అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం! | RBI Issues Guidelines To Trace Customers With Inoperative Accounts Or Unclaimed Deposits - Sakshi
Sakshi News home page

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం!

Published Tue, Jan 2 2024 3:13 PM | Last Updated on Tue, Jan 2 2024 3:53 PM

Rbi Issues Guidelines Of Unclaimed Deposits - Sakshi

ముంబై: క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల విషయంలో ఆర్‌బీఐ సమగ్ర మార్గదర్శకాలు వెలువరించింది. సదరు ఖాతాదారుల ఆచూకీ తెలుసుకునేందుకు తరచుగా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని బ్యాంకులకు సూచించింది. ఏప్రిల్‌ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.

బ్యాంకింగ్‌ వ్యవస్థలో అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లను తగ్గించేందుకు, ఆ నిధులను వాటి అసలు యజమానులకు తిరిగి అందించేందుకు బ్యాంకులు, రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకుంటున్న చర్యలకు ఈ మార్గదర్శకాలు అదనంగా ఉండనున్నాయి.

నోటిఫికేషన్‌ ప్రకారం వినియోగంలో లేని ఖాతాలు, అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లకు సంబంధించి లేఖలు, ఈమెయిల్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ పంపడం ద్వారా ఖాతాదారులను సంప్రదించేందుకు బ్యాంకులు ప్రయత్నించాలి. ఈమెయిల్‌/ఎస్‌ఎంఎస్‌లను మూడు నెలలకోసారి ప్రాతిపదికన పంపాలి. అవసరమైతే ఖాతాదారును కనుగొనేందుకు ఇంట్రడ్యూసర్‌ను, నామినీని కూడా సంప్రదించాలి.  


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement