deposits
-
చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా ?
సాక్షి, అమరావతి, సాక్షి, హైదరాబాద్: ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమంగా రూ.వేల కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ని ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు గురువారం కీలక, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రజల నుంచి వసూలు చేసిన ఆ డిపాజిట్లను తాము వెనక్కి ఇచ్చేశామని పలుమార్లు చెప్పిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కి న్యాయస్థానం గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది.డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. కాబట్టి తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం...’ అని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు సమక్షంలో గతంలో ఉండవల్లి అరుణ్ కుమార్‌కు భౌతిక రూపంలో అందజేసిన డిపాజిటర్ల వివరాలను పెన్‌డ్రైవ్‌లో కూడా ఇవ్వాలని మార్గదర్శిని ఆదేశించింది. తాము పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాల్సిన అవసరం లేదన్న మార్గదర్శి వాదనను తోసిపుచ్చింది. ఈ కేసులో కోర్టుకు సహకరించేందుకు ఉండవల్లికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని హైకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు సరైన రీతిలో సహకరించాలంటే డిపాజిటర్ల వివరాలను పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాల్సిన అవసరం ఉందంది. తద్వారా సాంకేతికత సాయంతో డిపాజిటర్ల వివరాలను క్షుణ్నంగా పరిశీలించి కోర్టుకు తగిన రీతిలో సహకరించేందుకు ఆస్కారం ఉంటుందంది.అయినా పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాలని చెబుతున్న సమాచారం ఏమీ కొత్తది కాదని, ఆ వివరాలను ఇప్పటికే భౌతికంగా ఉండవల్లికి అందజే శారని గుర్తు చేసింది. మార్గదర్శి పెన్‌డ్రైవ్‌లో ఇచ్చే వివరాలను ఈ కేసు కోసం మినహా మరే రకంగానూ ఉపయోగించడానికి వీల్లేదని ఉండవల్లిని హైకోర్టు ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది. మార్గదర్శి–ఆర్బీఐకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కోర్టు ముందుంచిన నేపథ్యంలో వాటి పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేస్తామన్న ఆర్బీఐ సీనియర్ న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు అనుమతించింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్బీఐ కౌంటర్లు దాఖలు చేయడం, వాటికి సమాధానం ఇవ్వడం లాంటి ప్రక్రియ అంతా డిసెంబర్ 20 కల్లా పూర్తి చేసి తీరాలని ఇరుపక్షాలను హైకోర్టు ఆదేశించింది.ఆ తేదీ తరువాత దాఖలు చేసే ఏ డాక్యుమెంట్లనూ తీసుకోబోమని పేర్కొంటూ విచారణను 2025 జనవరి 3కి వాయిదా వేసింది. అదే రోజు ఈ వ్యాజ్యాలపై తుది విచారణ తేదీని ఖరారు చేస్తామంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్‌యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీరావు మరణించినందున ఆ స్థానంలో తనను కర్తగా చేర్చాలంటూ ఆయన కుమారుడు కిరణ్ దాఖలు చేసిన సబ్‌స్టిట్యూట్ పిటిషన్లను అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వెనక్కి ఇచ్చేశాం: లూథ్రా మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తాజాగా వాదనలు వినిపిస్తూ సేకరించిన డిపాజిట్లలో 99.8 శాతం మొత్తాలను వెనక్కి ఇచ్చేసినట్లు చెప్పారు. రూ.5.33 కోట్లను ఎవరూ క్లెయిమ్ చేయనందున ఎస్క్రో ఖాతాల్లో ఉంచామన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్‌ను న్యాయస్థానానికి సహకరించాలని మాత్రమే సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. ఈ సమయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కౌంటర్లు దాఖలు చేయలేదా? అని ధర్మాసనం ప్రశించడంతో తాము కౌంటర్ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) పల్లె నాగేశ్వరరావు నివేదించారు. అదనపు కౌంటర్ దాఖలు చేస్తామని ఆర్బీఐ తరఫు సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ కోరడంతో ధర్మాసనం అంగీకరించింది.అనంతరం లూథ్రా వాదనలను కొనసాగిస్తూ.. అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కథనాలు రాశామని తమపై కేసు దాఖలు చేశారని, అయితే 2007 నుంచి ఏ డిపాజిటర్ కూడా తాము డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదు చేయలేదన్నారు. తాము వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించకుండా ఎగవేశామా? అనే విషయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చెప్పాల్సి ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఆర్బీఐ కౌంటర్ దాఖలు చేసిన తరువాత పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. వసూలు చేసిన డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటూ మీరు సమరి్పంచిన వివరాలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదని, అందుకే ఈ వ్యవహారాన్ని మళ్లీ తేల్చాలని వెనక్కి పంపిందని లూథ్రానుద్దేశించి ధర్మాసనం పేర్కొంది.ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ జోక్యం చేసుకుంటూ చందాదారుల వివరాలను మార్గదర్శి ఫైనాన్షియర్స్ పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. పెన్‌డ్రైవ్‌ను ఉండవల్లికి ఇవ్వడానికి వీల్లేదంటూ లూథ్రా వాదించారు. అలా ఇవ్వడం ఐటీ చట్ట నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నాలుగు వారాల్లో అదనపు కౌంటర్ దాఖలు చేయాలని ఆర్బీఐని ధర్మాసనం ఆదేశించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ కౌంటర్లకు సమాధానం దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చునని, కానీ మొత్తం ప్రక్రియను డిసెంబర్ 20 నాటికి పూర్తి చేసి తీరాలని ఇరుపక్షాల న్యాయవాదులకు ధర్మాసనం తేల్చి చెబుతూ విచారణను జనవరి 3కి వాయిదా వేసింది.ఎస్క్రో అకౌంట్లోని సొమ్ములు ఎవరివి?రామోజీ చాలా శక్తిమంతుడు..తాజా విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉండవల్లి చదివారు. అసలైన పెట్టుబడిదారుల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించవచ్చని హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. డిపాజిట్లు చెల్లించేశామని చెబుతున్నారని, మరి ఎస్క్రో అకౌంట్లో ఉన్న రూ.5.33 కోట్లు ఎవరివి? అని ప్రశి్నంచారు. ఆ మొత్తాలను ఎవరూ క్లెయిమ్ చేయడం లేదని, దీన్నిబట్టి ఆ మొత్తాలు ఎవరివో సులభంగా అర్థం చేసుకోవచ్చన్నారు. ఆ డిపాజిటర్లు ఎవరు? క్లెయిమ్ చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదో తేల్చాలన్నారు. చెల్లింపులు చేశామని మార్గదర్శి చెబుతున్న డిపాజిటర్లలో చాలా మంది నిజమైన డిపాజిటర్లు కాదన్న విషయాన్ని తాను నిరూపిస్తానన్నారు.మార్గదర్శి ఇచ్చిన 59 వేల పేజీల్లో కొన్నింటిని పరిశీలిస్తేనే వారు అసలైన డిపాజిటర్లు కారన్న విషయం అర్థమైందని, అందుకే పూర్తిస్థాయిలో పరిశీలన చేసేందుకు పెన్‌డ్రైవ్‌లో వివరాలు కోరుతున్నట్లు చెప్పారు. రామోజీ చాలా శక్తిమంతుడని, అందుకే ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. ‘మార్గదర్శిని గెలిపించడం కోసం లూథ్రా వాదిస్తున్నారు. కానీ నేను బాధితులు, చట్టం తరఫున హేమాహేమీలతో యుద్ధం చేస్తున్నా. సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టి 5 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయలేదు. 2006 నవంబర్ 6న మార్గదర్శి ఉల్లంఘనలపై కేంద్రానికి ఫిర్యాదు చేశానని, బుధవారంతో 18 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటి నుంచి మార్గదర్శి ఈ విచారణను సాగదీస్తూనే ఉంది’ అని పేర్కొన్నారు.ఉండవల్లికి పెన్‌డ్రైవ్ ఇవ్వాల్సిందే⇒ హార్డ్ కాపీ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇవ్వటానికి ఏం ఇబ్బంది?⇒ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఇక్కడ వర్తించదు⇒ డిసెంబర్ 15 కల్లా పూర్తి వివరాలతో పెన్‌డ్రైవ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశండిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. కాబట్టి తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం. – మార్గదర్శినుద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య‘అరుణ్‌కుమార్‌కు సుప్రీంకోర్టు చందాదారుల వివరాలతో కూడిన హార్డ్ కాపీలు ఇచ్చిన అంశాన్ని లూథ్రా తోసిపుచ్చలేదు. అంటే పెన్‌డ్రైవ్‌లో ఇచ్చే వివరాలేమీ కొత్తగా ఇచ్చేవి కాదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం– 2000 నియమ నిబంధనలు ఇక్కడ వర్తించవు. రేఖా మురార్కా (సుప్రా)లో సుప్రీంకోర్టు ఇదే అంశంపై తీర్పునిచ్చింది. అంతేకాదు.. హైకోర్టుకు సాయం చేయాలని సుప్రీంకోర్టు అరుణ్‌కుమార్‌ను సుప్రీం కోరింది. ఇందుకోసం ఆయన అడిగిన విధంగా పెన్‌డ్రైవ్‌లో వివరాలు డిసెంబర్ 15లోగా అందజేయాలని మార్గదర్శిని ఆదేశిస్తున్నాం.ఆయనను (ఉండవల్లి) ఎలా వినియోగించుకోవాలనేది మేం నిర్ణయిస్తాం. పెన్‌డ్రైవ్‌లో ఇచ్చిన డేటాను అరుణ్‌కుమార్ ఇతరులకు అందజేయకూడదు. పిటిషన్లు, కౌంటర్లు, అఫిడవిట్లతో రిజిస్ట్రీ ఓ ఐడెంటికల్ బుక్ తయారు చేయాలి. ఈ బుక్ కాపీలను పార్టీలతో పాటు అరుణ్‌కుమార్‌కు కూడా అందజేయాలి. దీనికయ్యే ఖర్చంతా మార్గదర్శి నుంచే రిజిస్ట్రీ వసూలు చేయాలి’ అని మధ్యంతర ఉత్తర్వుల్లో తెలంగాణ హైకోర్టు పేర్కొంది. -
బ్యాంకు డిపాజిట్లపై గరిష్ట వడ్డీ
బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా వడ్డీ పొందాలనుకునే వారికి ఇదే మంచి తరుణం. ప్రస్తుతం డిపాజిట్లపై వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అయితే భవిష్యత్తులో వీటిని తగ్గించే అవకాశముందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టమైన సంకేతాలను అందించింది. డిసెంబర్‌కు పావు శాతం, వచ్చే మార్చి నాటికి మరో పావు శాతం కలిపి.. ఆరు నెలల్లో వడ్డీ రేట్లు అర శాతం వరకూ తగ్గుతాయని అంచనా. ఇప్పటికే అమెరికా వడ్డీ రేట్లు తగ్గించడంతో మన దేశంలోనూ వడ్డీ రేట్లు తగ్గుతాయనుకుంటుండగా.. ద్రవ్యోల్బణం సాకుతో ఆర్బీఐ తగ్గింపును వాయిదా వేసింది. దీంతో బ్యాంకులు కూడా అధిక వడ్డీ రేటును అందిస్తున్న పరిమిత కాల డిపాజిట్ల పథకాలను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణ ప్రజలకు 7.10 శాతం నుంచి 7.40 శాతం వరకు వడ్డీని అందిస్తుండగా, ప్రైవేటు రంగ బ్యాంకులు 7.25 నుంచి 8.10 శాతం వరకు అందిస్తున్నాయి. – సాక్షి, అమరావతికనిష్ట స్థాయికి డిపాజిట్లు.. మేల్కొన్న బ్యాంకులుదేశీయ అతి పెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత కలశ, అమృత వృష్టి పేరుతో ప్రవేశపెట్టిన రెండు ప్రత్యేక డిపాజిట్ల పథకాలను 31 మార్చి, 2025 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 444 రోజుల కాల పరిమితి ఉన్న అమృత వృష్టి పథకంపై 7.25 శాతం, 400 రోజుల అమృత కలశ పథకంపై 7.10 శాతం వడ్డీ రేటును ఎస్బీఐ అందిస్తోంది. అతి పెద్ద ప్రైవేటు రంగ హెచ్డీఎఫ్సీ నాలుగేళ్ల ఏడు నెలల కాలపరిమితికి 7.40 శాతం వడ్డీని అందిస్తోంది. చైతన్య గోదావరి వంటివి ఏడాది దాటి.. రెండేళ్ల లోపు కాల పరిమితికి 8.10 శాతం వడ్డీని అందిస్తున్నాయి. కొంతకాలంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉండి బంగారం, స్టాక్ మార్కెట్లు మంచి రాబడి ఇస్తుండటంతో ప్రజలు బ్యాంకు డిపాజిట్ల వైపు అంతగా మొగ్గు చూపలేదు. దీంతో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్యాంకుల డిపాజిట్లు కనిష్ట స్థాయికి చేరాయి. దీంతో ఇప్పుడు బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచి డిపాజిట్లను పెంచుకోవడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ స్థాయి వడ్డీ రేట్లు ఎంతోకాలం కొనసాగే అవకాశం లేదని, దీర్ఘకాలిక డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి తరుణమంటున్నారు. -
ఐసీఐసీఐ బ్యాంకులో గోల్మాల్
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా, చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్‌లో కోట్లాది రూపాయల ఖాతాదారుల సొమ్ము గోల్మాల్ జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. దీంతో బాధిత ఖాతాదారులు గురువారం బ్యాంకు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. స్థానిక బ్యాంకు బ్రాంచిలో కొన్నేళ్లుగా పలువురు ఫిక్స్డ్ (ఎఫ్డీ), రికరింగ్ డిపాజిట్లు(ఆర్డీ) చేయడంతో పాటు గోల్డ్ లోన్లు తీసుకున్నారు. ఆర్డీకి సంబంధించి వడ్డీ తీసుకొనే వారు బ్యాంకుకు వచ్చిన సమయంలో వారి ఖాతాల్లో డబ్బు లేకపోవడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ఒక్కొక్కరుగా ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి తమ డిపాజిట్ల విషయమై ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో బ్యాంకు సిబ్బంది ఖాతాలను పరిశీలించగా కోట్లాది రూపాయల అవకతవకలు జరిగినట్లు గుర్తించి బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో బ్యాంకు జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రా, రీజనల్ హెడ్ రమేశ్, ఇతర ఉన్నతా«ధికారులు బ్రాంచికి వచ్చి విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో గతంలో బ్రాంచి మేనేజర్‌గా పనిచేసిన దూడ నరేశ్ చంద్రశేఖర్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు. డిపాజిట్లు రెన్యువల్ చేయకపోవడం, ఓవర్ డ్రాఫ్ట్‌లు తీసుకోవడం వంటి అవకతవకలకు పాల్పడినట్లు బ్యాంకు ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో ఇతర సిబ్బంది హస్తంపై కూడా విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 14మంది బ్యాంకు ఖాతాదారులు పోలీసుస్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు రూ.6.9కోట్ల డిపాజిట్లు, 115 సవర్ల బంగారం గోల్మాల్ జరిగిందని చెప్పారు. అంతేకాకుండా, మరో రూ.30 కోట్ల వరకు ఖాతాదారుల సొమ్ము పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. కస్టమర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యందీనిపై జోనల్ మేనేజర్ సందీప్ మెహ్రాను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని, అది పూర్తయ్యాక పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి మాట్లాడుతూ "ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎల్లప్పుడూ కస్టమర్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తాం. బ్యాంకు శాఖలో అవకతవకలు జరిగినట్లు మా దృష్టికి రావటంతో సంబంధిత ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేశాం. బ్యాంకులో మోసాల పట్ల మాకు జీరో టాలరెన్స్ పాలసీ ఉంది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని, కస్టమర్ల ఆర్థిక ప్రయోజనాలకు పూర్తిగా రక్షణ కల్పిస్తామని భరోసా ఇస్తున్నాం" అన్నారు -
బ్యాంకులకు డిపాజిట్ల కష్టాలు
న్యూఢిల్లీ: గడిచిన రెండు సంవత్సరాల్లో పెరిగిన రుణ డిమాండ్ స్థాయిలో డిపాజిట్ల సమీకరణకు బ్యాంక్‌లు సమస్యలు ఎదుర్కొన్నట్టు ఇన్ఫోమెరిక్స్ రేటింగ్స్ తెలిపింది. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్‌లు 2023–24లో జారీ చేసిన రుణాలు రూ.1,64,98,006కోట్లుగా ఉన్నాయి. క్రెడిట్ టు డిపాజిట్ రేషియో (సీడీ రేషియో) ఈ కాలంలో 75.8 శాతం నుంచి 80.3 శాతానికి పెరిగింది. త్రైమాసికం వారీగా చూసిన కానీ షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల డిపాజిట్ల కంటే రుణాల వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు ఇన్ఫోమెరిక్స్ నివేదిక తెలిపింది.2018–19 నుంచి 2023–24 మధ్య కాలంలోనూ డిపాజిట్ల కంటే రుణాల వృద్ధి ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాలు, అసంఘటిత రంగంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నగదు ఎక్కువగా ఉండడం డిపాజిట్ల సమీకరణపై ప్రభావం చూపించినట్టు ఈ నివేదిక తెలిపింది. 30 ఏళ్లలోపు ఇన్వెస్టర్ల సంఖ్య 2018–19 నాటికి 22.6 శాతంగా ఉంటే, 2025 జూలై నాటికి 39.9 శాతానికి పెరగడాన్ని ప్రస్తావించింది. యువ ఇన్వెస్టర్లలో ఈక్విటీ మార్కెట్ల పట్ల పెరిగిన ఆసక్తిని ఈ ధోరణి తెలియజేస్తున్నట్టు పేర్కొంది. ఇదే కాలంలో 30–39 వయసులోని ఇన్వెస్టర్ల బేస్ (సంఖ్య) స్థిరంగానే ఉన్నట్టు తెలిపింది. సంయుక్త కృషి అవసరం: డిపాజిట్ల నిష్పత్తి పెరగాలంటే బ్యాంక్‌లు, ప్రభుత్వం ఉమ్మడిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ట్రూనార్త్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో రోచక్ బక్షి అభిప్రాయపడ్డారు. సాధారణ ప్రజల నుంచి చిన్న మొత్తాల్లో డిపాజిట్లు సమీకరించే వెనుకటి ధోరణి నుంచి బయటకు రావాలని.. పెద్ద మొత్తంలో కార్పొరేట్ డిపాజిట్లను ఆకర్షించడంపై దృష్టి సారించాలని సూచించారు.బ్యాంక్ టర్మ్ డిపాజిట్లలో 47 శాతం 60 ఏళ్లు నిండిన వృద్ధులవే ఉన్నట్టు, యువతరం బ్యాంక్ డిపాజిట్ల వట్ల ఆసక్తి చూపించడం లేదన్న దానికి నిదర్శనమని చెప్పారు. కనీసం ఆదాయపన్ను అధిక శ్లాబులోని వారికి అయినా బ్యాంక్ డిపాజిట్ల వడ్డీపై పన్ను భారాన్ని తగ్గించాలని భక్షి సూచించారు. ఏటా వడ్డీపై టీడీఎస్ మినహాయించడం కాకుండా, డిపాజిట్ కాల వ్యవధి ముగిసిన సమయంలోనే పన్నును పరిగణనలోకి తీసుకోవాలన్నారు. -
టర్మ్ డిపాజిట్లకే ఆదరణ
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ డిపాజిట్లకు బదులు, అధిక రాబడినిచ్చే టర్మ్ డిపాజిట్లకే కస్టమర్లు మొగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా బ్యాంకులకు నిధులపై వ్యయాలు పెరిగిపోయి, వాటి నికర వడ్డీ మార్జిన్లకు చిల్లు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఆర్బీఐ తాజా డేటా ప్రకారం.. ఐదు ప్రముఖ బ్యాంక్‌ల్లో సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు 2.7–3 శాతం మధ్య ఉండగా, ఏడాది కాల టర్మ్ డిపాజిట్లపై అవే బ్యాంకులు 7.25 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. 2023–2024 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం, అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే టర్మ్ డిపాజిట్ల రూపంలో 18.64 శాతం అధికంగా రూ.116 లక్షల కోట్లను సమీకరించాయి. అదే కాలంలో బ్యాంకుల సేవింగ్స్ డిపాజిట్లు కేవలం 6 శాతం పెరిగి రూ.63 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2022–23లో టర్మ్ డిపాజిట్లలో వృద్ధి 13.5 శాతంగా ఉంటే, సేవింగ్స్ డిపాజిట్లలో పరుగుదల 4.9 శాతంగానే ఉండడం గమనార్హం. 2021–22లో టర్మ్ డిపాజిట్లలో వృద్ధి 9.6 శాతంగానే ఉంది. అదే ఏడాది సేవింగ్స్ డిపాజిట్లు ఇంతకంటే అధికంగా 12.4 శాతం మేర పెరిగాయి. మొత్తం మీద 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ డిపాజిట్లు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 13.5 శాతం వృద్ధి చెందాయి. అంతకుముందు వరుస ఆర్థిక సంవత్సరాల్లో ఈ వృద్ధి వరుసగా 9.6 శాతం, 8.9 శాతం చొప్పున ఉంది.అధిక రాబడుల కోసమే..పొదుపు నుంచి టర్మ్ డిపాజిట్లకు పెట్టుబడుల మరళింపు స్పష్టంగా కనిపిస్తున్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. రేట్లు గరిష్ట స్థాయిలో ఉండడంతో టర్మ్ డిపాజిట్లలోకి పొదుపు నిధులు మళ్లించుకోవడం ద్వారా రాబడులను పెంచుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దేశంలో అతిపెద్ద బ్యాంక్ (డిపాజిట్లలో 22.6 శాతం వాటా) ఎస్బీఐ డిపాజిట్ బేస్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 11.13 శాతం వృద్ధితో రూ.49.16 లక్షల కోట్లకు చేరుకుంది. ‘‘2023–24లో వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో టర్మ్ డిపాజిట్లు 16.38 శాతం మేర వృద్ధి చెంది రూ.27.82 లక్షల కోట్లకు చేరాయి. కాసా డిపాజిట్లు (కరెంట్, సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు) 4.25 శాతం పెరిగి రూ.19.42 లక్షల కోట్లకు చేరాయి’’అని ఎస్బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల నుంచి డిపాజిట్లు కేవలం టర్మ్ డిపాజిట్లలోకే కాకుండా, ఇంకా మెరుగైన రాబడులు వచ్చే ఈక్విటీలు, ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాల్లోకి వెళుతున్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా బ్యాంకు రుణాల వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి తగ్గడానికి ఇదే కారణమని పేర్కొంటున్నారు. రుణాల వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి క్షీణించడం పట్ల ఆర్బీఐ సైతం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. డిపాజిట్లు ఆకర్షించేందుకు బ్యాంకులు వినూత్నమైన మార్గాలను అన్వేíÙంచాలని సైతం ఆర్బీఐ సూచించింది. ‘‘బ్యాంక్‌లు డిపాజిటర్లను ఆకర్షించేందుకు మెరుగైన సంబంధాల దిశగా కృషి చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా వ్యాపార విధానాలు సైతం మారాల్సిందే. కేవలం డిపాజిట్ల స్వీకరణకే పరిమితం కాకుండా, సంపద నిర్వహణ సేవలు, క్లయింట్లతో పూర్తి సంబంధాల దిశగా వ్యవహరించాల్సిందే’’అని ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ పేర్కొనడం గమనార్హం. -
డిపాజిట్లు రూట్ మారడానికి కారణం ఇదే..
ముంబై: బ్యాంకుల నుంచి డిపాజిట్లు మ్యూచువల్ ఫండ్స్, ఇతర సాధనాల వైపు మళ్లడానికి సులభతర నిబంధనలే కారణమని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చైర్మన్ ఎంవీ రావు వ్యాఖ్యానించారు. గడిచిన ఏడాది కాలంగా బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి నిదానించిన నేపథ్యంలో.. ఎఫ్‌ఐబీఏసీ వార్షిక సదస్సులో భాగంగా దీనిపై ఆసక్తికర చర్చ జరిగింది.సెంట్రల్ బ్యాంక్ ఇండియా ఎండీ, సీఈవోగానూ వ్యవహరిస్తున్న ఎంవీ రావు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సులభతర నిబంధనల కారణంగా ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్స్ అధిక రాబడులు అందిస్తున్నాయని చెప్పారు. నిధుల నిర్వహణ విషయంలో బ్యాంకులపై ఎన్నో నియంత్రణలు ఉండగా.. మ్యూచువల్ ఫండ్స్‌కు అలాంటి నిబంధనలేవీ లేవన్నారు. ‘‘నిధులను అంతిమంగా ఎందుకు వినియోగిస్తున్నారో తనిఖీ చేయాల్సిన అవసరం మ్యూచువల్ ఫండ్స్‌కు లేదు.మా వద్దే డిపాజిట్ చేయాలని కస్టమర్లను బ్యాకింగ్ రంగం నిర్దేశించలేదు. ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఇన్వెస్ట్ చేసే విషయంలో ఫండ్స్‌కు ఎలాంటి ప్రొవిజనింగ్ లేదు. కానీ ప్రామాణిక రుణ ఆస్తులకు సంబంధించి కూడా నిర్దేశిత మొత్తాన్ని బ్యాంక్‌లు పక్కన పెట్టాల్సి ఉంటుంది. 99 శాతం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సంబంధించి ఎలాంటి పరిశోధన చేయడం లేదు.ఆరేడేళ్ల తర్వాత ఈ సైకిల్ తిరగబడితే అది వ్యవస్థాగత ముప్పుకు దారితీయవచ్చు. రానున్న రోజుల్లో డిపాజిటర్లు అధిక రాబడులు సొంతం చేసుకునేందుకు, దేశ వృద్ధికి కావాల్సిన ముడి సరుకు (నిధులు)ను బ్యాంక్‌లు పొందేందుకు ప్రభుత్వం, నియంత్రణ సంస్థల మధ్య చురుకైన భాగస్వామ్యం, చర్చ అవసరం’’అని రావు ఈ సమావేశంలో తన అభిప్రాయాలు వెల్లడించారు.డిపాజిట్ల మందగమనం కారణాలు వేరే..కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో, ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి సభ్యుడు కూడా అయిన నీలేష్ షా ఈ అభిప్రాయాలతో విభేదించారు. బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి నిదానించడానికి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమను ఎలా తప్పుబడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.ప్రభుత్వ నిధులు సైతం బ్యాంకింగ్ నుంచి బయటకు వెళుతున్నాయని, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, నగదు పంపిణీ తదితర అంశాలను ఇందుకు కారణాలుగా ప్రస్తావించారు. ప్రభుత్వ బ్యాలన్స్‌లను (మిగులు నిధులు) బ్యాంకుల్లో ఉంచాలని ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ను తాను కోరినట్టు చెప్పారు. ఇలా చేసిన ప్రభుత్వం ఏటా రూ.12,000 కోట్ల ఆదాయం పొందొచ్చన్నారు. కాగా, రావు అభిప్రాయాలతో ఇదే సమావేశంలో పాల్గొన్న హెచ్ఎస్బీసీ హితేంద్ర దవే సేతం విభేదించడం గమనార్హం. -
డిపాజిట్లు తగ్గడం సవాలు కాదు
ముంబై: రుణాలకు ఉన్న డిమాండ్‌ను తాము అందుకోగలమని, అందుకు సరిపడా వనరులు ఉన్నాయని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా చెప్పారు. రుణాల వృద్ధికి సరిపడా డిపాజిట్లు బ్యాంకుల్లోకి రావడం లేదన్న ఆందోళనల నేపథ్యంలో ఖరా దీనిపై స్పష్టత ఇచ్చారు. డిపాజిట్లలో వృద్ధి తగ్గుదల తమకు సవాలు కాబోదన్నారు. ప్రభుత్వ సెక్యూరిటీల్లో అదనంగా ఉంచిన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నామని, రుణాల వృద్ధికి ఈ వనరులను వినియోగిస్తామని ఖరా స్పష్టం చేశారు. బ్యాంకుల్లో రుణాల వృద్ధికి సరిపడా డిపాజిట్లు రాని పరిస్థితి రెండేళ్లుగా నెలకొంది. ఇందుకు ఎస్బీఐ కూడా అతీతమేమీ కాకపోవడం గమనార్హం. దీంతో డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు నానా తంటాలు పడుతున్నాయి. డిపాజిట్లు ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా చొరవ చూపించాలంటూ ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ అన్ని ప్రభుత్వరంగ బ్యాంక్‌లకు సూచించడం ఈ పరిణామాల్లో భాగమే. అధిక రాబడులు వచ్చే సాధనాల్లోకి నిధులు మళ్లుతుండడమే బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి క్షీణతకు కారణమని నిపుణులు అంటున్నారు. రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రస్తుత పరిస్థితి ఎంత మేర ఆందోళనకరమన్న ప్రశ్నకు ఖరా స్పందిస్తూ.. ‘‘రుణ వృద్ధికి సరిపడా సేవలు అందించే స్థితిలోనే ఉన్నాం. రుణాల డిమాండ్‌ను తీర్చగలిగినంత వరకు అది మాకు సవాలుగా పరిణమించదు’’అని వివరించారు. ఎంత రేటు ఆఫర్ చేయడం ద్వారా డిపాజిట్లను ఆకర్షించొచ్చన్న ప్రశ్నకు సూటిగా కాకుండా.. తమ నిధుల సమీకరణ వ్యూహాలను ఖరా వెల్లడించారు. తమకు రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నాయంటూ.. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్)లో కొంత భాగాన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా రుణ డిమాండ్‌ను తీర్చగలమన్నారు. పెట్టుబడుల కంటే రుణాలపైనే ప్రస్తుతం రాబడులు ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ఇలాంటి పరిస్థితే 2003–04 లోనూ ఉందన్నారు. -
పటిష్టంగా భారత ఎకానమీ
దేశ ఆర్థిక వ్యవస్థసహా పలు అంశాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిశోధనా నివేదికలు, ఆర్టికల్స్ సానుకూల అంశాలను వెలువరించాయి. అయితే ఈ నివేదికలు, ఆర్టికల్స్ ఆర్బీఐ బులెటిన్‌లో విడుదలవుతాయి తప్ప, వీటిలో వ్యక్తమయిన అభిప్రాయాలతో సెంట్రల్ బ్యాంకు ఏకీభవించాల్సిన అవసరం లేదు. తాజా ఆవిష్కరణలను చూస్తే...ధరల్లో స్థిరత్వం..‘స్టేట్ ఆఫ్ ది ఎకానమీ’ శీర్షికన విడుదలైన ఆర్టికల్ ప్రకారం ఆగస్టులో తృణధాన్యాలు, పప్పులు, వంట నూనెల ధరల్లో నియంత్రణ కనబడింది. ఆయా అంశాలు ఆగస్టు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉంది. జూన్ 2024లో 5.1 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, జూలైలో ఐదేళ్ల కనిష్ట స్థాయి 3.5 శాతానికి దిగివచ్చిన సంగతి తెలిసిందే. డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని టీమ్ రూపొందించిన ఈ ఆర్టికల్, గ్రామీణ వినియోగం ఊపందుకుందని, ఇది డిమాండ్, పెట్టుబడులకు దోహదపడుతుందని తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుదల..ఆర్బీఐ అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానం వల్ల తయారీ రంగంలో 2022–23లో ద్రవ్యోల్బణం కట్టడి సాధ్యమైందని ఆర్థికవేత్తలు పాత్రా, జాయిస్ జాన్, ఆసిష్ థామస్ జార్జ్‌లు రాసిన మరో ఆర్టికల్ పేర్కొంది. అయితే ఆహార ద్రవ్యోల్బణం తీవ్రత మొత్తం సూచీపై ప్రభావం చూపిస్తోందని ‘ఆర్ ఫుడ్ ప్రైసెస్ స్పిల్లింగ్ ఓవర్? (మొత్తం సూచీ ద్రవ్యోల్బణానికి ఆహార ధరలే కారణమా?) అన్న శీర్షికన రాసిన బులెటిన్‌లో ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ఆహార ధరల ఒత్తిళ్లు కొనసాగితే జాగరూకతతో కూడిన ద్రవ్య పరపతి విధానం అవసరమని ఈ ఆర్టికల్ పేర్కొంది. ఇదీ చదవండి: కాలగర్భంలో కలల ఉద్యోగం..!నిధులకోసం ప్రత్యామ్నాయాలు..డిపాజిట్ వృద్ధిలో వెనుకబడి ఉన్నందున కమర్షియల్ పేపర్, డిపాజిట్ సర్టిఫికేట్ వంటి ప్రత్యామ్నాయ వనరుల వైపు బ్యాంకింగ్ చూస్తోందని బులెటిన్ ప్రచురితమైన మరో ఆర్టికల్ పేర్కొంది. 2024–25లో ఆగస్టు 9 వరకూ చూస్తే, ప్రైమరీ మార్కెట్లో రూ.3.49 లక్షల కోట్ల సర్టిఫికేట్లు ఆఫ్ డిపాజిట్ (సీడీ) జారీ జరిగిందని ఆర్టికల్ పేర్కొంటూ, 2023–24లో ఇదే కాలంలో ఈ విలువ రూ.1.89 లక్షల కోట్లని వివరించింది. ఇక 2024 జూలై 31 నాటికి కమర్షియల్ పేపర్ల జారీ విలువ రూ.4.86 లక్షల కోట్లయితే, 2023 ఇదే కాలానికి ఈ విలువ రూ.4.72 లక్షల కోట్లని తెలిపింది. -
జనం సొమ్ముతో గురివింద విందు!
సాక్షి, అమరావతి: ఆర్థిక అక్రమాల ఉగ్రవాది ‘ఈనాడు’ రామోజీ పాపాలు పండాయి! చట్టాలంటే లెక్క లేకుండా దశాబ్దాలుగా సాగిస్తున్న ఆర్థిక అక్రమాలకు చెక్ పడింది. వ్యవస్థలను మేనేజ్ చేసి తప్పించుకునే ఎత్తుగడలు ఎల్లకాలం సాగవని రుజుౖవెంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నిబంధనలకు విరుద్ధంగా సాగించిన అక్రమ డిపాజిట్ల దందా రామోజీ మెడకు చుట్టుకుంది. టీడీపీ హయాంలో చంద్రబాబు అండదండలతో ‘రమణ’ మంత్రంతో కనికట్టు చేసి అక్రమ డిపాజిట్ల కేసు నుంచి తప్పించుకున్నా చట్టం నుంచి తప్పించుకోలేక పోయారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసును కొట్టివేయడానికి వీల్లేదని, ఆ కేసును సమగ్రంగా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈనాడు పేరుతో పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు రామోజీ చేసిన ప్రయత్నాలన్నీ సుప్రీంకోర్టు క్రియాశీలత ముందు వీగిపోయాయి. ఈనాడు అంటే ఆఫ్టరాల్ ఒక పేపర్ మాత్రమేనని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉందన్న రామోజీ మొసలి కన్నీళ్లను కొట్టిపారేస్తూ సుప్రీంకోర్టు విప్లవాత్మకమైన తీర్పును విస్పష్టంగా వెలువరించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా పూర్వాపరాలు ఇవిగో... రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్ల సేకరణ.. నిర్భీతిగా నిబంధనల ఉల్లంఘన చట్టాలకు తాను అతీతం అన్నట్టుగా భావించే రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట బరితెగించి ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. ఆర్బీఐ చట్టం 45 ఎస్ ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. అంతేగానీ ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు కాని వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు(హెచ్‌యూఎఫ్)లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. ఈ నిబంధనను రామోజీ నిర్భీతిగా ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించారు. 2006లో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఫిర్యాదుతో సీఐడీ దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు 1997 నుంచి 2006 వరకు యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు గుర్తించడంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ 2006లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారమే అప్పటికి రూ.2,610.38 కోట్లు అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు వెల్లడైంది. హెచ్యూఎఫ్గా తాము డిపాజిట్లు సేకరించవచ్చంటూ రామోజీ చేసిన వితండవాదాన్ని ఆర్బీఐ అప్పట్లోనే సమ్మతించలేదు. సెక్షన్ 45ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తన ఆర్థిక అక్రమాల వ్యవహారం బట్టబయలు కావడంతో రామోజీ అనివార్యంగా తప్పిదాలను అంగీకరించారు. డిపాజిట్‌దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని, మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసి వేస్తామని ప్రకటించారు. అక్రమ డిపాజిట్ల వివరాలు వెల్లడించం.. 2006 నాటికే 32,385 మంది నుంచి రూ.2,610.38 కోట్లు డిపాజిట్లుగా సేకరించామని పేర్కొన్న రామోజీరావు 2008లో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తాము ఇంకా చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.1,864.10 కోట్లు అని వెల్లడించారు. మరి మిగతా రూ.746.28 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయో ఆయన వెల్లడించలేదు. మరోవైపు తాము సేకరించిన డిపాజిట్లను పూర్తిగా చెల్లించేశామని 2012 తరువాత రామోజీ తాపీగా ప్రకటించారు. దీనిపై ఉండవల్లి అరుణ్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. డిపాజిట్లు ఎవరెవరి నుంచి ఎంతెంత సేకరించారు..? ఎవరెవరికి ఎంతెంత డిపాజిట్లు ఏయే తేదీల్లో చెల్లించారు...? నగదు రూపంలో చెల్లించారా? చెక్కుల రూపంలో చెల్లించారా? అనే వివరాలు వెల్లడించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ వాస్తవాలు ఏమిటో వెలికి తీసేందుకు ప్రయత్నించాల్సి ఉండగా... నాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంగానీ, ఆ తరువాత చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ సర్కారుగానీ ఉద్దేశపూర్వకంగానే మౌనం దాల్చాయి. తద్వారా రామోజీరావు ఆర్థిక అక్రమాలకు పరోక్షంగా వత్తాసు పలికాయి. దాంతో రామోజీరావు తాను సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలు చెపాల్సిన అవసరం లేదంటూ వితండవాదాన్ని వినిపించారు. తమకు ఎలాంటి క్రిమినల్ లయబులిటీ లేదని వాదిస్తూ వచ్చారు. ఈ క్రమంలో 2018 డిసెంబర్ 21న (ఉమ్మడి హైకోర్టు చివరి పనిదినాన) మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. డిపాజిటర్ల ప్రయోజనాల కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాల్సిన నాటి చంద్రబాబు సర్కారు ఏమీ పట్టనట్లు మౌనంగా ఉండిపోయింది. తద్వారా రామోజీ ఆర్థిక అక్రమాలకు చంద్రబాబు దన్నుగా నిలిచారు. అక్రమ డిపాజిట్లే... ఆర్థిక నేరస్తుడే: ఆర్బీఐ స్పష్టీకరణ ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌ను ఉల్లంఘిస్తూ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి సోదాహరణంగా వివరించింది. ఆ డిపాజిట్లను ఎవరెవరికి తిరిగి చెల్లించారో.. ఎంతెంత చొప్పున చెల్లించారో వివరాలు వెల్లడించాల్సిందేనని వాదించింది. ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగానే మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. ఈ కేసులో పార్టీ పర్సన్ ఇన్చార్జ్గా ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ సెక్షన్ 45 ఎస్ కింద హెచ్‌యూఎఫ్ సంస్థలు డిపాజిట్లు సేకరించవచ్చా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫు న్యాయవాది రమేశ్‌బాబు తన వాదనలు వినిపిస్తూ ‘ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్ ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మినహా ఇతర సంస్థలు, వ్యక్తులు డిపాజిట్లు సేకరించకూడదు. హెచ్‌యూఎఫ్ కూడా డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు. కాబట్టి హెచ్‌యూఎఫ్ పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్లను సేకరించడం అక్రమమే, చట్ట విరుద్ధమే. రామోజీ ఆర్థిక నేరస్తుడే ’అని విస్పష్టంగా తేల్చి చెప్పారు. దీంతో ఈ కేసులో రిజర్వు బ్యాంక్‌ను కూడా పార్టీగా చేర్చి సుప్రీంకోర్టు విచారణను కొనసాగించింది. కేసును నిలబెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ కేసు విషయంలో డిపాజిట్‌దారుల ప్రయోజనాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు వ్యతిరేకంగా ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. దీంతో ఈ కేసు నీరుగారిపోకుండా చూడగలిగింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ వసూలు చేసిన అక్రమ డిపాజిట్లు వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించింది. ‘ఈనాడు’కు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం ఎప్పటి మాదిరిగానే పత్రికా స్వేచ్ఛ ముసుగులో తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు రామోజీ వేసిన ఎత్తుగడను సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. ఈనాడు పత్రికకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాబట్టే ఈ కేసు విషయంలో ఇంత పట్టుబడుతోందని రామోజీ తరపున ప్రముఖ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, లూథ్రా, అభిషేక్‌మను సింఘ్వీలు వాదించినా ఫలితం లేకపోయింది. ఈ అంశానికి, అక్రమ డిపాజిట్లకు సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఎన్నికలు ఉన్నందునే ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోందన్న రామోజీ తరపు న్యాయవాదుల వాదనలతో అత్యున్నత న్యాయస్థానం సమ్మతించలేదు. ‘ఎన్నికలు ఉంటే ఈనాడుకు ఏమైంది? ఈనాడు ఏమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కదా..? ఈనాడు కేవలం ఓ పత్రికే కదా..? ఎన్నికలతో ఏం సంబంధం?’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్‌పైకి నెపాన్ని నెట్టివేసేందుకు రామోజీ తరపు న్యాయవాదులు విఫలయత్నం చేశారు. ఉండవల్లి ఓ రాజకీయ నేత అని పేర్కొంటూ గతంలో హైకోర్టు తీర్పుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ తెలుగులో ఉన్న వీడియో రికార్డులు తర్జుమా చేసి మరీ వినిపించారు. అయితే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించవచ్చని, అదేమీ తప్పు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాల తీర్పులపై విశ్లేషణలు జరగాలనే తాము కోరుకుంటామని తెలిపింది. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి చదువుకున్న వ్యక్తులు విశ్లేషిస్తే మరింత మంచిదని కూడా వ్యాఖ్యానించింది. మేమే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నాం కదా...? అంటే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించినట్లే కదా? అని ప్రశ్నించింది. దాంతో తప్పించుకునేందుకు రామోజీ వేసిన అన్ని ఎత్తుగడలు బెడిసికొట్టాయి. అక్రమ డిపాజిట్ల కేసును తెలంగాణ హైకోర్టు ఆరు నెలల్లో విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యావజ్జీవ ఖైదు...రెండింతల జరిమానా! మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల కేసులో నేరం నిరూపితమైతే రామోజీరావుకు రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. దీంతోపాటు ఆయన సేకరించిన అక్రమ డిపాజిట్లు రూ.2,600 కోట్లకు రెట్టింపు జరిమానా విధించవచ్చన్నారు. దీన్నిబట్టి రామోజీకి రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్షతో పాటు రూ.5,200 కోట్ల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. -
ఆర్థిక ఉగ్రవాది అరాచకాలు
సాక్షి, అమరావతి: పచ్చళ్ల వ్యాపారి... చిట్‌ఫండ్ సంస్థ యజమాని... పత్రికాధిపతి... ఫిల్మ్ సిటీ అధినేత... ఇవన్నీ చెరుకూరి రామోజీరావు ధరించిన లొసుగుల ముసుగులే! దశాబ్దాలుగా సాగించిన అక్రమ డిపాజిట్లే ఆయన దోపిడీకి రాచబాట. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీ సేకరించినవి అక్రమ డిపాజిట్లేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సుప్రీంకోర్టుకు నివేదించడంతో కేసు కీలక మలుపు తిరిగింది. రామోజీరావు ఓ ఆర్థిక నేరస్తుడే అన్నది స్పష్టమైంది. చిట్‌ఫండ్స్ బోర్డు.. ఫైనాన్సియర్స్ పేరిట భారీగా అక్రమ డిపాజిట్లు 2006 వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రశ్నించే వరకు ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ అనే సంస్థ ఉన్నట్లు కూడా సామాన్యులకు తెలియదు. రాష్ట్రం అంతటా ‘మార్గదర్శి చిట్ ఫండ్స్’ కార్యాలయాలే కనిపించేవి. ఆ కార్యాలయాల్లోనే గుట్టు చప్పుడు కాకుండా ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ పేరిట మరో కంపెనీ ఆర్థిక కార్యకలాపాలు సాగించిందనే విషయం బయటి ప్రపంచానికి తెలియదు. అలా 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ యథేచ్ఛగా అక్రమ కార్యకలాపాలు సాగించింది. ఆర్బీఐ చట్టం 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం కింద నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. రామోజీ తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద నమోదు చేసినట్టుగా పేర్కొన్నారు. హెచ్‌యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. 2006లో మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చే నాటికి ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లను సేకరించడం విభ్రాంతికర వాస్తవం. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టుకు నివేదించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లెంపలేసుకుని.. ‘మార్గదర్శి’ షట్టర్ క్లోజ్ మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమ డిపాజిట్ల దందా బయటపడటంతో రామోజీరావు కంగుతిన్నారు. నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణ అధికారిగా నియమించింది. సీఐడీ తరపున న్యాయ స్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి.కృష్ణంరాజును అధీకృత అధికారిగా నియమించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించినట్టు వీరు గుర్తించారు. సెక్షన్ 45 ఎస్ ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్బీఐ స్పష్టం చేయడంతో రామో జీ తాము తప్పు చేసినట్టు అంగీకరించారు. నగదు రూపంలో డిపాజిట్లు వసూలు చేసినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లించి మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసి వేస్తామని న్యాయస్థానానికి లిఖిత పూర్వకంగా తెలిపారు. అంతా నల్లధనం దందానే మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించిన ‘మార్గదర్శి ఫైనాన్సియర్స్’ ముసుగులో రామోజీరావు భారీగా నల్లధనం దందాను సాగించారు. సీఐడీ సోదాల్లో, ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో ఆ విషయం వెలుగు చూసింది. అందుకనే డిపాజిట్‌దారుల వివరాలను వెల్లడించేందుకు రామోజీరావు మొండికేశారు. డిపాజిట్ల ముసుగులో టీడీపీ పెద్దలు భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చారు. ♦ కేంద్ర ఆదాయపన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించి రామోజీ నల్లధనం దందా నడిపారు. రూ.20 వేలకు మించిన లావాదేవీలు నగదు రూపంలో తీసుకోకూడదని ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 269 స్పష్టం చేస్తోంది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌లో దాదాపు అన్ని డిపాజిట్లు నగదు రూపంలోనే తీసుకోవడం గమనార్హం. నగదు రూపంలో డిపాజిట్లు స్వీకరించి తమ సిబ్బంది ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ), పే ఆర్డర్లు(పీఓ)ల రూపంలోకి మార్చినట్టు ఆదాయ పన్ను శాఖ అధికారుల తనిఖీల్లో బయట పడింది. డిపాజిట్ చేసిన మొత్తాలను రూ.50 వేల కంటే తక్కువ మొత్తాలుగా విభజించి మరీ డీడీలు, పీఓలుగా మార్చారు. ♦ మార్గదర్శి ఫైనాన్సియర్స్ రశీదు రూపంలో సేకరించిన డిపాజిట్ల పత్రాలను పరిశీలిస్తే అదంతా నల్లధనం బాగోతమేనన్నది స్పష్టమవుతోంది. డిపాజిట్‌దారుల పాన్ నంబర్లు, పూర్తి చిరునామాలు కూడా లేకుండానే డిపాజిట్లు సేకరించడం గమనార్హం. ♦ రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్లో రూ.1,864.10 కోట్లు డిపాజిట్‌దారులకు చెల్లించేశామని తెలిపారు. మరి మిగిలిన దాదాపు రూ.750 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయనే విషయంపై మౌనం వహించారు. గుట్టుచప్పుడు కాకుండా రికార్డుల నుంచి తొలగించిన ఆ డబ్బంతా రామోజీకి అత్యంత సన్నిహితుడైన టీడీపీ పెద్దలు, ఆయన గ్యాంగ్‌వేనని తెలుస్తోంది. -
చెరుకూరి త్రిపాత్రాభినయం
సాక్షి, అమరావతి: ప్రేక్షకులను అలరించేందుకు కథానాయకులు కొన్ని సినిమాల్లో ద్విపాత్రా భినయం... త్రిపాత్రాభినయం చేయటాన్ని చూస్తుంటాం. చట్టం కళ్లకు గంతలు కట్టి ఆర్థిక అక్రమాలకు పాల్పడేందుకు త్రిపాత్రాభినయం చేయడం మాత్రం చెరుకూరి రామోజీరావుకే చెల్లింది. ఆర్బీఐ కళ్లుగప్పేందుకు చెరుకూరి తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఆర్బీఐను బురిడీ కొట్టించేందుకే... ఆర్బీఐ చట్టం 45ఎస్ ప్రకారం కంపెనీల చట్టం ప్రకారం నమోదైన ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. కాగా రామోజీరావు తన గ్రూపు సంస్థలను ‘హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూఎఫ్) కింద నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అంటే హెచ్‌యూఎఫ్ కింద నమోదైన కంపెనీలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్ పేరిట రామోజీరావు ఏకంగా రూ.2,600 కోట్లకుపైగా అక్రమ డిపాజిట్లు సేకరించారు. దీనిపై ఆర్బీఐగానీ ఇతర దర్యాప్తు సంస్థలుగానీ ప్రశ్నిస్తే తప్పించుకునేందుకు ఆయనో ఎత్తుగడ వేశారు. అదే త్రిపాత్రాభియనం... సాంకేతిక కారణాలతో తప్పించుకునే ఎత్తుగడ చెరుకూరి రామోజీరావు అనే వ్యక్తి ఏకకాలంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్ రశీదులపై హెచ్‌యూఎఫ్ కర్తగా... చెక్కులపై ప్రొప్రైటర్‌గా... బోర్డు మీటింగుల మినిట్స్ బుక్‌లో చైర్మన్‌గా సంతకాలు చేశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ అనేది చట్ట విరుద్ధంగా ఏర్పాటు చేసిన సంస్థ. ఆ సంస్థ ముసుగులో ఏకంగా రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించారు మరి. సాంకేతిక కారణాలను సాకుగా చూపించి తప్పించుకునేందుకే రామోజీరావు ఇలా వేర్వేరు హోదాలతో సంతకాలు చేశారన్నది సుస్పష్టం. కరడుగట్టిన ఆర్థిక నేరస్తులు మినహా ఇతరులు ఇంత పక్కాగా మోసగించలేరని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. డిపాజిట్ పత్రాలపై హెచ్‌యూఎఫ్ కర్తగా... మార్గదర్శి ఫైనాన్సియర్స్ అక్రమంగా వసూలు చేసిన డిపాజిట్ల విలువ మేరకు తమ డిపాజిట్‌దారులకు పత్రాలను జారీ చేసింది. వాటిపై రామోజీరావు తనను తాను ‘హెచ్‌యూ ఎఫ్ కర్త’గా పేర్కొంటూ సంతకం చేశారు. బోర్డు మీటింగులో చైర్మన్‌గా... ఇక మార్గదర్శి ఫైనాన్సియర్స్ బోర్డు మీటింగుల విషయం వచ్చేసరికి రామోజీరావు మరో పాత్రలోకి ప్రవేశించారు. బోర్డు మీటింగు మినిట్స్ బుక్‌లో, తీర్మానాల్లోనూ ఆయన ‘చైర్మన్’ అని సంతకం చేశారు. చెక్కులపై ప్రొప్రైటర్‌గా... మార్గదర్శి ఫైనాన్సియర్స్ తమ డిపాజిట్‌దా రులకు కాలపరిమితి తరువాత చెక్కుల రూపంలో చెల్లింపులు చేసింది. ఆమేరకు జారీ చేసిన చెక్కులపై రామోజీరావు ‘ప్రొప్రైటర్’ అని పేర్కొంటూ సంతకం చేశారు. అంటే డిపాజిట్ రశీదు మీద హెచ్‌యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీరావు చెక్కు దగ్గరకు వచ్చేసరికి మాత్రం ప్రొప్రైటర్ అయిపోయారు. -
ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఆర్థికాభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపునకు, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేశారు. ఈ ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా తయారైంది. బ్యాంకింగ్ రంగం కీలక సూచికలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో డిపాజిట్లతో పాటు రుణాల మంజూరులో భారీగా వృద్ధి నమోదైనట్లు 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రెండేళ్లు కోవిడ్ సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు సత్పలితాలు ఇస్తున్నాయనడానికి డిపాజిట్లలో భారీ వృద్ధి నిదర్శనం. గత ఐదేళ్లలో డిపాజిట్లలో ఏకంగా 58.23 శాతం వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి డిపాజిట్లు రూ.3,12,642 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.4,94,690 కోట్లు.. అంటే రూ.1,82,048 కోట్లు పెరిగాయి. అన్ని రంగాలకు బ్యాంకు రుణాల మంజూరులో ఏకంగా 96.64 శాతం భారీ వృద్ధి నమోదైంది. 2019 మార్చి నాటికి రుణాల మంజూరు రూ.3,97,350 కోట్లు ఉండగా 2023 డిసెంబర్ నాటికి రూ.7,81,313 కోట్లకు పెరిగాయి. అంటే రుణాలు రూ.3,83,963 కోట్లు పెరిగాయి. డిపాజిట్ల పెరుగుదల ప్రజల ఆదాయం పెరుగుదలకు నిదర్శనం కాగా రుణాలు ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నవరత్నాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా నేరుగా నగదు బదిలీని అమలు చేసింది. అలాగే బ్యాంకుల ద్వారా పేదలు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎంఎస్ఎంఈలు, ఇతర వర్గాలకు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడం ద్వారా వారి ఆదాయం మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది., ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా చర్యలు చేపట్టింది. అందువల్లే గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాల్లో రుణాల మంజూరులో భారీ వృద్ధి నమోదైంది. ఆర్బీఐ నిబంధనలకన్నా అన్ని రంగాల్లో అత్యధికంగా బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. బ్యాంకులు ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. అలాగే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలు ఇప్పిస్తోంది. వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పిస్తోంది. వైఎస్సార్ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు బ్యాంకు రుణాలను మంజూరు చేయించి, వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది. ప్రజలు కూడా ప్రభుత్వం అందించిన చేయూతతో సకాలంలో రుణాలు చెల్లిస్తూ వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం గత ఏడాది డిసెంబర్ నాటికి క్రెడిట్ రేషియో 60 శాతం ఉండాల్సి ఉండగా దానికి మించి 157.94 శాతం నమోదైనట్లు బ్యాంకర్ల కమిటీ నివేదిక పేర్కొంది. సీడీ రేషియో అధికంగా ఉందంటే ఆ రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు అధికంగా జరగుతున్నాయనే అర్ధమని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. -
‘బ్లాక్’ కోబ్రా
మార్గదర్శి చిట్ ఫండ్స్ రశీదు డిపాజిట్ల పేరుతో సేకరిస్తున్న అక్రమ డిపాజిట్ల వెనుక నల్లధనం గూడుపుఠాణి దాగుంది. రాష్ట్రంలోని 37 మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో సేకరించిన రశీదు డిపాజిట్ల వివరాలను సీఐడీ పరిశీలించడంతో ఈ బాగోతం బయట పడింది. ఆర్థిక లావాదేవీల నిర్వహణలో సంబంధిత వ్యక్తుల పాన్, ఆధార్ నంబర్లు నమోదు చేయాలని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సంస్థలు కచ్చితంగా పాటించాల్సిన నిబంధన. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ సేకరించిన అక్రమ డిపాజిట్లకు ఇస్తున్న రశీదుల్లో ఎక్కడా కూడా డిపాజిట్‌దారుల పాన్ నంబరు, ఆధార్ నంబర్లను నమోదు చేయడం లేదు. అంటే ఆ డిపాజిట్ల వివరాలేవీ ఆదాయ పన్ను శాఖ పరిశీలించే అవకాశం లేదు. ఎంత భారీ మొత్తాన్ని డిపాజిట్ చేసినా గుట్టు బయటపడదు. ఆ పేరుతో నల్ల కుబేరుల నుంచి భారీగా నల్లధనాన్ని అక్రమ డిపాజిట్లుగా సేకరిస్తోంది. అక్రమ మార్గాల్లో సంపాదించిన నల్లధనాన్ని దాచుకునేందుకు వారికి మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఓ మార్గంగా కనిపిస్తోంది. జాతీయ బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 5 శాతం కంటే అధికంగా వడ్డీ చెల్లిస్తున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేవలం 5 శాతం వడ్డీ చెల్లిస్తామన్నా సరే డిపాజిట్లు చేస్తుండటం గమనార్హం. ఎందుకంటే జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే ఆ ఆదాయం ఎలా వచ్చిందన్నది చెప్పాల్సి ఉంది. పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఇతర వివరాలను సమర్పించాలి. అవి ఆర్బీఐ, ఆదాయ పన్ను, సీబీడీటీ మొదలైన అధికారుల దృష్టిలో ఉంటాయి. ఆ వివరాలేవీ వెల్లడించడానికి సుముఖంగా లేని వారు మాత్రమే ఇతర సంస్థల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వారు డిపాజిట్ చేసేదంతా నల్లధనమే కాబట్టి. ఈ విధంగా వేల సంఖ్యలో అక్రమ డిపాజిట్ల రూపంలో భారీగా నల్లధనాన్ని చలామణిలోకి తీసుకువచ్చినట్టు సీఐడీ గుర్తించి దర్యాప్తు ముమ్మరం చేసింది. మొదటి దశలో రూ.కోటికిపైగా డిపాజిట్ చేసిన దాదాపు వెయ్యి మందిని గుర్తించింది. అంటే మొదటి దశలో రూ.వెయ్యి కోట్ల అక్రమ డిపాజిట్లపై దృష్టి సారించింది. ఆ విధంగా డిపాజిట్ చేసిన రూ.కోటి నిధులు ఏ ఆదాయ మార్గంలో వచ్చాయో తెలపాలని నోటీసుల్లో పేర్కొంది. కానీ ఇప్పటి వరకు ఎవరూ సీఐడీ నోటీసులకు సమాధానం ఇవ్వనే లేదు. దీనిపై మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉద్యోగులను ప్రశ్నిస్తే విస్మయకర సమాధానమిచ్చారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలను ఆన్లైన్ ఖాతాల్లో ఎందుకు లింక్ చేయలేదని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లను ప్రశి్నస్తే అది తమ విధానమని కూడా చెప్పడం గమనార్హం. అంటే పక్కా పన్నాగంతోనే నల్లధనం దాచుకునేందుకు మార్గదర్శి చిట్ ఫండ్స్‌ను ఆడ్డాగా చేశారన్నది స్పష్టమవుతోంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అయినా.. మార్గదర్శి చిట్ ఫండ్స్ అయినా అంతిమంగా చేసేది నల్లధనం దందానే అని తేటతెల్లమైంది. అందుకోసం రశీదు డిపాజిట్లు, భవిష్యత్ చందాలు, ఘోస్ట్ చందాదారులు.. ఇలా అనేక పేర్లతో రామోజీరావు సాగిస్తున్న అక్రమ ఆరి్థక సామ్రాజ్యమే మార్గదర్శి చిట్ ఫండ్స్ అని స్టాంపులు–రిజిస్ట్రేషన్లు శాఖ, సీఐడీ సోదాల్లో ఆధారాలతోసహా బట్టబయలైంది. అందుకే తమ దర్యాప్తులో భాగంగా ఆ అంశాలపై సమాధానం చెప్పమంటే రామోజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్ ముఖం చాటేశారు. రామోజీరావు ఏకంగా గుడ్లు తేలేసినట్టు మంచం ఎక్కి మెలో డ్రామా నడిపితే.. శైలజా కిరణ్ తనకు ఆరోగ్యం బాగోలేదు.. కళ్లు సరిగా కనిపించడం లేదంటూ టీవీ సీరియళ్లను తలపించే రీతిలో నటనా చాతుర్యం ప్రదర్శించారు. కానీ సోదాల్లో బయటపడిన ఆధారాలు అబద్ధం చెప్పవు కదా! అందుకే ఆ ఆధారాలతోనే మార్గదర్శి చిట్ ఫండ్స్‌పై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం రామోజీ అక్రమ ఆరి్థక సామ్రాజ్యం పునాదులతో సహా కదులుతోంది. – సాక్షి, అమరావతి ఘోస్ట్ చందాదారులతో నల్ల దందా బహుశా దేశంలో ఏ ఆర్తిక సంస్థ కూడా చేయని రీతిలో రామోజీరావు సరికొత్త నల్లధనం దందాకు తెరతీశారు. అందుకోసం ఆయన తెరపైకి తెచ్చిన విధానమే ‘ఘోస్ట్ చందాదారులు’. తమ ఏజంట్ల ద్వారా రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, గృహిణులు, ప్రైవేటు ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు ఇలా పలు వర్గాలకు చెందిన వారి ఆధార్ కార్డులు సేకరించారు. ఓ పట్టణంలోని వారి ఆధార్ నంబర్ల ఆధారంగా దూరంగా ఉన్న పట్టణంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయంలో చిట్టీ వేస్తారు. తన పేరుతో చిట్టీ ఉందనే విషయం సంబంధిత వ్యక్తులకు తెలియదు. వారినే ఘోస్ట్ చందాదారులుగా వ్యవహరిస్తారు. వారు చిట్టీలకు చందాలు చెల్లించరు. కానీ వారి పేరున చిట్టీ గ్రూపులు నిర్వహిస్తుంటారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ కూడా ఆ చిట్టీ చందాలు చెల్లించదు. కేవలం పుస్తకాల్లో సర్దుబాట్ల ద్వారా చందా చెల్లించినట్టు చూపిస్తారు. కానీ ప్రతి నెల డివిడెండ్లు, ఓసారి చిట్టీ పాట మొత్తాన్ని తీసుకుంటారు. ఆ చిట్టీ పాట మొత్తాన్ని మళ్లీ మార్గదర్శి చిట్ ఫండ్స్‌లోనే డిపాజిట్లు చేస్తారు. ఇలా రాష్ట్రంలో వేల సంఖ్యలో ఘోస్ట్ చందాదారుల పేరిట చిట్టీలు తెరచి.. భారీగా నల్ల ధనాన్ని అక్రమ డిపాజిట్లుగా చలామణిలోకి తీసుకువస్తున్నారు. ఆ విధంగా వేల కోట్ల రూపాయాల నల్లధనాన్ని చెలామణిలోకి తీసుకురావడం రామోజీరావుకే చెల్లింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ సోదాలు చేయగా అటువంటి ఘోస్ట్ చందాదారుల చిట్టీలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఉత్తుత్తి చెక్కులతో ‘బ్లాక్’ మ్యాజిక్ మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల నుంచి అక్రమంగా తమ సొంత కంపెనీల్లోకి పెట్టుబడులుగా తరలిస్తున్న నల్లధనానికి మసి పూసి మారేడు కాయ చేసేందుకు రామోజీరావు జిత్తులమారి ఎత్తులు వేస్తున్నారు. ఏటా మార్చి 31న మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లో బ్యాలన్స్ షీట్లు చూపించాలి. కానీ అప్పటికే ఆ నిధులను అక్రమంగా తమ సొంత కంపెనీలు ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ ప్రైజస్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్ కంపెనీల్లోకి తరలించేస్తున్నారు. కానీ మార్చి 31న బ్యాలన్స్ షీట్‌తో సరిపోవాలి. అందుకోసం మార్చి 31న పెద్ద సంఖ్యలో చందాదారులు చెక్కుల రూపంలో చిట్టీల మొత్తం చెల్లించినట్టుగా చూపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఆ చెక్కులను 90 రోజుల్లో నగదుగా మార్చాలి. కానీ మార్గదర్శి చిట్ ఫండ్స్ మాత్రం ఆ చెక్కులను నగదుగా మార్చి, బ్యాంకు ఖాతాలో జమ చేసినట్టు చూపించడం లేదు. అంటే మార్చి 31న బ్యాలన్స్ షీట్ పూర్తి కాగానే.. ఆ చెక్కులను గుట్టు చప్పుడు కాకుండా మాయం చేస్తోంది. ఎందుకంటే అవన్నీ ఉత్తుత్తి చెక్కులే. ఆ ఖాతాల్లో నగదు ఉండదు. ఆ చెక్కులు బ్యాంకులో వేసినా ఎన్‌క్యాష్ కావు. కేవలం చిట్స్ రిజి్రస్టార్, రిజర్వ్ బ్యాంకును బురిడీ కొట్టించేందుకే ఈ ఉత్తుత్తి చెక్కులతో కనికట్టు చేస్తోంది. ఆ విధంగా ఏటా మార్చి 31న దాదాపు రూ.550 కోట్ల విలువైన చెక్కులను మార్గదర్శి చిట్ ఫండ్స్ చూపిస్తోంది. అంటే ఏటా దాదాపు రూ.550 కోట్ల నల్లధనాన్ని గుట్టుగా దాటిస్తోందన్నది సుస్పష్టం. ఇలా దశాబ్దాల నుంచి ఏటా రూ.550 కోట్ల చొప్పున నల్లధనం దందా సాగిస్తుండటం రామోజీ బరితెగింపునకు నిదర్శనం. ‘మార్గదర్శి’ బాధితుల సంఘం ఏర్పాటు సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాలపై పోరాడేందుకు ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితుల సంఘం’ఏర్పాటైంది. విజయవాడ కేంద్రంగా ఈ సంఘాన్ని రిజిస్టర్ చేయించినట్టు ఆ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది ఎం.శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాధితులకు న్యాయ సహాయం, ఇతర సహకారం అందించేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. బాధితుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళతామన్నారు. రామోజీరావు, మార్గదర్శి చిట్‌ఫండ్స్ మోసాలకు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడటం ద్వారా బాధితులకు న్యాయం చేయడమే తమ సంఘం ప్రధాన లక్ష్యమన్నారు. బాధితులు తమ సమస్యలను తెలిపేందుకు 9849055267 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. -
రాష్ట్రంలో డిపాజిట్లు పెరిగాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిపాజిట్లు, క్రెడిట్ పెరిగినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో ఏపీలో డిపాజిట్ల వార్షిక సగటు వృద్ధి 9.4 శాతం ఉంటే.. అదే సమయంలో ప్రజలకు అవసరమైన క్రెడిట్ కూడా వార్షిక సగటు వృద్ధి 14.3 శాతం నమోదైనట్లు పేర్కొంది. ఐదేళ్లలో బ్యాంకుల్లో ప్రజల డిపాజిట్లు సగటు వార్షిక వృద్ధి 9.4 శాతం నమోదవ్వడం అంటే ప్రజల ఆదాయాలు పెరగడమే నిదర్శనంగా కనిపిస్తోంది. కోవిడ్ సమయంలో కూడా రాష్ట్ర ప్రజల జీవనోపాధికి సమస్యల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలు సత్ఫలితాలిచ్చాయనడానికి డిపాజిట్లలో వృద్ధి నిదర్శనంగా నిలుస్తోంది. ఇక నవరత్నాలు ద్వారా అర్హులైన పేదలందరి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారికి నేరుగా నగదు బదిలీని అమలుచేసింది. అలాగే, బ్యాంకుల ద్వారా పేదలతో పాటు రైతులకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు, ఎంఎస్ఎంఈలతో పాటు వివిధ పథకాల కింద బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి వారి ఆదాయాలు మెరుగుపడేలా రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా.. ► ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు విరివిగా లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలను చేపట్టింది. దీంతో గత ఐదేళ్లలో రాష్ట్రంలో వార్షిక సగటు క్రెడిట్ వృద్ధి 14.3 శాతం నమోదైంది. ► అలాగే, ఇచి్చన రుణాలను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, స్వయం సహాయక సంఘాలకు సున్నావడ్డీ పథకాన్ని అమలుచేస్తోంది. ► అంతేకాక.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలను ఇప్పిస్తోంది. ► వీధుల్లో, వాడల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి బ్యాంకులు ద్వారా సున్నావడ్డీకే రుణాలు ఇప్పిస్తోంది. ► ఇక వైఎస్సార్ చేయూత ద్వారా పేద మహిళలకు ప్రభుత్వం ఆరి్థక సాయం అందించడంతో పాటు బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయించడమే కాకుండా వ్యాపారాలు చేసుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ► దీంతో ఈ వర్గాలన్నింటికీ బ్యాంకులు విరివిగా రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఇలా రుణాలు తీసుకున్న వారు సకాలంలో వాటిని తిరిగి చెల్లిస్తున్నారు. -
అన్క్లెయిమ్డ్ డిపాజిట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం!
ముంబై: క్లెయిమ్ చేయని డిపాజిట్ల విషయంలో ఆర్బీఐ సమగ్ర మార్గదర్శకాలు వెలువరించింది. సదరు ఖాతాదారుల ఆచూకీ తెలుసుకునేందుకు తరచుగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని బ్యాంకులకు సూచించింది. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించేందుకు, ఆ నిధులను వాటి అసలు యజమానులకు తిరిగి అందించేందుకు బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యలకు ఈ మార్గదర్శకాలు అదనంగా ఉండనున్నాయి. నోటిఫికేషన్ ప్రకారం వినియోగంలో లేని ఖాతాలు, అన్క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించి లేఖలు, ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఖాతాదారులను సంప్రదించేందుకు బ్యాంకులు ప్రయత్నించాలి. ఈమెయిల్/ఎస్ఎంఎస్లను మూడు నెలలకోసారి ప్రాతిపదికన పంపాలి. అవసరమైతే ఖాతాదారును కనుగొనేందుకు ఇంట్రడ్యూసర్‌ను, నామినీని కూడా సంప్రదించాలి. -
మూడేళ్లలో రూ.87,877 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల సంపద పెరుగుతోంది. సంపాదనను బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నట్లు ఇటీవల జరిగిన 224వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. గత మూడేళ్లలో రూ.87,877 కోట్ల మేర బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి. 2021 మార్చి నాటికి బ్యాంకుల్లో రూ.3.85 లక్షల కోట్లు డిపాజిట్లు ఉండగా ఈ ఏడాది జూన్ నాటికి రూ.4.73 లక్షల కోట్లకు పెరిగాయి. పెరిగిన జీవన ప్రమాణాలు.. వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి వర్గాల జీవనోపాధి అవకాశాలు, ఆదాయాలు పెరిగేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రజలు తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో మదుపు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలతోపాటు జగనన్న పాల వెల్లువ ద్వారా ఆదాయ మార్గాలను చూపిస్తూ జీవన ప్రమాణాలను పెంపొందించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళలు సాధికారతతో తమ కాళ్లపై నిలబడేలా వివిధ వ్యాపార మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. ఈ కార్యక్రమాలతో 2021 మార్చి నుంచి ఏటా బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో విశాఖలో అత్యధికంగా డిపాజిట్లు ఉండగా నూతన జిల్లాల్లో అత్యధిక డిపాజిట్లు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా డిపాజిట్లున్నాయి. -
బ్యాంకు చిన్నదే.. కానీ టార్గెట్ పెద్దది!
ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో విలీనవుతున్న ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రూ. 1 లక్ష కోట్ల డిపాజిట్లతో సంవత్సరాన్ని ముగించాలని భావిస్తోంది. జైపూర్ కేంద్రంగా ఉన్న ఈ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించి 2027 నాటికి పదేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా 2027 మార్చి నాటికి రూ. 2 లక్షల కోట్ల డిపాజిట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంకు వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈవో సంజయ్ అగర్వాల్ పేర్కొన్నారు. ఎప్పటిలాగే రిటైల్ రుణాలు కొనసాగిస్తూనే భవిష్యత్తులో యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆయన చెప్పారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 2023 సెప్టెంబర్ నాటికి రూ. 75,000 కోట్లకు పైగా డిపాజిట్లను కలిగి ఉంది. ఇక ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు వద్ద రూ. 10,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. తాము 28-30 శాతం స్థిరమైన వృద్ధితో ఎదిగామని, ఇదే వృద్ధితో కొనసాగితే 2027 నాటికి డిపాజిట్లను రూ. 2 లక్షల కోట్లకు పెంచుకోగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏడేళ్లలో రూ.లక్ష కోట్ల డిపాజిట్లను సాధించడం ఏ బ్యాంకుకు అయినా వేగవంతమైన వృద్ధిరేటు అవుతుందని అగర్వాల్ అభిప్రాయపడ్డారు. సాంప్రదాయ బ్యాంకుల మాదిరిగా కాకుండా తాము ఆస్తి విభాగంలో ఇతర బ్యాంకుల కంటే ప్రధానంగా ఎన్బీఎఫ్సీలతో పోటీ పడుతున్నామని, కానీ డిపాజిట్ల విషయానికి వస్తే తాము అన్ని బ్యాంకులతో పోటీ పడతామని వివరించారు. -
ఫిక్స్డ్ డిపాజిట్ల ముందస్తు విత్‌డ్రా.. బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు
ఫిక్స్డ్ డిపాజిట్‌దారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI). ఇక నుంచి అన్ని ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి మెచ్యూరిటీ కంటే ముందే డబ్బును తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు కోటి రూపాయల వరకు ఉన్న అన్ని బ్యాంకు డిపాజిట్లపై ముందస్తు మెచ్యూర్ విత్‌డ్రాలను తప్పనిసరిగా అనుమతించాలని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. నాన్ కాలబుల్ (ముందస్తు ఉపసంహరణకు వీలు లేని) ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో ఆర్బీఐ గతంలోనే రూ.15 లక్షల వరకూ డిపాజిట్లను ముందస్తుగా ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. ఇప్పుడు ఆ పరిమితిని రూ.కోటి వరకూ పెంచింది. కాగా గతంలో ఈ ముందస్తు ఉపసంహరణకు వీలు లేని డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లించేందుకు బ్యాంకులను అనుమతించింది. అధిక వడ్డీ రేటు వర్తించే సమయంలో మెచ్యూర్‌కు ముందు ఉపసంహరణ సౌకర్యం లేకుండా అధిక వడ్డీ రేట్లను అందించేలా బ్యాంకులను ఆర్బీఐ ప్రోత్సహించింది. వడ్డీ రేట్లు పెరిగితే కస్టమర్లు తమ డిపాజిట్లను ముందస్తుగా విత్‌డ్రా చేయరనేది ఆర్బీఐ ఉద్దేశం. చిన్న పెట్టుబడిదారులను రక్షించడమే నాన్ కాలబుల్ డిపాజిట్లపై కనీస డిపాజిట్ల పరిమాణాన్ని పెంచడం వెనుక లక్ష్యం అని బ్యాంకర్లు భావిస్తున్నారు. ఈ డిపాజిట్లపై బ్యాంకులు 25 నుంచి 30 బేసిస్ పాయింట్లు అధికంగా రాబడిని అందిస్తాయి. అధిక విలువ కలిగిన డిపాజిట్లకు రాబడి ఎక్కువగా ఉంటుంది. ఇక గ్రామీణ బ్యాంకులకు బల్క్ డిపాజిట్ పరిమితిని రూ. 1 లక్ష నుంచి రూ. 1 కోటికి పెంచుతూ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్బీఐ. అంటే రూ. 1 కోటి కంటే ఎక్కువ డిపాజిట్లపై మాత్రమే బ్యాంకులు డిఫరెన్షియల్ రేట్లను అందించగలవు. -
‘కాసా’ నుంచి ‘టర్మ్’కు డిపాజిటర్ల చూపు! బ్యాంకుల లాభాలపై ప్రభావం
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (సీఏఎస్ఏ– కాసా) డిపాజిట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. బ్యాంకు వినియోగదారులు వేగంగా టర్మ్ డిపాజిట్ల వైపునకు మారిపోతున్నారు. కాసాలో అతి తక్కువ వడ్డీరేటు, టర్మ్ డిపాజిట్లలో కొంత మెరుగైన వడ్డీరేటు ఈ పరిస్థితికి కారణమని పారిశ్రామిక ప్రాతినిధ్య సంస్థ– ఫిక్కీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) విడుదల చేసిన సర్వే (17వ రౌండ్) ఒకటి పేర్కొంది. ఈ పరిస్థితి బ్యాంకుల లాభాలపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా నిపుణుల అభిప్రాయం. కాసా అంటే బ్యాంకులు సమీకరించే తక్కువ వడ్డీరేటు డిపాజిట్లు. అధిక మొత్తంలో తక్కువ వడ్డీ వ్యయాల డిపాజిట్లు ఒక బ్యాంకుకు ఉన్నాయంటే ఆ బ్యాంకుకు మెరుగైన మార్జిన్లు ఉంటాయని అర్థం. సర్వేలోని మరికొన్ని ముఖ్యాంశాలు.. మౌలిక సదుపాయాలు, టెక్స్టైల్స్ రసాయనాలు వంటి రంగాలు నిరంతర వృద్ధిని సాధిస్తున్నందున, ఆయా రంగాల్లో దీర్ఘకాలిక క్రెడిట్ డిమాండ్ ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్, మెటల్స్, ఐరన్, స్టీల్ రంగాల్లో కూడా గత ఆరు నెలల్లో వేగవంతమైన దీర్ఘకాలిక రుణాల పంపిణీ జరిగింది. మౌలిక రంగాన్ని పరిశీలిస్తే, 16వ రౌండ్ సర్వేలో 57 శాతం మంది ఈ రంగంలో రుణ వృద్ధి ఉందని పేర్కొంటే, ప్రస్తుత 17వ రౌండ్లో ఈ సంఖ్య 67కు పెరిగింది. వచ్చే ఆరు నెలల్లో నాన్–ఫుడ్ ఇండస్ట్రీలో భారీ రుణ వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన ఆరు నెలల్లో తమ మొండిబకాయిలు తగ్గాయని సర్వేలో పాల్గొన్న బ్యాంకర్లలో 75 శాతం మంది తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో మొండిబకాయిలు 3 నుంచి 4 శాతం వరకే ఉంటాయని బ్యాంకర్లలో మెజారిటీ విశ్వసిస్తున్నారు. సుస్థిర దేశీయ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ మూలధన వ్యయంతో కూడిన రుణ వృద్ధి, పటిష్ట ఆర్థిక పునరుద్ధరణ యంత్రాంగం, మొండిబకాయిలకు అధిక నిధులు కేటాయింపు (పొవిజనింగ్), భారీ రైట్–ఆఫ్ (పుస్తకాల నుంచి మొండి పద్దుల రద్దు) వంటి అంశాలు రానున్న ఆరు నెలల్లో బ్యాంకింగ్ రుణ నాణ్యత మెరుగుదలకు కారణం. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు తెలుసుకోవడానికి కొత్త పోర్టల్ - ఇది చాలా సింపుల్
ముంబై: బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి, గడువు ముగిసినప్పటికీ, వెనక్కి తీసుకోని వాటి (అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లు) వివరాలను తెలుసుకునే ఉద్గమ్(యూడీజీఏఎం) పోర్టల్‌పైకి 30 బ్యాంక్‌లు చేరాయి. ఈ వివరాలను ఆర్బీఐ గురువారం ప్రకటించింది. ఈ పోర్టల్ సాయంతో తమ, తమవారి అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను ఏ బ్యాంకుల్లో ఉన్నదీ తెలుసుకోవచ్చు. ఆగస్ట్ 17 నుంచి ఈ పోర్టల్‌ను ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరంభంలో ఏడు బ్యాంక్‌లకు సంబంధించిన వివరాలే ఈ పోర్టల్‌పై అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 28 నాటికి 30 బ్యాంక్‌లకు సంబంధించిన డిపాజిట్ల వివరాలు తెలుసుకునే విధంగా అప్‌గ్రేడ్ చేసినట్టు ఆర్బీఐ ప్రకటించింది. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లలో 90 శాతం ఈ 30 బ్యాంక్‌ల కస్టమర్లకు చెందినవి కాగా, ప్రస్తుతం ఆ డిపాజిట్లు డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ (డీఈఏ) రూపంలో ఉండడం గమనార్హం. అన్ని ప్రముఖ బ్యాంక్‌లు ఈ పోర్టల్‌తో అనుసంధానమయ్యాయి. 2023 ఫిబ్రవరి నాటికి ఎలాంటి క్లెయిమ్ రాని రూ.35,000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఎస్బీఐ కస్టమర్లకు చెందినవే రూ.8,086 కోట్లు ఉన్నాయి. ఆ తర్వాత పీఎన్బీ నుంచి రూ.5,340 కోట్లు, కెనరా బ్యాంక్ నుంచి రూ.4,558 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.3,904 కోట్ల చొప్పున ఉన్నాయి. నిబంధనల కింద గడువు తీరి పదేళ్లు అయినా క్లెయిమ్ రాని డిపాజిట్లను, బ్యాంక్‌లు డీఈఏకి బదిలీ చేయాల్సి ఉంటుంది. -
డిపాజిటర్ల డబ్బు పరిరక్షణే పవిత్ర విధి
