిణీ చేస్తామని బ్యాం కు అధికారులు సర్దిచెబుతున్నారు.

వేలిముద్ర వేసే ఇంకు రానందున కరెన్సీ మార్పిడి కుదరదని ఖాతాదారులను పంపించేశారు. తెల్లవారుజామునే బ్యాంకుల వద్దకు వచ్చి ఉదయం వేళ క్యూలోనే కూర్చుని టిఫిన్ చేస్తున్నట్లు కొందరు తెలిపారు. ఈరోడ్ జిల్లాలో ఒక క్షయవ్యాధి గ్రస్తుడిని బంధువులు బ్యాంకు వద్దకు మోసుకొచ్చి కరెన్సీని మార్చుకున్నారు. సహకార బ్యాంకుల గతేమిటంటూ సహకార బ్యాంకు సహాయ రిజిస్ట్రార్ మద్రాసు హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేయగా ఈనెల 28వ తేదీకి వారుుదాపడింది. పొన్నేరీలో ఒక చెత్తకుప్పలో రూ.500, రూ.1000 నోట్లతో కూడిన పెద్ద ఎత్తున కరెన్సీని కొందరు చింపిపారేశారు. కరెన్సీ రద్దును నిరసిస్తూ వర్తక, వాణిజ్య సంఘాలు శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారుు.

కరెన్సీ నోట్ల రద్దు నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చెన్నై కలెక్టర్ కార్యాలయం ముందు వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాలు సాగారుు. కేంద్రప్రభుత్వ తొందరపాటు చర్య వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ విమర్శించారు. కొత్త కరెన్సీ కోసం బ్యాంకులకు వచ్చే ప్రజలకు సహకరించాల్సిందిగా డీఎంకే కోశాధికారి స్టాలిన్ తమ పార్టీ కార్యకర్తలకు సూచించారు. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పెట్రోలు బంకుల నుంచి వారానికి రూ.2వేలు పొందేలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో 4,470  పెట్రోలు బంకులు ఉండగా, ఏఏ బంకుల్లో నగదు డ్రా చేసుకోవచ్చో? త్వరలో ఎస్‌బీఐ ప్రకటించనుంది.

కష్టాలు తప్పవు:కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం
దేశవ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కష్టాలు మరో ఏడు నెలలపాటు తప్పవని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఒక వారానికి రూ.3వేల కోట్ల విలువైన కరెన్సీని మాత్రమే ముద్రించే వెసులు బాటు ఉందని తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 8వ తేదీన అకస్మాత్తుగా ప్రకటించారు, అరుుతే ఈ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఆయన వ్యాఖ్యానించారు.

పెద్ద నోట్లను రద్దు చేసి పెద్ద తప్పు చేసిన ప్రధాని నేడు ఆ తప్పును దిద్దుకునేందుకు తంటాలు పడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో రూ.500, రూ.1000 నోట్లు సుమారు 2,100 కోట్లు ఉండగా, వీటిని రద్దు చేసినప్పుడు అదే స్థారుులో కొత్తవాటిని విడుదల చేయాల్సి ఉందని చెప్పారు. అరుుతే ఆ స్థారుులో వెంటనే ముద్రించేందుకు అవకాశం లేదని, నెలకు రూ.300 కోట్లు మాత్రమే కేంద్రం ముద్రించగలదని తెలిపారు. ఈలెక్కన చూసుకుంటే పూర్తిస్థారుు అవసరాలకు మరో 7 నెలలు గడువు తప్పనిసరి, అంత వరకు ప్రజలకు తిప్పలు తప్పవని ఆయన తెలిపారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement