నెల్లూరు: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి ప్రజలను మోసగించిన అక్షయ గోల్డ్ ఆస్తుల జప్తునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్న అక్షయ గోల్డ్ సంస్థ ఆస్తులను జప్తు చేయడానికి ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
అక్షయ్‌గోల్డ్ సంస్థ గొలుసుకట్టు వ్యాపారంతో సుమారుగా కోట్ల రూపాయలను వసూలు చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించిన అక్షయ్ గోల్డ్ సంస్థ ప్రజలను బురిడీ కొట్టించింది. తాము అనేక రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్నామని, తమ దగ్గర పెట్టుబడులు పెడితే భారీ లాభాలను అందిస్తామని ప్రజలను మభ్యపెట్టారు. వారి నుంచి దీర్ఘకాలిక ప్రాతిపదికన డిపాజిట్లు సేకరించి భారీ మోసానికి తెరలేపారు.