ముంబై: డిపాజిటర్లు కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించడం బ్యాంకర్‌కు పవిత్రమైన విధి అని, ఇది మతపరమైన స్థలాన్ని సందర్శించడం కంటే చాలా ముఖ్యమైనదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. చిన్న పొదుపుదారులు, మధ్యతరగతి, పదవీ విరమణ చేసిన వారి నుండి సమీకరించిన డిపాజిట్లపై మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఈ డబ్బు పరిరక్షణే ప్రధాన పవిత్ర విధిగా భావించాలని ఆయన అన్నారు. ‘‘డిపాజిటర్ల డబ్బును రక్షించడం బ్యాంకు అతి ముఖ్యమైన బాధ్యత. ఇది పవిత్రమైన విధి. గుడి లేదా మసీదు లేదా గురుద్వారాకు నమస్కరించడం కంటే.. డిపాజిటర్ల సొమ్మును పరిరక్షించడం ఎంతో పవిత్రమైన విధి’’ దాస్ అన్నారు. బ్యాంకింగ్ రంగంలోని ప్రతి ఒక్కరిపై ఉన్న ‘‘అతిపెద్ద బాధ్యత ఇది’’ అని ఇక్కడ నిర్వహించిన అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు (యుసీబీ) డైరెక్టర్ల సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. దాస్ ఆగస్టు 30వ తేదీన ఈ మేరకు చేసిన ఒక ప్రసంగాన్ని ఆర్బీఐ సోమవారం యూట్యూబ్‌లో అప్డేట్ చేసింది. ఆయన ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు... ► డిపాజిటర్ల డబ్బు సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి అన్ని బ్యాంకులతో కలిసి పనిచేయడం రిజర్వ్ బ్యాంక్ బాధ్యత. అందువల్ల ఈ దిశలో సెంట్రల్ బ్యాంక్ ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. నిబంధనలు, పర్యవేక్షణ చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. ► ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే... సహకార బ్యాంకింగ్ రంగంలో సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా డిపాజిటర్ సొమ్ము నిలిచిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో చాలా వరకూ నిర్వహణలో అక్రమాలే ప్రధాన కారణం. ఇక్కడ మనం యూసీబీ.. పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్‌ను ప్రస్తావించుకోవచ్చు. ► 1,500 పైగా సంస్థలపై మెరుగైన నియంత్రణ, పర్యవేక్షణ చేయాలన్న ప్రధాన దృక్పథంతో యూసీబీల కోసం ఆర్బీఐ నాలుగు అంచెల పర్యవేక్షణా యంత్రాంగాన్ని రూపొందించింది. ► ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో యూసీబీలు ముఖ్యమైన భాగం. ► యూసీబీలపై ఆర్బీఐ పర్యవేక్షణను పటిష్టం చేయడాన్ని... ఆయా సంస్థలు తమ వృద్ధికి ఆటంకాలు కలిగించే ప్రయత్నంగా చూడవద్దు. యూసీబీల మొండిబకాయిలపై హెచ్చరిక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులలో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి (జీఎన్‌పీఏ) 8.7 శాతంగా ఉన్న విషయాన్ని గవర్నర్ ప్రస్తావిస్తూ, దీనిపట్ల సెంట్రల్ బ్యాంక్ ‘‘సౌఖ్యంగా లేదు’’ అని స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల జీపీఎన్ఏలు 2023 మార్చిలో దశాబ్దపు అత్యుత్తమ స్థాయి 3.9 శాతానికి చేరుకున్నాయని, మరింత మెరుగుపడతాయన్న అంచనాలూ ఉన్నాయని ఈ సందర్భంగా అన్నారు. ఎన్పీఏల సమస్యను మెరుగుపరచడానికి యూసీబీలూ తగిన కృషి చేయాలని కోరారు. అలాగే యూసీబీలు పాలనా ప్రమాణాలను మెరుగుపరచాలని, డైరెక్టర్లు, అధికారుల వంటి బ్యాంకు నిర్వహణా సంబంధ పార్టీ లావాదేవీలను నివారించాలని, రుణ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆయన కోరారు. యూసీబీలు ఇటీవలి కాలంలో బహుళ సవాళ్లను ఎదుర్కొంటున్నాయని దాస్ పేర్కొన్నారు. మున్ముందు యూసీబీ సెగ్మెంట్.. డిజిటల్, ఫిన్‌టెక్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు, సూక్ష్మ రుణదాతలు వంటి టెక్–అవగాహన సంస్థల నుండి తీవ్ర పోటీని ఎదుర్కొననుందని, అందువల్ల సాంకేతికతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని దాస్ చెప్పారు. అయితే ఈ రంగంలో కొన్ని బ్యాంకులు తగిన విధంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. -
రూ.2వేల నోటు మార్పిడి: బ్యాంకు సెలవులెన్ని? డెడ్‌లైన్ పొడిగిస్తారా?
Exchange Rs 2000: చలామణీలో ఉన్న రూ. 2వేల నోటును కేంద్రం ఉపసంహరించుకున్న తరువాత ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఆర్బీఐ "క్లీన్ నోట్ పాలసీ" ప్రకారం, భారతదేశంలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటు రూ.2,000 నోటు, సెప్టెంబర్ 30, 2023 తర్వాత చట్టబద్ధమైన టెండర్ హోదాను కోల్పోతుంది. అయితే నిజానికి ఈ గడువు 3 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. అంటే సెప్టెంబరు 25, 27, 28 తేదీలు బ్యాంకులకు సెలవులు కావడంతో 26, 29, 30 తేదీలు మాత్రమే నోట్ల మార్పిడికి చాన్స్ ఉంటుంది. అయితే ఈ క్రమంలో డెడ్‌లైన్ పొడిగిస్తుందా? లేదా అనే ఊహాగానాలున్నాయి. డెడ్‌లైన్ పొడిగించే ప్రతిపాదనేదీ లేదని ఆర్థిమంత్రిత్వ శాఖ గతంలోనే ప్రకటించింది. అయితే తాజా రూమర్లపై కేంద్రం నుంచి ఆర్బీఐనుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ ఏడాది మే 19న రూ.2 వేల నోటు చలామణిని నిలిపివేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.అయితే రెండు వేల రూపాయలనోట్లను ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ లేదా మార్పిడి చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే సెప్టెంబర్ 30 వ తేదీలోపు ఈ పని పూర్తి చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత చెల్లబోదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ గడువు లోపల తమ వద్ద మిగిలిన రూ. 2 వేల నోటును మార్పిడిలేదా డిపాజిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్బీఐ మార్గ దర్శకాల ప్రకారం ఈ నోట్లు చట్టబద్ధమైనవి కాబట్టి, అభ్యర్థన స్లిప్ లేదా ఐడీ ప్రూఫ్ లేకుండానే మార్పిడి చేసుకోవచ్చు.అయితే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇందుకు భిన్నమైన విధానాన్ని అమలు చేస్తున్నాయి. కాబట్టి, లావాదేవీలు సజావుగా జరిగేలా చూసుకోవడానికి ఈ కరెన్సీని మార్చుకునేటప్పుడు ID ప్రూఫ్‌ని కలిగి ఉండటం మంచిది. ఈ వారంలో బ్యాంకుల సెలవులు ♦ బ్యాంకులు సోమవారం నుండి బుధవారం వరకు (సెప్టెంబర్ 25 -సెప్టెంబర్ 27 వరకు) సాధారణంగా పనిచేస్తాయి. ♦ గురువారం,సెప్టెంబర్ 28, మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఎ-మిలాద్ సెలవు. ♦ శుక్రవారం,శనివారం అంటే సెప్టెంబర్ 29 , సెప్టెంబర్ 30 తేదీలలో మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేయవచ్చు. అయితే కొన్ని ఏరియాల్లో శుక్రవారం కూడా సెలవు. మరోవైపు ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు రూ.2 వేల నోట్లలో 97 శాతం బ్యాంకులకు తిరిగొచ్చాయి. అయితే మరో 7 శాతం నోట్లు ఇంకా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద నోట్లు ఉన్న వారు తమ దగ్గర్లోని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడమో లేక చిన్న నోట్లతో మార్చుకోవడమో చేయాలని సూచించింది. -
మీరు బ్యాంకులో డబ్బుల్ని డిపాజిట్ చేస్తున్నారా?.. మీకొక విషయం తెలుసా?
మీరు డబ్బుల్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారా? చేస్తే మంచిదే. అయితే కొన్ని సందర్భాలలో ఈ బ్యాంకు డిపాజిట్లు అంత శ్రేయస్సకరం కాదు. ఎందుకంటే ఒక వేళ మీరు డిపాజిట్ చేసిన బ్యాంకుకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తి దివాళా తీస్తే? ఇదిగో ఇలాంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు బ్యాంకు డిపాజిటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఆర్బీఐ డిపాజిట్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను అందిస్తుంది. ఆ పథకం గురించి మీకు తెలుసా? భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) అన్ని బ్యాంకు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ అందించే డిపాజిట్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌ను అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా కొత్త మొత్తాన్ని బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేశారు. ఒకవేళ ఆ బ్యాంకు ఏదైనా సంక్షోభంలో చిక్కుకున్నా, రూ.5లక్షల వరకు డిపాజిట్‌ను ఖాతాదారులు తిరిగి పొందే వీలుంది. అర్హులైన ఖాతాదారులకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారింటీ కార్పొరేషన్(DICGC) యాక్ట్ ప్రకారం దివాలా లేదా నష్టాల్లో ఉన్న బ్యాంకుల డిపాజిటర్లు తమ డబ్బుని విత్‌డ్రా చేసుకునేందుకు అప్లై చేసుకున్న 90 రోజుల్లో తిరిగి ఇవ్వబడుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. -
డిపాజిట్ దారుల సొమ్ముపై సుప్రీం కోర్టు జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
సహారా డిపాజిటర్లకు గుడ్‌న్యూస్: చెల్లింపుల ప్రక్రియ షురూ.. ఫస్ట్ వారికే..
న్యూఢిల్లీ: సహారా గ్రూప్‌నకు చెందిన నాలుగు కోఆపరేటివ్ సొసైటీల్లో ఇరుక్కుపోయిన దాదాపు రూ. 5,000 కోట్ల మొత్తాన్ని తిరిగి డిపాజిటర్లకు అందజేసే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. దీనితో చాలా కాలంగా తమ కష్టార్జితం కోసం ఎదురుచూస్తున్న కోట్ల మంది చిన్న ఇన్వెస్టర్లకు ఊరట లభించనుంది. ఇందుకోసం సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్‌ను కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. దీనితో ఒక కోటి మంది డిపాజిటర్లకు ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు. ముందుగా రూ. 10,000 వరకు ఇన్వెస్ట్ చేసిన కోటి మంది ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరపనున్నట్లు మంత్రి చెప్పారు. నాలుగు సొసైటీల (సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, సహారాయాన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ, హమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ, స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ) మొత్తం డేటా సీఆర్సీఎస్–సహారా రీఫండ్ పోర్టల్‌లో ఉందని, దాని ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకోసం ఇన్వెస్టరు ఆధార్ కార్డు వారి మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతాలకు అనుసంధానమై ఉండాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లోగా వారికి రావాల్సిన సొమ్ము వారి ఖాతాల్లో జమవుతుందని చెప్పారు. రూ. 5,000 కోట్ల చెల్లింపులు పూర్తయిన తర్వాత ఇతర ఇన్వెస్టర్లకు చెందిన డబ్బును కూడా తిరిగి చెల్లించేందుకు అనుమతుల కోసం సుప్రీం కోర్టును కోరనున్నట్లు ఆయన తెలిపారు. సహారా–సెబీ రిఫండ్ ఖాతా నుంచి రూ. 5,000 కోట్ల మొత్తాన్ని సెంట్రల్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ (సీఆర్సీఎస్)కు బదలాయించాలంటూ గతంలో సుప్రీం కోర్టు ఆదేశించింది. నాలుగు సహకార సంఘాలకు చెందిన 10 కోట్ల మంది ఇన్వెస్టర్లకు 9 నెలల్లోగా డిపాజిట్ మొత్తాలను వాపసు చేస్తామంటూ మార్చి 29న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.