Mythri
-
మైత్రి బాధితుల వివరాల సేకరణ
జంగారెడ్డిగూడెం: మైత్రి ప్లాంటేషన్ అండ్ హార్టీకల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ బాధితుల నుంచి సీఐడీ అధికారులు వివరాలు సేకరించారు. డిపాటిజ్దారులను, ఏజెంట్లను విచారించి ఎవరు ఎంతెంత కట్టింది సేకరించారు. మంగళవారం సీఐడీ ఇన్స్పెక్టర్ ఎం.వెంకటనారాయణ, సిబ్బంది ఎస్.సుధాకర్ జంగారెడ్డిగూడెంలో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. మైత్రి సంస్థ నాలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.250 కోట్ల మేర డిపాజిట్లు సేకరించి కంపెనీ ఎత్తివేసినట్టు ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ తెలిపారు. రోజు, వారం, నెలవారీ వసూళ్ళు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయించుకున్నారని, వీరికి బాండ్లు అయితే ఇచ్చారు గాని తిరిగి డబ్బు చెల్లించలేదన్నారు. డిపాజిట్‌దారులకు భూమి ఇస్తామని నమ్మించి కంపెనీ ఎత్తివేశారన్నారు. ఒంగోలు కేంద్రంగా ఈ సంస్థ పనిచేసిందని, పశ్చిమగోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం, చింతలపూడిలో, కృష్ణా జిల్లాలో నూజివీడు, మైలవరంలో బ్రాంచ్‌లు ఏర్పాటు చేశారన్నారు. ఈ నాలుగు బ్రాంచ్‌లు ఎత్తివేయడంతో వీటిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందన్నారు. నాలుగు రాష్ట్రాల్లో రూ.250 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసినట్టు గుర్తించామని పేర్కొన్నారు. బాధితులూ బయటకు రండి మైత్రి సంస్థకు చెందిన ఆస్తుల వివరాలు ఎవరిౖMðనా తెలిస్తే సీఐడీకి సమాచారం ఇవ్వాలని వెంకటరమణ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంస్థకు 1,500 ఎకరాల భూములు ఉన్నాయని, వీటిలో కొన్ని అటాచ్ చేసినట్టు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే మైత్రి ప్రతినిధులు ముగ్గురిని అరెస్ట్ చేశామన్నారు. ఏజెంట్లు, డిపాజిట్‌దారులు, బాధితులు ఎవరైనా ఉంటే సీఐడీకి సెల్: 98482 11477 నంబర్లో తెలియజేయాలని కోరా రు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాం తాల్లో సుమారు రూ.4 కోట్ల మేర డిపాజిట్లు సేకరించారన్నారు. -
పొదుపు.. మదుపు.. అదే భవితకు మేలిమలుపు
మదుపరులకు నిపుణుల హితవు సాక్షిమైత్రీ ఇన్వ్స్టర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదుపరుల సదస్సు భానుగుడి (కాకినాడ): పిల్లల్ని బాగా చదివించాలి.. పెళ్లిళ్లు చేయాలి.. చక్కని ఇల్లు కొనుక్కోవాలి.. పదవీవిరమణ తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా జీవించాలి. ఇవీ ప్రతీఒక్కరి కోరికలు. ఈ కోరికలు తీరాలంటే పొదుపు ఎంతముఖ్యమో మదుపు కూడా అంతే ముఖ్యమంటున్నారు నిపుణులు. పెట్టుబడులు ఎలా ఉండాలి? స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది? మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? డీమాట్ తదితర అంశాలపై సందేహాలను తీరుస్తూ నిపుణులు మదుపుదారులకు అవగాహన కల్పించారు. సాక్షి మైత్రీ ఇన్వెస్టర్స్ క్లబ్, సీడీఎస్ఎల్, ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్ సంయుక్తంగా కాకినాడ ఆర్ఎల్ గ్రాండ్లో నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సు దీనికి వేదిక అయింది. ‘40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికీ రెండు ఆదాయాలు ఉండాలి. అలా ఉండాలంటే పొదుపు ఒక్కటే సరిపోదు. భవిష్యత్తులో ధరలను తట్టుకునేలా రాబడి వచ్చే సాధనాల్లో దాన్ని మదుపు చేయాలి.’ అని సీడీఎస్ఎల్ రీజనల్‌మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి అన్నారు. స్టాక్ మార్కెట్లో మదుపుచేయాలంటే... స్టాక్ మార్కెట్ అనగానే చాలామందికి జూదమనే భావన ఉంది. అయితే ఈ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మందు అన్నింటిపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. ఆతర్వాతే ఎంతకాలానికి మార్కెట్లో మదుపు చేస్తామనే వ్యూహంతోనే అడుగు వేయాలి. ట్రేడింగ్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. కొన్నిసార్లు షేర్ల ఎంపికలో పొరపాట్లు జరగవచ్చు. రెండు షేర్లు కొంటే ఒకదాని ధర పడిపోయి మరోటి పెరిగితే సాధారణంగా పెరిగిన షేర్లను అమ్ముతుంటారు. తగ్గిన షేరును వదిలించుకోవడం ద్వారా మరింత నష్టపోకుండా ఉంటాం. కంపెనీ మూలాలు బలంగా ఉంటే తగ్గినా పెరిగే అవకాశం ఉంది. వాటిని వదులుకోవద్దు. స్టాక్మార్కెట్లో మదుపు చేయాలనుకునే వారికి మందుగా ఉండాల్సింది డీమ్యాట్ఖాతా. పాన్‌కార్డు ఉన్న వారెవరైనా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఇందులో ఎలక్ట్రానిక్ రూపంలో షేర్లను భద్రపరచుకోవచ్చు. – షేర్ మార్కెట్లోకి రూ.500తో ప్రవేశించవచ్చు. మదుపరులు తమ వయస్సు, నష్టాన్ని భరించే సామర్థ్యం ఆధారంగా పథకాలను ఎంచుకోవాలి. – చాలామంది 25–60 ఏళ్ళ మధ్యనే సంపాదిస్తారు. 60 ఏళ్ళ తర్వాత ప్రశాంత జీవితం గడపాలంటే పెట్టుబడులను సవ్యమైన రీతిలో పెట్టడం ముఖ్యం. ––షేర్లు కొన్నాక క్రమం తప్పక సమీక్షించుకుని పనిచేయని వాటిని వదిలించుకోవాలి. రాజీవ్‌గాంధీ ఈక్విటీ పొదుపు పథకం కొత్తగా స్టాక్ మార్కెట్లో ప్రవేశించే వారికి రాజీవ్‌గాంధీ ఈక్విటీ పొదుప పథకం అందుబాటులో ఉంది. వార్షికాదాయం రూ.12 లక్షల లోపు ఉండి డీమ్యాట్ ఖాతా లేనివారు పెట్టుపబడులు పెట్టనివారు ఇందులో చేరేందుకు అర్హులు. దీని ద్వారా నవరత్న, మహారత్న, మినీరత్న కంపెనీలు నిర్దేశిత మ్యూచువల్ ఫండ్ ప«థకాల్లో మదుపు చేయవచ్చు. పెట్టుబడిలో 50 శాతం మేరకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సిజీజీ కిందపన్ను మినహాయింపు వర్తిస్తుంది. గరిష్టంగా రూ.50 వేలు వరకు మదుపుచేయవచ్చు. 1990 నుంచి ఇప్పటివరకు 17 శాతం సీఏజీఆర్ రిటర్న్స్ వచ్చాయి. స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకున్నా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ప్రతి ఒక్కరూ సులభంగా ఇన్వెస్ట్చేయవచ్చు. నిపుణులైన ఫండ్ మేనేజర్ పర్యవేక్షణలో మదుపరులు సొమ్మును నిప్టీలో టాప్ 50కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ సెబీ నియంత్రణలో కొనసాగుతుంటాయి. మదుపరుల సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుంది. 80సీ సెక్షన్ కింద రూ.1.5లక్షల వరకు మ్యూచువల్ ఫండ్స్‌తో పెట్టుబడి చేసి పన్ను ప్రయోజనాలు సైతం పొందవచ్చు. సిస్టమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(ఎస్ఐపీ) ఎస్ఐపీల ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం లేకుండా మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. నెలకు రూ. 5 వేలు చొప్పున 10 ఏళ్ల పాటు ఎస్ఐపీతో మ్యూచువల్ ఫండ్స్‌తో రూ.6లక్షలు ఇన్వెస్ట్ చేస్తే సుమారు రూ.17లక్షలు రిటర్న్స్ వస్తాయి. నెలకు రూ.5వేలు చొప్పున 15ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే సుమారు రూ.63 లక్షల రిటర్న్స్ వస్తాయి. ప్రయోగాత్మక డీమ్యాట్ చిన్న ఇన్వెస్టర్లను దృష్టిలో ఉంచుకొనిబేసిక్ డీమ్యాట్ అకౌంట్ (బీఎస్‌డీఏ )2012 అక్టోబర్ ప్రారంభించారు.డీమ్యాట్ అకౌంట్లో రూ.50వేల లోపు పోర్టు పోలియోలో ఉంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్(ఏఎంసీ) చెల్లించనవసరం లేదు. రూ.50వేలు నుంచి రూ.2లక్షలలోపు సంవత్సరంలో ఒక్కరోజు ఉన్నా రూ.100ఏఏంసీ చెల్లించాలి. అదే రోజు రెండు లక్షల రూపాయల పైబడి ఉంటే రెగ్యులర్ ఏఎంసీ చెల్లించాలి. ఈ సదుపాయాలన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మదుపరులకు ఒకే ఒక్క డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. మ్యూచువల్ ఫండ్‌కు సంబంధించిన అకౌంట్ స్టేట్ మెంట్లను కూడా డీమ్యాట్ అకౌంట్లోకి మార్చుకోవడానికి వీలుంది. అలాగే ఎక్సేంజ్ ప్లాట్‌ఫాం ద్వారా మ్యూచువల్ ఫండ్లను కొనుగోలు అమ్మకాల చేసుకోవడానికి అవకాశం ఉంది. మన ఖాతాను నిలుపుదల చేయాలనుకున్నపుడు ఫ్రీజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఏఎస్ఐ అనే సదుపాయం ద్వారా డీమ్యాట్ అకౌంట్ హోల్డర్ తన స్టేట్మెంట్ను నేరుగా సీడీఎస్ఎల్ వెబ్సైట్లో చూసుకునే అవకాశం కల్పిస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌తో ప్రయోజనమే.. బ్యాంక్ డిపాజిట్స్, పీపీఎఫ్, ఈపీఎఫ్, పోస్టాఫీసులో చేసే పెట్టుబడులపై 8నుంచి 9శాతం ఆదాయం వస్తుందని,మ్యూచువల్ ఫండ్స్‌లో అధిక ఆదాయం ఆర్జించవచ్చని ఎల్.కృష్ణకుమార్( సీనీయర్ మేనేజర్ ఎస్బీఐ,మ్యూచువల్ ఫండ్స్)అన్నారు. 1980 నుంచి ఇప్పటివరకు 17శాతం సీఏజీఆర్ రిటర్న్స్ వచ్చాయన్నారు. స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకున్నా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ప్రతి ఒక్కరూ సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చన్నారు. నిపుణులైన ఫండ్ మేనేజర్ పర్యవేక్షణలో మదుపరుల సొమ్మును నిఫ్టీలో టాప్ 50 కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారన్నారు. మ్యూచువల్ ఫండ్స్‌తో సెబీ నియంత్రణలో కొనసాగుతుంటాయని, దీనివల్ల మదుపరుల సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుందన్నారు. 80సీ సెక్షన్ కింద రూ. 1.5లక్షల వరకు పెట్టుబడి పెట్టి ప్రయోజనం పొందవచ్చన్నారు. ఇన్వెస్ట్మెంట్ అలవాటు చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ కల్చర్ అలవాటు చేసుకుంఏ మదుపర్లకు ఎంతో మంచిదని టి.జగన్మోహనరెడ్డి (కాకినాడ ఏరియా మేనేజర్ ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీ)పేర్కొన్నారు. స్టాక్మార్కెట్లో పెట్టుబడులపై అవగాహన వచ్చిన తర్వాత తెలిసిన కంపెనీల్లో షేర్లు కొనుగోలు చేయడం ఉత్తమమని ఆయన సూచించారు. ఎస్బీఐ షేర్లు, బాండ్లు, ఇతర మదుపు పథకాలను వివరించేందుకు ప్రత్యేక డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. మంచి అవగాహన వచ్చింది. షేర్లను కొనేముందు, కొన్న తర్వాత పాటించాల్సిన విషయాలపై మంచి అవగాహన వచ్చింది. ఇలాంటి సదస్సులను సాక్షి మరిన్ని నిర్వహించి మదుపుదారులకు మార్గదర్శకంగా నిలవాలి. ఎస్బీఐ అందిస్తున్న సేవలను చాలా చక్కగా ఏరియా మేనేజర్లు వివరించారు. వాసిరెడ్డి శ్రీనివాస్, కాకినాడ షేర్లు భద్రపరుచుకోవడంపై అవగాహన కుదిరింది షేర్లను భద్రపరుచుకునే విధానంపైఈ సదస్సు ద్వారా అవగాహన ఏర్పడింది. షేర్‌మార్కెట్‌ను కళ్ళముందుంచారు. ఏ సమయంలో ఏవిధంగా స్పందిస్తే లాభదాయకమన్న విషయాలు తెలిశాయి. ఇటువంటి సదస్సులు గ్రామాల్లో విస్తరించాలి. - సీహెచ్ సురేష్, కాకినాడ. మరింత నేర్చుకున్నాను. షేర్‌మార్కెట్ అనేది క్షణాల్లో మారిపోతుంటుంది. దీనికోసం నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. మన దగ్గర ఒక నిపుణుడు ఉండాలి. వారి సలహాలు ప్రతీసారీ అవసరమౌతాయి. నాకు సాక్షి మైత్రీ ద్వారా నిపుణుల సమూహాన్ని కలిసే అవకాశం వచ్చింది. నాలో దాగిన అనేక సందేహాలను నివృత్తి చేసుకోగలిగాను. - పీఎంరావు, కాకినాడ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలిసింది. మ్యూచువల్ ఫండ్స్ గురించి ఈ సదస్సు ద్వారా అవగాహన కలిగింది. ఎక్కడ ఫండ్స్ చేస్తే రిటర్న్స్ బాగా వస్తాయో తెలిసింది.ఇలాంటి సదస్సుల ద్వారా మాలాంటి వాళ్ళకు అవగాహన కల్పిస్తున్న సాక్షికి థ్యాంక్స్. - పి.రాంబాబు పెట్టుబడులపై అవగాహన వచ్చింది పెట్టుబడులు పెట్టే విధానంలో అవలంబించాల్సిన పద్ధతులపై శివప్రసాద్ తెలిపిన అంశాలు చాలా బాగున్నాయి. పెట్టుబడులపై పూర్తి అవగాహన కలిగింది. ఎంఎస్ నారాయణ, మదుపుదారు తెలియని విషయాలు తెలిశాయి. పెట్టుబడులు, ఇతర విషయాలకు సంబంధించి తెలియని విషయాలు చాలా తెలిశాయి. షేర్ మార్కెట్‌పై ఉన్న చెడ్డ అభిప్రాయం ఈ సదస్సు ద్వారా పోయింది. జాగ్రత్తలు పాటిస్తే పెట్టుబడులు ఎక్కడ పెడితో మంచిదో అర్ధమయ్యింది. డీమ్యాట్ గురించి నిపుణులు తెలిపిన విషయాలు అద్భుతం. - శివకుమార్, మదుపుదారు -
సాక్షి మైత్రి మహిళా ఆధ్వర్యంలో టైలరింగ్‌లో శిక్షణ
హన్మకొండ చౌరస్తా : సాక్షి మైత్రి మహిళా ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు టైలరింగ్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. నెలరోజుల పాటు కొనసాగే శిక్షణ ఆదివారం మినహా మొదటి బ్యాచ్ అభ్యర్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, రెండో బ్యాచ్‌కు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు తరగతులు ఉంటాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం బుధవారం నుంచి ఈనెల 31వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేరీ క్యాండిల్స్, బాలహనుమాన్‌గుడి దగ్గర, బస్టాండ్ రోడ్, హన్మకొండ చిరునామాలో రూ. 2500 చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలి. శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికెట్లను అం దజేస్తారు. శిక్షణ పొందే అభ్యర్థులు పెద్ద స్కేలు, టేప్, కత్తెర, మార్కర్, దారం రీలు, బ్లౌజ్ పీసులు, సూదులు, న్యూస్ పేపర్, నోట్‌బుక్స్, పెన్నులను వెంట తెచ్చుకోవాలి. మెథడ్ ఆఫ్ కటింగ్, సాదా బ్లౌజ్, మె«థడ్ ఆఫ్ స్టిచ్చింగ్, డ్రెస్ పెట్టికోట్, క్రాస్‌కట్ బ్లౌజ్, కటోరి బ్లౌజ్, శారీ పెట్టికోట్, డబుల్ కటోరీ బ్లౌజ్ వి షేప్ ప్రాక్, ప్రిన్స్ కట్బ్లౌ జ్, అంబరిల్లా ఫ్రాక్, స్కట్ అండ్ టాప్, గాగ్రాచోళీ, స్లీవ్ డిజైన్ బ్లౌజ్, డిఫరెంట్ హ్యాండ్స్ బ్లౌజ్, లాంగ్ లెంత్ డ్రెస్, ఫప్ హ్యాండ్స్ బ్లౌ జ్లో శిక్షణ తరగతులు ఉంటాయి. పూర్తి వివరాలకు సెల్ నంబర్ : 95055–14424లో సంప్రదించవచ్చు. -
అర్చనానందం
హర్షాతిరేకంలో మునిగి తేలుతున్నారు నటి అర్చన. నిజం చెప్పాలంటే ఈ తెలుగమ్మాయి సినిమాలు సక్సెస్ కోసం పోరాడుతున్నారు. అర్చనలో అన్ని రకాల పాత్రల్ని అవలీలగా పోషించగల సత్తా ఉంది. దాన్ని ఆమె నిరూపించుకున్నారు కూడా. హీరోయిన్గా, విలనీగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా పాత్రల్లోకి దూరి నటించడం అర్చనకు కొట్టిన పిండే అని చెప్పాలి. అంతేకాదు తెలుగు, తమిళం, కన్నడం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోను నటిస్తూ బహుభాషా నటిగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కన్నడ, తమిళ భాషల్లో నటించిన రెండు చిత్రాలు విడుదల కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అర్చన కన్నడంలో సూపర్‌స్టార్ మోహన్‌లాల్ సరసన మైత్రి చిత్రంలో నటించారు. గిరిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం గురించి అర్చన తెలుపుతూ మైత్రి చిత్రంలో మోహన్‌లాల్ భార్యగా నటించానని తెలిపారు. ఈ గృహిణి పాత్రతో మోహన్‌లాల్ సరసన నటించడం చాలా మంచి అనుభవం అని పేర్కొన్నారు. చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం గల నటుడు మోహన్‌లాల్ అని చెప్పారు. ఇక తమిళంలో నాడోడి వంశం చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నట్లు చెప్పారు. ఇది పూర్తి యాక్షన్ డ్రామా కథా చిత్రం అని తెలిపారు. తన పాత్ర కూడా చాలా సీరియస్‌గా ఉంటుందన్నారు. అయితే తాను ఎలాంటి పాత్ర పోషించాలని ఆశించానో అలాంటి పాత్రను ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. చిత్రంతోపాటు సన్నివేశాల్లో చాలా ఎంజాయ్ చేస్తూ నటించానన్నారు. ఈ చిత్రం కూడా త్వరలో తెరపైకి రానుందని తెలిపారు. ఈ రెండు చిత్రాలు విడుదల కోసం చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. తదుపరి తెలుగులో ఆనందిని అనే చిత్రం చేయనున్నట్లు తెలిపారు. రొమాంటిక్ డ్రామా చిత్రానికి నిర్ణయ దర్శకత్వం వహించనున్నారని అర్చన వెల్లడించారు.