సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల సంపద పెరుగుతోంది. సంపాదనను బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నట్లు ఇటీవల జరిగిన 224వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక వెల్లడించింది. గత మూడేళ్లలో రూ.87,877 కోట్ల మేర బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి. 2021 మార్చి నాటికి బ్యాంకుల్లో రూ.3.85 లక్షల కోట్లు డిపాజిట్లు ఉండగా ఈ ఏడాది జూన్ నాటికి రూ.4.73 లక్షల కోట్లకు పెరిగాయి.
పెరిగిన జీవన ప్రమాణాలు..
వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పేదలు, మధ్య తరగతి వర్గాల జీవనోపాధి అవకాశాలు, ఆదాయాలు పెరిగేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రజలు తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో మదుపు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాలతోపాటు జగనన్న పాల వెల్లువ ద్వారా ఆదాయ మార్గాలను చూపిస్తూ జీవన ప్రమాణాలను పెంపొందించేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.
మహిళలు సాధికారతతో తమ కాళ్లపై నిలబడేలా వివిధ వ్యాపార మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం చూపించింది. ఈ కార్యక్రమాలతో 2021 మార్చి నుంచి ఏటా బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో విశాఖలో అత్యధికంగా డిపాజిట్లు ఉండగా నూతన జిల్లాల్లో అత్యధిక డిపాజిట్లు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా డిపాజిట్లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment