జంగారెడ్డిగూడెంలో మైత్రి సంస్థ బాధితుల వివరాలను సేకరిస్తున్న సీఐడీ అధికారి వెంకటనారాయణ
జంగారెడ్డిగూడెం: మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టీకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ బాధితుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరించారు. డిపాటిజ్‌దారులను, ఏజెంట్‌లను విచారించి ఎవరు ఎంతెంత కట్టింది సేకరించారు. మంగళవారం సీఐడీ ఇన్‌స్పెక్టర్ ఎం.వెంకటనారాయణ, సిబ్బంది ఎస్.సుధాకర్ జంగారెడ్డిగూడెంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. మైత్రి సంస్థ నాలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.250 కోట్ల మేర డిపాజిట్‌లు సేకరించి కంపెనీ ఎత్తివేసినట్టు ఇన్‌స్పెక్టర్ వెంకట నారాయణ తెలిపారు. రోజు, వారం, నెలవారీ వసూళ్ళు, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు చేయించుకున్నారని, వీరికి బాండ్లు అయితే ఇచ్చారు గాని తిరిగి డబ్బు చెల్లించలేదన్నారు. డిపాజిట్‌దారులకు భూమి ఇస్తామని నమ్మించి కంపెనీ ఎత్తివేశారన్నారు.
ఒంగోలు కేంద్రంగా ఈ సంస్థ పనిచేసిందని, పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం, చింతలపూడిలో, కృష్ణా జిల్లాలో నూజివీడు, మైలవరంలో బ్రాంచ్‌లు ఏర్పాటు చేశారన్నారు. ఈ నాలుగు బ్రాంచ్‌లు ఎత్తివేయడంతో వీటిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందన్నారు. నాలుగు రాష్ట్రాల్లో రూ.250 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసినట్టు గుర్తించామని పేర్కొన్నారు.
బాధితులూ బయటకు రండి
మైత్రి సంస్థకు చెందిన ఆస్తుల వివరాలు ఎవరిౖMðనా తెలిస్తే సీఐడీకి సమాచారం ఇవ్వాలని వెంకటరమణ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంస్థకు 1,500 ఎకరాల భూములు ఉన్నాయని, వీటిలో కొన్ని అటాచ్ చేసినట్టు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే మైత్రి ప్రతినిధులు ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. ఏజెంట్లు, డిపాజిట్‌దారులు, బాధితులు ఎవరైనా ఉంటే సీఐడీకి సెల్: 98482 11477 నంబర్‌లో తెలియజేయాలని కోరా రు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాం తాల్లో సుమారు రూ.4 కోట్ల మేర డిపాజిట్లు సేకరించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment